Aditi
-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్‌తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్‌లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
భారత గోల్ఫర్ అదితికి 29వ స్థానం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ ‘పారిస్’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది. భారత్‌కే చెందిన మరో గోల్ఫర్ దీక్ష డాగర్ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ గోల్ఫర్ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్ హెన్సెలైట్ (280 పాయింట్లు; జర్మనీ), లిన్ జియా జానెట్ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ‘తొలి మూడు రోజులు సరైన షాట్లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది. -
ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి
ఖత్రాన్ కి ఖిలాడీ.. ఇదొకరియాలిటీ సో.. ఇందులో పాల్గొనే వారితో రకరకాల స్టంట్లు చేయిస్తారు. వారి భయాల్ని పోగొడుతారు. అన్ని భయాలను దాటుకుని చివరిదాకా నిలబడ్డవారే విజేతగా నిలుస్తారు. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువే. అందుకే ఇప్పటివరకు 13 సీజన్లు విజయవంతంగా నడిచాయి. ప్రస్తుతం 14వ సీజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే కొంత షూటింగ్ జరిగిపోయింది.నా గురించి నేను తెలుసుకున్నాదాని గురించి ఈ సీజన్లో పాల్గొన్న నటి అదితి శర్మ మాట్లాడుతూ.. ఇదొక క్రేజీ ప్రయాణం. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. నేను చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని రోజులు సంతోషంగా, మరికొన్ని రోజులు కష్టంగా గడిచాయి. కానీ ఈ ప్రయాణంలో నా బలాలు, బలహీనతలు తెలుసుకున్నాను. నా గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. కొన్ని షాక్‌లు తగిలినప్పుడైతే జీవితాన్ని ఆస్వాదించడం, ఒదిగి ఉండటం నేర్చుకున్నాను. ఈ ప్రపంచం అందమైనది. ఈ సృష్టిలో ఉన్న ప్రతీది నాకిప్పుడు అందంగానే కనిపిస్తోంది.అవన్నీ నిజమైనవేభారత్కు రాగానే అందరూ అడిగిన ప్రశ్న.. షోలో చూపించేవి నిజమైన స్టంట్సేనా? అని! అవును నిజమే.. ఎలక్ట్రిక్ షాక్‌లు, కీటకాలు, జంతువులు.. ఇలా ప్రతీది నిజమే.. ఓ స్టంట్‌లో అయితే కొన్ని తేళ్లు నా మెడను కుట్టేశాయి. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇలాంటివేమైనా జరిగితే స్పాట్లో ట్రీట్మెంట్ చేస్తారు. అయినా ఆ నొప్పి భరించలేము' అని చెప్పుకొచ్చింది. కాగా అదితి.. ఖత్రాన్ కి ఖిలాడీ షో కోసం రొమేనియాలో దాదాపు 40 రోజుల పాటు ఉంది. ఈ మధ్యే ఇండియాకు వచ్చింది.చదవండి: ఎన్టీఆర్‌కు ఒక సెకను చాలు.. అదే నాకైతే 10 రోజులు: జాన్వీ కపూర్ -
కుటుంబానికి రూ.10 వేలకే హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా ప్రీమియం సామాన్యులకు భారంగా మారిన తరుణంలో.. ప్రముఖ వైద్యసేవల సంస్థ ‘నారాయణ హెల్త్’ చౌక ప్రీమియంతో ఒక ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆరోగ్య బీమా పాలసీకి ‘అతిథి’ పేరు పెట్టింది. దంపతులు, ఇద్దరు పిల్లలు (గరిష్టంగా) కలిగిన నలుగురు సభ్యుల కుటుంబానికి ఏడాదికి ప్రీమియం కేవలం రూ.10,000గా నిర్ణయించింది. ఇంటిపెద్ద వయసు 45ఏళ్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రీమియం. ఇంతకంటే అధిక వయసులోని వారికి ప్రీమియం (అది కూడా ఇతర బీమా సంస్థల కంటే తక్కువే) వేరుగా ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి ఒక ఏడాదిలో రూ.కోటి రూపాయల వరకు సర్జరీలకు ఈ పాలసీలో చెల్లింపులు లభిస్తాయి. ఇతర హాస్పిటల్ చికిత్సలకు (జ్వరం, ఇన్ఫెక్షన్ తదితర) రూ.5లక్షల వరకు కవరేజీ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ పాలసీ కింద సేవలు నారాయణ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే లభిస్తాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 21 హాస్పిటళ్లు ఉన్నాయి. బెంగళూరులో ఏడు ఆస్పత్రులతోపాటు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. -
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
‘రెస్టారెంట్ మేనేజ్మెంట్’ అంటే రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్‌కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్‌లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్’ వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్‌వన్ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్’ పేరుతో అదితి దుగర్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్’ రెస్టారెంట్ తక్కువ సమయంలోనే బాగాపాపులర్ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్’ దూసుకుపోయింది. మోస్ట్ ఫార్వర్డ్ – థింకింగ్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్‌పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్ వెంచర్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్ అసైన్మెంట్స్లో భాగంగా అదితి ఒక బ్రిటిష్ హోం చెఫ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్–వెజ్ చెఫ్ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్‌లో స్పెయిన్‌లో ఉన్న అదితికి ‘మాస్క్’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్ క్లయింట్స్ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్’ వేగానికి కోవిడ్ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్ బిజినెస్‌లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్ -
మలయాళ నటి అదితి రవి ఫోటోలు వైరల్
-
యంగ్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. ఫోటోషూట్ వైరల్!
కన్నడ హీరోయిన్ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే కొత్త ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా నెల క్రితమే ఆదితి సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెటర్నిటీ ఫోటో షూట్ నిర్వహించింది. తన భర్తతో పాటు దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చివరికీ నా చిన్న కోరిక కూడా తీరింది.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
న్యూ ఇయర్లో గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్!
న్యూ ఇయర్ వేళ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది శాండల్‌వుడ్ భామ. తోతాపురి- 2, రంగనాయకి, దిల్మార్ చిత్రాల్లో నటించిన కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా గర్భం ధరించినట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరంలో తాను అమ్మను కాబోతున్నట్లు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఏడాదిలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఫోటోలను పంచుకుంది. అదితి తన ఇన్‌స్టాలో రాస్తూ..' బంధుత్వాలలో గొప్పది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి బాధలోనూ మన నోటి నుండి వచ్చే ఏకైక పదం అమ్మ. జీవితంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా, గౌరవంగా చూసుకునే బంధం అమ్మ. మన కోసం ప్రతిక్షణం ఆలోచించేది అమ్మా. నేను 2024లో అమ్మను కాబోతున్నా' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. కాగా..నటి అదితి ప్రభుదేవాకు, వ్యాపారవేత్త యషాస్‌తో నవంబర్ 2022లో వివాహం జరిగింది. ప్రస్తుతం అదితి నటించిన 'అలెక్సా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 26న విడుదల కానుంది. View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
ద్రవిడ్ మా అంకుల్.. ఆయనను చూస్తే బాధేసింది: సీరియల్ నటి
వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమి తననెంతో బాధించిందని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ బంధువు, మరాఠా నటి అదితి ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా తన అంకుల్ అత్యుత్తమ కోచ్‌గా చరిత్రలో నిలిచిపోతారంటూ ఉద్వేగానికి లోనైంది. కాగా సొంతగడ్డపై టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా రోహిత్ సేనను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా ఉన్న భారత జట్టుకు షాకిస్తూ.. ఏకంగా ఆరోసారి జగజ్జేతగా అవతరించింది. దీంతో టీమిండియా తీవ్ర నిరాశలో మునిగిపోయింది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు చూసి టీమిండియా ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో అదితి ద్రవిడ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకుంది. రాహుల్ ద్రవిడ్‌ను చూసి తమ కుటుంబమంతా గర్విస్తోందని పేర్కొంది. ద్రవిడ్ మా అంకుల్ ఈ మేరకు.. ‘‘రాహుల్ ద్రవిడ్ మా అంకుల్. గత 30- 35 ఏళ్లుగా ఆయన క్రికెట్ మైదానంలో కఠిన శ్రమకోరుస్తున్నారు. మా నాన్న వినాయక్ ద్రవిడ్ కూడా రంజీ ప్లేయర్. అందుకే నాకు క్రికెట్‌తో అనుబంధం ఏర్పడింది. టీమిండియా ఓడిపోయిన దృశ్యాలు చూసి నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను. ఆ సమయంలో మా అంకుల్‌ను చూస్తే చాలా బాధేసింది. హెడ్‌కోచ్‌గా ఆయన ప్రస్థానం కూడా ముగింపునకు వస్తోంది. ఆయనకు బహుశా ఇదే ఆఖరి వరల్డ్‌కప్. ఎంతో హార్డ్‌వర్క్ చేసి జట్టును ఇక్కడిదాకా తీసుకువచ్చారు. కానీ ఆఖర్లో ఇలా జరిగిపోయింది. ఏదేమైనా ఆయన బెస్ట్ కోచ్’’ అని అదితి ద్రవిడ్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ది వాల్ రాహుల్ ద్రవిడ్.. హెడ్‌కోచ్‌గానూ కాగా మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాహుల్ ద్రవిడ్‌కు అదితి కూతురు వరుస అవుతుంది. ఆమె ప్రస్తుతం బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. ఇటీవల సుందర మన మధ్యే భార్లీ సీరియల్లో కనిపించింది. అంతేకాదు రెండు మరాఠా సినిమాల్లోనూ అదితి మెరిసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గానూ రాణిస్తోంది. ఇక మరాఠా మూలాలున్న రాహుల్ ద్రవిడ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన విషయం తెలిసిందే. తండ్రి ఉద్యోగరిత్యా కర్ణాటకకు షిఫ్ట్ కావడంతో అక్కడే పెరిగి పెద్దైన ద్రవిడ్.. దేశవాళీ క్రికెట్లో కన్నడ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా తరఫున ది వాల్‌గా.. దిగ్గజ క్రికెటర్‌గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. త్వరలోనే అతడి కాంట్రాక్ట్ ముగియనుంది. -
Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. మన అమ్మాయికి మరో స్వర్ణం తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్‌లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే. 19 స్వర్ణాలు బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?
‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నటి.. శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా చాన్స్‌లు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పడు తన ఫ్యాషన్ స్టయిల్ ఫొటోలు, పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ ఆకర్షణకు మెరుగులు దిద్దుతున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ఇంద్ శ్రీ హైదరాబాద్ నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ఇంద్ శ్రీ .. 2012లో తన పేరుతోనే ఓ బోటిక్ ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ అదితి ధరించిన ఇంద్ శ్రీ కాస్ట్యూమ్ డిజైన్ ధర రూ. రూ. 11,500 హౌస్ ఆఫ్ క్వాడ్ర హై క్వాలిటీ, లేటెస్ట్ వజ్రాభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాల్యూ. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఇదొకటి! ధరలు ఇటు సామాన్యులూ కొనేలా అటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. (చదవండి: ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్ అదిపోతుంది!) -
పాకిస్థాన్‌పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్‌లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇషాన్‌కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
అదరహో అదితి... ఓహో ఓజస్
అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్లు అద్భుతం చేశారు...గతంలో ఎన్నడూ చూపించని ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టించారు... గురి తప్పకుండా లక్ష్యం చేరిన బాణాలతో మన ఆర్చర్లు ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు...అటు మహిళల విభాగంలో అదితి స్వామి, ఇటు పురుషుల విభాగంలో ప్రవీణ్ ఓజస్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు సాధించి శిఖరాన నిలిచారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించి అదితి ఆనందం పంచిన కొద్ది సేపటికే ప్రవీణ్ కూడా పసిడి గెలవడంతో ‘డబుల్ ధమాకా’ మోగింది! చాలా గర్వంగా ఉంది. 17 ఏళ్లకే ఈ ఘనత సాధించడం సంతోషంగా అనిపిస్తోంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 52 సెకన్ల మన జాతీయ గీతం వినపడాలని కోరుకున్నాను. పూర్తి ఏకాగ్రతతో షాట్‌పై దృష్టి పెట్టడంతో లక్ష్యం తప్పలేదు. ఇది ఆరంభం మాత్రమే. దేశం తరఫున మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా – అదితి స్వామి బెర్లిన్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఒకే రోజు భారత్ తరఫున ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. శనివారం జరిగిన ఈ పోటీల కాంపౌండ్ విభాగంలో ముందుగా మహారాష్ట్రకు చెందిన అదితి గోపీచంద్ స్వామి అగ్రస్థానం సాధించింది. ఫైనల్లో 17 ఏళ్ల అదితి 149–147 స్కోరుతో మెక్సికోకు చెందిన ఆండ్రీయా బెసెరాపై విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 150–147 తేడాతో ల్యూకాజ్ జిల్స్కీ (పోలాండ్)ను ఓడించాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెల రోజుల్లోపే సీనియర్ విభాగంలోనూ అదితి విశ్వ విజేత కావడం విశేషం కాగా...టోర్నీ చరిత్రలో పురుషుల విభాగంలోనూ భార త్‌కు ప్రవీణ్ సాధించిందే తొలి స్వర్ణం. వీరిద్దరూ మహారాష్ట్ర సతారాలోని అకా డమీలో ఒకే చోట శిక్షణ పొందుతున్నారు. ఓవరాల్‌గా 3 స్వర్ణాలు, ఒక కాంస్యంతో (మొత్తం 4 పతకాలు) సాధించి భారత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. శుక్రవారం భారత్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించింది. పూర్తి ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్ సారా లోపెజ్‌ను ప్రిక్వార్టర్స్‌లో ఓడించిన బెసెరా, అదితి మధ్య ఫైనల్ పోటాపోటీగా సాగింది. తొలి మూడు బాణాలను సమర్థంగా సంధించిన అదితి మొదటి రౌండ్లోనే 30–29తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 12 బాణాలను లక్ష్యం వద్దకు చేర్చిన అదితి మూడు పాయింట్లు ముందంజలో ఉంది. చివరి రౌండ్లో మాత్రం ఒక బాణంతో ‘9’ మాత్రమే స్కోర్ చేసినా...అప్పటికే ఆమె విజేత కావడం ఖాయమైంది. శనివారం సెమీస్, ఫైనల్లోనూ 149 పాయింట్లు సాధించిన అదితి మొత్తం నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయింది. ఫైనల్లో చివరి నాలుగు అవకాశాల్లోనూ ఆమె 30 పాయింట్లు సాధించడం విశేషం. పురుషుల విభాగంలో కూడా ప్రవీణ్ ‘పర్ఫెక్ట్ స్కోర్’తో పసిడి గెలుచుకున్నాడు. ప్రవీణ్ ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకపోగా, ఒత్తిడిలో పడిన ల్యూకాజ్ చివర్లో ఒక పాయింట్ పోగొట్టుకొని రజతంతో సంతృప్తి చెందాడు. జ్యోతి సురేఖకు కాంస్యం ప్రపంచ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగంలో 2019లో కాంస్యం, 2021లో రజతం సాధించి∙ఈ సారి స్వర్ణంపై గురి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ విభాగంలో సురేఖ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. సెమీ ఫైనల్లో సురేఖ 145 – 149 స్కోరుతో అదితి స్వామి చేతిలో ఓటమి పాలైంది. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో సురేఖ చక్కటి ప్రదర్శనతో 150 స్కోరు నమోదు చేసింది. ఆమె 150 – 146 స్కోరుతో తుర్కియేకు చెందిన ఐపెక్ తోమ్రుక్ను ఓడించింది. ఓవరాల్‌గా ఆర్చరీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సురేఖకు ఇది ఎనిమిదో పతకం. టీమ్, వ్యక్తిగత విభాగాల్లో కలిపి ఆమె ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు గెలుచుకుంది. -
రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఫోటోలు వైరల్
-
అర్జున్ రెడ్డితో గుర్తింపు.. వరుస సినిమాలు చేస్తున్న తెలుగందం
అదితి మ్యాకాల్ పుట్టింది కామారెడ్డి. తండ్రి సదాశివపేట గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఫ్యాషన్‌పై ఉన్న మక్కువతో తన డిజైన్స్‌ను తానే ధరిస్తూ కొన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొంది. డిజైనర్‌గా కంటే మోడల్‌గా గుర్తింపు రావడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. తర్వాత ఆమె నటనారంగం వైపు నడిచింది. వాణిజ్య ప్రకటనల్లో మోడలింగ్ చేస్తూ.. యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించేది. తను నటించిన ‘పాప పి సుశీల’, ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పాష్ పోరీస్’ వెబ్ సిరీస్‌లు అదితికి సినిమా ఛాన్స్‌లను తెచ్చి పెట్టాయి. బ్లాక్బాస్టర్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అదితి వెనుతిరిగి చూడలేదు. అందులో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి గుర్తింపునే ఇచ్చింది. వరుసగా ‘అమీ తుమీ’,‘రాధ’, ‘మిఠాయ్’, ‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా’, ‘నేనులేని నా ప్రేమకథ’ సినిమాల్లో నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఏకమ్’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బిజీగా ఉండటం నాకిష్టం. ఎంతలా అంటే ఐదేళ్లలో ఇరవై సినిమాల్లో నటించేంతలా! బాలీవుడ్‌లోనూ నటించాలని ఉంది – అదితి మ్యాకాల్ View this post on Instagram A post shared by Aditi Myakal (@aditi.myakal) View this post on Instagram A post shared by Aditi Myakal (@aditi.myakal) చదవండి: రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం -
ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే!
Bangladesh vs India, 3rd ODI- Ishan Kishan: జార్ఖండ్ యంగ్ డైనమైట్, టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. కెరీర్లో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ యువ వికెట్ కీపర్ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. దీంతో ఇషాన్ పేరుతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అద్భుతమైన ఇన్నింగ్స్... నిన్ను ఎంత ప్రశంసించినా తక్కువే అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొనియాడగా.. టీమిండియాకు కావాల్సింది ఇలాంటి ఆటగాడే కదా అని వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకున్నాడు. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇషూ నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఇషూ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన మరో స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సైతం సూపర్ ఇన్నింగ్స్ అంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు ఓ స్పెషల్ పర్సన్ నుంచి అందిన విషెస్ నెట్టింట చర్చకు దారితీశాయి. ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరీ అదితి?! ఆమె పేరు అదితి హుండియా. ఇషాన్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి, అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉంది. మిస్ ఇండియా ఫైనలిస్టు అయిన అదితి.. మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ ఇద్దరు పలుమార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇషాన్ గానీ, అదితి గానీ తమ బంధం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్ ద్విశతకం బాదడంతో అదితి అతడిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఇషాన్‌ను ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్ హార్ట్ ఎమోజీతో ప్రేమను చాటుకుంది. అతడి స్పెషల్ ఇన్నింగ్స్‌కు సంబంధించి బీసీసీఐ చేసిన పోస్టును కూడా రీషేర్ చేసింది. దీంతో ఇషాన్- అదితి పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే ఇషాన్ కిషన్ రికార్డులు... ►వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (126 బంతులు; పాత రికార్డు క్రిస్ గేల్ (138 బంతులు; 2015లో జింబాబ్వేపై) ►చిన్న వయసులో ద్విశతకం (24 ఏళ్ల 145 రోజులు; పాత రికార్డు రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజలు; 2013లో ఆస్ట్రేలియాపై), భారత్ తరఫున అతి తక్కువ (103) బంతుల్లో 150 పరుగుల మార్క్ (పాత రికార్డు సెహ్వాగ్ 112 బంతుల్లో; 2011లో వెస్టిండీస్‌పై) ►ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్ ఇషాన్ కిషన్. ఇంతకు ముందు రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకం బాదగా.. సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్ ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే AUS vs WI: 77 పరుగులకే కుప్పకూలిన విండీస్.. 419 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం -
పెళ్లికూతురైన అదితి ప్రభుదేవ.. ప్రముఖ పారిశ్రామికవేత్తతో ఘనంగా వివాహం
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్ నటీ అదితి ప్రభుదేవ, పారిశ్రామికవేత్త యశష్ పట్లా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 28, సోమవారం ఉదయం ప్యాలెస్ మైదానంలో ఘనంగా పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు నటులు యష్, రాధిక పండిట్, జై జగదీష్, రచన ఇందర్, అభిషేక్ అంబరీష్, మేఘనా రాజ్ సర్జా వంటి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో అదితి టెంపుల్ జ్యువెలరీతో.. తెలుపు, ఎరుపు రంగు పెళ్లి పట్టు చీరను ధరించగా, యశష్ పట్టు ధోతీ, చొక్కా ధరించి కనిపించారు. సోషల్ మీడియాలో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో ఆదిత్, యశప్లు తమ నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (Sai Pallavi: సాయిపల్లవి సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి గుడ్‌బై?) -
పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్‌వుడ్‌లో డిమాండ్ ఉన్న నటి. కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్‌తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్ -
కార్తీ నా కంటే మంచి నటుడు: హీరో సూర్య
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమన్. ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, ఎస్.కె.సెల్వకుమార్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి మధురైలో చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా, రాజ్యసభ సభ్యుడు వెంకటేశన్ అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన ఏ చిత్రానికీ ఆడియో విడుదల వేడుక జరగలేదన్నారు. కానీ ఈసారి ఇలా వేడుక జరిపినందుకు సూర్య, జ్యోతిక, కార్తీ, 2డీ సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కథానాయికగా అవకాశం ఇచ్చిన సూర్య, కార్తీకి హీరోయిన్ అదితి శంకర్ థ్యాంక్స్ చెప్పారు. ఆమె ఈ చిత్రంలో ఒక పాట పాడటం విశేషం. కార్తీ మాట్లాడుతూ తన తొలి చిత్రం పరుత్తివీరన్ షూటింగ్ ఇక్కడే జరిగిందన్నారు. ఇంతకుముందు ముత్తయ్య దర్శకత్వంలో మధురై నేపథ్యంలో కొంబన్ చిత్రంలో నటించానని, ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. రెండవసారి విరుమన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. సూర్య మాట్లాడుతూ మధురై మన్నులో కథలకు కొరతే లేదన్నారు. పలుమార్లు ఇక్కడికి వచ్చి ప్రేమాభిమానాలను పొందానన్నారు. అలాంటి ఈ గడ్డపై విరుమన్ చిత్ర ఆడియో వేడుక జరపడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఇక్కడ కథల్లో జీవం ఉంటుందన్నారు. కార్తీ నా కంటే మంచి నటుడు అని కొనియాడారు. ఆదితి శంకర్ నటిగా మెప్పించారన్నారు. తనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలో తాను తన పిల్లల విద్య విషయమై న్యూయార్క్‌లో ఉన్నానని, ఆ విషయం తెలియడానికి తనకు నాలుగు గంటలు పట్టిందన్నారు. అంతకు ముందే మీడియా ఆ వార్తను గ్లోబలైజేషన్ చేయడం సంతోషం కలిగించిందని తెలిపారు. చదవండి: విజయ్ దేవరకొండతో లవ్? మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు! -
డైరెక్టర్ శంకర్ కూతురు హీరోయిన్గా శివకార్తికేయన్ కొత్త సినిమా
తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్, డాన్ చిత్రాలతో విజయాలు అందుకున్న ఆయన ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ప్రిన్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రానికి క్లాప్ కొట్టారు. దీనికి ‘మావీరన్’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో దర్శకుడు శంకర్ వారసురాలు ఆదితి శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈమెకిది రెండో సినిమా. కార్తీ నటించిన విరుమాన్ చిత్రంతో కథానాయికగా అదితి శంకర్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే అదితి మరో చిత్రంలో అవకాశం దక్కించుకోవడం విశేషం. కాగా శాంతి టాకీస్ సమర్పణలో అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకార్తికేయన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుధవారం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విదు అయన్న ఛాయాగ్రహణంను, భరత్ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అంగన్వాడీలో టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి
మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రంలో ప్రమా దవశాత్తు టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మద్నూర్ మండలం రాచూర్‌కి చెందిన సూర్యకాంత్ కుమార్తె అదితి(5) శనివారం మినీ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం ఆ బాలిక నోటి నుంచి నురగ రావడం గమనించిన అంగన్వాడీ కార్యకర్త నగరబాయి బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించింది. దీంతో కుటుంబసభ్యులు చిన్నారిని మహారాష్ట్ర దెగ్లూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు చిన్నారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, అదితి టర్పంటాయిల్ను అంగన్వాడీ కేం ద్రంలో తాగిందా.. లేక ఆ సమీపంలోని అంగన్ వాడీ కార్యకర్త ఇంట్లో తాగిందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పాప టర్పం టాయిల్ తాగి మృతి చెందిందని, దీనికి కార్యకర్త నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీడీపీవో సునంద వివరణ కోరగా, ఆదివారం ఉదయం రాచూర్కు వెళ్లి విచారణ చేపడతామని, ఆ తర్వాతే పాప మృతికి గల కారణాలు వివరిస్తామని బదులిచ్చారు. -
ఈ హీరోయిన్ నిజ జీవితంలోనూ ఓ సివంగి
నాలుగు అడుగులు వెనక్కి వేసిన పులి ఒక్కసారిగా ముందుకు దూకి కొట్టే పంజా దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో... అలా వరుస ఫ్లాప్‌ల తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకొని, ఓ భారీ హిట్ కొట్టింది అదితి పోహన్‌కర్. కేవలం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘షీ’ వెబ్ సిరీస్‌లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె ఓ సివంగి. ముంబైలో పుట్టి,పెరిగింది. బహుముఖప్రజ్ఞగల కుటుంబం ఆమెది. తండ్రి సుధీర్ పోహన్‌కర్ మారథాన్ రన్నర్, తల్లి శోభా పోహన్‌కర్ జాతీయ స్థాయి హాకీ ప్లేయర్. అమ్మమ్మ సుశీల శాస్త్రీయ సంగీత గాయని. అక్క నివేదిత రచయిత్రి, ఆమె బావ బాలీవుడ్ ప్రసిద్ధ నటుడు మకరంద్ దేశ్‌పాండే. ఆ ప్రతిభా వారసత్వాన్ని అందిపుచ్చుకుంది అదితి. చిన్నతనంలో పరుగు పొటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించింది. మహారాష్ట్ర తరపున 100, 200 మీటర్ల పరుగు పందేలు, మారథాన్లలో పాల్గొంది. ముంబై విశ్వవిద్యాలయంలో కామర్స్ కోర్సు చేసింది. కాలేజీ రోజుల్లోనే నటనపై ఉన్న ఇష్టంతో ప్రఖ్యాత నాటక దర్శకుడు సత్యదేవ్ దూబే వర్క్‌షాపుల్లో పాల్గొనేది. అక్కడే ఆమె ఆల్‌రౌండర్‌గా మారింది.. నటిగా, సింగర్‌గా, డాన్సర్‌గా! ఇది గుర్తించిన ఆమె బావ, సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అలా 2010లో ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేనంత బిజీ అయిపోయింది. వెంట వెంటనే ‘కుణాసాఠీ కుణీతరి’ మరాఠి చిత్రం, ‘జెమినీ గణేశనం సురులి రాజానం’, ‘మన్నవన్ వన్యనాది’ తమిళ చిత్రాల్లో నటించింది. కానీ అవన్నీ ఫ్లాప్లే. 2014లో చేసిన ‘లయ్భరి’ మరాఠి చిత్రం బాగా ఆడింది. అయితే రితిశ్ దేశ్‌ముఖ్‌కు మొదటి సినిమా కావడంతో క్రెడిట్ మొత్తం అతనికి వెళ్లింది. అప్పుడప్పుడు క్యాడ్బరీ మంచ్, గోద్రెజ్, ఎయిర్టెల్, శామ్సంగ్ వంటి వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. వరుస అవకాశాలు తెచ్చిన వరుస పరాజయాలను గుర్తించి, ఇకపై ఆచి తూచి అడుగు వేద్దామని నిర్ణయించుకుంది. అందుకే.. చాలా సంవత్సరాల తర్వాత 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘షీ’ వెబ్ సిరీస్‌తో పెద్ద హిట్ కొట్టింది. ఇందులో గొప్ప ధైర్యం, తెలివి ఉన్న అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి, మెప్పించింది. ప్రపంచం మొత్తం నుంచి నాకు అభినందనలు వస్తున్నాయి. ఇవి నా డబ్బింగ్‌కు కూడా రావడం, చాలా సంతోషం. ఏదో పెద్ద కమర్షియల్ సినిమా చేసిన అనుభూతినిచ్చింది ‘షీ’. – అదితి పోహన్‌కర్ -
మనిషిలా ఉండే మనిషి
అదితి సింగ్ ఎక్కడా పెద్దగా కనిపించరు. వెతుక్కోవాలి ఆమెను మనుషుల్లోకి వెళ్లి! తనకు ఇష్టం లేనిదే పార్టీ చెప్పినా వినరు. తగని పని తన పార్టీ చేసినా ఊరుకోరు. పాలిటిక్స్.. ఆమెకు స్వచ్ఛంగా ఉండాలి. పార్టీ ఏదైనా మనిషి మనిషిలా ఉండాలి. ముందొక జోకు. తర్వాతొక క్రూయల్ జోకు. ∙∙ ‘‘ఎప్పుడు తిన్నాడో ఏమో, పొద్దున చేసిన ఉప్మా కాకుండా మళ్లీ ఫ్రెష్‌గా తీస్కోనిరా’’ అంటాడు సుధతో, తనికెళ్ల భరణి. డైనింగ్ టేబుల్ ముందుంటారు భరణి, నాగార్జున. నాగార్జునకు.. భరణి బాబాయ్. నాగార్జున పిన్ని.. సుధ. ‘‘ఎర్ర రవ్వ ఉప్మా చెయ్యనా? తెల్ల రవ్వ ఉప్మా చెయ్యనా?’’ అని మళ్లీ వచ్చి అడుగుతుంది సుధ. ‘‘ఉప్మాలా ఉండే ఉప్మా చెయ్’’ అంటాడు భరణి. (ఉవ్వెత్తున ఎగసి... ఉసూరుమని కూలి...) భర్త అంగద్తో అదితి ఇప్పుడు ఒక క్రూయల్ జోక్. ఊహు. దానికన్నా ముందు ఒక సత్యశోధన. మనిషి ఎలా ఉండాలి? ఎర్రగానా, ఎత్తుగానా, బక్కగానా, బలంగానా? నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి కారణంగా కూతురికి ఉన్న ఫాలోయింగ్ కాదు అదితికి ఉన్నది. ప్రజలతో చక్కగా మాట్లాతారు. ప్రత్యర్థులకు మాటకు మాట చెబుతారు. ప్రత్యర్థులు అవతలి పార్టీవాళ్లే అయి ఉండాలనేం లేదు ఆమెకు. తిన్నగా లేకపోతే సొంత పార్టీవాళ్లకు కూడా తను ప్రత్యర్థిగా మారిపోతారు. మనుషుల పార్టీ ఆమెది! మనిషికి కష్టం కలిగించిన వాళ్లెవరైనా, మనిషిలా ప్రవర్తించని వాళ్లెవరైనా అదితికి నచ్చరు. రాజకీయాల్లో ఈ స్వభావం పని చేస్తుందా? పని చేసే స్వభావమే రాజకీయ స్వభావం కావాలన్నది అదితి పాలసీ. పని గట్టుకుని ఆమె పాలిటిక్స్‌లోకి రాలేదు. పని చేయాలనుకుని వచ్చారు. ఢిల్లీలో చదువుకున్నారు. తర్వాత ముస్సోరీలో. తర్వాత యూఎస్‌లోని డ్యూక్ యూనివర్సిటీలో. మేనేజ్మెంట్లో డిగ్రీ చేశారు అక్కడ. ఇండియా వచ్చాక సోషల్ వర్క్‌ను ఎంచుకున్నారు. సోషల్ వర్క్‌లో చురుగ్గా ఉండేవాళ్లకు రాజకీయాలు పట్టవు కానీ.. రాజకీయాలు అలాంటివారిని ఎంత దూరాన్నుంచయినా వెంటనే పట్టేస్తాయి. అలా పాలిటిక్స్‌లోకి వెళ్లారు. క్రూయల్ జోక్ నుంచి పక్కకు వచ్చేశామా! లేదు. ప్రియాంక గాంధీ చేసిన ఒక పనిని క్రూయల్ జోక్ తో పోల్చింది అదితినే! ∙∙ అదితి, ప్రియాంక ఒకేపార్టీ వాళ్లు. అదితి.. ఎమ్మెల్యే మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ కార్యదర్శి కూడా. ప్రియాంక తూర్పు యూపీకి పార్టీ ప్రధాన కార్యదర్శి. వలస కార్మికులకు కాంగ్రెస్‌పార్టీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేసింది అని ప్రియాంక ప్రకటించగానే, ఆ బస్సుల జాబితాను అధికార పార్టీ బీజేపీ తెప్పించుకుని చూసింది. వాటిల్లో సగానికి పైగా కండిషన్లో లేని బస్సులే! 297 బస్సులు తప్పుపట్టి ఉన్నాయి. 98 ఆటో–రిక్షాలు, అంబులెన్స్ వంటి కొన్ని వాహనాలు కూడా ఆ బస్సుల జాబితాలో చేరి ఉన్నాయి! 68 వాహనాలకైతే అసలు పేపర్లే లేవు! ఈ విషయమే అదితికి తన సొంత పార్టీ మీద ఆగ్రహం తెప్పించింది. ఇంతకన్నా చవకబారు రాజకీయం ఉందా? వలస కార్మికుల మీద వేసిన క్రూయల్ జోక్ కాదా ఇది అని బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే క్రమశిక్షణ చర్య ఒకటి అదితిపై పెండింగులో ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశానికి.. పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ హాజరైనందుకు అదితిని ఎమ్మెల్యేగా అనర్హురాలిని చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన ఆ ఫిర్యాదుపై ఇంకా ఏ నిర్ణయమూ జరగలేదు. ∙∙ ఎవరి నిర్ణయాలకూ తలొగ్గరు అదితి. అలాగే తనపై వచ్చిన ఏ నిజం కాని వార్తకూ ఆమె స్పందించకుండా ఉండరు. రాహుల్, అదితి పెళ్లి చేసుకోబోతున్నారని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చినప్పుడు ఆమె వెంటనే ఖండించారు. ‘‘రాహుల్జీ నాకు అన్నయ్య. ఆయనకు రాఖీ కూడా కట్టాను’’ అని స్పష్టంగా చెప్పి ఆ విషయంలో ఇక ఎవరి ఊహల్నీ ముందుకు వెళ్లనీయలేదు. గత ఏడాదే అదితికి అంగద్సింగ్తో వివాహం జరిగింది. ఆయన కూడా ఎమ్మెల్యేనే. అయితే పంజాబ్‌లో. సమావేశాలు, నియోజకవర్గ పర్యటనలు లేనప్పుడు ఢిల్లీనే ఈ దంపతుల ఇల్లు. అతడిదీ కాంగ్రెస్ పార్టీనే. లవ్ మ్యారేజ్ వాళ్లది. అదితి ఎక్కువగా ఉండేది మాత్రం తన నియోజకవర్గ ప్రజలతోనే.