
శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకాళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్‌కే గ్రూప్స్ అధినేత పద్మశ్రీ డాక్టర్ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment