మహానందిలో గోశాల ప్రారంభం
మహానందిలో గోశాల ప్రారంభం
Published Sat, Apr 29 2017 10:39 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
మహానంది: మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్‌కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్‌గౌడు, కార్పొరేటర్ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానంది అధికారులు, సిబ్బంది కోరిక మేరకు గోశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. గోశాల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో మహాలక్ష్మియాగాన్ని నిర్వహించారు. మహానంది క్షేత్రంలో గోశాలను నిర్మించడం శుభప్రదమని వేదపండితులు రవిశంకర అవధాని అన్నారు.
Advertisement
Advertisement