శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీ అరెస్ట్ | woman arrest in srikalahasti temple | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీ అరెస్ట్

Published Fri, Sep 26 2014 9:28 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

woman arrest in srikalahasti temple

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులకు మాయమాటలు చెప్పి నగదు, నగలు దోపిడీ చేస్తున్న కిలాడీ లేడీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆయలంలోని హుండీ నుంచి నగదు అపహరిస్తున్న ఆ మహిళను పోలీసులు ఈరోజు ఉదయం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా ఈనెల 19న ఒంగోలుకు చెందిన ఓ కుటుంబానికి తిరుపతికి చెందిన గౌరి   మాయమాటలు చెప్పి  విషం కలిపిన కాఫీని వారికిచ్చిన విషయం తెలిసిందే. స్పృహ కోల్పోయిన వారి వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అక్కడికి చేరుకున్న వారి కుటుంబసభ్యులు నిందితురాలిని పట్టుకొని సెక్యూరిటీకి అప్పగించారు.  ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement