cement lorry
-
ఘోరం: జీపును ఢీకొన్న సిమెంట్ లారీ.. 8 మంది మృత్యువాత
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని 8 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో? చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం -
మృత్యుపిలుపు
♦ కేఎస్ ఆర్టీసీ, సిమెంట్ లారీ ఢీ ♦ బస్సు సీటులోనే ప్రాణం విడిచిన యువకుడు ♦ వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం.. ♦ మరో ముగ్గురు ప్రయాణికులకూ గాయాలు బంధు,మిత్రులను స్వయంగా కలిసి శుభలేఖలు అందజేసి తన వివాహానికి ఆహ్వానించాలని బయల్దేరిన యువకుడిని విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. బస్సులో కూర్చున్న సీటులోనే ప్రాణం విడిచాడు. పసుపు పూసిన పెళ్లి పత్రికలు కాస్తా రక్తంతో ఎరుపెక్కాయి. కదిరి అర్బన్: కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలో హిందూపురం – కదిరి రహదారిపై సోమవారం ఉదయం కేఎస్ ఆర్టీసీ బస్సు సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కేఎస్ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలోకి రాగానే బెంగూళురు నుంచి వస్తున్న సిమెంటు లారీ కేఎస్ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ ముందుసీటును బలంగా గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. వైఎస్సార్‌జిల్లా పులివెందులకు చెందిన చైతన్యరెడ్డి, శకుంతల, వేమలకు చెందిన గంగరాజులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లింట విషాదం.. ప్రేమ్‌నజీర్‌కుమార్ స్వస్థలం వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం చౌవారుపల్లి. ఉపాధి నిమిత్తం అదే చిలమకూరులో స్థిరపడ్డాడు. ప్రేమ్‌నజీర్‌కుమార్‌కు పులివెందులకు చెందిన అమ్మాయితో ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపత్రికలను బంధువులకు ఇచ్చేందుకు బస్సులో బయలుదేరి దుర్మరణం చెందాడు. పెళ్లింట విషాదం నెలకొంది. ట్రైసైకిల్ అదుపుతప్పి దివ్యాంగుడు.. ధర్మవరం రూరల్: ధర్మవరం మండలం రేగాటిపల్లి వద్ద సోమవారం ట్రైసైకిల్ అదుపు తప్పి కనగానపల్లి మండలం చంద్రాశ్చర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు నాగభూషణం(50) మృతి చెందాడు. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు... నాగభూషణం స్వగ్రామం నుంచి ధర్మవరానికి ట్రై సైకిల్లో వస్తుండగా రేగాటిపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఫెడల్ బలంగా తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ యతీంద్ర ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వివాహిత మృతి
రాయచోటి(వైఎస్సార్‌జిల్లా): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన అంజనమ్మ(20) భర్తతో కలిసి బైక్‌పై రాయచోటికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అంజనమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పిడుగురాళ్లలో ఘోర రోడ్డుప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలయినట్టు తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన సిమెంట్ లారీ
- డీజిల్ ట్యాంక్‌ర్ దగ్ధం బెస్తవారిపేట (ప్రకాశం) : ఎదురెదుగా వస్తున్న రెండు లారీ ఢీకొని డీజిల్ ట్యాంకర్ దగ్ధమైన సంఘటన సోమవారం అర్ధరాత్రి బెస్తవారిపేట మండలం మేక్షగుండం వద్ద జరిగింది. బెంగుళూరువైపు వెళుతున్న సిమెంట్ లారీ టైర్ పగిలి ఎదురుగావస్తున్న డీజల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో డీజిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకుని లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది. సుమారు 25 లక్షల రూపాయాల మేర ఆస్థి నష్టం జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం: 13 మంది మృతి
తమిళనాడు: మధురై సమీపంలోని కళ్లపట్టి వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందగా, 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సిమెంట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేరళలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి
కోజికోడ్(కేరళ): కేరళలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శబరిమల యాత్రికులు దుర్మరణం చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోజికోడ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో తిక్కోటి ప్రాంతం వద్ద వారి వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. కర్ణాటక నుంచి 10 మంది యాత్రికుల బృందం శబరిమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
సిమెంట్ లారీ సీజ్ - వెయ్యి బస్తాల స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శివారులోని ఇక్బాల్‌పూర్ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద వే బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న సిమెంట్ లారీని సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ నుంచి వే బిల్లులు లేకుండా వచ్చిన ఎంఎక్స్ 26 ఎడి 1285 నంబరు గల లారీ ఖానాపూర్‌లో సిమెంట్ అన్లోడ్ చేస్తుండగా పోలీసులకు ఎవరో సమాచారం ఇచ్చారు. పోలీసులను చూసిన లారీ డ్రైవర్ లారీని స్టార్ట్ చేసి ఇక్బాల్పూర్వైపు వేగంగా తీసుకెళ్లాడు. జీపులో వెంబడించిన పోలీసులు వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద లారీని పట్టుకున్నారు. లారీ క్లీనర్ పోలీసులకు చిక్కాడు. డ్రైవర్ పక్కనున్న పొలాల్లోకి పరుగు తీశాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పట్టుకున్న లారీలో వెయ్యికి పైగా సిమెంట్ బస్తాలు ఉన్నాయి. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖానాపూర్ ఎస్ఐ అజయ్‌బాబు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిమెంట్ లారీ దొంగల అరెస్ట్
గోరంట్ల (అనంతపురం) : ఓ సిమెంట్ లారీని కొట్టేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14 న గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీతో దొంగలు పరారయ్యారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. లారీని దొంగిలించిన చౌడప్ప, మహేశ్‌లను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. -
సిమెంట్ లారీ దొంగల అరెస్ట్
ఓ సిమెంట్ లారీని కొట్టేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా గోరంట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14న గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీతో దొంగలు పరారయ్యారు. దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. లారీని దొంగిలించిన చౌడప్ప, మహేశ్‌లను అరెస్ట్ చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు. -
సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లె(చిత్తూరు): సిమెంట్ లారీ ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం జరిగింది. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెం మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లెకు వచ్చి వెళ్తున్న సమయంలో.. స్థానిక అమ్మచెరువు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
గండేడ్/కుల్కచర్ల, న్యూస్‌లైన్: విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ను సిమెంట్‌లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బైకును లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మహమ్మదాబాద్ పోలీస్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐలు జానకీరాంరెడ్డి, కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ దాస్యానాయక్ తండాకు చెందిన నేనావత్ బాస్‌నాయక్ (27)కు గత 2010లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తాండూరులో పనిచేసిన ఆయన ఇటీవల మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ అయ్యాడు. విధుల్లో భాగంగా శనివారం బోసునాయక్ ఓ కేసు విచారణ కు మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామానికి బైకుపై వెళ్లి తిరిగి ఠాణాకు ప్రయాణమయ్యాడు. తాండూరు నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ (ఏపీ04వై 7786) రెడ్డిపల్లి సమీపంలో గురుకుల పాఠశాల దగ్గర బాస్‌నాయక్ బైకును వెనుక నుంచి ఢీకొంది. తలకు తీవ్రంగా గాయాలైన ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో మొకర్లాబాద్ సమీపంలో పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. బాస్‌నాయక్ మృతితో మహమ్మదాబాద్ ఠాణా సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబీకులు ఘనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిగి ఆస్పత్రికి తరలించారు. దాస్యానాయక్ తండాలో విషాదం దాస్యానాయక్ తండాకు చెందిన దుగ్యానాయక్, మున్నమ్మ దంపతుల రెండో కుమారుడు బాస్‌నాయక్. మహమ్మదాబాద్ ఠాణాకు బదిలీ ఆయిన నుంచి ఆయన నిత్యం స్వగ్రామం నుంచి ఠాణాకు రాకపోకలు సాగిస్తున్నాడు. బాస్‌నాయక్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మేకగూడకు చెందిన జ్యోతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి నెల రోజుల క్రితం ఓ కుమారుడు పుట్టాడు. బాస్‌నాయక్ తండ్రి ఐదు నెలల క్రితం పంటకు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం బాస్‌నాయక్ పెద్ద అన్న కిషన్‌నాయక్ అదృశ్యమై తిరిగి రాలేదు. కానిస్టేబుల్ దుర్మరణంతో భార్య జ్యోతి, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. కానిస్టేబుల్ మృతితో దాస్యానాయక్ తండాలో విషాదం అలుముకుంది.