woman arrest
-
నీతూబాయి ఆట కట్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకుని తీరుతామని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.ఆమె పట్ల తాము ఎలాంటి మెతక వైఖరి అవలంభించడం లేదని, కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న నీతూబాయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖతో పాటు లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాయన్నారు. ఆమె అక్రమ కార్యకలాపాలపై కేసులు నమోదు చేశామని, గతంలో ఆమె పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయినా ఆమె వైఖరిలో మార్పురాలేదన్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా యధావిధిగా గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుండడంతో బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీస్ శాఖ ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసిందన్నారు. రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి, ఆమె కుటుంబసభ్యులు అక్రమంగా కూడబెట్టిన స్థిర, చర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. నీతూబాయ్ నుంచి రూ.15.17 లక్షలు, ఆమె కుటుంబ సభ్యులైన మధుబాయి రూ. 25.13 లక్షలు, గౌతమ్‌సింగ్ నుంచి రూ.91.21 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 86 లక్షల స్థిరాస్తులను జప్తు చేశామన్నారు. నీతూబాయిపై హిస్టరీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, గోల్కొండ, గచి్చబౌలి, మొయినాబాద్, గౌరారం, నల్లగొండ టూటౌన్లతోపాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ధూల్‌పేట్, నారాయణగూడలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెపై 25 కేసులు ఉన్నాయని, పోలీసులు 7 కేసులు నమోదు చేశారన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్ తరహాలో నానక్‌రాంగూడలోనూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం -
ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒకరిద్దరిని కాదు ఏడుగురిని పెళ్లి చేసుకుంది ఆ కిలాడీ లేడీ. డబ్బున్న వారిని గుర్తించడం. వారి చెంత చేరడం. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటు. గుంటూరు, భీమవరం, శారదానగర్, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేసినట్టు బాధితుడు కొత్తకోట నాగేశ్వరరావు (శివ) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకటలక్షి్మ(అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్షి్మ) అతని వద్ద పనికి చేరింది. అతనికి దగ్గరవ్వడమే గాక 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అతను ఓ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేసేవాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్ నుంచి ఆమె అకౌంట్‌కు బదిలీ చేసుకునేది. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట మారి్పంచుకుంది. ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషయమై గుంటూరు, భీమవరం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాను. అనంతరం ఆమె గురించి అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి. భీమవరంలో ఇద్దరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదానగర్‌లో ఒకరు, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఒకరు, గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తేలింది. -
సోనమ్ కపూర్ ఇంట్లో రూ. 2.4 కోట్ల నగదు చోరీ.. నర్సు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును న్యూఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ కేసులో సోనమ్ ఇంట్లో పనిచేసే ఓ మహిళ, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోనమ్ కపూర్ అత్త కేర్ టేకర్‌గా పనిచేస్తున్న అపర్ణ రూతు విల్సన్ అనే నర్సు ఈ దొంగతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల న్యూఢిల్లీలోని సోనమ్ కపూర్ అమృత షెర్గిల్ మార్గ్ నివాసంలో జరిగిన ఈ ఘటనలో నర్సు ఆమె భర్త సుమారు రూ. 2.41 కోట్ల విలువైన నగలు, డబ్బును దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది పోలీసుల వివరాల ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా తల్లిని చూసుకునేందుకు కేర్ టేకర్‌గా అపర్ణ రూతు విల్సన్ అనే నర్సును నియమించారు. అపర్ణ భర్త నరేశ్ కుమార్ సాగర్ శంకర్పూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనపై అదే నెల 23న సోనమ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆహుజా ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ పోలీసులు విచారించారు. చదవండి: వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్ అలాగే మంగళవారం రాత్రి సరితా విహార్‌లోని అపర్ణ ఇంట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు జరపగా అసలు విషయం బయటపడింది. దీంతో అపర్ణతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గత మార్చిలోనే సోనమ్ మామయ్య, ఆమె భర్త ఆనంద్ ఆహుజా తండ్రి హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీకి సైబర్ నేరస్థులు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. -
కిలాడి లేడీ అరెస్ట్: రూ 8 కోట్లకు టోకరా
సాక్షి, పంజగుట్ట: ఓ వ్యక్తిని సుమారు రూ.8 కోట్ల మేర మోసం చేసిన కేసులో మహిళను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌భవన్ రోడ్డులోని సేథీ టవర్స్‌కు చెందిన పి.విజయ్ ఎన్.రాజు ఇన్వెస్టర్. 2013లో అతని వద్దకు కూకట్పల్లి, వసంత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రాజు, కేపీహెచ్‌బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్‌బాబులు వచ్చారు. పద్మజ తమకు గోపనపల్లిలోని సర్వేనెంబర్ 124/2 నుండి 124/5 వరకు 6.20 ఎకరాల స్థలం ఉందని, ఆ స్థలంలో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. సదరు స్థలంపై బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మీరు తీరిస్తే మీకు రెండున్నర ఎకరాల స్థలం ఇస్తామని చెప్పారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. దీంతో బ్యాంకుకు సుమారు రూ.5 కోట్లు చెల్లించడమే కాకుండా, రూ.3 కోట్లు వారివద్ద ఇన్వెస్ట్ చేశాడు. వారు బ్యాంకు నుంచి కాగితాలు తీసుకున్నారు. ఆ స్థలంలో విల్లాల నిర్మా ణం చేయకపోగా ఇస్తామన్న రెండున్నర ఎకరాలు కూడా ఇవ్వకుండా మోసం చేశా రు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పంజగు ట్ట పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సామల పద్మజ మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. గోవాలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపి సామల పద్మజను అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్‌గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్‌ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్‌తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్‌కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్‌లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌లేటర్ ఇంద్రజిత్‌ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు) -
చిన్నారి హత్య కేసులో మహిళ అరెస్టు
చెన్నై, టీ.నగర్: బన్రూట్టిలో న్యాయవాదితో కలిసి చిన్నారిని హతమార్చిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. కడలూరు జిల్లా, బన్రూట్టి కంబన్ వీథికి చెందిన మురుగన్, శివరంజని (24) దంపతులు. వీరికి గౌతమన్ (3) అనే కుమారుడు, ఒకటిన్నర ఏడాది వయసున్న ప్రియదర్శిని అనే కుమార్తె ఉంది. శివరంజని ఇంటికి నడువీరపట్టి ప్రాంతానికి చెందిన న్యాయవాది నటరాజన్, అతని భార్య ధైర్యలక్ష్మి తరచుగా వెళ్లేవారు. ఆ సమయంలో వల్లలార్ వీధిలో నివసిస్తున్న యువతి కమలి శివరంజని ఇంటికి ఎదురుగానున్న ఆమె స్నేహితురాలు కార్తికా ఇంటికి వెళ్లి వచ్చేది. ఆ సమయంలో న్యాయవాది నటరాజన్‌కు, కమలికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ధైర్యలక్ష్మికి తెలిసింది. ఆమె ఖండించింది. దీంతో ఆగ్రహించిన కమలి, నటరాజన్ ధైర్యలక్ష్మిని ఏదైనా ఒక వివాదంలో ఇరికించి జైలుకు పంపాలని నిర్ణయించారు. గత డిసెంబరు శివరంజని ఇంటికి వెళ్లిన కమలి శివరంజని కుమార్తె ప్రియదర్శిని ముఖంపై దిండుతో హతమార్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు బిడ్డ తల్లిదండ్రుల వద్ద నాటకమాడింది. కాలక్రమంలో కమలి బిడ్డను హతమార్చినట్లు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన ఆమె దీని గురించి గ్రామ నిర్వాహక అధికారికి హత్య చేసినట్లు చెప్పింది. బన్రూట్టి డీఎస్పీ నాగరాజన్ ఆధ్వర్యంలోని పోలీసులు కమలిని అరెస్టు చేసి విచారణ జరిపారు. ఇందులో నటరాజన్ హత్యకు కుట్రను రూపొందించినట్లు తెలిసింది. పోలీసులు నటరాజన్, కమలిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పరారీలో ఉన్న నటరాజన్ కోసం గాలిస్తున్నారు. మంగళవారం తహసీల్దార్ ఆరుముగం, పోలీసు అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వాహించారు. -
లేడీ కేడీ అరెస్టు
చైతన్యపురి: దేవాలయాలు, పాఠశాలల వద్ద మాటువేసి చిన్నపిల్లల ఆభరణాలు దోచుకుంటున్న ఓ కరడుగట్టిన పాత నేరస్తురాలిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్ సీఐ రంగస్వామి, డీఐ వెంకటేశం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కొత్తపేట శృంగేరికాలనీలో నివసించే మెహరున్నీసా అలియాస్ మమత (37) టైలర్‌గా పనిచేసేది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాటపట్టింది. తల్లి రషీదాబేగం (70), సోదరుడు సయ్యద్ మహ్మద్ (25)తో కలిసి చోరీలకు పాల్పడేవారు. దేవాలయాలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ 5 నుంచి 10 సంవత్సరాల బాలికలను ఎంచుకుని వారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకెళ్లి వారి వంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచుకుని వదిలేసేవారు. ఈనెల 14న సరూర్‌నగర్ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న 6 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి బంగారు చెవిపోగులు, కాళ్ల పట్టీలు తీసుకుని పారిపోయారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ కృష్ణయ్య విచారణ చేపట్టి నిందితురాలు మెహరున్నీసాగా గుర్తించారు. ఆదివారం పీఅండ్‌టీ కాలనీలో ఆమె అనుమానాస్పందంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె వద్ద నుంచి రూ. లక్ష నగదు, 25గ్రాముల బంగారం, 160 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. సరూర్‌నగర్ స్టేషన్ పరిధిలోని ఆరుకేసుల్లో ఆమె నిందితురాలని పేర్కొన్నారు. గతంలో ఆమెపై ఎల్బీనగర్ స్టేషన్ పరిధిలో 22, మియాపూర్‌లో ఒకటి, రాయదుర్గంలో అయిదు, మైలార్‌దేవులపల్లిలో ఒకటి, రాజేంద్రనగర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, సంతోష్‌నగర్‌లో రెండు, కాంచన్‌బాగ్‌లో ఒకటి, మాదన్నపేటలో ఒక కేసు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆంధ్రాలో 8 కేసులు ఉన్నాయని పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లివచ్చిందని వివరించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ టీవీ నటి హంగామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 1 వద్ద మాళవికా తివారి(56) అనే మహిళకు చెందిన పవర్‌బ్యాంకు పేలుడు కలకలం రేపింది. శబ్దం చేస్తూ పేలడంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సీనియర్ అధికారి అందించిన సమాచారం ప్రకారం మాళవిక ధర్మశాలకు వెళ్లే విమానం కోసం వేచి చూస్తుంది. ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెను చెకింగ్ కోసం పిలిచారు. తన హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంకును పెట్టుకుని సెక్యూరిటీ చెకింగ్ వద్దకు వచ్చింది. అక్కడ హ్యాండ్ బ్యాగులోని వస్తువులను చూపించానికి నిరాకరించడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన మహిళ బ్యాగులోని పవర్ బ్యాంక్ తీసి నేలకేసి కొట్టింది. దీంతో చిన్నపాటి పేలుడు సంభవించడంతో కొద్దిసేపు గందరగోళం వాతావరణం ఏర్పడింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఆమెను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఐపీసీ సెక్షన్ 336, 285 ల కింద మాళవికను అదుపులోకి తీసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పయిందంటూ ఆమె క్షమాపణ కోరిందనీ, అయితే విచారణ అనంతరం ఆమెను బెయిల్‌పై విడుదల చేశామని ఎయిర్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సంజయ్ భాటియా తెలిపారు. ఆమె నేపథ్యం గురించి ఖచ్చితంగా తెలియదు కానీ ఒక టీవీ నటిగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. -
ఉద్యోగం పేరిట రూ.3 కోట్లు మోసం
అన్నానగర్ : చిదంబరంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 74 మంది వద్ద రూ.3 కోట్లు మోసం చేసిన మహిళను పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. కడలూరు జిల్లా చిదంబరం ఉలుందూరుకు చెందిన ఇళందీపన్ (33) ఆహార భద్రత బోర్డులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతని వద్ద చిదంబరం సిలువైపురానికి చెందిన క్షోభియ (32) అనే మహిళ తాను ఆహార భద్రత బోర్డులో అధికారిగా పని చేస్తున్నట్టుగా చెప్పి ఐడి కార్డును చూపించింది. రూ.5 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని క్షోభియా చెప్పింది. అది నమ్మిన ఇళందీపన్ రూ.3లక్షల 50వేల నగదు ఆమెకు ఇచ్చాడు. దీంతో నగదు తీసుకున్న ఒక వారంలో క్షోభియా ఇళందీపన్కు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇచ్చింది. అతను పనిలో చేరడానికి వెళ్ళినప్పుడు అది నకిలీ ఉత్తర్వు అని తెలిసింది. దీంతో ఇళందీపన్ చిదంబరం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ వచ్చారు. విచారణలో క్షోభి యా, ఆమె తల్లి ఆరోగ్యసెల్వి (50) కలసి పలువురు యువకుల వద్ద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నగదు తీసుకున్నారు. కడలూరులో కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న రవిచంద్రన్ (33)తో కలిసి నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి మోసం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. క్షోభియా మొత్తం 74 మంది వద్ద నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి మోసం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు మంగళవారం క్షోభియ, ఆరోగ్యసెల్వి, రవిచంద్రన్ ముగ్గురిని అరెస్టుచేశారు. -
ఉద్యోగం పేరిట మోసం
తిరువళ్లూరు: విద్యుత్‌శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నలుగురి వద్ద రూ.13 లక్షలు వసూలు చేసి ఉడాయించిన మహిళను తిరువళ్లూరు డీసీబీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా గూళూరు భజన వీధికి చెందిన జయకుమార్. ఇతనికి విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అరక్కోణం ప్రాంతానికి చెందిన మూర్తి, పాండిచ్చేరికి చెందిన కుగన్, అతని భార్య త్రిపురసుందరి తదితరులు మొదట రూ.నాలుగు లక్షలు తీసుకున్నారు. అనంతరం జయకుమార్ బంధువులకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మరో నలుగురి నుంచి రూ.9లక్షలు వసూలు చేశారు. తరువాత వారికి ఉద్యోగం ఇప్పించలేదు. బాధితులు నగదు తిరిగిఇవ్వాలని పలుసార్లు కోరినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తిరువళ్లూరు ఎస్పీ శిబిచక్రవర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ, తక్షణం విచారణ చేయాల్సింది క్రైమ్ పోలీసులను ఆదేశించారు. కేసును విచారించిన పోలీసులు మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో త్రిపురసుందరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 15 రోజులు రిమాండ్ విధించడంతో పుళల్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సింగర్‌ని కౌగిలించుకుందని..
రియాద్ : సౌదీ అరేబియా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో నిరూపించే సంఘటన మరొకటి చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో సింగర్‌ను కౌగిలించుకుందని ఓ మహిళను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం తైఫ్ సిటీలో గాయకుడు మజిద్ అల్ మోహండిస్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో స్టేజి వద్ద ఉన్న మహిళ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. ఆమెను ఆపడానికి సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఆమె వారిని నెట్టి మరీ అతన్ని కౌగిలించుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గాయకుడి ప్రదర్శన కొనసాగింది. సౌదీ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో ఎలాంటి సంబంధం లేని పురుషులను సౌదీ మహిళ తాకరాదు. దీంతో సదరు మహిళపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మహిళా సాధికారత విషయంలో ఇప్పుడిప్పుడే సౌదీ అరేబియా మెల్లగా అభ్యుదయపథం వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సౌదీలో మహిళల పట్ట కఠినంగా వ్యవహరించే చట్టాలు ఇంకా కొన్ని అమలులో ఉన్నాయి. డ్రెస్‌కోడ్ నిబంధన ఉంది. బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి కాళ్ల దాకా బురఖా ధరించాలి. గాయకున్ని కౌగిలించుకున్న మహిళ కూడా బురఖా ధరించే ఉన్నారు. -
భర్తపై హత్యాయత్నం కేసులో మహిళ అరెస్టు
నాగులుప్పలపాడు: భర్తను చంపేందుకు ఉద్దేశ పూర్వకంగా వేడి నూనె పోసిన భార్యను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ అజయ్‌బాబు కథనం ప్రకారం.. ఈదుమూడి గ్రామానికి చెందిన కొదమల సుధాకరరావు, ఏసుమ్మ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉధ్యోగం చేసే వారి కుమార్తె ఈ నెల 5వ తేదీన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడుతున్న తీరుకు మనస్తాపంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంకొల్లు బస్టాండ్‌లో ఉండి తండ్రి సుధాకరరావుకు ఫోన్ చేసి తాను హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పింది. కుమార్తె అలా వెళ్లడం నచ్చని తండ్రి భార్య ఏసుమ్మను ప్రశ్నించాడు. ఇదే విషయమై దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అంతా సర్దుకున్నాక నిద్రిస్తున్న భర్త సుధాకర్‌రావుపై భార్య ఏసుమ్మ బాగా కాగిన నూనె పోసింది. భర్తతో పాటు పక్కనే నిద్రిస్తున్న మరో కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఏసుమ్మపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బ్లేడు పడితే..బ్యాగు తెగాల్సిందే
అదో దొంగల ముఠా. వారు బ్లేడు పడితే.. బ్యాగు తెగాల్సిందే..ఆ ముఠా సభ్యులు ఆర్టీసీ బస్టాండ్లలో కాపు కాస్తారు. బ్యాగుల్లో నగలు తీసుకెళుతున్న ప్రయాణికులను గుర్తించి వారి వెంటే బస్సు ఎక్కుతారు. ప్రయాణికులు ఏమరపాటుగా ఉన్న సమయంలో బ్యాగు కత్తిరించి నగలు తస్కరిస్తారు. ఆ తర్వాత దారి మధ్యలోనే బస్సు దిగిపోతారు. శ్రీశైలం టెంపుల్: ప్రయాణికుల ముసుగులో ఆర్టీసీ బస్సుల్లో చోరీకి పాల్పడే అంతర్జిల్లా ముఠా సభ్యురాలిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నుంచి 65 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం శ్రీశైలం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఆదినారాయణపురం గ్రామానికి చెందిన కావేటి ఆదినారాయణ, కావేటి అలివేలు, కావేటి వరలక్ష్మి, శివలీల, నాగమ్మ, ఏడుకొండలు, కర్రెద్దుల వంశీ(నాని) ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ప్రయాణికుల మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి ప్రయాణికుల బాగ్యులు కత్తిరించి నగలు, నగదు చోరీ చేసేవారు. ఈక్రమంలో వీరిపై జిల్లాలోని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, నందికొట్కూరులో నాలుగు కేసులు నమోదయ్యాయి. చోరీలు ఇలా.. ముఠాలో ఆదినారాయణ కీలకమైన వ్యక్తి. అక్కచెళ్లెల్లైన కావేటి అలివేలు, కావేటి వరలక్ష్మిని అతడు వివాహం చేసుకున్నాడు. వీరు ముగ్గురూ శివలీల, నాగమ్మ, ఏడుకొండలు, కర్రెద్దుల వంశీతో ముఠా కట్టారు. ఇందులో కర్రెద్దుల వంశీ తప్ప మిగతా వారంతా బస్సుల్లో చోరీలు చేసేవారు. కర్రెద్దుల వంశీ వీరు చోరీ చేసి తెచ్చిన బంగారాన్ని కరిగించి అమ్మేవాడు. అనంతరం వచ్చిన డబ్బును అందరూ కలిసి పంచుకునేవారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వీరు చీరాల, అద్దంకి, ఒంగోలు, కడప, మైదుకూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేశారు. పట్టుబడిందిలా.. ఏడాది క్రితం నందికొట్కూరుకు చెందిన శివరత్నమ్మ ఆర్టీసీ బస్సులో కర్నూలు నుంచి నందికొట్కూరుకు బయలుదేరింది. ఆమెను వెంటాడిన దొంగల ముఠా సభ్యులు ఆమె బ్యాగును కత్తిరించి అందులో ఉన్న 44 తులాల బంగారును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. దాదాపు 8 నెలలపాటు బృందం సభ్యులు మఫ్టీలో ఉంటూ ముఠా సభ్యుల కోసం గాలించారు. ఈక్రమంలో ముఠా సభ్యురాలైన కావేటి అలివేలు శనివారం నందికొట్కూరులోని బంగారు దుకాణాల ముందు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొత్తం 85 తులాల బంగారు నగలు చోరీ చేసినట్లు అంగీకరించింది. ఇందులో 30 తులాలు బంగారం తన వద్ద ఉండగా మరో 35 తులాల బంగారాన్ని చీరాలలో మణప్పురం గోల్డ్‌లోన్‌లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకుంది. ఒంగోలు సీసీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్ బాలుకు 10 తులాల బంగారు అమ్మినట్లు తెలియజేసింది. నిందితురాలి నుంచి రూ.16 లక్షల విలువైన 65 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దొంగబంగారం కొనుగోలు చేసిన ఒంగోలు సీసీఎస్ కానిస్టేబుల్‌పై విచారణ చేపడతామన్నారు. సిబ్బందికి రివార్డులు.. అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసిన నందికొట్కూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈసందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది ఏ ప్రసాద్ఆచారి, బషీర్బాషా ,ఐ శ్రీనివాసులు, సి నాగరాజు, నభీసొలేల్ల,ఏ ఖాజాలకు రివార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు ఎల్లమరాజు, కృష్ణయ్య, వెంకటరమణ, నందికొట్కూరు, మిడుతూరు, శ్రీశైలం ఎస్ఐలు చంద్రశేఖరరెడ్డి, సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలిష్ వేస్తానని మస్కా- మహిళ అరెస్ట్
సాక్షి, హొసూరు: కాలిగొలుసుకు పాలిష్ వేస్తానని మోసం చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. కిష్టగిరి సమీపంలోని నాగర్కట్ట గ్రామానికి చెందిన వనిత(30) బుధవారం వీధిలో తిరుగుతూ పాలిస్ వేస్తానని చెబుతూ వెళ్లింది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన దీపిక తన కొడుకు కాలులోని గొలుసులకు పాలిష్ వేయమని ఇచ్చింది. అయితే పాలిష్ వేసిన తర్వాత గొలుసులు తక్కువ బరువు రావడంతో వనితను నిలదీసింది. దీనికి సమాధానంగా ఆ మహిళ అంతే పాలిష్ వేస్తే బరువు తక్కువగానే వస్తుందని ఆమె బదులిచ్చింది. దీంతో దీపిక స్థానికుల సాయంతో వనితను బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వనితను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
మహిళా స్మగ్లర్ అరెస్ట్..
సాక్షి, సిటీబ్యూరో: విశాఖ ఏజెన్సీలో గంజాయి ఖరీదు చేసి, సిటీకి అక్రమ రవాణా చేసి విక్రయించడానికి ప్రయత్నించిన ఓ మహిళా స్మగ్లర్‌ను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈమెపై గతంలోనూ ఈ తరహా కేసులు ఉన్నాయని, తాజాగా 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ మంగళవారం తెలిపారు. విశాఖపట్నం జిల్లా జీకే వీధి గూడానికి చెందిన కె.పార్వతమ్మ చింతపల్లికి చెందిన అప్పారావు నుంచి గంజాయి ఖరీదు చేసి, వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేసి విక్రయించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితం 14 కేజీల గంజాయిని అక్కడి ఏజెన్సీ ఏరియాలో ఖరీదు చేసి సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరింది. మంగళవారం అఫ్జల్‌గంజ్‌లోని సీబీఎస్‌లో బస్సు దిగిన ఈమె ట్రాలీ బ్యాగ్స్‌లో ఉన్న గంజాయిని ధూల్‌పేట ప్రాంతానికి తరలించి అక్కడ తనకు పరిచయస్తులైన హోల్‌సేల్ గంజాయి వ్యాపారులకు కేజీ రూ.5 వేల చొప్పున అమ్మాలని భావించింది. అయితే పార్వతమ్మ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ నేతృత్వంలోని బృందం సీబీఎస్ వద్ద వలపన్ని నిందితురాలిని అరెస్టు చేసింది. కేసును తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించింది. గోవాలో చిక్కిన హైదరబాదీలు... విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీల నుంచి గంజాయిని తరలిస్తూ, సిటీలో విక్రయిస్తున్న నిందితుల్ని ఇక్కడి పోలీసులు పట్టుకుంటున్నారు. ఇలానే హైదరాబాద్ నుంచి గంజాయిని గోవాకు తీసుకువెళ్ళి అక్కడ అమ్మడానికి ప్రయత్నించిన ఇద్దరు సిటీ వాసుల్ని గోవా యాంటీ నార్కోటిక్ సెల్ (ఏఎన్సీ) అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన అరుణ్, మహేష్ రెండు కేజీల గంజాయి తీసుకుని గోవాకు చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి గోవా ఏఎన్సీ అధికారులు వలపన్ని అరుణ్, మహేష్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
ఘరానా భార్య అరెస్టు
బనశంకరి : తాళి కట్టిన భర్తను హత్య చేయించి పరారీలో ఉన్న భార్యతో పాటు మరో వ్యక్తిని ఆదివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది మైసూరు నగరంలో ఓ పాఠశాల వ్యవస్థాపకుడు కృష్ణ (40)ను అతని భార్య రాధ గత ఏడాది తనకు సన్నిహితులైన మంజునాథ్, మరో వ్యక్తితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రాధా, మంజునాథ్‌లను అరెస్ట్ చేశారు. -
ప్రకటనలు, మాటలతో మాయచేసి..
బంజారాహిల్స్ : ప్రకటనలు, మాటలతో మాయచేసి మోసాలకు పాల్పడుతూ రూ. కోట్లు కొట్టేసిన కి‘లేడి’ని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విల్లివాకం నారాయణమేస్త్రీ రెండో వీధికి చెందిన సుజాత అలియాస్ కన్మణి ‘ఎక్స్‌ప్రెస్ కార్ వాష్’ కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2.50 లక్షలు డౌన్‌పేమెంట్ కడితే మీ పేరుతో కారును కొనుగోలు చేసి, అద్దెకు తిప్పుతూ ప్రతినెల రూ.30 వేలు చెల్లిస్తామని ప్రకటనలు ఇచ్చింది. దీనిని చూసి ఆకర్శితుడైన ముషీరాబాద్‌కు చెందిన రామారపు శశాంక్‌తో పాటు మరో 23 మంది 2016 సెప్టెంబర్ 7న రూ.2.50 లక్షల చొప్పున చెల్లించారు. నెలలు గడుస్తున్నా కార్లు కొనుగోలు చేయకపోగా ప్రతినెలా ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వక పోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెను విచారించగా నాగోల్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఇదే తరహాలో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఏడాదిలో 160 మందిని మోసం చేసి రూ.5 కోట్లు కాజేసినట్లు తెలిసింది. తమిళనాడులోనూ ఆమెపై ఈ తరహా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యవర్తులు సురేష్‌బాబు, శ్రీకాంత్, శేషులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదివింది ఎంఏ ఎంఫిల్ ఎక్స్‌ప్రెస్ కార్ వాష్ కంపెనీ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్న సుజాత అలియాస్ కన్మణి ఎంఏ ఎంఫిల్ చదివారు. ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ఎదుటివారిని ఇట్టే బుట్టలో వేసుకుంటారు. చాలా మంది ఆమె మాటలు నమ్మి మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా ఆమె వైఖరిలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు. -
మహిళలపై ప్రతాపమా...
అందాల పోటీల పేరుతో అతివలను ఆటబొమ్మలను చేయొద్దన్న డిమాండ్‌తో రెండో రోజూ ఆందోళనకు దిగిన మహిళా సంఘాల ప్రతినిధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆందోళన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత రేగింది. మద్దిలపాలెం జంక్షన్లో సోమవారం ఉదయం తలపెట్టిన నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. వాహనాల్లో వచ్చిన సంఘాల ప్రతినిధులను వాహనాలు దిగకుండా అడ్డుకున్నారు. ప్రతిఘటించిన వారిని ఈడ్చుకెళ్లి, ఎత్తుకెళ్లి పోలీసు వాహనాల్లోకి నెట్టి.. త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. వారందరినీ సాయంత్రం వరకు అక్కడే ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు.. దీనికి నిరసనగా ఆడవాళ్లను ఆటబొమ్మలను చేయొద్దన్నందుకు అరెస్టులు చేయడం సిగ్గచేటంటూ మహిళా సంఘాలు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించాయి. మద్దిలపాలెం (విశాఖ తూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైపోతుంది. అన్యాయాన్ని ప్రశ్ని స్తున్న మహిళా సంఘాలపై పోలీసులు జూలుం ప్రదర్శిస్తున్నారు. ఇదేం పాలనరా.. బాబు అనే దుస్థితికి మన రాష్ట్ర పాలన దిగజారిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. నగరంలో అందాల పోటీలను రద్దు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా సంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మద్దిలపాలెం కూడలి తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసనకు సమాయత్తమైన మహిళా సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడంపై ధ్వజమెత్తారు. అరెస్టు చేసిన మహిళా సంఘాల ప్రతినిధులను మూడో పట్టణ పోలీసు స్టేషన్లో కలిసి మద్దతు తెలిపారు. ఆమెతోపాటు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పీలా వెంటకలక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, మైనార్టీ సెల్ నగర ప్రధాన కార్యదర్శ సబీరాబేహంలు కలిసి పరామర్శించారు. మహిళ సంఘాలపై దాడులు అమానుషం మహిళలకు రక్షణలేని నేటి సమాజంలో.. అందాల పోటీలను నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.రామూర్తి,పి.వి.రమణ ఒక ప్రకటనలో ఖండించారు. గొంతు నొక్కితే ప్రభుత్వానికి పతనం తప్పదు అందాల పోటీలు నిర్వహించి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని అఖిల పక్ష మహిళా సంఘాలు నిరసన చేపడితే పోలీసులు బలవంతంగా అరెస్టులు చేయడం అన్యాయమని సీపీఐ గ్రేటర్ కార్యదర్శి దేవకొండ మార్కెండేయులు అన్నారు. ఉద్యమకారులు గొంతునొక్కె ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. కేసులు బనాయించం దుర్మార్గం అందాల పోటీలు వద్దని నిరసన తెలిపిన మహిళా సంçఘాలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని సీఐటీయూ నగర అధ్యక్ష,కార్యదర్శిఆర్.కె.ఎస్.కుమార్, జగ్గునాయుడు అన్నారు. మహిళాసంఘాల అరెస్టు తీరు చూసి సభ్యసమాజం తలదించుకుంటుందన్నారు. అరెస్టు చేయడం తగదు ఆందాల పోటీలు వద్దన్నందుకు మహిళా సంఘాల నాయకుల్ని అరెస్టు చేయడం దుర్మార్గమని ఐద్వా ఉపాధ్యక్షురాలు బి.పద్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథ, నగర కార్యదర్శి బి.గంగారావు, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. అందగత్తెల పోటీలు నిర్వహించొద్దని మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అందగత్తెల పోటీల పోస్టర్ ఆవిష్కరించడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ మహిళలను గౌరవించే పద్దతి ఇదేనా?, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ అందాల పోటీలు వద్దన్నందుకు పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయంచడం తగదన్నారు. పీవోడబ్ల్యూ నాయకులు లక్ష్మి నిర్బంధం -
కేరళలో మహిళ కీచక చర్య!
