
బుల్లితెరపై తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటి విష్ణు ప్రియ. తెలుగులో త్రినయని, జానకి కలగనలేదు వంటి సీరియల్స్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా తమిళంలోనూ పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత విష్ణుప్రియ తన సీరియల్ కో-స్టార్ సిద్ధార్థ్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అభిషేకం, కుంకుమ పువ్వు, ఇద్దరు అమ్మాయిలు వంటి సీరియల్స్‌తో తెలుగులో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 11/ఏ ఏటిగట్టు అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.
అయితే తాజాగా ఈ బుల్లితెర బ్యూటీ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసింది. ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన బీఎండబ్లూ బైక్‌ను కొనేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ద్విచక్రవాహనంపై దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ బైక్ ధరలు దాదాపు లక్షల్లోనే ఉంటాయి. బీఎండబ్ల్యూ బ్రాండ్‌లో వీటి ప్రారంభ ధరలే దాదాపు రూ.3 లక్షల నుంచి మొదలవుతాయి. విష్ణు ప్రియ కొనుగోలు చేసిన ఈ ఖరీదైన బైక్ ధర దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.