
తిరుపతి,సాక్షి: తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా మరోసారి బట్టబయలైంది. గోశాలకు మరోసారి రమ్మని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నాని, సుధీర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తోక ముడిచారు.
ఫోన్‌లో భూమనను రమ్మనమని అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మీడియా ముందు డ్రామా ఆడి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు భూమన బయల్దేరగా.. ఇంటి వద్దే ఆయనను పోలీసులు నిర్భందించారు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు గోశాల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది.

ఎమ్మెల్యేల దారిలో పల్లా
మరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్ చేశారు. మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు సిద్ధమన్న భూమన. గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం. మీరు ఎక్కుడున్నారని పల్లాను భూమన ప్రశ్నించారు. ఈ క్రమంలో భూమన ఫోన్ కాల్‌ను పల్లా శ్రీనివాస్ కట్ చేశారు.