
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు.. టెంపును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది చిన్నారులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని థోల్పుర్‌లో శనివారం అర్ధరాత్రి స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే, వీరంతా బరౌలీలో ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment