
మహానంది: నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం తెల్లవారు జామున 1.20 గంటల ప్రాంతంలో మూడోసారి గోశాల ప్రాంగణంలో సంచరించింది.
ఉదయం విధులకు హాజరైన ఏఈవో ఓంకారం వేంకటేశ్వరుడు సీసీ కెమెరాలు పరిశీలించగా గోశాల ముందు నుంచి కృష్ణనంది మార్గం వైపు చిరుతపులి వెళ్లిన దృశ్యం కనిపించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన డీఆర్‌వో హైమావతి, ఎఫ్‌బీవో ప్రతాప్‌లకు సమాచారం ఇచ్చారు. చిరుత భయంతో వణికిపోతున్న స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి ఆ చిరుతను బంధించాలని కోరుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment