Kerala Transgender Couple Ziya And Zahad Blessed With Baby, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..

Published Wed, Feb 8 2023 7:50 PM | Last Updated on Wed, Feb 8 2023 9:31 PM

Kerala Transgender Couple Ziya And Zahad Blessed With Baby - Sakshi

తిరువనంతపురం: కేరళ కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జియా పావల్, జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితమే వీరికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా.. కోజికోడ్ మెడికల్ హాస్పిటల్‌లో బుధవారం ఉదయం జహద్ సిజేరియన్ ద్వారా ప్రసవించింది. పుట్టింది ఆడ బిడ్డా లేక.. మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

తమ బిడ్డ ఫొటోను జియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కావాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ఆనంద బాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తమకోసం ప్రార్థించిన వారికి, మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పుట్టుకతో మగ అయిన జియా శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారుతోంది. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారాలనుకున్నాడు. అయితే ఇంతలోనే జహద్ గర్భం దాల్చడంతో ఇద్దరూ ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement