srikalahasti
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. నెల్లూరుకు చెందిన వినయ్(23), హేమలత(23) ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. తిరుమల దర్శనార్థం శుక్రవారం బయలుదేరారు. శనివారం తిరిగి నెల్లూరుకు బైక్‌పై వెళుతుండగా శ్రీకాళహస్తి పట్టణం, వీఎంపల్లి వద్ద హేమలత బ్యాగు లారీకి చిక్కుకోవడంతో ఆమె లారీ కింద పడిపోయి, అక్కడికక్కడే మృతి చెందింది. వినయ్ స్వల్పగాయాలతో బయటపడడ్డాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో రిసార్ట్ కూల్చివేతకు కుట్ర
సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి తెగబడుతున్నారు. గత ఆరు నెలల్లో సుమారు 175 నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున 2017 టీడీపీ హయాంలోనే నిర్మించిన రివర్వ్యూ రిసార్ట్‌ను... నేడు అక్రమం అంటూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు.శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అల్లుడు శేఖర్‌రెడ్డికి చెందిన రిజి్రస్టేషన్ స్థలంలో రివర్ వ్యూ రిసార్ట్ నిరి్మంచారు. రిసార్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెంచురెడ్డి కుమార్తె వెల్లడించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేసింది. అందువల్లే వారిపై శేఖర్‌రెడ్డికి చెందిన రివర్ వ్యూ రిసార్ట్‌ను కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి కుట్ర పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెల్లవారుజామునే వచ్చి... మున్సిపల్ అధికారులు, పోలీసులు శనివారం వేకువజామున రివర్ వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అక్కడకు చేరుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తులలో ఏమిటీ దౌర్జన్యమని నిలదీశారు. అప్పటికే ప్రహరీ కొంత భాగాన్ని కూల్చి వేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న విధ్వంసకాండ గురించి బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమన వెంటనే శ్రీకాళహస్తిలోని రివర్వ్యూ రిసార్ట్ వద్దకు చేరుకుని కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదని, నిబంధనలు పాటించాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా హోటల్ వద్దకు చేరుకుని నిర్మాణాలు కూల్చివేతను తప్పుబట్టారు. ఇంతలోనే మరోసారి అధికారులు కూల్చివేతకు సిద్ధం కాగా.. బియ్యపు మధుసూదన్‌రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయవాది ప్రభాకర్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ కమిషనర్, అధికారులకు చదివి వినిపించారు. రిజిస్టర్ భూమిలో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని? అక్రమ నిర్మాణమే అయినా వారం ముందే నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అక్రమ నిర్మాణాలు అయినా శని, ఆదివారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంచేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పోలీసులు వెనకడుగు వేశారు. అయినా ఎమ్మెల్యే నుంచి మున్సిపల్ కమిషనర్, పోలీసులపై ఒత్తిడి రావటంతో ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు. ఒకవైపు అక్రమం అంటూనే.. మరోవైపు పరిహారం చెల్లిస్తామని.. ఉదయం నుంచి రివర్వ్యూ రిసార్ట్ అక్రమంగా నిర్మించారని, కూల్చివేస్తామని అధికారులు హడావుడి చేశారు. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు మాత్రం ‘స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం స్థలం అవసరం ఉంది. కొంత తీసుకుంటాం. అందువల్ల కూల్చివేసిన నిర్మాణాలకు ఎంత నష్టం అయ్యిందో చెబితే పరిహారం చెల్లిస్తాం’అని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత కూల్చివేతలు నిలిపివేసి అందరూ వెళ్లిపోయారు. కానీ, వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ లేని సమయంలో సాయంత్రం అధికారులు మరోసారి జేసీబీతో వచ్చి రివర్ వ్యూ రిసార్ట్ ముఖద్వారాన్ని పూర్తిగా కూల్చివేశారు. -
Tirupati: శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత..
-
శ్రీకాళహస్తి : అంగరంగ వైభవంగా ఏడు గంగమ్మల జాతర (ఫొటోలు)
-
శ్రీకాళహస్తి ఆలయం వద్ద అఘోరీ హల్ చల్
-
ఎవరి అర్థాలు వాళ్లవి...
దసరా పండుగ నాడు ఢిల్లీ ‘భారత మండపం’లోని ‘గతిశక్తి అనుభూతి కేంద్ర’ను మోదీ హఠాత్తుగా సందర్శించారు. ఆ రోజు ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కేంద్రం మూడవ వార్షికోత్సవం వేళ అక్కడికి వెళ్లి తన ప్రాధాన్యాన్ని దేశానికి వెల్లడించారు. అయితే, ఇది అందరికీ ఒకేలా అర్థం కావాలనే షరతు ఏమీ లేదు. వీటి తాత్పర్యం చంద్ర బాబుకు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డికి మరొక లాగా అర్థం కావొచ్చు. అందుకు వాళ్ళ వయస్సు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన కాలం, వారి ప్రాపంచిక దృక్పథం, మరెన్నో కారణాలు కావొచ్చు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ పదేళ్ళలో అదీ దేశానికి తూర్పున ఈ చివరన ఉన్నామేమో, ఇందులో ‘మనకు ఏముంది’ అని చూసినప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఎక్కువే ఉంది.ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15.39 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 208 భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు ఉన్నాయి. దీని అమలుకు వేర్వేరు శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం ఒక ‘నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్’ పనిచేస్తున్నది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ – ఇంటర్నల్ ట్రేడ్’ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా... ‘ఇందులో 101 జాతీయ రహదారులు, 73 రైల్వే ప్రాజెక్టులు, 12 పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, 4 చమురు–గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి’ అంటున్నారు. ఈ నాలుగు రంగాలు కూడా ప్రాంతాల మధ్య దూరాలనుతగ్గించి వాటిని చేరువ చేస్తూ, విద్యుత్తు భద్రత, పట్టణీకరణ లకు దోహదం చేస్తాయి. ఇందులో కీలకమైన అంశం ‘పి.ఎం. గతిశక్తి’... ‘బ్రాడర్ విజన్’ పేరుతో దేశవ్యాప్తంగా 1600 రకాల ‘జియో స్పైటల్ డేటా’ను సేకరించి ఈ ‘నేషనల్ మాస్టర్ ప్లాన్’ ప్రాజెక్టు కోసం ఇక్కడ భద్రపరుస్తున్నారు. పక్కా ‘డేటా’తో అభివృద్ధి ప్రణాళికల తయారీకోసం వీటిని సేకరిస్తున్నారు. ఇందులో ‘నేచురల్ రిసోర్సెస్ డేటా’ సేకరణ ఒక అంశంగా ఉంది. ప్రాంతాల స్వరూపం తెలి యడం కోసం ‘ల్యాండ్ రికార్డ్ డేటా’ అవసరం. అలాగే సాగు కోసం భూగర్భ జలాల వినియోగం ఎంతో తెలియడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చాలి. నిజానికి ఇవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన వీటిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో అల్లరి చేసిందీ తెలిసిందే. ‘అభివృద్ధి’ గురించి ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మార్చి 2023లో విశాఖలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏమిటో చూడాలి. ఇందులో కీలకం ఏమంటే, ఆయన దృష్టి ఆసాంతం ఢిల్లీ నుంచి కిందికి దక్షిణాదికి దిగే క్రమంలో ఢిల్లీ యంత్రాంగాన్ని నేరుగా తూర్పు తీరానికి చేర్చడంపై పెట్టారు. ‘ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి అక్కణ్ణించి నాగపూర్ వచ్చి అక్కణ్ణించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని చెబుతూ... ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయనీ, అవి పూర్తి అయితే వాటిలో ఒకటైన ‘రాయపూర్–విశాఖపట్టణం’ రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు ఏపీ పోర్టులు అందుబాటులోకి వస్తాయనీ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ. 33.540 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్నామన్నారు. ఇలా ఢిల్లీ నుంచే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణాన మన సముద్ర తీరానికి రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరవచ్చన్నారు. సరే, ఇది విని ‘ఎందుకు?’ అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నాలుగు నెలల తర్వాత కాకినాడలో దొరికింది. అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ ప్రారంభానికి హాజరై ఆంధ్ర సముద్ర తీరం డిల్లీకి ఎంత కీలకమో చెప్పకనే చెప్పారు. ఇక వెనకబడిన మెట్ట కరవు ప్రాంతాలను ‘ఓపెన్’ చేయడానికి నడికుడి– శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ మార్చి నాటికి పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనదైన సంక్షేమ ముద్రను ప్రతి రంగం మీద వేసింది. కుర్చీ ఎక్కిన ఆరు నెలల్లోనే వచ్చిన ‘కరోనా’ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోనే ‘ఏపీ’ ముందు నిలిచింది. జగన్ ముందు చూపు అప్పట్లో అందరికీ అర్థం కాలేదు. కేంద్రం ‘గతిశక్తి సంఘటన్’ పేరుతో చేస్తున్న మౌలిక వసతుల కల్పన వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ ప్రభుత్వం ప్రజల పాటవ నిర్మాణం (కెపా సిటీ బిల్డింగ్) పై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, విద్య–వైద్యం ప్రాధాన్యత పెంచింది. కొత్త జిల్లాలతో ప్రభుత్వాన్ని, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్యాన్ని కొత్త ప్రాంతాలకు చేర్చింది. నైపుణ్యాలు తప్పనిసరి అయ్యే సామాజిక వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవిక కోసం ‘స్కిల్ డెవలప్మెంట్’పై దృష్టి పెట్టింది. అయినా ఎన్నికలప్పుడు ‘అభివృద్ధి ఏది?’ అనే విమర్శ చేయడం చాలా తేలిక. కానీ ‘అభివృద్ధి’ అంటే ‘మానవాభివృద్ధి’ అని అర్థమయ్యేట్టుగా చెప్పడం మరీ కష్టం. వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
గుడి కూల్చేసిన టీడీపీ నేత
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కుందేటివారి వీ«ధి ఎస్టీ కాలనీలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం రెండడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమేగాక అడ్డుకున్న కాలనీవాసుల్ని బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి నాలుగు నెలల కిందట ఆరడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు.ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారి అయిన టీడీపీ నేత వెంకటేష్ శెట్టికి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరూ కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి, కడుతున్న ఆలయం వ్యాపారి స్థలంలో రెండడుగుల మేర ఉందని మార్క్ వేశారు. ఆ రెండడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి, మండల సర్వేయర్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్‌శెట్టి జేసీబీతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు.అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానంటూ బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే రూ.2.5 లక్షలు ఖర్చయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సర్వేయర్ హరిని అడగగా.. వెంకటేష్ స్థలంలో రెండడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్నా గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు. ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు కుందేటివారి వీధి ఎస్టీకాలనీ వాసులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలు. ఇక్కడ అందరూ రోజువారీ కూలీలే. పైసాపైసా కూడబెట్టి గ్రామదేవత గంగమ్మ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. ఆపై దాతల సాయంతో కొంత మొత్తాన్ని సేకరించారు. తర్వాత వారే కూలీలుగా ఆలయాన్ని నిరి్మస్తున్నారు. టీడీపీకి చెందిన వ్యాపారి వెంకటేష్ శెట్టి తన స్థలానికి బేరం కుదరడంలేదన్న సాకుతో ఆలయం మొత్తాన్ని కూల్చేసేందుకు స్కెచ్ వేశారు.సర్వేలో ఆలయం తన స్థలంలోకి రెండడుగుల మేర వచ్చిందన్న సాకుతో మరింత రెచ్చిపోయారు. ఆలయం మొత్తాన్ని రాత్రికిరాత్రే జేసీబీతో కూల్చేశారు. శిథిలాలను ట్రాక్టర్ల ద్వారా రాత్రికిరాత్రే తరలించారు. అడొచ్చినవారిపై చిందులేస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో గిరిజనులు చేసేదిలేక ఆలయాన్ని కూల్చేస్తున్నా ఆవేదనగా చూస్తూ ఉండిపోయారు. వెంకటేష్ శెట్టికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉండడం వల్లే ఎస్టీలమైన తమపై ప్రతాపం చూపుతున్నాడని వారు మండిపడుతున్నారు. -
శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వాలంటీర్లు మహేశ్వరి, పృథ్వీ ఇళ్లపై దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు.. వారిని నిర్బంధించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాలంటీర్ల కుటుంబాన్ని రక్షించారు.వైఎస్సార్ విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం: తోపుదుర్తిఅనంతపురం: టీడీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. రాప్తాడులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ విగ్రహాలను టీడీపీ నేతలను కూల్చడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తాం. హామీలు నెరవేర్చకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని తోపుదుర్తి హెచ్చరించారు.టీడీపీ దాడులపై ఎస్పీ గౌతమి శాలి సీరియస్టీడీపీ దాడులపై అనంతపురం ఎస్పీ గౌతమి శాలి సీరియస్ అయ్యారు. దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు. -
ఏర్పేడులో ఆర్. కృష్ణయ్యపై రాయితో దాడి
సాక్షి, తిరుపతి: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండల కేంద్రంలో కృష్ణయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ అగంతకుడు వెనుక నుంచి రాయి విసరడంతో ఆయన వీపునకు తగిలి గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ.. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారని తెలిపారు. పేదలకు మేలు చేస్తున్న జగన్‌కు బీసీలు అండగా నిలుద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
మా మధు అన్నకు ఈ సారి మంత్రి పదవి ఇవ్వండి అన్న
-
సంక్షేమం అందించే ప్రభుత్వమే కావాలి: శ్రీకాళహస్తి ప్రజలు
-
సీఎం జగన్ తో సెల్ఫీ కోసం బస్సు వెంట పరిగెత్తిన యువకుడు
-
డ్రైవర్లంటే చంద్రబాబుకి అంత చులకనా.. 40 రోజుల్లో మెమెంటో చూపిస్తాం..
-
కాళహస్తిలో సెల్ఫీ వీడియో.. టీడీపీ నేతపై ఆగ్రహం
తిరుపతి, సాక్షి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో సెల్ఫీ వీడియో ద్వారా ఆలయ ట్రస్ట్ ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఆ నిబంధనల్ని బొజ్జల ఉల్లంఘించారు. ఆలయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. ఆలయంలో పురాతమైన భాగం తొలగింపు.. ఆ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బొజ్జల. పైగా గోడ కూలడాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి విమర్శలు గుప్పించారు. దీంతో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆంజురు తారక శ్రీనివాసులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో బొజ్జలపై చట్టపరమైన చర్యలు కు సిద్దం అవుతున్నారు. ఆలయ చైర్మన్ వివరణ ఇది.. ఆలయంలో కూల్చివేత అంటూ టీడీపీ నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై శ్రీకాళహస్తి ఆలయం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్పందించారు. ఆలయంలో మృత్యుంజయ లింగం ఆనుకుని ఉన్న గదిని గతంలో ప్రసాదాలు తయారీ సరుకుల గోడౌన్ గా వినియోగించేవారు. 1956 లో దేవస్థానం ట్రస్టీ సహకారం తో దీన్ని నిర్మాణం చేశారు. శిథిలావస్థలో ఉన్న దీన్ని కూల్చి వేయాలని ప్రస్తుత పాలక మండలి 2022 ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశం లో 7వ అంశంగా చేర్చారు. దానిలో భాగంగా పాడుబడిన ఈ గదిని తొలగింపు చర్యలు చేపట్టారు -
ముగిసిన గ్రహణం..తెరుచుకున్న ఆలయం
తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. తిరుమలలో ఆదివారం ఉదయం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాల పూజలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. గ్రహణాల సమయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేకాభిõషేకాలు నిర్వహించారు. ఆదివారం వేకువజాము 1 గంటకు మొదటి కాలాభిషేకం, 1:45 గంటలకు రెండోకాలాభిషేకం, 2.30 గంటలకు మూడో కాలాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. -
26 మంది టిడిపి లీడర్లపై కేసు నమోదు
-
పోలీస్ స్టేషన్ ఎదురుగా టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి రౌడీయిజం..!
-
ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్కే గ్రూప్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు. -
టీడీపీలో టికెట్ వార్.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా?
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరింది. నేతల సంగతి దేవుడెరుగు.. కార్యకర్తలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం టికెట్ కోసం ఆశావహులు పోటీ పడుతున్నారనే కలరింగ్ ఇస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ అభ్యరి్థత్వంపై హామీ ఇచ్చి మభ్యపెడుతున్నారు. ప్రధానంగా బొజ్జల సుదీర్‌రెడ్డి.. ఎస్సీవీ నాయుడు.. మునిరామయ్య మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అరకొరగా మిగిలిన శ్రేణుల్లో సైతం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తమ్ముళ్ల నడుమ తకరారు పెట్టి చోద్యం చూస్తున్నారు. దీంతో ఏ నేత వెంట వెళితే ఏం ముంచుకొస్తుందో అని కార్యకర్తలు అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, తిరుపతి : శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరి రోజులు గడవక ముందే ఆ పారీ్టలో కోల్డ్ వార్ మొదలైంది. నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోసం చంద్రబాబు వేసిన ఎత్తులకు బొజ్జల, ఎస్సీవీ, సత్రవాడ బలవుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆ ముగ్గురు నాయకుల మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఓటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సర్వేల్లో తేలిపోయింది. విషయం తెలిసినా.. బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్రవాడ మునిరామయ్య, ఎస్సీవీ నాయుడు నడుమ అగ్గి రాజేసి ఆజ్యం పోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థత్వం కోసం ఈ ముగ్గురు నేతలు పోటీపడుతున్నారని, అందుకే ఎవరినీ ఖరారు చేయకుండా మభ్యపెడుతూ వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తరచూ పారీ్టలు మారే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏపార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు నెరుపుతూ.. చిన్నగా అందులోనే చేరడం ఎస్సీవీ నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా టీడీపీ అధికారం కోల్పోవటంతో వైఎస్సార్సీపీలో కొనసాగుతూ శ్రీకాళహస్తిలో చక్రం తిప్పాలని భావించారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుండటంతో వ్యక్తిగతంగా తనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని భావించిన ఎస్సీవీ నాయుడు మరోసారి టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పార్టీలో చేరక ముందు నుంచే వర్గాలు ! శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీచేయాలనే లక్ష్యంతో టీడీపీలో చేరిన ఎస్సీవీ నాయుడు ఆరు నెలల ముందు నుంచే తమ్ముళ్లందరితో సఖ్యతగా ఉండటం ప్రారంభించారు. బొజ్జల, మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య వర్గీయులతో తరచూ మాట్లాడుతుండటం, వారిని ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా మంతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ అ«ధినేత చంద్రబాబుని కూడా తరచూ కలిసేవారని విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్‌రెడ్డిపై ప్రజల్లో సానుకూల దృక్పథం లేదని చంద్రబాబుకు పదే పదే చెప్పేవారని తెలిసింది. అందులో భాగంగానే ఎస్సీవీని టీడీపీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థగా ఎస్సీవీకి గట్టి హామీ ఇవ్వటంతోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఎస్సీవీ నాయుడు పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చారు. పార్టీని నమ్ముకుని ఉన్న బొజ్జల సు«దీర్‌రెడ్డి తనకే టికెట్ అని భావించి తన వంతు నియోజక వర్గంలో పర్యటించటం, నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడటం చేస్తున్నారు. అయితే చంద్రబాబు లోపాయికారీ ఒప్పందంలో భాగంగా ఎస్సీవీ నాయుడికే టికెట్ అనే విషయం బొజ్జలకు ఆలస్యంగా తెలియటంతో పలుమార్లు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. బస్సుయాత్రలో బయటపడిన విభేదాలు టీడీపీ నేతలు చేపట్టిన బస్సుయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తనకు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తనకు పొలం ఇచ్చారని, అందులో తననే సాగు చేసుకోమని చెప్పారని పరోక్షంగా తెలియజేశారు. సందర్భం లేకుండా ఎస్సీవీ నాయుడు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనే విషయం టీడీపీ శ్రేణులకు అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న బొజ్జల సుదీర్‌రెడ్డి మాత్రం ఎస్సీవీ నాయుడు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని, నేటి వరకు శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా మరో వైపు మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కూడా తన వంత తాను ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే పైకి తామంతా ఒక్కటేనని, ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని చిలక పలుకులు వల్లిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల బొజ్జల సు«దీర్‌రెడ్డి, ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరికి వారు తనకే టికెట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. తాజాగా బస్సుయాత్రలోనే ఎస్సీవీ నాయుడు, ఆయన వర్గీయులకు బొజ్జల ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులను బస్సులో ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారే ప్రచారం జరుగుతోంది. ఇలాగైతే కొనసాగలేం అడుగడుగునా అవమానాలు భరిస్తూ టీడీపీలో కొనసాగలేమని ఎస్సీవీ నాయుడు ముఖ్య అనుచరుడు శివా యాదవ్ తదితరులు ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో నిమ్న వర్గాలకు ప్రాధాన్యత లేదని మీడియా ఎదుట వాపోయారు. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ బస్సు యాత్రలో పాలుపంచుకున్న తనపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని శివ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎస్సీవీ నాయుడు అనుచరుడినని చెబుతున్నా వినకుండా బస్సు దిగమన్నాడని, అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషిస్తూ అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు. విజయవాడలో చంద్రబాబు నాయుడుని ఎస్సీవీ సుమారు 500 మందితో కలిశారని, అప్పుడు కూడా బొజ్జల సుధీర్‌కి టికెట్ ఇస్తామని పార్టీ అధినేత చెప్పలేదని వివరించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని మాత్రమే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ ఆఫీసుకి వస్తే దాడి చేస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, బొజ్జల సు«దీర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని శివ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు వర్గం దూసుకుపోవడం సహించలేక బొజ్జల సు«దీర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేయటం గమనార్హం. తుస్సుమన్న బస్సు యాత్ర! – వరదయ్యపాళెంలో వెలవెల పోయిన రచ్చబండ వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగ మండలం పల్లమాల నుంచి యాత్ర ప్రారంభించారు. బీఎన్‌కండ్రిగ, వేణుగోపాలపురం మీదుగా వరదయ్యపాళెంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంతో యాత్ర ముగిసింది. అయితే రచ్చబండ జనం లేక వెలవెల పోయింది. రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ వారి ఊక దంపుడు ప్రసంగాలు వినలేక జనం నెమ్మదిగా జారుకున్నారు. అంతకు ముందు వరదయ్యపాళెంలో నిర్వహించిన ర్యాలీలో సైతం పట్టుమని 100 మంది కూడా లేకపోవడం గమనార్హం. కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్షి్మ, మాజీ ఎమ్మెల్యేలు హేమలత, ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, పరసారత్నం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి హెలన్ ఉన్నారు. -
శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక, మృతులు విజయవాడకు చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్దలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి.. -
అల్లూరయ్య అక్రమాలు.. టీడీపీ ముఖ్యనేత సతీమణికి భారీగా అవినీతి సొమ్ము
తీగలాగితే డొంక కదిలినట్లు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఓ చిరుద్యోగి ఇంట్లో సోదాలు చేస్తే మాజీ మంత్రి బొజ్జల అనుచరుల అక్రమాల పర్వం వెలుగుచూసింది. రాజీవ్‌నగర్‌లో నిరుపేదలకు కేటాయించిన స్థలాలను ఇష్టారాజ్యంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వైనం పట్టణ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో పురపాలక ఉద్యోగి అల్లూరయ్యను అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేశారనే విషయం తెలియడంతో లబి్ధదారులు లబోదిబోమంటున్నారు. మాయమాటలు చెప్పి తమ పట్టాలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో తెగనమ్మేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా మరికొందరు పచ్చనేతలు అందినకాడికి స్థలాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో దివంగత నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో మంచి డిమాండ్ ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని ప్లాట్లను బొజ్జల అనుచరులు ఒక్కొక్కటిగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. అసలైన లబ్ధిదారుల సంతకాలను ఫోర్జరీ చేసి విక్రయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో అల్లూరయ్య అనే మున్సిల్ ఉద్యోగి నివాసంలో అధికారులు చేపట్టిన సోదాలో బయటపడ్డ పట్టాలే ఇందుకు నిదర్శనం. సాక్షి, తిరుపతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌నగర్ కాలనీ పేరుతో ఇల్లులేని పేదలకు గూడు కల్పించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో అందుకు అవసరమైన భూములను సేకరించారు. సుమారు 6వేల మంది పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. పక్కాగృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాజీవ్ నగర్ అభివృద్ధి అటకెక్కింది. తర్వాత ప్రభుత్వాలు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక కలి్పంచకపోవటంతో అక్కడ ఇల్లు కట్టుకునేందుకు లబి్ధదారులు సైతం పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో హౌసింగ్‌శాఖలో కాంట్రాక్టు కింద పనిచేస్తున్న అల్లూరయ్య మాయమాటలు చెప్పి లబి్ధదారుల పట్టాలను తీసిపెట్టుకున్నాడు. అరాకొర ధరలకే కొన్ని ప్లాట్లను అమ్ముకుని జేబులో వేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లోనే బయటపడడంతో నాటి ప్రభుత్వం వెంటనే అల్లూరయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది. టీడీపీ హయాంలో రెచ్చిపోయి.. టీడీపీ ప్రభుత్వంలో అల్లూరయ్య శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తొలుత అటెండర్‌గా చేరి అవినీతి పర్వానికి తెరతీశాడు. ఆ సమయంలోనే 30 మంది మున్సిపల్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును కాజేశాడనే ఆరోపణలతో సస్పెండయ్యాడు. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత సతీమణికి రూ.20లక్షలు ముట్టజెప్పి, 2018లో అదే కార్యాలయంలో జూనియర్ అసిప్టెంట్గా ఉద్యోగం పొందాడు. ఇక అప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లో అల్లూరయ్య ఆడింది ఆట.. పాడింది పాటగా మారిపోయింది. అదే సమయంలో అల్లూరయ్య వద్ద ఉన్న ఇంటి పట్టాల విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బొజ్జల అనుచరులు నలుగురు రంగంలోకి దిగారు. లబి్ధదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.100 డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. దొరికిన స్థలాలను దొరికినట్లు ఇష్టారాజ్యంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. వందలాది పట్టాలు వెలుగులోకి.. రాజీవన్నగర్లో నాడు రూ.30వేలు ఉన్న ఇంటి స్థలం.. నేడు రూ.5లక్షలకు చేరడంతో అల్లూరయ్య దగ్గర ఉన్న పట్టాలను టీడీపీ నేతలు బయటకు తీయించారు. తాము ఇది వరకే సిద్ధం చేసుకున్న రూ.100 డాక్యుమెంట్లను చూపించి కొనుగోలుదారులను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. తమకు నగదు అవసరమని, అందుకే రూ.5లక్షల ప్లాటుని రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకే ఇచ్చేస్తున్నామని ప్రచారం చేపట్టారు. ఆ ప్రాంతంలో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ప్లాటు వస్తుందని స్థానికులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేశారు. ఇలా సుమారు వెయ్యి ప్లాట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. ఇవి కాకుండా అల్లూరయ్య ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో మరో 2,309 పట్టాలు దొరకడం గమనార్హం. టీడీపీలోని నలుగురు నేతలు, అల్లూరయ్య చేస్తున్న అక్రమాలను తెలుసుకున్న మరికొందరు ఆ పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఆక్రమించుకున్నట్లు సమాచారం. భాగోతం బట్టబయలు! రాజీవ్‌నగర్‌లో ఇంటి స్థలాలకు రేటు పలకుతుండడంతో అల్లూరయ్య దగ్గర పట్టాలు ఇచ్చిన లబి్ధదారుల్లో కదలిక వచ్చింది. తమ పట్టాలను వెంటనే ఇవ్వాలని అల్లూరయ్యను కోరారు. అయితే తన వద్ద ఎలాంటి పట్టాలు లేవని తెగేసి చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విచారణకు ఆదేశించడంతో బొజ్జల అనుచరుల భాగోతం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన డిమాండ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గం అభివృద్ధి పథంలో పయనించింది. అక్కడ జగనన్న కాలనీ పేరుతో 2 వేల మందికి పైగా పక్కాఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లే అవుట్‌ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సైతం ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నవరత్నాల ఆలయాన్ని నిర్మించారు. జగన్న కాలనీకి ఎదురుగానే ఉన్న రాజీవ్‌నగర్‌కి పైన కొండచుట్టు కోసం ‘దేవుడి బాట’ పేరుతో 20 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేశారు. కాలనీకి పకడ్బందీగా నీటి సౌకర్యం కలి్పంచారు. దీంతో రాజీవ్‌నగర్ కాలనీలోని ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. -
శ్రీకాళహస్తిస్వరుడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
నేటి నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
శ్రీకాళహస్తిలో యాంకర్ అనసూయ పూజలు.. ఫోటోలు వైరల్
-
Srikalahasti: లాడ్జికి తీసుకెళ్లి.. ఆపై మత్తు మందు ఇచ్చి..
