Transgender Couple
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..
తిరువనంతపురం: కేరళ కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జియా పావల్, జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితమే వీరికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా.. కోజికోడ్ మెడికల్ హాస్పిటల్లో బుధవారం ఉదయం జహద్ సిజేరియన్ ద్వారా ప్రసవించింది. పుట్టింది ఆడ బిడ్డా లేక.. మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమ బిడ్డ ఫొటోను జియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కావాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ఆనంద బాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తమకోసం ప్రార్థించిన వారికి, మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో మగ అయిన జియా శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారుతోంది. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారాలనుకున్నాడు. అయితే ఇంతలోనే జహద్ గర్భం దాల్చడంతో ఇద్దరూ ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
గుప్పెడంత మనసు.. హిజ్రాతో ప్రేమపెళ్లి
ఇల్లెందు: సమాజం నుంచి విమర్శలు, జనాల నుంచి తేడా చూపులు ఎదురైనా.. కలిసే బతకాలనుకుంది ఆ జంట. కారణంగా.. ఆ జంటలో ఒకరు యువకుడు, మరొకరు ట్రాన్స్‌జెండర్ కావడమే!. మూడు నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. చివరకు తన ప్రేమకథను సుఖాంతం చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి వాళ్ల సమక్షంలోనే మూడుముళ్లతో ఒక్కటయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిందీ ఘటన. జయశంకర్ భూపాలపల్లికి చెందిన రూపేశ్‌కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల(రేవతి) అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహం చిగురించి అదికాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. రహస్యంగా.. ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా సహజీవనం చేశారు. చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మాటలు అన్నా.. బయట ఇబ్బందులు ఎదురైనా ఆ జంట ఒకరి చెయ్యి మరొకరు వీడలేదు. అయితే, ఇలా ఎంతకాలం తల్లిదండ్రులను మోసం చేయాలి అనుకున్న రూపేశ్.. ధైర్యం తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు. భయంభయంగానే వాళ్లకు చెప్పాడు. ముందు వాళ్లు కంగారుపడ్డారు.. తిట్టారు. అయితే తమ ప్రేమను విప్పి వాళ్లను ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో నిన్న(శుక్రవారం, మార్చి 11 2022) రూపేశ్-అఖిలకు ఘనంగా వివాహం జరిగింది. ఎవరు ఎమనుకున్నా.. తమ మనుసులు మంచివని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని, జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని చెబుతోంది ఆ జంట. -
ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది!
సమాజం.. ముఖ్యంగా మన చట్టాలు అంగీకరించని వ్యవహారం ఇది. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు వీరిద్దరి. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ, ఇలాంటి వాటిని నిందించే సమాజం కదా. అయినా పెద్దలు ధైర్యం చేశారు. స్నేహితులు తోడుగా నిలిచారు. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కేరళ తిరువనంతపురంలో ఫిబ్రవరి 14న ఘనంగా జరిగింది ఈ ట్రాన్స్ జంట వివాహం. త్రిస్సూర్ కు చెందిన వరుడు మనూ కార్తీక టెక్నోపార్క్ లోని ఓ ఐటీ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఇక వధువు శ్యామా ఎస్. ప్రభ కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. 2010లో క్వీర్ ఉద్యమం సందర్భంగా ఇద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి పరిచయం కాస్త స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. 2017లో తొలిసారిగా మనూ, శ్యామకు ప్రపోజ్ చేశాడట. వీళ్ల శరీరతత్వాల గురించి తెలిసిన పెద్దలు.. వీళ్ల ప్రేమకి, పెళ్లికి సైతం అడ్డుచెప్పలేదు. అయితే.. వాళ్లిద్దరూ వాళ్ల వాళ్ల ఇంట్లో పెద్దవాళ్లు. దీంతో కొన్ని బాధ్యతలు పెళ్లికి అడ్డుపడ్డాయి. అవి తీరాక ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెద్దల సమక్షంలోనే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ముందుగా ప్రచారం జరగడంతో ట్రాన్స్జెండర్లు సైతం భారీ ఎత్తున్న హాజరై.. ఈ జంటను ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పుడున్న వివాహ చట్టాల ప్రకారం వీళ్ల వివాహం ఆమోదయోగ్యం కాదు. అందుకే తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కింద తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరనున్నారు వీళ్లు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్నామని ఈ జంట చెబుతోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. -
ఆ ప్రేమకథ ఎక్కడ మొదలైందంటే...
ముంబై: రెండు హృదయాల మధ్య ప్రేమకథలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తాయో? అదే విధంగా ముగింపు కూడా ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే జంట మాత్రం మంచి ముగింపునే కొరుకుంటోంది. ముంబైలోని ఓ లింగ మార్పిడి కేంద్రంలో చిగురించిన ప్రేమకథే ఇది. ఆర్వ్ అప్పుకుట్టన్ పుట్టకతోనే మహిళ, సుకన్య కృష్ణ అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం ముంబైలోని ఓ లింగ మార్పిడి కేంద్రంలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఫోన్ నంబర్లు మాత్రమే మార్చుకున్న వాళ్లు తర్వాత మనసులు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. అతను ఆమెగా, ఆమె అతనుగా మారిన తర్వాత వాళ్ల మధ్య అప్యాయతలు ఎక్కువ అయ్యాయి. దీంతో మూడు ముళ్లతో ఒకటవుదామని నిర్ణయించుకున్నారు. "నా జీవితం మొత్తం సుకన్యతోనే గడపాలనుకుంటున్నా'' అని 46 ఏళ్ల అప్పుకుట్టన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అధికారిక పత్రాలు రాగానే కేరళలో సాంప్రదాయబద్ధంగా మేము ఒకటవుతాం అని చెప్పారు. చట్టప్రకారం ఎలాంటి సమస్యలు ఎదురుకాబోవని భావిస్తున్నామని, అయితే ప్రజలు తమ గురించి ఎలా స్పందిస్తారో అనే ఆలోచిస్తున్నామన్నారు. సాధారణంగా లింగ మార్పిడి చేయించుకున్న వాళ్ల విషయంలో చిన్నచూపు సహజమేనంటున్న ఆ జంట, పుట్టే పిల్లల్ని ఈ సంఘం ఎలా చూస్తుందోనని తమ కుటుంబ సభ్యులు ఆవేద చెందుతున్నారని తెలిపింది. అయితే ఈ విషయంలో సంఘంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అప్పుకుటన్ కూడా సర్జరీ అయిన తర్వాత ఉద్యోగం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకానోక టైంలో దుబాయ్ వీసా కూడా తిరస్కరణకు గురైందని చెబుతున్నాడు. ఇక 20 ఏళ్ల సుకన్య కృష్ణ లింగ మార్పిడికే కాదు, ప్రేమకు కూడా కుటుంబ సభ్యులు అడ్డుచెప్పలేదు. "మమల్ని విమర్శించే వారికి మా ప్రేమకథను విడమరిచి చెబుతున్నాం" అని కృష్ణ చెబుతోంది. తమలాగే లింగమార్పిడి పెళ్లి చేసుకోవాలే జంటలకు తాము ఎప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తామని తెలిపారు. త్వరలో హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డను దత్తత కూడా తీసుకోవాలనుకుంటున్నారు.