పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం | Massive road accident at Piduguralla, three died | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం

Published Wed, Aug 17 2016 7:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం

పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం

గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న సిమెంట్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలయినట్టు తెలిసింది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement