goshala
-
దేవాలయాల జోలికొస్తే ఊరుకోం.. చంద్రబాబుపై మల్లాది ఫైర్
సాక్షి,విజయవాడ : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దేవాలయాల జోలికి వస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మధురా నగర్లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలువ గట్టు వివి.నరసరాజు రోడ్డులో స్థానికులు చేపట్టిన దుర్గాదేవి ఆలయం నిర్మాణాలు తొలగించారు.తాజాగా,అదే ప్రాంతంలో శ్రీకృష్ణుడి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూల్చివేశారు. సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు.గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.‘గోశాలను కూల్చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం.సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.ఈ కూల్చివేతల బాధ్యత చంద్రబాబు,పవన్,దేవాదాయశాఖ మంత్రిదే,రాష్ట్రప్రభుత్వ శాఖలే దుర్మార్గంగా వ్యవహరించడం హిందూ ధర్మం,సనాతన ధర్మం పైన దాడిగానే పరిగణించాలి. గోవుల రక్షణ వైఎస్సార్సీపీ ధ్యేయం.కెనాల్ బండ్ ప్రొటెక్ట్ చేయాలని మేం ఆనాడే నిధులిచ్చాం.ఫెన్సింగ్ పనులు ప్రారంభించాం. బుల్డోజర్లతో ఇలా కూల్చివేతలకు పాల్పడటం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే. మరోసారి గుడుల జోలికి వస్తే ఊరుకోం.పుష్కరాల సమయంలో అనేక దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారు. ఆంజనేయ విగ్రహం మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడూ..ఈనాడూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి’ అని సూచించారు. -
ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌పై( ISKCON) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారామె. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. అనంతపూర్ ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారామె. #BJP MP and former minister #MenakaGandhi telling what #ISKCON is doing at #Gaushalas #Bhakts and @IskconInc should react on this.. pic.twitter.com/RdpLMBsZP1 — manishbpl (@manishbpl1) September 26, 2023 అయితే.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఇస్కాన్ ప్రతినిధి యుధిష్టిర్ గోవిందా దాస్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా అనే సంగతి తెలిసిందే. Response to the unsubstantiated and false statements of Smt Maneka Gandhi. ISKCON has been at the forefront of cow and bull protection and care not just in India but globally. The cows and bulls are served for their life not sold to butchers as alleged. pic.twitter.com/GRLAe5B2n6 — Yudhistir Govinda Das (@yudhistirGD) September 26, 2023 -
తిరుపతి ఎస్వీ గోశాలలో ‘సరోగసి’ దూడ జననం
తిరుపతి రూరల్: దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసి) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా టీటీడీ పరిధిలోని తిరుపతి ఎస్వీ గో సంరక్షణశాలలో మేలుజాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారని చెప్పారు. వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కోసం దాతలు ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చా రని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో 324 సాహివాల్ గోజాతి దూడల ఉత్పత్తి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సరోగసి పద్ధతిలో రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీన్లోభాగంగా పిండమార్పిడి చేసిన ఆవుల్లో ఇప్పటివరకు 11 గర్భం దాల్చినట్లు చెప్పారు. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్యదూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరో పది సాహివాల్ దూడలు జన్మించనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్సునీల్రెడ్డి, గో సంరక్షణశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ వీరబ్రహ్మయ్య, వెంకట్‌నాయుడు పాల్గొన్నారు. -
శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద గోశాలలో జరిగిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం పాల్గొన్న సంగతి తెలిసిందే. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
సీఎం జగన్‌ను కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
-
అమ్మకు వందనం.. పాతికేళ్లుగా గో సేవ.. పాలు పితకరు, అమ్మరు!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంటున్న ఎనభై ఏళ్ల బదాంబాయికి మూగజీవాలంటే ప్రేమ. పాతికేళ్ళ క్రితం గోశాల ఏర్పాటు చేసిన ఆమె, నేటికీ గో సంరక్షణ కోసం పాటుపడుతుంటుంది. గోవులపై ఆమెకున్న ప్రేమకు కుటుంబం కూడా మద్దతుగా ఉంటుంది. శక్తి ఉన్నన్ని రోజులు గో సేవ చేస్తానని చెబుతున్న ఆమెను అందరూ గోవుల అమ్మగా కీర్తిస్తుంటారు. మదన్‌లాల్, బదాంబాయి దంపతులు తమ వైవాహిక జీవితం మొదలుపెట్టిన నాటి నుంచే ఆవు కనబడితే చాలు దండం పెట్టుకునేవారట. ఈ విషయం గురించి బదాంబాయిని అడిగితే ప్రతీ రోజూ ఉదయం క్రమం తప్పకుండా గో పూజ చేసేదాన్నని, ఆ భక్తి, ప్రేమ ఏళ్లు గడిచినకొద్దీ పెరిగిందే కానీ తగ్గలేదని చెబుతుంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో రాణించాడు మదన్‌లాల్. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వారూ జీవితాల్లో స్థిరపడుతున్నారు. ఆ సమయంలోనే గోశాల పెట్టాలన్న ఆలోచనను భర్తకు వివరించింది బదాంబాయి. అందుకోసం స్థలాన్వేషణ చేశారు. 1996లో 44వ నంబరు జాతీయ రహదారిపై జంగంపల్లి వద్ద స్థలాన్ని కొనుగోలు చేశాడు. ‘శ్రీ కుమార్ పాల్ జీవ్ దయా ట్రస్ట్’ను ఏర్పాటు చేసి అదే సంవత్సరం 21 ఆవులతో గోశాల మొదలుపెట్టారు బదాంబాయి దంపతులు. వాటి సంరక్షణకు పనివాళ్లను నియమించారు. బదాంబాయి రోజూ ఉదయం 9 గంటలకు టిఫిన్‌బాక్స్ పట్టుకొని గోశాలకు చేరుకునేది. అక్కడే సాయంత్రం వరకు గోవులను చూసుకుని తిరిగి ఇంటికి చేరుకునేది. మదన్‌లాల్, ఆయన కొడుకులు కూడా వ్యాపారంలో బిజీగా ఉన్నా ప్రతీ ఆదివారం గోశాలకు వచ్చేవారు. పాతికేళ్ల అనుబంధం... ఎవరైనా ఆవులు అమ్మడానికి తీసుకువెళుతున్నారంటే చాలు వాటిని బాదంబాయి కొనుగోలు చేస్తుంటుంది. అలాగే దేవాలయాల వద్ద ఆవులను పెంచడం భారంగా భావించి ఈ గోశాలకు తీసుకు వస్తుంటారు. ఇప్పుడు గోశాలలో ఆవులు, లేగల సంఖ్య 158కి చేరింది. ప్రతి రోజూ ఉదయమే బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్ లు ఆవులకు దాణా, కూరగాయలు, పండ్లు తీసుకువచ్చి వేస్తారు. ఆదివారం, సెలవు రోజుల్లో కొడుకులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లు కూడా గోశాలకు వచ్చి పనులు చేస్తుంటారు. అమావాస్య రోజున కుటుంబం అంతా గోశాలలోనే గడుపుతారు. అమ్మ వచ్చిందంటే చాలు ఆవులన్నీ ఆమెకు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. ఆమె వయసు పైబడటం, ఆరోగ్య దృష్ట్యా అమ్మకు ఇబ్బంది కలగగూడదన్న ఉద్దేశ్యంతో ఇటీవల అడ్డుగా ఇనుప జాలీలను ఏర్పాటు చేశారు. జాలీల నుంచి వాటికి బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తుంటుంది. శక్తి ఉన్నన్ని రోజులూ గోవులకు సేవ చేస్తానని, పిల్లలందరూ ఇదే పనిని భక్తిగా చేస్తుంటారని వివరిస్తుంది బదాంబాయి. అన్నీ తానై.. 2008లో బదాంబాయి భర్త మరణించాడు. అయినా, ఆమె గో సంరక్షణ మానుకోలేదు. 21 ఆవులతో మొదలైన వాటి సంఖ్య వందల్లోకి చేరింది. గడ్డివేయడం, గోశాల శుభ్రం చేయడం, బెల్లం, ఇతర బలవర్ధకమైన ఆహారాన్ని తినిపించడం ద్వారా ఆవులతో ఆమె అనుబంధం పెంచుకుంటూనే ఉంది. ప్రతి గోవు బాగోగులు దగ్గర ఉండి చూసుకోవడంలోనే ఆమె రోజు మొత్తం గడుపుతుంటుంది. పాలు పితకరు, అమ్మరు ఈ గోశాలలో ఆవుల పాలు పితకరు. ఎన్ని ఆవులు ఈనినా సరే పాలు లేగలకు వదిలేస్తారు. ఆవులను గానీ, లేగలను గానీ అమ్మడం అనే మాట ఉండదు. వయస్సు పైబడి చనిపోయే దాకా వాటి సంరక్షణ బదాంబాయి, ఆమె కుటుంబం చూసుకుంటూ ఉంటుంది. చనిపోయిన గోవులను అక్కడే ఒక పక్కన గొయ్యి తీసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆవు మూత్రాన్ని మాత్రం సేకరించి బాటిళ్లలో నింపి పెడతారు. ఎవరైనా గృహ ప్రవేశాలు, యాగాల సందర్భంగా ఆవు మూత్రం కావాలని వచ్చిన వారికి ఇస్తారు. ఆవు పేడ కూడా తీసుకువెళతారు. కాగా ఆవు పేడను ఒక చోట జమ చేసి ఏడాదికోసారి అమ్ముతారు. పేడ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను గోసేవా ట్రస్టుకే జమ చేస్తారు. ఆవులను మేపడం, గడ్డి కోసి వేయడం వంటి పనుల కోసం ఇప్పుడు నలుగురు పనివాళ్లను నియమించారు. వారికి వేతనాలతో పాటు దాణా కొనుగోలు కోసం నెలకు దాదాపు రూ.లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు బదాంబాయి కొడుకులు. నాలుగెకరాల్లో గడ్డి పెంపకం.... ఆవుల కోసం గోశాలలో నాలుగు ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. ఒక వైపు గడ్డి విత్తనం వేసి మొలకెత్తగానే, మరో పక్కన విత్తనం వేస్తారు. ఈ విధానం వల్ల ఎప్పుడూ గడ్డి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటారు. ఈ జాగ్రత్తతో పాటు ఎండుగడ్డినీ కొనుగోలు చేసి నిల్వ చేస్తారు. దాతలు కొందరు గడ్డిని అందిస్తారు. ఏటా ఎండు గడ్డి కోసం రూ.3.50 లక్షల వరకు ఖర్చు చేస్తామని బదాంబాయి కొడుకులు మహేందర్, మహిపాల్‌లు తెలిపారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి చదవండి: Venkampalli: వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ Rainwater Harvesting: చినుకు చినుకును ఒడిసి పట్టి.. ఆ నీటితోనే ఇంటి అవసరాలు సహా ఆవరణలో సపోటా, జామ.. ఇంకా -
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నాన్న వాటర్ వర్క్స్‌లో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్‌లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్‌తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్‌తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
మామయ్య చెప్పిన ఆ మాట మనసులో నాటుకుపోయింది: వైఎస్ భారతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వినూత్న ఆకృతిలో ఈ గోశాలను నిర్మించారు. తాజాగా సీఎం జగన్ సతీమణి భారతిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి.. గోశాలలో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్మాణం.. అదే విధంగా ఆమె వ్యక్తిగత విషయాల గురించి శిల్ప అడిగి తెలుసుకున్నారు. గోశాల నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని, తన చూపును తిప్పుకోలేకపోతున్నానని శిల్పారెడ్డి అన్నారు. నిర్మాణమంతా చాలా సంప్రదాయబద్దంగా కనిపిస్తోందని, ఇందుకు ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారని అడిగారు. ఇందుకు భారతి స్పందిస్తూ.. ‘గోశాలను ఏ విధంగా నిర్మించాలనే విషయంలో ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. అయితే నిర్మాణంలో ఎక్కువగా కృత్రిమ మెటీరియల్‌ను వాడొద్దని, వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండే వస్తువులను ఉపయోగించాలని’ మాత్రమే సూచించినట్లు తెలిపారు. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం గురించి మాట్లాడుతూ.. ‘బొప్పాయి మొక్కను మొదట కుండీలో పెంచి ఆ తర్వాత పెరట్లో నాటాము. అలాగే మొక్కజొన్నను కూడా కుండీలలో పెంచాము. ఇంకా ఇంట్లో వండుకునేందుకు వీలుగా పాలకూర, మెంతి కూర కూడా పెంచాము. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనేది తెలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని పేర్కొన్నారు. ఇంట్లోనే కొన్ని కూరగాయలు, ఆకు కూరలు పెంచుకోవడం, బయట ఫుడ్ తగ్గించి స్వయంగా వండుకొని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలమ’ని అన్నారు. ‘నా చిన్నతనంలో మా అమ్మ ఏం చేసేదంటే రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు, పాలు వేసి కలిపి పెట్టేది. పొద్దునకల్లా అది పెరుగన్నంగా మారేది. నాకు తెలిసి అమ్మ ఇప్పటికీ అదే చేస్తుంది. మా మామయ్య (దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి) చెట్లను పెంచేవారు. చాలామంది అది చూసి ఏదైనా పంట వేయకుండా ఇలా ఎందుకు చెట్లను పెంచుతున్నారని అడిగేవారు. ఆయన ఒక్కటే చెప్పేవారు.. ఇది భవిష్యత్తు కోసం నేను పెడుతున్న పెట్టుబడి అనేవాళ్లు. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది’ అని వైఎస్ భారతి చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాల కోసం కింది ఇంటర్వ్యూని చూడండి. -
ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
UP Assembly Election 2022: గోవులే గోసపడుతున్నాయ్!
యోగి ఆదిత్యనాథ్ గడచిన ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రశంసించే వారి సంగతి పక్కన పెడితే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆయన విధాన నిర్ణయాలను తప్పు పట్టే వారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రైతులు ఆయన ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెరకు రైతులు తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడుతుంటే, ప్రభుత్వ గోశాలలకు తరలించిన పశువులు ఎక్కడ పోతున్నాయని రైతులు నిలదీస్తున్నారు. వ్యవసాయానికి పనికిరాని పశువులను కబేళాలకు తరలిస్తున్నారంటూ యోగి ప్రభుత్వం వాటి సంరక్షణకు గోశాలలు ఏర్పాటు చేసింది. తమ వద్ద ఉండి వృద్ధాప్యంలోకి వచ్చిన పశువులను కబేళాలకు తరలించకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గోశాలలు రైతుల నమ్మకాన్ని కోల్పోయాయి. దానికి తోడు తమ పశువులను గోశాలకు అప్పగిస్తే ఒక్కోదానికి రూ.ఐదు వేలు చెల్లించాలి. ఇంతే కాదు అవసరమయ్యే దాణా ఖర్చు భరించాలి. యోగి సర్కార్ ఈ నిబంధన పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మీరట్ సమీపంలోని ఖతూలీ నియోజకవర్గం కేంద్రానికి సమీపంలో ఉన్న భైంసీ గోశాలలో రైతులు అప్పగించిన పశువులు కొద్ది రోజులకే బయటకు వదులుతున్నారు. ‘మా గ్రామం నుంచి గడచిన ఏడాది కాలంలో రమారమి 500 పశువులను అప్పగించాము. మూడు మాసాల తరువాత వెళ్లి చూస్తే 50 కూడా లేవు. మరి మిగిలినవి ఏమయ్యాయని గోశాల నిర్వాహకులను ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా... ప్రభుత్వమే వాటిని కబేళాలకు తరలిస్తోందా?’ అని భైంసీ రైతు బ్రిజ్‌పాల్ సింగ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము దాణాకు డబ్బులు ఇస్తున్నాము. అయినా వాటిని ఎందుకు కాపాడటం లేదు. ఇక గోశాల దేనికి మా దగ్గర డబ్బులు లాగటానికా’ అని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మీరట్, ముజఫర్‌నగర్ డివిజన్లలో పాతిక గోశాలలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో పశువులు రెండు మూడు మాసాలకే మాయమవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోశాల నుంచి బయటకు వచ్చిన పశువులు తమ పంట పొలాలను పాడు చేస్తున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. గడచిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన ఇక్కడి రైతాంగం ఇప్పుడు సమాజ్‌వాదీ–రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతు ఇస్తామని బహిరంగంగా చెబుతున్నారు. చదవండి: (UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!) ఫ్యాక్టరీలకు మేలు చేస్తున్న ప్రభుత్వ విధానాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చక్కెర రైతులు ఏకంగా ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో 2.60 లక్షల ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. ముజఫర్ నగర్, మీరట్, భాగ్‌పట్, దాద్రి ప్రాంతాల్లోకి చక్కెర మిల్లులు ఏటా 140 రోజుల పాటు చెరకు క్రషింగ్ చేస్తాయి. సగటున రోజుకు లక్ష టన్నులను ఈ ఫ్యాక్టరీలు క్రష్ చేస్తాయి. ‘ఫ్యాక్టరీల బాగు కోసమే మేము చెరకు పండిస్తున్నామన్నట్టుంది ప్రభుత్వం తీరు. మా బాగోగుల కంటే ఫ్యాక్టరీలకు మేలు చేయడంపైనే పాలకుల దృష్టి ఉంది. క్వింటాల్‌కు రూ. 350 నుంచి రూ.400 పెంచాలన్న మా డిమాండ్‌ను కేంద్రం, రాష్ట్రం రెండూ పట్టించుకోలేదు’ అని భాగ్‌పట్ కు చెందిన రైతు భీరంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాము ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నామని భీరంసింగ్ చెప్పారు. చెరకు పండించే ప్రాంతాల్లో రైతులు వరుస సమావేశాలు నిర్వహించుకుని బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలన్న తీర్మానాలు చేస్తున్నారు. ఎన్నికలొస్తేనే గుర్తుకొస్తామా! ‘మాకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీకి ఓట్లు వేశాము. ఇప్పుడే మా బాధలను వారు పట్టించుకోవడం లేదు. తీరా ఎన్నికలు వస్తే గానీ అమిత్ షాకు మేము గుర్తుకు రాలేదా? – దాద్రి ప్రాంతానికి చెందిన రైతు నాయకుడు కిషన్ గుజ్జర్ ఉద్యోగావకాశాలు లేక నిస్పృహలో యువత రైతులు మాత్రమే కాదు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. కొత్తగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కరోనా కారణంగా యూపీలో వందలాదిగా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 3.25 లక్షల మంది ఉపాధి అవకాశాలకు గండి పడింది. రైల్వే బోర్డు ఉద్యోగాలకు సంబంధించి బిహార్‌లో చెలరేగిన సెగ ఇప్పుడు యూపీకి పాకింది. ఉద్యోగాల కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేసుకున్న యువతకు కాల్ లెటర్లు రావడం లేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి తాము ఊహించలేదని మీరట్ నిరుద్యోగ యువజన సమితి నేత దిలీప్ భండారీ అన్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా వీధుల్లో తిరుగుతున్నారని, ప్రభుత్వానికి తగిన కార్యాచరణ లేకపోవడమే దీనికి కారణమని మండిపడ్డారు. పశ్చిమను ఫాలో అవుతారా? ప్రస్తుతం పశ్చిమలో ఉన్న పరిస్థితులు మొత్తం రాష్ట్రం ఫాలో అవుతుందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ‘కొన్నిసార్లు తీర్పు రాష్ట్రమంతటా ఒకేలా ఉంటుం ది. ఉదాహరణకు 2017 శాసనసభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు సాగడంతో ఓట్ల చీలిక కారణంగా బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఈసారి ఓట్ల చీలిక లేకపోతే పోటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండవచ్చు’ అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీ (సీఎస్డీఎస్) ప్రతినిధి ప్రభాత్ కుమార్ అన్నారు. ముస్లింలలో ఓట్లు చీలకూడదనే పట్టుదల గడచిన ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)కి ఓట్లు వేసిన ముస్లింలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదన్న పట్టుదలతో ఉన్నారు. ‘మా గమ్యం ఏమిటో మాకు తెలిసి వచ్చింది. మేము ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో స్పష్టత వచ్చింది’ అని ఖతూలీకి చెందిన వ్యవసాయ పరికరాలు విక్రయించే వ్యాపారి న్నౌషద్ మోనీ చెప్పారు. ‘నేను గతంలో బహెన్జీ పార్టీ (బీఎస్పీ)లో ఉన్నాను. మా ఏకైక లక్ష్యం బీజేపీని ఓడించడమే. అందుకే నేను ఇప్పుడు ఎస్పీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నా’ అనిమోనీ అన్నారు. ‘నేను సైకిల్ గుర్తుకు ఓటేస్తా. నేనే కాదు నాకు తెలిసిన అందరూ ఈసారి గంపగుత్తగా సమాజ్‌వాదీ పార్టీకే ఓటు వేస్తారు. మా మీటింగుల్లో కూడా అదే చెపుతున్నారు’ అని.ముజఫర్‌నగర్ మార్కెట్లో రోడ్డు పక్కన పాత వస్త్రాలు విక్రయించే షాహీల్ తెలిపారు. ఇతర పార్టీల్లో ముస్లిం అభ్యర్థులు ఉన్నా సరే ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి ఓటు వేయాలంటూ ముస్లింలు నిర్ణయించుకున్నారని ముజఫర్‌నగర్ కేంద్రంగా పని చేస్తున్న అమర్ ఉజాల పత్రిక బ్యూరో చీఫ్ మదన్‌లాల్ బహియాన్ చెప్పారు. సెస్సు వేసినా... 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా యూపీ పగ్గాలు చేపట్టగానే గోసంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటైపోయింది. గోవుల ఆలనాపాలనా చూడటానికని చెప్పి... 2019లో టోల్ట్యాక్స్లపై 0.5 అదనపు సెస్ వేశారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల అమ్ముకునే పంట ఉత్పత్తులపై మండీ ట్యాక్స్‌ను 1 నుంచి 2 శాతానికి పెంచారు. గోశాళల నిర్మాణానికి 2019–20వ బడ్జెట్లో ఏకంగా రూ.447 కోట్లను కేటాయించింది యోగి ప్రభుత్వం. ఆలనాపాలన లేకుండా రహదారులపై తిరిగే ఆవులు, ఎద్దులు, గేదెలను ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంచి పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి విఫలమైంది. సంరక్షణ కేంద్రాల నుంచి తప్పించుకొని ఈ పశువులు రైతుల పొలాలపై పడి సర్వనాశనం చేయడం ప్రారంభించాయి. దాంతో అన్నదాతల ఆగ్రహం రెట్టిపైంది. దానికి తోడు జాతీయ రహదారులపై వీటి మూలంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మరోవైపు నడుస్తున్న కొన్ని గోశాలల్లోనూ పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. పిడుగుపాటుకు, వర్షాలకు బక్కచిక్కిన మూగజీవాలు చనిపోవడం ప్రజాగ్రహాన్ని పెంచుతోంది. -కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి మీరట్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు -
గోశాలను సందర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోశాలను సోమవారం సందర్శించారు. ఈ గోశాలలో ఆరు రకాల దేశీ ఆవులు.. కపిల, గిర్, పుంగనూరు, కాంక్రిజ్, తార్ పార్కర్, సాయివాలా ఉన్నాయి. గోశాలను వెదురు, రాయి మాత్రమే వాడి పర్యావరణహితంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: (11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు) -
హెర్బల్ మిక్చర్‌తో పశువులకు పుష్టి!
సృష్టిలో ఏ ప్రాణికైనా ఆరోగ్యం, దేహదారుఢ్యం ప్రధానంగా 5 క్రియలపై ఆధారపడి ఉంటుంది. అవి: 1. ఉచ్ఛ్వాస 2. నిశ్చ్వాస 3. సేవనం 4.పచనం 5. విసర్జనం. పశువులలో ఈ 5 క్రియలను దృష్టిలో పెట్టుకొని కొన్ని దినుసులతో ఈ రోజు మనం అమృత తుల్యమైన హెర్బల్ మిక్చర్‌ను తయారు చేసుకుందాం. మినరల్ మిక్చర్, కాల్షియంలకు బదులుగా ఈ హెర్బల్ మిక్చర్ ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ మిక్చర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్ని తిన్న పశువులు ఎండు/పచ్చి గడ్డి ఎక్కువ తింటాయి. కాబట్టి, ఆ మేరకు దాణాను తగ్గించుకోవచ్చు. గోసంరక్షణ శాలలకు దానాలు ఇచ్చే వారు ఈ హెర్బల్ మిక్చర్‌ను స్వయంగా తయారు చేయించి దానం చేస్తే మేలు జరుగుతుంది. హెర్బల్ మిక్చర్‌కు కావలసిన దినుసులు 1. సొంఠి – 200 గ్రా.: దీన్ని ఆయుర్వేదంలో మహా ఔషధంగా పిలుస్తారు. వాత, పిత్త, కఫ దోషాలను సమతూకం చేయగలదు. ప్రధానంగా ఆమ వాత రోగాన్ని నిర్మూలిస్తుంది. 2. మిరియాలు – 150 గ్రా. : మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా కలిగి ఉండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. 3. పిప్పళ్లు – 50 గ్రా. : దీన్ని రసాయన గుణకారిణి అంటారు. అరుగుదలకు బాగా ఉపయోగపడటమే కాకుండా గర్భాశయ శుద్ధికి దోహదపడుతుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. 4. వాములయు మిరియాలు – 50 గ్రా.: దీన్నే వాయు విడంగాలు అని కూడా పిలుస్తారు. జీర్ణవ్యవస్థలో ఉండే పలు రకాల రుగ్మతలను తొలగించడంతో పాటు మంచి డీవార్మింగ్ దినుసుగా ఉపయోగపడుతుంది. 5. తోక మిరియాలు – 50 గ్రా. : వీటిని చలువ మిరియాలు అంటారు. శరీరానికి చలువ చేస్తూ గుండె రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు నాలుకపై రుచి గ్రంథుల వృద్ధికి, మూత్ర వ్యవస్థ శుద్ధికి చాలా ఉపయోగకారిణి. 6. వాము – 200 గ్రా.: మనుషులు వామును ఎక్కువగా జీర్ణాశయ సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ, పశువుల్లో పాల స్రావాన్ని మెరుగుపరిచే చను గ్రంథులకు శ్రీరామరక్షగా వాము ఉపయోగపడుతుంది. 7. పాల ఇంగువ – 100 గ్రా.: ఇది ఒక యాంటీ మైక్రోబియల్ దినుసు. సుఖ విరేచనకారి గాను, నరాల ఉత్తేజకారిణిగాను ఉపయోగ పడుతుంది. 8. వెల్లుల్లి – 300 గ్రా. : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే నానుడి ఉండనే ఉంది. వెల్లుల్లి కూడా అంతే. ఇది ప్రధానంగా పరాన్న భుక్కులను సమూలంగా నశింపజేస్తుంది. 9. మెంతులు – 150 గ్రా.: మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన పశువులో పొదుగు వాపు దరిచేరనీయక పాల రుచిని బాగా పెంచుతుంది. 10. మోదుగుపువ్వు – 300 గ్రా.: శివునికి ఇష్టమైన పువ్వు. ఇవి కడుపులోని బద్దె పురుగుల నివారణకు, చర్మ వ్యాధుల వలన వచ్చే దురదలను అలాగే విషతుల్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి. 11. దాల్చిన చెక్క – 50 గ్రా.: ఇందులోని 41 సమ్మేళనాలు అనేక రుగ్మతలపై విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నివారిణిగా, మెదడుకు రక్షణ కారిణిగా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 12. నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు – 1.5 గ్రా.: జింక్, థయామిన్, ఐరన్, కాల్షియం, విటమిన్–ఇ సమృద్ధిగా ఉండటం వలన వీటిని ఆంగ్లంలో పవర్ హౌజ్ అని పిలుస్తారు. పశువులను ముఖ్యంగా యువి కిరణాల నుంచి నల్ల నువ్వులు రక్షిస్తాయి. నోటి పూతల నివారణకు ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు వేరు పిసర ఆకులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో దేనినైనా వాడుకోవచ్చు. 13. ఉలవలు 1.5 కిలోలు : వీటిలో పోషక విలువల అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విశేషంగా పనిచేస్తాయి. 14. తాటి బెల్లం – 1.5 కిలోలు : ఐరన్ అధికంగా ఉంటుంది. జీర్థాశయ ఎంజైముల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. పేగుల్లో ఉన్న విషతుల్యాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. 15. యాలకులు – 50 గ్రా. : యాలకులలో టర్పనైన్, లియోనెన్, టెర్ఫినోల్ లాంటి రసాయనాలు ఉన్నాయి. ఉదర సంబంధమైన అజీర్తి, మలబద్ధకాన్నే కాకుండా అల్సర్‌ను సైతం నివారిస్తాయి. 16. లవంగాలు – 100 గ్రా. : ఇవి రక్తాన్ని గడ్డకట్టడంలోనూ, నొప్పులు, వాపులు నియంత్రించడంలోనూ, రక్త ప్రసరణలోనూ, సంతాన ఉత్పత్తిలోనూ పశువులలో చక్కగా పనిచేస్తాయి. పైన ఉదహరించిన దినుసులను దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఆవ నూనె (750 ఎం.ఎల్. నుంచి ఒక లీటరు వరకు) కలుపుకొని తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. వాడే విధానం : పెద్ద పశువులకు రోజుకోసారి 50 గ్రా. మోతాదులో, దూడలకు రెండు నెలలు దాటిన దగ్గర నుంచి 5–20 గ్రాముల మోతాదులో తినిపించాలి. ప్రతి రోజూ అక్కర్లేదు. వరుసగా నెలకు 10–15 రోజులకు తగ్గకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంతో పశువులను అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా దుకాణాల్లో దొరికే మినరల్ మిక్చర్, కాల్షియం వాడకంతో పని లేకుండా అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. పైన చెప్పిన మోతాదులో తయారుచేసుకున్న హెర్బల్ మిక్చర్ 10 పెద్ద పశువులకు, 5 దూడలకు (10 రోజులు) సరిపోతుంది. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు,పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా, ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు, డా.వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార గ్రహీత. -
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్
సాక్షి, పటాన్చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్పూర్ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్పూర్ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. -
‘ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగం’
బెంగుళూరు: ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగమని, అలాంటి ఆవులను చంపడం నేరమని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ తెలిపారు. చిక్కబల్లాపూర్లో గోశాల ప్రారంభత్సంలో సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోసంరక్షణ, గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. వ్యాధి కారకాలను ఆవు నిరోదిస్తుందని ఇది వరకే రుజువు అయిన విషయాన్ని సుధాకర్ గుర్తు చేశారు. గోవద నిషేద చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్దంగా ఉన్నారని తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి తగ్గగానే ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, గోవద నిషేద చట్టానన్న అమలు చేస్తున్న గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలకు వెళ్లి గోవద నిషేద చట్టాన్ని అధ్యయనం చేస్తామని పశుశాఖ అధికారులు తెలిపారు. అయితే బీజేపీ గోవద నిషేద చట్టాన్ని 2018అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తమ మేనిఫెస్టేలో చేర్చిన విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం -
గోవుల మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, అమరావతి : గోశాలలో గోవుల మృతిపై విచారణకై డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. గోవుల మరణానికి కారకులను, అందుకు గల కారణాలను కనుగొనే దిశగా సిట్ విచారణ వేగవంతం చేయనుంది. కాగా విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో భారీ సంఖ్యంలో గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చదవండి : గోవుల మృత్యు ఘోష -
‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’
సాక్షి, విజయవాడ : గోశాలలో పెద్దసంఖ్యలో గోవులు మృతి చెందటం వెనుక కుట్రకోణం దాగి ఉందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కొత్తూరు తాడేపల్లిలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసింగ్, ఎమ్మెల్సీ మాధవ్ సోమవారం గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘పచ్చగడ్డిలో ఏదైనా కెమికల్స్ కలిశాయి అంటున్నారు. అలాగే జరిగింది అనుకుంటే ఒకటో, పదో ఆవులు చనిపోవచ్చు.. కానీ వంద ఆవులు ఎలా చనిపోతాయి’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని... ఇందుకు కారణమైన కుట్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గోవులపై విషప్రయోగం జరిగిందని తేలితే సహించేది లేదని తేల్చిచెప్పారు. గోమాతను ప్రేమిస్తాను కాబట్టే గోవుల మరణవార్త విని ఇక్కడికి వచ్చానన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ మాధవ్ స్పందిస్తూ.. గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందటంపై విచారం వ్యక్తం చేశారు. విషప్రయోగం జరిగింది కాబట్టే భారీ సంఖ్యలో గోవులు చనిపోయాయని ఆరోపించారు. గోవుల మృతిపై పోలీసులు, వెటర్నరీ, ఫోరెన్సిక్ అధికారులు సంయుక్తంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాంతి హోమం జరిపితే మంచిదని సూచించారు. కాగా గో సంరక్షణ ప్రాంతంలో అత్యంత ఖరీదైన సంపద దాగి ఉందని పేర్కొన్నారు. గోశాలలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చదవండి: గోవుల మృత్యు ఘోష -
గోవుల మృతిపై విచారణ జరిపిస్తాం : మోపిదేవి
