kozikode medical college hospital
-
భారత్‌లో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!
తిరువనంతపురం: దేశంలో మరోసారి నిపా వైరస్ కలకలం సృష్టించింది. తాజాగా కేరళలో నిపా వైరస్ సోకి ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, కేరళలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. వివరాల ప్రకారం.. కేరళలో మరోసారి నిపా వైరస్ ప్రబలుతోంది. నిపా వైరస్ సోకడంతో ఇన్ఫెక్షన్ కారణంగా కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని తెలిపారు. #NewsAlert| Nipah Virus alert issued in Kerala's Kozhikode after two 'unnatural' deaths. — NDTV (@ndtv) September 12, 2023 అలాగే, మరణించిన వారిలో ఒకరి బంధువులు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. అయితే, 2018, 2021లో కోజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ కారణంగా పలువురు మరణించారు. మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించింది. నిపా లక్షణాలు.. నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. ఇది సోకినవారిలో.. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లోలాగానే.. జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్’కు దారితీయవచ్చు. అకస్మాత్తు మరణం.. అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్ఎన్ఏ వైరస్’. మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించడం మొదలుపెట్టింది. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ‘నిపా’ ఫ్రూట్ బ్యాట్ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే.. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్) వల్ల కాకుండా.. వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్లెట్స్) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి.. మాస్క్ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది. ఇది కూడా చదవండి: క్యాన్సర్ కణాలకు చెక్! -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..
తిరువనంతపురం: కేరళ కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జియా పావల్, జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితమే వీరికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా.. కోజికోడ్ మెడికల్ హాస్పిటల్లో బుధవారం ఉదయం జహద్ సిజేరియన్ ద్వారా ప్రసవించింది. పుట్టింది ఆడ బిడ్డా లేక.. మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమ బిడ్డ ఫొటోను జియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కావాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ఆనంద బాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తమకోసం ప్రార్థించిన వారికి, మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో మగ అయిన జియా శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారుతోంది. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారాలనుకున్నాడు. అయితే ఇంతలోనే జహద్ గర్భం దాల్చడంతో ఇద్దరూ ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
16 మందిని మింగిన ‘నిపా’
కోజికోడ్, కేరళ : ప్రాణాంతక ‘నిపా’ వైరస్ మహమ్మారి కేరళలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ‘నిపా’ బారిన పడి మరణించినవారి సంఖ్య 16కు చేరుకుంది. అంతేకాక కోజికోడ్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ‘నిపా’ వైరస్ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. మధుసూధన్(56), అకిహిల్ కరస్సేరి(28) కోజికోడ్‌లోని మెడికల్ కాలేజ్ ఆస్సత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది ‘చికిత్స ప్రారంభంలో కోలుకున్నట్లే కనిపించారు...కానీ తరువాత పరిస్థితి విషమించడంతో వారు మరణించారు. వీరికి ఈ వైరస్ ఆస్పత్రి నుంచే సోకిందన్నా’రు. మరో వ్యక్తికి కూడా నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కోజికోడ్ ఆస్పత్రిలో ‘నిపా’ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారు ముగ్గురు, వైరస్ లక్షణాలు ఉన్న వారు మరో తొమ్మిది మంది ఉన్నారు. ఇదిలా ఉండగా కోల్‌కతాలో మరణించిన సైనికుడు శీను ప్రసాద్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం తనకు తెలియదని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ సరిత తెలిపారు. శీను ప్రసాద్.. నిపా వైరస్ బారిన పడే మరణించాడనే అనుమానం నేపథ్యంలో అతని శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి వ్యాధి నిర్ధారణకు పంపారు. భారతదేశంలో నిపా వైరస్‌ను గుర్తించగల సామర్ధ్యం ఉన్న ఏకైక లాబోరేటరీ ఎన్‌ఐవీలోనే ఉంది. అయితే బుధవారం మరణించిన అకిహిల్ ‘నిపా’ వ్యాప్తి ఉన్న ప్రాంతం వాడు కాదని, కనీసం ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే అకిహిల్ ఈ మధ్యే కొజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితున్ని చూడడానికి వచ్చాడని అతని బంధువులు తెలిపారు. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇప్పటికే చాలా వరకూ ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రభుత్వం వారికి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తుంది. -
‘నిపా’ ఎఫెక్ట్..నలుగురు మృతి
కోజికోడ్/కేరళ: ప్రాణాంతక నిపా వైరస్ బారిన పడి కేరళలో మరో వ్యక్తి మరణించాడు. ఇప్పటికే అదే కుటుంబంలోని ముగ్గురు నిపా వైరస్ సోకి చనిపోగా గురువారం వీ.మూసా (61) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ కోజికోడ్ ఆస్పత్రిలో గురువారం ప్రాణాలు విడిచాడు. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. ఒకే కుటుంబంలోని నలుగురు ఈ కారణంగా చనిపోవడంతో మూసా కుటుంబం నివాసముంటున్న కోజికోడ్ పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. మూసా ఇంటి పరిసరాల్లో గల పాడుబడిన బావిలో చనిపోయిన గబ్బిలాలు పదుల సంఖ్యలో పడి ఉన్నాయని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. బహుశా ఈ బావిలోని గబ్బిలాల ద్వారానే నిపా వైరస్ వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వ్యాధికి గురైన మూసా, అతని ఇద్దరి కుమారులు, సోదరికి చికిత్సనందిస్తూ నర్సు లినీ సోమవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. -
అధికార మదం.. తప్పతాగి గర్భిణిని తన్నాడు
కోజికోడ్ : గర్భిణిపై అధికార పార్టీ నేత దాడి చేసిన ఘటన కేరళలో కలకలం రేపుతోంది. కడుపు మీద తన్నటంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి బంధువులు అందోళన చేపట్టారు. రాజకీయంగా పెను దుమారం రేపుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కోజికోడ్‌కు చెందిన దంపతులు స్థానికంగా ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. బాధిత మహిళ నాలుగు నెలల గర్భవతి. ఈ మధ్య వారి పొరుగునే ఉండే ఓ వ్యక్తితో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ సీపీఎం నేత సెటిల్మెంట్ కోసం అక్కడికి వచ్చాడు. ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆమె భర్తపై దాడికి తెగబడ్డాడు. తన భర్తను వదిలేయాలంటూ బతిమాలుతుండగా ఆమె కడుపుపై ఒక్కసారిగా తన్నాడు. అంతే మహిళ రక్తస్రావంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. హుటాహుటిన మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 2న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు నేత మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో ఆ నేత పీకలదాకా తాగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులు వచ్చాయని.. కానీ, న్యాయం జరిగేదాకా పోరాటం ఆపబోమని అతను చెబుతున్నారు. మరోపక్క రాజకీయ పార్టీలు కూడా వారికి అండగా నిలుస్తున్నాయి. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు సీపీఎం వర్గాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. -
కేరళలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి
కోజికోడ్(కేరళ): కేరళలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శబరిమల యాత్రికులు దుర్మరణం చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోజికోడ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో తిక్కోటి ప్రాంతం వద్ద వారి వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. కర్ణాటక నుంచి 10 మంది యాత్రికుల బృందం శబరిమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు.