ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం (PC: SAI)
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు.
మన అమ్మాయికి మరో స్వర్ణం
తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్‌లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే.
19 స్వర్ణాలు
బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి.
చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్..
Comments
Please login to add a commentAdd a comment