కోజికోడ్(కేరళ): కేరళలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శబరిమల యాత్రికులు దుర్మరణం చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోజికోడ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో తిక్కోటి ప్రాంతం వద్ద వారి వ్యాన్ను ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది.
కర్ణాటక నుంచి 10 మంది యాత్రికుల బృందం శబరిమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
కేరళలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి
Published Sun, Jan 3 2016 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM