ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
రాయచోటి(వైఎస్సార్‌జిల్లా): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వివాహిత మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది.
లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన అంజనమ్మ(20) భర్తతో కలిసి బైక్‌పై రాయచోటికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అంజనమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.