private travels bus
-
పొంగల్ బాదుడు..టికెట్ రేట్లు అదరహో!
-
టావెల్స్ బస్సును ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు
కోదాడ రూరల్: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రయాణికులతో రాజమహేంద్రవరానికి బయల్దేరింది.శనివారం తెల్లవారుజామున కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ వద్ద హైవే పక్కన బస్సును నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లి ఆగింది. రెండు బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నవ్య, ఆదిత్య, తేజ, డేవిడ్‌లను కోదాడలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు, కె.మణి, దానియేలు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
టెంపోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు.. టెంపును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది చిన్నారులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని థోల్పుర్‌లో శనివారం అర్ధరాత్రి స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే, వీరంతా బరౌలీలో ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
టైరు పేలి.. మంటలు చెలరేగి..
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్‌పేట ప్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ఎస్ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది. -
పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సును పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివరాల ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున దిగపహండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 10 మంది మృతిచెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు, సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో గాయపడిని వారిని బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందిస్తున్నారు. Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, on Sunday late night. Injured were immediately rushed to the MKCG Medical College in Berhampur for treatment. "Two buses collided in which 10 people died. The injured were immediately admitted to MKCG… pic.twitter.com/OE3G3BhMFl — ANI (@ANI) June 26, 2023 అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోంది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. #ଦିଗପହଣ୍ଡିରେ_ଭୟଙ୍କର_ଦୁର୍ଘଟଣା ଗଂଜାମ ଦିଗପହଣ୍ଡିରେ ଦୁଇ ବସ୍ ମଧ୍ୟରେ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା..ସମସ୍ତ ଆହତ ବ୍ରହ୍ମପୁର ବଡ଼ ମେଡିକାଲରେ ଭର୍ତ୍ତି କରାଯାଇଛି#MKCG #accident #Ganjam #Odisha #OTV pic.twitter.com/t52OfjNgxB — ଓଟିଭି (@otvkhabar) June 26, 2023 ఇక, ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: టిక్కెట్ లేకుండా ‘వందేభారత్’ ఎక్కి.. భయంతో వాష్‌రూమ్‌లో నక్కి.. -
కూకట్పల్లి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫైర్ కేసును ఛేదించిన పోలీసులు
-
బస్సులో టాయిలెట్‌కు వెళ్లి.. ఎగ్జిట్ డోర్ తీసి ఒక్కసారిగా..
సాక్షి, ఏలూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ టాయిలెట్‌కు వెళ్లిన అనంతరం పొరపాటున ఎగ్జిట్ డోర్ తీసి అడుగు బయటపెట్టిన ఓ ప్రయాణికుడు రోడ్డు మీద పడిపోవడంతో మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఆకురాతి నన్నయ్య (59) ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో బంధువుల ఇంటికి ప్రయాణమాయ్యరు. ఈ నెల 11న రాత్రి హైదరాబాద్‌లోని ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కారు. ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. నన్నయ్య కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు వెనుక బాగంలోని టాయిలెట్ రూములోకి వెళ్లారు. అనంతరం బయటకు వస్తూ లోపలికి వెళ్లే తలుపు అనుకుని బస్సు వెనుక భాగంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపు తీసి ముందుకు వెళ్లటంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. దీంతో పెద్ద శబ్దం రాగా, డ్రైవర్ విషయాన్ని గమనించి బస్సును నిలిపివేశారు. జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో నన్నయ్యను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏలూరు రూరల్ ఎస్సై లక్ష్మణబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం బస్సులో ప్రయాణించే వారికి ఎగ్జిట్ డోర్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. చదవండి: (పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి) -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని చింతూరు మండలంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సాలోని భవానిపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. క్షతగాత్రులను ఏడుగుర్రాళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చింతూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (మే 26న వివాహం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి) -
ప్రైవేట్ ట్రావెల్స్ రూటే సెపరేటు..అనుమతులు ఒకలా.. ప్రయాణం మరోలా..
సాక్షి, ఆదిలాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అడ్డదారిలో జిల్లా ప్రయాణికులను తరలించుకుపోతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. కాంటాక్టు క్యారియర్ అనుమతులు ఉన్న బస్సులు ఇలా మధ్య, మధ్యలో ఆపి ప్రయాణికులను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నా.. ఆదిలాబాద్‌లో నిలిపి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ బస్సులపై చర్య తీసుకోవాల్సిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా కేంద్రం మీదుగా ఆదిలాబాద్–హైదరాబాద్, రాయ్‌పూర్ – హైదరాబాద్, నాగ్‌పూర్ – బెంగళూరు మధ్య అనేక ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. ఆరెంజ్, జీడీఆర్, ఎస్ఆర్ఎస్, శబరి, దివాకర్, ఖురానా అనే ట్రావెల్ బస్సులు ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మీదుగా గమ్య స్థానానికి వెళ్తాయి. ఇవే కాకుండా ఆదిలాబాద్ నుంచి నిత్యం ముస్కాన్, మెట్రో, డైమండ్, పల్లవి, సహరా స్థానిక ట్రావెల్స్ ఏజెన్సీల నుంచి హైదరాబాద్‌కు రాత్రి సర్వీసులు నడుస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. వారంతా హైదరాబాద్ వాసులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వందలాది మంది ప్యాసింజర్లు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. లాగేజీ దందా.. కాంటాక్టు క్యారియర్ అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తూ స్టేజ్ క్యారియర్‌గా బస్సులను నడుపుతుండడమే కాకుండా ఈ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకులు పార్శిల్, లగేజీ దందాను అక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చిపోయే బస్సులు పెద్ద మొత్తంలో పార్శిల్, లగేజీ నిర్వాహణ చేపడుతున్నాయి. వస్తు సామగ్రిని ఒక చోట నుంచి మరోచోటకి బస్సుల ద్వారా తరలించే అనుమతి వీరికి లేకపోయినా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్యాసింజర్లను చేరవేయడం ద్వారా ట్రావెల్ ఏజెన్సీలకు అనుకున్న స్థాయిలో లాభాలు ఉండవని, అసలు పార్శిల్, లగేజీలు చేరవేయడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బస్సుల ద్వారా వస్తుసామగ్రి చేరవేత రూపంలో అనేక అక్రమ దందాలు కూడా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది వ్యాపారులు డబ్బులను హవాలా రూపంలో చేరవేస్తారనే ప్రచారం కూడా ఉంది. పెద్ద మొత్తంలో లగేజీని బస్సుల బాక్స్లతోపాటు టాప్‌పై తీసుకొస్తుండడంతో ఎదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ లగేజీ కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. దీనిపై ఇటు పోలీసు, అటు రవాణా శాఖ అధికారుల నిఘా లేకపోవడం వారికి కలిసి వస్తోంది. భద్రత డొల్లా.. ప్రస్తుతం ప్రైవేట్ బస్సులు స్లీపర్ కోచ్‌లను తీసుకురావడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సీటింగ్ విధానంతో బస్సు లోపల స్థలం ఇరుకుగా మారింది. ఎదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులు ఒకరికి దాటుకుని మరొకరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరణాల సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా కాంటాక్టు క్యారియర్ అనుమతి ఉన్నవారు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకిస్తారు. దానికి విరుద్ధం స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నప్పటికీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సును నడపడమే కాకుండా మధ్యమధ్యలో బస్సును ఆపి ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్దం. కానీ ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. -
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
గోపవరం: మండలంలోని పి.పి.కుంట సమీపంలో నెల్లూరు– ముంబై (ఎన్‌హెచ్–67) జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి నెల్లూరు వెళుతున్న పీఎస్ఆర్ ప్రైవేటు ట్రావెల్స్æ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు ముందు భాగంలో ఉన్న రాజస్థాన్‌కు చెందిన సురేకుమార్(30) అనే వ్యక్తి అదుపు తప్పి కిందపడటంతో టైరు ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్‌కు చెందిన జగదీ‹Ù, మల్లికార్జున, వాకాడుకు చెందిన పద్మావతి, కుసుమ, అనంతపురానికి చెందిన విజయబాబులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు అతివేగంగా వెళుతుండటం, డ్రైవర్ నిద్రలోకి జారడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. మరో రెండు నిమిషాల్లో గమ్యం చేరేలోపే.. కాగా మృతి చెందిన సురేకుమార్ పి.పి.కుంట వద్ద గాలిమిషన్‌లో కూలీ పని చేసుకుంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో రెండు నిమిషాల్లో పి.పి.కుంట స్టేజీ వద్ద దిగేందుకు పుట్‌బోర్డు మీదకు చేరుకున్న సురేకుమార్ ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో కిందపడి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బద్వేలు రూరల్ ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని టైరు కింద ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటికి తీశారు. బస్సు ఢీకొన్న లారీ సిమెంట్ లోడుతో వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. సురేష్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 30మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారందరినీ పడినవారిని చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ...క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై డ్రైవర్ దగ్గర కనీసం సమాచారం కూడా లేదన్నారు. ప్రయాణికుల పేర్లు, వివరాలు...కనీసం ఫోన్ నెంబర్లు కూడా లేవని అన్నారు. తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నియమ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
