
సాక్షి, విజయవాడ: హాంగ్‌ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు.
శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు.
భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment