Jyothi Surekha Vennam
-
జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్ ప్రతినిధులు
సాక్షి, విజయవాడ: హాంగ్ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. -
గురి తప్పని బాణం.. జ్యోతి సురేఖ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో భారత ఆర్చర్లు అదరగొడతున్నారు. తాజాగా భారత ఖాతాలో రెండు బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఆర్చరీలో భారత్ రెండు పసిడి పతకాలు భారత్ సాధించింది. పురుషల కాంపౌండ్ ఈవెంట్లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్ మెడల్ సాధించగా.. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఆసియాక్రీడల్లో ఇది జ్యోతి సురేఖకు మూడో బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో యువ సంచలనం అధితి గోపిచంద్‌కు కాంస్యం సొంతం చేసుకుంది. ఆర్చరీలో తాజా విజయాలతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 24కు చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 99(24 గోల్డ్, 35 సిల్వర్, 40 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. -
Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. మన అమ్మాయికి మరో స్వర్ణం తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్‌లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే. 19 స్వర్ణాలు బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే జోడీ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. కాగా ఆసియా క్రీడల్లో ఇది భారత్‌కు 16 స్వర్ణం. ఓవరాల్‌గా ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 71 పతకాలు కైవసం చేసుకుంది. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం -
భారత ఏస్ ఆర్చర్ జ్యోతి సురేఖకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత ఏస్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంను జ్యోతి సురేఖ బుధవారం కలిశారు. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్, ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో పలు పతకాలను ఆమె సాధించారు. తాను సాధించిన పతకాలను సీఎంకు సురేఖ చూపించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై సురేఖను సీఎం ప్రశంసించారు. తనకు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం.. రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఏపీకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. చదవండి: కాలుష్య రహిత విద్యుత్ ఉత్పాదనలో తొలిస్థానంలో ఏపీ: సీఎం జగన్ -
చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం
World Archery Championships-Berlin: భారత మహిళా ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా (17) ప్రపంచ రికార్డు నెలక్పొంది. బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఆర్చరీలో భారత్ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. Aditi Swami gets the FIRST individual WORLD TITLE for India. The 17-year-old prodigy is now the world champion. 🏆#WorldArchery pic.twitter.com/oBbtgxyzq3 — World Archery (@worldarchery) August 5, 2023 ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను 149-47 ఓడించడం ద్వారా జగజ్జేతగా నిలిచి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఇదే పోటీల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్‌లతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన అదితి.. గంటల వ్యవధిలో భారత్‌కు మరో స్వర్ణం అందించింది. Kudos to #KheloIndia Athlete Aditi Gopichand Swami on being crowned World Champion in the Women's Individual Compound Final at the #ArcheryWorldChampionships🇩🇪🏹 and bagging the🥇 for 🇮🇳 with a near perfect score of 149 points💪👏 With this victory she has become the first… pic.twitter.com/m6kd0Y9ifK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2023 ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అదితి.. గత నెలలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలను సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ షూట్-ఆఫ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన సన్నె డి లాట్‌ను ఓడించిన అదితి.. సెమీఫైనల్లో సహచరి, ఆంధ్ర అమ్మాయి జ్యోతి సురేఖపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
చరిత్ర సృష్టించిన భారత మహిళా ఆర్చర్లు.. జ్యోతి సురేఖకు హ్యాట్సాఫ్!
World Archery Championships 2023- Berlin: భారత మహిళా ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్, అదితి గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. తద్వారా.. వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన ఆర్చర్లుగా రికార్డులకెక్కారు. కాగా జర్మనీలోని బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు మెక్సికన్ టీమ్‌పై 235-229తో గెలిచింది. డఫ్నే క్వింటెరో, అనా సోఫా హెర్నాండెజ్ జియోన్, ఆండ్రియా బెసెర్రాలపై పైచేయి సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చేరింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక బుధవారం నాటి ఈవెంట్లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జ్యోతి సురేఖ బృందం 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో 228–226తో చైనీస్ తైపీపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టి.. మెక్సికోను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. మన అమ్మాయి బంగారం కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఇది ఆరో పతకం కావడం విశేషం. 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఇప్పటి వరకు టీమ్ విభాగంలో రెండు రజతాలు (2021, 2017), ఒక కాంస్యం (2019)... వ్యక్తిగత విభాగంలో ఒక రజతం (2021), ఒక కాంస్యం (2019) తన ఖాతాలో జమచేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి పసిడి పతకం గెలవడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. HISTORIC win for India 🇮🇳🥇 New world champions at the Hyundai @worldarchery Championships.#WorldArchery pic.twitter.com/8dNHLZJkCR — World Archery (@worldarchery) August 4, 2023 -
200 మీటర్ల విభాగంలో జ్యోతికి స్వర్ణ పతకం
Federation Cup 2023: జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకం సాధించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి 200 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 23.42 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ జ్యోతి బంగారు పతకం గెలిచింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఇవి కూడా చదవండి: పరాజయంతో మొదలు... అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–4 గోల్స్‌తో పరాజయం పాలైంది. భారత్ తరఫున సంగీత (29వ ని.లో), షర్మిలా దేవి (40వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత ప్లేయర్ మోనిక తన కెరీర్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. సెమీస్‌లో అవ్నీత్ కౌర్ షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అవ్నీత్ కౌర్... పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ జావ్కర్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో అవ్నీత్ 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై, ప్రథమేశ్ 149–148తో చోయ్ యోంగీ (దక్షిణ కొరియా)పై నెగ్గారు. భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. -
Federation Cup 2023: జ్యోతి ‘పసిడి’ పరుగు
రాంచీ: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి విజేతగా నిలిచింది. జ్యోతి అందరికంటే వేగంగా 12.89 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నిత్య రామరాజ్ (తమిళనాడు; 13.44 సెకన్లు) రజతం... సప్న కుమారి (జార్ఖండ్; 13.58 సెకన్లు) కాంస్యం గెలిచారు. తెలంగాణ అథ్లెట్ అగసార నందిని 13.65 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ లావెటి యశ్వంత్ కుమార్ 14.62 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత ఆర్చరీ జట్లకు నిరాశ షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. రెండు విభాగాల్లో భారత జట్లు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాయి. మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–231 (57–58, 57–58, 57–59, 57–56)తో హజల్ బురున్, ఇపెక్ తొమ్రుక్, ఇర్మక్ యుక్సెల్లతో కూడిన తుర్కియే జట్టు చేతిలో ఓడిపోయింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె, రిషభ్ యాదవ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు తొలి రౌండ్లో ‘బై’ లభించగా... రెండో రౌండ్లో 236–228తో ఇండోనేసియా జట్టును ఓడించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 231–234తో మెక్సికో జట్టు చేతిలో పరాజయం పాలైంది. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర 656 పాయింట్లు స్కోరు చేసి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. -
Archery World Cup: శెభాష్ జ్యోతి సురేఖ- ప్రవీణ్.. భారత్ ఖాతాలో స్వర్ణం
Archery World Cup: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ- మహారాష్ట్ర ప్లేయర్ ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె జోడీ భారత్‌కు స్వర్ణం అందించారు. తుర్కియేలోని అంటాల్యా వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో భారత జోడీ- చైనీస్ తైపీ ద్వయంతో తలపడింది. ఈ క్రమంలో 159- 154తో ప్రత్యర్థిపై గెలుపొంది సురేఖ- ప్రవీణ్ భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ చేర్చారు. కాగా జ్యోతి సురేఖకు మెగా ఈవెంట్లో ఇది రెండో స్వర్ణ పతకం. పారిస్‌లో 2022లో జరిగిన వరల్డ్‌కప్-3లో జ్యోతి సురేఖ- అభిషేక్ వర్మతో కలిసి విజేతగా నిలిచారు. తాజాగా ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీ ఫైనల్లో ప్రవీణ్‌తో కలిసి చెన్ యి సువాన్–చెన్ చియె లున్ జోడీని ఓడించి తన ఖాతాలో మరో పసిడి పతకం జమచేసుకున్నారు. చదవండి: WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్ టెండుల్కర్ INDIAN DOMINANCE 💪 🇮🇳 It's gold for Jyothi Surekha Vennam and Ojas Pravin Deotale in Antalya#ArcheryWorldCup pic.twitter.com/hhk9OsjifV — World Archery (@worldarchery) April 22, 2023 -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలు... ప్రపంచ చాంపియన్‌షిప్... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్ జట్టులో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్... మహిళల కాంపౌండ్ జట్టులో ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు. సోనీపత్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది. రెండు ప్రపంచకప్ టోర్నీలు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్ ఇస్తారు. మూడు ప్రపంచకప్ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్ 13–18) జరుగుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్‌లో విఫలమైన ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి మహిళల రికర్వ్ జట్టులో చోటు సంపాదించలేకపోయింది. మార్చి 18న ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ నేరుగా సెమీఫైనల్ చేరాయి. -
ఆర్చరీలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కోల్‌కతాలో రెండు రోజులపాటు జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ట్రయల్స్‌లో విజయవాడకు చెందిన 26 ఏళ్ల జ్యోతి సురేఖ డబుల్ 50 మీటర్ల రౌండ్లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లు సాధించింది. తొలి రోజు 72 బాణాలు, రెండో రోజు మరో 72 బాణాలు ఉపయోగించారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో బ్రిటన్ ఆర్చర్ ఎల్లా గిబ్సన్ 1417 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. 24 మంది ఆర్చర్లు పాల్గొన్న సెలెక్షన్ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ట్రయల్స్ ద్వారా ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీలలో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేస్తారు. -
Archery World Cup: సూపర్ సురేఖ.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి
పారిస్: ఒకే ఒక్కసారి సెలెక్షన్ ట్రయల్స్‌లో తడబడినందుకు తొలి రెండు ప్రపంచకప్ టోర్నీలలో భారత జట్టులో చోటు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మూడో ప్రపంచకప్ టోర్నీలో ఘనంగా పునరాగమనం చేసింది. ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన విజయవాడకు చెందిన సురేఖ పారిస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో తన ప్రతాపం చూపించింది. కాంపౌండ్ కేటగిరీ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆర్చర్ అభిషేక్ వర్మతో కలిసి సురేఖ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 156–151తో రాబిన్–లిసెల్ జాట్మా (ఎస్తోనియా) జోడీని ఓడించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. 150కి 150 పాయింట్లు... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ సురేఖ అద్భుత ప్రదర్శన చేసి సెమీస్ చేరింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సురేఖ తొలి రౌండ్లో 147–133తో యోహానా హోర్టా ఒలివియెరా (పోర్చుగల్)పై, రెండో రౌండ్లో 150–141తో ఎలీసా బజిచెటో (ఇటలీ)పై గెలుపొందింది. ఎలీసాతో జరిగిన మ్యాచ్‌లో సురేఖ అందుబాటులో ఉన్న 150 పాయింట్లకుగాను 150 పాయింట్లు సాధించడం విశేషం. మ్యాచ్‌లో ఇద్దరు ఆర్చర్లు మూడు బాణాల చొప్పున ఐదుసార్లు లక్ష్యంపై సంధించాల్సి ఉంటుంది. సురేఖ సంధించిన 15 బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోనే పడటం విశేషం. మూడో రౌండ్లో సురేఖ 146–144తో మార్సెలా (ఇటలీ)పై, క్వార్టర్ ఫైనల్లో 149–148తో లిసెల్ జాట్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. ‘కాంపౌండ్’నూ ఒలింపిక్స్‌లో చేర్చండి... 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ కేటగిరీని కూడా చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రతిపాదన పంపించింది. మైదానంలో కాకుండా ఇండోర్ గ్రౌండ్లో కాంపౌండ్ పోటీలను నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్ కేటగిరీతో పోలిస్తే కాంపౌండ్ కేటగిరీకి చెందిన విల్లు ఆకారం, బాణాన్ని విడుదల చేసే విధానం తేడా ఉంటుంది. రికర్వ్ విల్లులో బాణాన్ని వేళ్ల ద్వారా... కాంపౌండ్‌లో బొటనవేలితో ట్రిగ్గర్ను నొక్కి బాణాన్ని విడుదల చేస్తారు. చదవండి: Vennam Jyothi Surekha: జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం -
Archery World Cup: మెరిసిన జ్యోతి సురేఖ
పారిస్: ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో మెరిసింది. కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో lవిజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 712 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రియా గుర్జర్ 689 పాయింట్లతో 20వ ర్యాంక్‌లో, ముస్కాన్ 689 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో, అవనీత్ 686 పాయింట్లతో 24వ ర్యాంక్‌లో నిలిచారు. సురేఖ, ప్రియ, ముస్కాన్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. -
జ్యోతి సురేఖకు నిరాశ.. బొపన్న, సానియా జంటలకు షాక్!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్ల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ జ్యోతి సురేఖ విఫలమైంది. సోనిపట్‌లో మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ విభాగం ట్రయల్స్‌లో సురేఖ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్ రౌండ్లోనే నిష్క్రమించింది. సురేఖ 2014, 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, రజతం సాధించింది. ఇతర క్రీడాంశాలు బొపన్న జంట ఓటమి కాలిఫోర్నియా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం 2–6, 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 61,100 డాలర్ల (రూ. 46 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సానియా జోడీ పరాజయం కాలిఫోర్నియా: మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్ (బెల్జియం) ద్వయం 3–6, 6–7 (3/7)తో జావోజువాన్ యాంగ్ (చైనా)–ఎకతెరీనా (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో మనిక బత్రా–అర్చన జంట ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా–అర్చన కామత్ (భారత్) ద్వయం 13–11, 8–11, 11–5, 13–11తో సూ వాయ్ యామ్–లీ హో చింగ్ (హాంకాంగ్) జోడీని ఓడించి సెమీఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మనిక 5–11, 2–11, 4–11తో యింగ్ హాన్ (జర్మనీ) చేతిలో... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సత్యన్ (భారత్) 11–5, 8–11, 7–11, 4–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! -
ఆసియా ఆర్చరీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆంధ్రా అమ్మాయి..
ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. మహిళల కాంపౌండ్ విభాగంలో గురువారం జరిగిన ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్ యూహ్యూన్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. తొలి నాలుగు సెట్లు పూర్తయ్యేసరికి సురేఖ 118–116తో యూహ్యూన్‌పై రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి సెట్లోని మూడు బాణాలకు సురేఖ వరుసగా 10, 9, 9 పాయింట్లు స్కోరు చేయగా... యూహ్యూన్ 10, 9, 10 స్కోరు చేసింది. ఫలితంగా సురేఖ పాయింట్ తేడాతో గెలుపొంది స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖర్లో కొరియా కోచ్ మ్యాచ్ జడ్జితో వాదనకు దిగాడు. యూహ్యూన్ వేసిన ఐదో సెట్ రెండో బాణం 10 పాయింట్ల సర్కిల్ గీతకు మిల్లీ మీటర్ తేడాతో బయటి వైపు గుచ్చుకుంది. దీనికి జడ్జి 9 పాయింట్లు కేటాయించగా... 10 పాయింట్లు ఇవ్వాల్సిందిగా కొరియా కోచ్ కాసేపు వాదించాడు. బాణాన్ని పలు మార్లు పరిశీలించిన జడ్జి... దానికి 9 పాయింట్లనే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో సురేఖకు గెలుపు ఖాయమైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ రజతాన్ని సాధించాడు. ఫైనల్లో అతడు 148–149తో కిమ్ జోంగ్‌హూ (కొరియా) చేతిలో ఓడాడు. కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ– రిషభ్ యాదవ్ (భారత్) జంట 154–155తో కిమ్ యున్హీ–చోయ్ యాంగ్‌హీ (కొరియా) ద్వయం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. చదవండి: IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్ దాఖలు -
రెండు స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ జ్యోతి; హాకీలో అవార్డులన్నీ మనకే!
Jyothi Surekha Vennam Won 2 Gold Medals: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రపదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఆమె కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో, ఒలింపిక్ రౌండ్లో విజేతగా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో సురేఖ 150–146తో ముస్కాన్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. హాకీలో అవార్డులన్నీ మనకే లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఓటింగ్ పద్ధతిలో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. చిత్రంగా ఆటగాళ్లే కాదు కోచ్ అవార్డులు కూడా మన జట్ల కోచ్‌లకే రావడం మరో విశేషం. భారత పురుషులు, మహిళల జట్లకు చెందిన ఆరుగురు క్రీడాకారులు, హెడ్ కోచ్‌లు ఎఫ్ఐహెచ్ అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో గుర్జీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో పీఆర్ శ్రీజేశ్... మహిళల విభాగంలో సవితా పూనియా ‘ఉత్తమ గోల్‌కీపర్’ ట్రోఫీలు గెలుచుకున్నారు. ‘బెస్ట్ రైజింగ్ స్టార్’లుగా పురుషుల విభాగంలో వివేక్ సాగర్... మహిళల విభాగంలో షర్మిలా దేవి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో ఉత్తమ కోచ్‌గా రీడ్... మహిళల విభాగంలో ఉత్తమ కోచ్‌గా జోయెర్డ్ మరీన్ ఎంపికయ్యారు. ►79 దేశాలకు చెందిన హాకీ సమాఖ్యలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సుమారు మూడు లక్షల మంది అభిమానులు కూడా ఈ ఓటింగ్‌లో పాలుపంచుకున్నట్లు ఎఫ్ఐహెచ్ తెలిపింది. ►ఆగస్టు 23న మొదలైన ఓటింగ్ ప్రక్రియ గత నెల 15న ముగిసింది. మొత్తం 100 శాతంలో హాకీ జట్ల కోచ్‌లు, కెపె్టన్లకు 50 శాతం ఓటింగ్ కోటా ఉండగా... 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు వేసుకోవచ్చు. మిగతా 25 శాతం మీడియాకు కేటాయించారు. ►అయితే ఓటింగ్ విధానంపై టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ బెల్జియం హాకీ జట్టు ఆక్షేపించింది. పారదర్శకంగాలేదని ఓటింగ్ పద్ధతిని తప్పుబట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు కొత్త రికార్డు! -
రెండోరోజూ చెరుకూరి దీక్ష.. వైద్యానికి నో!
సాక్షి, విజయవాడ : చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకుంది. చెరుకూరి సత్యనారాయణ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తుండగా.. ఆయన భార్య చెరుకూరి కృష్ణకుమారి ఇంట్లో దీక్షను చేస్తున్నారు. గుణదల స్మశానవాటికలోని తన కుమారుడు లెనిన్ సమాధి వద్ద దీక్ష చేస్తున్న చెరుకూరి సత్యనారాయణను మంగళవారం సాయంత్రం బలవంతంగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన దీక్ష భగ్నం చేసి.. బలవంతంగా ఆస్పత్రికి తరలించినా.. ఆస్పత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తనను, తన కుటుంబాన్ని అవమానించారని, ఆమె, ఆమె తండ్రి తమకు క్షమాపణ చెప్పే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన చెప్తున్నారు. దీక్షలో ఉన్న ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు. జ్యోతిసురేఖను తాను ఎప్పుడు డబ్బులు అడగలేదని, తాను రూ. 15 లక్షలు అడిగినట్టు ఆమె అబద్ధాలు చెప్తున్నారని చెరుకూరి సత్యనారాయణ అంటున్నారు. తమ పేరు చెప్పి.. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్లకు రావాల్సిన డబ్బు తీసుకున్నారని, ఆమె శిక్షణ తీసుకుంది తమ వోల్గా ఆర్చరీ సెంటర్‌లోనేనని ఆయన తెలిపారు. వివాదమిది.. ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని జ్యోతి సురేఖ ఖండించిన విషయం తెలిసిందే. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని ఆమె స్పష్టం చేశారు. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్ అని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని, దీంతో పెట్రోలియం స్పోర్ట్స్ బోర్డ్ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపారు. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు ఆమె వివరణ ఇచ్చారు. మరోవైపు జ్యోతిసురేఖకు బేసిక్ కోచ్‌ను తానేనని చెరుకూరి సత్యనారాయణ వాదిస్తున్నారు. -
కోచ్ చెరుకూరి సత్యనారాయణ దీక్ష భగ్నం!
సాక్షి, విజయవాడ : అర్జున అవార్డు గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తనను, తన కుటుంబాన్ని అవమానించారంటూ కోచ్ చెరుకూరి సత్యనారాయణ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గుణదల స్మశానవాటికలోని తన కుమారుడు లెనిన్ సమాధి వద్ద దీక్ష చేస్తున్న ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. జోత్యి సురేఖ, ఆమె తండ్రి తన కుటుంబాన్ని అవమానించారని, ఆమె తనకు గురుద్రోహం చేసిందని ఆరోపిస్తూ.. చేరుకూరి సత్యనారాయణ మంగళవారం మధ్యాహ్నం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. జ్యోతి సురేఖ తమకు క్షమాపణ చెప్పేవరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. తానే కాదు తన భార్య కూడా నివాసంలో దీక్ష చేస్తోందని చెప్పారు. జ్యోతిసురేఖను తాను ఎప్పుడు15 లక్షల రూపాయలు అడగలేదని అన్నారు. తమ పేరు చెప్పి.. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్లకు రావాల్సిన డబ్బు తీసుకున్నారని, ఆమె శిక్షణ తీసుకుంది తమ వోల్గా ఆర్చరీ సెంటర్‌లోనేనని ఆయన తెలిపారు. కాగా, ఈ నెల 3న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో తనకు కోచ్‌గా చెరుకూరి సత్యనారాయణను చూపిస్తూ రూ.15 లక్షల మంజూరు చేయడాన్ని జ్యోతి సురేఖ ఖండించిన విషయం తెలిసిందే. తనకు ఏనాడు ఆయన కోచ్‌గా వ్యవహరించలేదని ఆమె స్పష్టం చేశారు. తన కోచ్‌లు జె.రామారావు, జీవన్‌జ్యోత్‌సింగ్ అని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా చెరుకూరి సత్యనారాయణ అడ్డుకున్నారని, దీంతో పెట్రోలియం స్పోర్ట్స్ బోర్డ్ తరఫున ఆడాల్సి వచ్చిందని తెలిపారు. 2013లోనే ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. మరోవైపు జ్యోతిసురేఖకు బేసిక్ కోచ్‌ను తానేనని చెరుకూరి సత్యనారాయణ వాదిస్తున్నారు. -
'విజయవాడలో ఆమెకు 500 గజాల స్థలం'
అమరావతి: అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కలిశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిందు చేతుల మీదుగా జాతీయ క్రీడాపురస్కారం అర్జున అవార్డు అందుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు. జ్యోతి సురేఖకు విజయవాడలో 500 గజాల స్థలం, కోటి రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీయిచ్చారు. ఆమె పేరును ప్రభుత్వ ఉద్యోగానికి పేరు సిఫారసు చేస్తామన్నారు. స్కేటింగ్‌లో గిన్నీస్ రికార్డు సాధించిన జి.దేవిశ్రీప్రసాద్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. అతడికి ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. దేవిశ్రీప్రసాద్ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని, తిరుపతి ఎస్వీయూలో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీయిచ్చారు.