
పశ్చిమగోదావరి జిల్లా: ఏలూరు జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి సమీపంలో హైవేపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది.
శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి 40మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ టావ్రెల్స్ బస్సు శ్రీకాకుళం పాతపట్నం వెళ్తుంది. మార్గం మధ్యలోని గుణ్ణం పల్లి సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల్ని వేరే బస్సులో గమ్య స్థానానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.