డివైడర్‌ను ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు | Private travels bus hIts divider in Mahabubnagar district, 12 injured | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు

Published Sat, Jan 14 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:16 AM

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు

మహబూబ్‌ నగర్‌ : మహబూబ్‌ నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం రంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పన్నెండుమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు మైసూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement