Archery
-
జ్యోతి సురేఖకు కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ 900 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 18 మీటర్ల దూరం ఉన్న లక్ష్యంవైపు ఆయా ప్లేయర్లు 30 బాణాలను మూడుసార్లు చొప్పున సంధించారు.నిర్ణీత 90 బాణాల తర్వాత సురేఖతోపాటు ఎలీసా రోనెర్ (ఇటలీ), అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా), ఆండ్రియా మునోజ్ (స్పెయిన్) 900 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే పతకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్లను లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా ఎలీసా రోనెర్ (87)కు స్వర్ణ పతకం, అలెజాంద్రా (80) రజతం, జ్యోతి సురేఖ (79)కు కాంస్య పతకం ఖరారయ్యాయి. ఉమామహేశ్‌కు నాలుగో స్థానం న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఉమమహేశ్ 208.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. -
ఆర్చరీ వరల్డ్‌కప్: రజత పతకం కైవసం చేసుకున్న దీపికా కుమారి
ట్లాక్స్కాలా (మెక్సికో): భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లో రజత పతకాన్ని (మహిళల రికర్వ్ ఈవెంట్) కైవసం చేసుకుంది. ఫైనల్లో దీపికా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన అర్చర్ లి జియామన్ చేతిలో 0-6 తేడాతో ఓటమిపాలైంది.మూడేళ్ల విరామం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరిన దీపికా అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో దీపికా తడబాటుకు లోనైంది. ఆర్చరీ వరల్డ్‌కప్ టోర్నీలో దీపికాకు ఇది ఆరో పతకం. 2011, 2012, 2013, 2015, 2024 ఎడిషన్లలో దీపికా రజత పతకాలు సాధించింది. 2018 ఎడిషన్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.చదవండి: ధీరజ్, సురేఖలకు నిరాశ -
ధీరజ్, సురేఖలకు నిరాశ
ట్లాక్స్కాలా (మెక్సికో): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ నిరాశపరిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 ప్లేయర్లకు వరల్డ్‌కప్ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ ధీరజ్ పురుషుల రికర్వ్ విభాగంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్ ఫైనల్) ఓడిపోయాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ కూడా ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్ ఫైనల్) పరాజయం పాలైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ప్లేయర్ ప్రథమేశ్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్రీ మార్టా పాస్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 145–147 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ప్రథమేశ్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన ప్రియాంశ్‌పై 147–146తో గెలిచాడు. సెమీఫైనల్లో ప్రథమేశ్ డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ ఫులర్టన్ చేతిలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతక మ్యాచ్‌లో ప్రథమేశ్ 146–150తో మైక్ ష్లాసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 4–6 (28–28, 29–26, 28–28, 26–30, 28–29)తో లీ వూ సియోక్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ఎక్కుపెట్టిన బాణాలు.. ఈ'విల్' కారులు!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో హైదరాబాద్‌కు ఒలింపియన్స్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి పీవీ సింధూ, సైనా నెహా్వల్, గుత్తా జ్వాల, నగరంతో అనుబంధమున్న గగన్ నారంగ్ వంటి వారు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడమే కారణం. అంతేకాకుండా పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒలింపియన్స్ సన్నద్ధమైంది కూడా ఇక్కడే. ఇలా నగరం నుంచి బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, హాకీ, చెస్, రైఫిల్ షూటింగ్ వంటి పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి నగర ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు. ఇదే కోవలో ఆర్చరీ క్రీడ కూడా భవిష్యత్‌లో రాణించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్చరీకి ప్రాధాన్యత చాలా పెరుగుతోంది. ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగు క్రీడా కారుడు ధీరజ్ 4వ స్థానంలో నిలిచిన సంగతి విధితమే. భారతీయ క్రీడా చరిత్రలో తమకంటూ ఒక పేజీ రాసుకోవాలనుకునే నగర క్రీడాకారులు విల్లంబులు చేతబట్టి ఒలింపిక్ వేటకు సిద్ధమవుతున్నారు.ఆర్చరీపై భాగ్యనగర వాసుల గురి..జాతీయ స్థాయి టాప్ 2లో నగర అమ్మాయిలు, టాప్ 8లో అబ్బాయిలు..ఏ క్రీడ ఆడాలన్నా, శిక్షణ పొందాలన్నా మరో క్రీడాకారుడు ఉండాల్సిందే. ఇలా కాకుండా ఇండివీడ్యువల్ గేమ్ (వ్యక్తిగత క్రీడ) విభాగంలో ఆర్చరీ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా ఈ గ్లామర్ గేమ్‌పై నగర క్రీడా అభిలాషకులు ఫోకస్ పెట్టారు. నగరం నుంచి ఇప్పటికే పలు క్రీడల్లో చాలా మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో తమను తాము నిరూపించుకోవడానికి ఆర్చరీని ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర క్రీడల్లో కొనసాగుతున్న పోటీని తప్పించుకోవడానికి కూడా ఆర్చరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్స్‌లో నగర ఆర్చరీ క్రీడాకారులు రాణిస్తుండటం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఆర్చరీ శిక్షణ అందించే ‘సాయ్’ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, గచి్చబౌలి), హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ రెండూ నగరానికి అనుబంధమున్నవే. వీటితో పాటు నగరంలో దాదాపు ఎనిమిది ప్రైవేటు శిక్షణా కేంద్రాలున్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇక్కడ ఆర్చరీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. నేషనల్స్‌లో వెయ్యి మంది రాణింపు..జాతీయ స్థాయిలో టాప్ 2లో నా విద్యార్థులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆర్చరీ ప్రారంభించిన నేను ఏడేళ్ల పాటు 23 విభాగాల్లో నేషనల్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ ఛాంపియన్స్ ఆడాను. 7 నేషనల్స్‌లో పతకాలు సాధించాను. ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్‌గా నిలిచాను. అనంతరం మేటి ఆర్చర్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా 2008 నుంచి శిక్షణ ప్రారంభించాను. ఇప్పటి వరకూ నా శిక్షణలో వెయ్యి మందికి పైగా నేషనల్స్ ఆడారు. కొందరు యూత్ ఒలింపిక్స్ ఇండియా క్యాంపుకు వెళ్లారు.దాదాపు 3 వేల మందికి పైగా శిక్షణ అందించాను. ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్, ప్రగతి నగర్, నార్సింగిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అథ్లెట్లను తయారు చేస్తున్నాను. 2028 ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా అద్భుతమైన నైపుణ్యాలున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. ఆర్చరీ శిక్షణతో పాటు వీరికి అవసరమైన ఫిట్నెస్, ఫిజియోథెరపీ, సైకాలజీ కౌన్సిలింగ్, స్పెషల్ ట్యూనింగ్ అందిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్చరీకి మంచి భవిష్యత్ ఉంది. రీకర్వ్, కాంపౌండ్ విభాగాల్లో మన ఆర్చర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంచి భద్రతా ప్రమాణాలతో మరిన్ని ఆర్చరీ గ్రౌండ్స్ నిర్మిస్తే వందల మంది ఆర్చర్స్కు అవకాశం ఉంటుంది. ఎక్విప్మెంట్ అందించగలిగితే ఆర్చరీ మరింత రాణిస్తుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన కోచ్‌లు ఉన్నారు. నా అకాడమీ తరపున చాలా మంది పేద పిల్లలకు ఆర్చరీలో సహకారం అందిస్తున్నాను. వారిలో రాజ్‌భవన్ స్కూల్‌కు చెందిన వైభవ్ నేషనల్స్ మెడల్ సాధించాడు. మరో అమ్మాయి లలితా రాణి నేషనల్స్ ఆడి సత్తా చాటింది. – రాజు, ఆర్చరీ నేషనల్స్ ఛాంపియన్, ప్రముఖ కోచ్, ఫ్రెండ్స్ అండ్ ఆర్చెర్స్ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్.నగర వేదికగా..నగరం వేదికగా దాదాపు 150 మంది ఆర్చరీ అథ్లెట్స్ ఉన్నారని అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ టీం రెండో స్థానంలో ఉన్నట్లు క్రీడా నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నగరానికి చెందిన అమ్మాయిలు ఇద్దరూ సిల్వర్ మెడల్స్ సాధించగా, అబ్బాయిలు ఎనిమిదో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.ఆరు కేటగిరీల్లో..ఆర్చరీకి సంబంధించి నేషనల్స్‌లో అండర్ 10, 13, 15, 17, 19, అబౌ 19 విభాగాలు ఉంటాయి. ఒలింపిక్స్‌కు అయితే ఎలాంటి ప్రమాణాలూ ఉండవు. ఎవరైనా పోటీ పడొచ్చు. ఆరు కేటగిరీల్లో ఈ ఎంపిక కొనసాగుతోంది. మెదటి దశ ఓపెన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చు. ఇందులోంచి టాప్ 32, టాప్ 16, టాప్ 8, టాప్ 6 ఇలా ఎంపిక చేసి చివరగా ముగ్గురిని ఒలింపిక్స్‌కు పంపిస్తారు.2028 ఒలింపిక్స్ లక్ష్యంగా.. 12 ఏళ్ల వయస్సు నుంచి ఆర్చరీలో రాణిస్తున్నాను. ఇప్పటి వరకూ ఎనిమిది నేషనల్స్ ఆడాను. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఒక గోల్డ్, మరో సిల్వర్ మెడల్ సాధించాను. 2028 ఒలింపిక్స్‌లో ఆడి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం మోయినాబాద్ కాలేజ్‌లో పీజీ చదువుతున్నాను. – హర్షవర్ధన్నాలుగు నేషనల్స్ ఆడాను..కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాను. ఇప్పటి వరకూ గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో నాలుగు నేషనల్స్ ఆడాను. అసోసియేషన్ నేషనల్స్, ఫుల్ నేషనల్స్‌లో పోటీ పడ్డాను. భారతీయ ఆర్చర్‌గా ఒలింపిక్స్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని మరింత పెంచడమే లక్ష్యం. – లలితా రాణి -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
ముగిసిన భారత ఆర్చర్ల పోరాటం.. కార్టర్స్‌లో దీపికా ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆర్చరీ విభాగంలో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్ మిచ్చెల్లి క్రొప్పన్‌ను ఓడించి తన సత్తాచాటిన దీపికా కుమారి .. క్వార్టర్లో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయింది. దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియోన్ చేతిలో4-6 తేడాతో దీపికా కుమారి పరాజయం పాలైంది. 3వ సెట్ ముగిసే సమయానికి దీపిక 4-2తో ముందంజలో ఉన్నప్పటకి.. తర్వాత సెట్లలో పేలవమైన షూటింగ్‌ల కారణంగా ఆమె తమ సెమీ-ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది.అదేవిధంగా మరో ఆర్చర్ భజన్ కౌర్ రౌండ్-16లోనే ఇంటిముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన డియానందా చోయిరునిసా చేతిలో భజన్ కౌర్ ఓటమి చవిచూసింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ప్రయాణం ముగిసింది. మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి భారత ఆర్చర్లు ఇంటిముఖం పట్టారు. -
గురి చెదిరింది.. కాంస్యం చేజారింది
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఒలింపిక్స్ ఆర్చరీలో సెమీఫైనల్‌కు చేరిన భారత మిక్స్డ్ జట్టు.. పతకం పట్టే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ జోడీ.. ‘ప్యారిస్’ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓడిన ధీరజ్–అంకిత జంట... కాంస్య పతక పోరులో అమెరికా ద్వయం చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారివిశ్వక్రీడల్లో భారత ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరి పతక ఆశలు రేపిన మన మిక్స్డ్ ఆర్చరీ జట్టు చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.శుక్రవారం రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ ద్వయం 2–6తో (37–38, 35–37, 38–34, 35–37) బ్రాడీ ఎలీసన్–క్యాసీ కౌఫ్‌హోల్డ్ (అమెరికా) జంట చేతిలో ఓడింది. ధీరజ్ గురి అంచనాలకు తగ్గట్లు సాగినా... ఒత్తిడికి గురైన అంకిత పలుమార్లు గురి తప్పడం ఫలితంపై ప్రభావం చూపింది. నాలుగు సెట్లలో కలిపి అంకిత రెండుసార్లు 7 పాయింట్లు సాధించడంతో జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది. తొలి సెట్లో అంకిత 7 ,10 పాయింట్లు సాధించగా.. ధీరజ్ రెండు 10లు నమోదు చేశాడు. ప్రత్యర్థి ఆర్చర్లు 10, 9, 9, 10 పాయింట్లు సాధించి ముందంజ వేయగా.. రెండో సెట్‌ను కూడా అంకిత 7 పాయింట్లతో ప్రారంభించింది. చేజారిన కాంస్యంఈసారి కూడా ప్రత్యర్థిదే పైచేయి కాగా.. మూడో సెట్లో అంకిత 10, 9, ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టారు. ప్రత్యర్థి జంట 10, 7, 9, 8 పాయింట్లు చేసి వెనుకబడింది. ఇక నాలుగో సెట్లో అంకిత రెండు బాణాలకు ఎనిమిదేసి పాయింట్లే రాగా.. ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టాడు. అయితే వరుసగా 10, 9, 9, 9 పాయింట్లు సాధించిన అమెరికా జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది.దక్షిణ కొరియా, జర్మనీ జోడీలకు స్వర్ణ, రజత పతకాలు లభించాయి. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్–అంకిత జోడీ 2–6తో (38–36, 35–38, 37–38, 38–39) ప్రపంచ నంబర్‌వన్ కిమ్ వూజిన్–లిమ్ షిహ్యోన్ (కొరియా) జంట చేతిలో ఓడింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 5–3తో (38–37, 38–38, 36–37, 37–36) స్పెయిన్‌పై, తొలి రౌండ్లో 5–1తో (37–36, 38–38, 38–37) ఇండోనేసియాపై గెలిచింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్ ఈరోజు బరిలోకి దిగనున్నారు. బల్‌రాజ్‌కు 23వ స్థానం పారిస్ ఒలింపిక్స్‌లో భారత రోవర్ బల్రాజ్ పన్వర్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ రౌండ్ ‘డి’ ఫైనల్లో శుక్రవారం బల్రాజ్ 7 నిమిషాల 2.37 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. అంతకుముందు రెపిచాజ్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు చేరిన బల్రాజ్... అక్కడ ఐదో స్థానానికి పరిమితమవడంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. ఫైనల్ ‘ఎ’లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
Olympics: చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జోడీ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ మరో పతకానికి చేరువైంది. మిక్స్డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీసెమీ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్లో స్పానిష్ జంట కనాలెస్- గొంజాలెజ్‌పై విజయం సాధించింది. ఆద్యంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి స్పెయిన్ ద్వయాన్ని 5-3తో ఓడించి జయభేరి మోగించింది.తద్వారా ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత తొలి ఆర్చరీ జోడీగా చరిత్ర సృష్టించింది. మరో క్వార్టర్స్ పోరులో సౌత్ కొరియా జంట.. ఇటలీపై గెలుపొందింది. ఈ క్రమంలో భారత్- సౌత్ కొరియా జట్ల మధ్య సెమీ ఫైనల్ పోటీ మొదలుకానుంది.కాంస్య పతక పోరులో భారత్ ఓటమిమిక్స్డ్ ఆర్చరీ టీమ్ కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీ ఓటమి పాలైంది. యునైటెడ్ స్టేట్స్ బ్రాడీ-కేసీ జంట చేతిలో6-2 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది. సెమీస్‌లో ఓటమి.. కాంస్య పతకపోరుకు మనోళ్లుసెమీ ఫైనల్లో సౌత్ కొరియా జోడీ లిమ్- కిమ్ జోడీ చేతిలో ధీరజ్- అంకిత ఓడిపోయారు. 6-2తో పరాజయం పాలై స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అయితే, కాంస్య పతకం కోసం అమెరికాతో తలపడతారు. ఇక సౌత్ కొరియాతో పాటు జర్మనీ ఫైనల్‌కు చేరింది.ఇప్పటికి మూడు పతకాలుప్యారిస్లో ఇప్పటికే భారత్ మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్, స్వప్నిల్ కుసాలే.. టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ.. సరబ్‌జోత్‌తో కలిసి ఇదే విభాగంలో టీమ్ మెడల్(కాంస్యం), స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన.. మనూ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి మూడో పతకానికి గురిపెట్టింది. -
ప్రవీణ్ తొలి రౌండ్లోనే...
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా... బరిలో మిగిలిన ఏకైక భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ కూడా ఇంటిదారి పట్టాడు. వ్యక్తిగత రికర్వ్ తొలి రౌండ్లో ప్రవీణ్ 0–6 (28–29, 29–30, 27–28)తో వెన్‌చావో (చైనా) చేతిలో ఓడాడు. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్ శనివారం ప్రిక్వార్టర్స్ బరిలో దిగనున్నారు. -
ఆ ఆర్చర్ గురికి ఒకటే పాయింట్!
పారిస్: ఆర్చరీ పోటీల్లో గురి లక్ష బిందువుపైనే ఉంటుంది. ఇది కుదిరితే 10 కాస్త అటుఇటు తప్పితే 9, 8, 7 పాయింట్లు సహజం. కానీ ఆఫ్రికన్ దేశం చాద్ ఆర్చర్ ఇజ్రాయెల్ మదయె దాదాపు టార్గెట్ రింగ్స్ బోర్డుకే దూరమయ్యే బాణం సంధించాడు. త్రుటిలో బోర్డులో పడింది... కానీ వచి్చంది ఒకే పాయింట్! వినడానికి విడ్డూరంగా ఉన్న మదయె రెండో సెట్లో మూడు షాట్లలో ఒకటి ఒక్క పాయింటే తెచ్చి పెట్టింది. విలువిద్యలో కొరియన్ ఆర్చర్లకు తిరుగుండదు. పైగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన కిమ్ వూ జిన్ ముందు 36 ఏళ్ల మదయె ఓ పిల్లబచ్చ! ఈ మ్యాచ్‌లో 26–29, 15–29, 25–30 స్కోరుతో కిమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్లో 26 పాయింట్లు సాధించిన మదయె రెండో సెట్లో కేవలం 15 పాయింట్లే చేశాడు. అంటే మూడు బాణాల స్కోరుకు (10+10+10)కు సగమన్నమాట! ఇందులో మూడో షాట్ ఒక పాయింట్ తేవడంతో అతను సగం స్కోరుకు పరిమితమయ్యాడు. అయితే మూడో సెట్లో పుంజుకొని 25 పాయింట్లు సాధించాడు. ఇంత ఘోరంగా మదయె ఓడినప్పటికీ స్టేడియంలోని కొరియన్ అభిమానుల నుంచి ఓదార్పు లభించింది. చప్పట్లతో మదయెకు వీడ్కోలు పలికారు. -
ఆర్చరీలో మళ్లీ నిరాశ
ఒలింపిక్స్ ఆర్చరీ క్రీడాంశంలో భారత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ స్టార్ ఆర్చర్ దీపికా కుమారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో.. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అంకిత తడబడటం... భజన్ కౌర్ రాణించినా ఫలితం లేకపోవడంతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 0–6 (51–52, 49–54, 48–53)తో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. దీపిక, అంకిత ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీపిక, అంకిత సంధించిన బాణాలకు 4,6,7 పాయింట్లు కూడా రావడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. -
ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు
పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... గురువారం ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ కొత్త ప్రపంచ రికార్డుతోపాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహైన్ 694 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయెంగ్ (దక్షిణ కొరియా; 2019లో) సాధించిన ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొరియాకే చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును కూడా లిమ్ సిహైన్ తిరగరాసింది. -
ఈసారైనా గురి కుదిరేనా!
అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం నిలకడగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించడం... ఒలింపిక్స్‌కు వచ్చేసరికి తడబడటం... భారత ఆర్చరీ గురించి ఇలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీకి తొలిసారి చోటు దక్కింది. భారత్ మాత్రం 1988 సియోల్ ఒలింపిక్స్‌తో అరంగేట్రం చేసింది. పురుషుల వ్యక్తిగత, టీమ్ విభాగంలో లింబారామ్, సంజీవ సింగ్, శ్యామ్‌లాల్ మీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లోనూ భారత ఆర్చర్లు పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే నిష్క్రమించారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఎవరూ అర్హత పొందలేదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంతోపాటు తొలిసారిగా మహిళల విభాగంలోనూ భారత్ పోటీపడింది. పురుషుల విభాగంలో సత్యదేవ్ ప్రసాద్, తరుణ్‌దీప్ రాయ్, మాఝీ సవాయన్... మహిళల విభాగంలో డోలా బెనర్జీ, రీనా కుమారి, సుమంగళ శర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. సత్యదేవ్ ప్రసాద్, రీనా కుమారి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... తరుణ్‌దీప్, మాఝీ సవాయన్, డోలా బెనర్జీ తొలి రౌండ్లో, సుమంగళ శర్మ రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత ఆర్చర్లు బరిలోకి దిగినా రిక్తహస్తాలతో వెనుదిరిగారు. గత మూడేళ్ల కాలంలో భారత ఆర్చర్లు నిలకడగా రాణించారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఐదు విభాగాల్లోనూ అర్హత సాధించారు. పురుషుల టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్... మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో... భజన్ కౌర్ మహిళల టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో పోటీపడతారు. 40 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్, 30 ఏళ్ల దీపిక కుమారి నాలుగో సారి ఒలింపిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా దీపికా కుమారిపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్íÙప్... ఇలా అన్ని మెగా టోర్నీల్లో పతకాలు గెల్చుకున్న దీపిక ఖాతాలో కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది. ఈ ఏడాది దీపిక మంచి ఫామ్‌లో ఉంది. షాంఘై ప్రపంచకప్ టోర్నీ లో రజత పతకం సాధించగా... ఆసియా కప్‌లో స్వర్ణ పతకం గెలిచింది. ఓవరాల్ గా దీపిక ప్రపంచకప్ టోర్నీ ల్లో 37 పతకాలు... ప్రపంచ చాంపియన్íÙప్లో ఐదుపతకాలు సాధించి భారత అత్యుత్తమ ఆర్చర్‌గా పేరు తెచ్చుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో దీపిక తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన అవసరం ఉంది.కీలకదశలో ఒత్తిడికి తడబడి గురి తప్పడం దీపిక బలహీనతగా ఉంది. అయితే మూడు ఒలింపిక్స్‌లలో పోటీపడ్డ దీపిక ఈ బలహీనతను పారిస్‌లో అధిగమిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పారిస్ గేమ్స్ నుంచి దీపిక పతకంతో తిరిగొస్తే భారత్‌లో ఆర్చరీకి మరింత ఆదరణ పెరుగుతుంది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల ధీరజ్ కూడా కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ పారిస్ గేమ్స్‌లో తన నుంచీ పతకం ఆశించవచ్చని ఆశలు రేకెత్తిస్తున్నాడు. గత రెండేళ్లలో ధీరజ్ ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గాడు. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్íÙప్లో, ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఐదు పతకాలు సాధించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ధీరజ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పతకంతో తిరిగొస్తే భారత ఆర్చరీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ ఈవెంట్ జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఆర్చరీలో కాంపౌండ్, రికర్వ్ అని రెండు కేటగిరీలున్నా... ఒలింపిక్స్‌లో మాత్రం కేవలం రికర్వ్ విభాగంలోనే పోటీలు నిర్వహిస్తారు. –సాక్షి క్రీడా విభాగం -
విశ్వ క్రీడలకు భారత్ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల జాబితాలో షాట్ పుట్టర్ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్ ర్యాంకింగ్ కోటాలో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్ అథ్లెటిక్స్ , ఒలింపిక్ పార్టిసిపెంట్స్ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు, సెయిలింగ్, స్విమ్మింగ్ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్ , వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్ -
Paris Olympics : ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది
చండీగఢ్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చండీగఢ్ యూనివర్సిటీకి అలాంటి అరుదైన అవకాశం దక్కింది.ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ గౌరవం పట్ల చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్, ఎంపీ సత్నామ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. క్వార్టర్ ఫైనల్లో అనాహత్, శౌర్య ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బాలికల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్... బాలుర సింగిల్స్‌లో శౌర్య బావా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అనాహత్ 11–6, 13–11, 11–2తో అకారి మిదోరికావా (జపాన్)పై, శౌర్య 11–9, 5–11, 11–5, 13–11తో సెగుండో పొర్టాబాలెస్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. -
తనది.. ఎదురు లేని బాణం!
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలు.. వరల్డ్ కప్‌లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో కాంస్యం, 18 ఏళ్ల వయసులోనే తొలి సారి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్.. ఇదీ ఆమె బయోడేటా. ఇక మిగిలింది ఒలింపిక్స్ పతకమే. గతంలో మూడు ప్రయత్నాలు ఆమెకు తగిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఇప్పుడు మరింత శ్రమతో, పట్టుదలతో నాలుగోసారి ఒలింపిక్స్ సమరానికి ఆమె సిద్ధమైంది. దేశంలోనే వెనుకబడిన ఒక ప్రాంతం నుంచి వచ్చే దేశం గర్వించేలా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన ఆమె పేరే దీపికా కుమారి. భారత ఆర్చరీకి సంబంధించి ఆల్‌టైమ్ గ్రేట్. ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు, ఘనతలతో విలువిద్యలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని దీపికా ప్రస్థానం అసాధారణం, ఎందరికో స్ఫూర్తిదాయకం.దీపికాకు ఆర్చరీ అనే ఒక క్రీడ ఉంటుందనే విషయం కూడా చిన్నప్పుడు తెలీదు. సహజంగానే ఆమె నేపథ్యమే అందుకు కారణం. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్ నుంచి ఆమె వచ్చింది. రాంచీకి సమీపంలోని రాతూ చట్టీ అనే గ్రామం స్వస్థలం. తండ్రి ఆటోడ్రైవర్ కాగా, తల్లి నర్సుగా పని చేస్తోంది. కుమ్మరి కుటుంబ నేపథ్యం కారణంగా అప్పుడప్పుడు ఆ పనుల ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేది.చాలామంది పిల్లల్లాగే రాళ్లతో చెట్ల పైనున్న పళ్లను కొట్టడం లాంటి అల్లరి పనులు తనూ చేసేది. దీనివల్ల ఒక్కసారిగా విల్లు ఆమె చేతికి వచ్చేయలేదు. ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువు ఒకరికి ఆర్చరీపై మంచి అవగాహన ఉంది. రాళ్లు విసరడంలో కూడా దీపికా కచ్చితత్వం ఆయనను ఆకర్షించింది.దాంతో ఈమెను సానబెట్టవచ్చనే ఆలోచన వచ్చింది. అయితే సహజంగానే తండ్రి నవ్వి ఊరుకున్నాడు. నేనేంటీ, నా కూతురికి ఆటలేంటీ అంటూ వదిలేశాడు. అయితే అప్పటికే ఆర్చరీలో శిక్షణ పొందుతున్న దీపికా కజిన్ ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ ముండా భార్య మీరా ముండా ఒక ఆర్చరీ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. దీపికాను అక్కడకు తీసుకెళ్లి చేర్పించారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. అక్కడే అసలైన ఆర్చరీ ఆటపై ఆమెకు అవగాహన ఏర్పడింది.2024,వరల్డ్ కప్ సిల్వర్ మెడల్‌తో, 2018, వరల్డ్ కప్ గోల్డ్ మెడల్‌తో..టాటా అండదండలతో మలుపు..ఆర్చరీలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత దీపికా తర్వాతి మజిలీ మరో పెద్ద కేంద్రానికి మారింది. జంషెడ్‌పూర్‌లో ఉన్న టాటా ఆర్చరీ అకాడమీ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రం. టాటా అండదండలు, ఆర్థిక సహకారంతో ఎంతోమంది గొప్ప ఆర్చర్లుగా ఎదిగారు. ప్రతిభ ఉంటే చాలు అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభించడమే కాదు, ఆటగాళ్లకు స్టైపెండ్ కూడా లభిస్తుంది. దీపికాకు ఇంతకంటే కావాల్సిందేముంది అనిపించింది.తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు అదే సొంతిల్లు అయింది. అక్కడ మొదలైన గెలుపు ప్రస్థానం మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా సాగిపోయింది. టాటా అకాడమీ సభ్యురాలిగానే మరింత పదునెక్కిన దీపికా ఆట గొప్ప విజయాలను అందించింది. అంతర్జాతీయ జూనియర్, యూత్ స్థాయిల్లో పతకాలు సాధించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది.అన్నీ ఘనతలే..2010.. న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు. సొంతగడ్డపై ప్రతి క్రీడాంశంలోనూ భారత ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదే జాబితాలో ఆర్చరీ ఫలితాలు కూడా చర్చకు తెర తీశాయి. 16 ఏళ్ల దీపికా రికర్వ్ విభాగంలో రెండు స్వర్ణాలతో మెరిసి తన రాకను ఘనంగా చాటింది. అటు వ్యక్తిగత, ఇటు టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు ఆమె ఖాతాలో చేరాయి. రెండేళ్ల తర్వాత తొలి వరల్డ్ కప్ మెడల్‌తో ఆమె మెరిసింది.వరుస విజయాలు దీపికాను అందరికంటే అగ్రభాగాన నిలబెట్టాయి. ఫలితంగా ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన అధికారిక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె మొదటిసారి నంబర్ వన్‌గా నిలిచింది. కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం నుంచి వచ్చి కొరియా, చైనాలాంటి ఆర్చర్లతో పోటీ పడి శిఖరాన నిలిచిన క్షణం అందరూ గర్వపడేలా చేసింది. ఈ ఘనత సాధించిన రోజున తండ్రి శివ్‌చరణ్ చూపించిన ఆనందం, ఆయన సంబరం మాటల్లో చెప్పలేనిది.భర్త అతాను దాస్‌తో, తల్లిదండ్రులతో..అవార్డులు, రివార్డులు..దీపికా ఘనతలకు సహజంగానే అన్ని వైపుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహకాలు లభించాయి. అంతర్జాతీయ వేదికల్లో విజయాలు సాధించిన ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆమెను అంతా చూడలేదు. పేద కుటుంబం, వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆమెను స్ఫూర్తిగా తీసుకునేలా ఉన్న కెరీర్ చాలామందికి దిశను చూపించింది.ముఖ్యంగా అమ్మాయిల కోణంలో చూస్తే ఆమె ఎదిగిన తీరు అసాధారణం. ప్రతిభ, పోరాటతత్వం, కష్టపడే లక్షణం ఉంటే విజయాలు కచ్చితంగా వస్తాయని దీపికా నిరూపించింది. వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదిగిన ఏడాదే 2012లో కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారం అర్జునతో ఆమెను గౌరవించింది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు కూడా ఆమె చెంతకు చేరింది. 20 ఏళ్ల వయసులోనే పలు ఘనతలు సాధించిన దీపికాకు ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘30 అండర్ 30’లో చోటు కల్పించి ఆమె ప్రత్యేకతను ప్రపంచానికి చూపించింది.అన్నింటినీ మించి ఆమె కెరీర్లో హైలైట్‌గా నిలిచిన అంశం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ. దీపికా విజయగాథను పెద్ద స్థాయికి తీసుకెళ్లి చూపించాలనే సంకల్పంతో ఉరాజ్ బహల్, షా బహల్ అనే రూపకర్తలు దీపికా కెరీర్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేశారు. ‘లేడీస్ ఫస్ట్’ పేరుతో వచ్చిన ఈ అద్భుత డాక్యుమెంటరీలో ఆమె జీవితం, పోరాటం, విజయాల గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు నగరాల్లో దీనిని ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ప్రదర్శించడం విశేషం.ఒకే ఒక లక్ష్యంతో..ఐదేళ్ల క్రితం పారిస్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో మూడు విభాగాల్లో (వ్యక్తిగత, మిక్స్డ్, టీమ్) విభాగాల్లో దీపికా మూడు స్వర్ణాలు గెలుచుకుంది. ఇలా వరల్డ్ కప్‌లో ట్రిపుల్ గోల్డ్ సాధించడం ఆర్చర్ సత్తాకు ఉదాహరణ. కానీ తన సుదీర్ఘ కెరీర్లో 13వ సారి ఇలాంటి ఫీట్‌ను నమోదు చేసి అరుదైన ఆర్చర్ల జాబితాలో దీపికా పేరు లిఖించుకుంది. ఇలా ఎన్నో రికార్డులు ఆమె ఖాతాలో చేరినా, ఒలింపిక్స్ పతకం మాత్రం ఇంకా లోటుగానే ఉంది.వరుసగా 2012, 2016, 2021 ఒలింపిక్స్‌లలో ఆమె పాల్గొంది. మెగా ఈవెంట్‌కు ముందు ఫామ్‌లో ఉండి, ఒక దశలో నంబర్‌వన్‌గా కూడా ఉండి అంచనాలు రేపినా, దురదృష్టవశాత్తూ వేర్వేరు కారణాలతో ఆమెకు పతకం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి నాలుగో ప్రయత్నంలో కల నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందులో ఆమెకు భర్త అతాను దాస్ అండగా నిలుస్తున్నాడు. సహచర ఆర్చర్, వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అతాను దాస్‌ను నాలుగేళ్ల క్రితం దీపికా పెళ్లి చేసుకుంది.వీరికి వేదిక పేరుతో ఒక పాప ఉంది. సహజంగానే అమ్మగా మారిన తర్వాత ఆటకు కొంత విరామం ఇచ్చింది. ఇక ఆమె కెరీర్ ముగిసినట్లు అనిపించింది. అయితే రెట్టింపు సాధనతో కొన్నాళ్ల క్రితమే మళ్లీ బరిలోకి దిగి దీపికా సత్తా చాటింది. ముందుగా జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయాలతో పాటు ఇప్పుడు ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. పారిస్‌పై ఆమె ఎక్కు పెట్టే బాణం సరైన లక్ష్యాన్ని చేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత
న్యూఢిల్లీ: మూడు క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా వీలుకాకపోయినా వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్న 10 జట్లను మినహాయించి... వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో భారత్, చైనా... మహిళల విభాగంలో భారత్, ఇండోనేసియా జట్లకు ఈ అవకాశం లభించింది. ఫలితంగా వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో, వ్యక్తిగత విభాగాల్లో, మిక్స్డ్ టీమ్ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్) పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 44 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్... మాజీ నంబర్‌వన్ దీపికా కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత పురుషుల ఆర్చరీ జట్టు: తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాధవ్. భారత మహిళల ఆర్చరీ జట్టు: దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత. -
ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్
అంటాల్యా (టర్కీ): మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఈవెంట్లో భారత ఆర్చర్ భజన్ కౌర్ స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఫైనల్లో భజన్ కౌర్ 6–2 (28–26, 29–29, 29–26, 29–29)తో మొబీనా ఫలా (ఇరాన్)పై విజయం సాధించింది. భారత స్టార్ ఆర్చర్ ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి నిరాశ పరిచింది. నేరుగా మూడో రౌండ్ మ్యాచ్ ఆడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక 4–6 (28–26, 27–25, 23–26, 24–25, 27–29) తో యెలాగుల్ రమజనోవా (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన అంకిత 4–6 (27–27, 27–28, 29–27, 27–27, 28–29)తో మొబీనా ఫలా (ఇరాన్) చేతిలో పరా జయం పాలైంది. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మిక్స్డ్ విభాగంలోనూ పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. -
పురుషుల జట్టుకూ నిరాశ
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది. కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు. -
జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి
యెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్ అదితి రెండో రౌండ్ లో, అవనీత్ కౌర్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో... పర్ణీత్ 138–145తో హాన్ సెంగ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. అదితి 142–145తో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా) చేతిలో, అవనీత్ 143–145తో ఒ యుహూన్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్ మూడో రౌండ్లో, అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. సెమీస్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ పారిస్: ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
Archery: ‘టాప్స్’లోకి దీపిక కుమారి
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్‌లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ -
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్
భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్ 1 పోటీల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ సౌత్ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్‌కప్‌లో 14 ఏళ్ల తర్వాత భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై (చైనా): ఆర్చరీ సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో భారత క్రీడాకారుల గురి అదిరింది. మహిళల, పురుషుల టీమ్ విభాగాల్లో భారత జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి రెండు స్వర్ణ పతకాల రేసులో నిలిచాయి. బుధవారం జరిగిన టీమ్ విభాగాల నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత జట్లు నిలకడగా రాణించాయి.ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 235–230 పాయింట్ల తేడాతో టర్కీ జట్టును ఓడించింది. అనంతరం సెమీఫైనల్లో సురేఖ బృందం 235–230 పాయింట్ల తేడాతోనే ఎస్టోనియా జట్టుపై గెలిచింది.శనివారం జరిగే ఫైనల్లో ఇటలీతో భారత మహిళల జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన సురేఖ జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది.మరోవైపు అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు తొలి రౌండ్లో 233–227తో ఫిలిప్పీన్స్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 237–234తో డెన్మార్క్ జట్టుపై, సెమీఫైనల్లో 235–233తో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుపై విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోటీపడుతుంది. -
జ్యోతి సురేఖకు రెండో స్థానం
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్లో భాగంగా ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో, పర్ణీత్ కౌర్ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
శీతల్ దేవి అద్భుతం: సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ!
న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది. ‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు. -
స్పోర్ట్స్: ఆ ఆర్చర్ పేరు 'బొమ్మదేవర ధీరజ్'!
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నవంబర్ 2023.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి. ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్‌దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్‌కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు. అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్లైన్లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు. బలంగా పైకి లేచి.. క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది. ‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్‌టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్‌కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు. అలా మొదలై.. ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు. నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్‌లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్‌లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మలుపు.. వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్‌కు కెరీర్లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్‌లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్‌లో ధీరజ్‌ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్‌కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు. ఆర్మీ అండదండలతో.. 2017లో ఆసియా అవుట్డోర్ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్లో రజతంతో ధీరజ్‌కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్హగ్యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు. ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్‌లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. కోల్‌కతాలో జరిగిన ఈవెంట్లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్‌కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
అనిరుద్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక లాస్ వేగస్ షూట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్లో భారత సంతతి కుర్రాడు పింజల అనిరుధ్ కల్యాణ్ రజత పతకంతో మెరిశాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన అనిరుధ్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. లాస్ వేగస్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన అనిరుధ్ రికర్వ్ కబ్ కేటగిరీ లో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ మొత్తం 547 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. ఇదే టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ 898 పాయింట్లతో పదో ర్యాంక్‌లో నిలిచింది. -
ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ బెర్తు తెచ్చిన ధీరజ్
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ కోటా బెర్తును తెచ్చి పెట్టాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో ధీరజ్ రజతం సాధించాడు. ఫైనల్లో స్వర్ణ పతకంపై గురిపెట్టిన 22 ఏళ్ల తెలుగు కుర్రాడు 5–6తో జి సియాంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి... రజతంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో ధీరజ్ 6–0తో సాదిగ్ అష్రాఫి బవిలి (ఇరాన్)పై, సెమీ ఫైనల్లో 6–0తో మొహమ్మద్ హొస్సేన్ గొల్షాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు. -
రెండు స్వర్ణాలపై జ్యోతి సురేఖ గురి
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాల కోసం విజయం దూరంలో నిలిచింది. విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జ్యోతి సురేఖ 148–145తో హువాంగ్ జౌ (చైనీస్ తైపీ)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కే చెందిన పర్ణీత్ కౌర్‌తో సురేఖ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో పర్ణీత్ కౌర్ 147–145తో విక్టోరియా లియాన్ (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి ప్రిక్వార్టర్ ఫైనల్లో 145–146తో బొన్నా అక్తర్ (బంగ్లాదేశ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–217తో థాయ్‌లాండ్ జట్టును ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో సురేఖ బృందం ఆడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. -
చికిత ‘పసిడి’ గురి...
