mahanandi
-
ఇహలోక అద్భుతం మహానంది
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన మహానంది ఒకటి. ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే! ఇక్కడ మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారూ కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంగానూ మారింది. ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలోంచి స్వయంభువుగా వెలిశాడు. శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం.. శైలధార, దివోదుని ధార, నరసింహధార, నంది తీర్థం, కైలాస తీర్థమనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతోంది.చిన్న గుండు సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం. మహానందీశ్వరస్వామి ఆలయానికి వస్తే.. గర్భగుడి చాళుక్యుల కాలంనాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పాకళా వైభవాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మహానందీశ్వరస్వామే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఓ నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత. వేసవిలో చల్లగా.. శీతకాలంలో వెచ్చగా.. మహానంది కోనేటి నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం. బోరుబావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధునాతన యంత్రపరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పీహెచ్ స్థాయి రాదు. అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పీహెచ్ స్థాయి 7.1 ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. శీతకాలంలో వెచ్చగా మారుతుంది. తెల్లవారుజామున చూస్తే కోనేరులు పొగలు గక్కుతున్నట్లు కనిపిస్తాయి. స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాలు ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేలాది ఎకరాలకు సాగునీరుగా.. మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకూ ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు. కోనేరుల్లోంచి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్లి తెలుగుగంగ కాలువలో కలుస్తోంది. మహానంది ఆలయ పరిధిలోని 53.41 ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది.ఓ అద్భుత దివ్యక్షేత్రంఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం. ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానమాచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివపురాణంలో వర్ణించారు. ఇక్కడ స్నానమాచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు శాస్త్రీయంగానూ నిరూపితమైంది. – బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానంది దేవస్థానం వేద పండితులు -
మహానందిలో చిరుతపులి కలకలం
-
మహానందిలో ప్రజలను భయపెడుతున్న చిరుత
-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
మహానంది: నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం తెల్లవారు జామున 1.20 గంటల ప్రాంతంలో మూడోసారి గోశాల ప్రాంగణంలో సంచరించింది. ఉదయం విధులకు హాజరైన ఏఈవో ఓంకారం వేంకటేశ్వరుడు సీసీ కెమెరాలు పరిశీలించగా గోశాల ముందు నుంచి కృష్ణనంది మార్గం వైపు చిరుతపులి వెళ్లిన దృశ్యం కనిపించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన డీఆర్వో హైమావతి, ఎఫ్‌బీవో ప్రతాప్‌లకు సమాచారం ఇచ్చారు. చిరుత భయంతో వణికిపోతున్న స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఆ చిరుతను బంధించాలని కోరుతున్నారు. -
అంబర్‌పేట ఎస్సైకి ‘మహానంది’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సాహితీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అంబర్‌పేట క్రైం విభాగం సబ్ ఇన్స్పెక్టర్ టి. రామచందర్ రాజుకు ‘మహానంది’ పురస్కారం వరించింది. ఇటీవల జాతీయ విశ్వకర్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ‘తెలుగు వెలుగు’ మహానంది జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో రామచందర్ రాజు పురస్కారం స్వీకరించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అవార్డును ప్రదానం చేశారు. తన విధి నిర్వహణతో ఎస్సై రాజు ‘తెలంగాణ సాహితీ రత్న’ వంటి బిరుదుతో పాటు ఇప్పటివరకు 200కు పైగా అవార్డులు అందుకున్నారు. -
ప్రకృతి అందాల ఖిల్లా.. నల్లమల
మహానంది/ ఆత్మకూరు రూరల్/ బండిఆత్మకూరు: దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. క్షేత్రానికి వచ్చిన భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతుంటారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడి చెంత ఉద్భవించిన స్వచ్ఛమైన గంగాజలంతో కూడిన కోనేరులు ప్రత్యేక ఆకర్షణ. అలాగే పరిసరాల్లోని నవనందుల్లో వినాయకనంది, గరుడనంది క్షేత్రాలతో పాటు సూర్యనంది క్షేత్రం ఉండటం మరో విశేషం. నంద్యాల–గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పురాతన దొరబావి వంతెన ఆకట్టుకుంటుంది. పచ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన ఎకో టూరిజం, నల్లమలలోని బైరేనీ స్వామి దగ్గరున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. రుద్రకోడు.. నల్లమల అడవుల్లో వెలసిన పురాతన శైవ క్షేత్రాల్లో రుద్రకోడు ఒకటి. రుద్రాణి సమేతంగా రుద్రకోటీశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. ఔషధీయుక్తమైన జలాలతో ఉన్న రుద్రగుండం కోనేరు విశిష్టమైనది. ఈ ఆలయంలో సీతారామస్వామి కూడా కొలువై ఉండడం విశేషం. నల్లకాల్వ గ్రామం నుంచి నల్లమల అడవుల్లో 12 కి.మీ. వెళ్తే ఈ క్షేత్రం చేరుకోవచ్చు. దారిలో గాలేరు ,ముసళ్లవాగు వంటి కొండవాగులను దాటి వెళ్లాల్సి ఉంటుంది. దారిలో డాక్టర్ వైఎస్సార్ బయోడైవర్సిటి పార్క్ ఉంది. ఇందులో సుమారు 600 వృక్ష జాతులు సహజసిద్ధంగా ఉండడం విశేషం. రుద్రకోడు వెళ్లేందుకు నల్లకాల్వ నుంచి ఆటోల సౌకర్యం ఉంటుంది. జంగిల్ క్యాంప్.. ►ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటి గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిందే నల్లమలై జంగిల్ క్యాంప్. ►నల్లమలై జంగిల్ క్యాంప్‌లో కాటేజ్‌లు, టెంట్లు విశ్రాంతి కోసం నిర్మించారు. ►బైర్లూటి నుంచి నాగలూటి మీదుగా పురాతన వీరభధ్ర స్వామి ఆలయం దర్శించుకుని తిరిగి క్యాంప్ చేరుకునేలా జంగిల్ సఫారీ ►ఇలాంటి క్యాంప్‌లు తుమ్మల బయలు, పచ్చర్లలో కూడా ఉన్నాయి. ►సమీపంలోనే శ్రీశైలానికి రెడ్డి రాజులు నిర్మించిన మెట్ల దారిని కూడా చూడవచ్చు. మహిమాన్వితం.. ఓంకార క్షేత్రం బండిఆత్మకూరుకు తూర్పు దిశన వెలసిన ఓంకార క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాన మంది భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడ ఉన్న పంచ బుగ్గల కోనేరులో స్నానం చేసి అమ్మవారు, ఓంకార సిద్ధేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ‘ఓం’ అనే శబ్దం వినిపిస్తుండేది.. అన్ని మంత్రాలకు బీజాక్షరమైన ఓం అనే ప్రవణాదం ఈ ప్రాంతంలో వినిపిస్తుండేది. దీంతో సిద్ధులు అనే మహర్షులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని ఓంకార సిద్ధేశ్వర స్వామిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్న కోనేరులో ఉన్న 5 బుగ్గలలో నుంచి నీరు వస్తుండేది. ఈ విధంగా పంచబుగ్గల కోనేరుగా పిలువబడింది. దొరబావి వంతెన.. రాష్ట్రంలో ఊగే రైలు వంతెన అంటే ముందుగా గుర్తొచ్చేది నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే మార్గంలో బొగద టన్నెల్ వద్ద కనిపించే వంతెన. చలమ, బొగద రైల్వేస్టేషన్ సమీపంలో భూ మట్టానికి సుమారు 276 అడుగుల ఎత్తులో బ్రిడ్జి నిర్మించారు. 1884లో మొదలుపెట్టి 1887 నాటికి పూర్తి చేశారు. 110 ఏళ్ల పాటు వాడిన ఈ వంతెనను బ్రాడ్‌గేజ్ సమయంలో తొలగించారు. బొగద సొరంగం సౌత్‌సెంట్రల్ రైల్వేజోన్‌లో ఎక్కువ పొడవైనదని, 1,565 మీటర్లు ఉంటుందని సమాచారం. వైఎస్సార్ స్మృతివనం.. వైఎస్సార్ స్మృతివనం ప్రాజెక్ట్ 22 ఎకరాల్లో రూ.14 కోట్లతో నిర్మించిన ఈ ఉద్యానం వైవిధ్యానికి ప్రతీక. సుమారు 550 ఫల,పుష్ఫ,తీగ,వృక్షజాతులు ఒకే చోట ఉండడం అద్భుతం. ♦20 అడుగుల పొడవైన వైఎస్ఆర్ విగ్రహం చూడ చక్కనైనది. ♦అందమైన కాలినడక మార్గాలు, వివిధ జాతుల వృక్షాలు వీక్షించవచ్చు. ♦వ్యూ టవర్ పై నుంచి నల్లమల అందాలు తిలకించవచ్చు ♦కొరియన్ కార్పెట్ గ్రాస్‌తో ల్యాండ్ స్కేప్ పరిమళ వనం, సీతాకోక చిలుకల వనం, పవిత్రవనం, నక్షత్ర వనం ప్రత్యేకం ఓంకార క్షేత్రం ఆకట్టుకునే జలపాతాలు.. నల్లమలలోని మోట, మూడాకుల గడ్డ, బైరేనీ, చలమ ప్రాంతాల్లో అద్భుతమైన జలపాతాలున్నాయి. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని గుండ్లబ్రహ్మేశ్వర ఆలయం వద్ద మూడు కోనేరులు ఉండగా ఎప్పటికీ నీరు తరగదు. బైరేనీ స్వామి కింద నుంచి వచ్చే అద్భుత నీటి ద్వారా నల్లమలలోని వన్యప్రాణులకు తాగునీరు లభిస్తుంది. మహానందిలోని రుద్రగుండం కోనేరు -
కోతికి దాహమేసింది.. తర్వాత ఏం జరిగింది?
ఎండల వల్లో, మరేమో కానీ ఈ వానరానికి దాహమేసింది. చుట్టుపక్కల నీళ్లు కన్పించలేదు. ఎదురుగా మాత్రం వాటర్ క్యాన్ ఉంది. దాన్ని కిందకు పడేసింది. అయినా నీరు అందకపోవడంతో చేతితో క్యాన్‌లోని నీటిని లాగి ఇలా దాహం తీర్చుకుంది. ఈ దృశ్యం కర్నూలు జిల్లా మహానందిలో ‘సాక్షి’ కెమెరా కంటపడింది. – మహానంది -
‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’
మహానంది: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న చందంగా ..ఓ పిల్లి కూన మహానందిలోని రామాలయం హుండీలోకి దూరింది. అందులో నుంచి బయటికి రాలేకపోయింది. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన అర్చకులు గుర్తించి విషయాన్ని ఈఓ మల్లికార్జున ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం హుండీల తాళాలు ఒకసెట్ దేవస్థానం వారి వద్ద, మరో సెట్ కర్నూలులోని ఏసీ కార్యాలయంలో ఉంటాయి. దీంతో ఈఓ విషయాన్ని ఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో దేవదాయశాఖ నంద్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలుకు వెళ్లి తాళాలు తీసుకొచ్చారు. అనంతరం ఈఓ సమక్షంలో సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో హుండీ తాళాలు తెరచి పిల్లిపిల్లను బయటికి తీశారు. బయటికి వచ్చి వెంటనే అది తల్లి వద్దకు పరుగుపెట్టుకుంటూ వెళ్లింది. చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం! -
బాగా చదువుకో.. వెళ్తున్నా !
సాక్షి, మహానంది (కర్నూలు): ‘బాగా చదువుకో.. ఆరోగ్యం జాగ్రత్త.. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి’ అంటూ బిడ్డకు మంచి మాటలు చెప్పి వెనుదిరిగిన ఆ తల్లి కాసేపటికే అనంతలోకాలకు చేరుకుంది. టైర్ పంక్చర్ కావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిన ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన మహానంది మండలం నందిపల్లె వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన నారాయణమ్మ, శ్రీను కుమార్తె లావణ్య పాణ్యం మండలం నెరవాడలోని గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కూతురిని చూసేందుకని ఉదయం బైక్‌పై వచ్చారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెనుదిరిగారు. మార్గంమధ్యలో నందిపల్లె సమీపంలోకి చేరుకోగానే బైకు టైరుకు మేకు గుచ్చుకుని పంక్చర్ అయింది. వెనుక కూర్చున్న నారాయణమ్మ ఒక్కసారిగా జారి కిందపడటంతో చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్, రోడ్ సేఫ్టీ సిబ్బంది రసూలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! అడ్డుగా ఉన్నాడనే కడతేర్చింది పట్నంబజారు(గుంటూరు): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలసి భర్తను కడతేర్చిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్ వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె. సుప్రజ, స్టేషన్ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉండే పి.కె.మరియదాసు (40) మార్చుల్ పని చేస్తాడు. అతడికి 22 ఏళ్ల కిందట మరియమ్మతో వివాహం జరగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కొడుకు సుధాకర్ మిర్చి యార్డులో పని చేస్తున్నాడు. కుమార్తె వేమూరులో ఉంటుండగా మరియమ్మ అక్కడకు వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో పెరవలి గ్రామానికి చెందిన గుంటూరు అనిల్‌బాబు అనే ఆటోడ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దికాలానికి విషయం తెలుసుకున్న భర్త మరియదాసు భార్య మరియమ్మను హెచ్చరించడం ప్రారంభించారు. నిత్యం మద్యం తాగి వేధిస్తుండటంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలసి పథకం వేసింది. (చదవండి: డబ్బుల కోసం వేధించి.. గొంతు నులిమి చంపేశాడు) వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుప్రజ, ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు ఈనెల 7వ తేదీ రాత్రి 1గంట సమయంలో కుమారుడు మిర్చి యార్డుకు పనికి వెళ్లిన తరువాత, అనిల్‌బాబు, మరియమ్మలు కలసి మరియదాసు గొంతుకు తాడును బలంగా బిగించి, రోకలి బండతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తర్వాత కుమారుడు సుధాకర్‌కు ఫోన్ చేసి తండ్రి మరియదాసు ఫూటుగా మద్యం తాగి ఎక్కడో పడి గాయపడ్డాడని చెప్పి అక్కడ నుంచి పరారయ్యారు. సుధాకర్ బంధువులకు సమాచారాన్ని అందించాడు. అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు కాంతారావు విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కాగా హత్య జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం రాజీవ్‌గాం«దీనగర్‌కు చెందిన వలంటీర్ ద్వారా ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు, రోకలిబండ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
శంకరప్పా.. శభాష్!
కర్నూలు, మహానంది: సాధారణంగా నోటితో పిల్లనగ్రోవితో పాటలు పాడుతుండడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన నాసికారంధ్రాలతో పిల్లనగ్రోవిని ఊదుతూ సంగీత స్వరాలను పలికిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బూరగమాడకు చెందిన శంకరప్ప మేకలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కర్ణాటకలో ఓ ఉత్సవానికి వెళ్లిన ఆయన పిల్లనగ్రోవిని కొనుక్కుని మేకలు కాసేందుకు వెళ్లినప్పుడు సరదాగా ఊదుతూ కొన్నేళ్లకు పాటలు పాడే స్థాయికి వెళ్లాడు. అయితే ఏదో ఒక కొత్తదనం ఉండాలన్న కాంక్షతో ముక్కురంధ్రాలతో ఊదడం ప్రాక్టీస్ చేశాడు. నోరు మూసుకుని ముక్కురంధ్రంతో పిల్లనగ్రోవిని ఊదుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మూడేళ్ల నుంచి ఇలా చేస్తున్నానని, ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి భక్తుల ముందు ప్రదర్శిస్తూ వారు ఇచ్చిన పదో ఇరవయ్యో తీసుకుంటూ ఉంటానని శంకరప్ప ‘సాక్షి’తో తెలిపారు. మహానందీశ్వర దర్శనానికి వచ్చిన తన ప్లూట్ ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు. -
బిల్లు చెల్లించమంటే చెవి కొరికాడు..