క్రైమ్: మోసాన్ని మోసపోయేదాకా గుర్తించకపోవడం కొందరి ప్రత్యేకత. అలాంటిదే ఈ ఘటన. తిరుపతిలో ఓ మహిళ చేసిన ఘరానా మోసం బయటపడింది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తిని పూర్తిగా దోచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బస్సులో పరిచయమై లాడ్జికి తీసుకెళ్లింది కిలాడి మహిళ. దీంతో వెళ్లిన అతగాడికి.. ప్రసాదంలో మత్తుమందు ఇచ్చి దోచుకుంది ఆ మహిళ. సుమారు 75 తులాల బంగారం,20 వేల నగదు, ఓ సెల్ ఫోన్ మాయం చేసి పరారైంది. ఆ విలువ సుమారు రూ. 6లక్షల రూపాయలు అంటున్నాడు బాధితుడు. బాధితుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు పోలీసులు. తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ కిలేడీ గురించి గాలింపు చేపట్టారు. -
శ్రీకాళహస్తిలో కిలాడి లేడీ ఘరానా మోసం
-
క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు..
శ్రీకాళహస్తి(తిరుపతి): ఓ తండ్రి క్షణికావేశం ముక్కు పచ్చలారని మూడు నెలల చిన్నారి ప్రాణాలను బలి తీసుకొంది. భార్యతో గొడవతో సహనం కోల్పోయిన ఆ తండ్రి.. బిడ్డను గోడకేసి కొట్టడంతో ఆ పసిప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శుకబ్రహ్మాశ్రమం సమీపంలోని వాటర్ హౌస్ కాలనీలో భార్యాభర్తలు మునిరాజా, స్వాతి నివాసముంటున్నారు. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. రెండేళ్ల తర్వాత వీరికి నిఖిల్ పుట్టాడు. ప్రస్తుతం నిఖిల్ వయసు మూడు నెలలు. నాలుగు రోజుల కిందట పిల్లాడికి న్యుమోనియా సోకడంతో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఇందుకోసం తన బైక్‌ను అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత బిడ్డకు మళ్లీ జ్వరం రావడంతో.. నువ్వు ఆస్పత్రిలో సరిగా చూపించలేదంటూ భార్య గొడవకు దిగింది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తన తండ్రి బైక్‌ను తీసుకురాగా.. అప్పటికే వాళ్ల మధ్య విభేదాలుండటంతో ఆ బైక్ ఎక్కేందుకు ఆమె నిరాకరించింది. అంతేగాక తన తల్లిదండ్రుల మీద ఆమె నోరు పారేసుకోవడంతో మునిరాజా సహనం కోల్పోయాడు. అదే సమయంలో బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండటంతో మునిరాజా.. బాలుడి కాళ్లు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు వన్ టౌన్ సీఐ అంజుయాదవ్ చెప్పారు. -
ముక్కంటి సేవలో క్రికెటర్ కేదార్ జాదవ్
సాక్షి, శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని భారత క్రికెటర్, ప్రముఖ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనయుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు పసల సుమతి, మున్నారాయల్, ప్రత్యేక ఆహా్వనితులు పవన్ రాయల్ పాల్గొన్నారు. -
మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
సాక్షి, శ్రీకాళహస్తి: విద్యార్థిని చదువు మధ్యలో ఆగిపోకుండా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.50 వేలు సాయం చేసి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తొట్టంబేడు మండలం రాంబట్లపల్లెకు చెందిన సుధాకర్‌నాయుడు, విజయ దంపతుల కుమార్తె జ్యోత్స్న మదనపల్లెలో ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది. వారిది పేద కుటుంబం కావడంతో చదువుకు ఇబ్బంది కలిగింది. వారు బుధవారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని కలిసి తమ గోడును వినిపించారు. స్పందించిన ఆయన రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా విద్యార్థినికి ల్యాప్‌ట్యాప్‌ను ఈ నెల 20వ తేదీన తీసిస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో చదువు ఆగిపోకుండా సాయం అందిస్తానని వెల్లడించారు. దీంతో సుధాకర్‌నాయుడు దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (భార్య సివిల్స్ పోరాటం..భర్తలో అనుమానం) -
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరిళ్లకు వారిని పంపించివేశారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు, పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలున్నాయి. చదవండి: మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడి నిర్వాకం.. యువతిపట్ల అసభ్యకర ప్రవర్తన మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత శనివారం వీరిద్దరూ వెళ్లిపోయి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సీఐ సీతారామిరెడ్డి వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి అప్పగించారు. -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. పర్యటన ముగించుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో ఓ యువకుడు రోడ్డుపై అర్జీతో కనిపించాడు. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్‌ను ఆపి సెక్యూరిటీ సిబ్బందిని అర్జీ తీసుకోమని పురమాయించారు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన మహేష్‌కి 2019లో యాక్సిడెంట్లో అంగ వైకల్యం కలిగింది. సీఎం జగన్ జిల్లా పర్యటనకు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సీఎం జగన్.. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుపై అర్జీతో నిల్చోవడంతో సీఎం జగన్ చూసి స్పందించారు. అయితే, అర్జీలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనను ఆదుకోవాలని అర్జీలో కోరినట్లు మహేష్ తెలిపారు. చదవండి: (ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్) -
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
-
అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్
సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇనగలూరులో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మొదటి దశలో రూ.350 కోట్లు, వచ్చే ఐదేళ్లలో మరో 350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అపాచీ పరిశ్రమలో అడిడాస్ షూలు, లెదర్ జాకెట్స్, బెల్ట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. 2023 సెప్టెంబర్ కల్లా పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 80 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిది: టోనీ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ కృతజ్ఞతలు తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు మరువలేనిదన్నారు. పారిశ్రామికరంగాన్ని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. చదవండి: (ఒక్క రూపాయికే పక్కా ఇల్లు) -
ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!
శ్రీకాళహస్తి: గత నెల 26న శ్రీకాళహస్తిలోని ఫిన్‌కేర్ బ్యాంకు దోపిడీ కేసులో బ్యాంకు మేనేజర్ స్రవంతితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం 1వ పట్టణ పోలీసుస్టేషన్లో ఆయన నిందితుల అరెస్టును మీడియాకు చూపారు. బ్యాంకు దోపిడీ కేసులో మేనేజర్ స్రవంతిదే కీలకపాత్రని వెల్లడించారు. పట్టణంలో ముత్యాలమ్మ గుడి వీధిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న స్రవంతి ఐదేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే వీధికి చెందిన జనసేన నేత విజయకుమార్‌తో సన్నిహితంగా ఉంటోంది. అలాగే అదే ప్రాంతానికి చెందిన నవీన్, సుల్తాన్లతోనూ స్రవంతికి స్నేహం ఉంది. నవీన్, సుల్తాన్లు కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం నుంచి స్రవంతి బ్యాంకులో పలు అవకతవకలకు పాల్పడింది. తన స్నేహితులు, తెలిసినవారి పేర్లతో పెద్ద ఎత్తున నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందింది. ఆడిటింగ్‌లో దొరక్కుండా జాగ్రత్త పడింది. ఎప్పటికీ దొరకకుండా ఉండేందుకు తన మిత్రులు ముగ్గురితో కలిసి డ్రామాకు తెరలేపింది. ఇందులో భాగంగా విజయకుమార్, సుల్తాన్, నవీన్, చెన్నైకు చెందిన హుస్సేన్, గురురాజ్, ఆంటోనీరాజ్, అరుణ్‌తో కలిసి పథకం వేశారు. గత నెల 26 అర్ధరాత్రి స్రవంతి బ్యాంకులో ఒంటరిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె స్నేహితులు బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న నగలు, నగదును బ్యాగులో వేసుకుని వెళ్లిపోయారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్‌డిస్కులను తీసుకెళ్లిపోయారు. అయితే స్రవంతి దోపిడీకి ముందే బ్యాంకులో కొంత బంగారాన్ని ఇంట్లోనే దాచేసింది. పోలీసుల విచారణలో దోపిడీలో స్రవంతిని కీలక సూత్రధారిగా నిర్ధారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.3.50 లక్షల నగదు, 1274 గ్రాముల నగలు, 874 గ్రాముల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. అసలు బంగారు ఆభరణాలను తీసుకువెళ్లిన స్రవంతి వాటిని పలు ప్రైవేటు బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు గుర్తించారు. -
Srikalahasti: ఫిన్‌కేర్ బ్యాంక్ దోపిడీ కేసులో కొత్తకోణం
-
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ దోపిడి కేసులో కొత్త కోణం
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ దోపిడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బ్యాంకు మేనేజర్ స్రవంతిని పోలీసులు విచారించగా వెలుగులోకి ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఫిన్ కేర్ బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన కిలోకు పైగా బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి క్యాష్ చేస్తుకుంది మేనేజర్ స్రవంతి. ఈ వ్యవహారమంతా వేరే వ్యక్తుల పేర్లతో నడపింది. ఎవరీ అనుమానం రాకుండా బయట వ్యక్తులతో బేరం కుదర్చుకని ఫిన్‌కేర్ కస్టమర్ల బంగారాన్ని మూత్తూట్లో తాకట్టు పెట్టింది. కానీ బ్యాంక్ ఉన్నతాధికారుల ఫిర్యాదులో నిజాలు వెలుగులోకి మేనేజర్ స్రవంతి నిర్వాకం బయటపడింది. కాగా.. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన మేనజర్ స్రవంతి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బ్యాంక్‌కు కన్నం వేసినట్లు స్రవంతి తెలిపింది. మేనేజర్ నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది.\ చదవండి: ఇంటర్ స్టూడెంట్ పాడుపని.. బాలికను ఇంటికి తీసుకెళ్లి.. -
శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. దోపిడీపై పిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందు నుంచే ఇంటి దొంగల ప్రాతపై అనుమానం కలిగింది. స్రవంతి బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి డబ్బు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆడిట్లో వ్యవహారం బయటపడుతందని దొంగతనం డ్రామా ఆడినట్లు తేల్చారు. ఇందుకు చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్టు కుదుర్చుకొని బ్యాంకు దోపిడికి ప్లాన్ వేసినట్లు తెలిపారు. స్రవంతి ప్లాన్ ప్రకారం దుండగులు బ్యాంక్ లాకర్ నుంచి 67 ప్యాకెట్లలోని దాదాపు రెండు కేజీల బంగారం, 5 క్షల రుపాలయు నగదు ఎత్తుకెళ్లారు. తన చేతులు కట్టేసి అరవకుండా నోటిలో గుడ్డనొక్కి కత్తితో బెదిరించి చోరీ చేశారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే ముందు నుంచే స్రవంతిపై అనుమానపడ్డ పోలీసులు ఆమె నుంచే అసలు నిజాన్ని రాబట్టారు. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్రవంతి బ్యాంక్‌కు కన్నం వేసినట్లు పోలీసులు తెలిపారు. స్రవంతి నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది. సోమవారం స్రవంతితో పాటు చోరీకి పాల్పడ్డ దుండగులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరచనున్నారు. చదవండి: ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి.. -
మిస్టరీగా వందన మృతి.. సందీప్ ఇంట్లో ఏం జరిగింది..?
శ్రీకాళహస్తి: అనుమానాస్పద స్థితిలో యువతి మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ భాస్కర్‌నాయక్ కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలుకు చెందిన వందన (20) తొట్టంబేడు మండలం పొయ్యగ్రామంలో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన పులి సందీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావమరదళ్లు కావడంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వందన బుధవారం ఉద్యోగానికి వెళ్లే ముందు సందీప్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ కాసేపటికి హాల్లో సందీప్ నిద్రిస్తుండగా బాత్రూమ్లో వందన ఉరివేసుకుని మృతి చెందింది. భయాందోళనకు గురైన సందీప్ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్‌నాయక్, ఎస్ఐ మహేష్ మృతదేహాన్ని పరిశీలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎవరికీ చెప్పకుండా యువతి ఎందుకు సందీప్ ఇంటికి వెళ్లింది? వాళింట్లో ఏం జరిగిందో మిస్టరీగా మారింది. దీనిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీఐ భాస్కర్‌నాయక్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం బంధువులకు అప్పగించారు. చదవండి: (ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి) -
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు
-
బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..
బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. తెల్లవారు జామున తమ ఇద్దరి పిల్లలు అస్వస్థతకు గురికావడంతో ఏమైందో తెలియక గందరగోళం ఏర్పడింది. ఆప్తులు ఎవ్వరూ లేకపోయినా చుట్టుపక్కల తెలిసిన వారి సహాయంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏమైందో ఏమోగానీ పిల్లలు ఒకరితర్వాత ఒకరు మృతిచెందడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఊరుగాని ఊర్లో ఏం చేయాలో తెలియక విలపించింది. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం, రాచగున్నేరిలో చూపరులను కంటతడి పెట్టించింది. సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన గురువారం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మర్దన్ జిల్లా, ఆండాళ్ గ్రామానికి చెందిన రమేష్, నీలంకుమారి దంపతులు. రెండేళ్ల కిందట పొట్టచేతబట్టుకుని రాచగున్నేరికి వచ్చారు. వీరికి కుమార్తె హీనాకుమారి(5), కుమారుడు రోషణ్‌కుమార్‌దాస్(2) ఉన్నారు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రయివేటు కర్మాగారంలో రమేష్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తుండగా, భార్య ఇంటివద్దే ఉంటోంది. రమేష్ బుధవారం విధులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. రాత్రి ఆహారం తిని అందరూ నిద్రకు ఉపక్రమించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హీనాకుమారి అస్వస్థతకు గురైంది. చదవండి: (ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం) తల్లిదండ్రులు తన కుమారుడుని పక్క ఇంట్లో వదిలిపెట్టి కుమార్తెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి కుమారుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారడంతో మళ్లీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రోషణ్‌కుమార్‌దాస్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదికలను బట్టి కలుషిత ఆహారమా, మరే ఇతర కారణాలా..? తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం చిన్నారులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే ఏరియా ఆస్పత్రి వైద్యులు మరణధ్రువీకర పత్రాలు అందజేశారు. ఆపై పోలీసులు వత్తిడి చేయడంతో పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. -
శ్రీకాళహస్తిలో దారుణం.. సీసీ కెమెరాలో దృశ్యాలు..
సాక్షి, చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. ఇనుపరాడ్లతో యువకుడిని దుండగులు దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని ఇమ్రాన్ (27)గా పోలీసులు గుర్తించారు. గతంలో అనేకమందితో ఇమ్రాన్ గొడవలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిన ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హతమార్చిందెవరనే దానిపై సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: శునకం నోటిలో పసికందు తల టిఫిన్ హోటల్‌కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు -
శ్రీకాళహస్తిలో నవరత్నాల నిలయం
-
అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్‌కు రెండు కళ్లు
సాక్షి, శ్రీకాళహస్తి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన శ్రీకాళహస్తిలో టిట్కో ఇళ్లు, జగనన్న కాలనీల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలు కొత్త టౌన్లుగా తయారవుతాయన్నారు. జగనన్న కాలనీలో ఇంటికొక పండ్ల మొక్క పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
వైరల్: మేకను మింగిన కొండచిలువ
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయ సమీపంలోని భరద్వాజ తీర్థంలో 13 అడుగుల కొండచిలువ ఆదివారం మేకను మింగేసింది. అది కదలలేని స్థితిలో ఉండగా ఆలయ ఉద్యోగులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కొండచిలువను పట్టుకుని, మింగిన మేక పిల్లను కక్కించి, రామాపురం అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. -
శ్రీకాళహస్తి అన్నప్రసాదానికి ఐఎస్వో సర్టిఫికెట్
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో అన్నప్రసాదం నాణ్యత, శుభ్రతకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ‘ఐఎస్వో’ సర్టిఫికెట్ లభించింది. ‘హెచ్‌వైఎం’ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఐఎస్వో ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు, సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఆలయానికి రెండు వైపులా రూ.34 లక్షల వ్యయంతో లగేజ్ స్కానర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి తరువాతే అనుమతిస్తామన్నారు. రానున్న రోజుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేశంలో అత్యున్నత స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చెప్పారు. చదవండి: మహిళా కూలీకి వజ్రం లభ్యం -
శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ శంఖారావం
-
సర్పంచ్ బరిలో యువ డాక్టర్
సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరి పంచాయతీ సర్పంచ్ పదవికి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసిన డాక్టర్ నర్రా భార్గవి పోటీచేస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి మంచి అవకాశంగా భావించి వైఎస్సార్సీపీ అభిమానిగా సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పంచాయతీ పరిధిలో అనేక చిన్న, పెద్దతరహా పరిశ్రమలున్నాయని, దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు జీవిస్తున్నారని చెప్పారు. వారందరికీ సేవ చేయాలనే తపనతో ఉన్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో గృహశోభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ జరుగుతోందని.. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ మొదలు కొత్త సంవత్సరం, సంక్రాంతి వరకు ఇది కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాల పంపిణీతో పాటు, రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం, మరో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా సోమవారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరులో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలి దశలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లలో చిత్తూరు జిల్లాలో 1,78,840 ఇళ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో 2.50 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఊరందూరు లేఅవుట్లో ఏకంగా 6,232 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ప్లాన్ చాలా చక్కగా ఉంది. ఇక్కడే ఆర్బీకే కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆటో స్టాండ్, వైఎస్సార్ జనతా బజార్, కల్యాణ మండపాలు, వార్డు సచివాలయం, పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు రానున్నాయి’ అని చెప్పారు. ఇక్కడ మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో ప్లాటు విలువ రూ.7 లక్షలు ఉంటుందన్నారు. ఒక అన్నగా, తమ్ముడిగా అక్కచెల్లెమ్మలకు ఈ ఆస్తిని ఇస్తున్నానని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాను ► ‘‘అక్క చెల్లెమ్మలకు అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చాను. 18 నెలలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6,352 కోట్లు వారి చేతిలో పెట్టాం. విద్యా దీవెన పథకం ద్వారా 18.52 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.4 వేల కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద 15.56 లక్షల తల్లులకు రూ.1,221 కోట్లు ఇచ్చాం. ► ఆసరా కింద పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు తొలి ఏడాదిలో 87.74 లక్షల మందికి రూ.6,792 కోట్లు ఇచ్చాం. చేయూతలో వారి చేయి పట్టుకుని నడిపిస్తూ 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు చేతికి అందించాం. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకంలో 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం పథకంలో 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.492 కోట్లు ఇచ్చాం. ఆ కష్టాలు స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో సొంతిల్లు లేని వారి కష్టాలు స్వయంగా చూశాను. 25 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం. కానీ ఇవాళ దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇల్లు కూడా కట్టించి ఇస్తున్నాం. మొత్తంగా 1.24 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. ► ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తాం. తర్వాత ఇల్లు కట్టిస్తాం. ఊళ్లు రాబోతున్నాయి ► 17 వేల రెవెన్యూ గ్రామాల్లో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల లేఅవుట్లు వేసి, గతంలోలా 224 చదరపు అడుగుల్లో కాకుండా, 340 చదరపు అడుగుల్లో ఇళ్లు కట్టిస్తున్నామంటే అవి కాలనీలు కావు.. ఊళ్లు రాబోతున్నాయి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.7 వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల్లో వేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు రూ.25,530 కోట్లు. అంత ఆస్తిని 30.75 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ప్రతి ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్ ట్యాంక్ ఉంటాయి. రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, మరో రెండు ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాం. ఇళ్ల నిర్మాణం.. టిడ్కో ఇళ్లు ► తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యాయి. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది మొదలు పెడతాం. ఇవి కాక 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. ఇందుకు దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఒక్క రూపాయికే ఇల్లు ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా? లేక రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ కోరితే ఒకే ఒక్కరు చంద్రబాబు స్కీమ్ కోరారు. ► 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. మొత్తంగా టిడ్కో ఇళ్లకు ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.4,287 కోట్ల భారం పడుతున్నా చిరునవ్వుతో భరిస్తున్నాం. ఎందరికో ఉపాధి.. ఆర్థిక పురోగతి ► ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు, ఆటో వాళ్లు.. ఇలా 30 రకాల వృత్తుల వారు లక్షలాది మందికి లబ్ధి కలుగుతుంది. ► తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్ వస్తుంది’’ సీఎం జగన్ అన్నారు. ► అనంతరం లబ్ధిదారులు పుష్ప, జ్యోతి, ధనలక్ష్మి, సృజనీ, రజియాలకు సీఎం ఇంటి పట్టాలు అందజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, ఊరందూరు లేఅవుట్లోని మోడల్ హౌస్‌ను సంబంధిత లబ్ధిదారురాలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మదుసూధనరెడ్డి, భూమన, రోజా, చెవిరెడ్డి, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకూడదా? ► అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైతే, డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (కులపరమైన అసమతుల్యం) వస్తుందని చంద్రబాబు మనుషులు కొందరు కొన్ని చోట్ల కోర్టుకు వెళితే, కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 3.74 లక్షల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. ► విశాఖపట్నంలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం తెలుపలేదు. వాటితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వాటిపై స్టే తీసుకొచ్చారు. రాజమండ్రిలో ఆవ భూములు అని చెప్పి స్టే తెచ్చారు. దాని వల్ల 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలంటే అవరోధం ఏర్పడింది. ► నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు దుర్మార్గులు, రాక్షసులు. అవి ఏపీఐఐసీ భూములని, మైనింగ్ భూములంటూ కోర్టుకు పోయారు. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ మేరకు ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. వీళ్లందరికీ దేవుడు మొట్టికాయలు వేస్తాడు. న్యాయం జరుగుతుంది. త్వరలో మిగిలిపోయిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. అన్నా మీరు విన్నారు.. ఆదుకున్నారు అన్నా.. నా పేరు పుష్ప. మా ఆయన తిరుమల్‌రావు కూలీ పని చేస్తాడు. మాకిద్దరు చిన్న పిల్లలు. మాకు సొంతిల్లు లేదు. దీంతో నా బిడ్డ పురిటి సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము. నాకు అన్నదమ్ములు లేరు. ఈ పరిస్థితిలో సొంత అన్నలా ఆదుకుంటూ మీరు నాకు ఇంటి పట్టా ఇస్తున్నారు. మీ వల్ల నాలాగే రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు. మీ పాదయాత్రలో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకుంటూ నవరత్నాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వైఎస్సార్ ఆసరా, చేయూత ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇళ్ల పట్టా ఇవ్వడం గొప్ప కార్యక్రమం. ఏ ప్రభుత్వం ఇలా 30 లక్షల మందికి పైగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించడం లేదు. పైగా మా (మహిళలు) పేరుతోనే ఇస్తున్నారు. – పుష్ప, ఏర్పేడు, చిత్తూరు మాకు అడ్రస్ ఇచ్చారన్నా.. నా పేరు జ్యోతి. మాకు ఇద్దరు పిల్లలు. నాకు ఆరేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. పదేళ్లప్పుడు నాన్న చనిపోయాడు. అలాంటి నాకు ‘నేను ఉన్నాను చెల్లెమ్మా’ అంటూ అమ్మ ప్రేమను, నాన్న అనురాగాన్ని పంచుతూ ఇంటికి యజమానిని చేస్తున్నారు. అన్నా.. మేము చెరువు కట్టపై ఉంటున్నాం. వానకు, ఎండకు ఇబ్బందులు పడుతున్నాం. ఇన్నాళ్లూ ఎవరూ ఏమీ చేయలేదు. నా ఊరు ఇది అని చెప్పుకునేందుకు అడ్రస్ లేని వాళ్లం. అటువంటి సమయంలో మీరు మాకు అడ్రస్ ఇచ్చారు. ఇప్పుడు నా ఊరుపేరు ‘జే సిటీ’. నా ఇంటి నంబర్ 305. (భావోద్వేగానికి లోనవుతూ) నాలాగే ఆ కట్టపై ఉన్న మరో 25 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇళ్లు కట్టిస్తున్నారు. ‘నీకేమి మీ అన్న ఉన్నాడు. ఇంటికి మహరాణిని చేశాడు. మీ అమ్మను ఏమైనా అంటే వాళ్ల అన్నకు చెబుతుంది’ అని మా ఆయన మా బిడ్డతో అంటున్నాడు. మీ వల్లే నాకు ఈ గౌరవం. పండుగ అంటే ఇదే అన్నా. – జ్యోతి, అమ్మపాలెం చెరువు కట్ట అన్ని పథకాల్లో అక్కచెల్లెమ్మలకే ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్చు జమ చేశాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కూడా అక్కచెల్లెమ్మల పేరుతోనే ఇస్తున్నాం. ఆలయ ట్రస్టు బోర్డు పదవులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులు, బీసీ కార్పొరేషన్లలో, రాజకీయ నియామకాల్లో 50 శాతం వారికే చెందాలని చట్టాలు చేశాం. ఇది మీ అందరి ప్రభుత్వం.. మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం.. అని గర్వంగా చెబుతున్నాను. సీఎం వైఎస్ జగన్ -
శ్రీకాళహస్తిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్న బీజేపీ, జనసేన
బీజేపీ, జనసేన పార్టీ కొత్తనాటకానికి తెరతీశాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ అసత్యప్రచారాలకు దిగుతున్నాయి. అంతటితో ఊరుకోక అధికార పార్టీ ఎమ్మెల్యేలనే దోషులుగా చూపేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. దీనికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ వినుత అండ్ కో ఆడుతున్న నాటకం జిల్లాలో చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీ, జనసేన కలిసి నాటకాన్ని రక్తికట్టిస్తున్నాయి. గతంలో టీడీపీ ‘పచ్చ’ అబద్దాలను బూతద్దంలో చూపించేందుకు ప్రయత్నించగా ఇప్పుడు అదే కోవలో ఆ రెండు పార్టీలు చేరిపోయాయి. అసలేం జరిగిందంటే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ నగరం వినుత, జనసైనికుడు మర్రిగుంట శివకుమార్‌పై కేసులున్నాయి. జనసేనలోకి వస్తే ఎలమండ్యం ఎంపీటీసీ సభ్యుడు నువ్వేనని శివకు ఆశపెట్టారు. నాటి నుంచి శివకుమార్ వినుత చెప్పిన కార్యక్రమాలన్నీ చేసేవాడు. ఆమె ఆదేశాల మేరకు లాక్డౌన్ సమయంలోనూ సొంత డబ్బులు పెట్టి కాలనీలో నిత్యావసరాలు పంపిణీ చేశాడు. ఆ తర్వాత ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం, కేసు విషయంలో సాయం చేయకపోవడంతో శివకుమార్ శనివారం వినుత భర్తను కలిశాడు. తనకు ఏమీ చేయలేదని, కనీసం కేసు నుంచైనా తప్పించేందుకు పోలీసులతో మాట్లాడమని ప్రాధేయపడ్డారు. ఆర్థికంగా చితికిపోయానని, ఏదైనా సాయం చేయమని ఆమెను ప్రాధేయపడినట్టు తెలిసింది. ఆ సందర్భంలో వారి మధ్య మాటామాట పెరిగింది. ఈ సందర్భంగా శివను వినూత భర్త కులం పేరుతో దూషించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆపై ఆగ్రహించిన శివకుమార్ వినుత కారు అద్దాలు పగులగొట్టి పోలీసులకు లొంగిపోయాడు. జనసేన నాయకులు శివకుమార్ వైఎస్సార్సీపీ కార్యకర్త అని ప్రచారం చేసుకోవడం గమనార్హం. (కార్యకర్తను కులం పేరుతో దూషించిన జనసేన నేత) ఆ ఇద్దరూ ఒకప్పుడు వైఎస్సార్ సీపీలోనే ప్రస్తుత జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ నగరం వినుత, శివ ఇద్దరూ గతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా ఉన్నారు. వినుత తండ్రి నగరం భాస్కర్ వైఎస్సార్సీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. వినుత తల్లి జయలలిత రేణిగుంట ఎంపీటీసీ సభ్యురాలు. గతంలో టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనలో తల్లిదండ్రులుతో పాటు వినుత, శివకుమార్ పాల్గొనేవారు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ పార్టీ పెట్టడంతో వినుత, శివకుమార్ మరికొందరు జనసేనలో చేరిపోయారు. నాటి ఫొటోలను పెట్టుకుని నగరం వినుత అండ్ కో శివ వైఎస్సార్ సీపీ కార్యకర్తే అని దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. తన గొడవకు వైఎస్సార్సీపీ ఎటువంటి సంబంధం లేదని శివ పదేపదే చెప్పినా.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై జనసేన అండ్ కో అసత్య ఆరోపణలకు దిగారు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ చిల్లర గొడవను బూతద్దంలో చూపించేందుకు జనసేనతో బీజేపీ జత కట్టింది. గతమంతా అబద్ధాలే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో నగరం వినుత వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారని వినుత డ్రామా ఆడారు. అయితే ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కుటుంబ సభ్యులే వినుతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరం వినుత వచ్చి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను తీసుకెళ్లినట్లు పోలీసుల ఎదుట చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు వినుత డ్రామాను బయటపెట్టారు. మర్రిగుంట ఏరియాలో వినుత అద్దెకు తీసుకుని ఉన్న భవనంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఉంచినట్లు గుర్తించారు. పోలీసుల విచారణతో వినుత కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. అలాగే 15 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలను వినుత, ఆమె భర్త రాజకీయ ప్రచారాలకు తిప్పుకునేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక బీజేపీ, జనసేన నాయకులు చెప్పిన అబద్ధాలను నమ్మి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్పయాత్రతో జనం చెంతకు చేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా నేతగా ఎదిగారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. విద్యతోనే ముందడుగు అని విశ్వసించి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా వసతి వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని సమూలంగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌ని చిన్నారులు మావయ్య అంటూ సంబోధిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కొందరు చిన్నారులు ‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’ అంటూ సాగే పాటను ఆలపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట అంటూ ఆయన ఈ పాట ప్రొమోని షేర్ చేశారు. ప్రోమో విడుదలైందని, త్వరలోనే పాట విడుదల చేస్తామని చెప్పారు. (చదవండి: సుపరిపాలన వైఎస్ సంతకం) జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట "బంగారు కొండవయ్య మా జగన్ మావయ్య"@ysjagan #apcmYsJagan #ysjaganindiasbestcm pic.twitter.com/uStVPaBB8u — Biyyapu MadhuSudhan Reddy - MLA (@BiyyapuMadhu) August 31, 2020 -
దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు
సాక్షి, చిత్తూరు : అనుమానం పెను భూతం అయింది. భార్య శిలాన్ని శంకించిన భర్త కిరాత కానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. భార్య దుర్గను భర్త వెంకటేష్ కత్తి తో దాడి చేసి కాళ్ళు,చేతులు నరికేశాడు. అంతంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తికి చెందిన వెంకటేష్ ఆరు నెలల క్రితం నెల్లూరు కు చెందిన దుర్గ ను వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య ప్రవర్తన మీద వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. రాత్రి దుర్గ నిద్రపోతున్న సమయంలో కత్తి తో దాడి చేశాడు. అనంతరం శ్రీకాళహస్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ దుర్గ ప్రస్తుతం నెల్లూరు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. (చదవండి : పరాయి వ్యక్తితో చనువుగా ఉంటోందని..) -
అయ్యోరు రాసిన రక్తచరిత్ర
భావిపౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర వృత్తిలో ఉండి నేరప్రవృత్తిని చాటుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే హత్యా రాజకీయాలకు తెరతీశాడు. పాఠాలు చెప్పాల్సిన వాడు ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడు. ఆధిపత్యం కోసం మానవత్వాన్నే మరిచాడు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతూ చివరకు మనిషిని చంపే స్థాయికి దిగజారాడు. వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటేష్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి పద్మనాభం కిరాతక నైజాన్ని గ్రామస్తులు వివరిస్తున్నారు. – సాక్షి, తిరుపతి ఉపాధ్యాయుడిగా ఉంటూ పద్మనాభం రాజకీయాలపైనే ఆసక్తి చూపేవాడు. 9ఏళ్ల క్రితం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు. వృత్తిని అడ్డుపెట్టుకుని తెరచాటు రాజకీయాలు నడిపేవాడు. ఉడమలపాడు పంచాయతీ శెనగమిట్ట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నా విధులకు తరచుగా డుమ్మాకొట్టేవాడు. అధికారులు ఆకస్మికంగా తనిఖీలకు వస్తే తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు ముందస్తు లీవ్ లెటర్‌ను స్కూల్లోనే ఉంచేవాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపునకు అహర్నిశలు పనిచేశాడు. అనంతరం ఆయన సహకారంతో పలు కాంట్రాక్ట్ పనులను చేజిక్కించుకున్నాడు. 2019 ఎన్నికల్లో సైతం బొజ్జల సుధీర్‌రెడ్డి తరపున పనిచేశాడు. సుధీర్ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం కావడంతో బీజేపీని ఆశ్రయించాడు. తన బంధువులు, అనుచరులకు స్థానిక బీజేపీ నేత కోలా ఆనంద్ సమక్షంలో కాషాయ కండువా కప్పించాడు. ఎన్నికల తర్వాత బీజేపీ కండువా కప్పుకుంటున్న పద్మనాభం మేనల్లుడు (ఫైల్) ఆధిపత్యం కోసమే.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వెంకటేష్ ఉడమలపాడు పంచాయతీ పరిధిలో ఎదుగుతుండడాన్ని పద్మనాభం ఓర్వలేకపోయాడు. తన మేనల్లుడు, బంధువులు, అనుచరులతో కలిసి వెంకటేష్‌తో తరచూ గొడవలకు దిగేవాడు. దీనిపై వెంకటేష్, స్థానికులు కూడా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పద్మనాభం ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని స్థానికులు మానవత్వంతో ఆలోచించి కేసు నుంచి అతడ్ని తప్పించేవారు. ఇదే అలుసుగా తీసుకుని పద్మనాభం తన బంధువులు, అనుచరుల సహకారంతో రాజకీయ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయేవాడు. చదవండి: టార్గెట్ వైఎస్సార్సీపీ! పంచాయతీ పరిధిలో తన ఆధిపత్యమే కొనసాగాలనే ఉద్దేశంతో వెంకటేష్‌ను అడ్డు తప్పించేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా గ్రామంలో గొడవలు సృష్టించి పోలీసుల సహకారంతో వెంకటేష్‌ని ఊరు నుంచి వెళ్లగొట్టించాడు. భార్య, పిల్లల కోసం వచ్చి వెళుతున్న విషయం తెలుసుకుని నిఘా పెట్టాడు. సోమవారం దారి కాచి వెంకటేష్‌ను దారుణంగా హత్య చేసి, పద్మనాభం తన అనుచరులతో కలిసి పరారైనట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. తప్పించుకోలేరు దొమ్మరపాలెంకు చెందిన వెంకటేష్ హత్యలో పాల్గొన్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాం. పద్మనాభం, ఆయన అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు పట్టణానికి ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లాలోనూ గాలిస్తున్నాం. త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం. – నాగేంద్రుడు, డీఎస్పీ, శ్రీకాళహస్తి -
టార్గెట్ వైఎస్సార్సీపీ!
పాత కక్షలు పురివిప్పాయి.. వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. హత్యా రాజకీయాలు ఓ కుటుంబాన్ని వీధిన పడేశాయి. ఎన్నికల్లో ఓటమిని ఓర్వలేని టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. నిండు ప్రాణాలను సైతం హరించేందుకు తెగబడుతున్నాయి. ప్రశాంతమైన పల్లెల్లో అరాచకం సృష్టించేందుకు దిగజారుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా ప్రణాళికతో ప్రత్యర్థుల ఉసురు తీసేస్తున్నాయి. – సాక్షి, తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీ, బీజేపీ స్థానిక నేతలు ఏకమై రెచ్చిపోతున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో పగ, ప్రతీకారాలను పెంచి పోషిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అనుచరులను టార్గెట్ చేశారు. స్థానిక ఎన్నికల సమయంలో తొట్టంబేడు మండలం ఈదులగుంటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బత్తెయ్యను హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి రూరల్ మండలానికి చెందిన బొజ్జల వర్గీయుడు రాంబాబు, ఆయన అనుచరులు పలుమార్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వలంటీర్లపై దాడులు చేశారు. ఆస్పత్రి వద్ద రోదిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులు, మృతుడు సాలాపక్షి వెంకటేష్ (ఫైల్) స్థానిక ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రెవెన్యూ కార్యాలయం వద్ద బైఠాయించి నానా యాగీ చేశారు. బస్సు అద్దాలను పగలగొట్టి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. బొజ్జల సుధీర్‌రెడ్డి ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుండడంతో టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులనే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. తాజాగా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఉడమల పంచాయతీ దొమ్మరపాళానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటేష్‌ను అతి కిరాతంగా చంపేశారు. ఇందులో టీడీపీ, బీజేపీ కార్యకర్తల ప్రమే యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చదవండి: ‘నిమ్మగడ్డ’ నియామకంపై మరో పిటిషన్ 3నెలల క్రితమే ప్లాన్..? సాలాపక్షి వెంకటేష్ వైఎస్సార్సీపీలో చురుకైన కార్యకర్త. చుట్టుపక్కల ఎస్సీ కాలనీల్లో మంచి గుర్తింపు ఉంది. వెంకటేష్ ఎదుగుదలను స్థానిక టీడీపీ నేత సాలాపక్షి పద్మనాభం ఓర్వలేకపోయాడు. పలు మార్లు తన అనుచరులైన శ్రావణ్‌కుమార్, సుకుమార్, అంకయ్య, రమేష్, హరితో కలసి వెంకటేష్‌తో ఘర్షణకు దిగాడు. మూడు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిన సమయంలో ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకున్నాడు. టీడీపీ, బీజేపీ నేతలతో కుమ్మక్కై వెంకటేష్‌ను బెదిరించాడు. ఊరు వదలి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. లేకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించాడు. దీంతో వెంకటేష్ గ్రామం విడిచివెళ్లిపోయాడు. భార్య, పిల్లలను చూసుకునేందుకు అప్పుడప్పుడు ఊరి పొలిమేరకు వచ్చి వారిని పిలిపించుకుని మాట్లాడి వెళ్లేవాడు. ఈ క్రమంలో వెంకటేష్ కదలికలపై పద్మనాభం, అతడి అనుచరులు నిఘా పెట్టారు. సోమవారం ఉదయం వెంకటేష్ వస్తున్నట్లు తెలుసుకుని దారి కాచారు. ఊరి పొలిమేరలో అడ్డుకుని కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఈ హత్య వెనుక ఓ పోలీస్ అధికారి పాత్ర సైతం ఉన్నట్లు మృతుడి బంధువులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. చదవండి: యువతి కోసం గ్యాంగ్ వార్ -
లాక్డౌన్: ల్యాంకో ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
తిరుపతి : లాక్డౌన్ కారణంగా కనీస వసతులు లేకపోవడంతో శ్రీకాళహస్తి సమీపంలోని లాంక్యో ఫ్యాక్టరీ కార్మికులు ధర్నాకు దిగారు. దాదాపు రెండు వేల మంది వలస కార్మికులు శనివారం సాయంత్రం ఫ్యాక్టరీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమను స్వంత రాష్టాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేదని వలస కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి బొజ్జల అనుచరులు తమను వేధిస్తున్నారని, వారే యూనియన్ నాయకులుగా వుంటూ అరాచకం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించని తమను స్వరాష్ట్రం పంపిచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లాక్డౌన్లో కనీస సదుపాయాలు కూడా యాజమాన్యం ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. (డీ విటమిన్ ఉంటే ఢోకాలేదు!) -
కరోనా నుంచి కోలుకొని ఇంటికి.. ఊహించని షాక్
సాక్షి, శ్రీకాళహస్తి: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాననే ఆనందం కాసేపైనా ఆమెకు లేకుండా పోయింది. కనీస దయ, జాలి, కరుణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు తను అద్దెకుంటున్న బిల్డింగ్ యజమాని. ఈ అమానవీయ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వరిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే చికిత్స అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి కోటి ఆశలతో తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది. కానీ ఆ మహిళను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. అమె అద్దెకుంటున్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఈ ఊహించని పరిణామం ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోక నడిరోడ్డుపై సదరు మహిళ నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ సహోద్యోగి పరిస్థితి తెలుసుకున్న శ్రీకాళహస్తి తహశీల్దారు ఆమెకు వేరొకచోట బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు మహిళా ఉద్యోగికి అండగా నిల్చోగా ఇంటి యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కలతచెంది.. కాలినడకన బయలుదేరి.. డాక్టర్ దంపతులపై పూల వర్షం -
కరోనా: శ్రీకాళహస్తిలో ఇలా వ్యాపించింది!
సాక్షి, తిరుపతి: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 74 నమోదైతే అందులో 43 శ్రీకాళహస్తిలోనే బయటపడ్డాయి. పట్టణంలో కరోనా కేసులు అధికంగా వెలుగు చూడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై నెపం నెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా యత్నించాయి. అసలు విషయం తెలుసుకునేందుకు అధికారులు, నిపుణులు, మీడియా ప్రతినిధులు రెండు రోజులపాటు శ్రీకాళహస్తిలో వైరస్ వ్యాప్తికి కారణాలను అన్వేషించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలో తొలి కేసు లండన్ నుంచి వచ్చిన యువకుడికి బయటపడింది. ఆ తర్వాత అన్నీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన వారివే అని అధికారులు వెల్లడిస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి మర్కజ్‌కు 19 మంది వెళ్లొచ్చారు. (49 రోజుల తర్వాత లాక్డౌన్ సంపూర్ణంగా ఎత్తివేత) తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు బయటపడే వరకు వీరందరూ యథావిధిగా తమ కార్యకలాపాలు సాగించారు. బంధువులు, మిత్రుల ఇళ్లకు రాకపోకలు సాగించారు. కొంతమంది నిత్యావసర సరుకులు, మందులు, కూరగాయల కోసం యథేచ్ఛగా సంచరించారు. ముఖ్యంగా పట్టణంలో ముస్లింలు నివసించే ప్రాంతాలు చాలావరకు ఇరుకు సందుల్లో ఉన్నాయి. దీంతో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఇంతటి నష్టం జరిగిపోయిందని ఓ ముస్లిం మతపెద్ద తెలియజేశారు. పాజిటివ్ కేసులు బయటపడిన తర్వాత కూడా కొంతమంది క్వారంటైన్ సెంటర్లకు వెళ్లలేదు. ఇది కూడా వైరస్ వ్యాప్తికి ఒక కారణంగా చెబుతున్నారు. పాజిటివ్ కేసుల బంధువుల్లో కొందరు అధికారులు ఉన్నారు. వీరు తమ సహచర సిబ్బందితో కలిసి తిరిగారని, అందుకే పలువురు ఉద్యోగులకు సైతం వైరస్ సోకినట్లు సమాచారం. శ్రీకాళహస్తిలో ఒకరికి పాజిటివ్ చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ నారాయణ భరత్ గుప్త మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 7 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అందులో 74 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. 74 మందిలో 16 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 58 యాక్టివ్ కేసులున్నట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెంటనే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిరోజూ 800 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 400 పైగా పరిశ్రమలుండగా, గ్రీన్జోన్లో ఉన్న వాటికి మాత్రం 30 శాతం కారి్మకులతో పనులు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. క్వారంటైన్ సెంటర్ల నుంచి 174 మంది డిశ్చార్జి చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని 15 క్వారంటైన్ సెంటర్ల నుంచి మంగళవారం 174 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. ఏర్పేడు మండలంలో 69 మంది, తిరుపతిలో 54, కుప్పంలో 51 మొత్తం 174 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న ఈ 174 మందికి నెగిటివ్ రావడం, నిరీ్ణత గడువు ముగియడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. ఇంకా 518 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. అలాగే 26 షెల్టర్లల్లో 1,949 మంది నిరాశ్రయులకు వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. -
శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు లాక్డౌన్
శ్రీకాళహస్తి: పట్టణంలో సోమవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చేరుకున్న కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ నివారణ కోసం మరింత కఠినంగా మరో 28 రోజులు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీకాళహస్తి వద్ద ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలోని 15 మందికి ఆదివారం రక్తపరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు సోమవారం ధ్రువీకరించారు. వారు ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి భార్య, కుమార్తె. అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి గత వారం పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయనతో పాటు మరో ఇద్దరు పిల్లల నుంచి కూడా సోమవారం రక్త నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపించారు. ఆ ఫలితాలు మంగళవారం అందుతాయని అధికారులు తెలిపారు. దీంతో వారిని చిత్తూరు ఐసోలేషన్‌కు తరలించారు. వారి బంధువులు, ఎవరెవరిని కలిశారనేది వివరాలు సేకరించి క్వారంటైన్‌కు పంపుతామని తహసీల్దార్ జరీనా తెలిపారు. లాక్డౌన్ కొనసాగింపు కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త సోమవారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు కఠినంగా లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. కరోనా బాధితుల కుటుంబీకులను చిత్తూరు ఐసోలేషన్ సెంటర్‌కు తరలించామన్నారు. మిగిలిన వారికి కూడా రక్తపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా బారి నుంచి కోలుకున్న వ్యక్తికి రోజూ వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అనిల్‌బాబు, తహసీల్దార్ జరీనా, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
సాక్షి, చిత్తూరు: పొలానికి వెళ్లిన ఇద్దరు కూలీలు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఎల్లంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ఇద్దరు రైతు కూలీలు కృష్ణయ్య, చెంచమ్మ పొలం పనులు చేయడానికి సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అయితే ఆ పొలానికి ఉన్న విద్యుత్ కంచె తగలడంతో విద్యుదాఘాతానికి గురైన కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో బాలుడు గౌతమ్ కూడా అక్కడే ఉండటంతో అతను కూడా మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..
-
టీడీపీకి గుడ్‌బై చెప్పిన మరో కీలకనేత
సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. రేపు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరతానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తల సూచల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వల్ల గత ఐదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యానన్నారు. శ్రీకాళహస్తితో పాటు గూడూరులలో టీడీపీని చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
శ్రీకాళహస్తిలో ఒక్క రూపాయికే భోజనం పథకం
-
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
శ్రీకాళహస్తి: మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన మునికుమార్(44)కు నెల్లూరుకి చెందిన మాధవి(39)కి 16ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. మునికుమార్ తిరుపతిలోని మ్యూజిక్ కళాశాలలో నాదస్వరం కాంట్రాక్ట్ లెక్చరర్‌గా చేస్తున్నారు. అయితే కొంతకాలంగా వీరి కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. దీంతో మాధవి తనను వేధిస్తున్నారని భర్తపై శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు గతంలో పోలీసులు వారికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినా వివాదాలు తగ్గుముఖం పట్టకపోగా.. కొత్తగా ఆర్థిక సమస్యలు కూడా తోడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంతోనే వారు సోమవారం ఉదయం పట్టణంలోని కర్నాలవీధిలోని తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పాడ్డారు. కుమార్తెలతోపాటు కొందరు బంధువులు ఇంటిలో ఉండగా.. వారిద్దరు ఓ గదిలోకి వెళ్లారు. ఎంత సమయానికి రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు కిటికీల్లో నుంచి చూడగా ఉరేసుకుని కనిపించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మునికుమార్ దంపతులు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. గతంలో వీరికి పోలీస్ స్టేషన్లోనే కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కలచివేసిన కుమార్తెల రోదన.. మునికుమార్, మాధవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె శ్రావణి పదోతరగతి, చిన్నకుమార్తె సాయిలక్ష్మి 8వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారిద్దరూ అనాథలయ్యారు. వారి రోదన స్థానికులను కలచివేసింది. -
మనస్పర్దలతో దంపతుల బలవన్మరణం
సాక్షి, చిత్తూరు/శ్రీకాళహస్తి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మనస్పర్ధల కారణగాంగా భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి ఇద్దరి ఆడపిల్లలు అనాధలుగా మిగిలారు. వివరాలు.. మునికుమార్ (40), మాధవి (36) దంపతులు శ్రీకాళహస్తి పట్టణంలోని కర్ణల వీధిలో నివాసముంటున్నారు. వీరికి మునిశ్రావణి (15), మునిసాయి (12) సంతానం. మునికుమార్ తిరుమలలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గతరాత్రి కూడా దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందనీ.. ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్త వివరాలు తెలియాల్సి ఉంది. -
జన్మభూమిలో టీడీపీ నేతల చిందులు
-
జన్మభూమిలో ‘గున్నా మామిడి’
సాక్షి, శ్రీకాళహస్తి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధికార పార్టీ నేతల చిందులకు వేదికగా మారింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు ‘గున్నా మామిడి’ పాటకు జోరుగా డాన్స్ వేశారు. ఈలలు వేస్తూ, ఒళ్లు మరిచిపోయి నృత్యాలు చేశారు. టీడీపీ నాయకుల నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా డాన్సులు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చబాబుల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల జోక్యం తొలినాళ్ల నుంచి తెలిసిందే. దీంతో ప్రజల పాలిట కామధేనువు కావాల్సిన జన్మభూమి అపహస్యం పాలవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమం జనవరి 2-11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కాగా, ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పలు చోట్ల గ్రామ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
ఏమిటీ ప్రకటనలు..?
► తండ్రా ... తనయుడా ? ► శ్రీకాళహస్తిలో మా నాయకుడెవరో ! ► టీడీపీ నాయకుల్లో అయోమయం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేస్తారా....లేదా ఆయన తనయుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి బరిలో ఉంటా రా...అనే అంశంపై పార్టీలో తీవ్రమైన చర్చసాగుతోంది. రెండు రోజుల క్రితం బొజ్జల తనయుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి పట్టణంలోని పంచాయతీ అతిథి భవనంలో విలేకరుల ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని...ఆ మేరకు మంత్రి నారా లోకేష్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీలో ఉంటారని...ఆయన నామినేషన్ వేసి ఇంట్లో ఉన్నా.... కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడులాగే గోపాలకృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నేతలకు సూచించారు. దాంతో పార్టీ నేతలు ఇంతకీ తమ నాయకుడు తండ్రా ... ? తనయుడా ? అనే డోలాయమానంలో పడ్డారు. తండ్రీకొడుకులు చర్చించుకుని ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుంటే ఇబ్బందిపడాల్సి వస్తుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. -
ఆదిశేషుడు అర్చించిన ఆలయం తిరుప్పాంపురం
జాతకంలో కాలసర్ప దోషం, కళత్ర దోషాలు ఉంటే ఆ దోషాలను తొలగించుకునేందుకు శ్రీకాళహస్తి వెళ్లి పూజలు చేయించుకుంటారు తెలుగునాట. మరి తమిళ తంబీలకు..? వాళ్లకు కూడా ఇలాంటి క్షేత్రం ఒకటి ఉంది. అదే తిరుప్పాంపురం. రాహుకేతువులు ఏకశరీరంగా ఉన్న మహా మహిమాన్వితమైన సర్పక్షేత్రమిది. ఈ క్షేత్రాన్ని తమిళులే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా దర్శించుకుని సర్పదోషనివారణ పూజలు చేయించుకుని ఉపశమనం పొందుతుంటారు. తిరుక్కాళాత్తి, కుడండై, తిరునాగేశ్వరం, నాగూర్, కీయ్ పెరుపల్లం తదితర అయిదు పుణ్యక్షేత్రాల మేలు కలయికే తిరుప్పాంపురం.ఈ ఆలయంలో ఉన్న దైవం శేషపురీశ్వరుడు. అమ్మవారు వండుచేర కుయిలి. ఇక్కడ ఉన్న పుణ్యతీర్థం ఆదిశేష తీర్థం.స్థలపురాణం: ఒకసారి కైలాసంలో శివుడిని వినాయకుడు పూజిస్తున్నాడు. అప్పుడు శివుడి మెడలోని పాములు తమనూ కలుపుకుని పూజిస్తున్నట్లు గర్వపడ్డాయి. అది గ్రహించిన శివుడు ఆగ్రహించి, ఇక మీదట నాగుపాములన్నీ తమ దివ్యశక్తులను కోల్పోయి సామాన్య సర్పాలవలె మానవుల చేత చిక్కి నానాహింసల పాలూ అయి మరణిస్తాయని శపించాడు. దీంతో శివుడి మెడలోని వాసుకితోపాటు ఆదిశేషువు, కర్కాటకుడు, తక్షకుడు... తదితర సర్పాలు తమ శక్తిని కోల్పోయాయి. అవి తమ తప్పు తెలుసుకుని శాపవిమోచనం కల్పించ వలసిందిగా పరమేశ్వరుని ప్రాధేయపడ్డాయి. బోళాశంకరుడి మనసు కరిగిపోయింది. మహాశివరాత్రిరోజున తిరుప్పాంపురం వెళ్లి అక్కడ కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాపవిమోచనం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వాసుకి, ఆదిశేషుడు తదితర అన్ని నాగులూ కలసి మహాశివరాత్రిరోజు తిరునాగేశ్వరంలోని నాగనాథ స్వామిని, తిరుప్పాంపురంలోని పాంబునాథుడిని, నాగూరులోని నాగనాథుని ఆరాధించాయి. తిరుప్పాంపురం క్షేత్రంలో ఆరాధించిన వెంటనే నాగుల శాపం తొలగిపోయింది. ఇక్కడ ఈశ్వరుడిని ఆరాధించేందుకు వచ్చిన సర్పాలు ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చే సుకున్నాయి. అదే ఆదిశేష తీర్థం. బ్రహ్మ, ఇంద్రుడు, అగస్త్యుడు, గంగాదేవి వంటి వారు ఇక్కడి ఆలయాన్ని సందర్శించి ధన్యులైనట్లు పురాణగాథలున్నాయి. ఇక్కడ ఉన్న మూడవ కుళోత్తుంగ చోళుడి శిలాఫలకాన్ని బట్టి చూస్తే ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. తంజావూరును పాలించిన శరభోజీ చక్రవర్తి ఈ ఆలయానికి వసంతమండపాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురానికి ఎదురుగా ఉన్న వినాయక విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి శేషపురీశ్వరుడు, పాంబుపుర నాథుడు, పాంబుపురీశ్వరుడు తదితర నామాలున్నాయి. గర్భగుడిలో శివుని పూజించే రీతిలో ఉన్న ఆదిశేషుని విగ్రహం కనువిందు చేస్తుంది. వెలుపలి ప్రాకారానికి ప్రదక్షిణ మార్గంలో భైరవుడు, సూర్యుడు, దుర్గ, శనీశ్వరుడు, రాహువు, కేతువు తదితర సన్నిధులున్నాయి. ఇక్కడ ఉన్న రావిచెట్టుకింద అసంఖ్యాకంగా సర్పశిలలున్నాయి. ఆలయంలో ఈశాన్య దిక్కుమూలలో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు. ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే సర్పదోష పరిహార పూజలకు ఈ ఆలయం పెట్టింది పేరు. రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతిదీపాలు కొని వెలిగిస్తారు. రాహు, కేతు దోషాల పరిహారపూజలకు తగిన సంబారాలు ఇక్కడే లభిస్తాయి. భక్తులు ముందుగా చెప్పడం మంచిది. చెప్పకుండా నేరుగా వచ్చినవారు తెల్లవారు జామున వస్తే మేలు. సర్పదోష నివృత్తికోసం చేయించుకునే పూజకు సుమారు 5,500 వరకు వసూలు చేస్తారు. జాతకంలో సర్పదోషం ఉన్నవారు, ఏ పని తలపెట్టినా ముందుకు సాగనివారు, విద్యా, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నవారు రాహుకేతువులకు మొక్కుకుని, తిరుప్పాంపురంలో పూజలు చేయించుకునే వారు అధిక సంఖ్యాకంగా కనిపిస్తుంటారు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ముక్కంటి సేవలో కోరుముట్ల
శ్రీకాళహస్తి: శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రానికి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో సోమవారం విచ్చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం సమీపంలో పార్టీ స్థానిక సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సారథ్యంలో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ప్రత్యేక టిక్కెట్ ద్వారా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వారికి ఆలయాధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. వారితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ప్రాణాలైనా ఇస్తాం.. స్థలాలు ఇవ్వలేం
► తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం ► శివనామస్మరణ వింటూ ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నాం ► ఇప్పుడు భూములు ఇవ్వమంటే ఎలా? ► జేసీని నిలదీసిన స్థానికులు ►మంచి పరిహారం ఇస్తామని భరోసా ‘ప్రాణత్యాగానికైనా సిద్ధం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్థలాలు ఇవ్వలేం’ అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న 173 కుటుంబాల ప్రజలు తెగేసి చెప్పారు. ‘తాతముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం.. శివనామస్మరణ వింటూ ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నాం.. ఇప్పుడు మా ఇళ్లు ఖాళీ చేసి.. స్థలాలు లాక్కుంటే ఎలా బతికేది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదిరించి..బెదిరించి స్థలాలు లాక్కోవాలని చూస్తే ఇక్కడే చావనైనా చస్తామని శుక్రవారం సబ్‌కలెక్టర్ ఎదుట తమ ఆవేదన వెళ్లగక్కారు. శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో విస్తరణ పనులు చేపట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో బృహత్తర ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ గిరీషా హాజరయ్యారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య పలువురు బాధితులు మాట్లాడుతూ తాతల.. ముత్తాతల కాలం నుంచే ఇదే ప్రాంతంలో నివాసముంటున్నామని, ఇప్పుడు స్థలాలు దేవస్థానానికి ఇవ్వాలని డిమాం డ్ చేయడం సరికాదని చెప్పారు. ‘ఇంట్లోనే ఉంటాం.. ఇల్లు కూల్చివేసి... స్థలాలు లాక్కోండి’ అంటూ కొందరు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎక్కడో స్థలాలు ఇస్తే ఎలా బతకా లి..? అంటూ మరికొందరు సమాధానం ఇచ్చారు. మా జీవితం ఇదే ప్రాంతంలో గడిపేయాలంటూ ఇంకొందరు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. మంచి పరిహారం ఇస్తాం జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ దేవస్థానాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుం దని, తద్వారా మంచి జరుగుతుందని చెప్పారు. మంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భూములు అవసరమైతే తీసుకునే హక్కు ఉందని, మొత్తం 173 మందిలో కొందరు ఆలయ అభివృద్ధికి స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ముందుగా వారి స్థలాలు సేకరిస్తామని జాయింట్ కలెక్టర్ వివరించారు. కానీ దీనికి బాధితుల నుంచి సంతృప్తికర సమాధానం లభించలేదు. వారికి ఇంతవరకు పరిహారం అందలేదు.. గాలిగోపురం 2010లో కుప్పకూలితే నష్టపోయినవారికి, కొత్త గాలిగోపురం నిర్మాణానికి స్థలాలు ఇచ్చినవారికి ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి కొందరు తమ స్థలాలకు అంకణానికి రూ.15లక్షల చొప్పున ఇప్పించాలని, ఇంటికి ఓ షాపు, ఓ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వడం కుదరదని, షాపులు అయితే కొందరికి ఇస్తామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఓ పద్ధతి ప్రకారం స్థలం విలువకట్టి పరిహారం చెల్లిస్తుందన్నారు. దీనిపై మరో రెండు, మూడు సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్ కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ ఈఈ వెంకటనారాయణ, తహసీల్దార్ రమేష్‌బాబు, డీఎస్పీ వెంకటకిషోర్, సీఐ చిన్నగోవింద్, ఎస్ఐ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే’
తిరుపతి: మంత్రివర్గం నుంచి తొలగించడంతో అలకబూనిన మాజీ మంత్రి,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణారెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. బొజ్జల ఈరోజు ఉదయం కాళహస్తిలో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారితో చర్చల అనంతరం టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటన చేశారు. ప్రాణం ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. అలాగే పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేతలు వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాగా మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జలతో పాటు ఆయన అనుచర వర్గమంతా రగిలిపోయిన విషయం తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. -
దిగిరాని బొజ్జల
►ఫలించని బుజ్జగింపులు ►తగ్గేదిలేదంటున్న మాజీ అమాత్యులు ►దేవస్థానం చైర్మన్ చర్చలు..... ►శ్రీకాళహస్తి వచ్చాక తుది నిర్ణయం శ్రీకాళహస్తి: మాజీ మంత్రి,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణారెడ్డి వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. వెనక్కి తగ్గేది లేదని రాయబారాలకు వచ్చిన వారికి సమాధానమిస్తున్నట్లు తెలిసింది. సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు,ఎంపీ సీఎం రమేష్ బుజ్జగింపులు ఫలించలేదు. మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడంపై మాజీ మంత్రితో పాటు ఆయన అనుచర వర్గమంతా రగిలిపోతోంది. ఇది తమకు తీరని అవమానమని భావిస్తోంది. మంత్రి వర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాలపాటు టీడీపీకి ఎంతో కృషిచేసినా తమను అగౌరవపరిచేలా మంత్రి పదవి నుంచి తొలగించారని, అందుకే ఆయన కలత చెందారని బొజ్జల సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం దారుణమని అనుచరులవద్ద వాపోతున్నారని శ్రీకాళహస్తిలో ప్రచారం సాగుతుంది. కీలక సమయాలలో వెన్నుదన్నుగా నిలిచిన తననిలా అవమానించి పంపడం సబబా అని ఆయన అధిష్టాన పెద్దలను ప్రశ్నిస్తున్నట్లు భోగట్టా. రాజీనామా విషయంలో ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని అనుచరులతో తేల్చిచెప్పినట్లు చర్చసాగుతుంది. మరో రెండు రోజుల్లో బొజ్జల శ్రీకాళహస్తికి రానున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చలు జరిపి తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మరోవైపు మంగళవారం శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, తొట్టంబేడు మండలం పార్టీ అధ్యక్షుడు గాలి మురళీనాయుడుతోపాటు ముఖ్యనేతలు ప్రభాకర్‌నాయుడు, భాస్కర్‌నాయుడు, చంద్రారెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, చిరంజీవుల నాయుడు హైదరాబాద్ వెళ్లారు. పార్టీ అంశాలపై బొజ్జలతో వారు చర్చించినట్లు తెలుస్తుంది. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్న విషయాలు చర్చించినట్లు సమాచారం. -
అశ్వంపై అర్ధనారీశ్వరుడు
శ్రీకాళహస్తి: కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి మంగళవారం రాత్రి అశ్వవాహనంపై పట్టణంలో విహారించారు. నూతన వధువైన జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై భకు్తలకు దర్శనమిచ్చారు. కైలాసగిరి ప్రదక్షిణ సందర్భం గా ఉదయం వెళ్లిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూరు్తలు తిరిగి సాయంత్రానికి పట్టణ పొలి మేర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భకు్తలు పెద్ద ఎతు్తన ఎదురెళ్లి వారికి స్వాగతం పలి కారు. అనంతరం స్వామివారు అశ్వవాహనం పై అధిరోహించారు. ఇక అమ్మవారు సింహవాహనంపై ఆశీనులయా్యరు. శివనామస్మరణలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతుల్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, సభ్యులు, శాఫ్ చైర్మన్ పీఆర్ మోహన్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
20 నిమిషాల్లోనే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటుచేస్తోంది. రూ.500 టికెట్టుతో కేవలం 20 నిమిషాల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందాలంటే ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరోజు ముందు కొనుగోలు చేసే భక్తులకు రూ.250 రాయితీ ప్రకటించారు. సాధారణ భక్తులకు తిరుమల తరహాలో మహాలఘు దర్శనం అమలు చేస్తామన్నారు. మహాశివరాత్రికి ఆలయాన్ని తోరణాలు, విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
యాగశాలలో అగ్నిప్రమాదం
శ్రీకాళహస్తి(చిత్తూరు): చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రధాన ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ గాలిగోపురం ప్రతిష్టాపన సందర్భంగా జనవరి 19 నుంచి 29వ తేదీ వరకు యాగం నిర్వహించారు. అయితే, ప్రధాన యాగశాల అలాగే ఉంది. ఇందులో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే యాగశాలతోపాటు అందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు కాలిపోయాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే, యాగానికి తమను పిలువలేదనే అక్కసుతో కొందరు నిప్పు పెట్టి ఉంటారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ నేతల చేరిక
శ్రీకాళహస్తి రూరల్ : మండలంలోని వేడాం గ్రామానికి చెందిన 37 మంది టీడీపీ నాయకులు మంగళవారం వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఒక మంచి పని చేయలేకపోయామని, అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని వైఎస్సార్సీపీలో చేరామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో పెల్లూరు జానకయ్య, వేణుగోపాల్‌రెడ్డి, శంకరయ్య, దేవేంద్రరెడ్డి, మల్లికార్జునరెడ్డి, కామినేటి సుధాకర్, రమణయ్య, బాలసుబ్రమణ్యం, శివ, సురేష్, గోపి ఉన్నారు. -
నేటి నుంచి మహాకుంభాభిషేకం
కంచి పీఠాధీశుల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహణ శ్రీకాళహస్తి: ముక్కంటిక్షేత్రం మహాకుంభాభిషేకం మహోత్సవాలకు ముస్తాబైంది. 17ఏళ్ల తర్వాత రాహుకేతు క్షేత్రంలో కుంభాభిషేకం శోభ నెలకొంది. గురువా రం నుంచి 8వతేదీ వరకు అంగరంగ వైభవంగా కంచి పీఠాధీశులు శ్రీజయేంద్ర సరస్వతి, శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. 12వ శతాబ్దానికి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఐదోసారి మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారు. నాలుగో కుంభాభిషేకాన్ని 2000లో కంచి పీఠాధీశుల పర్యవేక్షణలో వేడుకగా నిర్వహించారు. మరోసారి ఆయన సారథ్యంలోనే ఈసారి కూడా సంప్రదాయపద్ధతులను అనుసరిస్తున్నారు. ఆ యన శిష్య బృందం ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతున్నారు. 2వతేదీన గాలిగోపురం కుంభాభిషేకం, గణపతి హో మం, వాస్తుశాంతి, 3వతేదీ గోపూజ, ధనపూజ, మత్స్యగ్రహణం, 4వతేదీ యాగప్రవేశం కుంభస్థాపన, నైవేద్యాలు, దీపారాధన, 5వ తేదీన పరివార దేవతల గోపురాలకు కంచుగడప గోపురానికి స్వర్ణ కలశ స్థాపన, 6వతేదీన యాత్రదానం, యాగపూజ, కుంభోద్వాసన, 7వ తేదీన స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి వార్ల విమాన గోపురాలకు స్వర్ణ కలశస్థాపన, 8న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి కుంబాభిషేకంతో మహాకుంభాభిషేకం మహాత్సోవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో 4 నుంచి 8వ తేదీ వరకు స్వామి,అమ్మవార్ల మూలవిరాట్ దర్శనాలు రద్దు చేశారు. అలంకార మండపంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మాత్రమే భక్తులు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. -
అదిగో... దక్షిణ కైలాసం
పుణ్యతీర్థం :: శ్రీకాళహస్తి దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ నుంచి 8వ తేదీ వరకు వైభవంగా శ్రీకాళహస్తీశ్వరాలయ మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దక్షణ æకైలాసంగా పేరొంది కోట్లాదిమంది భక్తులను పునీతులను చేసే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్రీ.శ.12వ శతాబ్దంలో చోళుల కాలంలో రాజేంద్రచోళుడిచే పవిత్ర స్వర్ణముఖీ నదీతీరాన నిర్మించబడిన ఈ ఆలయం విజయనగర పాలకుల కాలంలో ప్రాచుర్యం పొంది ప్రఖ్యాత శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఈ వాయులింగేశ్వరునికి ప్రతి పుష్కరానికి ఒకసారి మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. శ్రీ–కాళ–హస్తి పేరొచ్చిందిలా... శ్రీకాళహస్తీశ్వరుణ్ణి నిష్టతో పూజించిన మూడు మూగజీవాల సమ్మేళనంతో శ్రీ–కాళ–హస్తి పేరు వచ్చిందని ప్రచారంలో ఉన్న కథలను బట్టి తెలుస్తోంది. శ్రీ(సాలీడు): పూర్వం ఊర్థ్వనాధుడనే దివ్యలోక శిల్పి ఏదో తప్పిదం చేయగా అతనిని భూలోకంలో సాలీడుగా జన్మించమని బ్రహ్మ శాపమిచ్చాడు. దాంతో ఊర్థ్వనాధుడు సాలీడుగా జన్మించి దక్షిణకైలాసం అంటే ప్రస్తుత కాళహస్తి ప్రాంతంలోని మారేడువనంలో గూడు కట్టుకుని జీవిస్తూ అక్కడ వెలసిన శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ శివలింగం చుట్టూ శరీర దారాలతో ప్రాకారాలను నిర్మించేవాడు.అతడి భక్తిని పరీక్షించదలచిన పరమశివుడు ఒకరోజు ఆ దారాల ప్రాకారాలని అఖండదీపంతో దహింపజేశాడు. దానిని చూసి చలించిపోయిన సాలీడు శివుని పై భక్తితో ఆ దీపాన్నే మింగబోతూ తనను తాను ఆత్మార్పణ చేసుకోబోయింది. దీంతో ముగ్ధుడైన పరమేశ్వరుడు సాలీడుని కటాక్షించాడు. ఏం వరం కావాలో కోరుకోమనగా దక్షిణకైలాస పురానికి ముందు ‘శ్రీ’ అనే అక్షరం ఉండేలా వరం పొంది సాలీడు రూపంలో ఉన్న ఊర్థ్వనాథుడు శివైక్యం చెందాడు. కాళ (సర్పము): ఈ కాళం(సర్పం) పూర్వజన్మలో బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేదవిద్యలను అభ్యసించి హిమాలయ పర్వతగుహల్లో నివసిస్తుండేవాడు. అయితే రత్నాలచే శివుని పూజించిన వారు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతారని ఒక గంధర్వుడు చెప్పడంతో తక్షణమే శరీరం వదలి నాగుపాముగా జన్మించి దక్షిణ కైలాసానికి చేరి అక్కడున్న వాయులింగాన్ని ప్రాతఃకాలంలో మణులతో పూజించడం ప్రారంభించాడు. హస్తి(ఏనుగు): హస్తి(ఏనుగు) కూడా పూర్వజన్మలో మలయపర్వత ప్రాంతంలో శోత్రీయ కుటుంబంలో జన్మించినవాడు. వేదాలను అభ్యసించే సమయాన వ్యాధిపీడితుడు కావడంతో శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి జాగరణ చేసిన భక్తుడు. ఇతడు కొంతకాలానికి మరణించి ఏనుగుగా జన్మించి దక్షిణ కైలాసానికి చేరి శివలింగానికి తొండంతో తెచ్చిన నీటితో అభిషేకించి కమల పుష్పాలతో పూజించడం మొదలుపెట్టాడు. సర్పం శివలింగంపై అభిషేకించిన మణులను మధ్యాహ్న సమయంలో ఏనుగు తొలగించి నీటితో అభిషేకించి కమలార్చన చేసేది. మరునాడు ప్రాతఃకాలంలో పూజకు వచ్చిన సర్పం పువ్వులను తొలగించి మణులతో అభిషేకించేది. అయితే ఎవరో పూజాభంగం చేస్తున్నారని భావించిన సర్పం ఓ దినాన శివలింగానికి వెనుక భాగాన దాక్కుని గమనిస్తుండగా ఏనుగు వచ్చి మణులను తొలగించడం గమనించింది. వెంటనే కోపంతో అది ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. బాధ భరించలేక హస్తి తన తొండాన్ని మోదుకుంది. దాంతో రెండూ శివైక్యం చెందింది. వీరి భక్తికి మెచ్చిన శివుడు వారిరువురిని వరం కోరుకోమనగా వాయులింగంతో పాటు తాము ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి. అప్పటి నుంచి సాలీడు పేరున శ్రీ, సర్పం పేరున కాళ, ఏనుగు పేరున హస్తి కలిసి ‘శ్రీ–కాళ–హస్తి’ పేరిట శైవక్షేత్రం వెలసింది. తొలిపూజను అందుకునే భక్త కన్నప్ప వృత్తాంతమిదీ... పూర్వం కణ్ణడు అనే కోయవాడు దివ్య కైలాస శిఖరారణ్యంలో తిరుగుతూ వాయులింగాన్ని ప్రతిరోజూ బిల్వదళాలతో పూజించి జంతువులను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవాడు. ఒకరోజు అతడి భక్తికి పరీక్ష పెట్టిన పరమశివుడు కణ్ణడు పుక్కిట జలంతో అభిషేకిస్తున్న సమయంలో శివలింగం కంటి నుంచి నీరు కారేవిధంగా చేశాడు. శివుని కంట నీరు కారడం గమనించిన కణ్ణడు తన తప్పిదం వల్లే ఇలా జరిగిందని భావించి తన కన్నును అమ్ములపొదిలోని బాణంలో తీసి శివుని కన్నుగా అమర్చాడు. దీంతో నీరు కారడం ఆగిపోయి మరో కంటినుంచి కారడం ఆరంభం కావడంతో మరో కన్నును కూడా బాణంతో తీయబోతుండగా కణ్ణడి పరమ భక్తికి పరవశించిపోయిన శివుడు ప్రత్యక్షమై, కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు, భక్త కన్నప్పను దర్శించినా, చరిత్ర వినినా, పఠించినా సర్వపాపాలు తొలగి అంత్యకాలంలో కైలాసప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్థానమవుతాడు. ఆనాటి నుంచి పరమశివుని తొలిభక్తుడైన భక్తకన్నప్పకు స్వామివారి కన్నా ముందే తొలిపూజ చేయడం ఆచారంగా వస్తోంది. ప్రతియేటా స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ భక్తకన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. కుంభాభిషేకం విశిష్టత ఇదీ ప్రతి పుష్కర కాలానికి (12సంవత్సరాలు) ఒకసారి శ్రీకాళహస్తి క్షేత్రంలో కుంభాభిషేకం చేయడం ద్వారా ఆలయ కట్టడాలకు బలం చేకూరడంతోపాటు దేవతామూర్తుల శక్తి పునరుత్తేజింపబడుతుందని విశ్వాసం. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల్లో కాలానుగుణంగా చిన్నపాటి శిథిలాలు ఏర్పడినా, దేవతామూర్తుల ఆకారాల్లో పగుళ్లు ఏర్పడినా వాటి స్థానంలో బాలాలయాలను ఏర్పాటు చేసి జీర్ణోద్ధరణ పనులను పూర్తి చేసి కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో 1901లో రామానందం చెట్టియార్ వంశీకులు ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి 1912లో ఆలయ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ రికార్డులు తెలుపుతున్నాయి. అప్పటినుంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహించాల్సి ఉన్నా, ఆ పని సజావుగా జరగలేదు. 1912 తర్వాత 1969లో ఒకసారి, 1974లో మరోసారి, 2000వ సంవత్సరంలో ఇంకోసారీ కుంభాభిషేకం నిర్వహించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నుంచి 8వ తేదీ వరకు వైభవంగా శ్రీకాళహస్తీశ్వరాలయ మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ రాజగోపురం విశిష్టత శ్రీకాళహస్తి దేవస్థానానికి ఈశాన్యదిక్కున స్వర్ణముఖీ నది తీరాన క్రీ.శ. 1516లో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణభారతదేశ దండయాత్రలో విజయానికి చిహ్నంగా వేలాది మంది కూలీల సాయంతో మూడేళ్ల కఠోర శ్రమతో రాజగోపురాన్ని నిర్మించాడు. అప్పటి కళాఖండాలను మేళవించి హిందూ సంస్కృతి, సాంప్రదాయం, ప్రజల జీవనశైలి ప్రతిబింబించేలా గోపుర నిర్మాణం చేశాడు. ఇటుకలు లేకుండా సున్నం, బెల్లం, కరక్కాయ, కోడిగుడ్ల సొనతో అద్భుత రీతిలో రాజగోపురాన్ని నిర్మింపచేశాడు. ఏడు అంతస్తులుగా 136 అడుగుల ఎత్తుతో ఈ గాలిగోపురం శ్రీకాళహస్తికి మకుటంగా దర్శనమిస్తూ వచ్చింది. కాలక్రమేణా ఈ గోపురం ఎండకు ఎండుతూ, వానాలకు తడుస్తూ పగుళ్ల ధాటికి తట్టుకోలేక 2010 మేనెల 26వ తేదిన కూలిపోయింది. అయితే నవయుగ సంస్థకు చెందిన చింతా విశ్వేశ్వరరావు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దీని నిర్మాణం చేపట్టి 144 అడుగుల ఎల్తైన గోపురాన్ని పూర్తి చేయడంతో మళ్లీ దివ్యతేజస్సుతో దర్శనమిస్తోంది. నిర్మాణకర్తలు జనవరి 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 11 రోజులపాటు అత్యంత వైభవోపేతంగా విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఒకటిన శ్రీకాళహస్తీశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శోభాయమానంగా జరపడానికి ఆలయానికి చెందిన ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. – ఉప్పరపల్లి చెంచురెడ్డి, శ్రీకాళహస్తి కుంభాభిషేకం క్రమమిది... కంచికామకోటి పీఠాధీశులు శ్రీ జయేంద్ర సరస్వతీ, శ్రీవిజయేంద్ర సరస్వతీ వారి నేతృత్వంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. వారితోపాటు వారి శిష్యబృందం ఎనిమిది రోజుల పాటు శ్రీకాళహస్తి దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మగుడి ప్రాంతంలోనే నివాసం ఉంటారు. మహాకుంభాభిషేకానికి లక్షమందికి పైగా భక్తులు వస్తారని ఆలయాధికారుల అంచనా. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అర్చనలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. భక్తులకు ఆలయ అన్నదాన మండపంలో భోజన వసతులు కల్పించనున్నారు. నేటి నుంచి ప్రధానంగా జరిగే కార్యక్రమాలు ఫిబ్రవరి 1, బుధవారం గాలిగోపురానికి కుంభాభిషేకం 2న గణపతి హోమం, వాస్తుశాంతి 3న గోపూజ, ధనపూజ, మత్స్యగ్రహణం 4న యాగప్రవేశం కుంభ స్థాపన 5న పరివార దేవతల గోపురాలకు కంచుగడప గోపురానికి స్వర్ణ కలశ స్థాపన 6న యాత్రదానం, యాగపూజ, కుంభోద్వాసన 7న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామి వార్ల విమాన గోపురాలకు స్వర్ణ కలశస్థాపన, 8న స్వామి, అమ్మవార్లు, నటరాజస్వామికి కుంభాభిషేకం మాటలు తెచ్చే తీర్థం దేవస్థానంలో స్వామి, అమ్మవార్లతోపాటు అనేక అద్భుత దర్శనీయాలు భక్తులకు ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలుగా వెలుగొందుతున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానంలోని కంచుగడప సమీపంలో పురుషామృగంను వీక్షిస్తే మోక్షం లభిస్తోందని శాస్త్రం చెబుతుంది. ఇక్కడి సరస్వతి తీర్థాన్ని సేవిస్తే చెవిటి, మూగ వారు వ్యాధి విముక్తులవుతారని భక్తుల్లో విశ్వాసం. ఇక బంగారుబల్లిని తాకితే శరీరంపై బల్లి పడితే వచ్చే దోషాలు హరించకుపోతాయని నమ్మకం. అదేవిధంగా దేవస్థానంలో శనీశ్వరస్వామి, ఆదిశంకరాచార్యులు ప్రతిష్టంచిన స్పటింకలింగం, గురుదక్షిణామూర్తి, పాతాళ వినాయకుడు, భరద్వాజతీర్థం, పొగడచెట్టు వంటి వాటిని దర్శంచుకోవచ్చు. అంతేకాకుండా శ్రీకాళహస్తి పట్టణంలో దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయం, ప్రసన్న వరదరాజస్వామి ఆలయం, కనకదుర్గమ్మ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. -
శాంతి మహాయజ్ఞంలో చిరంజీవి
-
శాంతి మహాయజ్ఞంలో చిరంజీవి
-
శాంతి మహాయజ్ఞంలో చిరంజీవి
శ్రీకాళహస్తి: చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో నవయుగ నిర్మాణ సంస్థ నిర్మించిన రాజగోపురానికి మహాకుంబాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞంలో సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ‘నవయుగ’ చైర్మన్ చింత విశ్వేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అభిమాన హీరో చిరంజీవిని చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావచ్చారు. మొదట చిరంజీవి కుటుంబసభ్యులతో వెళ్లి శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీర్వసామిని దర్శించుకున్నారు. -
కుప్పమా..పలమనేరా..
రెవెన్యూ కొత్త డివిజన్ల ఏర్పాటుపై సందిగ్ధత పలమనేరులో గతంలో స్థలం కేటాయింపు తాజాగా కుప్పం వైపు మొగ్గు ఆందోళనకు సిద్ధమంటున్న పలమనేరు నేతలు పలమనేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందా లేక.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పానికి దక్కేలా చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీకాళహస్తి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు త«థ్యమనే నేపథ్యంలో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. రెండో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. భౌగోళికంగా అటు కుప్పం, ఇటు పుంగనూరు నియోజకవర్గాలకు మధ్యలో ఉండే పలమనేరునే డివిజన్ చేయాలనే డిమాండ్ దీర్ఘకాలంగా ఉంది. పలమనేరులోనే రెవెన్యూ డిజిజన్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వినతులను పంపారు. కొద్దిరోజులుగా కుప్పానికి రెవెన్యూ డివిజన్ హోదా మంజూరవుతుందనే సమాచారం పలమనేరులో రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆందోళనలు, నిరసనలకు సైతం వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే న్యాయవాదులను విధులను బహిష్కరించారు. పలమనేరు: రాష్ట్ర విభజనకు ముందు పలమనేరు డివిజన్ ఏర్పాటు చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్ సీసీఎల్ఏ, ఆర్థిక శాఖలవద్దకు వెళ్లింది. ఈలోగానే ఎన్నికలు, సమైక్య ఉద్యమాలతో ఈ అంశం పూర్తిగా తెరమరుగైంది. ప్రస్తుతం మదనపల్లి డివిజన్ పరిధిలో పీలేరు, మదనపల్లి, తంబళ్ళపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం శాసనసభ నియోజకవర్గాలున్నాయి. పరిపాలనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రెండుగా విభజించాలని పలు ప్రభుత్వాలు భావించాయి. పాతికేళ్లుగా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పలమనేరు డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక అంశాలపై నివేదిక పంపాలని అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయ నిర్మాణం కోసం పలమనేరులో మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని రిజర్వు చేసిపెట్టింది. ఈ నేప«థ్యంలో అధికార టీడీపీ ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. పలమనేరు కాకుండా కుప్పం పేరు రావడమే ప్రస్తుతం వివాదానికి కారణమైంది. -
ముక్కంటీశుని చెంత ఆస్ట్రేలియా భక్తులు
చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం ఆస్ట్రేలియా భక్తులు విచ్చేశారు. ఆలయంలో వారు ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని.. ఆలయ శిల్ప సౌందర్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. జల వినాయకుని సమీపంలో ఉన్న నాగశిలల వద్ద దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. -
అధికార భూమాయ
శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నడుం బిగించిన తరుణంలో అధికార పార్టీ నాయకులు అప్పనంగా పరిహారం పొందేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకునేశారు. రెవెన్యూ అధికారులతో కలసి తమ అనుభవంలోనే ఈ భూములు ఉన్నట్లు కనికట్టు చూపుతున్నారు. శ్రీకాళహస్తి రూరల్: వెలంపాడు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఏకమై ఈ ఏడాది జూలై నెలలో ఓ ప్రైవేటు సర్వేయర్ సాయంతో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఓ రెవెన్యూ అధికారిని మచ్చిక చేసుకుని చెట్టుపుట్ట కొట్టి తీర్చుకుని 60 ఎకరాలు పంచుకుని దర్జాగా మినుము పంట సాగుచేసిన ఘటన మండలంలోని వెలంపాడులో తాజాగా వెలుగు చూసింది. గతేడాది ఇవే భూములను ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా అప్పట్లో సాక్షి దినపత్రికలో భూ ఆక్రమణలపై కథనాలు రావడతో అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్ అడ్డుకట్ట వేశారు. అరుుతే నాలుగు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ బదిలీపై వెళ్లడం, దీనికి తోడు భూ సేకరణకు సంబంధించి ప్రక్రియ మండలంలో జోరుగా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి టీడీపీ తమ్ముళ్లు పరిహారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు. రూ.6 కోట్లు పై మాటే మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు రెవెన్యూ పరిధిలో 178, 185 వ బ్లాక్‌లో 225 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 150 ఎకరాల భూమిని ప్రభుత్వం రెండేళ్ల కిందట ఏపీఐఐసీకి అప్పగించింది. అప్పట్లో ఏపీఐఐసీ మేనేజర్ ప్రతాప్, అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్‌తో కలసి భూములను పరిశీలించి భూములకు సంబంధించి రికార్డులను సిద్దం చేసి, వారికి అందించారు. అరుుతే తాజా భూసేకరణ నేపథ్యంలో ఆక్రమణ చోటు చేసుకుంది. ఓ రెవెన్యూ అధికారి సహకారంతో ఇదే అదునుగా భావించి వెలంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బ్లాక్ నంబర్ 178లో దామరాకులగుంట నుంచి మామిడిగుంటకు వెళ్లేదారిలో 30 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 30 ఎకరాలు దర్జాగా ఆక్రమించారు. అనంతరం జేసీబీ యంత్రాలు పెట్టి చెట్టు, పుట్ట కొట్టి ప్రభుత్వ భూములను తీర్చేశారు. వారం రోజుల కిందట ఆ భూములను చదును చేసి మినుము పంట సాగుచేశారు. ఈ ఆక్రమిత భూములు విలువ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలిసినా ఖాతరు చేయకుండా గత వారం రోజుల నుంచి ఇదే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. కొంత మంది స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీఐఐసీ పరిశ్రమలు తీసుకొచ్చేలోపు ఆ భూముల్లో పంటలు సాగుచేసి భూ సేకరణ బృందానికి తమ పేర్లను సూచించి అనుభవం డబ్బులు కాజేయాలని రచించిన పన్నాగం పూర్తరుుంది. అనుభవంలోకి మార్చడానికి ప్రయత్నాలు వెలంపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా 60 ఎకరాల్లో చెట్లను తొలగించి ఏదో ఒక పంట సాగు చేస్తే అనుభవం కింద మార్చివేస్తానని ఓ రెవెన్యూ అధికారి టీడీపీ తమ్ముళ్లకు భరోసా ఇచ్చారని సమాచారం. వచ్చిన పరిహారంలో రెవెన్యూ అధికారికి వాటా ఇచ్చేలా రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం . మాకు సంబంధం లేదు ఏపీఐఐసీకి భూములు అప్పగించాక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. ఇప్పుడు ఆ భూములపై మాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించి విచారిస్తాం. తర్వాత ఏపీఐఐసీ అధికారులకు సమాచారం అందిస్తాం. - రమేష్‌బాబు, తహశీల్దార్, శ్రీకాళహస్తి -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
శెట్టిగుంట(రైల్వేకోడూరు రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటనలో రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎస్.మస్తాన్ వలీ(35) రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో వివాహం చేసుకున్నాడు. గురువారం కొత్త ద్విచక్ర వాహనంలో పుల్లంపేటకు వచ్చి తిరిగి శ్రీ కాళహస్తికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతినికి భార్య అమీనా బేగం ఉన్నారు. -
ముక్కంటీశుని చెంత నాగశిల ప్రతిష్ట పూజకు శ్రీకారం
దోష పరిహారం చేసుకునే భక్తుల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటికే దేశంలో మరెక్కడా లేని విధంగా రాహుకేతు పూజలను చేస్తూ ఆలయ ప్రాశస్త్యానికి వన్నె తెచ్చారు. ఈనేపథ్యంలో శ్రీకాళహస్తి ప్రాంతంలో విశేష ప్రాధాన్యత కలిగిన నాగశిలల ప్రతిష్ట పూజలు అధికారికంగా దేవస్థానం సారథ్యంలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దేవస్థానం పాలకులు నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ 1వతేది నుంచి ఈ పూజలను ఆలయ సమీపంలోని భరద్వాజతీర్థం వద్ద జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ కొందరు అర్చకులు భక్తులకు శ్రీకాళహస్తి సన్నిధివీధితోపాటు మరికొన్ని ఆలయాలు వద్ద నాగశిలల ప్రతిష్ట పూజలు చేసి వారి నుంచి రూ.25వేలు మేరకు వసూలు చేస్తున్నారు. దోపిడీకి స్వస్తి పలకడానికి తోడు ఆలయ ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఈ పూజలను రూ.15వేలకే చేసేందుకు ఆలయాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. నక్షత్రదోష పరిహారం కోసం నలుగురు అర్చకులతో నాగశిలలకు వివిధ అభిషేక పూజలు, హోమాలు చేసి ప్రతిష్టిస్తే దోషపరిహారం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ పూజకు అంతటి ప్రాచుర్యం ఉంది. భక్తుల విశ్వాసాలను కొందరు ఆలయ అర్చకులు అనధికారికంగా ఈ పూజలను ఆలయ సమీపంలో ఉన్న ఓ మఠం, నీలకంఠేశ్వరాలయం, మరికొన్ని చోట్ల నాగశిలల ప్రతిష్ట పూజలను చేస్తున్నారు. ఆలయ పాలకులు తీసుకోనున్న ఈ సరికొత్త నిర్ణయంతో భక్తులకు ఈ విశేషపూజ చేరువ కానుంది. భక్తుల సౌకర్యార్థమే... ఎంతో ప్రాచుర్యం ఉన్న నాగశిలల ప్రతిష్ట పూజను దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించాలని భావిస్తున్నాం. ఆ మేరకు భరద్వాజతీర్థంలో పూజలు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ పూజకు అవసరమైన నాగశిలలతోపాటు పూజాసావుగ్రిని దేవస్థానం సమకూరుస్తుంది. రూ.15వేలు టికెట్ నిర్ణయించబోతున్నాం. నవంబర్ నుంచి భక్తులకు ఈ పూజలను అందుబాటులోకి తీసుకువస్తాం. - గురవయ్యనాయుడు, ఆలయ చైర్మన్. -
కాళహస్తిలో సింధు రాహుకేతు పూజలు
శ్రీకాళహస్తి : రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పీవీ సింధు... ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆమెకు గురు దక్షిణమూర్తి మండపం వద్ద ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందచేశారు. సింధుతో పాటు బీజేపీ నేత, టీడీపీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. -
వుుక్కంటీశుని సన్నిధిలో అడిషినల్ సొలిసిటర్ జనరల్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సోవువారం సుప్రింకోర్టు అడిషనల్ సోలిసిటర్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీరజ్‌కష్ణ కనల్ కుటుంబసభ్యులతో సందర్శించుకున్నారు. స్వామి,అవ్మువార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను,తీర్థప్రసాదాలను అందజేశారు. -
మిస్టరీగా చిన్నారి సల్మా అదృశ్యం
-
శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల భూకబ్జా
-
శ్రీకాళహస్తి విజ్ఞాన గిరిపై బ్రహ్మోత్సవం
-
శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం
శ్రీకాళహస్తిలో వైభవంగా అగ్నిగుండ ప్రవేశం శ్రీకాళహస్తి పట్టణంలో అగ్నిగుండ మహోత్సవం ఆదివారం రాత్రి వేడుకగా సాగింది. ఈ కార్యక్రమానికి 15 వేల మంది భక్తులు హాజరయ్యారు. డీఎస్పీ ఆధ్వర్యంలో.. బందోబస్తు చేపట్టారు. ఆలÄýæు ధర్మకర్తల వుండలి సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక ఏటా ధర్మరాజుల అగ్నిగుండప్రవేశం రోజున వర్షం కురుస్తోందని భక్తుల నవ్ముకం. అదేవిధంగా ఈ సారికూడా వర్షం కురవడంతో భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతకుముందు నిర్వహించిన ధుర్యోదన వధ నాటిక ఆకట్టుకుంది. -
సుష్మ కిడ్నాప్ కథ సుఖాంతం
శ్రీకాళహస్తి: తొమ్మిదో తరగతి విద్యార్థిని సుష్మ కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలనీలో మూడు రోజుల క్రితం సుష్మ అపహరణకు గురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఆమెను ఆర్టీసీ బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. స్థానికులు సుష్మను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కిడ్నాప్ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా సుష్మ ఆచూకీ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
శ్రీ కాళహస్తిలో విద్యార్ధిని కిడ్నాప్
-
జయలలిత ఆరోగ్యం కోసం పూజలు
- ముక్కంటీశునికి 66 కేజీల వెండి వస్తువుల బహూకరణ శ్రీకాళహస్తి : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తమిళనాడు రేట్టరి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నీలకంఠం శనివారం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం 66 కేజీల 543 గ్రాముల వెండి ఆభరణాలను ఆలయానికి అందజేశారు. వీటిలో స్వామివారి పానుమట్టంతోపాటు 50 రకాల పూజ సామగ్రి ఉన్నాయి. వీటి విలువ రూ.32,66,459 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ సభ్యులు లోకనాథం నాయుడు, మల్లెమాల ప్రమీలమ్మ, పీఎం చంద్ర, డాక్టర్ ప్రమీలమ్మలు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో దిగంబరస్వామి
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి బుధవారం నిత్యాగ్నిహోత్ర అవధూత హఠయోగేశ్వర మోని దిగంబర చటగోపి సూర్యప్రకాశనాథ కనకదుర్గాదేవి యోగేశ్వర శ్రీ సరస్వతీ స్వామి వచ్చారు. ఆయన స్వామి.. అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఇలా దిగంబరంగా దేవస్థానానికి విచ్చేసిన అవధూతలు చాలా అరుదు. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం బొగ్గులకొండ కూకట్లపల్లి గ్రామం. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తిలో దిగంబరం దర్శనానికి ఆయన దేవాదాయ శాఖ అనుమతి పొందినట్లు ఆలయంలో చర్చ జరుగుతోంది. -
వన్డే చైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ డెలిగేట్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్య ఎన్నికయ్యారు. ఒక్కరోజు చైర్మన్ హోదాలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఆది నుంచి వివాదాస్పదంగా సాగుతున్న శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 21 వుంది టీడీపీ, 11 మంది వైఎస్సార్సీపీ, మరో ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు కొనసాగుతున్నారు. బుధవారం జరిగిన అత్యవసర సమావేశానికి చైర్మన్, వైస్ చైర్మన్ సహా టీడీపీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అంతే కాకుండా ప్యానెల్ కమిటీ సభ్యులు (నలుగురు) కూడా సమావేశానికి రాలేదు. వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది సమావేశానికి హాజరయ్యారు. బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లలో 11వ వార్డుకు చెందిన లత, 13వ వార్డు కౌన్సిలర్ పుష్ప హాజరయ్యారు. అయితే టీడీపీ ఒత్తిళ్లతో 13వ వార్డు కౌన్సిలర్ పుష్ప మినిట్స్ పుస్తకంలో సంతకం చేయకుండా అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. 11వ వార్డు కౌన్సిలర్ లత మాత్రం సమావేశంలోనే కొనసాగడంతో కోరానికి అవసరమైన బలం చేకూరింది. దీంతో సమావేశం నిర్వహించి తీరాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరామశర్మను వైఎస్సార్సీపీ కోరింది. అయితే ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సమావేశానికి ఆలస్యంగా వచ్చారని సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు సమావేశ మందిరంలోకి చేరుకుని సంతకాలు పెట్టడానికి ప్రయత్నించారు. కమిషనర్ మినిట్స్ పుస్తకాన్ని ఇచ్చేందుకు నిరాకరించారు. కోరానికి కావాల్సిన కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారని, వారందరి చేత ఎందుకు సంతకాలు చేయించరని కమిషనర్‌తో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత కమిషనర్ మినిట్స్ పుస్తకాన్ని ఇవ్వడంతో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కూడా సంతకాలు పెట్టారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ ఫ్లోర్ లీడర్ గుమ్మడి బాలకృష్ణయ్య నేతృత్వంలో డెలిగేట్ మున్సిపల్ చైర్మన్‌గా 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకుని సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలోని 46 అంశాలను ఆమోదిస్తున్నట్లు తీర్మానం చేశారు. ఒకరోజు చైర్మన్‌గా పాలకవర్గాన్ని కాదని విపక్ష సభ్యుడు బాధ్యతలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. -
వన్ డే చైర్మన్
శ్రీకాళాహస్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య ముదిరిన ఆధిపత్య పోరు రెండు వర్గాలుగా చీలిన టీడీపీ కౌన్సిలర్లు కావాలనే అత్యవసర సమావేశానికి గైర్హాజరు అందిపుచ్చుకున్న ప్రతిపక్ష సభ్యులు ఒకరోజు చైర్మన్‌గా ప్రతిపక్ష కౌన్సిలర్ జిల్లాలోనే సంచలనం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వుున్సిపాలిటీలో సంచలనం చోటు చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య తలెత్తిన వివాదం కారణంగా బుధవారం జరగాల్సిన అత్యవసర సమావేశానికి ఆ పార్టీ కౌన్సిలర్లందరూ డుమ్మా కొట్టారు. కోరం లేక సమావేశం వాయిదా పడుతుందని లైట్ తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష కౌన్సిలర్లతోపాటు మరో కౌన్సిలర్ తోడవడంతో డెలిగేట్ మున్సిపల్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ వ్యవహరించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆది నుంచీ వివాదమే.. శ్రీకాళహస్తి వుున్సిపల్ పాలకవర్గం ఆది నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. పాలకవర్గం ఏర్పడిన కొన్నిరోజులకే వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, వైస్ చైర్మన్ వుుత్యాల పార్థసారథి వుధ్య రాజకీయు వైరుధ్యం ఆధిపత్య పోరుకు దారితీసింది. అది మరికొన్నాళ్లకు ముదిరిపాకాన పడి కువుు్మలాటలకు దారితీసిం ది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన స్థానిక మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఏ పథకమొచ్చినా తవు అనుచర కౌన్సిలర్ల వార్డుల్లో ప్రారంభించాలంటూ ఆ వర్గాలు రెండూ వాదనలకు దిగడం రివాజుగా మారుతోంది. ఇటీవల ఈ రెండు వర్గాలు రోడ్డెక్కాయి. చైర్మన్‌ను వూర్చాలని ఓ వర్గం, కొనసాగించాలని మరో వర్గం ర్యాలీలు, ధర్నాలు చేసిన విషయం తెల్సిందే. అంతటితో ఆగక ఒకరిపై వురొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కరపత్రాలు పంచడం తీవ్ర దువూరం లేపింది. మంత్రి కర్రపెత్తనం వుున్సిపల్ పాలకవర్గం అసవుర్థత బహిర్గతం కావడంతో వుంత్రి బొజ్జల కుటుంబీకులు వుున్సిపల్ అధికారులపై అజవూరుుషీ చే స్తూ కర్రపెత్తనానికి దిగారు. వుున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల వుధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంతో వారి ఆగడాలకు కత్తెర వేసే దిశగా వుంత్రి మానిటరింగ్ కమిటీని నియమించారు. ఇందులో ఏర్పేడు మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, శ్రీకాళహస్తి మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉన్నారు. ఇకపై మున్సిపాలిటీలో పూచికపుల్ల కదలాలన్నా వీరి అనుమతి తప్పనిసరి కానుంది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో వీరంతా సవూవేశమై చర్చ లు సాగించినట్లు తెలిసింది. అరుుతే టీడీపీ కౌన్సిలర్లు తావుు వుహానాడు పనులను పర్యవేక్షించేందుకు వెళ్లినట్లు బొంక డం గమనార్హం. ఒకరోజు చైర్మన్‌గా శ్రీకాళహస్తి వుున్సిపాలిటీలో మొత్తం 35 వుంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 21వుంది టీడీపీ, 11వుంది వైఎస్సార్ సీపీ, వుుగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. కాగా బుధవారం జరిగిన అత్యవసర సవూవేశానికి చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు టీడీపీకి చెందిన 21వుంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యూరు. ప్యానెల్ కమిటీ సభ్యులు (నలుగురు) కూడా సవూవేశానికి రాలేదు. కాగా వైఎస్సార్ సీపీకి చెందిన 11వుందితోపాటు ఓ బీజేపీ కౌన్సిలర్ తోడవడంతో కోరానికి సరిపడా బలం చేకూరింది. దీంతో సవూవేశం జరపాలని వుున్సిపల్ కమిషనర్ శ్రీరావుశర్మను వైఎస్సార్ సీపీ కోరింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ ఫ్లోర్ లీడర్ గువ్ముడి బాలకృష్ణయ్యు నేతృత్వంలో డెలిగేట్ వుున్సిపల్ చైర్మన్‌గా 22వ వార్డు వుున్సిపల్ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్యును ఏకగ్రీవంగా ఎన్నుకుని సవూవేశాన్ని నిర్వహించారు. పలు అంశాలను తీర్మానించడం చర్చనీయాంశమైంది. -
మాటలు వద్దు... పనిచేయండి
►శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డికి మంత్రి నారాయణ చురకలు ►చిత్తూరు కార్పొరేషన్ ►కమిషనర్‌పై మంత్రికి ఎమ్మెల్యే సత్యప్రభ ఫిర్యాదు ►తిరుపతిలో మున్సిపల్ ► కమిషనర్లు, కౌన్సిల్ చైర్మన్లతో సమీక్ష తిరుపతి కార్పొరేషన్ : ‘అభివృద్ధిలో శ్రీకాళహస్తి వెనుకబడినా పట్టించుకోరు.. మేము నిధులు ఇస్తామన్నా తీసుకుని ఖర్చు చేసేందుకు ముందుకురారు.. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే మాత్రం బ్రహ్మాండంగా స్పీచ్‌లు ఇస్తారు.. పనులు మాత్రం చేయరు.. మాటలతో పనులు కావు.. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేలా కౌన్సిల్ ద్వారా చొరవ చూపండి’ అంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డికి చురకలు అంటించారు. సాక్షాత్తు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన రాధారెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మంత్రి వ్యాఖ్యలతో పక్కనే ఉన్న మంత్రి బొజ్జల ఒకింత ఇబ్బందికి గురికావాల్సి వచ్చింది. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జిల్లాలోని అన్ని మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లు, చైర్మన్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీటికి నిధులు కేటాయింపు.. జిల్లాలోని అన్ని మున్సిపల్, కార్పొరేషన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌తో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేదని, మిగిలిన వాటికి నిధులు ఇస్తున్నామని, శాశ్వత మంచినీటి సదుపాయాన్ని కల్పిం చాలని ఆదేశించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ ఆఖరుకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. 150 రోజుల్లో జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ చేయించాలన్నారు. చిత్తూరు కమిషనర్ తీరు బాగలేదు.. నగరంలో ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. అదనంగా ఐదు మంచినీటి సరఫరా ట్యాంకర్లను ఏర్పాటు చేస్తే కమిషనర్ తిరిగి పంపించేశారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా మంత్రి స్పందించకపోవడంతో ఆమె సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య, తిరుపతి కార్పొరేషన్ వినయ్‌చంద్ పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు ప్రయాణిస్తున్న కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో అగ్ని ప్రమాదం
-
శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద గురువారం శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. తన అనుంగు శిష్యురాలు రజితతో కలిసి శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యానంద, రజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిత్యానంద, రజిత మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భక్తులు మాత్రం వీరిద్దరినీ ఆసక్తిగా గమనించారు. -
శ్రీకాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం
తిరుపతి: పదవి ఉంది.. డబ్బు ఉంది.. వ్యవస్థతో ఎలా అయినా ఆడుకోవచ్చు అనుకుంటున్నారు నేతల కుమారులు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడి కీచక పర్వం మరచిపోకముందే తాజాగా మరో నాయకుడి కుమారుడు రెచ్చిపోయాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాళహస్తిలో వీరంగం సృష్టించాడు. శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తికి వెళ్లిన ఆనం శుభకర్ రెడ్డి తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ అధికారులపై చిందులు వేశాడు. దర్శనం కల్పిస్తారా లేదా అంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. అందుకు నిరాకరించిన ఈవో పై శుభకర్ రెడ్డి అంతు చూస్తానంటూ దుర్భాషలాడినట్టు సమాచారం. 'గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబు తో మాట్లాడి నీ కథ తేలుస్తా' అంటూ ఈవో భ్రమరాంబపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీకాళహస్తిలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదాస్పదమవుతోంది. బాపిరాజుకు ఈ రోజు ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్ఎల్ఏ లకే లేని సౌకర్యాన్ని బాపిరాజుకు ఎలా కల్పిస్తారంటూ ఆలయ అర్చకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో భక్తుల ఎదుటే వారిపై తిట్ల పురాణానికి దిగారు. -
దేవతలారా..దిగిరండి!
ముక్కోటి దేవతలకు ముక్కంటి ఆహ్వానం కనుల పండువగా కన్నప్ప ధ్వజారోహణం నేడు స్వామివారి ధ్వజారోహణం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మాఘ బహుళ అష్టమి బుధవారం సాయంత్రం 4.30గంటలకు శ్రీకాళహస్తి కైలాసగిరుల్లో కన్నప్ప ధ్వజారోహణం కనుల పండువగా జరిగింది. బహ్మదేవుడి సారధ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దేవతలారా దిగిరండి.. దీవించండి.. అంటూ స్వామివారి తరఫున అర్చకులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు. శ్రీకాళహస్తి: శివ భక్తుడైన కన్నప్పకు ఉత్సవాల్లో ప్రథమ పూజ అందేలా పరమశివుడు వరమిచ్చాడు. ఆ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో తొలిరోజున భక్తకన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శ్రీకాళహస్తి ఆలయంలో బుధవారం కన్నప్ప ధ్వజారోహణం నిర్వహించారు. ముక్కంటీశుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి మేళాతాళాలతో, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా కైలాసగిరి కొండపై ఉన్న భక్తకన్నప్ప ఆలయానికి తీసుకొచ్చా రు. ఈసందర్భంగా ఆలయానికి చెందిన వృషభం, వివిధ కళాబృందాలు ఊరేగింపులో పాల్గొన్నారు. కొండపై ఉన్న భక్తకన్నప్ప ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారుచేసిన పవిత్రదారాన్ని, వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. సంప్రదాయంగా నైవేద్యం సమర్పించి, దీపారాధన ఇవ్వడంతో ధ్వజారోహణం పూర్తయింది. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఉరేగించారు. భక్తులు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాప్ చైర్మన్ పీఆర్‌మోహన్, వుున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, ఆలయు చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు, సభ్యులు, ఈవో భ్రవురాంబ, అధికారులు, ఉభయకర్తలు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి నిర్వహించనున్నారు. ఆ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 2వ తేదీ బుధవారం కన్నప్ప ధ్వజారోహణం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 3వ తేదీ గురువారం స్వామి, అమ్మవార్ల ధ్వజారోహణం, దేవరాత్రి, అంబారీ ఉత్సవం నిర్వహిస్తారు. 4వ తేదీ శుక్రవారం రెండో తిరునాళ్లు, భూతరాత్రి, భూతశుకవాహన సేవలు జరుగుతాయి. 5వ తేదీ శనివారం తిరునాళ్లు, గాంధర్వరాత్రి, రావణవాహన సేవలు నిర్వహించనున్నారు. 6వ తేదీ ఆదివారం నాలుగో తిరునాళ్లు, నాగరాత్రి, శేషవాహన సేవ నిర్వహిస్తారు. 7వ తేదీ సోమవారం మహాశివరాత్రి రోజున నందిసేవ, లింగోద్భవం ఉత్సవాలు జరుగుతాయి. 8వ తేదీ వుంగళవారం రథోత్సవం, బ్రహ్మరాత్రి, తెప్పోత్సవం నిర్వహిస్తారు. 9వ తేదీ బుధవారం స్వామి,అమ్మమువార్ల కల్యాణోత్సవం, స్కంధరాత్రి, 10వ తేదీ గురువారం శ్రీసభాపతి కల్యాణం, ఆనంద రాత్రి, 11వ తేదీన శుక్రవారం కైలాసగిరి ప్రదక్షిణం, రుషిరాత్రి నిర్వహించనున్నారు. 12వ తేదీ శనివారం ధ్వజావరోహణం, దేవరాత్రి, 13వ తేదీ ఆదివారం పల్లకీసేవ నిర్వహిస్తారు. 14వ తేదీ సోమవారం ఏకాంతసేవ, మోహరాత్రి, 15వ తేదీ మంగళవారం శాంతి అభిషేకాలు, నిత్యోత్సవం నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
మహిళ మృతి : ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నగరి వీధిలోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శోభ అనే మహిళ ఆదివారం మరణించింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శోభ మృతి చెందిందని వారు ఆరోపించారు. ఆ క్రమంలో ఆసుపత్రిపై దాడికి బాధితురాలి బంధువులు యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని... మృతురాలి బంధువులను సముదాయించేందుకు యత్నిస్తున్నారు. -
అందుబాటులోకి సొరంగ మార్గం!
♦ తలుపులు తెరచిన శ్రీకాళహస్తి ఆలయ వర్గాలు ♦ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాడుకకు పరిశీలన శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు స్వామి, అవ్మువారి దర్శనానంతరం వెలుపలికి వెళ్లేందుకు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి సొరంగాన్ని వాడుకలోకి తీసుకురావాలని అధికారులు, ఆలయు సభ్యులు ప్రయుత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆలయు ఈవో భ్రవురాంబ, ఈఈ వెంకటనారాయుణ, సభ్యులు , తహశీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ వెంకటకిశోర్ సవుక్షంలో సొరంగం తలుపులు తెరిచారు. 50 అడుగుల దూరం ఉన్న సొరంగంలో ఆభరణాలు ఉంటాయునే ఉద్దేశంతో ఇబ్బందులు తలెత్తకుండా వుుందు జాగ్రత్తగా ఈవో అందరికీ సవూచారం ఇచ్చి తలుపులు తెరిపించారు. అందులో శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి పెద్ద పెద్ద పాత్రలు, కొయ్యులు, స్తంభాలు వూత్రమే ఉన్నాయి. ఆలయ పోటు పైభాగం మీదుగా కంచుగడప సమీపంలోని సెక్యూరిటీ పారుుంట్ వద్దకు సొర ంగం కలుస్తోంది. అక్కడ వెలుపలకు దారి కోసం ఆలయు గోడ నాలుగు అడుగులు తొలగించాల్సి వస్తోంది. అయితే ఎక్కడ పడితే అక్కడ ఆలయు గోడలు తొలగించడం ఆగవుశాస్త్ర విరుద్ధవుని నిపుణులు అంటున్నారు. -
శివభక్తులకు సొరంగ మార్గం ద్వారా ప్రవేశం
- శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో సౌకర్యం కోసం పరిశీలన - తలుపులు తెరచిన అధికారులు, ఆలయ సభ్యులు - ఆగమశాస్త్ర విరుద్ధమని అంటున్న నిపుణులు శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు స్వామి, అమ్మవారి దర్శనానంతరం వెలుపలికి వెళ్లేందుకు శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి సొరంగాన్ని వాడుకలోకి తీసుకురావాలని అధికారులు, ఆలయ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆలయ ఈవో భ్రమరాంబ, ఈఈ వెంకటనారాయుణ, సభ్యులు వెంకట్రామానాయుడు, గుర్రప్పశెట్టి, మల్లెమాల ప్రమీలమ్మ, కండ్రిగ ఉమ, తహశీల్దార్ చంద్రమోహన్, డీఎస్పీ వెంకటకిషోర్ సమక్షంలో సొరంగం తలుపులు తెరిచారు. 50 అడుగుల దూరం ఉన్న సొరంగంలో ఆభరణాలు ఉంటాయనే ఉద్దేశంతో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈవో అందరికీ సమాచారం ఇచ్చి తలుపులు తీయించారు. అందులో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పెద్ద పెద్ద పాత్రలు, కొయ్యలు, స్తంభాలు మాత్రమే ఉన్నాయి. ఆలయ పోటు పైభాగం మీదుగా కంచుగడప సమీపంలో సెక్యూరిటీ పాయింట్ వద్దకు సొరంగం కలుస్తోంది. అక్కడ వెలుపలి భాగంలో దారి కోసం ఆలయ గోడలు నాలుగు అడుగులు తొలగించాల్సి వస్తోంది. అయితే ఎక్కడ పడితే అక్కడ ఆలయు గోడలు తొలగించడం ఆగమశాస్త్ర విరుద్ధవుని పలువురు నిపుణులు అంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రధాన ద్వారమైన కంచుగడప మీదుగా భక్తులు లోనికి ప్రవేశిస్తే, దర్శనానంతరం అదే దారిలో కాకుండా ఆలయంపై నుంచి వెలుపలికి వెళ్లడానికి మార్గం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, జనవరి నెలలో మాత్రమే భక్తుల సౌకర్యం కోసం ఈ దారిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దాంతోపాటు సొరంగం ద్వారా కూడా భక్తులు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆలయు ఈవో భ్రమరాంబ అంటున్నారు. -
మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు
చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం గ్రామంలో స్వయంభువుగా కొలువైన వళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డిలు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మూలం భానుప్రకాష్ శర్మ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటం బహూకరించారు. ఆలయ అభివద్ధి, కోనేరు నిర్మాణానికి సహయ సహకారాలు అందిస్తామన్నారు. భక్తులకు అన్నదానం: ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వైస్సార్ సీపీ నాయకులు ప్రారంభించారు. ఉభయకర్తలుగా ఓడూరు గిరధర్ రెడ్డి, ఇందూరు రోహన్ సాయిలు వ్యవహరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ పేరం మధునాయుడు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చెన్నారెడ్డి బాబురెడ్డి, నాయకులు కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, ఓడూరు సుందరరామిరెడ్డి, పెళ్లకూరు సర్పంచ్ బైనా చంద్రశేఖర్ రెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, ఓడూరు రమణారెడ్డి, అన్నమనేని రామకష్ణనాయుడు, చెన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి పాల్గొన్నారు. -
లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ
లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ కొట్టే యత్నం అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్‌తో రూ. కోటి సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యే ఆపై, హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆరా నగదు కోసం వ్యూహరచన చేశారని నిర్ధారణ మాటువేసి నిందితుల్నిపట్టుకున్న పోలీసుల రహస్య ప్రాంతంలో విచారణ తిరుపతి సిటీ : ముఖ్యమంత్రి నారాచంద్రబాబు తనయుడు లోకేష్ పీఏ విజయ్‌నంటూ ఓ అజ్ఞాన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు మంగళవారం ఫోన్ చేసినట్లు సమాచారం. తనకు చెందిన మనుషులు వస్తారని, వారి చేత కోటి రూపాయలు ఇచ్చి పంపిం చాలని ఎమ్మెల్యేకు ఫోన్లో విజయ్ పేరుతో కోరినట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తి సీఎం సతీమణి భువనేశ్వరి పేరును కూడా వాడుకున్నట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు సంజయ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి ఫోన్‌చేసి ఆరా తీశారు. ఆ పేరుగల వ్యక్తి ఎవరూలేరని అక్కడి నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టికి ఫిర్యాదు చేశారు. ఇంతలోపు మళ్లీ విజయ్ పేరుతో ఫోన్‌కాల్ రావడంతో డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సుగుణమ్మ అంగీకరించినట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెస్టు పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద మాటు వేసి రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఇంతలోపే శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. నగదు బ్యాగ్‌లు ఇస్తుండగా వెస్టు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు వినియోగించిన కారును సీజ్ చేసి, నిందితులను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. -
బస్సును ఢీకొన్న ఆటో
శ్రీకాళహస్తి: పట్టణంలోని హౌసింగ్ బో ర్డు సమీపంలో శనివారం రాత్రి బస్సును ఆటో ఢీకొనడంతో ఐదుగురు తీవ్రం గా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీకాళహస్తి నుంచి తొండవునాడు మీదుగా ఏర్పేడు వుండలంలోని బండారుపల్లి గ్రావూనికి బయలుదేరింది. హౌ సింగ్ బోర్డు వద్ద తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న బస్సును ఢీకొంది. శ్రీకాళహస్తి వుండలంలోని టీఎంవీకండ్రిగకు చెందిన జయుంతి(39), పుల్లారెడ్డికండ్రిగకు చెందిన అవుు్మలు(51), రాజయ్యు(55), ఏర్పేడు వుండలానికి చెందిన చెంగల్రాయుల్(45), పట్టణంలోని ప్రాజెక్టు వీధికి చెందిన ఆటో డ్రైవర్ సాధమ్ హుస్సేన్ (34) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 ద్వారా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథవు చికిత్స అనంతరం వారిని వైద్యులు తిరుపతి రూయూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
పిల్లల కోసం: తైవాన్ టు శ్రీకాళహస్తి..!
శ్రీకాళహస్తి: భక్తిభావానికి ఎల్లలు లేవు. దేశాలు అడ్డుకావు. దూరాలు లెక్కలోకి రావు. అందుకే సంతానం కోసం ఎక్కడో తైవాన్‌లో ఉండే 16 మంది భక్తులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడిని పూజించి తమ పిల్లలు కలిగేలా అనుగ్రహించమని వేడుకున్నారు. తైవాన్ దేశానికి చెందిన 16 మంది భక్తులు మంగళవారం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. మొదట ఆలయంలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద పొర్లు దండాలు పెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో పూజలు చేయిస్తే పెళ్లి కాని వారికి పెళ్లవుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెన్నైకి చెందిన ఓ స్నేహితుడు తెలిపాడని, అందుకే తాము ఈ ఆలయానికి వచ్చి మొక్కుకున్నట్టు చెప్పారు. -
'ఎన్ని కేసులు పెట్టినా భయపడం'
తిరుపతి: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ను నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఖండించారు. వైఎస్సార్ సీపీపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అక్రమ కేసులతో తమ పార్టీ ప్రజా ప్రతినిధులను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. తమపై పెట్టిన కేసులను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు. -
'చట్టాన్ని గౌరవించే పార్టీ మాది'
శ్రీకాళహస్తి: వైఎస్సార్ సీపీని అణగదొక్కడానికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. కోర్టులో హాజరుకావడానికి వస్తున్న మిథున్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 40 ఏళ్లుగా రాజకీయల్లో ఉన్నారని, ఆయనను ఎదుర్కొలేక ఎలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చట్టాన్ని గౌరవించే పార్టీ అని స్పష్టం చేశారు. అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని వరప్రసాద్ అన్నారు. -
తిరగబడ్డ జనం ...
► గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు ► ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? ► జన్మభూమిలో అధికారులను అడ్డుకున్న ప్రజలు మూడో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా సాగింది. పలు చోట్ల అధికారులపై జనం తిరగబడ్డారు. ‘‘గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు..ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వచ్చారు’’ అంటూ నిలదీశారు. పలుచోట్ల అధికార పార్టీ నేతలకూ చుక్కెదురైంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభల్లో అధికారులను జనం నిలదీశారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో అధికార పార్టీనేతలకే చుక్కెదురైంది. పలమనేరులో టీడీపీ నేతలకు సూచించిన వారికే రేషన్ కార్డులు ఇస్తున్నారంటూ మహిళలు అధికారులను నిలదీశారు. పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్యనే ఘర్షణ చోటుచేసుకుంది. నగరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జన్మభూమి కమిటీ సభ్యుడే అధికారులను నిలదీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాసారంలో శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడును స్థానికులను అడ్డుకున్నారు. పట్టణంలోని రెండో వార్డులో టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ పేటరాధారెడ్డిపై స్థానికులు తిరగబడ్డారు. పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలోని క్రిష్ణాపురంలో రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఎన్.అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణంలోని ఒకటో వార్డులో వేదికపై జన్మభూమి కమిటీ సభ్యులను కూర్చొపెట్టడంతో వివాదం జరిగింది. ఈవిషయంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు చెప్పినవారికే రేషన్‌కార్డులు ఇచ్చారంటూ మహిళలు అధికారులను అడ్డుకున్నారు. సత్యవేడు నియోజకవర్గం టీపీ కోటలో అధికారులను జనం అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. పుంగనూరు మున్సిపాలిటీ 24వ వార్డులో వైస్‌చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్ ఇబ్రహీం, పింఛన్లు, రుణాలు మంజూరు కాలేదని టీడీపీ పట్టణాధ్యక్షుడు ఖలీల్‌తో వాగ్వాదానికి దిగారు. కమిషనర్ కేఎల్వర్మ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.తిరుపతి పెద్దకాపువీధిలో జన్మభూమి వేదికపై ఉన్న ఎమ్మెల్యే సుగుణమ్మ, మున్సిపల్ అధికారులకు స్థానిక మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. చిత్తూరు మండలంలో కుర్చివేడులో అధికారులను గ్రామంలోకి రానీవ్వకుండా 3 గంటల పాటు జనం అడ్డుకున్నారు. చివరకు సర్పంచ్ జోక్యంతో శాంతించారు. తంబళ్ళపల్లె నియోజకవర్గం కురబలకోట తెట్టు గ్రామంలో అంత్యోదయకార్డులు రద్దుచేశారని అధికారులపై జనం తిరగబడ్డారు. ఆర్ఎన్ తాండాలో రుణమాఫీ, పంట నష్టపరిహారం, మరుగుదొడ్ల బిల్లుల కోసం అధికారులను నిలదీశారు. నగరి నియోజకవర్గం విజయపురం మండల కేంద్రంలో అధికార పార్టీ కార్యకర్తలకు ఫించన్లు మంజూరు చేయడంపై వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతి ఎంపీడీవో దశరధరామయ్యను నిలదీశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని సొన్నేగానిపల్లె, ఎంకే పురంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో స్థానిక టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లెలో నిర్వహించిన సభలో టీడీపీకి చెందిన వూజీ ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ సవువేశంలో అధికారులను నిలదీశారు. ‘‘ఇప్పటికి రెండు జన్మభూముల్లో అర్జీలు ఇచ్చాం.. ఎక్కడ పరిష్కారం చూపారో నిరూపించండి’’ అని ప్రశ్నించారు. కేవీపల్లె మండలం జిల్లేళ్ల మందలో వైఎస్ఆర్సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు గుండ్లూరు జయరామచంద్రయ్య చేతి నుంచి టీడీపీ నాయకులు మైక్‌ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నాగవాండ్లపల్లెలో నిర్వహిం చిన సభలో జిల్లా కలెక్టర్ సిదార్థజైన్ పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినా ఇంతవరకు మంజూరు కాలేదని ప్రజలు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. మొదటి రోజు 219 ప్రాంతాల్లో జన్మభూమి చిత్తూరు (గిరింపేట): జిల్లాలోని 219 ప్రాంతాల్లో శనివారం ప్రారంభమైన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించామని జిల్లా కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 189 గ్రామ పంచాయతీలు, 30 వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజలకు పలు రకాల సంక్షేమ పథకాలు అందజేసి వారి సమస్యలను వినతిపత్రాల రూపంలో స్వీకరిస్తామని తెలిపారు. -
ఘనంగా ఎడు గంగమ్మల జాతర
-
ఆమె 'శ్రీ' ఉండాలంటారు... ఆయన వద్దంటారు
శ్రీకాళహస్తి పేరుకు మరో శ్రీ చేర్చాలనే విషయంపై వివాదం ప్రతిపాదిస్తున్నది ఒకరు.... తిరస్కరిస్తున్నది మరొకరు అభివృద్ధి కమిటీల నియామకాలపైనా అదే పరిస్థితి శ్రీకాళహస్తి : కైలాసగిరుల్లోని పరమేశ్వరుడి క్షేత్రం శ్రీకాళహస్తి పేరుకు ముందు మరో ‘శ్రీ’ని చేర్చాలనే విషయంపై చైర్మన్, ఈవో మధ్య వివాదం సాగుతోంది. ఈవో ప్రతిపాదస్తుంటే చైర్మన్ తిరస్కరిస్తున్నారు. వీరి మధ్య నడుస్తున్న ఈ వివాదం క్షేత్రానికి సంబంధించి ఇతర విషయాలపై పడుతోంది. ముక్కంటి క్షేత్రాన్ని మూడు మూగజీవులకు చిహ్నంగా శ్రీకాళహస్తిగా ఆది నుంచి పిలుస్తున్నారు. అయితే ఆలయూల పేర్లకు ముందు గౌరవార్థంగా శ్రీ ఉండాలని చెబుతున్న ఈవో భ్రవురాంబ శ్రీ శ్రీకాళహస్తిగా పేరు మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆమె గురువారం చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడికి పంపగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదేకోవలో ఆలయ అభివృద్ధి కోసం 15 కమిటీలను ఏర్పాటు చేసి వాటికి సభ్యులను నియమించేందుకు చైర్మన్ పంపిన ప్రతిపాదనను ఇదేరోజు ఈవో వెనక్కు పంపినట్లు సమాచారం. అన్ని ఆలయాలకు ముందు శ్రీ .. శ్రీ అనేది ఆలయాల గౌరవార్థం కోసం పెట్టుకునేది. అందువల్లే అన్ని ఆలయాల పేర్లకు ముందు శ్రీ వాడుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా శ్రీ వెంకటేశ్వరునిగా పిలుస్తున్నారు. ఇదే తరహాలో శ్రీ శ్రీకాళహస్తి దేవస్థానంగా పిలవాలని భావించాం. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అలాగే రాస్తున్నాను. - భ్రవురాంబ, ఆలయు ఈవో ఆది నుంచి ఉన్నదాన్ని మార్చడమెందుకు.. ఆది నుంచి శ్రీకాళహస్తి దేవస్థానంగానే పిలుస్తున్నాం. గౌరవార్థం అంటూ ఈవో కొత్తగా శ్రీ శ్రీకాళహస్తిగా పిలవాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరించాం. శ్రీకాళహస్తి దేవస్థానంగానే పిలుస్తాం. దీనిపై ఇతర చర్చలు అనవసరం. - పోతుగుంట గురవయ్యనాయుడు, ఆలయు చైర్మన్ ఇదీ ‘శ్రీ-కాళ-హస్తి’ప్రాశస్త్యం... శ్రీకాళహస్తి అనే పేరు మూడు మూగజీవుల భక్తి ఆరాధనల ఫలితంగా వచ్చింది. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. బ్రహ్మదేవుని శాపానికి గురై ఊర్ణనాభుడనే శిల్పి భూలోకాన సాలీడుగా జన్మించి మారేడు పత్రాల మధ్య జీవించేవాడు. శివుని మెడలోని కాళం శాపంతో దక్షిణ కైలాసాన అడవిలో జన్మించి బిల్వ వ ృక్షం కింద వెలసిన శివలింగాన్ని పూజించేది. హస్తి అనే శివకింకరుడు తాను చేసిన తప్పునకు ఫలితంగా శివుడి శాపంతో భూలోకంలో ఏనుగు గా జన్మించాడు. ఏనుగు కూడా సాలెపురుగు, కాళంతోపాటు బిల్వ వనంలోనే నివసిస్తూ అక్కడే ఉన్న శివలింగాన్నే కొలిచేవి. ఈ నేపథ్యంలోనే పాము చేసిన అలంకరణలను తొలగించి ఏనుగు తన తొండంతో సువర్ణముఖి నది నుంచి జలాన్ని తెచ్చి అభిషేకించేది. ఇందుకు కోపించిన కాళం ఒకనాడు శివలింగ సమీపాన వేచి ఉండి అభిషేకం చేస్తున్న గజరాజు తొండంలో చొరబడి కుంభస్థలంలో బాధ కలిగించింది. ఆ బాధ భరించలేక గజరాజు తన తలను బండకు మోదుకుని మరణించింది. గజరాజుతోపాటు కుంభస్థలం లోపల ఉన్న పాము కూడా మరణించింది. ఆ క్షణాన శివుడు ప్రత్యక్షమై వారికి పూర్వ జన్మ వృత్తాంతం తెలియజేశాడు. వారిని అనుగ్రహించి శివైక్యం చేశాడు. అప్పటి నుంచి దక్షిణ కైలాసమని పేరొం దిన ఈ క్షేత్రానికి శ్రీ-కాళ-హస్తి అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. -
శ్రీకాళహస్తి మధ్య స్తంభించిన రాకపోకలు
-
శ్రీకాళహస్తిలో భారీ వర్షం
శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని కాళంగి రిజర్వాయర్‌కు వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో.. గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. -
తిరుపతి, శ్రీకాళహస్తిలో భారీ వర్షం
చిత్తూరు : చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం రాత్రి నుంచి ఎడతేరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోవిందరాజు స్వామి ఆలయం రెండో సత్రంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే పలు నివాసాలలోకి వరద నీరు ప్రవేశించింది. తిరుమలలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో తిరుమాడ వీధులు జలమయమైనాయి. రెండో కనుమ రహదారిలో మరమ్మతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే శ్రీకాళహస్తిలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. శ్రీకాళహస్తిశ్వీర ఆలయంలోని వరద నీరు ప్రవేశించింది. జిల్లాలోని స్వర్ణముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. -
‘రాజ’సం రాదాయే!
బేస్‌మెంట్‌కే ఐదేళ్లు.. గోపుర నిర్మాణానికి ఇంకెన్నేళ్లో? నత్తనడకన రాజగోపుర నిర్మాణ పనులు శ్రీకాళహస్తికే వన్నెతెచ్చే రాజగోపుర నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునఃనిర్మాణ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడిచినా ఇంతవరకు బేస్మెంట్ కూడా సక్రమంగా పూర్తికాలేదు. ఇక గోపుర నిర్మాణం పూర్తయ్యేది ఎన్నాళ్లకోనని భక్తులు నిట్టూర్చుతున్నారు. శ్రీకాళహస్తి : పరమశివున్ని దర్శించుకోవడానికి ముందు ఆరుగురిని దర్శించుకోవాలని పురాణాలు ఘోషిస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. శివున్ని దర్శించుకునే ముందు గోపురం, శిఖరం, ఆలయ ద్వారం, ప్రాకారం, బలిపీఠం, అర్చకుడిని దర్శించుకోవాలని సూచిస్తారు. దీనికి సంబంధించి గోపురే, శిఖరే, ద్వారే, ప్రాకారే, బలిపీఠకే, అర్చకే, మూలలింగేచ సప్తయితే శివదర్శనం అనే స్తోత్రాన్నీ వారు భక్తులకు వినిపిస్తుంటారు. అలాంటి గాలిగోపురం శ్రీకాళహస్తిలో కరువయ్యింది. దేవదేవుని చెంత గోపురంలేక పలువురు భక్తులు చింతిస్తున్నారు. తమకు మోక్షం కలగుతుందోలేదోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేస్‌మెంట్‌కే ఐదేళ్లు శ్రీకాళహస్తికే తలమానికంగా ఉన్న రాజగోపురం 2010 మే 26వ తేదీన కూప్ప కూలిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి మూడు నెలల తర్వాత ఆగస్టు 29వ తేదీన గాలిగోపురాన్ని తిరిగి నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు గోపుర నిర్మాణ పనులు పూర్తిచేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ గోపుర నిర్మాణ పనులు బేసిమెంట్కే పరమితమయ్యాయి. నత్తనడకన పనులు గోపురాన్ని నిర్మించేందుకు నవయుగ కన్స్ట్రక్షన్స్ ముందుకొచ్చింది. రూ.46 కోట్ల వ్యయంతో గోపుర నిర్మాణాన్ని 16 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కానీ నిర్మాణానికి స్థల సమస్యతోపాటు అనేక ఆటంకాలు ఎదురు కావడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
ప్రాణం పోయండి
‘ఎందుకో ఆ విధి నాపై పగబట్టింది.. ఏ మాయదారి రోగాన్నో అంటగట్టింది.. నిలబడనీయదు.. కూర్చోనీయదు.. వేళ్లు వంకర్లు పోతుంటాయి..మాట కూడా పడిపోతోంది.. నేను బతకలేకున్నా.. మమ్మీ..డాడీ.. ఈ బాధ భరించలేను.. మీ వేదన చూడలేను.. ఎలాగైనా నన్ను.. మామూలుదాన్ని చేయండి.. ప్లీజ్..’ ఇదీ రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి చెందిన అయిషాబాను తల్లిదండ్రులతో పలికిన పలుకులు... తరువాత మాట పోయింది. కాలం వెళ్లిపోతోంది. కానీ ఆ బాలిక ఆరోగ్యం మెరుగుపడలేదు.. బిడ్డకు ప్రాణం పోయడానికి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. శ్రీకాళహస్తి టౌన్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ఇమామ్వీధికి చెందిన షేక్‌గౌస్ బాషా, ఆఖ్తర్ బేగానికి అయిసాబాను, మీరాబాను కుమార్తెలు. షేక్గౌస్బాషా స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయిసాబాను(14) పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తొమ్మి దో తరగతి చదివేది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేది. సరిగ్గా రెండేళ్ల క్రితం పరీక్షలు రాసే సమయంలో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. అప్పటి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వైద్యం కోసం అప్పులు చేసి వేలకువేలు ఖర్చుపెట్టారు. అయినా ఫలితం లేదు. స్విమ్స్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని ఆస్పత్రులను చుట్టేశారు. రోగం నిర్థారణ అయ్యేసరికి రెండేళ్లు గడిచిపోయాయి. మెదడులో ప్రాణంతకమైన మెసల్స్ వైరస్ చేరి ప్రమాదస్థాయికి చేరిందని వైద్యులు తేల్చారు. ఈ వ్యాధికి బెంగళూరుకు సమీపంలోని హొసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ జాతీయ మానసిక ఆరోగ్య నాడీశాస్త్ర ఆస్పత్రిలో వైద్యం దొరుకుతుందని సూచించారు. గౌస్‌బాషా పలువురు స్థానికుల సహాయంతో వారిని ఫోన్లో సంప్రదించారు. రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు అవుతాయని, పాపను తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు. అంత డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో గౌస్‌బాషా తాత్కాలిక మందులతో కూతురు ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ‘వైద్యం కోసం ఇప్పటికే అప్పులు చేసి ఎన్నో లక్షలు ఖర్చుపెట్టాను. రెండు వారాలుగా వాడకపోవడంతో అయిషా పరిస్థితి విషమిస్తోంది. దాతలు సహకరిస్తే అయిషాబాను అందరిలా అవుతుంది. ఆదుకోవాలనుకునే వారు ఫోన్ నంబర్లు 9133595937, 9966595937, స్టేట్బ్యాండ్ ఆఫ్ ఇండియా 33933060147కు సంప్రదించాల’ని కోరాడు. -
రేకులు తొలగించి సెల్ ఫోన్స్ చోరీ
శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంసీ సెంటర్ వద్దనున్న శ్రీ లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజైస్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు పడ్డారు. దుకాణంపైనున్న రేకులు తొలగించి షాపులో ఉన్న రూ.87 వేల నగదు, రూ.లక్షా యాభై వేలు విలువ చేసే మొబైల్ ఫోన్లు తస్కరించారు. షాపు యజమాని సుధాకర్ గురువారం ఉదయం షాపు తెరిచి చూసే సరికి పైన రేకులు తొలగించి ఉన్నాయి. షాపులో దొంగలు పడిన విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. -
అగ్నిగుండ మహొత్సవంలో అపశ్రుతి
-
రెండు లారీలు ఢీ: ట్రాఫిక్‌కు అంతరాయం
చిత్తూరు(శ్రీకాళహస్తి): రెండు లారీలు ఢీకొనడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... చిత్తూరు నుంచి టమటా లోడ్‌తో వస్తున్న లారీని మరో లారీ ఢీకొంది. దీంతో లోడ్‌తో ఉన్న లారీ బోల్తా కొట్టడంతో బైపాస్‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. -
ఎస్బీ ఖాతాలో రూ.20కోట్ల శివయ్య సొమ్ము
- శ్రీకాళహస్తిలో అధికారుల నిర్వాకం శ్రీకాళహస్తి : సాధారణ అవసరాలు, ఉత్సవాల కోసం శ్రీకాళహస్తీశ్వరాలయ సొమ్మును రూ.2కోట్ల వరకు సేవింగ్స్ (ఎస్బీ)ఖాతాలో ఆలయాధికారులు ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువయితే బ్యాంకులో ఫిక్సె డ్ డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా రూ.20కోట్లను ఎస్బీ ఖాతాలో అధికారులు ఉంచేశారు. దాదాపు ఏడు నెలలుగా ఈ మొత్తానికి వడ్డీ లేకుండాపోయింది. భక్తులు ఆలయ హుండీల్లో వేసిన కానుకలు భద్రపరచి సద్వినియోగం చేయాల్సిన బాధ్యత అధికారులదే. అయితే శ్రీకాళహస్తీశ్వరాల యంలో భక్తులు హుండీల్లో వేసిన డబ్బుతో పాటు ఆలయంలో రాహుకేతు పూజలు, ఇతర అభిషేకాల ద్వారా వచ్చిన రూ.20కోట్లు బ్యాంక్‌లో ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఎస్బీ అకౌంట్లో జమచేశారు. ఏటా దేవాదాయశాఖకు జూన్ చివరికల్లా సుమారు రూ.10కోట్లు ఆలయం నుంచి చెల్లించాల్సి ఉంటుం ది. అయినా అదనంగా మరో రూ.10కోట్లు ఉంచుకోవాల్సిన అవసరమం ఏమిటనేది ప్రశ్న. గతంలో ఎన్నడూ ఈవోలు ఇలా ఇంత పెద్ద మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ చేయకుండా ఉంచిన సందర్భం లేదు. దేవాదాయశాఖకు చెల్లించడం కోసమే : ఈవో దేవాదాయశాఖకు ప్రతి ఏటా జూన్ చివరికల్లా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ఆదాయాన్ని బట్టి కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. గత ఏడాది రూ.10కోట్ల వరకు ఆలయానికి చెందిన డబ్బును దేవాదాయశాఖకు చెల్లించాం. ఈసారి ఆలయ ఆదాయం పెరగడంతో రూ.12కోట్ల వరకు చెల్లించాలి. ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే దేవాదాయశాఖకు వెంటనే చెల్లించాలంటే ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్ధేశంతో రూ.20కోట్లు ఎస్బీలో ఉంచాం. పుష్కరాల వల్ల చెల్లించలేకపోయాం. పుష్కరాలు తర్వాత చెల్లిస్తాం. అంతే తప్ప పైసా తిన్నా.. ఇబ్బందులు తప్పవు. - బి.రామిరెడ్డి,ఈవో -
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
చిత్తూరు (శ్రీకాళహస్తి) : కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తిలోని తుఫాన్ సెంటర్‌కు చెందిన అల్లూరుమ్మ(28)కు అదే ప్రాంతానికి చెందిన అంకయ్యకు రెండేళ్ల కిందట వివాహమైంది. అయితే వీరు తరుచూగా గొడవ పడుతూ ఉంటూరు. ఈ క్రమంలో శనివారం భార్యతో వాగ్వివాదానికి దిగిన అంకయ్య ఆమెను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నీళ్లలో మునిగి ఇద్దరు బాలురు మృత్యువాత
శ్రీకాళహస్తి (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లిలో శుక్రవారం ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కూనాటి కాళప్ప కుమారుడు తులసి(10), మోడుబోయిన వెంకటరత్నం కుమారుడు గురుప్రసాద్(9) స్థానిక పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత వారిద్దరూ కలసి వారి ఇళ్లకు సమీపంలో ఉండే చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ నీటితో నిండిన గుంతలో ఈతకొట్టేందుకు ప్రయత్నించి ఇద్దరూ జారి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు వెతుకుతూ రాగా విగతజీవులై నీళ్లపై తేలియాడుతూ కనిపించారు. -
శ్రీకాళహస్తిలో బీజేపీ కార్యకర్తలు అరెస్ట్
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 10 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒత్తిడే కారణమని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్, బీజేపీ నేత కోలా ఆనంద్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు శనివారం పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ చైర్మన్ ఆదేశాల మేరకు సిబ్బంది సదరు ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో ఆగ్రహించిన కోలా ఆనంద్ వర్గీయులు మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి....అద్దాలు పగలకొట్టారు. అక్కడే బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్లపై దాడి చేశారు. దాంతో మున్సిపల్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆదివారం 10 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
సోమవారం లాకర్లో పెడదామనుకుంటే...
