కృష్ణా జిల్లాలోని నవాబుపేట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంలోగాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.