సాక్షి, మహానంది : హోటల్‌కు వచ్చాడు.. జొన్నరొట్టె.. చికెన్ తదితర వాటిని ఆర్డర్ చేశాడు.. కడుపునిండా తిన్నాడు.. బిల్లు చెల్లించమని అడిగితే మద్యం మత్తులో గొడవపడి హోటల్ నిర్వాహకుడి కుమారుడి చెవిని కొరికాడు.. ఈ ఘటన మండలంలోని గాజులపల్లెలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. రంగస్వామి, లక్ష్మి గాజులపల్లె మెట్ట వద్ద చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు మహేష్ హోటల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా పనిచేస్తున్నాడు. రొట్టె, పప్పు, చికెన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారి హోటల్‌కు అదే గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి వచ్చాడు. కడుపు నిండా తిని సుమారు రూ. 200 బిల్లు చేశాడు. తిన్నవాటికి డబ్బులు ఇవ్వాలని అడుగగా వారితో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శివదీక్షలో ఉన్న మహేష్ చెవిని శ్రీను కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 16 కుట్లు పడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. వారు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
నంద్యాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదు రోజులుగా నంద్యాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్, బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి. ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన ముంపు ప్రాంతాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం పర్యటించారు. మహానంది మండలం గాజులపల్లెలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స అన్నారు. మంత్రుల వెంట ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. -
వణుకుతున్న నంద్యాల
సాక్షి, నంద్యాల: నంద్యాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాలుగు రోజుల పాటు కురిసిన వరుణుడు తెరిపిస్తున్నట్లు కనిపించాడు. వరద తగ్గుముఖం పడుతుంది... పట్టణం, చుట్టు పక్కల గ్రామాల్లో చేరిన నీరు ఇప్పుడిప్పుడు బయటకు వెళ్లిపోతుంది.. అని ప్రజలు అనుకుంటున్న సమయంలో శుక్రవారం మరోసారి వరదనీరు నంద్యాల పట్టణాన్ని ముంచెత్తింది. ఐదు రోజులుగా నంద్యాలలో కురుస్తున్న వర్షాలకు తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. వరద నీటి చేరికతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్‌నగర్, గాంధీనగర్, బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్‌కాలనీ, విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్‌బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి. పెద్దకొట్టాల, దీబగుంట్ల గ్రామాల్లో వర్షపునీరు చేరి ఇళ్లు అని జలమయమయ్యాయి. దీంతో ఏ క్షణంలోనైనా వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసే అవకాశం ఉందని నది తీర గ్రామాలైన భీమవరం, చాపిరేవుల, పుసులూరు, గుంతనాల, తేళ్లపురి, కూలూరు, రాయపాడు ప్రజలకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరుణుడు శాంతించక పోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. వరద బాధితులు శిబిరాలకు తరలింపు పట్టణంలోని శ్యాంమకాల్వ, మద్దిలేరువాగు, కుందూనదిలకు భారీగా వరదనీరు వస్తుండటంతో వరదముంపు ఉన్న ప్రజలను పట్టణంలో ఏర్పాటు చేసిన ఏడు వరద బాధిత శిబిరాలకు తరలించారు. పక్కిర్‌పేట, హరిజనపేట, సాయిబాబానగర్, శ్యామకాల్వ వద్ద ఉన్న బాధితులను కేంద్రాలకు తరలించి భోజన సౌకర్యాలు, బస వసతి ఏర్పాటు చేశారు. పట్టణంలోని పక్కిర్‌పేట, సాయిబాబానగర్, దేవనగర్, శ్యామకాల్వ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వారిని అప్రమత్తం చేశారు. మహానంది ఆలయంలోకి మళ్లీ వరద నీరు ముఖమండపం వరకు చేరిన వరద నీరు మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలోని ముఖమండపం వరకు మళ్లీ వరద నీరు చేరింది. మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి ఆలయం బయట ఉన్న రెండు చిన్నకోనేరులు నీట మునిగాయి. నల్లమలలో సైతం భారీగా వర్షం కురవడంతో వరద నీరు రాజగోపురం నుంచి ముఖమండపం వరకు నీళ్లు ప్రవహించడంతో పాటు ఆలయంలోని రెండు చిన్న కోనేరులు కనిపించకుండా నీటితో నిండిపోయాయి. తెల్లవారు జామున 5.30 గంటల నిమిషాల నుంచి వర్షపునీరు ఆలయంలోకి చేరింది. వర్షం తగ్గడంతో ఉదయం పది గంటల నుంచి నీటి చేరిక తగ్గుముఖం పట్టింది. చదవండి : బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు -
వరదలతో అపార నష్టం
సాక్షి, కర్నూలు: నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వ, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడంతో రూ.వందల కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 17 మండలాల్లోని 95 గ్రామాల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు, అప్రమత్త చర్యల కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్లలేదు. లోతట్టు ప్రాంతాలు, వంకలు, వాగులు, చెరువుల్లో చిక్కుకున్న ప్రజలను తక్షణమే కాపాడడంతో పాటు వారిని సహాయక శిబిరాల్లో ఉంచి తగిన సేవలు అందించడంలో అధికార యంత్రాంగం సఫలమైంది. భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి పంపారు. నంద్యాల పట్టణంలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నకలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు భారీగా పంట నష్టం నంద్యాల డివిజన్లోని 15 మండలాల్లో 29,847 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరి 16,228 హెక్టార్లలో, పత్తి 5,195 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు వ్యవసాయ యంత్రాంగం తేల్చింది. పంటలకు దాదాపు రూ.70 కోట్ల మేర నష్టం జరగ్గా.. పెట్టుబడి రాయితీ కింద రూ.41.44 కోట్లు విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. ఉద్యాన పంటలకు సంభవించిన నష్టం రూ.55.14 కోట్లు ఉండగా..ఇన్పుట్ సబ్సిడీ రూ.3.02 కోట్లు విడుదల చేయాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. అలాగే రూ.5 లక్షల విలువ చేసే పశుసంపద మృత్యువాత పడింది. నందిపల్లి, తమ్మడపల్లి, బుక్కాపురం, తిమ్మాపురం, మసీదుపురం, ఎర్రగుంట్ల, యూళ్లూరు, గోవిందపల్లె గ్రామాల్లో పశుగ్రాసం పూర్తిగా నీట మునిగి పనికిరాకుండా పోయింది. వరద నీటి నుంచి బయట పడిన మహానంది ఆలయం 13,827 ఇళ్లలోకి వరద నీరు భారీ వర్షాలతో గ్రామాలు చెరువులను తలపించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గోస్పాడు, నంద్యాల, మహానంది మండలాలతో పాటు మిగిలిన 14 మండలాల్లో దాదాపు 13,827 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇందులో 417 ఇళ్లు దెబ్బతిన్నాయి. 95 గ్రామాల్లో వరద నీరు చేరినా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వంకలు, వాగులు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. అలాగే అధికారులు సకాలంలో స్పందించి వరదలో చిక్కుకున్న 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామాన్ని వీడని నీరు దెబ్బతిన్న రోడ్లు భారీ వర్షాలు, వరదల వల్ల నంద్యాల డివిజన్లోని 10 మండలాల్లో దాదాపు 59.13 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇదే శాఖ పరిధిలో 45 ప్రాంతాల్లో కల్వర్టులు సైతం దెబ్బతిన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా దాదాపు 638 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లకు నష్టం వాటిల్లింది. వీటి మరమ్మతులు, శాశ్వత నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మునిసిపాలిటీలకు భారీ నష్టం భారీ వర్షాలతో నంద్యాల, ఆళ్లగడ్డ మునిసిపాలిటీలకు భారీ నష్టం వాటిల్లింది. వాటి పరిధిలో మంచినీటి పైపులైన్లు, మురుగు కాల్వలు ధ్వంసం కావడంతో రూ.33.76 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే నంద్యాల డివిజన్లో విద్యుత్ శాఖకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. 152 విద్యుత్ స్తంభాలు, 25 ఎల్టీ లైన్లు, 500 సర్వీసులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అర్డబ్ల్యూఎస్ శాఖకు కూడా రూ.1.8 కోట్ల నష్టం వాటిల్లింది. ఆలూరులో పొంగిపొర్లుతున్న వాగు సహాయక చర్యలు భేష్ భారీ వర్షాల బారిన పడిన ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు పలువురి ప్రశంసలను అందుకున్నాయి. 45 క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు 24,730 మంది ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలను సమకూర్చింది. అక్కడక్కడ వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నాలుగు బోట్లు ఏర్పాటు చేశారు. 40 ఫైరింజన్లను నిత్యం అందుబాటులో ఉంచారు. సహాయక చర్యల కోసం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు 15 మెడికల్ క్యాంపులను నిర్వహించి.. రోగాల బారిన పడిన వారికి ఉచితంగా వైద్య పరీక్షలతోపాటు మందులను పంపిణీ చేశారు. చదవండి : నీళ్లల్లో మహానంది -
నీట మునిగిన గ్రామాలలో పర్యటించిన జేసీ
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది మండలంలో నీటమునిగిన గ్రామాలను మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే నీట మునిగిన గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గండిపడిన చెరువులకు మరమ్మత్తులు చేయడంతో పాటు, నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు నేడు, రేపు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వరదనీటితో నిండిపోయిన గ్రామాల్లో తక్షణ వైద్యసాయం అందించాలంటూ సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపట్టేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని, గ్రామ సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. -
‘మర్యాద రామన్న’తో గుర్తింపు
సాక్షి, మహానంది: మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సినీ నటుడు నాగినీడు తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం గురువారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటగా ప్రసాద్ ల్యాబ్స్‌లో వర్కర్‌గా పనిచేసేవాడినన్నారు. అక్కడ పనిచేస్తుండగా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనను గుర్తించి ఫిజిక్ బాగుందని మొదటగా చెన్నకేశవరెడ్డి చిత్రంలో అవకాశం ఇచ్చారన్నారు. అనంతరం వచ్చిన మర్యాద రామన్న చిత్రం తనకెంతో గుర్తింపు తెచ్చిందని చెప్పారు. చిత్రంలో రామినీడు పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం లభించిందన్నారు. ప్రస్తుతం వాల్మీకి, బందోబస్త్ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న మనిషి ఆకలి తీర్చడం ద్వారా లభించే ఫలితం అనంతమైనదని చెప్పారు. తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో మనోవికాస్ కేంద్రం పేరుతో విద్యార్థులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. తన కుమారుడి వైద్యసేవల నిమిత్తం నంద్యాల పట్టణానికి వచ్చినట్లు వివరించారు. -
పట్టాలెక్కని సౌకర్యాలు
సాక్షి, మహానంది(కర్నూలు) : నంద్యాల – గుంటూరు రైలు మార్గంలో గాజులపల్లె రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వసతులు కరువయ్యాయి. రైలు వచ్చే వరకు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఈ రైల్వేస్టేషన్‌కు సమీపంలో కేవలం 4 కి.మీ. దూరంలో మహానంది పుణ్యక్షేత్రం ఉండడంతో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. రోజుకు సుమారు 2 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ రైల్వే శాఖ అధికారులు రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి వెళ్లేందుకు సమీప గ్రామాల వారు అధిక సంఖ్యలో ఈ స్టేషన్ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. గాజులపల్లె స్టేషన్ నుంచి చలమ, పచ్చర్ల, కృష్ణంశెట్టిపల్లె, గిద్దలూరు తదితర స్టేషన్ల మీదుగా విజయవాడకు వెళ్లేందుకు సమీప గ్రామాల ప్రజలు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు మహానంది పుణ్యక్షేత్రం దగ్గరగా ఉండడంతో అటు విజయవాడ నుంచి, ఇటు గుంతకల్లు వైపు నుంచి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. కాని ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గతంలో డీఆర్ఎంగా ఆనంద్మాథూర్ విధులు నిర్వహించే సమయంలో సుమారు రూ.16 లక్షలతో షెడ్లు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కాని అవి నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో భక్తులు, ప్రయాణికులు మండుటెండల్లోనే రైళ్లకోసం వేచి చూడాల్సి వస్తోంది. మహానంది స్టేషన్‌గా పేరు మార్పు ఎప్పుడు? గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా పేరు మార్చాలని, దీని ద్వారా మహానంది పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని అధికారులు కొన్నేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహానంది దేవస్థానం ఈఓ సుబ్రమణ్యం, వేదపండితులు రవిశంకర అవధాని, అధికారులు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని కలిసి గాజులపల్లె రైల్వేస్టేషన్‌కు మహానంది స్టేషన్‌గా మార్పు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశంలో చర్చించడంతో పాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారని దేవస్థానం అధికారులకు తెలిపారు. ఈ సారైనా ఎంపీ చొరవతో మహానంది ఫుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా పేరు వస్తుందని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
మహానందిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
-
చూస్తే నిజం.. తాకితే డమ్మీ
జూబ్లీహిల్స్: గది నిండా తుపాకులు, మెషిన్గన్లు.. కుప్పలు తెప్పలుగా పడేసిన కత్తులు, కటార్లు, శిరస్త్రాణాలు.. ఇదేదో ఆయుధాల గోదాం కాదు.. కదనరంగం కోసం సిద్ధం చేసిన ఏర్పాట్లు అంతకంటే కాదు. అన్నీసినిమాల్లో వాడేందుకు సిద్ధం చేసిన డమ్మీఆయుధాలు. చిత్రాలకు ఎప్పటినుంచో సినీఆయుధాలు సరఫరా చేసే ‘శ్రీశైల మహానంది’ కార్యాలయంలోకి అడుగు పెడితే.. ఆయుధాల లోకంలోకి వెళ్లినట్టు ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాషూటింగ్లకు కావాల్సిన రకరకాల పరికరాలు సరఫరా చేసే ‘మహానంది’ యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో అందరికి సుపరిచితుడే. కర్నూలు జిల్లాకు చెందిన మహానంది దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఉపాధి కోసం నగరానికి వలస వచ్చాడు. సినీరంగంలో చిన్నాచితకా పనులు చేస్తూ క్రమంగా సినిమా షూటింగ్‌ల్లో వినియోగించే పలు రకాల వస్తువులను అందించే సప్లయర్‌గా నిలదొక్కుకున్నాడు. రెండు దశాబ్దాలుగా వందలాది సినిమాలకు ఆయన పలురకాల వస్తువులు సరఫరా చేస్తున్నాడు. అదరహో ‘బాహుబలి’ తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి’ అంటే ప్రేక్షకులకే కాదు.. సినీరంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్రేజ్. ఆ చిత్రంలో ఒక్క చిన్న వేషం వేసినా చాలనుకున్న నటులు చాలామందే ఉన్నారు. అలాంటి చిత్రానికి రెండు భాగాల్లో వాడిన కత్తులు, యుద్ధ సామగ్రిని మహానందే సరఫరా చేశాడు. ‘ఈ సినిమా కోసం వందలాది కత్తులు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించాం. తాజాగా చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’కి కావాల్సిన యుద్ధ సామగ్రిని సైతం మేమే సరఫరా చేస్తున్నాం’ అని గర్వంగా చెబుతాడు మహానంది. తాకితేనే తెలిసేది.. ‘డమ్మీ’ అని పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా కానిస్టేబుల్స్, హోంగార్డులకు డమ్మీ తుపాకులతో శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రారంభంలో నిజమైన తుపాకులతో శిక్షణ ఇస్తే ప్రమాదవశాత్తు పేలితే ప్రాణనష్టం. కాబట్టి ఈ ఏర్పాట్లు చేస్తారు. ఏ చిత్రం షూటింగ్లో పోలీసుల శిక్షణ ఉందంటే అందుకు అవసరమైన డమ్మీ తుపాకులను కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. చెక్క బరువుగా ఉంటే ఇబ్బందని.. తేలికైన బూరుగు చెక్కతో తుపాకులను రూపొందిస్తారు. వాటికి మధ్యలో ఇనుప ముక్కలు అమర్చి నిజమైన తుపాకుల్లా కనిపించేలా చేస్తారు. ఇక కత్తులనైతే పూర్తిగా రబ్బరుతో రూపొందించి రంగులు వేస్తారు. తాకితే అవి డమ్మీ అని చెప్పగలరు కానీ.. చూసినవాళ్లు మాత్రం అవి నిజమైనవే అని భ్రమపడతారు. వృత్తినే నమ్ముకున్నా.. ఈ నగరం నన్ను ఆదరించింది. రెండు దశాబ్దాలుగా సినిమాలకు అవసరమైన పరికరాలు సప్లయ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాను. ‘బాహుబలి’ సినిమాకు పనిచేయడం జీవితంలో మర్చిపోలేను. దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో కత్తులు తయారు చేయించారు. కొన్ని వందల సినిమాలకు రకరకాల పరికరాలు అందించాను. ఈ వృత్తి సంతృప్తికరంగా ఉంది. – శ్రీశైలం మహానంది -
మహానందిలో అపశ్రుతి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా మహానందిలో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన రత్నాలు(40) అనే మహిళ మహానందీశ్వరుని దర్శనానికి వచ్చి కోనేటిలో స్నానం చేస్తుండగా పిట్స్ రావడంతో ఆమె నీట మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
పట్టాలు తప్పిన రైలు ఇంజన్
సాక్షి, మహానంది : కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి రైల్వేస్టేషన్లో రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఆదివారం ఉదయం రైలు ఇంజన్‌ను ట్రాక్ మారుస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. ఇంజన్‌కు బోగీలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. జరిగిన ప్రమాదం ప్రధాన ట్రాక్‌పై కాకపోవడంతో రైళ్లు యధాతథంగా నడుస్తున్నాయి. -
ట్రావెల్స్ బస్సులో పొగలు..తప్పిన ప్రమాదం
సాక్షి, మహానంది : గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రయివేట్ బస్సు ఇంజన్ వెనుక మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకొంది. గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరబాద్‌కు బయలుదేరింది. ఈ బస్సులో గిద్దలూరు నుంచి హైదరబాద్‌కు సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్లమల ఘాట్‌లోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద ఆగి భోజనాలు చేసీ బయల్దేరారు. అనంతరం గాజులపల్లె సమీపంలోకి చేరగానే బస్సులోని ఎయిర్ కంప్రెషర్ వద్ద మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు వెంటనే గుర్తించి డ్రైవర్ శివ దృష్టికి తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఇంజన్ వెనక మంటలు వ్యాపించడంతో బస్సును గాజులపల్లె మెట్ట వద్ద నిలిపి మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. -
పేదల బతుకుల్లో అమావాస్య చీకట్లు
మహానంది: వెలుగుల పండుగ దీపావళి నాడు ఆ ఇళ్లలో చీకట్లు అలుముకున్నాయి. గురువారం ఉదయం గాజులపల్లె గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పేద కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద చింతల సుబ్రమణ్యం, బాలసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, సుబ్బరాయుడు, సుబ్రమణ్యం, నాగినేని వెంకటేశ్వర్లు, గద్వాల నాగేశు, జమ్ములమ్మ. సంజీవరాయుడు, సంజమ్మ, మల్లికార్జున, రంగనాయకులు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరంతా నిరుపేదలు. కొందరు చంద్రికలు అల్లుతూ జీవిస్తుండగా, మరి కొందరు కూలీకి వెళ్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో చింతల సుబ్రమణ్యం ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మొదట మంటలు చెలరేగాయి. వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగానే పక్కన ఉన్న వారి గుడిసెలు మంటలు ఎగిశాయి. పక్క పక్కనే గుడిసెలు ఉండటంతో పాటు మంటలు వ్యాపించడంతో ఇళ్లల్లోని వస్తువులు తీసుకోలేకపోయారు. సర్వం కోల్పోయిన బాధితులు ఆగ్ని ప్రమాదంలో బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కష్టపడి కూడిబెట్టిన నగదు, ఎంతో ప్రేమతో కొనుకొన్న చిన్న చిన్న బంగారు ఆభరణాలు, తినడానికి దాచుకున్న బియ్యం, బేడలు, టీవీలు, ఫ్యాన్లు, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. మల్లికార్జున ఇంట్లో రూ. 15వేల నగదుతో పాటు అన్ని వస్తువులు బూడిదయ్యాయి. అలాగే రూ. 50వేలు అప్పు తెచ్చి చీరల వ్యాపారం చేసే సంజమ్మ ఇంట్లో అన్ని కాలిపోయాయి. కుమార్తెకు కట్నం కింద బంగారు ఇచ్చేందుకు ఆరు మేకపోతులను అమ్మి రూ. 25వేలు దాచుకుని ఉంటే కాలిపోయాయని సంజీవరాయుడు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు కేరళలో ఉంటూ కష్టపడి బేల్దార్ పనిచేస్తూ కూడబెట్టిన రూ. 25వేల నగదు బూడిదయ్యాయని తమిమనేని రాములమ్మ, నాగేశ్వరరావు దంపతులు విలపించారు. కట్టుకున్న ఇంటి అప్పును తీర్చేందుకు పొదుపులో రూ. 20 వేలు రునం తీసుకున్నామని, కాలిపోయినట్లు లక్ష్మీనరసమ్మ వాపోయింది. ఈ సంఘటనలో సుమారు రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఏసీ సుబ్బరాయుడు సంఘటన స్థలానికి వెళ్లి తన సొంత డబ్బుతో 12 కుటుంబాల వారికి బియ్యం, కందిబేడలు, నూనె, తదితర వస్తువులను అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కొండారెడ్డి, మధుసూదన్‌రెడ్డి వారికి ఆహారం అందించారు. మొదట మా ఇంట్లోనే మంటలు: అగ్నిప్రమాదంలో మొదటగా మా ఇంట్లోనే మంటలు వ్యాపించాయి. అందరం కట్టుబట్టలతో మిగిలాం. రూ. 25వేల నగదుతో పాటు విలువైన చంద్రికలు కాలిపోయాయి. బంగారు వస్తువులు, పిల్లల పుస్తకాలు, రేషన్‌కార్డులు, అన్ని మంటల్లో మాడిపోయాయి. బియ్యం, బేడలు, మంచాలు, రేషన్‌కార్డులు, ఇతర వస్తువులన్నీ కాలాయి. ఒక్కటీ కూడా తీసుకోలేకపోయాం. -
మహానందిలో 21 నుంచి దసరా శరన్నవరాత్రులు
– వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు మహానంది: సెపె్టంబర్ 21 నుంచి మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 21న శైలపుత్రిదుర్గ, 22న బ్రహ్మచారిణీదుర్గ, 23న చంద్రఘంట దుర్గ, 24న కూష్మాండదుర్గ, 25న స్కందమాత దుర్గ, 26న కాత్యాయినీదుర్గ, 27న కాళరాత్రి దుర్గ, 28న మహాగౌరీదుర్గ, 29న సిద్ధిధాత్రిదుర్గ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 30వ తేదీన విజయదశమి రోజున మహానంది క్షేత్రంలో వెలిసిన కామేశ్వరీదేవి అమ్మవారి నిజరూపంలో దర్శనమిస్తారన్నారు. అదేరోజు సాయంత్రం కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి ఉత్సవమూర్తులు స్థానిక ఈశ్వర్‌నగర్ వద్ద ఉన్న జమ్మిచెట్టు వద్దకు చేరుతారన్నారు. జమ్మిచెట్టు వద్ద స్వామి, అమ్మవారికి విశేష పూజల అనంతరం తిరిగి మహానందికి వస్తారని తెలిపారు. మహానంది క్షేత్రంలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వయంగా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని, దాతలు రూ.11,116 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీరికి నవరాత్రుల్లో ఒకరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు, శత చండీయాగం, అలంకార పూజ, సహస్రదీపాలంకరణసేవ, గ్రామోత్సవం సేవల్లో పాల్గొనవచ్చన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలోనే వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు స్వామి, అమ్మవారి శేష వస్త్రాలు, వెండిడాలరు అందించి వేదాశీర్వచనం చేయిస్తామన్నారు. -
గుడికి వెళ్తూ టీవీ నటులు దుర్మరణం
సాక్షి, బెంగుళూరు: బుల్లి తెర నటులు రచన, జీవన్‌లు గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రచన స్నేహితురాలి పుట్టిన రోజు కావడంతో పార్టీ చేసుకున్న అనంతరం కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు తన ఆరుగురు స్నేహితులతో కారులో బయల్దేరారు. వీరిలో జీవన్ కూడా ఉన్నారు. కారు మాగడి వద్దకు చేరుకున్న తర్వాత వేగంగా వెళ్తున్న బస్సును తప్పించబోయిన డ్రైవర్.. రోడ్డుకు ఎడమ వైపున ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రచన, జీవన్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని స్థానికులు నీలమంగళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ సీరియల్ షూటింగ్ కోసం గురువారం రాత్రి రచన హైదరాబాద్‌కు రావాల్సివుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆమె తండ్రి గోపాల్ కన్నీరుమున్నీరయ్యారు. రచన, జీవన్‌లు నటించిన 'మహానంది' సీరియల్ కన్నడంలో మంచి ఆదరణ పొందింది. రచన తన కెరియర్ను 'మధుబాల' సీరియల్‌తో ప్రారంభించారు. జీవన్ కన్నడంలో ఇప్పుడిప్పుడే కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. -
బాలీవుడ్‌పై దృష్టి
– సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మహానంది: తెలుగు సినిమా రంగంపై కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఆలయ సూపరింటెండెంట్ ఈÔ¶శ్వర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధానిలు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 60 తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించానని, ఏడాది వరకు ఖాళీ లేదన్నారు. తెలుగులో నటించిన శీను..వాసంతి..లక్ష్మి, బ్రోకర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించిందన్నారు. అలాగే మనలో ఒకడు చిత్రంలో వేసిన పాత్రకు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారన్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి మృతి చిత్రరంగానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. -
మహానంది ఇన్చార్జ్ ఈఓగా వెంకటేశ్వర్లు
మహానంది: మహానంది దేవస్థానం ఇన్చార్జ్ ఈఓగా అనంతపురం జిల్లా ఉవరకొండ గౌరీ మఠం అసిస్టెంటు కమిషనర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శంకర వరప్రసాద్ పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వెంకటేశ్వర్లుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయశాక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వెంకటేశ్వర్లు గౌరీ(గవి)మఠం ఏసీ, మేనేజర్‌గా ఉన్న ఆయన కర్నూలు జిల్లా డీసీగా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పది రోజుల్లో మహానంది దేవస్థానానికి రెగ్యులర్ ఈఓను నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. -
మహానందిలో పెళ్లిసందడి
– భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు మహానంది : మహానంది క్షేత్రంలో బుధవారం పెళ్లిసందడి నెలకొంది. సుమారు 20కిపైగా వివాహాలు జరగడంతో ఆలయ ప్రాంగణాలు వధూవరుల బంధువుల, భక్తులతో కళకళలాడాయి. పుణ్యసా్ననాలు చేసే వారితో కోనేరులు నిండిపోయాయి. నూతన వధూవరులు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.వేసవి సెలవులకు తోడుగా వివాహాలు ఉండటంతో భక్తజన రద్దీ పెరిగింది. -
మహానందిలో గోశాల ప్రారంభం
మహానంది: మహానంది క్షేత్రంలో సుమారు రూ. 15లక్షలతో నిర్మించిన గోశాలను శనివారం.. హైదరాబాద్‌కు చెందిన మాజీ శాసనసభ్యులు వెంకటేశ్‌గౌడు, కార్పొరేటర్ శ్రీశైలం గౌడులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానంది అధికారులు, సిబ్బంది కోరిక మేరకు గోశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. గోశాల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో మహాలక్ష్మియాగాన్ని నిర్వహించారు. మహానంది క్షేత్రంలో గోశాలను నిర్మించడం శుభప్రదమని వేదపండితులు రవిశంకర అవధాని అన్నారు. -
మహానందిలో హుండీ చోరీయత్నం
– అన్నదానభవనంలో ఘటన మహానంది: మహానంది దేవస్థానంలోని నిత్యాన్నదాన భవనంలోని హుండీ చోరీ యత్నం సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించడంతో సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే...మహానంది దేవస్థానంలో ప్రతిరోజు 125 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాల్లోని అన్నదాన భవనంలో హుండీ ఉంటుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అన్నదానమండపం వెనుక వైపు ఉన్న కిటికీలకు ఉన్న కడ్డీలను తొలగించి లోపలికి చొరబడ్డారు. అక్కడే ఉన్న హుండీని భవనం వెనుక ఉన్న షెడ్డువైపు తీసుకొచ్చి చోరీకి యత్నించారు. హుండీ తాళం పగలగొట్టలేక పడేసి వెళ్లారు. ఆదివారం ఉదయం గుర్తించిన సిబ్బంది అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు వర్గాల మధ్య ఉన్న విభేధాలే ఈ ఘటనలకు కారణం ఉండొచ్చు అని పలువురు చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నదానమండపం ప్రాంగణంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత
– ఎస్బీఐ ఉభయరాష్ట్రాల సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ మహానంది: డిజిటల్ బ్యాంకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంచుతున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ పేర్కొన్నారు. కర్నూలులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మహానందీశ్వరుడి దర్శనార్థం మంగళవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు సేవలు మరింత విస్తరిస్తున్నామన్నారు. అలాగే ఆన్లైన్ సేవల పట్ల ఖాతాదారులకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకుని వస్తామన్నారు. మహానందీశ్వరుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి జలసంపద అద్భుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకముందు సీజీఎం కుటుంబ సభ్యులకు ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర అవధాని స్వాగతం పలికి పూజలు నిర్వహింపచేశారు. అనంతరం సీజీఎం స్థానిక స్వామివారి కల్యాణమండపంలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఆయన వెంట నంద్యాల ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వీరేందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లమలలో రూ. 22లక్షలతో ఫైర్‌లైన్స్
- డీఎఫ్ఓ శివప్రసాద్ మహానంది: వేసవిలో నల్లమల సంరక్షణకు రూ. 22లక్షలు వెచ్చించి 200 కిలోమీటర్ల మేరకు ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశామని డీఎఫ్ఓ శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక అటవీ పర్యావరణ కేంద్రం నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నల్లమల అడవిలో అగ్ని ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు తాత్కాలికంగా 55 మందిని ఫైర్వాచర్స్గా తీసుకున్నామన్నారు. ప్రస్తుతం బేస్‌క్యాంపుల్లో 65 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు. వన్యప్రాణులకు తాగునీరు అందించేందుకు నంద్యాల, రుద్రవరం డివిజన్లలో 60 సాసర్ పిట్స్ ఉన్నాయన్నారు. వీటికి అదనంగా కొత్తగా 40 నిర్మించామన్నారు. వీటికి ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపుతామని తెలిపారు. ప్రతి రోజూ నంద్యాల–గిద్దలూరు రహదారిలోని ఘాట్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అటవీపర్యావరణ కేంద్రం పరిధిలోని రెండో నర్సరీలో మొక్కలు ఎండిపోవడంపై డీఎఫ్ఓ శివప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షం రోజుల్లో పరిసరాలు మారాలని సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, డీఆర్ఓ రఘుశంకర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
వైభవంగా త్రిశూల స్నానం
- మహానంది క్షేత్రంలో పూర్ణాహుతి - అంకురార్పణలో మొలకలు వృద్ది - సమృద్ధిగా వర్షాలకు సూచనగా చెప్పిన పండితులు మహానంది: మహానంది క్షేత్రంలో వారం రోజుల పాటు వైభవంగా జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతి పూజలతో ముగిశాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి వారికి రుద్రగుండం కోనేరులో వైభవంగా త్రిశూల స్నానం చేయించారు. వేదపండితులు రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండిత బృందం విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. రుద్రగుండం కోనేరులో స్వామివారికి నిర్వహించిన త్రిశూల స్నానంలో భక్తులు పాల్గొని తరించారు. కలశ ఉద్వాసన, ధ్వజ అవరోహణ, మూలమూర్తుల కంకణాల విసర్జన, దీక్షా హోమాలు, మహాపూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అనంతరం స్థానిక స్వామివారి కల్యాణమండపంలో నాగవేళి పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ 2017 మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అంకురార్పణలో అంకురాలు బాగా మొలిచాయన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయనేందుకు ఇది సూచనగా తెలిపారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీనివాసులు, బాలరాజుయాదవ్, మునెయ్య, రామకృష్ణ, కేశవరావు, శివారెడ్డి, మౌళీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహానందమాయే!
కనుల పండువగా సాగిన మహానందీశ్వరుడి రథోత్సవం మహానందిలో కనులపండువగా జరిగిన రథోత్సవం అశేష భక్తజనవాహిని మధ్య కదిలిన రథం మహానంది: నల్లమల పర్వత పాన్పుల అందాలు.. నీలాకాశం నింగి అందాలకు తోడుగా మహానందీశ్వరుడి రథోత్సవం కనులపండువ సాగింది. మహానంది దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో ఆదివారం సాయంత్రం రథోత్సవం వైభవంగా సాగింది. కర్నూలు అడిషనల్ జడ్జి ఇంతియాజ్ అహ్మద్, నంద్యాల ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్రావు, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్, నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు రథోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ గంగా, శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణం పూర్తయిన తర్వాత ఆదివారం పెళ్లిపెద్దలు శ్రీ పార్వతీ సహిత శ్రీ బ్రహ్మనందీశ్వరస్వామితో కలిసి రథంలో కొలువయ్యారు. ఈ మేరకు లక్షలాది మంది భక్తులు హరహర...మహాదేవ...శంభో శంకర.....శ్రీ మహానందీశ్వరస్వామికి జై...శ్రీ కామేశ్వరీదేవి మాతాకీ జై....అంటూ భక్తులు భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు. ఆలయం పురవీధుల్లో సాగిన ర థోత్సవాన్ని తిలకించిన భక్తులు మహానందానికి గురయ్యారు. రథోత్సవంలో విశేష పూజలు: రథోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రథం వద్ద వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, తదితర çపండిత బృందం ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, రథాంగబలి, నవకలశ స్నపనము, రథాంగహోమము, దీక్షా హోమం, తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం తిమ్మాపురం గ్రామానికి చెందిన పుల్లయ్యాచారి కుంభంకూడు మోసుకొచ్చారు. రథానికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తెడ్లకు కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేపట్టారు. రథంలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, ప్రదక్షిణలు చేయడం ద్వారా పునర్జన్మ ఉండదని, సర్వ పాపాలు హరిస్తాయని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. తూర్పున ధర్మం, పడమట జ్ఞానం, ఉత్తరాన ఐశ్వర్యం, దక్షిణాన మోక్షం లభిస్తుందన్నారు. రథంలో బ్రహ్మ, అనంతుడు, ఇంద్ర, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఉంటారని వారు వివరించారు. పూజా కార్యక్రమాల్లో పాలకమండలి సభ్యులు బండి శ్రీనివాసులు, రామకృష్ణ, సీతారామయ్య, మునెయ్య, బాలరాజు, శివారెడ్డి, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సురేంద్రనా«ద్‌రెడ్డి, నంద్యాల రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో ఉద్రిక్తత: మహానందీశ్వరుడి రథోత్సవంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. మహానందీశుని రథోత్సవం స్థానిక ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం వద్దకు చేరుకోగానే అక్కడ ఆపాలి అంటూ కొందరు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు అర్చకులు, పండితులపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు వెంటనే వారించడంతో సమస్య సద్దుమణిగింది. -
ప్రకాశం జిల్లా వృషభాల విజయకేతనం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో ప్రకాశం జిల్లా ఎద్దులు విజయకేతనం ఎగురువేశాయి. సీనియర్స్ విభాగంలో ఆరు జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రకాశం జిల్లా ముదిరాళ్లముప్పాల మండలం ఎన్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన అనంతనేని శ్రీలేఖ, మధులకు చెందిన వృషభాలు 2468.08 అడుగుల దూరం బండను లాగి ప్రథమస్థానంలో నిలిచాయి. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కాసరనేని రాజాచౌదరికి చెందిన వృషభాలు 2403.02 అడుగుల దూరంతో ద్వితీయ స్థానంలో నిలిచాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం, ఎనగండ్ల గ్రామానికి చెందిన బాయికాటి బోడెన్న వృషభాలు 2157.7అడుగుల దూరంతో తృతీయస్థానం, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తోట శ్రీనివాసరావు వృషభాలు 2155 అడుగుల దూరంతో నాలుగవస్థానం, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన దాసరినారాయణరావు వృషభాలు 1396.9 అడుగులతో ఐదోస్థానం, శిరివెళ్ల మండలం ఖాదరబాదు గ్రామానికి చెందిన బండికృష్ణయ్య వృషభాలు 1008 అడుగుల దూరంతో ఆరోస్థానంలో నిలిచాయి. వీరికి వరుసగా రూ. 80వేలు, రూ. 60వేలు, రూ. 40వేలు, రూ. 30వేలు, రూ. 20వేలు, రూ.10వేలు బహుమతులను అందించారు. బుక్కాపురం గ్రామానికి చెందిన పన్నంగి వెంకటరమణ, పగిడ్యాల మండలానికి చెందిన అహ్మద్‌బాషాలు పోటీలను ప్రారంభించారు. ఒంగోలు జాతి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొప్పుల శివనాగిరెడ్డి, నిర్వాహకులు మురళీ, శివయ్య , తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం..మహానందీశ్వరుడి కల్యాణం
మహానంది: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం వేకువ జామున మహానందీశ్వరస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలకరించారు. కల్యాణ వేదికపై ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ తంతను శాస్త్రోక్తంగా జరిపారు. కల్యాణోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించారు. కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి..నూతన వధూవరులుగా భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు, ఆదిలక్ష్మమ్మ దంపతులతో పాటు నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు. మయూరవాహనంపై మహానందీశుడు.. కల్యాణం అనంతరం శనివారం ఉదయం మయూరవాహనంపై మహానందీశ్వర స్వామి కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. వేలాది మంది భక్తజనంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన దర్శనం రాత్రి వరకు నిర్విరామంగా సాగింది. -
ఏప్రిల్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ
– అన్ని షాపుల్లో హెచ్‌పీఎఫ్‌ఎస్ – అధిక ధరలకు విక్రయిస్తే రూ.లక్ష నుంచి రూ. 5లక్షలు జరిమానా – ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్ మహానంది: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ చట్టం అమలు చేస్తామని, అందుకు అనుగుణంగా వినూత్న మార్పులు తెస్తామని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వైన్¯Œ షాపుల్లో హెచ్‌పీఎఫ్‌ఎస్(హలోగ్రాఫిక్ పాత్ ఫైండర్ సిస్టమ్) ఏర్పాటు చేస్తామన్నారు. ట్రేస్ అండ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా అన్నింటిని ఆన్లైన్ చేస్తామన్నారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు, సీసీ టీవీలు, ఆటోమిషన్ స్కాన్ విధానం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మద్యంను అధిక ధరలకు విక్రయిస్తే రూ.లక్ష వరకు జరిమానా విధించేవారమని, కొత్త చట్టం ద్వారా ఫిర్యాదు అందితే రూ. 5లక్షలు జరిమానా విధిస్తామన్నారు. మహానందిలోని వైన్‌షాపును తొలగిస్తామని చెపా్పరు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదినారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. -
గజవాహనాధీశా నమోస్తుతే
- ఘనంగా మహానందీశ్వరుని గ్రామోత్సవం - అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు మహానంది: క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ గంగా, కామేశ్వరీదేవి సహీత శ్రీ మహానందీశ్వరస్వామి వారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం గజవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి, అమ్మ వారికి గజవాహన సేవ నిర్వహించారు. మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో పండిత బృందం వేకువజాము నుంచి విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారు గజవాహనంపై కొలువై ఆలయ పురవీధుల గుండా ఊరేగారు. మహాశివరాత్రి కావడంతో వేలాదిగా భక్తజనం హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్, పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, కల్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాద్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. -
మహానందిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి అంకురార్పణ పూజలు చేశారు. మహానంది దేవస్థానం పాలక మండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్.. విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, చండీశ్వరపూజ, దీక్షాధారణ, అఖండస్థాపనములు, తిరుమంజనము జరిపారు. రాత్రి అగ్నిప్రతిష్ఠాపన, కలశస్థాపన, వాస్తుపూజా హోమం, భేరిపూజ, ధ్వజారోహణం, బలిహరణం, వేదశాస్త్ర సమర్పణం గావించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, కళ్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు, ఆలయ ధర్మకర్తలు బాలరాజు, రామకృష్ణ, మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో జరగనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ చేయనున్నట్లు మహానంది దేవస్థానం పండితుడు రవిశంకర అవధాని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో ఈ నెల 27వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు. అందులో భాగంగా 24న మహా లింగోద్భవం, మహా లింగోద్భవం, 25న స్వామివారి కల్యాణం, 26న రథోత్సవం ఉంటాయన్నారు. ఈ ఏడాది కొత్తగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి పుష్పపల్లకీ ఉత్సవం నిర్వహిస్తున్నామన్నారు. -
అరటితోటలో గుర్తు తెలియని మృతదేహం
శ్రీనగరం(మహానంది): మహానంది మండలం శ్రీనగరం గ్రామం సమీపంలోని అరటితోటలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపిన వివరాల మేరకు... మృతుడికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండొచ్చు. షర్టుపై జానీ టైలర్, నంద్యాల అని ఉంది. మృతుడి షర్టుజేబులో జపమాల, రెండు ఉంగరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పారవేశారా? అనే కోణంలో ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతదేహంపై అరటిసొరుగు కప్పి ఉంచడంతో స్థానికులు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మహానందికి చేరిన బ్రహ్మనందీశ్వరుడు
నంద్యాల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనడానికి మహానందీశ్వరస్వామి ఆహ్వానం మేరకు బ్రహ్మనందీశ్వరస్వామి మంగళవారం మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. కల్యాణం, రథోత్సవం పూర్తయ్యాక ఆయన 27న నంద్యాల చేరుకుంటారు. కోటవీధిలో కొలువుదీరిన బ్రహ్మనందీశ్వరస్వామికి, కల్యాణానికి ఆహ్వానించడానికి విచ్చేసిన మహానందీశ్వరస్వామి విగ్రహాలకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మనందీశ్వరస్వామి, మహానందీశ్వరస్వామి పల్లకీలో గ్రామోత్సవానికి బయలుదేరాయి. సుంకులమ్మ వీధిలోని పెద్దమ్మ ఆలయం వద్ద పల్లకీలను ఆపి, సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సేవలు చేశారు. స్థానికులు మహానందీశ్వరస్వామి, బ్రహ్మనందీశ్వరస్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం పల్లకీలు పట్టణ వీధుల గుండా, సాయంత్రం మహానంది క్షేత్రానికి చేరాయి. 24న అర్ధరాత్రి జరిగే కామేశ్వరిదేవి, మహానందీశ్వరస్వామి వార్ల కల్యాణానికి పార్వతీదేవి, బ్రహ్మనందీశ్వరస్వామి పెళ్లిపెద్దలుగా వ్యవహరిస్తారు. 27న నంద్యాలకు రాక మహానంది క్షేత్రంలో రథోత్సవం, తెప్పోత్సవం పూర్తయ్యాక బ్రహ్మనందీశ్వరస్వామి, మహానందీశ్వరస్వామి విగ్రహాలు నంద్యాలకు చేరుతాయి. తన కల్యాణానికి పెళ్లి పెద్దగా వ్యవహరించినందుకు బ్రహ్మనందీశ్వరస్వామికి, పార్వతీదేవికి మహానందీశ్వరస్వామి ధన్యవాదాలు తెలిపి, మహానంది చేరడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
మహాశివరాత్రికి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
– మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ మహానంది: మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం దేవస్థానం కార్యాలయంలో పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్ఠాత్మకమైన లింగోద్భవ కార్యక్రమంలో గత ఏడాది ఈఓ, పాలకమండలి సభ్యులకు సైతం చోటు లేకపోయిందని, ఈ ఏడాది దేవస్థానం పరిధిలో తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపడతామన్నారు. వీఐపీలు వారి కుటుంబ సభ్యులతో గాకుండా కేవలం దంపతులు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారికి నూతనంగా పుష్పపల్లకీ సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు. మహానంది దేవస్థానంలో రూ.74లక్షలతో గ్రానైట్ పనులు చేపడుతున్నామన్నారు. రూ.16లక్షలతో శాండ్‌బ్లాస్టింగ్, బండపరుపు పనులు జరుగుతున్నాయన్నారు. ఉత్సవాలకు రూ.15.73లక్షలు మంజూరైందని, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణానికి నంద్యాలకు చెందిన కూరగాయల వ్యాపారి లక్కబోయిన ప్రసాద్ దంపతులు దాతలుగా వ్యహరిస్తున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఉన్న శాశ్వత లైన్లతో పాటు తాత్కాలిక లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పార్కింగ్ నుంచి ఆలయం వరకు భక్తులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. వీటి కోసం నంద్యాలకు చెందిన రామకృష్ణ, ప్రభాత్, శాంతిరాం విద్యా సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయన్నారు. టెంకాయలు సమర్పించే చోట, చెప్పుల స్టాండు వద్ద భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవస్థానం పాలకమండలి ధర్మకర్త సీతారామయ్య ఆధ్వర్యంలో తాగునీరు సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు బాలరాజుయాదవ్, రామకృష్ణ, మునెయ్య, చింతకుంట్ల శివారెడ్డి, బండి శ్రీనివాసులు, సీతారామయ్య, మౌళీశ్వరరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
మహానందీశ్వరుడి పెళ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వరస్వామి
– 20న మహానందీశ్వరస్వామి ఉత్సవాల రాక – 21న బయల్దేరనున్న బ్రహ్మనందీశ్వరస్వామి నంద్యాల: మహా శివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రంలో జరిగే మహానందీశ్వరస్వామి, కామేశ్వరిదేవీల వివాహానికి పెళ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వరస్వామి హాజరై, కల్యాణం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక తిరిగి నంద్యాలకు రానున్నారు.ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నవనంది క్షేత్రాల పాలకుడు బ్రహ్మనందీశ్వరస్వామి స్థానిక కోటావీధిలో ఉన్న బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయం కేంద్రంగా చేసుకొని నందన చక్రవర్తి నవనంది క్షేత్రాలను నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆయన హయాంలో ఏర్పాటైన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రతి ఏడాది మహానంది క్షేత్రంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో స్వామి వారికి, అమ్మవారికి కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ కల్యాణానికి పెళ్లి పెద్దగా బ్రహ్మనందీశ్వరస్వామి, పార్వతీదేవి అమ్మవారు వ్యవహరించనున్నారు. మహానందీశ్వరస్వామి సంప్రదాయబద్ధంగా కామేశ్వరిదేవీతో నంద్యాలకు వచ్చి బ్రహ్మనందీశ్వరుని, పార్వతీదేవి అమ్మవారిని కలిసి పెద్ద దిక్కుగా వ్యవహరించి, పెళ్లిని జరిపించాలని కోరడం, మరుసటి రోజు వారు బయల్దేరడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పెళ్లి పెద్ద బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించడానికి 20వ తేదీన కామేశ్వరిదేవి సహిత మహానందీశ్వరస్వామి నంద్యాలకు రానున్నారు. మరుసటి రోజైన 21న బ్రహ్మనందీశ్వరస్వామి మహానందికి వెళ్లి.. 24వ తేదీ అర్ధరాత్రి కామేశ్వరిదేవి సహిత మహానందీశ్వరస్వామి కల్యాణ మహోత్సవం జరిపిస్తారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక 28వ తేదీ బ్రహ్మనందీశ్వరస్వామి, మహానందీశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను నంద్యాలకు తీసుకొస్తారు. 29న గ్రామోత్సవం జరిగాక మహానందీశ్వరస్వామి విగ్రహాలను ఆలయ సిబ్బంది మళ్లీ మహానందికి తీసుకెళ్తారు. దీంతో మహానందీశ్వరస్వామి పెళ్లి తంతు ముగుస్తుంది. -
వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది: మహానంది క్షేత్రంలో రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలాచక్రవర్తి, తదితరులు విశేష పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనము, సూర్యయంత్రారాధన, ద్వాదశాదిత్యపూజ, రథాంగపూజ, రథాధిదేవతావాహనము పూజలు నిర్వహించారు. అనంతరం రథమును శివరాత్రిన జరిగే గంగా, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణోత్సవ ఉత్సవాలకు బయటకు తీశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజుయాదవ్, చింతకుంట్ల శివారెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, బండి శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు నిచ్చెనమెట్ల శేషఫణి, గంగిశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలం
మహానంది (శ్రీశైలం) బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ భారీ శివలింగాన్ని ఎత్తే సీన్ ప్రేక్షకాదరణ పొందింది. అది సినిమా.. నిజ నిజీవితంలో అలాంటి బాహుబలులు అరుదుగా తారసపడతారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఆదివారం ఇలాంటి వారు కనిపించారు. సయ్యద్ దస్తగిరిస్వామి ఉరుసు సందర్భంగా ఆదివారం పోటీలు నిర్వహించారు. రాతి గుండు(120 కేజీలు)ను అలవోకగా ఎత్తి శిరివెళ్లకు చెందిన ఉస్మాన్ ప్రథమ స్థానం, కొత్తపల్లె వెంకట లక్ష్మిరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఇసుక సంచి (105 కేజీలు)ని ఎత్తి హబీబుల్లాఖాన్ విజేతగా నిలిచారు. ఒక టైర్ బండిని లాగే పోటీలు ఆసక్తికరంగా సాగాయి. -
31న ఒంగోలు జాతి పశువుల వేలాలు
ఎంసీ ఫారం(మహానంది): మహానంది సమీప ఎంసీ ఫారంలోని శ్రీ వెంకటేశ్వర పశు పరిశోధన స్థానంలోని 50 ఒంగోలు జాతి పశువుల విక్రయానికి సంబంధించి ఈ నెల 31వతేదీన వేలం పాటలు నిర్వహిస్తామని పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.శ్రీనివాసనాయక్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిది తరుపులు, 41 కోడెదూడలను వేలంలో విక్రయిస్తామన్నారు. వీటిని ఉదయం 7గంటలకు ఫారం ఆవరణలో ప్రదర్శనకు ఉంచుతామన్నారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్‌కార్డు, పట్టాదారు పుస్తకం జిరాక్స్ ప్రతులు ఇవ్వడంతోపాటు రూ. 2వేల దరావత్తు చెల్లించాలని సూచించారు. -
కనవయ్యా.. మహానందీశా!
- ఒరిగిపోయిన గర్భాలయ గోపుర కలశం - అపచారం జరగకముందే అధికారులు మేల్కోవాలి మహానంది: ‘‘గోపుర కలశాన్ని దర్శించుకుంటే కోటిరెట్ల పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోలేని వారు గోపుర కలశాన్ని దర్శించుకుంటే చాలని చెబుతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న గర్భాలయ గోపుర కలశం పరిరక్షణపై మహానంది పుణ్యక్షేత్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. స్వామివారి గర్భాలయ గోపురానికి ఎంతో విశిష్టత ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు కళింగ ఆర్కిటెక్చర్ నిర్మాణశైలిని పోలి ఉన్నట్లు చరిత్రకారులు, పురావస్తుశాఖవారు చెబుతున్నారు. అలాంటి గోపురం పైభాగంలోని కలశం ఓ వైపునకు ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. అపచారం జరగకముందే కొత్త కలశాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆలయ యాజమాన్యం పాతదానికే కడ్డీలు కట్టి మరీ బిగించి ఉంచడం గమనార్హం. ఇటీవలే మహానంది దేవస్థానానికి వచ్చిన కమిషనర్ అనురాధ, అధికారులు త్వరలో కలశ ప్రతిష్టాపన ఉంటుందని ప్రకటించినా ముహూర్తం నిర్ణయించకపోవడం గమనార్హం. నూతన కలశం సిద్ధంగా ఉంది : రవిశంకర అవధాని, వేదపండితులు ప్రస్తుతం ఉన్న కలశం స్థానంలో నూతనంగా ప్రతిష్టించేందుకు కొత్త కలశాన్ని తీసుకువచ్చాం. కంచికామకోటి పీఠాధిపతి చేత ప్రతిష్టకు చర్యలు తీసుకుంటున్నాం. మాఘ మాసం లేదా శివరాత్రి పర్వదినాల్లో కార్యక్రమం పూర్తి చేస్తాం. -
రమణయ్య పంట పండింది
- ఎకరాకు 59 బస్తాల దిగుబడి - రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపిక - నేడు విజయవాడలో సన్మానం మహానంది(శ్రీశైలం): డిగ్రీ వరకు చదువుకున్న రమణయ్య తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు. ఏటా వరి సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నాడు. గత ఏడాది ఎకరాకు 58బస్తాలు సాధించి జిల్లా స్థాయి ఉత్తమ రైతుగా ఎంపికైన ఇతడు ఈ ఏడాది ఏకంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ రైతుగా ఎదిగాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏఓ కల్యాణ్‌కుమార్ గురువారం వెల్లడించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన పన్నంగి వెంకటరమణయ్య డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆదర్శరైతుగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఇతడు పంటలు సాగు చేస్తూనే పది మంది రైతులకు సలహాలు ఇచ్చేవాడు. ఈ ఏడాది రెండెకరాల్లో బీపీటీ-2 రకం పంట సాగు చేసిన రమణయ్య ఎకరాకు 59 బస్తాల దిగుబడి సా««ధించి రికార్డు సృష్టించాడు. దీంతో అతన్ని ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ వరి రైతుగా ఎంపిక చేసింది. శుక్రవారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడలో అవార్డు అందుకోనున్నారు. -
అయ్యప్ప భక్తులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
మహానంది: కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో అయ్యప్ప మాలధారులు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన భక్తులు ఒక బస్సులో గురువారం ఉదయం మహానందికి వచ్చారు. స్థానిక టీటీడీ కల్యాణ మంటపం వద్ద బస్సును ఆపి అందరూ కిందికి దిగారు. ఇద్దరు భక్తులు లగేజిని కిందికి దించేందుకు బస్సుపైకి ఎక్కారు. అయితే, ఆ ప్రదేశంలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండటంతో వారికి తీగలు తాకి షాక్‌కు గురయ్యారు. గాయపడిన వారిని తోటివారు వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు. -
జిల్లాలో 75 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు
– డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మహానంది: జిల్లాలో ఇప్పటి వరకు 75 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ప్రారంభించామని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం బుధవారం ఆయన మహానందికి వచ్చారు. అనంతరం తిమ్మాపురంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ ఫర్హానాబేగంను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఎంసెట్‌లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి మోడల్ స్కూల్లో కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 14 పీఈటీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ మోడల్ స్కూల్ హాస్టళ్లను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు మినహా మిగిలిన పాఠశాలల్లో విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని త్వరలో మొదలు పెడతామన్నారు. జిల్లాలో సుమారు 200 మంది ఉపాధ్యాయుల కొరత ఉందని డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మహానందిలో పూజలు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేపట్టారు. ఆలయ పండితులు రవిశంకర అవధాని, తదితరులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేశారు. ఆయన వెంట మహానంది, శిరివెళ్ల మండలాల ఎంఈఓలు రామసుబ్బయ్య, శంకరప్రసాద్ ఉన్నారు. -
మహానంది కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు
- మార్చిలో బోర్డు సమావేశం – పోస్టుల భర్తీకి చర్యలు – కాన్ఫరెన్స్ హాలు, ఎకో స్టూడియో ప్రారంభించిన డీన్ ఆఫ్ అగ్రికల్చర్ మహానంది: మహానంది సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలకు రాష్ట్రస్తాయి గుర్తింపు ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ తాతినేని రమేష్‌బాబు పేర్కొన్నారు. మహానంది వ్యవసాయ కళాశాలలో రూ. 6.50లక్షలతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్, రూ. 9లక్షలతో నిర్మించిన ఎకోస్టూడియోను ఫ్రొఫెసర్ అకడమిక్ టి.శ్రీనివాస్, అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్యతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చినెలలో విశ్వవిద్యాలయం బోర్డు సమావేశం మహానందిలోనే నిర్వహిస్తామన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ ఫోన్లో మాట్లాడారని, కళాశాల అభివృద్దికి ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని సూచించారన్నారు. అలాగే ఆర్థిక మంత్రితో చర్చించి ముందుగా కళాశాలలో ఖాళీగా ఉన్న 17అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్‌గేమ్ స్టేడియం, గెస్ట్‌హౌస్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపితే నిధుల మంజూరుకు తనవంతు కృషి చేస్తానన్నారు.సమావేశంలో అధ్యాపకులు డాక్టర్ కేఎన్ రవికుమార్, డాక్టర్ ఎంఎస్ రాహూల్, డాక్టర్ కేఎన్ శ్రీనివాసులు, డాక్టర్ సరోజినీదేవి, సుధారాణి, జయలక్ష్మి, మాధవి, హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరెడ్డి, రమేష్‌బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
నోట్లమార్పిడి వ్యవహారంలో ముగ్గురిపై వేటు
మహానంది: మహానంది దేవస్థానంలో వివిధ కౌంటర్లలో జరిగిన నోట్ల మార్పిడి వ్యవహారంపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బుకింగ్ కౌంటర్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో పనిచేస్తున్న మహేశ్వరీ, వెంకటేశ్వర్లు ఆలియాస్ శివప్ప, లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న డీబీ శివకుమార్లను ససెన్షన్ చేసినట్లు సూపరింటెండెంట్ పరశురామశాస్త్రి తెలిపారు. ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులను వదిలేయడం వెనుక పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ చిరుద్యోగిని బెదిరించి తన పేరు చెప్పవద్దని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. -
మహానందీశ్వరుడికి లక్ష బిల్వార్చన
మహానంది: కార్తీకమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ మహానందీశ్వరస్వామివారికి ఆదివారం లక్షబిల్వార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. నంద్యాలకు చెందిన రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులు పూజలకు దాతలుగా పాల్గొన్నారు. మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ డాక్టర్ శంకరవరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకరఅవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, తదితర పండిత బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, దీక్షా ధారణ, కంకణ ధారణ, గోపూజ, తదితర పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తామని వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం 10 గంటల నుంచి ఆర్జిత కుంకుమార్చనలు ఉండవని భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
ఉత్తమ సేవకుడికి సత్కారం
మహానంది: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ శంకర వరప్రసాద్ మూడు అవార్డులు అందుకున్నారు. గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా మూడు బంగారు పతకాలు అందుకున్నారు. పెద్దాపురంలో ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రెడ్‌క్రాస్ సొసైటీవారు ఆయనకు అవార్డులను అందించారు. -
మహానందీశ్వరుడి సాక్షిగా..
- రూ. లక్షల్లో నోట్ల మార్పిడి - అధికార పార్టీ నేత అండగా ఓ అధికారి కక్కుర్తి - సిబ్బంది భాగస్వామ్యం - 13 మందికి షోకాజ్ నోటీసులు మహానంది: నల్లకుబేరులు పెద్ద నోట్ల మార్పిడికి మహానంది క్షేత్రాన్ని అడ్డాగా మార్చుకున్నారు. ఓ అధికారి సహకారంతో నల్లడబ్బును తెల్లగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకున్న వారిలో ధర్మకర్తల మండలి సభ్యులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ తంతగంలో ఓ చిరుద్యోగి తన హవాను కొనసాగిస్తున్నాడు. గత ఆది, సోమవారాల్లో రెండురోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి జరిగినట్లు అధికారులకు సమాచారం అందింది. ఆదివారం సెలవురోజు కావడంతో సుమారు రూ. 4లక్షలు, కార్తీక పౌర్ణమి కావడంతో సోమవారం భక్తులరద్దీ అధికంగా ఉండటంతో రూ. 5లక్షల వరకు ఆదాయం వచ్చింది. రెండు రోజుల్లో రూ. 9లక్షలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులరద్దీ, ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు రోజులనే నల్లకుబేరులు టార్గెట్ చేశారు. అధికార పార్టీ అండగా ఓ ఉద్యోగి కింది స్థాయి సిబ్బంది సహకారంతో రెండు రోజుల్లో రూ. 2.64లక్షల నోట్ల మార్పిడి చేసినట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆలయ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఎనిమిది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ఏజేన్సీ ఉద్యోగులు కలిపి 21 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వీరిలో స్థానిక అధికారపార్టీ నేతతో పాటు ఓ ఉద్యోగి బంధువు, మరికొందరు స్థానికులు ఉన్నారని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.అలాగే లోకాయుక్తను ఆశ్రయించి కేసు వేస్తామన్నారు. ఎంతటి వారైనా చర్యలు తప్పవు: శంకర వరప్రసాద్, డిప్యూటీ కమిషనర్, మహానంది నోట్ల మార్పిడిలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఏజేన్సీ, ఔట్సోర్సింగ్, ఇతరులకు కలిపి మొత్తం 21 మందికి షోకాజ్‌నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాము.ఆది, సోమవారాల్లో కలిపి రూ. 2.64లక్షల మార్పిడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విచారణ అనంతరం బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవు. -
అజ్ఞాత భక్తుడు రూ. 3.60 లక్షలు విరాళం
మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ మహానందీశ్వరస్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు రూ. 3.60 లక్షలు సమర్పించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు గర్భాలయం ఎదురుగా ఉన్న హుండీలో ఈఓ శంకర వరప్రసాద్ సమక్షంలో నగదు వేసినట్లు సిబ్బంది తెలిపారు. పాతనోట్లు రద్దయిన సందర్భంగా ఓ భక్తుడు పెద్ద మొత్తాన్ని హుండీలో వేయడం స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు. - మహానంది -
మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో శనివారం పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలిసి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రొటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు న్యాయమూర్తి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అలాగే నంద్యాలకు చెందిన న్యాయమూర్తులు రామ్మోహన్, నాగేశ్వరరావు, ఎం.కుమారి, శైలజలు వేర్వేరుగా మహానంది క్షేత్రానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితోపాటు జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, ఇన్‌కంట్యాక్స్ జాయింట్ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి సత్యనారాయణ (విజయవాడ రేంజ్) మహానందికి వచ్చారు. వీరికి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు. -
మహానందిలో అంతే !
- నిబంధనలు, ఆచారాలు పట్టవు - నిత్యం ఉత్తర ద్వారా దర్శనం - ధ్వజస్తంభ దర్శనం కరువు - ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం - ఆదాయం కోసం ప్రైవేటు టెండర్లపై ఆసక్తి - నేడు క్షేత్రానికి దేవాదాయ కమిషనర్ రాక మహానంది: మహానంది క్షేత్రంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మహానందీశ్వరుడు దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి వారిని దోపిడీకి గురి చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ కలిగిన ఈ క్షేత్రానికి ప్రస్తుతం ప్రతి ఏడాది రూ. 15కోట్ల ఆదాయం వస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ ఆదాయం చాలదన్నట్లు మహానందిలో ఉన్న వివిధ విభాగాలను ప్రైవేటు పరం చేస్తూ భక్తులకు తీవ్ర అసౌకర్యాలు కలిగిస్తున్నారు.అంతేకాకుండా నియమ నిబంధనలు, సంప్రదాయాలను విస్మరిస్తున్నారు. దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆదివారం సాయంత్రం మహానందికి వస్తున్న నేపథ్యంలో క్షేత్రంలోని సమస్యలు పరిష్కరిస్తారని పలువురు ఆశిస్తున్నారు. సమస్యలు ఇవి మహానంది క్షేత్రంలో ఉచిత దర్శనం కల్పించాలని ఇటీవల ఆర్జేసీ భ్రమరాంబ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. కానీ నామమాత్రంగా అమలవుతుంది. ఆలయ రాజగోపురం దాటి వెళ్లిన తర్వాత ముఖద్వారం వద్ద కేవలం ఒక్కబోర్డు మాత్రమే ఉచితదర్శనం అని ఉంచారు. మహానందికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలసంఖ్యలో వస్తుంటారు. వారి భాషలను అనుగుణంగా ఎక్కడా ఒక్కబోర్డు కూడా లేదు. ఆలయానికి ధ్వజం ఆత్మసమానమైనది అంటారు. అయితే మహానందీశ్వరుడి భక్తులకు «ధ్వజ స్తంభ దర్శనం కరువైంది. అలాగే ఏడాదికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఎక్కడైనా ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ నిరంతరంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం ఆశ్చర్యం. మహానందీశ్వరుడికి నిత్యం జరగాల్సిన శాస్త్రోక్తమైన పూజలు సక్రమంగా జరగడం లేదు. భగవంతుడికి వేకువజామున, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమర్పించే నివేదన ఎంతో పవిత్రమైన కార్యం. సధ్బ్రాహ్మణుడు మాత్రమే మడికట్టుకుని స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించాలి. కానీ మహానందిలో మాత్రం సాధారణ పరిచారకులతో నివేదన సమర్పిస్తున్నారు. వీఐపీలు వచ్చినప్పుడు భాజాభజంత్రీలు పూర్తి స్థాయిలో ఉంటారు. నివేదన, మిగతా సమయాల్లో ఒకరిద్దరు మాత్రమే అందుబాటులో ఉంటారు. క్షేత్రంలో రెగ్యులర్ సిబ్బందికి మినహా మిగిలిన వారికి డ్రెస్‌కోడ్ లేదు. దీంతో భక్తులు సిబ్బందిని గుర్తించడం కష్టమవుతుంది. పలు పర్యాయాలు ఘర్షణలు సైతం జరిగాయి. ఏజెన్సీ, పారిశుధ్య విభాగం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పడితరం దిట్టానికి అనుగుణంగా లడ్డూలు, పులిహోర తయారు చేయాల్సి ఉండగా నాణ్యతలోపంతో తయారు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వీరికి ప్రతినెలా మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లడ్డూ ఉండాల్సిన పరిమాణం కంటే తక్కువగా ఉంటోంది. ప్రసాదాల తయారీని ఏళ్లతరబడి ఒకరికే అప్పగిస్తున్నారు. -
భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి చీరలు
– వారంలో మూడు రోజుల పాటు వేలాలు మహానంది: మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరించిన చీరలను శనివారం వేలాల ద్వారా భక్తులకు అందజేశారు. సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 60 చీరలను వేలాల ద్వారా విక్రయించగా రూ.30వేల ఆదాయం వచ్చినట్లు ప్రొటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు విక్రయాలు కొనసాగిస్తామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
కార్తీకం..శుభప్రదం
– రేపటి నుంచి కార్తీకమాసం – సోమవారంతో మొదలు - సోమవారమే వచ్చిన పౌర్ణమి, అమావాస్య // న కార్తీకసమో మాసో న కృతేన సమం యుగమ్/న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్// కార్తీకమాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరిౖయెన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసంలో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు, విశేష ఫలప్రదములు. కార్తీకమాసం పాడ్యమి(31–10–2016) నుంచి పాడ్యమి(29–11–2016) వరకు నెలరోజులు అత్యంత విశేషమైనది. శివకేశవులకు ఈ నెల ప్రీతికర. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా ఈ కార్తీకమాసం అత్యంత అధిక ఫలదాయకమైనదని పురాణాల్లో చెప్పబడింది. ఈ సారి ప్రత్యేకం.. ఈ ఏడాది కార్తీకమాసం సోమవారంతో మొదలవడం విశేషం. అలాగే కార్తీకపౌర్ణమి, అమావాస్య కూడా సోమవారం రావడం చాలా అరుదు. ఇలాంటి అరుదుగా వచ్చే కార్తీక మాసం సహస్రాధికమైన ఫలాన్ని ఇస్తుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శక్తిదాయకమన్నారు. మహానంది క్షేత్రంలో గంగాదేవి(రుద్రగుండం కోనేరు), ఈశ్వరుడు ఇద్దరూ ఉన్నారని, యధాశక్తి దీపారాధన చేయడం ద్వారా అనంతమైన ఫలం లభిస్తుందని చెప్పారు. నియమాలివి.. కార్తీక సోమవారం పగలు అంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవధ్యానంలో గడిపేవాళ్లు శివసాయుజ్యం పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమి రోజు అయినా ఉన్నా ఎంతో పుణ్యం. కార్తీకమాసం అంతా తెల్లవారుఝామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్ర వేళల్లో ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు చేయడం వలన మహాపుణ్యం లభిస్తుంది. ఈ నెలలో ఎక్కడైతే మహావిష్ణువును పూజిస్తారో అక్కడ భూత, పిశాచ, గ్రహగణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడు పూలతో పూజిస్తే దీర్ఘాయులై మోక్షాన్ని పొందుతారు. వనభోజనం .. కార్తీకమాసంలో వనభోజనాలది ప్రత్యేకత. ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టు క్రింద సహపంక్తి భోజనాలు చేయాలి. గోమాతను పూజించాలి. తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసీ చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణుసహస్రనామ పారాయణం, కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసీకోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. -
7నుంచి కోస్తా జిల్లాల్లో పర్యటన
– మహానందిలో మంజునాథన్ కమిటీ సభ్యుల పూజలు మహానంది: కోస్తా ప్రాంతంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో నవంబరు 7 నుంచి పర్యటిస్తామని మంజునాథన్ కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, వెంకటసుబ్రమణ్యం, సత్యనారాయణ తెలిపారు. మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు బుధవారం మహానందికి వచ్చారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పర్యటించామన్నారు. కర్నూలు జిల్లాలో పాములపాడు మండలంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా తమ వాదనలు వినిపించాలన్నా, అభిప్రాయాలు చెప్పాలన్నా నేరుగా కలిసి వినిపించవచ్చని అన్నారు. -
మహానందికి చేరుకున్న మహానందీశ్వరుడు
నంద్యాల: దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి నంద్యాల వచ్చిన మహానందీశ్వర స్వామి మహానంది క్షేత్రానికి బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి స్వామి కామేశ్వరీ దేవి అమ్మవారితో కలిసి గత నెల 30 న నంద్యాల చేరుకున్నారు. కోట వీధిలోని బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయంలో పూజలందుకున్నాక, ఉత్సవిగ్రహాలను పల్లకిలో మహానందీ క్షేత్రానికి లాంఛనాలతో తీసుకొనివెళ్లారు. దీంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. -
నిజరూపంలో కామేశ్వరీదేవి
మహానంది: తొమ్మిదిరోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి విశేష పూజలందుకున్న శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు సోమవారం నిజరూపంలో దర్శనమిచ్చారు. దేవస్థానం ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వవర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, శాంతారాంభట్, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, తదితర పండిత బృందం విశేష పూజలు నిర్వహించారు. రాత్రి మయూర వాహనంపై కొలువైన అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించారు.స్థానిక స్వామివారి అలంకార మండపంలో శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి సహస్రదీపాలంకరణ సేవలు వైభవంగా జరిగాయి. నంద్యాలకు చెందిన విద్యార్థిని ప్రదర్శించిన భరతనాట్యం ¿భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రెడ్డి, దాతలు గంగిశెట్టి మల్లికార్జున, హైకోర్టు న్యాయవాది గంగిశెట్టి రాజేశ్, సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
సకల సిద్ధిదాయినీ...శ్రీ సిద్ధిధాత్ర దుర్గ
మహానంది: దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ సిద్ధిధాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై కొలువై అమ్మవారు ఆలయ పురవీధులో్ల ఊరేగారు. ఆలయంలోని స్వామివారి అలంకార మండపంలో అమ్మవారికి నిర్వహించిన సహస్రదీపాలంకరణ సేవ విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నంద్యాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించాయి. కార్యక్రమాల్లో దేవస్థానం ఈఓ డాక్టర్ శంకర వరప్రసాద్, దాత రామకృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ఉభయ దాతలు పాల్గొన్నారు. అమ్మవారు సోమవారం శ్రీ కామేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని వేదపండితులు తెలిపారు. -
నంది వాహనంపై మహాగౌరి
– మహానందిలో వైభవంగా గ్రామోత్సవం మహానంది: శ్రీ మహాగౌరిదుర్గను పూజించిన వారు సర్వవిధాలా పునీతులై అక్షయంగా పుణ్యఫలాలను పొందుతారని మహానంది దేవస్థానం వేద పండితులు చెండూరి రవిశంకర అవధాని పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శనివారం రాత్రి శ్రీ మహాగౌరీదుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలను కలిగిన అమ్మవారు ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో వరదముద్ర, త్రిశూలం, ఢమరుకాలను ధరించి భక్తులకు దీవెనులు ఇచ్చారు.నందివాహనంపై కొలువైన శ్రీ మహాగౌరీదుర్గ అమ్మవారికి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈఓ శంకర వరప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ఉభయదాతలు పాల్గొన్నారు. కామేశ్వరీదేవి అమ్మవారు ఆదివారం శ్రీ సిద్ధిదాత్రిదుర్గగా భక్తులకు దర్శనమిస్తారు. -
శుభంకరి...కాళరాత్రి దుర్గ
మహానంది: రూపంలో భయకంరం ఉన్నప్పటికీ కాళరాత్రి దుర్గ ఎల్లప్పుడు శుభఫలితాలను ఇస్తూ ఉంటుంది. భయంకర రూపంలో ఉన్న శ్రీ కాళరాత్రి దుర్గాదేవి శత్రువులను సంహరిస్తుందని, భక్తులను మాత్రం ఎల్లవేళలా కాపాడుతుంటుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. మహానంది క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండు కుడిచేతులు, రెండు ఎడమచేతులను కలిగిన ఈమె ఒక కుడిచేతిలో వరముద్ర, మరొక కుడిచేతిలో అభయముద్రలను కలిగి భక్తులకు వరాలిస్తుంటుంది. అలాగే ఎడమచేతిలో ఇనుప ముళ్ల ఆయుధం, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్ని ధరించి శత్రువులను సంహరిస్తుంటుందని తెలిపారు. ఉత్సవాల్లో నంద్యాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అశ్వవాహనంపై గ్రామోత్సవం శ్రీ కాళరాత్రిదుర్గ అమ్మవారిని అశ్వవాహనంపై అధిష్టింపజేసి శుక్రవారం రాత్రి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని శుభంకరీ...నమోస్తుతే అంటూ వేలవందనాలు సమర్పించారు. దేవస్థానం ఈఓ శంకర వరప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
మూడో కన్ను మూత
⇒ మహానందిలో మూడు రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు ⇒ పట్టించుకోని ఉన్నతాధికారి మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో నిఘా నేత్రాలు మూడురోజులుగా మూతపడ్డాయి. వర్షం వస్తుండడంతో వైర్లు పాడవుతాయంటూ నిఘా వ్యవస్థనే మూసేయడం గమనార్హం. ఆలయంలో హుండీలు, రూ. లక్షల విలువైన ఆభరణాలు ఉండటం, వేలాదిగా భక్తులు దర్శనానికి వస్తుండడం, కోనేరుల వద్ద తరచూ చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇలా సీసీ కెమెరాలను మూసేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ భద్రతపై ప్రత్యేక దష్టి పెట్టామని, మరో 22 సీసీ కెమెరాలు వస్తున్నాయని ప్రకటనలు చేస్తున్న ఉన్నతాధికారులు వర్షం సాకుతో వాటిని నిలిపేయడం గమనార్హం. మహానందిలో ఆలయ, భక్తుల భద్రత దష్ట్యా సుమారు 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు ఇదివరకటి నుంచే పని చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత వర్షాల కారణంగా మిగతా కెమెరాలు కూడా పనిచేయడం లేదు. వర్షం వస్తుండడంతో సర్వర్ ఆఫ్ చేశామని, విషయాన్ని ఉన్నతాధికారికి తెలియజేశామని అక్కడి తాత్కాలిక ఉద్యోగి శివ సాక్షికి తెలిపారు. క్షేత్రంలో సీసీ కెమెరాల ఆపరేటింగ్ సిస్టమ్ నిలిపేయడం దారుణమని, ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యులంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే వరుసగా నాలుగు చోరీలు జరిగాయి. శనివారం సెల్‌ఫోన్ లాకర్ల వద్ద సిబ్బంది, భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వాటి వివరాలు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిన ఉద్యోగి.. వేళలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. సెల్‌ఫోన్ లాకర్ల వద్ద వాగ్వాదం.. గుడి తలుపులు మూసేస్తారన్న విషయం చెప్పకుండా సెల్ఫోన్లను లాకర్లో ఉంచుకున్న విషయంపై శనివారం భక్తులు, అక్కడి సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటర్ వద్ద రశీదు పుస్తకం చించేయడంతో సిబ్బంది వాదనకు దిగారని కాంట్రాక్టర్ తెలిపారు. విషయంపై ఈఓతో మాట్లాడగా విచారణ చేపడతామని తెలిపారు. -
మహానందిలో రెచ్చిపోయిన కాంట్రాక్టర్
- భక్తులపై దాడి మహానంది: కర్నూలు జిల్లా మహానందిలో ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆలయంలో సెల్ ఫోన్లు ఉంచేందుకు అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కొందరు భక్తులు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆ విభాగం కాంట్రాక్టర్, సిబ్బంది కలిసి భక్తులపై దాడికి దిగారు. ఈ ఘటనతో భక్తులు భయ భ్రాంతులకు గురయ్యారు. అనంతరం ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని నంద్యాల రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. -
మహానందీశ్వరుని హుండీ లెక్కింపు
మహానంది: మహానంది క్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా రూ. 25.63 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ శంకర వరప్రసాద్ తెలిపారు. మహానంది క్షేత్రంలోని సామూహిక అభిషేక మండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కామేశ్వరీదేవి సహీత మహానందీశ్వరస్వామి, కోదండరామాలయం, వినాయకనంది ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపు ద్వారా రూ. 25,53,695 వచ్చిందన్నారు. అలాగే అన్నదానం విభాగం ద్వారా రూ. 9,453 వచ్చినట్లు చెప్పారు. రెండు కలిపి రూ. 25,63,148 వచ్చినట్లు తెలిపారు. ఈ ఆదాయం 52 రోజులకు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఏఈఓ రాజశేఖర్, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, పాలకమండలి ధర్మకర్తలు పాల్గొన్నారు. -
మహానందీశ్వరుడి సేవలో..
మహానంది: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. అనుపమచక్రవర్తి ఆదివారం మహానందీశ్వరుడిని దర్శించుకున్నారు. క్షేత్రానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ప్రొటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కోదండరామాలయం, వినాయకనంది ఆలయాల్లో హారతి తీసుకుని పూజలు చేపట్టారు. న్యాయమూర్తి దంపతులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేయించారు. -
మహానందికి ఆర్జేసీ హోదా
– గత ఐదేళ్లలో ఏడాది ఆదాయం రూ. 8 నుంచి రూ. 15కోట్లు – అన్నదాన పథకానికి రూ. 1.70కోట్ల డిపాజిట్లు మహానంది: రాష్ట్రంలో డిప్యూటీ కమిషనర్(డీసీ)స్థాయి కలిగిన ఐదు దేవాలయాల స్థాయిని పెంచేందుకు దేవాదాయశాఖ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో నందన మహారాజులు, చాళుక్యరాజులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి రాజులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. క్షేత్ర అభివృద్ధికి ధర్మకర్తగా పనిచేసిన భైరవజోష్యుల మహానందయ్య ఎంతగానో కృషి చేశారు. మహానంది దేవస్థానానికి 6–02–1950న కార్యనిర్వహణాధికారి హోదా వచ్చింది. దేవాదాయశాఖ అసిస్టెంటు కమిషనర్(సహాయ కమిషనర్) హోదా 14–07–1989న వచ్చింది. అనంతరం అనతికాలంలోనే 5–07–2002 నుంచి అసిస్టెంటు కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయిని చేరుకుంది. ఏటా పెరుగుతున్న ఆదాయం మహానంది క్షేత్రానికి ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లల్లో రూ. 8 నుంచి రూ. 15కోట్ల స్థాయికి చేరింది. ఈ ఐదేళ్లలో ఒక ఏడాది మాత్రం రూ. 6.28 కోట్లు వచ్చినా ఐదేళ్ల వ్యవధిలో రూ. 7 కోట్లు ఏడాది ఆదాయం పెరగడం విశేషం. అధికారులు, సిబ్బంది ఇంకా కృషి చేస్తే ఏడాదికి రూ. 20కోట్లు వస్తుందని స్థానికులు, భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రూ. 15కోట్ల ఆదాయం వస్తున్న క్షేత్రం జిల్లాలో రెండోది మహానంది మాత్రమే అని తెలుస్తుంది. బంగారు, వెండి ఆభరణాలు పరిశీలిస్తే మహానంది క్షేత్రానికి 821 గ్రాముల 893 మిగ్రా బంగారం, 102 కిలోల 815 గ్రాముల 550 మిల్లీగ్రాముల వెండి ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఇప్పటి వరకు సుమారు రూ. 1.70 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. స్థాయి పెరిగితే మరింత అభివృద్ధి.. రీజనల్ జాయింట్ కమిషనర్( ప్రాంతీయ సంయుక్త కార్యనిర్వహణాధికారి) హోదా పెరిగితే భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వహణాధికారి స్థాయిలో కేవలం రూ.2 లక్షల వరకు మాత్రమే పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆర్జేసీ హోదా వస్తే ఆర్జేసీ స్థాయిలో రూ. 10 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసి పనులు చేపట్టవచ్చు. అలాగే సిబ్బంది కొరత ఉంటే తన పరిధిలోనే ఏజేన్సీ, లేదా ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకోవచ్చు. ప్రతి చిన్నచిన్న పనులకు కమిషనర్ వరకు వెళ్లకుండా తనే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. పాలకమండలి సభ్యులు పెరుగుతారు. ఆలయ ప్రచారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. -
స.హ.చట్టం పరిధిలోకి దేవాదాయశాఖ
– చట్టాలను అమలు చేసే బాధ్యత పాలకులదే – దేవాలయాల్లో ధర్మాన్ని నిలబెట్టాలి – ఈఓ ఒకరు కోట్లలో అక్రమార్జన చేస్తే స.చట్టం వర్తించదా ? మహానంది : దేవాదాయశాఖకు సమాచార హక్కు చట్టం వందశాతం వర్తిస్తుందని, ఆ శాఖ కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుందని ఉభయ రాష్ట్రాల సమాచార హక్కుచట్టం కమిషనర్ విజయబాబు అన్నారు. అయితే, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం సాయంత్రం ఆయన మహానందికి వచ్చారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ శంకరవరప్రసాద్, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వారికి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీదేవీ సహిత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. అంతకు ముందు స్థానిక ఏపీ టూరిజం అతిథిగహం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని, అలాగే భక్తుల మనో భావాలను పరిరక్షించాలని చెప్పారు. శ్రీశైలదేవస్థానంలో ఒక ఈఓ రూ. కోట్లలో ఆక్రమ ఆస్తులను కూడబెట్టుకోవడం, భక్తుల విరాళాలు మింగడం స.హ. చట్టం కిందికి వస్తుందన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో కళాశాలలో, పలు ప్రాంతాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో 108 కేసుల విచారణ చేశామని, ఈ కేసులకు సంబంధించిన వివిధ స్థాయి అధికారులైన 32 మందికి షోకాజు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ప్రభుత్వ శాఖలో ఏ ఒక్కరో అవినీతికి పాల్పడితే మొత్తం ఆ శాఖకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రామకష్ణుడు, వీఆర్వోలు సత్యనారాయణ, కష్ణనాయక్ పాల్గొన్నారు. -
మహానందిలో రూ. 2.07 కోట్లతో మాడా వీధులు
· ఆలయంలో సైన్‌బోర్డుల ఏర్పాటు · పాలకమండలి సమావేశంలో తీర్మానాలు మహానంది : మహానంది దేవస్థానంలో రూ. 2.07 కోట్లతో మాడా వీధుల నిర్మాణానికి మరోసారి టెండర్లను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకరవరప్రసాద్ తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో గురువారం సాయంత్రం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన తీర్మాన వివరాలను వారు వెల్లడించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు కమిషనర్ ఉత్తర్వుల మేరకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానంలో రూ.22 లక్షలతో ఏకాంత సేవ మండపం చుట్టూ అద్దాలు, నిత్యకల్యాణమండపంలో అల్యూమినియం పార్టీషియన్స్, రామాలయంలో అద్దాల మరమ్మతులు చేస్తామన్నారు. కానుకలు హుండీలలో వేయాలన్న సమాచారానికి సంబంధించిన బోర్డులను ప్రతి ఆలయంలో ఏర్పాటు చేయాలని పాలకమండలి సభ్యులు తీర్మానించారు. కమిషనర్ అనుమతిస్తే మహానంది క్షేత్ర అభివద్ధికి విశేష కషి చేసిన దివంగత మాజీ ధర్మకర్త మహానందయ్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. పందుల నివారణకు ఆలయ పరిసరాలలో గ్రిల్స్ ఏర్పాటు, ఉచిత దర్శనం కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఈఓ రాజశేఖర్, సూపరింటెండెంట్లు పరుశురామశాస్త్రి, ఈశ్వరరెడ్డి, ఏఈ మురళీధర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు సి బాలరాజు, రామకష్ణ, మునెయ్య, చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామయ్య, చింతకుంట్ల శివారెడ్డి, వేమూరి నారాయణ పాల్గొన్నారు. -
మహానందీశ్వరుడికి సహస్రఘటాభిషేకం
– ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం మహానంది : మహానందీశ్వరస్వామివారికి ఆదివారం సహస్రఘటాభిషేక పూజలు వైభవంగా జరిగాయి. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, పండిత బృందం ఆధ్వర్యంలో విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహస్ర ఘటాల్లో గంగావాహన, ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం, కలశ ఉద్వాసన, పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహానందీశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం చేపట్టారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజు, శివారెడ్డి పాల్గొన్నారు. -
మహానందికి పుష్కర భక్తుల రద్దీ
మహానంది: మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పుష్కరాల సందర్భంగా శ్రీశైలం, సంగమేశ్వరం వచ్చిన భక్తులు మహానంది క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. కృష్ణ పుష్కరాలతో పాటు ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలు, మంత్రాలయం రాఘవేంద్రుడి ఉత్సవాలు అన్నీ కలిసి రావడంతో మహానంది క్షేత్రం గత కొద్దిరోజులుగా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అలాగే శ్రావణ మాసం శుభముహూర్తాలు ఉండటంతో ఆలయ ప్రాంగణంలో వివాహాలు కూడా జరగడంతో ఆలయం కిటకిటలాడుతోంది. -
వైభవంగా మహానందీశ్వరుడి కల్యాణోత్సవం
మహానంది: మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి కల్యాణోత్సవం గురువారం వైభవంగా జరిగింది. మహానంది దేవస్థానం చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తి తదితరులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాలకు చెందిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి శాశ్వత కల్యాణోత్సవానికి రూ. 10,116 చెల్లించి మొదటి టికెట్‌ను తీసుకున్నారు. అలాగే ఈఓ శంకర వరప్రసాద్ రూ. 10,116 చెల్లించారు. అలాగే పలువురు భక్తులు ఒకరోజు కల్యాణోత్సవానికి రూ. 1116 చొప్పున చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి రాజశేఖర్, సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలరాజు, శివారెడ్డి, సీతారామయ్య, రామకృష్ణ, మునెయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు
మహానంది : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్యశాఖ రీజనల్ డైరక్టర్ డాక్టర్ దశరథరామయ్య తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శనివారం ఆయన మహానందికి వచ్చారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఎంపీహెచ్ఈఓ హుసేన్రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉందన్నారు. ఇప్పటిఏ ప్రతి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర ్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఒక డాక్టర్, స్టాఫ్‌నర్సు, ఏఎన్ఎంలను నియమించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
మహానంది/ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అహోబిలం, మహానందిలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. మహానందిలో 230 మంది దంపతులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, కలశంలో లక్ష్మీదేవి ఆవాహన, వరలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు, తోరగ్రంధి పూజలు నిర్వహించినట్లు వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులందరికీ నంద్యాలకు చెందిన బంగారు వ్యాపారి అవ్వారు గౌరీనా«ద్, సరస్వతీ దంపతులు సారె సమర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్, ఆలయ పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు పాల్గొన్నారు. అహోబిలంలో: శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో నియోజవర్గంలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజామునుంచే మహిళలు ఆలయాల వద్ద బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలలు భక్తి శ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అహోబిలంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను దేవస్థానం ఎదురుగా కొలువుంచి తిరుమంజనం జరిపారు. నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.lమహిళలు సామాహిక వ్రతం నిర్వహించారు. ఆలయ ముద్రణకర్త శ్రీమాణ్ శఠగోప వేణుగోపాలన్ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. -
లక్ష లడ్డూలు సిద్ధం
మహానంది(కర్నూలు): కృష్ణా పుష్కరాల సందర్భంగా మహానంది క్షేత్రానికి భక్తులరద్దీ పెరుగుతుందన్న అంచనాల మేరకు లక్ష లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు మహానంది దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ కష్ణా పుష్కరాలను పురస్కరించుకుని శ్రీశైలం, సంగమేశ్వరం క్షేత్రాలకు భక్తుల రద్దీ లక్షల్లో ఉంటుందన్నారు. రెండు పుణ్యక్షేత్రాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు మహానందికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందులో భాగంగా మహానంది క్షేత్రంలో 12 నుంచి 23 వరకు ప్రతి రోజూ పదివేల లడ్లు సిద్ధంగా ఉండేలా చూస్తామన్నారు. భక్తులకు ప్రసాదాల కొరత రానివ్వమన్నారు. అలాగే గత గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి వెళ్లి గోదావరి జలాలు తెచ్చి భక్తులకు పవిత్ర తీర్థంగా పంపిణీ చేశామన్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు అందజేస్తే ఈ ఏడాది కూడా అలాగే పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
మహానందికి 4న గవర్నర్ రాక..?