సాక్షి, విజయవాడ : నగర శివారులోని కొత్తూరుతాడేపల్లి గోశాలలోని గోవుల మృతిపై శాఖపరంగా విచారణ జరిపిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో గోవులు మృతి చెందడం బాధాకరమన్నారు. విచారణ నివేదిక రాగానే గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని గోశాలల్లో ఉన్న గోవుల పరిస్థితిపై తనిఖీలు చేపడతామని చెప్పారు. గోవుల మృతి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా..? అని కూడా విచారిస్తామన్నారు. గోవుల మృతి బాధాకరం : మల్లాది విష్ణు గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందటం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కొత్తూరుతాడేపల్లి గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గోవుల మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఇక మీదట గోశాలలపై పశుసంవర్ధక శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా విజయవాడ నగర శివారులోని కొత్తూరుతాడేపల్లి గోశాలలో 100 గోవులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవుల మరణ మృదంగం కొనసాగుతోంది. గోవుల మృతి సంఖ్య 101కి చేరగా మరో 20 గోవుల పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం గోశాలకు వచ్చిన 22 టన్నుల పసుగ్రాసం మీదే నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషపూరితమైన లేత జున్నుగడ్డి తినటం వల్లే ఘోరం జరిగి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మృతి చెందిన పెద్ద గోవులకు పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే గోవుల మృతికి సరైన కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
విషాదం: తాడేపల్లి గోశాలలో 100 ఆవుల మృతి
సాక్షి, కృష్ణా: విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. శ్రావణ శుక్రవారం అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్‌మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. మరికొన్ని పశువులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్ పాయిజనింగ్ కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
విద్యార్థులను గెంటేసి.. స్కూల్ ను గోశాలగా మార్చారు
సాక్షి, హైదరాబాద్ : బడిలో చదువుకుంటున్న పేద పిల్లలను ఖాళీ చేయించి దాన్ని గోశాలగా మార్చేశారు నగరానికి చెందిన వీరాంజనేయ స్వామీ మందిర్ కమిటీ సభ్యులు. నివ్వెర పోయే ఈ సంఘటన ఉప్పుగూడలోని అరుంధతి కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. జనవరిలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలతను కలిసిన ఆలయ కమిటీ సభ్యులు, కొన్ని రోజుల కోసం పాఠశాలను గుడి అవసరాలకు వాడుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దాని కోసం కొన్ని రోజులు బడిని వేరే చోటికి బదిలీ చేయాల్సిందిగా సూచించారు. ఆలయ పనుల కోసం అడుగుతున్నారు కదా అని ప్రధానోపాధ్యాయురాలు పద్మ వారి వినతిని అంగీకరించారు. జనవరి 21న పాఠశాలను అరుంధతి కాలనీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేషా నగర్‌కు మార్చారు. పద్మలత వారికి నాలుగు నెలల గడువు ఇచ్చారు. ఆలోపు అన్ని పనులు పూర్తి చేసుకుని పాఠశాలను తిరిగి అప్పగించాల్సిందిగా ఆలయ కమిటీకి తెలిపారు. నాలుగు నెలల తర్వాత పాఠశాల గోశాలగా మారడాన్ని చూసి ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆశ్చర్యపోయారు. ఇదేంటని ఆలయ కమిటీని ప్రశ్నించగా ఈ స్థలం తమదేనంటూ ఆమెపై దూషణకు దిగారు కమిటీ సభ్యులు. ఏప్రిల్ 11న పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి ఆమె నిరసన తెలిపిన ఫలితం లేకుండా పోయింది. ఆలయ కమిటీకి చెందిన ఒక సభ్యుడు దీనిపై స్పందిస్తూ.. ఈ స్థలం ఆలయానికి సంబంధించిందని, ప్రభుత్వ అధికారులు పాఠశాల కోసం మమ్మల్ని సంప్రదించినప్పుడు కమిటీ హాలును వారికి ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఇదే విషయమై స్పందించిన ఎంఈఓ, ప్రస్తుత గోశాల ఉన్న స్థలం ప్రభుత్వానిదేనని, దానికి సంబంధించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. 1999 నుంచి ఇక్కడ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆలయ సమీపంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అనే బోర్డును కూడా పెట్టించారు. -
రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూత
– పేద రైతులకు ఉచితంగా 188 కోడెదూడల పంపిణీ – పీఠాధిపతి చేతుల మీదుగా వితరణ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి కృపతో రైతు శ్రేయస్సుకు శ్రీమఠం చేయూతనిస్తోందని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పేర్కొన్నారు. శ్రీమఠం గోశాలలో శుక్రవారం పేద రైతులకు ఉచితంగా కోడెదూడల వితరణ కార్యక్రమం చేపట్టారు. గోశాలలో పురుడోసుకున్న 188 కోడెదూడలను 94 మంది రైతులకు అందజేశారు. ముందుగా వాటికి పూజలు గావించి డిప్ పద్ధతిలో రైతులకు పంపిణీ చేశారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ కరువు పరిస్థితుల్లో సేద్యానికి ఎద్దులు లేక అల్లాడిపోతున్న రైతులకు అండగా శ్రీమఠం నిలుస్తుందన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధానంలో పెరిగిన పశువులను ఆరాధ్యంగా భావిస్తామని, వాటిని బాధించకుండా చూసుకోవాలన్నారు. అవసాన దశలో విక్రయించడం, కబేళాలకు తరలించడం చేయొద్దన్నారు. ఏదైనా పోషణ భారమనిపిస్తే తిరిగి గోశాలకు అప్పగించాలని సూచించారు. ఎలాంటి రాజకీయం జోక్యం లేకుండా పారదర్శకంగా కోడెదూడలు అందజేస్తున్నామన్నారు. రైతులు అంతే నమ్మకంతో పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పండలు పండి రైతులోకం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల రైతులకు కోడెదూడలు అందజేశారు. వితరణ స్వీకరించిన రైతులు శ్రీమఠానికి, స్వామిజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పండిత కేసరి రాజాఎస్ గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, గోశాల బాధ్యులు రఘుదేశాయ్, గుంజిపల్లి శ్రీనివాస పాల్గొన్నారు. -
మహానందిలో గోశాల ప్రారంభం
మహానంది: మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్‌కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్‌గౌడు, కార్పొరేటర్ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానంది అధికారులు, సిబ్బంది కోరిక మేరకు గోశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. గోశాల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో మహాలక్ష్మియాగాన్ని నిర్వహించారు. మహానంది క్షేత్రంలో గోశాలను నిర్మించడం శుభప్రదమని వేదపండితులు రవిశంకర అవధాని అన్నారు. -
మృత్యుఘోష
శ్రీమఠం గోపురంలో ప్రబలిన థ్రిప్స్ వ్యాధి – వారంలో 10 గోవుల మృత్యువాత – నిద్రావస్థలో శ్రీమఠం.. మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోశాలలో మృత్యుఘోష వినిపిస్తోంది. అనారోగ్యంతో రోజుకు రెండు గోవుల చొప్పున మృత్యువాత పడుతున్నాయి. థ్రిప్స్(దోమకాటుతో సోకిన మెదడువాపు వ్యాధి) కారణంగా పట్టిల్లా గోవులు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇన్నాళ్లు పశుగ్రాసం కరువై ప్రాణాలు కోల్పోయిన గోవులను తాజాగా థ్రిప్స్ హరించివేస్తోంది. ఇంత జరుగుతున్నా శ్రీమఠం అధికారుల్లో చలనం కరువైంది. గోవుల ప్రాణాలకు రక్షణ కరువు శ్రీమఠం నిర్వహణలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయంలో గోశాల ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 900 దాకా గోవులున్నాయి. వీటి సంరక్షణ నిమిత్తం దాదాపు 150 ఎకరాల్లో గడ్డి పెంపకం చేపట్టారు. అయితే సరైన వసతులు లేని కారణంగా గోవుల ప్రాణాలకు రక్షణ కరువైంది. నిలువ నీడ లేక ఆవులు ఎండకు ఎండి, వానకు తడిసిపోతున్నాయి. ముఖ్యంగా మైదానం సైతం వర్షపునీరు, గోమూత్ర, పేడతో అపరిశుభ్రంగా తయారైంది. గోశాల నిర్వహణకు ఏటా రూ.25–30 లక్షల దాకా విరాళాలు వస్తున్నాయి. అయినా సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన వ్యాధి తీవ్రత.. దోమకాటుతో గోవులకు తీవ్ర మెదడువాపు వ్యాధి (థ్రిప్స్) సోకింది. ఉన్నపాటున గోవులు తీవ్ర జ్వరం, మెదడువాపుతో ఎక్కడ పడితే అక్కడ కూలిబడుతున్నాయి. వారం రోజుల్లో దాదాపు 10 గోవులు మృత్యువాత పడ్డాయి. మూడురోజులుగా వ్యాధి తీవ్రత అధికమైంది. దాదాపు 100 ఆవులకు పైగా వ్యాధితో బాధపడుతున్నాయి. గోశాల సూపర్వైజర్ వైద్యులకు చూపించామని చెబుతున్నా దోమల నిర్మూలన కష్టంగా మారింది. ఖననంలో ఇష్టారాజ్యం : మృత్యువాత పడిన గోవులను పూడ్చిపెట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తుంగభద్ర నదీతీరంలో చనిపోయిన గోవులను గోతిలో పడేసి వస్తున్నారు. వాటి కళేబరాలను కుక్కులు పీక్కుతినడంతో నదీతీరంలో కలుషితమవుతోంది. గోశాల కెపాసిటీ 250 గోవులు మాత్రమే ఉండగా, సంఖ్య ఎక్కువగా ఉండడంతో సంరక్షణలో లోపాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇదే విషయాన్ని పశువైద్యాధికారులు చెప్పినా ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదు. చికిత్స చేయిస్తున్నాం దోమల బెడద కారణంగా గోవులు మృత్యువాత పడుతున్న విషయం వాస్తవమే. ప్రభుత్వ పశువైద్యులతో పరీక్షలు చేయించాం. థ్రిప్స్ వ్యాధితో గోవులు చనిపోతున్నాయని గుర్తించారు. ఎప్పటికప్పుడు చికిత్సలు చేసి మృత్యువాత పడకుండా చూస్తున్నాం. –శ్రీనివాస ఆచార్, సూపర్వైజర్ -
గోవులు... భారతీయుల సంపద
తిరుపతి : దేశీయ గోవుల జాతిని పరిరక్షించడానికి కృషితోపాటు గోవుల సంరక్షణ టీటీడీ ధ్యేయమని ఆ సంస్థ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకృష్ణ అష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో టీటీడీ ఛైర్మన్ చదలవాడ, ఈవో సాంబశివరావు గోపూజ చేశారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ... గోవులు... భారతీయుల సంపదగా అభివర్ణించారు. గోవులకు వ్యాధి నిరోధక ఔషధాలతో ప్రయోగాలు చేయిస్తున్నామని చెప్పారు.