శ్రీకాళహస్తి : ఓ వేడుక కోసం బ్యాంకు లాకర్ నుంచి బంగారు ఆభరణాలు తెచ్చుకున్నారు. అవి తిరిగి బ్యాంకు లాకర్‌ను చేరడానికి ఒక్కరోజు ముందు దొంగలు కొల్లగొట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ రోడ్డులో విశ్రాంత ఉపాధ్యాయుడు కరుణాకరన్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును దొంగలు ఎత్తుకుపోయారు. కరుణాకరన్ దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించుకుని లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనే ఉండే కరుణాకరన్ కుమార్తె ఇంట్లో ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. ఆ వేడుకలో పెట్టుకునేందుకు బ్యాంకు లాకర్ నుంచి ఆభరణాలు తెచ్చుకున్నారు. కార్యక్రమం పూర్తి కాగా, సోమవారం తిరిగి బ్యాంకు లాకర్లో పెడదామనుకున్నారు. ఇంతలోనే ఆ సొత్తంతా దొంగల పాలయ్యేసరికి కరుణాకరన్ దంపతులు లబోదిబోమంటున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. తిరుపతి నుంచి వేలిముద్రల నిపుణులను రప్పిస్తున్నారు. -
మార్కెట్లో చిరు వ్యాపారి ఆత్మహత్య
-
మున్సిపల్ చైర్మన్ వేధింపులతో మహిళ ఆత్మహత్య
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కూరగాయల మార్కెట్ లో విషాదం చోటుచేసుకుంది. వసంత అనే చిరువ్యాపారి ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, కమిషనర్ శ్రీరాం శర్మ వేధింపుల కారణంగానే వసంత ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వసంత ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వేధింపులు తాళలేక తన తల్లి ఆత్మహత్య చేసుకుందని వసంత కుమారుడు ఆరోపించాడు. -
సరైన వైద్యం అందక గర్భవతి మృతి
- ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ధర్నా శ్రీకాళహస్తి : వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భవతి మృతిచెందిందని బాధితులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెతో పాటు కడుపులోని ఇద్దరు మగశిశువుల ప్రాణంతీసిం దనీ, సకాలంలో సరైన వైద్యం అందకపోవడమే అందుకు కారణమయిందన్నారు. శ్రీకాళహస్తిలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు పట్టణంలోని కైలాసగిరి ప్రాంతానికి చెందిన సునీల్ భార్య సుధారాణి నిండు గర్భవతి. పట్టణంలోని నగరివీధిలో ఓ వైద్యురాలి వద్ద వారం వారం పరీక్షలు చేసుకుంటోంది. సోమవారం కడుపునొప్పిగా ఉండడంతో అదే ఆస్పత్రికి వెళ్లింది. వారు ఓ సూది మందు ఇచ్చి రెండు గంటల తర్వాత తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి సిఫారసు చేశారు. అక్కడికి వెళుతుండగా ఆమె మృతి చెందింది. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. తల్లి మృతదేహంతో పాటు కడుపులోని ఇద్దరు మగబిడ్డల శవాలను అప్పగించారు. వైద్యురాలు నిర్లక్ష్యం తోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాచేశారు. ఆస్పత్రిలోని వైద్యురాలిపై మండిపడ్డారు. వన్ టౌన్ సీఐ చిన్నగోవింద్ అక్కడికి సిబ్బందితో చేరుకుని వివాదాన్ని సద్దుమణిచారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని సీఐ తెలిపారు. -
శ్రీకాళహస్తిలో దర్శకరత్న ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి: మంచి కథ ఉన్న చిత్రాలు సైతం హిట్ కావడం లేదని దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చిత్రాలు తీయాలి... మంచి చిత్రాలు చూడాలని అటు దర్శకులకు... ఇటు ప్రేక్షకులకు సూచిస్తానని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం రాజకీయాలపై మాత్రం ఇప్పుడు స్పందించలేనని దాసరి తెలిపారు. అంతకుముందు దాసరి నారాయణరావు శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రత్యేక రాహు కేతు పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలోని గురుదక్షిణామూర్తి వద్ద ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతోపాటు స్వామి, అమ్మవార్లు చిత్రపటాలు అందజేశారు.తన భార్య దాసరి పద్మతో వచ్చి రాహు, కేతు నిర్వహించాలని భావించానని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని వెల్లడించారు.ఆ తర్వాత దేవాలయం వెలుపల విలేకర్లు అడిగిన ప్రశ్నలకు దాసరి నారాయణరావుపై విధంగా సమాధానం చెప్పారు. (శంకర్ సాక్షి టీవీ) -
చెరువులో క్లబ్‌కు భూమిపూజ
- శ్రీకాళహస్తిలోతెలుగుతమ్ముళ్ల అరాచకం - అధికారులూ చూసి వెళ్లిపోయారు శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లా ... మజాకానా ... చెరువులో క్లబ్ భవనాలకు దగ్గరుండి అక్రమంగా భూమిపూజ చేయించారు. అభ్యంతరం చెప్పిన రెవెన్యూ అధికారులను సైతం నిలదీసి మరీ ఆ కార్యం పూర్తికానిచ్చారు. మనోళ్లే ఎందుకు అడ్డుకుంటారని నిలదీయగానే అక్కడి నుంచి అధికారులు కూడా పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి పట్టణంలో సోమవారం ఈ అరాచకం చోటుచేసుకుంది. ఓ క్లబ్ కమిటీ సభ్యులు పట్టణంలోని అయ్యలనాడు చెరువులో భవనాలు నిర్మించడం కోసం భూమిపూజ చేయడానికి ఉపక్రమించారు. ఈ సమాచారం తహశీల్దార్ చంద్రమోహన్‌కు అందింది. సిబ్బందిలో వెళ్లి చెరువులో భవనాలు నిర్మించడానికి అనుమతి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే క్లబ్ సభ్యులు తమకు గతంలో భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించారని తెలిపారు. చెరువుల్లో స్థలాలు కేటాయించరని, ఆధారాలు ఉంటే చూపాలని తహశీల్దార్ ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో చెరువులో భవనాల కోసం భూమిపూజ చేయడానికి వీలులేదని...అడ్డుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అదే సమయానికి పట్టణానికి చెందిన ముఖ్యమైన టీడీపీ నాయకులు, మునిసిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనోళ్లే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అంటూ తహశీల్దార్‌ను టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో చేష్టలుడిగిన రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్లబ్ సభ్యులు కొందరు టీడీపీ నాయకుల సమక్షంలో ఎంచక్కా యథావిధిగా భూమిపూజ నిర్వహించారు. మంత్రిది ఓ దారి-ఆయన అనుచరులది మరో దారి.... ఇదేమి విడ్డూరమో ఓ వైపు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెరువుల్లో సెంటు భూమి ఆక్రమించినా రాళ్లతో తరిమికొట్టాలని పదేపదే చెబుతుంటారు. కానీ ఆయన ప్రథమ అనుచరులు దగ్గరుండి చెరువులో భవనాల నిర్మాణం కోసం భూమిపూజ చేయించడం విడ్డూరంగా ఉంది. పేదోడు చెరువులో గుడిసె వేస్తే వెంటనే వాటిని తొలగించడంతో పాటు.... కోర్టు జారీచేసిన ఆదేశాలను చూపే రెవెన్యూ అధికారులు తమ్ముళ్ల చేతిలో మాత్రం కీలుబొమ్మలవుతున్నారు. కళ్లముందే భూమిపూజ నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారులు మాయమైపోవడమే అందుకు నిదర్శనం. అబ్బే భూమిపూజ జరగలేదు..... అబ్బే చెరువులో భూమిపూజ జరగలేదు. చెరువులో క్లబ్ సభ్యులు భవనాలు నిర్మించడానికి వారికి అక్కడ సెంటుభూమి కూడా లేదు. మా సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నాం.దీంతో వారు వెళ్లిపోయారు.భూమిపూజ చేయలేదు. -చంద్రమోహన్,తహశీల్దార్. -
కాళహస్తిలో నటి శ్రీదేవి పూజలు
అలనాటి అందాల నటి శ్రీదేవి.. శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేయించారు. ఆమె తన స్నేహితురాలుతో కలిసి విచ్చేశారు. రూ.2500 టికెట్ ద్వారా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ అధవికారులు శ్రీదేవిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమెను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు. దాంతో శ్రీదేవి మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఫోటోలు తీయరాదంటూ అసహనం వ్యక్తం చేశారు. -
శ్రీకాళహస్తిలో భారీ అగ్ని ప్రమాదం
-
బొజ్జల అనుచరుడి 'సెల్ చల్'
చిత్తూరు: గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉందన్న అహంకారంతో ఎక్కడబడితే అక్కడ చెలరేగుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు రాంబాబు సోమవారం 'సెల్ చల్' చేశాడు. భక్తులందరూ బుద్ధిగా వరుసలో నిల్చుంటే రాంబాబు మాత్రం తన సెల్ ఫోన్ తో ఆలయం ఫోటోలు తీస్తూ హడావుడి చేశాడు. ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదానికి దిగాడు. రాంబాబు వైఖరితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పవిత్రస్థలంలో ఇవేం పనులంటూ భక్తులు తిట్టుకున్నారు. -
ఆది దంపతుల పురవిహారం
శ్రీకాళహస్తి: కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి శనివారం రాత్రి అశ్వవాహనంపై శ్రీకాళహస్తి పురవిహారం చేశారు. నూతన వధువైన జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కైలాసగిరి ప్రదక్షిణ సందర్భంగా ఉదయం వెళ్లిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు తిరిగి సాయంత్రానికి పట్టణ పొలిమేర్లకు వేంచేపుచేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీసంఖ్యలో ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత అశ్వవాహనంపై స్వామివారు అధిరోహించారు. సింహవాహనంపై అమ్మవారు ఆశీనులయ్యారు. విద్యుత్ దీపాల కాంతిలో వివిధ కళా బృందాల సమక్షంలో ఊరేగింపు వేడుకగా జరిగింది. భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని కర్పూరహారతులిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో రామిరెడ్డి దంపతులతో పాటు అధికారులు పాల్గొన్నారు. -
శివయ్య పెళ్లికొడుకాయనే!
శ్రీకాళహస్తి : ముక్కంటీశుని కల్యాణం సర్వజగత్తుకే పండుగ. స్వర్ణముఖి నది తీరంలో ఆకాశమే పందిరిగా భూదేవి పీటగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కల్యాణోత్సవం వారి ఆలయాల్లో నిర్వహిస్తారు. అయితే ఇక్కడ సోమస్కంధుడు పట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గజవాహనంపై వాయులింగేశ్వరుడు,సింహవాహనంపై జ్ఞానప్రసూనాంబ పెళ్లిమండపం వద్దకు గురువారం రాత్రి పయనమయ్యారు. అర్ధరాత్రి తర్వాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. వరుడుగా సర్వేశ్వరుడు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని విభూదీశుడైన వాయులింగేశ్వరుడు అద్భుతమైన బంగారు స్వర్ణాభరణాలను ధరిం చాడు. ముందుగా చండీకేశ్వరుడు, భృంగిరీటుడు, నికుంభధరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశురుని వెంట నిలిచారు. విభూదిని ఒకరు రాయగా, రుద్రాక్షమాలను మరొకరు అలంకరించగా, భిక్షపాత్ర ఒకరు, దివ్యాభరణాలను మరొకరు అలంకరించారు .పురాతనమైన అపురూప ఆభరణాలతో, పట్టువస్త్రాలతో, భారీ పూలమాలలతో, మంగళవాయిద్యాలతో పార్వతీ పరమేశ్వరులు పెళ్లిమండపానికి మందగమనంతో పయనమయ్యారు. ఉమాదేవి, సుబ్రమణ్యస్వామి సమేతుడైన సోమస్కంధమూర్తి గజవాహనంపై, జ్ఞానప్రసూనాంబ సింహవాహనంపై తేరువీధి నుంచి పెళ్లిమండపానికి బయలుదేరారు. ముందుగా గజవాహనంపై ఠీవిగా కూర్చున్న స్వామివారు రంగవల్లులు, మామిడితోరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులు, అరటిచెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణమండపానికి చేరుకోగా వాలుజడతో సిగ్గులొలకబోస్తూ ముందుకుసాగిన అమ్మవారు తేరువీధి దాటి నెహ్రువీధిలోకి ప్రవేశించి వాహనంతో సహా అక్కడే ఆగిపోయారు. వేదపండితులు పవిత్ర మంత్రోచ్ఛారణతో మండపం వద్ద పూజలను ప్రారంభించారు. హోమం వెలిగించి కలశాలను ప్రతిష్ఠించి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టారు. ఈవో రామిరెడ్డితో పాటు అధికారులు నాయకులు, అనధికారులు భక్తుల సమక్షంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. -
బాల్యవివాహాలు అడ్డుకున్న పోలీసులు
చిత్తూరు: శ్రీకాళహస్తిలో బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు బాలికల పెళ్లిని నిలిపివేశారు. వారికి సంబంధించిన పెద్దలను అదుపులోకి తీసుకున్నారు. శివపార్వతుల కళ్యాణోత్సవం సందర్బంగా ఇక్కడ బాల్యవివాహాలు జరగడం చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉదయం శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు కూడా కొందరు బాల్యవివాహాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి వివాహాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. -
శ్రీకాళహస్తి రథోత్సవంలో స్వల్ప తొక్కిసలాట
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి రథోత్సవంలో స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. బుధవారం ఉదయం స్వామి రథోత్సవం వైభవంగా ప్రారంభం కాగా... కొందరు భక్తులు రథం మధ్యలోకి ప్రవేశించి లాగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోగా, పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపు చేశారు. రథం మధ్యలో నుంచి లాగరాదని, అటు చివర, ఇటు చివర నుంచే లాగాలని మైకులో ప్రకటన కూడా చేశారు. దీంతో కొద్దిసేపట్లోనే పరిస్థితి చక్కబడింది. -
వాయులింగేశ్వరస్వామి రధోత్సవం
-
ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో తోపులాట
-
దేదీప్యమానం.. దక్షిణకైలాసం
శివరాత్రికి శ్రీకాళహస్తి ముస్తాబు సర్వాంగసుందరంగా శివాలయం జంగమయ్య సన్నిధిలో నేడు జనజాగరణ శ్రీకాళహస్తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆలయ ఈవో రామిరెడ్డి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులకోసం అదనంగా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టికెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. 1.5లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఈవో రామిరెడ్డి తెలిపారు. దర్శనం తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఉంటుందని తెలిపారు. లడ్డూ, వడతో పాటు భక్తులకు అవసరమైన జిలేబి, పులిహోర, పెద్దలడ్డు తదితర ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంగళవారం ప్రత్యేక దర్శనం కోసం భక్తులు రూ.100 టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. లింగోద్భవ దర్శనానికి ప్రత్యేక టికెట్లు లేకుండా రద్దుచేశారు. భక్తులకు సౌకర్యంగా క్యూలు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఈవో చెప్పారు. స్వామి, అమ్మవారిని సులభంగా దర్శించుకుని తిరిగి వెళ్లే విధంగా క్యూలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యూలోని భక్తులకు మంచినీటి సదుపాయంతోపాటు పాలు, మజ్జిగ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వీక్షించేందుకు పలుచోట్ల టీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది వేల మందికిపైగా అన్నప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ లఘు దర్శనమే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖమండపం(లఘుదర్శనం) నుంచే స్వామి,అమ్మవార్లను దర్శించుకుని వెళ్లేలా అధికారులు క్యూలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు గర్భాలయాన్ని ప్రదక్షిణ చేసే అవకాశం లేదు. వీఐపీలను ముఖమండపం తర్వాత అర్థమండపం నుంచి గతంలో స్వామి,అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉండేది. అయితే ఈ ఏడాది ముఖమండపం నుంచే భక్తులందరూ దర్శించుకునేలా క్యూలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవో రామిరెడ్డ్డి క్యూల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఏపీ సీడ్స్, స్వర్ణముఖినది వద్ద ఏర్పాట్లు జరిగాయి. ఆలయంలో తనిఖీలు డీఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో భద్రాతా ఏర్పాట్లు చేస్తున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను, లగేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆలయంలోకి వెళ్లే నాలుగు ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది హోంగార్డులతో పాటు పోలీసులు కూడా మెటల్ డిటెక్టర్ల వద్ద ఉంటున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద కూడా భక్తులను తనిఖీలు చేస్తున్నారు. ఆకర్షిస్తున్న శివుని కటౌట్ శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన పరమశివుని కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది. భిక్షాల గాలిగోపు రం వద్ద శివలింగం సాలెపురుగు, ఏనుగు, పాములతో కలిసి పరమశివుడు కూర్చుని ఉన్నట్లు చిత్రాన్ని తయా రుచేసిన చిత్రం ఆకట్టుకుంటోంది.సుపథమండపం, శివయ్యగోపురం, తిరుమంజనం,జ్ఞానాంబిక గోపురాలను విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. బెంగళూరునుంచి తెప్పించిన వివిధ రకాలపుష్పాలతో కలకత్తా బృందం ఆలయంలో అద్భుతంగా పుష్పాలంకారణ చేసింది. ధ్వజస్తంభాలు,గురుదక్షిణామూర్తి, వెంకటేశ్వరస్వామి,దుర్గాదేవి తదితర పరివార దేవతలను ప్రత్యేకంగా అలంకరించారు. -
దేవతలారా రండి..!
ముక్కోటి దేవతలకు ముక్కంటి ఆహ్వానం కాళహస్తి కైలాసగిరుల్లో కన్నప్ప సందడి కనుల పండువగా కన్నప్ప ధ్వజారోహణం నేడు స్వామివారి ధ్వజారోహణం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యూయి. మాఘ బహుళ అష్టమి గురువారం సాయంత్రం 4:30 గంటలకు కాళహస్తి కైలాసగిరుల్లో భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. కైలాసగిరిపైనున్న భక్త కన్నప్ప ఆలయం నుంచి అర్చకులు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారధ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దేవతలారా దిగిరావాలి.. దీవించాలి అంటూ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు. భక్తుడైన కన్నప్పకు ఉత్సవాల్లో ప్రథమపూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. ఈ కారణంగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున భక్త కన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించారు. దేవుడి ఉత్సవంలోను భక్తునికే తొలి పూజ గౌరవం దక్కింది. సాయంత్రం ముక్కంటీశుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేళాతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా కైలాసగిరిలోని భక్తకన్నప్ప ఆలయానికి తీసుకెళ్లారు. భక్తకన్నప్ప ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారుచేసిన పవిత్రదారాన్ని,వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. తర్వాత సంప్రదాయబద్ధంగా నైవేద్యం సమర్పించారు. దీపారాధన చేయడంతో ధ్వజారోహణం పూర్తయింది. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు,బాణసంచా పేలుళ్ల మధ్య ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఉరేగించారు. భక్తులు కర్పూరహారతులతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో బి.రామిరెడ్డి,ఏఈవో శ్రీనివాసులురెడ్డి,ఈఈ రామిరెడ్డి,పీఆర్వో హరిబాబుయాదవ్, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్,మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి,వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారధి, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు శాంతారామ్ జే పవార్, బీజేపీ నాయకులు కండ్రిగ ఉమ,కోలా ఆనంద్,టీడీపీ నాయకుడు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం,కంఠా ఉదయ్‌కుమార్,వైఎస్సార్సీపీ నాయకుడు తీగల భానుప్రకాష్రాయల్,ఉభయదాతలు, చెన్నైకి చెందిన కామవర్తి సాంబయ్య,సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు స్వామివారి ధ్వజారోహణం.. దేవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు, మాఘబహుళ నవమినాడు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామివారి ధ్వజారోహణం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయంలోని స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజారోహణం చేస్తారు. ఉదయం,సాయంత్రం వెండి అంబారీలపై స్వామి, అమ్మవారు ఊరేగుతారు.పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయనను మేల్కొలపడానికి దేవతలు చేసే ఉత్సవాన్నే ధ్వజారోహణం అంటారు.దీనినే దేవరాత్రి అని కూడా పిలుస్తారు. -
అపవిత్రం చేసిన అధికారి సస్పెన్షన్
పవిత్రమైన శ్రీకాళహస్తిలో పని చేస్తున్న ఉద్యోగే ఆలయం ప్రాంగణాన్ని అపవిత్రం చేశారు. త్రినేత్ర గెస్ట్ హౌస్ మేనేజర్ గణపతిరాజు విధి నిర్వహణలో ఉన్నపుడే మద్యం సేవించడమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. -
శ్రీకాళహస్తిలో మందుబాబు వీరంగం
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తిలోని గాంధీ రోడ్డులో మద్యం మత్తులో మంగళవారం ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ట్యూషన్ వెళుతున్న 14 ఏళ్ల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వెలికి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని భయంతో పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న స్థానికులు మందుబాబుకి దేహశుద్ధి చేశారు. తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.