'అనంత'లో అదుపు తప్పిన వోల్వో బస్సు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పాలసముద్రం సమీపంలో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. ఎన్‌హెచ్-44పై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వోల్వో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం) -
ట్రావెల్స్ బస్సు నిలిపివేత
జహీరాబాద్/ మనూరు (నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మాడ్గి చెక్‌పోస్టు వద్ద ముంబై నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సోమవారం పోలీసులు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ఈ బస్సులో దుబాయ్ నుంచి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు 32 మంది ఉన్నారు. ముంబైలో దిగి రాష్ట్రానికి వస్తున్న వీరి వాహనాన్ని నిలిపివేసి అదే బస్సులో తిప్పి పంపించారు. నిజామాబాద్, కరీంనగర్ వెళ్లాల్సి ఉంటే వెనుకకు తిరిగి బీదర్ మీదుగా వెళ్లాలని సూచించడంతో అక్కడి నుంచి తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తి చెక్‌పోస్టువద్ద నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వారిని గుర్తించిన పోలీసు సిబ్బంది బస్‌ను నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి చేతులపై వేసిన ముద్రలను గుర్తించారు. స్థానిక ఎస్ఐ శేఖర్, నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ బాలయ్య, వైద్యాధికారులు హుటాహుటిన చెక్పోస్టువద్దకు చేరుకొని వారి వివరాలు తెలుసుకున్నారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో.. వీరందరూ ఈ నెల 21న దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వచ్చారు. వారికి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ట్రావెల్స్ బస్సులో ప్రభుత్వ అనుమతితో నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాలకు పంపించే ఏర్పాటు చేశారు. వీరు ముంబై నుంచి కర్ణాటక మీదుగా తెలంగాణకు చేరుకోవాల్సి ఉంది. వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి పోలీస్ ఎస్కార్టు ద్వారా నారాయణఖేడ్ మీదుగా నిజామాబాద్ పంపించారు. వారంతా స్వస్థలాలకు చేరుకునే వరకు దారివెంట స్థానిక పోలీసు ఎస్కార్టు ఉంటుందని నారాయణఖేడ్ సీఐ తెలిపారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే వారి కి వ్యాధి లక్షణాలు ఏమీ లేనందునే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి, చేతులపై ముద్రలు వేసి పంపించినట్లు తెలిసింది. కాగా వారి చేతులపై వచ్చే నెల 4వ తేదీ వరకు బయట సంచరించకుండా ఎయిర్‌పోర్టులో క్వారంటైన్ ముద్ర వేసినట్లు గుర్తించారు. -
ఆర్టీఓ తనిఖోల్లో 8 బస్సులు సీజ్
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
రెండు బస్సులు ఢీ,ఇద్దరు మృతి
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. శబరిమల నుంచి నల్గొండకు అయ్యప్ప భక్తుల బృందంతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నెల్లూరు - పూతలపట్టు రహదారిపై కాశిపెంట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన బస్సు డ్రైవర్ రమేష్, మరో ప్రయాణికుడు మృతి చెందగా.. మరో 30 మంది అయ్యప్ప భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో క్షతగాత్రులను తరలించడానికి అంబులెన్స్‌లు లేక లారీలో ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి మేకపాటి దిగ్భ్రాంతి చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రమాదం జరిగిన తీరును జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. -
తప్పిన పెను ప్రమాదం, ట్రావెల్స్ బస్సు దగ్ధం
సాక్షి, నల్గొండ: నల్గొండలో పెను ప్రమాదం త్రుటిలో తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్కూట్‌తో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి కిందకు దిగిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు -
దారి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు తెరతీసిన దారి దోపిడీ పర్వం సోమవారం కూడా కొనసాగింది. దసరాకు సొంతూళ్లకు బయలుదేరిన వారి నుంచి ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ నిర్వాహకులు వందశాతం అదనపు చార్జీలు వసూలు చేశారు. యథావిధిగా విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లేవారి నుంచి సాధారణ టికెట్ ధరపై రెట్టింపు చార్జీలు వసూలు చేసి జేబులు గుల్ల చేశారు. నగరం నుంచి తెలంగాణా రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సుమారు 1400 బస్సులు తరిగినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్లో 1500 బస్సులు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 3800 బస్సులకుగాను.. సోమవారం సుమారు 1600 మంది తాత్కాలిక సిబ్బంది సాయంతో 1500 బస్సులు తిప్పారు. వీటిలో 500 వరకు ఆర్టీసీ అద్దె బస్సులు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ బస్సుల్లోనూ తాత్కాలిక కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్లచేశారు. రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేసి జేబులు నింపుకోవడం గమనార్హం. ప్రయాణికులు విధిలేక వారు అడిగినంత సమర్పించుకున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో పలు ఆర్టీసీ డిపోల వద్ద రెగ్యులర్ కార్మికులు బతుకమ్మ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం ప్రయాణికులపై దోపిడీకి తెగబడ్డాయి. నగరంలో వివిధ రూట్లలో రాకపోకలు సాగించిన సెవన్‌సీటర్ ఆటోలు, సాధారణ ఆటో డ్రైవర్లు సైతం ప్రయాణికుల అవసరాన్ని సొమ్ముచేసుకున్నారు. పలు ప్రధాన రూట్లలో స్వల్ప దూరాలకే రెట్టింపు చార్జీలు ముక్కుపిండి మరీ దోచుకున్నారు. క్యాబ్ సర్వీసులు సైతం అదనపు శ్లాబు రేట్లు, సర్‌చార్జీల పేరిట నిలువునా ముంచేశాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు కిటకిట సమ్మె ప్రభావంతో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిశాయి. సోమవారం 125 సర్వీసుల్లో సుమారు 1.50 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ రూట్లలో రద్దీని బట్టి ప్రతి మూడు.. ఐదు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. సుమారు వంద అదనపు సర్వీసులను నడిపినట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఈ సర్వీసుల్లో సోమవారం సుమారు 3 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు. పండగకు మెజార్టీ సిటీజన్లు పల్లెబాట పట్టడంతో మెట్రో రద్దీ కాస్త తగ్గింది. దూరప్రాంత రైళ్లు బిజీబిజీ.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిన 80 ఎక్స్‌ప్రెస్.. మరో 100 ప్యాసింజర్ రైళ్లు సైతం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయి. రైళ్లలో సీట్లు, బెర్తులు దొరక్క నానా అవస్థలు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రైళ్లలో నానా ఇబ్బందులు పడ్డారు. -
అధిక చార్జీల వసూలుపై కొరడా.. కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె, దసరా పండగు నేపథ్యంలో ప్రైవేటు వాహనదారులు విచ్చలవిడిగా ప్రజా సొమ్మును దోచుకుంటున్నారు. అందినకాడికి అందినట్లు అడ్డు అదుపు లేకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. పండుగ సమయం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న యజమానులు భారీగా దోపిడీకి దిగుతున్నారు. అయితే ప్రైవేట్ బస్సుల దోపిడీపై రవాణా శాఖ కొరడా విధిస్తోంది. అధిక చార్జీల వసూలుపై స్పెషల్ డ్రైవ్ జరపాలని రవాణా కమిషనర్ సీతారామాంజనేయులు ఆదేశించారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనీకీలు చేపడుతోంది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న 300 బస్సులపై అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అలాగే హైద్రాబాద్, ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు రవాణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే బస్సులపై నిఘా పెంచారు. భారీగా చార్జీలు వసూలు చేస్తున్న వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. -
అదిగో సమ్మె... ఇదిగో బస్సు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ బస్సులు సమ్మెను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. అడ్డగోలు చార్జీలతో ఇష్టారాజ్యంగా దారిదోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రతిపాదన నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్నారు. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకవైపు దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ 50 శాతం అదనపు దోపిడీకి పాల్పడుతుండగా, ప్రైవేట్ ఆపరేటర్లు మరో అడుగు ముందుకేసి వంద శాతం దోపిడీ కొనసాగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్న దృష్ట్యా ప్రైవేట్ బస్సుల్లో ముందస్తుగా బుక్ చేసుకోవడమే మంచిదంటూ ప్రయాణికులపైన ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఒకవేళ కార్మికుల సమ్మె అనివార్యమైతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైనే ఆధారపడి ముందస్తు బుకింగ్‌లకు సిద్ధపడుతున్నారు. దీంతో అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, మియాపూర్, బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్, కోఠీ, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సుల బుకింగ్ కేంద్రాల వద్ద అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ బస్సుల పరిమితిని, రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సి వస్తుంది. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, కడప, బెంగళూరు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రెట్టింపు కంటే ఎక్కువ చార్జీలు చెల్లించుకోవలసి వస్తోంది. మరోవైపు రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు చార్జీలను పెంచేస్తున్నారు. ఆర్టీసీ 50 శాతం అ‘ధన’ం... దసరా రద్దీ దృష్ట్యా ఈసారి 4933 బస్సులు అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. గత నాలుగు రోజులుగా రెగ్యులర్ బస్సులతో పాటు, రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ సమ్మె ముంచుకొస్తుండగా మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ యదావిధిగా 50 శాతం అదనపు చార్జీలతో ప్రయాణికులపైన దోపిడీ కొనసాగిస్తోంది. తెలంగాణ పరిధిలో అదనపు చార్జీలు ఉండబోవని, 200 కిలోమీటర్లు దాటి వెళ్లే బస్సుల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. కానీ ప్రత్యేక బస్సులన్నింటిలోనూ 50 శాతం అదనపు చార్జీలు విధిస్తున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘సాధారణ రోజుల్లో జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి నిర్మల్‌కు ఇలాగే అదనపు చార్జీలు చెల్లించవలసి వచ్చిందని’ నారపల్లిలో ఉంటున్న ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేట్ దోపిడీ తరహాలోనే ఇది ప్రభుత్వరంగ దోపిడీ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న 5వ తేదీ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక్క రోజే సుమారు 1000 బస్సులను అదనంగా నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 5,6 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలి వెళ్లనున్నారు. అలాగే తిరుగు ప్రయాణికులకు సైతం ఆర్టీసీ బస్సులపైన ఆధారపడాల్సి ఉంటుంది. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసిందే. రైళ్లలో కిటకిట... ప్రతిరోజు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ పెరిగింది. వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో రిజర్వేషన్లు లభించని ప్రయాణికులు సాధారణ బోగీలపైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అన్ని రైళ్లలో రద్దీ కిక్కిరిసిపోతోంది. హైదరాబాద్ నుంచి ముంబయి, పట్నా, దిల్లీ, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ నెలకొంది. -
ప్రయివేట్ బస్సు బోల్తా, 15మందికి గాయాలు
-
జూపార్క్ వద్ద ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, హైదరాబాద్ : ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు శనివారం ఉదయం జూపార్క్ సమీపంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్ మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం
సాక్షి, ఒంగోలు: స్థానిక త్రోవగుంట ఆటోనగర్‌లో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 4 గంటల మధ్యలో రెండు కె.యం.బి.టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో ఆటోనగర్‌లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పార్కు చేసిన వాహనాలు దగ్ధం కావడంపై ఏం జరిగి ఉంటుందా అంటూ చర్చించుకోవడం ప్రారంభించారు. మీడియాలో వస్తున్న కథనాలతో తాలూకా సీఐ యం.లక్ష్మణ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలిబూడిదైన రెండు బస్సులను పరిశీలించారు. త్రోవగుంట ఆటోనగర్‌లో మంటల్లో దగ్ధం అవుతున్న ప్రైవేట్ర్ టావెల్స్ బస్‌లు బస్సుల యజమాని కళాధర్‌ను ప్రశ్నించారు. రెండు బస్సులకు మంటలు ఎలా అంటుకున్నాయి, మీకు ఎప్పుడు తెలిసింది తదితర ప్రశ్నలు వేశారు. తనకు ఉదయం 3.35 గంటల సమయంలో ఫోన్ వచ్చిందని, అయితే అప్పటికే కంట్రోల్ రూం నుంచి సమాచారం అందడంతో అగ్నిమాపక శకటం కూడా ఘటనాస్థలానికి బయల్దేరినట్లు తెలిసిందన్నారు. దీంతో తాను హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నానన్నారు. కాలిపోయిన బస్సు ధర రూ. 1.50 కోట్లు ఉంటుందని, రెండు బస్సులకు బీమా సౌకర్యం కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏసీ మెషీన్ వద్ద ఎలుకలు వైర్‌ను కట్ చేయడం ద్వారా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నామని సీఐ లక్ష్మణ్‌కు తెలిపారు. వెల్లువెత్తుతున్న అనుమానాలు ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇటు పోలీసులకే కాకుండా మరో వైపు అగ్నిమాపక శాఖ అధికారులకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారిని వివరణ కోరగా తొలుత ఏదైనా కేర్లెస్ స్మోకింగ్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ప్రాంతాన్ని పరిశీలించామని, అయితే అటువంటి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు పడి ఉండడాన్ని గుర్తించామని, మద్యం సేవించడం ఆ ప్రాంతంలో నిత్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. రెండు బస్సులు పార్కు చేసి ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని తాము భావించలేకపోతున్నామని ఈ నేపథ్యంలో పోలీసు విచారణ తప్పనిసరి అని భావించి ఘటనపై పోలీసులను విచారణ చేపట్టాలని కోరుతూ పోలీసుశాఖకు సమాచారం పంపనున్నట్లు ఒంగోలు ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రహస్య విచారణ చేపట్టిన పోలీసులు ఇదిలా ఉంటే బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా తదుపరి విచారణను వేగవంతం చేయాలని పోలీసులు దృష్టి సారించారు. అయితే తమకు ఫిర్యాదు రానప్పటికీ ఘటన తమ పరిధిలోది కావడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన రహస్య విచారణను వేగవంతం చేశారు. తొలుత బస్సు దగ్ధం అవుతున్న దృశ్యాన్ని గమనించింది ఎవరు, కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా తెలుసుకునే బాధ్యతను సిబ్బందికి అప్పగించారు. అయితే వెల్లువెత్తుతున్న అనుమానాల నేపథ్యంలో సంబంధిత ఏరియాలో సెల్టవర్ల నుంచి వెళ్లిన కాల్స్ జాబితాను కూడా పరిశీలించి వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని భావిస్తున్నట్లు సమాచారం. -
కర్నూలులో దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
-
దారి దోపిడీకి రహస్య ఒప్పందం
కర్ణాటక ప్రైవేట్ బస్సులు ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన డీ.హీరేహాళ్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలోని ఓ అధికారి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారు. ‘దారి దోపిడీ’కి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ తతంగానికి ఆర్టీఏలోని జిల్లాస్థాయి కీలక అధికారి కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. అనంతపురం టవర్‌క్లాక్: కర్ణాటకలో బళ్లారి జిల్లా నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతమై డీ.హీరేహాళ్ మండలంలో దాదాపు 11 కిలో మీటర్ల మేర కర్ణాటక ప్రైవేట్ బస్సులు యథేచ్ఛగా ప్రయాణం చేస్తున్నాయి. కొందరు ఆర్టీఏ అధికారులు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. పన్ను చెల్లించకుండా పర్మిట్ తీసుకోకుండా ప్రతి రోజూ కర్ణాటక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఆంధ్రా సరిహద్దులో నుంచి వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి రూ.లక్ష ఒక్కో బస్సుకు పర్మిట్ తీసుకోవాలి అంటే పన్ను కట్టాలి. అలా కర్ణాటకకు చెందిన దాదాపు 100 ప్రైవేట్ బస్సులకు మూడు నెలలకు ఒకసారి రూ.కోటి ప్రభుత్వానికి రావాల్సి ఉంది. గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి రహస్య ఒప్పందం కుదుర్చుకుని మూడు నెలలకు ఒకసారి దాదాపు రూ.15 లక్షలు మామూళ్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో కొంత మొత్తం జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో పని చేసే ఓ కీలక అధికారికి అందుతున్నట్లు సమాచారం. ఈయన అండదండలతో రెండేళ్లుగా దారి దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల రెండేళ్లకు దాదాపు రూ.8 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఆ బస్సులను సీజ్ చేయొద్దంటూ ఆదేశాలు! జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో ఒక అధికారి కర్ణాటక ప్రైవేట్ బస్సులను సీజ్ చేయడానికి వెళ్తే కీలక అధికారి రంగం ప్రవేశం చేసి.. వాటి పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా కర్ణాటక బస్సులు ఆంధ్ర సరిహద్దులో ప్రయాణిస్తుంటే చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మళ్లీ రెండేళ్లగా గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలోని ఓ అధికారి రహస్య ఒప్పందంతో ఆంధ్ర సరిహద్దుల్లో కర్ణాటక ప్రైవేట్ బస్సులు తిరిగేలా చేసినట్లు సమాచారం. రాత్రి వేళలో ప్రయాణం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి తుమకూరు, హరియాన్, చెళ్లికెర, డీ.హీరేహాళ్ సమీపంలోని హైవే మీదుగా బళ్లారి – హోస్పెట్, రాయచూర్, బీదర్ మీదుగా హైదారాబాద్‌కు కర్ణాటక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణిస్తుంటాయి. డీ.హీరేహాళ్ సమీపంలోని ఓఎంసీ మైన్స్ గేటు వద్ద హైవే నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి లింగనహళ్లి, బస్టాప్ వరకు సుమారు దాదాపు 11 కిలో మీటర్లు మేరకు ఆంధ్రా పరిసరాలల్లోని హైవేలోకి ప్రయాణం చేస్తాయి. ఆ తర్వాత తిరిగి కర్ణాటక సరిహద్దులోకి వస్తాయి. నిబంధనల మేరకు ఆంధ్రా సరిహద్దులోకి ప్రవేశించి ప్రయాణం చేసే ఇతర రాష్ట్రాల ప్రైవేట్ బస్సులు తప్పని సరిగా పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు అక్కడ అమలు కావడం లేదు. దీని ఆసరాగా తీసుకొని గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయం అధికారులు మామూళ్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చర్యలు తీసుకుంటాం డీ.హీరేహాళ్ వద్ద ఆంధ్రా సరిహద్దులో కర్ణాటక ప్రైవేట్ బస్సులు ప్రయాణం చేస్తున్నాయని, ఆ బస్సుల నిర్వాహకులు ఎటువంటి పన్నులు, పర్మిషన్ తీసుకోలేదని మా దృష్టి వచ్చింది. వీటిపై గుంతకల్లు ఆర్టీఏ అధికారులు కర్ణాటక ప్రైవేట్ బస్సులపై నిఘా వేసి చర్యలు తీసుకునే విధంగా సూచించాం. పన్నులు చెల్లించకుండా ఆంధ్రాలో కర్ణాటక ప్రైవేట్ బస్సులు ప్రయాణం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – సుందర్ వద్దీ, డీటీసీ, -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు నుంచి హైదరాబాదు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా కిందికి దిగిపోయారు. కనకదుర్గా ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 07 టీజే 3233 నంబరు కలిగిన బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో తణుకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం నుంచి ఆదివారం రాత్రి బయల్దేరింది. ఇటీవల సంక్రాంతి పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆన్లైన్ యాప్ ద్వారా తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు హైదరాబాదుకు టెక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రయాణికులందరూ బస్సు ఎక్కాక 8.30 గంటల ప్రాంతంలో బయలుదేరుతుండగా బాయ్నెట్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దిగిపోయారు. స్థానికులు మంటలను అదుపు చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కారణాలు తెలియాల్సి ఉంది. తణుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు. -
ట్రావెల్ దందా!
రెక్కలు ముక్కలు చేసుకుని... సొంత ఊరికి, కన్నవారికి సుదూరంగా... రోజువారీ కూలి పనులు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలెన్నో జిల్లాలో ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఏడాదికోసారి వచ్చే ముఖ్యమైన సంక్రాంతి పండగకోసం సొంత గ్రామాలకు తరలివస్తుంటారు. కానీ వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు ట్రావెలర్స్ ఇష్టానుసారం బస్‌చార్జీలు పెంచేసి... వారి రెక్కల కష్టాన్ని నిలువుగా దోచేస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం దాచుకున్న సొమ్ము మొత్తం బస్సు చార్జీలకోసమే వెచ్చించి..కన్నవారికి ఏమీ ఇవ్వలేకపోతున్నారు. వారి కష్టాన్ని మొత్తం బస్సులకు ధార పోస్తున్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీకి చెందిన కె.రామారావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన పండగ దగ్గర పడటంతో సొంత ఊరికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి విజయనగరం చేరుకునేందుకు అయిన చెల్లించిన మొత్తం చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మక మానదు. స్లీపర్ క్లాస్ బస్సు ఎక్కిన భార్య భర్తలిద్దరి నుంచి రూ. 5550ల వరకు వసూలు చేశారు. సాధారణ రోజుల్లో రూ. 1800లు ఉండే ధరను ఒక్క సారిగా రెట్టింపు చేయటం గమనార్హం. విజయనగరం మున్సిపాలిటీ:సంక్రాంతి వచ్చిందంటే సగటు మానవుడి ప్రయాణం గగనమైపోతోంది. సొంత ఊళ్లకు వెళ్లేవారు కొందరైతే, అత్తవారిళ్లకు, అమ్మల వద్దకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపధ్యంలోనే రైళ్ల రిజర్వేషన్లు దొరకని వారు, జనరల్ బోగీల్లో కిక్కిరిసి కూర్చునే ప్రయాణికులను చూసి ఇదేమి ప్రయాణంరా బాబూ అంటూ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న సంబంధిత యజమానులు ఆమాంతం టికెట్ ధరను పెంచేసి ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీ కన్నా రెట్టింపు మొత్తాన్ని గుంజుతున్నారు. రాష్ట్రంలోనేకాకుండా పక్క రాష్ట్రానికి చెందినవారు ఎంతోమంది జిల్లాలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నవారు ఉన్నారు. వీరంతా సంక్రాంతి పండగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. వారంతా ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ఈ వారం రోజుల్లో రోజుకు 15 నుంచి 25 వరకు రద్దీని బట్టి ప్రైవేటు సర్వీసులు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల వివరాలు ఇలా.... పండగ నేపథ్యంలో ముందుగా వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారిని టార్గెట్ చేసిన ప్రైవేటు సర్వీసు యాజమాన్యాలు హైదరాబాద్ నుంచి వచ్చే వారి వద్ద నుంచి ఏసీ స్లీపర్ సర్వీసుకైతే ఒక్కో టిక్కెటు ధర రూ. 2500ల నుంచి రూ. 2700లవరకూ వసూలు చేస్తున్నారు. ఏసీ సిట్టింగ్ సర్వీసుకైతే రూ. 2వేలు గుంజుతున్నారు. అదే నాన్ ఏసీ సర్వీసులకైతే రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే సాధారణ రోజుల్లో అయితే ఏసీ సిట్టింగ్ సర్వీసు ధర రూ 800 నుంచి రూ1000 మాత్రమే ఉండేది. అదే నాన్ఏసీ సర్వీసులకైతే రూ600 నుంచి రూ700 ఛార్జీ ఉండేది. విజయవాడ నుంచి విజయనగరం చేరుకోవాలంటే గతంలో ఉన్న ఏసీ స్లీపర్ క్లాస్ టిక్కెట్ ధరను రూ. 700ల నుంచి రూ. 1800ల వరకు పెంచేశారు. అదే నాన్ఏసీ టిక్కెటు ధర ఐతే రూ. 400ల నుంచి రూ. 800ల వరకు ధర పలుకుతోంది. ఈ రెండు రోజుల్లో ఇటు నుంచి ప్రయాణానికి మాత్రం సాధారణ ధరలే అమలవుతుండగా.. పండగ అనంతరం రోజుల్లో రెట్టింపు చార్జీలు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి ఆయా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ఆన్లైన్లో ధరల పట్టికను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచాయి. ఆర్టీసీలోనూ అదే బాదుడు సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా తీసుకొని ఆర్టీసీ అడ్డగోలుగా ఛార్జీలు పెంచింది. దూరప్రాంతాలకు ప్రత్యేక సర్వీసుల ద్వారా భారీగా వసూలు చేస్తోంది. దూరప్రాంతాలకు వేసిన సర్వీసుల్లో చార్జీని 50 శాతం పెంచారు. రెండురోజులుగా ఈ సర్వీసుల ద్వారా లక్షల రూపాయలు ఆదాయాన్ని పొందారు. విజయనగరం జిల్లా నుంచి ఒకేఒక బస్సు రెగ్యులర్‌గా ఉంది. కానీ సంక్రాంతి సీజన్‌గా జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, విజయనగరం డిపోల నుంచి హైదరాబాద్‌కు 15, విజయవాడ 6 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నిర్వహిస్తున్నారు. వీటిలో సాధారణ సర్సీసుల కంటే 50 శాతం చార్జీలు పెంచారు. చేతి చమురు తప్పలేదు ఏడాదికోసారి వచ్చే పండగ. స్వగ్రామాలకు వెళ్లడం తప్పనిసరి. అందువల్ల వారెంత అడిగితే అంత సమర్పిం చుకుని ఈసురోమని స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే ఈ దందా పై కనీసం ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
గండికి బండి
సాక్షి,సిటీబ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థల ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేట్ ఆపరేటర్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీలు తొలిసారి ‘సంయుక్త కార్యాచరణ’ చేపట్టాయి. పండగలు, ప్రత్యేక సెలవు రోజుల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రెండు సంస్థలు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ రెండు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అన్ని ప్రధాన రూట్లలో వందల కొద్దీ ప్రైవేట్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో రెండు ఆర్టీసీ సంస్థల మధ్య సమన్వయంతో బస్సులను నడపాలని నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా లక్షలాది మంది నగర వాసులు ఏపీకి తరలి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఆర్టీసీ సంస్థలు తమ బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో మొట్టమొదటిసారి ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఆపరేషన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయరావు, తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొమురయ్యల నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు రెండు రోజుల క్రితం ఎంజీబీఎస్‌లో సమావేశమయ్యారు. ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగించే అన్ని మార్గాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెండు సంస్థలు సమన్వయంతో కలిసి పని చేయాలని ఈ సమావేశంలో అవగాహనకు వచ్చారు. ప్రధాన కూడళ్ల నుంచి తరలింపు సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సుమారు 25 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతోనే ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. ఇప్పటికే రైళ్లల్లో బెర్తులు పూర్తిగా నిండిపోయాయి. వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు బస్సులు మినహా మరో మార్గం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏటా రెండు ఆర్టీసీలు అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ విడివిడిగానే తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఏ ఆర్టీసీ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుందనే అంశంపై అవగాహన కొరవడుతోంది. ఇది ప్రైవేట్ ఆపరేటర్లకు చక్కటి అవకాశంగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితిని అధిగమించి సమన్వయంతో బస్సులను నిర్వహించడం వల్ల రెండు సంస్థలు ప్రైవేట్ బస్సుల పోటీని ఎదుర్కోవచ్చని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీకి రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి బస్సులను నడిపేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మియాపూర్, జేఎన్టీయూ, కూకట్పల్లి, అమీర్‌పేట్, సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, ఎస్సార్‌నగర్, లక్డీకాపూల్, కాచిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్సుఖ్నగర్, బీహెచ్ఈఎల్, తదితర ప్రధాన కూడళ్లు, నగర శివారు ప్రాంతాలను కేంద్రంగా కనీసం 100 పాయింట్ల నుంచి బస్సులను నడపాలని యోచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ బస్సులతో పాటు ప్రతి సంవత్సరం సుమారు 5 వేల బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా రద్దీ నేపథ్యంలో అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ దోపిడీ పండుగలు, సెలవులు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపు చార్జీలు విధిస్తుంది. కానీ ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రం కనీసం రెండు రెట్లు అదనపు దోపిడీకి దిగుతారు. ప్రయాణికులకు మరో గత్యంతరం లేక ప్రైవేట్ ఆపరేటర్లు అడిగినంతా సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్రతిరోజు సుమారు 1000 ప్రైవేట్ బస్సులు ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అమలాపురం, విశాఖ, చిత్తూరు, కడప, కర్నూలు వంటి రద్దీ అధికంగా ఉండే రూట్లలో ఆపరేటర్ల దోపిడీకి అదుపులేదు. ఈసారి సంక్రాంతి రద్దీని ఎదుర్కొనేందుకు తొలిసారి ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు సమన్వయంతో బస్సులను నడపనుండడం ప్రయాణికులకు శుభపరిణామమే. -
ప్రైవేట్ బస్సుల దోపిడీ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విజయవాడకు టిక్కెట్టు రూ.2,500లు. ఆశ్చర్యపోకండి... ఇది విమాన చార్జీ కాదు.. బస్సు టిక్కెట్టే. ఇంకా సంక్రాంతి సందడి మొదలు కాకముందే ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. గతంలో సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో టిక్కెట్టు చార్జీలు అధికంగా పెంచేవారు. ఇప్పుడలా కాదు.. పండగ, పబ్బాలతో పనిలేకుండా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వీటి రేట్లు పెంచేస్తున్నారు. వరుసగా రెండు మూడు రోజులు సెలవులొస్తే చాలు ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగే పండగ. సెలవులకు విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించాలంటే అప్పటికప్పుడు బెర్తులు దొరికే పరిస్థితి ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అక్కడా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూపోతూ ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వీరి దోపిడీపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. డిమాండ్‌ను బట్టి దోపిడీ ప్రస్తుతం విశాఖ – విజయవాడ (349 కి.మీల దూరం) ప్రైవేటు ఏసీ బస్సు టిక్కెట్ ధర రూ.2,500కు పైగానే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సీజను ప్రారంభం కావడానికి కనీసం రెండు వారాల సమయం ఉంది. పండగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పటికే చుక్కలనంటే చార్జీలను ఫిక్స్ చేసేశారు. కానీ ప్రస్తుతం అంతగా డిమాండ్ లేని ఈ రోజుల్లోనూ అదే బాదుడు కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాలుగో శనివారం, ఆదివారం సెలవులు రావడం, మధ్యలో సోమవారం పనిదినం ఉన్నా మంగళవారం క్రిస్మస్ కావడంతో వరుస సెలవులు వచ్చినట్టయింది. దీన్ని ఆసరాగా చేసుకుని అసలు చార్జీకి రెట్టింపుకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు మంగళవారం ప్రైవేటు ట్రావెల్స్ విశాఖ – విజయవాడల మధ్య చార్జీలను పరిశీలిస్తే... కృష్ణా ట్రావెల్స్ సెమీ స్లీపర్ రూ.1,330, ఏసీ స్లీపర్ రూ.1,790, ఆరంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్లీపర్ రూ.2,400, ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నాన్ ఏసీ సెమీ స్లీపర్ రూ.890 చొప్పున నిర్ణయించారు. అంతేకాదు.. బస్సులు బయలుదేరే సమయానికి వీటి ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. ఒకవేళ ముగ్గురు ప్రయాణికులు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకుని ఆఖరి క్షణంలో ఒకరి టిక్కెట్టు రద్దు చేయమని కోరితే మిగిలిన ఇద్దరివీ కేన్సిల్ చేస్తున్నారు. ఇలా రద్దయిన టిక్కెట్లను డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్టు కావాలంటే అప్పటికి పెంచిన చార్జిని ఇవ్వాలని లేదంటే టిక్కెట్టు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో ఉన్న వారు మరో గత్యంతరం లేక ఆఖరి నిమిషంలో అధిక చార్జీలు చెల్లించి గమ్యానికి చేరుకుంటున్నారు. ఇలా ప్రైవేటు ఆపరేటర్ల మోసాలపై రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఆర్టీసీది మరో తీరు ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు బస్సులతో పోల్చుకుంటే ఆర్టీసీ వేగం ఒకింత తక్కువ. దానికితోడు అంతగా కండిషన్ లేని బస్సులు, నిర్లక్ష్యంగా నడిపే కొంతమంది డ్రైవర్ల వల్ల ఆర్టీసీ బస్సులు సకాలంలో గమ్యాన్ని చేరడం లేదు. ఇది దూరప్రాంత సర్వీసుల్లో ప్రయాణించి విధులకు హాజరయ్యే వారికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో అయిష్టంగానైనా ప్రైవేటు సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 23న విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ సర్వీసులో తండ్రీ కొడుకులు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో ఎక్కిన వీరు రాత్రి 11 గంటలకల్లా విశాఖ చేరుకోవాలి. కానీ మార్గమధ్యలో టీలు, టిఫిన్లు, భోజనాలు పేరిట ఆపుకుంటూ నిర్ణీత సమయానికి మూడు గంటలు ఆలస్యంగా... అంటే రాత్రి 2 గంటలకు విశాఖ చేర్చారు. వాస్తవానికి ఆ రోజు దారిలో ట్రాఫిక్ జామ్‌లు కానీ, టోల్గేట్ల వద్ద రద్దీ కానీ లేదు. దీనిపై డ్రైవర్‌ను నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ ప్రయాణికుడు సంబంధిత డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆర్టీసీ కూడా పండగ వేళల్లో ఫ్లెక్సీ ఫేర్ల పేరిట టిక్కెట్టుపై 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇలా ఇటు ప్రైవేటు, అటు ఆర్టీసీ యాజమాన్యాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. అధికంగా వసూలు చేస్తే కేసులు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికంగా బస్సు చార్జీలు వసూలు చేయడం నేరం. అలా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు మాకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం రావాలి.– వెంకటేశ్వరరావు,డిప్యూటీ ట్రాన్స్పోర్టుకమిషనర్ ఆలస్యంగాచేరిస్తే చర్యలు ప్రయాణికులను గమ్యానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చేరిస్తే సంబంధిత డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటాం. భోజనం, అల్పాహారాల కోసం నిర్ణీత ప్రదేశాల్లోనే ఆపాలి. బస్సు కదలికలను ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గమనిస్తుంటాం. బస్సు గమ్యానికి చేర్చడం ఆలస్యమైతే వివరణ కోరతాం. పొరపాటు ఉంటే రూ.4 వేల వరకు జరిమానా విధిస్తాం. అసౌకర్యం కలిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. – వెంకట్రావు,డిప్యూటీ సీటీఎం, అర్బన్ -
బస్సు బోల్తా: తప్పిన ప్రమాదం
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది. బాదంపూడి వై జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆటోను తప్పించబోయి.. పంటబోదిలోకి దూసుకుపోయింది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. అందులో 42 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మితి మీరిన వేగం కారణంగానే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే వీరందరిని హుటాహుటిన వేరే బస్సులో తరలించారు. బస్సులో ఉన్న వారు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
ప్రైవేటు ట్రావెల్స్‌పై టీడీపీ నేతల పైరవీలు
సాక్షి, విజయవాడ : సాధారణ ప్రజలు ప్రయాణించే బస్సులపై కూడా టీడీపీ నేతలు పైరవీలు చేస్తున్నారు. నందిగామలో ఒకే పర్మిట్‌తో బస్సులను తిప్పేందుకు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. జిల్లాలోని అనాసాగరం వద్ద బస్సులోని ప్రయాణికులను దించి వేరే బస్సు మార్చేందుకు యాజమాన్యం ప్రయత్నించడంతో అసలు బండారం బయటపడింది. ఒకే పర్మిట్‌తో బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ గుట్టురట్టు కావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా బస్సులను విడిచిపెట్టాలని టీడీపీ నేతలు పోలీసుల వద్ద పైరవీలకు దిగారు. ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ ప్రయాణికులపై ఒత్తిడి తెస్తున్నారు. అక్రమాలను పాల్పడుతున్న ట్రావెల్స్‌ను ఎలా వెనుకేసుకొస్తారని.. వారి వైఖరిపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
వేకువనే విషాదం
తుమకూరు: ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. కొంతసేపట్లో గమ్యం చేరుకునేవారే, ఇంతలో విధి వక్రించింది. ముందు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్సును అధిగమించే ప్రయత్నంలో ప్రైవేటు ట్రావెల్స్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా 15 మందికి గాయాలైన ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకాలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున హుబ్లి నుంచి బెంగళూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్సును– చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు వెళుతున్న ట్రావెల్స్ బస్సు హైవే– 48పై కళ్లంబెళ్ల గ్రామ సమీపాన ఓవర్‌టేక్‌కు యత్నిస్తూ అదుపుతప్పి వెనుక ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించడంలో విఫలమయ్యాడు. వేగంగా ఢీకొనడంతో ట్రావెల్స్ బస్సులోని నిఖిత (27),ధనరాజ్ (45), పరమేశ్వర్‌నాయక్ (50)లుఅక్కడిక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సలుఓని మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుల్లో ఒకరైన పరమేశ్వర నాయక్ కారవార పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐ. స్థానికుల ప్రేక్షకపాత్ర తీవ్రంగా గాయపడ్డ 15 మందిని ఆసుపత్రికి తరలించిన కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటన జరిగి సహాయం కోసం క్షతగాత్రులు ఆర్తనాదాలు చేస్తున్నా స్థానికులు, ఇతర వాహనదారులు నిలబడి చోద్యం చూస్తుండడం గమనార్హం. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న శిర గ్రామీణ సీఐ సుదర్శన్ జనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే సహాయం చేయకుండా చోద్యం చూస్తున్న మీరు అసలు మనుషులేనా?, మీలో మానవత్వం లేదా? అని నిలదీశారు. పోలీసులతో పాటు స్థానికులు, తోటి వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని తుమకూరు ఆస్పత్రికి మార్చారు. శిర డీఎస్పీ వెంకటేశ్ నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ప్రాణాలతో చెలగాటం !
ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలకు రాష్ట్ర రాజధాని నగరం విజయవాడ నుంచి ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతులు తీసుకుంటున్న యాజమాన్యాలు ఆ తరువాత నిబంధనలు పాటించకుండా బస్సులను తిప్పుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రైవేటు బస్సుల తీరు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ‘మామూళ్లే’ కారణమన్న ఆరోపణలున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలోనే ఈ బస్సుల స్టేజీలు ఉన్నా.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు బస్టాండుకు వస్తున్న ప్రయాణికులను పిలిచి మరీ ప్రైవేటు బస్సుల్లో ఎక్కించుకుంటున్నా అధికారులు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉంది. స్టేజీ క్యారియర్‌గా ఒక్క బస్సుకూ అనుమతి లేకుండా నిత్యం వందలాది బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తిరుగుతున్నా చేష్టలుడిగి చూడటం రవాణా శాఖ అధికారులకే చెల్లింది. ఒక్క బస్సుకూ అనుమతి లేదు.. రాజధాని ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రతి రోజూ రాష్ట్రంతోపాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితరాల ప్రాంతాలకు 750 బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వీటిలో ఒక్క బస్సుకూ స్టేజీ క్యారియర్ అనుమతి లేదు. అయినా ఆ బస్సులు నిత్యం రోడ్లపై తిరుగుతున్నాయి. దీనిని అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం రవాణాశాఖలో 530 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు బస్సులు 225 వరకు ఉన్నాయి. వీటిలో 13 జిల్లాల్లో తిరిగేందుకు పర్మిట్లు ఉన్నవి 108, జాతీయ పర్మిట్లు కలిగినవి 117 ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 150 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. మిగిలిన బస్సులు అనంతపురం, కడప, తిరుపతి నగరాల నుంచి తిరుగుతున్నాయి. పండిట్ నెహ్రూ బస్టాండే అడ్డాగా... విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను అడ్డాగా చేసుకుని ప్రైవేటు బస్సులు దందా సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లేందుకు వస్తున్న ప్రయాణికులను ఆయా ప్రైవేటు బస్సుల సహాయ సిబ్బంది ప్రయాణికులను దారి మళ్లిస్తున్నారు. బస్టాండుకు కూతవేటు దూరంలోనే ఈ తతంగమంతా జరుగుతున్నా అటు ఆర్టీసీ అధికారులు కానీ, ఇటు రవాణా శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ముందు కూడా పదుల సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిష్ట వేసి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇస్తున్న నెలావారీ మామూళ్లకు అలవాటు పడే రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ? గత ఏడాది మార్చి నెల 1వ తేదీన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రవాణాశాఖలో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై కృష్ణా డీటీసీ కార్యాలయం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్యే బుద్దా వెంకన్నలు.. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి చేసినంత పనిచేశారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని ఇరువురికి రాజీ చేయాల్సి వచ్చింది. సోమవారం రోజూ జగ్గయ్యపేట సమీపంలోనే మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మూడు బస్సులు, ఒక కారు ఢీ కొన్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే భారీ ప్రాణ నష్టం సంభవించేది. ఎదైనా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేసే అధికారులు అనుమతి లేని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తదని ప్రయాణికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. -
తొమ్మిదింటికే ‘ప్రైవేట్ హారన్’!
సిటీని ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలు కూడా దాటకముందే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నిత్యం ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ వాహనాల వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనదారులు నరకం చవిచూడాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సులు, రవాణా వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై ప్రైవేట్ బస్సులు, సరుకు రవాణా వాహనాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిబంధనలకు పాతరేసి సిటీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. రాత్రి 9 దాటకుండానే రోడ్ల మీదకు వస్తున్న బస్సులు, లారీలు రవాణా చట్టాలను, రహదారి భద్రతను యధేచ్ఛగా తుంగలో తొక్కేస్తూ స్వైరవిహారం చేస్తున్నాయి. రాత్రి 8గంటల నుంచి 11 వరకు నగరం పూర్తిగా ప్రైవేటు రవాణా వాహనాలు కబంధహస్తాల్లో చిక్కుకొంటుంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే అతి పెద్ద కారిడార్‌లో ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ రద్దీకి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాత్రి వేళల్లో ఈ వాహనాల రాకపోకలను నగర శివార్లకే పరిమితమం చేసి అక్కడి నుంచి ఔటర్ రింగురోడ్డు ద్వారా దూరప్రాంతాలకు నడపాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది ఏళ్లకు ఏళ్లుగా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్, పెద్ద అంబర్‌పేట్‌ల వద్ద బస్సులు, ట్రక్కులు, లారీలు, తదితర రవాణా వాహనాల కోసం టర్మినల్స్ ఏర్పాటు చేసి అక్క డి నుంచే నడాపాలని ఇటీవల రవాణాశాఖ సమీ క్షా సమావేశంలనూ ఆ శాఖ మంత్రి స్పష్టం చేశా రు. ఇందుకోసం ట్రాక్ ఆపరేటర్స్ అసోసియేషన్ కు గతంలో కేటాయించిన భూములను వినియోగించాలని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. దీంతో రాత్రి వేళ ల్లో, తెల్లవారు జామున రహదారులన్నీ ప్రైవేట్ బస్సులు, లారీలకు అడ్డాగా మారుతున్నాయి. చీమ కూడా కదలడం కష్టమే.... కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ రోడ్లు సాయంత్రం 5 గంటల నుంచే రద్దీగా ఉంటాయి. ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం రాకపోకలు సాగించే వాళ్లతో æరోడ్లు జనసముద్రాన్ని తలపిస్తాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసీ బస్సులతో ప్రధాన రహదారులు నిండిపోతాయి. అలాంటి రోడ్లపై ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. కాలనీల నుంచి ఒకటెనుక ఒకటిగా ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి. క్రమంగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకటి, రెండు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ బస్సులే కనిపిస్తాయి. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిపోయిన వాహనాలకు ఎక్కడికక్కడ బ్రేకులు పడుతాయి. దీంతో లక్షలాది మంది రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఒక్క కూకట్పల్లి ప్రజలే కాదు. అటు మియాపూర్ నుంచి కూకట్పల్లి, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, లకిడాకాఫూల్, హిమాయత్‌నగర్, కాచిగూడ, ఆబిడ్స్, కోఠీ, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ వరకు అడుగడుగునా ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రధానమైన బస్టాపులు, బస్‌బేలలో ప్రయివేట్ బస్సులను నిలిపివేస్తున్నారు.లకిడికాఫూల్లోని టెలిఫోన్ భవన్, కాచిగూడ, అమీర్‌పేట్ బస్టాపులు రాత్రి వేళల్లో ప్రైవేట్ బస్సుల అడ్డాలుగా మారుతున్నాయి. ఈ బస్సులను నియంత్రించడంలో పోలీసులు,ఆర్టీఏ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిబంధనలు బేఖాతర్... మోటారు వాహన నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ వాహనాలు సిటీలోకి ప్రవేశించాలి. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోదు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను దాటి మరీ దూసుకొస్తాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఖైరతాబాద్ వంటి అతి పెద్ద కూడళ్లలో రెడ్‌సిగ్నల్ వెలుగుతున్నప్పటికీ దూసుకొనిపోయే ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు కనిపిస్తాయి. ఒకవైపు లకిడికాఫూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు రాజ్‌భవన్ వైపు వెళ్తూనే ఉంటాయి. కానీ అదేమీ పంజగుట్ట నుంచి లకిడికాఫూల్ వైపు వెళ్లే బస్సులు మాత్రం రెడ్ సిగ్నల్‌ను లెక్కచేయకుండా పరుగులు తీస్తూనే ఉంటాయి. రాత్రయిందంటే చాలు అపరిమితమైన వేగంతో ఏ వైపు నుంచి దూసుకొస్తాయో తెలియదు. హైదరాబాద్ నుంచి ప్రతి రోజు రాత్రి సుమారు 550 బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. అలాగే మరో 500 బస్సులు ఉదయం పూట నగరానికి చేరుకుంటాయి. శని,ఆది వారాలు వంటి వీకెండ్స్‌లో వీటి రాకపోకలు మరింత అధికంగా ఉంటాయి. నగరంలోకి వచ్చే వాహనాలు కానీ తిరిగి వెళ్లేవి కానీ ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ప్రైవేట్ బస్సులకు తోడు హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు మరో 50 వేల లారీలు కూడా ఇదే తరహా ఉల్లంఘనలతో ట్రాఫిక్ టెర్రర్ను సృష్టిస్తున్నాయి. పర్మిట్ల ఉల్లంఘన ... ప్రయాణికులను ఎక్కించుకోవలసిన అనేక బస్సులు సరుకు రవాణా అవతారమెత్తాయి. కేవలం ప్రయాణికుల రవాణా కోసమే ఇచ్చిన పర్మిట్లను ఉల్లంఘించి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వాణిజ్య,వ్యాపార వస్తువులను రవాణా చేస్తున్నాయి. అక్రమంగా తిరుగుతున్న ఇలాంటి బస్సులు వల్ల రహదారి భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఒక్కొక్క బస్సుపైన 4 నుంచి 5 టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, బహదూర్‌పురా, లకిడికాఫూల్, తదితర ప్రాంతాల్లో రవాణా అధికారులు నిర్వహించే తనిఖీల్లో ఇలాంటి ఓవర్‌లోడ్‌పై కేసులు నమోదువుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు,నెల్లూరు,కడప,అనంతపురం,తదితర ప్రాంతాలకు ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను వ్యాపారులు భారీ ఎత్తున తరలిస్తున్నారు. లారీల్లో మాత్రమే తీసుకెళ్లాల్సిన అనేక వస్తువులు టూరిస్టు బస్సుల్లో రవాణా అవుతున్నాయి.ఒక్క ప్రైవేట్ బస్సులకే కాకుండా అన్ని రకాల రవాణా వాహనాలకు నగర శివార్లలోనే హాల్టింగ్ కల్పించి అక్కడికి ప్రయాణికులను తరలించేందుకు సిటీ బస్సులను నడిపితే తప్ప పరిష్కారం లభించదు. -
ప్రైవేట్ బస్సు బోల్తా..
కట్టంగూర్ (నకిరేకల్) : మండటంలోని అయిటిపాముల గ్రామ శివారు లో శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం నుంచి హైదరాబాదుకు 48 మంది ప్రయాణికులతో వెంకటేశ్వర ప్రైవేట్ ట్రావెల్బస్సు గురువారం రాత్రి గం.10 బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున గం.4 సమయంలో మార్గమధ్యలోని అయిటిపాముల గ్రామశివారులోకి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవటంతో హైవే పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి బస్సు అదుపు తప్పి కల్వర్టు గుంతలో బోల్తాకొట్టింది. కల్వర్టు గుంతలోని నీరు బస్సులోకి చేరటంతో గమనించిన ప్రయాణికులు బస్సు వెనక, ముందు గ్లాసులను ధ్వంసం చేసి సురక్షితంగా బయటపడ్డారు. గుంత తక్కువ లోతు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన దుర్గాభవాని, శ్రీనివాస్, గోపి, అప్పారావు, పావని, పుష్పలత, లక్ష్మికుమారి, ధర్మరాజు, లక్ష్మి, రాము, గాయిత్రి, లిఖిత, యశ్వస్వినిలను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపుతున్నట్లు ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు. -
ప్రైవేటు బస్సులు రింగురోడ్డు దగ్గరే నిలిపేయాలి
హైదరాబాద్ : రవాణా శాఖ పై మంత్రి మహేందర్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రవాణా శాఖ రూ.3200 కోట్ల రెవెన్యూ టార్గెట్ సాధించిందని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏపీ రవాణా మంత్రితో కూడా సమావేశం అయ్యామని, త్వరలోనే మళ్లీ ఒకసారి సమావేశం అవుతామని చెప్పారు. ఇక మీదట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నగరంలో రాకుండా రింగ్ రోడ్డు దగ్గరే నిలిపివేయాలని ఆదేశించామని తెలిపారు. రింగ్ రోడ్డు నుంచి నగరం లోపలకు రావడానికి ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు త్వరలో నిర్మిస్తామని చెప్పారు. త్వరలో పూర్తి స్థాయి రవాణా శాఖ కమిషనర్‌ను నియమిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. -
‘ప్రైవేట్’ నిర్వాకం!
వత్సవాయి (జగ్గయ్యపేట) : ఓ పైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున మరమ్మతులకు గురై టోల్‌ప్లాజా సమీపంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లకు గురైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 48 మంది ప్రయాణికులతో శనివారం బయలుదేరింది. తెల్లవారుజామున మండలంలోని భీమవరం టోల్‌ప్లాజా వద్దకు వచ్చేసరికి బస్సులో సాంకేతికలోపం ఏర్పడి నిలిచిపోయింది. అప్పుడు సమయం రాత్రి రెండు గంటలు అవుతోంది. ఆ సమయంలో డ్రైవర్ మాత్రం ప్రయాణికులను దిగి వేరే బస్సు చూసుకోవాలని చెప్పాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రాత్రి వేళ కావడం, ఎక్కడ ఉన్నారో తెలీక భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆగ్రహానికి గురై డ్రైవర్‌తో గొడవకు దిగారు. అయినా, అతను మిన్నకుండిపోయాడు. దీంతో వృద్ధులు, పిల్లల తల్లులు బ్యాగులతో సహా రోడ్డు పక్కన కూర్చుండిపోయారు. స్పందించిన అధికారులు... అయితే, సమాచారం అందుకున్న రవాణా, పోలీస్ శాఖల అధికారులు స్పందించారు. రెండు శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రావెల్స్ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. వెంటనే బస్సును పంపించాలని ఆదేశించారు. దీంతో సూర్యాపేట జిల్లా నకరకల్లులో ఉన్న అదే ట్రావెల్స్‌కు చెందిన బస్సును పంపారు. దీంతో తెల్లవారుజామున వచ్చిన బస్సులో ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లారు. -
దూకుడు !
అమరావతి కేంద్రంగా ఏటా రూ.1,200 కోట్లు దోపిడీరవాణానిబంధనలు బేఖాతరుటీడీపీనేతలఅండతోనేదందాచోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం రాజధానిలో ప్రైవేటు ట్రావెల్స్ దందా మూడు పువ్వులు..ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నిబంధనలకు తూట్లు పొడిచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. టికెట్ ధరలు రెట్టింపు వసూలు చేస్తున్నా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్తో ఆర్టీసీకి రూ.వందల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఓ వ్యూహం ప్రకారం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ప్రైవేటుకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు చెందినవే మెజార్టీ ట్రావెల్ సంస్థలు ఉండటంతో ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తుందే తప్పా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ దందా చెలరేగిపోతోంది. అమరావతి పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రైవేటు ట్రావెల్స్ దాదాపు 800 బస్సులు నడుపుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు నడుపుతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.650 నుంచి రూ.800 వరకు బస్సు చార్జీ ఉండగా... సీజన్లో రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తారు. విజయవాడ– విశాఖపట్నం టిక్కెట్ సాధారణ రోజుల్లో రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు ఉంటుంది. సీజన్లో ఆ టిక్కెట్ రూ.1,500 నుంచి రూ.2వేలు వరకు వెళుతుంది. వ్యూహాత్మకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారనే పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ప్రైవేటు ఆపరేటర్ల అక్రమ దందా వల్ల ఆర్టీసీ ఏటా రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నష్టపోవాల్సి వస్తోంది. అందులో అమరావతి నుంచే దాదాపు రూ.800 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఆర్టీసీ నిర్ణయించిన టిక్కెట్ చార్జీల ప్రకారం లెక్కతేల్చిన నష్టం అది. కానీ ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేసి అంతకు దాదాపు రెట్టింపు టర్నోవర్‌ను సాధిస్తున్నాయి. ఆ లెక్కన రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ ఏటా కనీసం రూ.2,500 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాయన్నది సుస్పష్టం. అందులో అమరావతి కేంద్రంగా దాదాపు రూ.1,200 కోట్ల టర్నోవర్ ఉంది. దర్జాగా ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం... ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు కాంట్రాక్టు క్యారియర్లుగానే అనుమతి ఉంది. స్టేజ్ క్యారియర్లుగా అనుమతి లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్లుగానే నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం పూర్తిగా నిషిద్ధమైనా దర్జాగా ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. డ్రైవర్ల నిబంధనలూ బేఖాతరు.... డ్రైవర్లకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రైవేటు ట్రావెల్స్ పట్టించుకోవడం లేదు. డ్రైవర్‌కు 8 గంటల పనిదినం ఉండాలి. అందులో 5గంటలే డ్రైవింగ్ చేయాలి. ఇక బస్సుకు కనీసం ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఈ నిబంధనను కూడా ప్రైవేటు ట్రావెల్స్ బేఖాతరు చేస్తున్నాయి. కంచికచర్ల వద్ద శుక్రవారం ప్రమాదానికి గురైన మార్నింగ్ ట్రావెల్స్ బస్సుకు ఒక్కరే డ్రైవర్ ఉండటం గమనార్హం. దివాకర్ ట్రావెల్స్ బస్సు 2017, ఫిబ్రవరి 28న పెనుగంచిప్రోలు మండలంలో ప్రమాదానికి గురైన ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆ బస్సుకు కనీసం ముగ్గురు డ్రైవర్లు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై గత ఏడాది విజయవాడ నడిరోడ్డుపైనే దౌర్జన్యానికి దిగారు. తమ ప్రత్యర్థి సంస్థపై నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోవాలన్న తన మాటను ఆయన వినకపోవడంతోనే ఎంపీ కేశినేని అంతటి వీరంగం సృష్టించారు. కేశినేని ట్రావెల్స్ సిబ్బంది తమకు ఏడాదికిపైగా జీతాలు చెల్లించడం లేదని మొరపెట్టుకున్నా కార్మిక శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఇవీ ప్రమాదాలు.... నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులపాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. 2017, ఫిబ్రవరి 28న దివాకర్ ట్రావెల్స్ బస్సు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో ప్రయాణించి అదుపుతప్పి కల్వర్టులో పడటంతో పదిమంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలుగానీ అధికారులుగానీ గుణపాఠం నేర్చుకోలేదు. వేగ నియంత్రణ ఏదీ..? జాతీయరహదారుల మీద వాహనాల వేగ నియంత్రణను అధికారులు పట్టించుకోవడం లేదు. స్పీడ్ గన్లు, స్పీడ్ హంటర్లతో వాహనాల వేగాన్ని పర్యవేక్షించాలి. ఎస్సై స్థాయి అధికారి తమ సిబ్బందితో ఈ బాధ్యతను నిర్వర్తించాలి. వాహనాల వేగాన్ని కి.మీ. దూరం నుంచే అంచనా వేసి నియంత్రించాలి. కానీ అధికారులు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. -
ట్రావెల్స్ బస్సు పాల వ్యాన్ ఢీ..ఒకరి మృతి
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, వ్యాన్ ఢీ..ఒకరి మృతి
కృష్ణా జిల్లా : నందిగామ సమీపంలో జాతీయరహదారిపై కంచికచర్లలోని చెరువు కట్ట వద్ద మార్నింగ్ ట్రావెల్స్ బస్సు, పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుతోంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్వామిని దర్శించకనే..
వారందరూ బీడీలు చుట్టి జీవనం సాగించే కార్మికులు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటే శ్వరస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. బంధుమిత్రులందరూ కలసి కారు మాట్లాడుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. స్వామి సన్నిధికి చేరకనే మృత్యు ఒడికి చేరారు. ఈ హృదయ విదారక ఘటన బంగారుపాళెం మండలం మాధవనగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బంగారుపాళెం: కేరళ రాష్ట్రం కాసరగూడ జిల్లా మంజేశ్వర తాలూకా మధ ర గ్రామానికి చెందిన ఫకీర్‌గట్టి కుటుంబ సభ్యులు, కుంబ్లె గ్రామానికి చెందిన వారి బంధువులు 10 మంది కారులో శనివా రం మధ్యాహ్నం మహేంద్ర జైలో కారు(కెఎల్14 కే7468)లో మధిరగ్రామం నుంచి తిరుమలకు బయలుదేరారు. ఆదివా రం తెల్లవారుజామున 3.40 గంటలకు బంగారుపాళెం మండలం మాదిగోనితోపు వద్ద ముందుపోతున్న కంటైనర్ వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ప్రయివే టు ట్రావెల్స్‌కు చెందిన బస్సు(పీవై01 ఆర్ఎస్1825)ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ఫకీర్‌గట్టి(75), మంజప్పగట్టి(55), ఆయన భార్య గిరిజ(47), సదాశివగట్టి(50) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నాగవేణి(49), బోజాగట్టి(58), హరీష్(35), లక్ష్మి(55), కారు డ్రైవర్ ఉమేష్(43) మాధవ(47) గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నెట్టి కంఠయ్య, హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నాగవేణి, బోజాగట్టి, హరీష్, లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ఉమేష్, మాధవకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ చౌడేశ్వరి, గంగవరం సీఐ మధుసూదన్‌రావు ఘట న స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను బస్సు, కారు డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ముందుపోతున్న కంటైనర్‌ను అధిగమించే క్రమంలో కారు, ఎదురుగా వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మృతదేహాలను తరలించేం దుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. -
మృత్యు మలుపు
స్పందించని హైవే సిబ్బంది.. హైవేపై ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించాల్సిన హైవే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఘటనలో కూడా మరోసారి వారి నిర్లక్ష్యం కనిపించింది. సంఘటన స్థలానికి చేరుకుని ఎంతకూ హైవే సిబ్బంది రాకపోవడంతో పోలీసులే రోడ్డుకు ఇరువైపులా కోన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రోడ్డు డివైడర్‌పై పడిన బస్సును తొలగించడానికి హైవేకు చెందిన క్రేన్స్ కూడా సకాలంలో రాలేదు. దీంతో ప్రైవేట్ క్రేన్ ద్వారా పోలీసులు తొలగిస్తుండగా ఉదయం 8 గంటల ప్రాంతంలో హైవేకు చెందిన క్రేన్ అక్కడకు చేరుకుంది. ప్యాపిలి: పట్టణ సమీపంలోని స్థానిక చిరుతలగుట్ట మలుపు వద్ద బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతిచెందగా మరో పదిమంది గాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు.. ఏఆర్ 01టీ 5445 నంబర్ గోటూర్ ట్రావెల్స్ బస్సు గత రాత్రి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్థానిక చిరుతలగుట్ట మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ తమిళ్ అర్సన్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును కుడివైపునకు మరల్చడంతో రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌పై బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ తమిళ్ అర్సన్, పసుపులేటి ఆదిత్య (27), శ్రీనివాసరెడ్డి, క్రిష్ణ, సత్యవతి, శృతి చౌదరి, మురళీక్రిష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, భాస్కర్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. సీఐ రామక్రిష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుత్తి, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుడు హైదరాబాద్ వాసి.. తీవ్రంగా గాయపడిన పసుపులేటి ఆదిత్యను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇతడు హైదరాబాదులోని కొండాపూర్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరులో బయో డిజైన్ ఇన్నోవేషన్ ల్యాబ్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న ఎస్పీ గోపీనాథ్‌జట్టి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ ఉన్నారు. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు జాతీయ రహదారి 44పై ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ప్యాపిలి మండలం పొదొడ్డి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలివి.. వీర ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇద్దరి డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రావెల్స్ బస్సులో రూ.కోటి 3 లక్షలు స్వాధీనం
సాక్షి, నల్లగొండ : ఓ బస్సులో డబ్బులు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తుంటే అదే బస్సులో కోటి రూపాయలు పోలీసులకు దొరికాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది. చిట్యాల శివారులోని ఓ హోటల్ ముందు ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులు ఓ జ్యువెలరీ షాప్ యజమానికి చెందినవిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు అదే బస్సులో రూ.17లక్షలు చోరీ జరిగాయంటూ ఫిర్యాదు అందింది. వాటి కోసం వెతుకుతుంటే వాటి కోసం వెతుకుతుంటే బస్ టాప్ పైన ఈ డబ్బు కనిపించింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖకు ఈ డబ్బులు అప్పగించనున్నట్టు చిట్యాల సిఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ బస్సు హైద్రాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్నది. -
ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
సాక్షి విజయవాడ : నగర శివార్లలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. పైడూరుపాడు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా అడ్డదారిలో వెళ్తుండగా పైడూరుపాడు వద్ద బస్సు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మిగతా ప్రయాణికులను గొల్లపూడి నుంచి వేరే బస్సులో తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొద్దిసేపట్లోనే ప్రైవేటు ట్రావెల్స్ దగ్దం
మంగళగిరి: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొద్దిసేపట్లోనే మంటల్లో పూర్తిగా దగ్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళగిరి రూరల్ పోలీసులు వివరాల మేరకు.. శుభకార్యం నిమిత్తం గుంటూరు నుంచి కొంతమందిని తీసుకొచ్చేందుకు సోమవారం రాత్రి విజయవాడ స్వరూప ట్రావెల్స్‌కు చెందిన బస్సు బయలుదేరింది. డ్రైవర్ శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి బస్సులో ఉన్నారు. అయితే మంగళగిరి మండలం కాజ గ్రామం నారాయణ తీర్థులు ఆశ్రమం వద్దకు వచ్చేసరికి బస్సు ఏసీలో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి మరో వ్యక్తితో పాటు కిందకి దిగిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్దమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుసుకున్న బస్సు యజమాని పోలీసులకు వివరాలు అందజేశారు. ఏసీలో మొదలైన మంటలు పూర్తి బస్సుకు వ్యాపించి కొంత సమయంలోనే బస్సు పూర్తిగా కాలిపోయిందని పోలీసులకు డ్రైవర్ చెప్పాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మళ్లీ బోల్తా కొట్టించింది
30 అడుగుల గుంతలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 47 మందికి గాయాలు.. అందులో 40 మంది విద్యార్థులు డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రకాశం జిల్లాలో ప్రమాదం కనిగిరి: డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. సుమారు 30 అడుగుల గుంతలో పడి 78 మంది విద్యార్థులను దాదాపు మృత్యుముఖంలోకి తీసుకెళ్లింది. పెనుగం చిప్రోలు సంఘటన మరచిపోక ముందే జరిగిన ఈ ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తున్న 40 మంది విద్యార్థులతో పాటు మొత్తం 47 మంది గాయపడ్డారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెద అలవలపాడు వద్ద గురువారం వేకువన 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉలవపాడు మండలం కరేడులోని పోతల వెంకట సుబ్బయ్య శ్రేష్టి (పీవీఎస్ఎస్) జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గత నెల 28 రాత్రి ఒంగోలుకు చెందిన ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్ బస్సులో విహారయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి మహానంది నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. 78 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు, డ్రైవర్ తదితరులతో కలిపి బస్సులో మొత్తం 88 మంది ఉన్నారు. దీంతో కొందరు విద్యార్థులు బస్సు ప్లాట్‌ఫామ్‌పై పట్టా వేసుకుని కూర్చున్నారు. అంతా గాఢనిద్రలో ఉన్నారు. వారు కరేడు చేరుకుంటారనగా డ్రైవర్ కాలేషా బస్సుపై అదుపు కోల్పోయాడు. దీంతో అలవలపాడు వద్ద బ్రిడ్జి ఎక్కేముందు పక్కనే ఉన్న పిల్లర్లను ఢీకొట్టిన బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయిం ది. మద్యం మత్తువల్లే ప్రమాదం డ్రైవర్ కాలేషా తాగిన మైకంలో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, వైద్యసిబ్బంది ధ్రువీకరించారని కనిగిరి సీఐ సుబ్బారావు తెలిపారు. ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్ ఓనర్ మన్నం బ్రహ్మయ్య, డ్రైవర్ ఎస్కే కాలేషా, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రెండు బస్సులు ఢీ దొరవారిసత్రం (సూళ్లూరుపేట): ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టడంతో 23 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెల్లబల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పన్నెండుమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు మైసూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు నుంచి పొగలు..తప్పిన ప్రమాదం
జడ్చర్ల(మహబూబ్‌నగర్ జిల్లా): జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేసి ఉద్యోగులను దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదసమయంలో బస్సు జడ్చర్ల నుంచి పోలేపల్లి ఫార్మా సెజ్‌కు వెళ్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినపుడు బస్సులో 50 మంది ఉన్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. -
ప్రైవేటు బస్సు బోల్తా
సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్వాయి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
తణుకులో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
-
తణుకులో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం
తణుకు(పశ్చిమగోదావరి): అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం తేతలి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులను అక్కడి స్థానికులు రక్షించినట్టు సమాచారం. బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు చెరువుకట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రహదారిపై నుంచి బస్సును పక్కకు తీశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా: ఒకరు మృతి
-
ట్రావెల్స్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
ప్రకాశం: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గత రెండు రోజుల క్రితం నాయకన్‌గూడెంలో నాగార్జున సాగర్ కాలువలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది దుర్మరణం చెందిన ఘటన మరకముందే ప్రకాశం జిల్లాలో గురువారం మరో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో లారీ ఓవర్టేక్ చేయబోయిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి స్వల్ప గాయాలయినట్టు తెలిసింది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ రోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలయినట్టు తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చుక్కులు చూపిన ప్రైవేట్ ట్రావెల్స్
-
నిలిచిన ట్రావెల్స్ బస్సు: ప్రయాణికుల ఇబ్బంది
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో బుధవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ ప్రయాణీకులను రహదారిపై దింపివేశాడు. తమను మరో బస్సులో హైదరాబాద్ చేర్చాలని ప్రయాణీకులు... యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన వారి నుంచి స్పందన కరువైంది. దాంతో ప్రయాణీకులకు ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత ఆర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ బస్సు ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. -
ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ: 15మందికి గాయాలు
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ: 15మందికి గాయాలు
కృష్ణా: కృష్ణా జిల్లాలోని నవాబుపేట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంలోగాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ
మహబూబ్‌నగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బస్సు ప్రయాణికుడు ఒకరు తన బ్యాగ్‌లోని 11 కిలోల బంగారు ఆభరణాలు కనిపించటం లేదని గుర్తించారు. దాంతో ఆ విషయాన్ని డ్రైవర్ చెప్పి... బస్టాండ్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయింబత్తూరు నుంచి మొత్తం 15 కేజీల బంగారాన్ని తీసుకు వస్తున్నానని.... కానీ తన బ్యాగ్‌లో నాలుగు కేజీల బంగారం మాత్రమే ఉందని ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సదరు బంగారం మొత్తం హైదరాబాద్‌లోని జ్యూయలరీ షాపుకు తీసుకు వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పారు. -
కొండను ఢీకొట్టిన మినీ బస్సు..ఒకరి మృతి
విశాఖపట్నం (అనంతగిరి): విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఆరో నెంబర్ మలుపు వద్ద బుధవారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ మినీ బస్సు కొండను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ యలమంచిలి సన్యాసి రావు (21) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డగారిని విజయనగరం జిల్లా శృంగవరపు కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
షిర్డీ నుంచి వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్ : షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్రా ఉస్మానాబాద్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 12మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానాబాద్ లోని ఆస్పత్రికి తరలించినట్లు షిర్డీలోని ఎస్వీఆర్ ట్రావెల్స్ ఎండీ బోస్ తెలిపారు. మిగతా ప్రయాణికులను మరో బస్సులో షిర్డీకి తరలించినట్లు ఆయన చెప్పారు. బాబా దర్శనం అనంతరం వారిని హైదరాబాద్ తరలించనున్నట్లు చెప్పారు. -
బస్సు బోల్తా: ఒకరు మృతి, 30 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయనపల్లి సమీపంలో బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతి చెందిన మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన మరో బస్సు
ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణమంటే ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నాయి. తాజాగా... ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును... మరో ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన నల్గొండ జిల్లా కోదాడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అయిల్ ట్యాంక్ లీక్ అవుతుండటంతో జాతీయ రహదారిపై పక్కన నిలిపి రిపేరు చేస్తున్నారు. అయితే వినాయక్ ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సు విజయవాడ వైపు వస్తున్న క్రమంలో ఆగి ఉన్న కావేరి ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా, ఐదుగురి మృతి
బెంగళూరు : కర్ణాటకలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. బెంగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలో హోసకోటె సమీపంలో రాజేష్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 29మంది గాయపడ్డారు. బస్సు తిరుపతి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఎంఈజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 49మంది ప్రయాణికులు ఉన్నట్లు సమచారం. కాగా రాజేష్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే నెల్లూరులోని సంస్థ కార్యాలయాన్ని మూసివేశారు. తమ వారి గురించి తెలుసుకునేందుకు ప్రయాణీకుల బంధువులు.. మిత్రులు..కార్యాలయానికి చేరుకున్నారు. తమ వారి సమాచారం కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా, ఐదుగురి మృతి