దేశంలో మైనర్ బాలలపై లైంగిక అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో 13 ఏళ్ల బాలికపై ఓ మహిళ కీచకంగా ప్రవర్తించింది. బాలికను లైంగికంగా వేధించి తన వికృతబుద్ధిని చాటుకుంది. కొచ్చిలోని పల్లురుథీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీచకంగా ప్రవర్తించిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు పోలీసు కస్టడీ విధించింది. మైనర్ బాలిక దుస్తులు మార్చుకుంటుండగా.. ఆమె అశ్లీలంగా ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను ఫేస్బుక్లో పెట్టి బహిరంగ పరుస్తానని బెదిరించి.. అప్పటినుంచి బాలికతో లైంగికంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదట ఈ విషయాన్ని చెప్పడానికి భయపడ్డ బాలిక.. ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలుపడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులుస నిందితురాలని అరెస్టు చేశారు. బాలిక అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసిన ఫోన్‌తోపాటు సిమ్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి స్వాధీనం.. మహిళ అరెస్టు
బాలానగర్: హైదరాబాద్‌లోని బాలానగర్ ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో ఫతేనగర్ పిట్టల బస్తీ బస్‌స్టాప్‌లో గంజాయి అమ్ముతున్న స్వరూప (32) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కొద్ది కాలంగా గంజాయిని అమ్ముతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందటంతో పోలీసులు మాటు వేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోదాలు చేయగా ఆమె నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళను రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
2 కిలోల గంజాయి పట్టివేత
రాజుపాలెం: ఇనిమెట్ల గ్రామంలో బుధవారం ఓ మహిళ నుంచి 2 కిలోల గంజాయిని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఎస్కే రంజాన్‌బీ కొన్నాళ్ల నుంచి గంజాయి అమ్ముతోందని గ్రామానికి చెందిన యువకులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అధికారులు గ్రామానికి సమీపంలో వాహనాన్ని ఆపి బ్రహ్మంగారి గుడి సమీపంలో గంజాయి అమ్ముతున్న రంజాన్బీని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ జి.సూర్యనారాయణ తెలిపారు. సత్తెనపల్లి ప్రొహిబిషన్ సీఐ ఎం.రమేష్, ఎస్ఐ ప్రసన్నలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి నతానియేలు తదితరులు పాల్గొన్నారు. -
జడ్జి శిక్ష వేశారని.. దోషి సోదరి వీరంగం
మీరట్: ఓ క్రిమినల్ కేసులో తన సోదరుడికి కోర్టు జైలు శిక్ష విధించడంతో ఓ మహిళ తీర్పు చెప్పిన న్యాయమూర్తిని దూషిస్తూ, ఆయన ఛాంబర్లో వీరంగం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టు ఆవరణంలో ఈ ఘటన జరిగింది. ఓ క్రిమినల్ కేసులో అనిత అనే మహిళ సోదరుడితో పాటు ఇతర నిందితులను ఇటీవల కోర్టు దోషులుగా ప్రకటించి పదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం అనిత మీరట్ అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిని కలిసేందుకు వచ్చింది. జడ్జి ఛాంబర్లోకి అనుమతిలేకుండా వెళ్లిన అనిత జడ్జిని కలవాలని సిబ్బందిని కోరింది. ఓ పేపర్‌పై తన పేరు రాసి విశ్రాంతి గదిలో జడ్జిని కలిసింది. తన సోదరుడికి శిక్ష వేసినందుకు జడ్జిని దూషిస్తూ, వాటర్ బాటిల్‌ను విసిరేసింది. టేబుల్‌పై ఉన్ గ్లాసును పగలగొట్టింది. అనితను అడ్డుకునేందుకు వచ్చిన ఓ మహిళ కానిస్టేబుల్‌పై చైర్ విసరడంతో ఆమె గాయపడింది. అనితపై కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి ఏకే రాణె చెప్పారు. -
ఆయింట్మెంట్ రాస్తూ నగలు కొట్టేసింది
చెన్నై: ఓ మహిళ మాయమాటలు చెప్పి ఓ వృద్ధురాలి నగలు కాజేయాలనుకుంది. బంగారం బదులు టమోటా ఉంచి నగలు కొట్టేసేందుకు పథకం వేసింది. చివరకు ఆమె పన్నాగం వికటించి కటకటాలపాలైంది. లక్ష్మి (35) అనే మహిళ.. పొన్నలూరు పెటాయ్లో ఓ ఇంట్లో ఒంటిరిగా ఉన్న ఇంద్రాణి (50) అనే ఆమెను కలసి, తనను నర్సుగా పరిచయం చేసుకుంది. తన దగ్గర సింగపూర్ నుంచి తీసుకువచ్చిన ఆయింట్మెంట్ ఉందని, అది నొప్పిని నయం చేస్తుందని ఇంద్రాణికి చెప్పింది. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఇంద్రాణి.. ఆయింట్మెంట్ రాయాల్సిందిగా లక్ష్మిని కోరింది. లక్ష్మి ఆయింట్మెంట్ రాస్తూ నగలు తీయాల్సిందిగా ఇంద్రాణికి చెప్పింది. ఇంద్రాణి నగలు తీసి చీర కొంగుకు కట్టుకుంది. కాసేపు కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వమని ఇంద్రాణికి లక్ష్మి చెప్పింది. లక్ష్మి ఈ సమయంలో ఇంద్రాణి చీరకొంగు విప్పి నగలు తీసుకుని, వాటికి బదులుగా టామోటా ఉంచింది. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి అల్మరా పగలగొట్టి అందులో ఉన్న 19 వేల రూపాయల నగదు తీసుకుంది. లక్ష్మి ఇంట్లోంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, ఇంద్రాణి విషయం గమనించి అలారమ్ మోగించింది. చుట్టుపక్కలవాళ్లు వచ్చి లక్ష్మిని బంధించి పోలీసులకు అప్పగించారు. లక్ష్మి గతంలోనూ ఇలాగే చోరీలకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. -
బాలిక హత్యకేసులో నిందితురాలు అరెస్ట్
నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు పట్టణంలో గత శుక్రవారం దారుణ హత్యకు గురైన వేముల రూప అనే గిరిజన బాలిక హత్యకేసును నూజివీడు పోలీసులు 24 గంటల్లో చేధించారు. రూప తల్లి పనిచేస్తున్న చోట పనిచేస్తున్న ఇస్లావత్ సీత అనే మహిళ ఈ హత్య చేసినట్లు ఒప్పుకుంది. బాలిక తల్లి మరియమ్మ మీద వ్యక్తిగత కక్షతో ఈ హత్య చేసినట్లు సీత పోలీసుల వద్ద అంగీకరించింది. ముందుగా పథకం ప్రకారం మరియమ్మ పనిచేస్తున్న ఇటుక తయారీ ఫ్యాక్టరీలో పనికి చేరింది సీత. మృతురాలు రూప ఆ రోజు ఉదయం తన తల్లి మరియమ్మ దగ్గరకు వెళ్లింది. రూపను తీసుకుని సీత బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వస్తాను తోడు పంపమని అడిగింది. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి బాలికను దారుణంగా చంపేసింది. నోట్లో మట్టిపోసి ఊపిరి ఆడకుండా చేసి, రూప గౌనును తీసి మెడకు బిగించి హత్య చేసింది. తిరిగి పనిలోకి వెళ్లి రూప ఆడుకోవడానికి వెళ్లినట్లు మరియమ్మకు చెప్పిందని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. -
'అదృశ్యమైన యువతి ఏటీఎంతో డబ్బు డ్రా..'
ఆస్ట్రేలియా: కనిపించకుండా పోయిన ఓ యువతి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రాచేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. బహుశా ఆ యువతిని డబ్బు డ్రా చేసిన వ్యక్తే చంపేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన జోడీ మేయర్స్ అనే యువతి ఆగస్టు 26న కనిపించకుండా పోయింది. మరుసటి రోజే ఆ అమ్మాయికి చెందిన బ్యాంక్ ఎస్ఏ ఏటీఎం కార్డు ద్వారా మార్గరెట్ ఆర్చర్ (55) అనే మహిళ డబ్బులు డ్రా చేసింది. అయితే, ఈ కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు గతవారం మేయర్స్ చాలా రోజు నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆమె చనిపోయి ఉందని తాము నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అలా చెప్పిన వారం తర్వాత తాజాగా మార్గరెట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేయర్స్ ఆగస్టు 26న ఇంటి నుంచి బయలు దేరేముందు తన జీవిత భాగస్వామి నెయిల్ అర్చర్తో వెళ్లిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అతడిని అనుమానితుడిగా చేర్చడం లేదని పోలీసులు తెలిపారు. మున్ముందు దర్యాప్తులో ఏ మార్పు జరుగుతుందో చెప్పలేమని తెలిపారు. కాగా, మార్గరెట్ బెయిల్ తీసుకొని విడుదలైంది. తిరిగి ఈ నెల 30న ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.