మహానంది: గవర్నర్ నరసింహన్ ఈ నెల 4న మహానందికి వస్తున్నట్లు దేవస్థానం కార్యాలయానికి సమాచారం అందింది. పుష్కర ఏర్పాట్ల పరిశీలనకు వస్తున్న ఆయన శ్రీశైలం క్షేత్రానికి వెళ్తూ అహోబిలం క్షేత్రానికి వస్తారని, అక్కడ రాత్రి బస చేసి 4వ తేదీ ఉదయం మహానందికి చేరుకుని శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుంటారని సమాచారం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
భక్తులపై తేనెటీగల దాడి
- పది మందికి గాయాలు జమాలయ్యదర్గా(మహానంది): జమాలయ్య దర్గా వద్ద తేనెటీగల దాడిలో పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. నంద్యాలకు చెందిన సుమారు 20 మందికిపైగా భక్తులు జమాలయ్యదర్గా వద్ద స్వామివారికి పూజలు చేసేందుకు వచ్చారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని వంటలు చేసుకునేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్లుండి తేనేటీగలు వారిపై దాడి చేయడంతో చిన్నారులతో కలిపి సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం అక్కడే ఉన్న తిమ్మాపురం గ్రామానికి చెందిన యువకులు వేణు, సయ్యద్, తదితరులు వారికి సేవలందించారు. ఇదిలా ఉండగా గత గురువారం సైతం తేనెటీగలు దాడి చేయడంతో ఐదుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. -
మహానందీశ్వరుడి భక్తులకు రుచికర భోజనం
- పోలీసు స్టేషన్ వెనుక పార్కింగ్ - పెద్దనంది వద్ద క్షురకుల షాపుల ఏర్పాటు - పాలకమండలి సమావేశంలో తీర్మానాలు మహానంది : మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్‌లు పేర్కొన్నారు. మహానందిలోని దేవస్థానం కార్యాలయంలో శుక్రవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానందిలో ప్రస్తుతం 125 మందికి మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నామని, ఇక నుంచి ప్రతిరోజు 300 మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం అన్నం, రసం, మజ్జిగ ఇచ్చేవారని, ఇక నుంచి స్వీటు, చట్నీ, కర్రీ, పప్పు, సాంబారు, మజ్జిగ అందించి భక్తులకు ఆకలి తీర్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఆలయ పరిధిలో ఉన్న క్షురకుల షాపులను పెద్ద నంది విగ్రహం వద్దకు మారుస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందులు వాహనాల పార్కింగ్‌ను పోలీసుస్టేషన్ వెనుక, మహానంది తహాసీల్దార్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహానంది అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానందయ్య విగ్రహం ఏర్పాటుకు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు బాలరాజు, రామకృష్ణ, చింతకుంట్ల శివారెడ్డి, బండి శ్రీనివాసులు, చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామయ్య, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, అన్నదాన పథకం ఇన్చార్జ్ పార్వతీ, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో భారీగా బదిలీలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయాల్లో చాలా ఏళ్లుగా స్థిరంగా ఉంటున్న సిబ్బంది మరోచోటుకి వెళ్లే సమయం వచ్చింది. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరిగాయి. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆలయ ఏఈవో, సూపరింటెండెంట్ సహా 9 మందికి స్థానచలనం కలిగింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ట్రాన్స్ఫర్లు జరగటంతో ఆలయవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు విజయవాడ దుర్గగుడిలో 36 మంది సిబ్బందిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ద్వారకా తిరుమల ఆలయంలో సైతం 17 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
బొలేరో బోల్తా : ఒకరి మృతి
మహానంది: కర్నూలు జిల్లా మహానంది సమీపంలోని శ్రీనగరం వద్ద వేగంగా వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడి కృష్ణ(16) అనే బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కృష్ణ తదితరులు మహానందివైపు వెళుతుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 వాహనంలో మహానందికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదిగదిగో గులాబి చంద్రుడు
నేడు గులాబి రంగులో దర్శనం అరుదుగా కనిపించే ఈ దృశ్యం ఎంతో శుభకరం అంటున్న పండితులు ఏ పుణ్యకార్యం చేసినా వెయ్యిరెట్ల ఫలం మహానంది: ఎప్పుడూ తెలుపు రంగులో కనిపించే చందమామ గురువారం గులాబీ రంగులో దర్శనమివ్వనున్నాడు. అరుదుగా కనిపించే చంద్ర దర్శనాల్లో ఇదొకటిగా ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ దృశ్యం 21 గురువారం రాత్రి 10.54 నిమిషాల నుంచి 22వ తేదీ శుక్రవారం వేకువజాము 3.42 నిమిషాల వరకు ఉంటుందని కంచి పీఠ ఆస్థాన సిద్ధాంతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆగమ సలహాదారులు జ్యోతిష్య కేసరి బ్రహ్మశ్రీ దైవజ్ఞ సుబ్రమణ్య సిద్ధాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సాక్షితో మాట్లాడారు. గతంలో చంద్రుడు నీలం, బంగారు వర్ణాల్లో కనిపించిన విషయం తెలిసిందే. అందులో గులాబీ రంగులో దర్శనానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపు మేషరాశిలో అశ్వని నక్షత్రం సంచారం జరుగుతున్న సమయంలో వ్యతిరేక దిశలో 180 డిగ్రీల కోణంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుందన్నారు. 2009 ఏప్రిల్, 2012 ఏప్రిల్ 6,7న, 2014 ఏప్రిల్ 15, 16న ఇలా కనిపించిదని చెప్పారు. ఈ సమయంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా వెయ్యిరెట్ల పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు. -
మహానందీశ్వరుడికి ముత్యాల తలంబ్రాలు
మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహానందీశ్వర స్వామి వార్లకు నిర్వహించే కల్యాణోత్సవంలో ముత్యాల తలంబ్రాలను వినియోగించనున్నట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం పాలకమండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాలక మండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది కల్యాణోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గర్భాలయ విమాన గోపుర కలశం పక్కకు ఒరిగి పోవటంపై కలశం మార్పుతో పాటు లఘు సంప్రోక్షణ పూజలను మాఘమాసంలో నిర్వహించనున్నట్లు ప్రసాదరావు తెలిపారు. -
తుంగభద్రలో యువకుడి మృతదేహం లభ్యం
మహానంది (కర్నూలు) : స్నేహితులతో కలసి తుంగభద్ర నదిలో బోటింగ్‌కు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బోటులో నుంచి పడి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శనివారం మృతదేహం లభ్యమైంది. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన వేణుగోపాల్(19) తన తొమ్మిదిమంది స్నేహితులతో కలిసి శుక్రవారం కర్నూలు జిల్లా మహానందీశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో బోటు పై షికారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు మృతదేహం లభ్యమైంది. -
మహానందీశ్వరుడిని దర్శించుకున్న భన్వర్‌లాల్
మహానంది: కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరి దేవి సహిత మహా నందీశ్వరుడి ఆలయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి చీర బహుకరించారు. పూజల అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. -
మహానంది కోనేటిలో పాము కలకలం
మహానంది (కర్నూలు) : కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలోని కోనేటిలో ఆదివారం మధ్యాహ్నం పాము దర్శనమిచ్చింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కోనేటిలో పవిత్ర స్నానమాచరిస్తున్న సమయంలో భక్తులకు పాము కనిపించింది. దీంతో భక్తుల్లో కలకలం రేగింది. -
మహానందిలో హైకోర్టు న్యాయమూర్తి
మహానంది (కర్నూలు) : కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామిని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల గౌడ్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో.. భక్తులు అవస్థలు పడుతున్నారు. -
మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి
మహానంది (కర్నూలు) : కనుమరుగైందనుకుంటున్న మెదడు వాపు వ్యాధి మరోసారి వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలిక మెదడువాపు వ్యాధితో మంగళవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన దీపికాబాయి (6) గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు మొదట ఇద్దరు వైద్యులకు చూపించినా తగ్గకపోవడంతో నంద్యాలలోని ఓ చిన్న పిల్లల వైద్య నిపుణుడికి చూపించారు. మెదడువాపుగా నిర్ధారించిన డాక్టర్ మందులు సూచించడంతో అవి తీసుకుని వాడుతున్నామని, పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం దీపికాబాయి మృతి చెందినట్టు ఆమె తండ్రి కాశీరాంసింగ్ తెలిపారు. -
పీర్ల జాతరలో ఉద్రిక్తత
మహానంది: పీర్ల ఊరేగింపు తమ కాలనీకి రాలేదంటూ గ్రామస్తుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో మంగళవారం ఉదయం మౌలాలిస్వామి పీర్ల జాతర మొదలైంది. అయితే, గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి పీర్ల ఊరేగింపు వెళ్లకపోవడంతో కాలనీవాసులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని రెండు వర్గాల వారితో మాట్లాడి, శాంతింపజేశారు. -
పసికందును వదిలివెళ్లారు..
మహానంది (కర్నూలు) : పది రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు నిర్జన ప్రదేశంలో వదిలివెళ్లారు. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని నల్లమల అటవీప్రాంతం నంద్యాల-గిద్దలూరు రహదారిలోని వజ్రాలవంక సమీపంలోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద పది రోజుల మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. వజ్రాలు వెతుక్కునేందుకు అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు శిశువు ఏడుస్తుండగా విని వెళ్లి చూశారు. వారు గాజులపల్లె స్థానిక ఆర్ఎంపీ శర్మకు శిశువును అందజేయగా ఆయన ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని వారు తెలిపారు. -
మహానందిలో సెల్పోన్ల నిషిద్ధం
మహానంది : కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీకామేశ్వరీదేవీ సహీత మహానందీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులను సెల్ఫోన్లతో ఆలయంలోకి రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ శంకర వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు, కెమెరాలను ఆలయంలోకి అనుమతించమని చెప్పారు. అలాగే రుద్రగుండం, రెండు చిన్న కోనేరులలో పుణ్యస్నానాలాచరించే భక్తులు సాంప్రదాయ దుస్తులను దరిస్తేనే స్నానాలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. బీడీలు, సిగిరెట్లు, గుట్కాలు ఆలయంలోకి అనుమతించకుండా, రాజగోపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆలయ పవిత్రతకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. -
రెండు బైకులు ఢీ : ఇద్దరికి గాయాలు
మహానంది (కర్నూలు) : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం వద్ద సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. బుక్కాపురం గ్రామానికి చెందిన శివ(25) ద్విచక్రవాహనంపై మహానంది వెళ్తుండగా.. గ్రామ శివారుకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బైక్‌పై ఉన్న యువకుడితో పాటు శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. -
టోల్గేట్ టెండర్ వేలంలో ఉద్రిక్తత
మహానంది: కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న టోల్గేట్ నిర్వాహణ కోసం చేపట్టిన బహిరంగ వేలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగ వేలంలో రూ. 80.10 లక్షలకు మహానందికి చెందిన సుబ్బరామయ్య టెండర్‌ను చేజిక్కించుకున్నారు. అయితే షరతుల్లో ఉన్న విధంగా నగదును వెంటనే చెల్లించాలంటూ టెండర్ దారులు ఈవోతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. -
నిజాయితీకి అభినందనలు
మహానందిలో బ్యాగ్‌ను మరిచి వెళ్లిన భక్తులు అందులో రూ. 39 వేలు, ఏటీఎం కార్డులు పాదరక్షల కౌంటర్ యజమానికి దొరికిన బ్యాగ్ నాలుగు రోజుల తర్వాత బాధితులకు అప్పగింత మహానంది : వంద రూపాయలు దొరికితే పక్కోడికి తెలియకుండా జేబులో వేసుకునే రోజులివి. నాలుగురోజుల క్రితం దొరికిన రూ. 39వేల నగదు, విలువైన కార్డులతో దొరికిన బ్యాగును నిజాయితీతో ఓ వ్యక్తి బాధితులకు అప్పగించాడు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన నరసింహ, మంజుల దంపతులు ఈ నెల 4న గురువారం మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడిని దర్శించుకున్న అనంతరం వారు ఇక్కడి నుంచి అదే రోజు రాత్రికి తిరుపతికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక ఓ బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. బ్యాగులో రూ. 39వేల నగదు, విలువైన ఏటీఎం కార్డులు, ఇతర పత్రాలు ఉన్నాయి. వారి కుమార్తె ఇంటర్నెట్లో మహానంది సమాచారాన్ని తెలుసుకుని దేవస్థానం కార్యాలయం ఫోన్ నంబరుకు కాల్ చేసి వివరాలు చెప్పారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ ఓంకారం వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ మల్లయ్య మైక్‌లో అనౌన్స్ చేశారు. అప్పటికే పాదరక్షల కౌంటరు యజమాని కుమార్‌కు ఆ బ్యాగు దొరకడంతో సమాచారం తెలుసుకుని ఆలయ అధికారులకు అందించాడు. వారు బాధితులకు ఫోన్ ద్వారా బ్యాగ్ దొరికిన విషయం చెప్పడంతో వారు ఆనందించారు. ఆదివారం మహానందికి వచ్చి బ్యాగు, నగదును తీసుకున్నారు. దేవస్థానం అన్నదానం ఇన్చార్జ్ సుబ్బారెడ్డి, ప్రసాదాల ఇన్చార్జ్ బీకే స్వామిరెడ్డి, హోంగార్డులు రామచంద్రారెడ్డి, మధు, బాధితులు నిజాయితీగా బ్యాగ్‌ను అప్పగించిన కుమార్‌ను శాలువాతో సత్కరించారు. -
మహానంది టోల్గేట్ వద్ద గోల్మాల్
కర్నూలు(మహానంది): మహానంది దేవస్థానంలోని టోల్గేట్ వద్ద అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులను అధికారులను పట్టుకున్నారు. టోల్‌గేటు వద్ద టిక్కెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తూ వారు పట్టుబడ్డారు. శ్రీనివాసులు, విజయ్ కుమార్ రెడ్డి అనే ఇద్దరు ఏజెన్సీ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతుండగా పట్టుబడ్డారు. వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. -
మహానందీశ్వరుడిని దర్శించున్న కేఈ
మహనంది: కర్నూలు జిల్లాలోని మహానందీశ్వర స్వామిని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాతి నంది విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన కేఈ దంపతులకు ఈవో చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు కేఈ దంపతులకు ఆశీర్వచనం చేశారు. -
మహానంది లో ఆక్రమణల తొలగింపు
కర్నూలు : కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో అక్రమ కట్టడాలపై ఆలయ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆలయానికి చెందిన స్థలాల్లో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. దీంతో ఆలయ అధికారులు శనివారం ఉదయం వాటి కూల్చివేత ప్రారంభించారు. దాదాపు 60కిపైగా ఇళ్లను జేసీబీలతో తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్ల ఎదుటే తమ ఇళ్లు కూలిపోతుండగా బాధితులు రోదించారు. ఆక్రమణల తొలగింపును ఆపాలని అధికారులను ప్రాధేయపడ్డారు. (మహానంది) -
మహానందిలో వైభవంగా రథోత్సవం
కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం శివ నామ స్మరణతో పులకించింది. గురువారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. (మహానంది) -
భక్త సంద్రమైన శైవక్షేత్రాలు
-
కారు అంతలా బోల్తా పడినా....
ప్రతి మెతుకు మీద తీనే వాడి పేరు రాసిఉంటుందని వింటుంటాం.. అది నిజమేననిపిస్తుంది. ఈ ఫోటో చూస్తే మీరుకూడా ఒప్పుకోక మానరు. తలకిందులుగా పడి ఉన్న ఈ కారును చూసారుగా దీన్నిబట్టి అంచనా వేస్తే.. ఇందులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురైఉంటాడని ఊహించుకుంటే పొరపాటే.. అక్షరాల అతనికి చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహానంది సమీపంలో జరిగింది. నంద్యాల నుంచి గదాలపల్లి వెళ్తున్న బాషా వాహనం ఒక్కసారిగా మొరాయించి ఇలా కరెంటు స్తంభానికి గుద్దుకొని ఆగింది. -
మహానందిలో కూలిన అభిషేక మండపం
కర్నూలు : కర్నూలు జిల్లా మహానందిలో నిర్మాణంలో ఉన్న అభిషేక మండపం శనివారం ఒక్కసారిగా నేల కూలింది. దేవస్థానం నిధులు, భక్తులిచ్చిన విరాళాలతో సుమారు 50లక్షల వ్యయంతో మండపం పనులను ఇటివలే ప్రారంభించారు. ఉదయం మండపంలోని కొద్దిభాగం కూలిపోయింది. అక్కడే నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జునయ్య, మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడ్డారు. మండపం నిర్మాణం నాసిరకంగా ఉండడం వల్లే కూలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా దేవస్థానంలోని ధ్వజస్థంభం రాతి ద్వారాలు కూలిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహానంది క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న మండపం నేల కూలడం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భక్తులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి
మహానంది క్షేత్రానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసులు భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి గొడవలకు దిగరాదని నంద్యాల డీఎస్పీ అమర్నాథనాయుడు ఆదేశించారు.] మహాశివరాత్రి బందోబస్తులో భాగంగా మహానందికి వచ్చిన సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. భక్తులరద్దీకి అనుగుణంగా సంయమనం పాటించాలన్నారు. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు ఉండి విధులను నిర్వహించాలని పేర్కొన్నారు. నంద్యాల రూరల్ సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. క్యూలైన్లు, స్వామివారి ఆలయం, కోనేరులు, ఇతర ముఖ్యరద్దీ ప్రాంతాలను సెక్టార్లుగా విభజించామని, నాలుగు సెక్టార్లుగా చేశామన్నారు. క్రైంపార్టీ, ప్రత్యేక పోలీసులు, మఫ్టీలో ఉన్న సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. నంద్యాల-మహానంది, నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులో పెట్రోలింగ్ ఉంటుందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ వద్ద ప్రత్యేక సిబ్బంది విధులు చేపడతారని చెప్పారు. ఒక్కో సెక్టారుకు ఒక్కో సీఐ పర్యవేక్షిస్తారని వివరించారు. సీఐలు హుసేన్‌పీరా, బాలిరెడ్డి, దైవప్రసాద్, సురేంద్రనాథరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.