సాక్షి, సిటీబ్యూరో: ఎక్సైజ్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అంగూర్ బాయి ఎట్టకేలకు గురువారం కార్వాన్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. ధూల్‌పేట్ గంజాయి డాన్‌గా గుర్తింపు పొందిన అంగూర్‌బాయిని కార్వాన్ ప్రాంతంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అమ్మకాల్లో రూ.కోట్లకు పడగలెత్తిన అంగూర్ బాయిపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో 3 కేసులు, మంగల్‌హట్ పోలీస్‌స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి.
ఆయా కేసుల్లో అరెస్టు చేసేందుకు ఎక్సైజ్, పోలీసులు పలు మార్లు ప్రయతి్నంచినా ఆమె తప్పించుకు తిరుగుతోంది. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలిగా జైలుకు వెళ్లి వచ్చిన ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆమె కుటుంబ సభ్యులపై కూడా పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం. ధూల్‌పేట్‌లో గంజాయి హోల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అరితేరిన అంగూర్ బాయిని అపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా అరెస్టు చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు. అంగూర్‌బాయి అరెస్ట్‌తో ధూల్‌పేటలో ఎక్సైజ్ పోలీసులు భారీ విజయాన్ని నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment