
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం నిందితులకు సహకరించిన జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు.
కాగా సుభాష్ నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. అయితే అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. ఇటీవల పోలీసులు పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment