ఆమెపై 32 కేసులు ఉన్నాయి
రెండుసార్లు పీడీ యాక్ట్‌పై జైలుకు
ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకుని తీరుతామని ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.ఆమె పట్ల తాము ఎలాంటి మెతక వైఖరి అవలంభించడం లేదని, కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న నీతూబాయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖతో పాటు లా ఎన్ ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాయన్నారు.
ఆమె అక్రమ కార్యకలాపాలపై కేసులు నమోదు చేశామని, గతంలో ఆమె పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయినా ఆమె వైఖరిలో మార్పురాలేదన్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా యధావిధిగా గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుండడంతో బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీస్ శాఖ ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసిందన్నారు. రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి, ఆమె కుటుంబసభ్యులు అక్రమంగా కూడబెట్టిన స్థిర, చర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు.
నీతూబాయ్ నుంచి రూ.15.17 లక్షలు, ఆమె కుటుంబ సభ్యులైన మధుబాయి రూ. 25.13 లక్షలు, గౌతమ్‌సింగ్ నుంచి రూ.91.21 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 86 లక్షల స్థిరాస్తులను జప్తు చేశామన్నారు. నీతూబాయిపై హిస్టరీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, గోల్కొండ, గచి్చబౌలి, మొయినాబాద్, గౌరారం, నల్లగొండ టూటౌన్‌లతోపాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ధూల్‌పేట్, నారాయణగూడలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెపై 25 కేసులు ఉన్నాయని, పోలీసులు 7 కేసులు నమోదు చేశారన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్ తరహాలో నానక్‌రాంగూడలోనూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం
Comments
Please login to add a commentAdd a comment