
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నాం ఈ ప్రమాదం జరిగింది. అయితే, బస్సు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘాట్ రోడ్‌లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, లారీ చిత్తూరు నుంచి ఐరన్ లోడ్‌తో బెంగళూరు వెళ్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మనోహర్‌తో పాటు బస్సులో ప్రయాణీకులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment