కుటుంబ సభ్యుల ఆశాభావం
సీతమ్మధార: మురుగు కాల్వలో కొట్టుకుపోయిందని భావిస్తున్న ఆరేళ్ల చిన్నారి అదితి అచూ కి నాలుగు రోజులైనా లభించకపోవడంతో కు టుంబ సభ్యుల్లో చిన్నారి సజీవంగా ఉండే ఉం టుందని ఆశలు చిగురిస్తున్నాయి. ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అదితి తాతయ్య చాడా వెంకటరమణమూర్తి తన మనోభావాలు పంచుకున్నారు. చిన్నారి పూర్తి పేరు సిహెచ్ సాయి లావణ్య అదితి అని, నాలుగేళ్లుగా సీతమ్మధారలోని తన నివాసంలోనే ఉంటూ చదువుకుంటోందని తెలిపారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉండేదని, మంచి తెలివైనదని, అలాంటి బాలిక గల్లంతయిన విషయం తెలుసుకుని నిశ్చేష్టులమయ్యామన్నారు.
జీవీఎంసీ, పోలీస్, నేవీ, ఫైర్, మీడియా సహకారంతో నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికి అచూకి తెలియకపోవడంతో పలు కోణాల్లో ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు. ముఖ్యంగా పాప కొట్టుకుపోవడం ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదని చెప్పడం కూడ ఆశలు కలిగిస్తోందన్నారు. సంఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరాలేకపోవడంతో ఎవరూ చూడలేకపోయామని చెబుతున్నారన్నారు. పాప వెనుక స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, సుమారు 3..5 అడుగుల ఎత్తు ఉంటుందని, అడుగున్నర మేర ఉన్న కాలువలో కొట్టుకుపోవడం కష్టతరమనిపిస్తోందని చెప్పారు. వీటినిబట్టి చూస్తే చిన్నారిని ఎవరైనా అపహరించారా.. కాలువలో నుంచి ఎక్కడైన ఎవరైన రక్షించి వారివద్ద ఉంచుకున్నారా.. అనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఏదేమైనా చిన్నారి సజీవంగా, క్షేమంగా ఉంటుందనే ఆశలు చిగురిస్తున్నాయన్నారు. అదే కోణంలో దర్యాప్తు చేపట్టి పాపను కాపాడాలని కోరారు. చిన్నారి తల్లికి ఇప్పటివరకు నీటిలో గల్లంతయిందని చెప్పలేదనిఐ ఎక్కడో తప్పిపోయిందని, వెతుకుతున్నామని చెబుతున్నామన్నారు. ఇంటిలో అదితి గీసిన చిత్రాలను చూపిస్తూ కుటుంబ సభ్యులు విలపించారు. బెంగళూరులో చదువుతున్న అదితి సోదరుడు అనీష్ (8) మాట్లాడుతూ తన చె ల్లి చాలా హుషారుగా ఉండేదని, ఎక్కడ ఉన్నా తిరిగి ఇంటికి వచ్చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. చెల్లి తిరిగి వస్తే అందరికి మంచి పార్టీ ఇస్తానని చెప్పడం అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది.
క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం..
అదితి అచూకి తెలికపోవడంతో ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రుల మంతా కోరుకుంటున్నామని హైదరాబాద్‌కు చెందిన బాలిక మేనమామ భాస్కర్‌తో పాటు, స్నేహితులు తెలిపారు.
అదితి క్షేమంగా ఉంటుంది!
Published Sun, Sep 27 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM
Advertisement
Advertisement