
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.
కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్‌లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది.
Comments
Please login to add a commentAdd a comment