ఏలూరు, సాక్షి: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం.
పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ప్రయాణికులతో ఓ బస్సు వెళ్తోంది. అయితే ఏలూరు కలపరు టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ వేకువజామున బస్సు ఢీ కొట్టింది. వేగానికి బస్సు ముందు భాగంగా.. లారీలోకి చొచ్చుకుపోయింది. బస్సులోనే ఇద్దరు ప్రయాణికులు ఇరుక్కుపోగా.. ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే..
తన క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన ప్రయాణికుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం అందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment