
ఏలూరు జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి శివారులో రెండ్రోజుల చిరుత పులి సంచరించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను గుర్తించేందుకు స్థానికంగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అయితే సోమవారం ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు గుర్తించారు. ఆ ప్రాంతం పాదముద్రలు సేకరించి రాజమండ్రి ల్యాబ్‌కు పంపించారు. అదే సమయంలో చితరు సంచరిస్తుందని, పరిసర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు.