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామానికి చెందిన చికిత ఫైనల్లో 143–142తో ప్రియా గుర్జర్ (రాజస్తాన్)పై గెలిచింది. మరోవైపు మహిళల టెన్నిస్ ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో పతకాన్ని దక్కించుకుంది. మహిళల టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గిన రష్మిక... డబుల్స్ విభాగంలో శ్రావ్య శివానితో రజతం సాధించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ విభాగంలో రష్మిక రజత పతకం సొంతం చేసుకుంది. వైదేహి (గుజరాత్)తో జరిగిన టైటిల్ పోరులో రష్మిక 5–7, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ 3 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 22వ స్థానంలో ఉంది. -
జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్ ప్రతినిధులు
సాక్షి, విజయవాడ: హాంగ్ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. -
మన బాణం బంగారం
ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ సింగ్ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం. మహిళల రెజ్లింగ్‌లో రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్ చెన్, హువాంగ్ ఐజు, లు యున్ వాంగ్‌లతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్‌గా అవతరించింది. సెమీఫైనల్లో భారత్ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 231–220తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్ కూడా ఉంది. ఆ ఈవెంట్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్ జూ, జేవన్ యాంగ్, కింగ్ జాంగ్హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్ 235–224తో చైనీస్ తైపీపై, క్వార్టర్ ఫైనల్లో 235–221తో భూటాన్‌పై, తొలి రౌండ్లో 235–219తో సింగపూర్‌పై గెలుపొందింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది. సురేఖ బృందానికి సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. -
Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. మన అమ్మాయికి మరో స్వర్ణం తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్‌లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే. 19 స్వర్ణాలు బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే జోడీ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. కాగా ఆసియా క్రీడల్లో ఇది భారత్‌కు 16 స్వర్ణం. ఓవరాల్‌గా ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 71 పతకాలు కైవసం చేసుకుంది. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ ‘టాప్’
Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది. ధీరజ్‌కు ఆరో ర్యాంకు పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్‌లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్‌లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్‌లో నిలిచారు. -
పౌరాణిక సినిమాలు చూసి ఆకర్షితుడై.. గోల్డ్ మెడల్! ఒలింపిక్స్ లక్ష్యంగా..
చాట్ల అక్షయ్.. విలువిద్యలో సత్తా చాటుతున్నాడు. గురితప్పని సాధనతో విజయాలను తన విలువిద్యతో సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. సాధారణంగా పౌరాణిక సినిమాలు చూసే అలవాటున్న అక్షయ్ ఆ సినిమాల్లోని బాణాల వైపు ఆకర్షితుడయ్యాడు. అది గమనించిన తండ్రి ఆర్చరీలో శిక్షణను ఇప్పించడంతో అతనిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసింది. నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన చాట్ల రాజేష్, సుమలకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ విలువిద్యల్లో రాణిస్తున్నారు. పెద్దబ్బాయి చాట్ల అక్షయ్ మహదేవ్ 2019లో విలువిద్య సాధన ప్రారంభించారు. 3వ తరగతిలో ప్రారంభమైన విలువిద్య 8వ తరగతికి వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రారంభించిన ఏడాది నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. విలువిద్యలో మూడు సెగ్మెంట్లు ఉంటాయి. ఇండియన్ రౌండ్ సెగ్మెంట్ జాతీయ స్థాయిలో, రికార్వ్ సెగ్మెంట్ ఒలింపిక్స్‌లో, కాంపౌండ్ సెగ్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంటారు. ఆకాష్ మహదేవ్ క్లిష్టతరమైన రికార్వ్ సెగ్మెంట్లో రాణించడం విశేషం.- నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) కాస్ట్లీ క్రీడ... అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నెల్లూరులో ఆర్చరీకి తగిన ఆదరణ లేని సమయంలో అక్షయ్ మాధవ్ తాత చాట్ల నర్సింహారావు స్కూల్ డైరెక్టర్‌గా తన స్కూలు కోసం ఒక ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక విల్లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటుంది. బాణాలు రూ.12 వేలు, రూ.40 వేలు వరకు విలువ చేస్తాయి. ఇక టార్గెట్ పేస్లు, టార్గెట్ బట్టర్స్ ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడినవే. ఇప్పటి వరకు విజయవాడ, హైదరాబాదులకు పరిమితమైన ఈ ఆర్చరీ శిక్షణ నెల్లూరులో ప్రారంభం కావడంతో అక్షయ్‌కు కలిసి వచ్చింది. ఖర్చు అధికమైనప్పటికీ ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.40 నుంచి 6.30 గంటల వరకు సాధన చేస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతూ పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించేవాడు. ఖర్చు అధికమైనప్పటికీ స్కూల్లో పిల్లలు సైతం విలు విద్యలో రాణిస్తారని, ఏకాగ్రత సాధించగలుగుతారని స్కూల్ డైరెక్టర్ చాట్ల నర్సింహారావు తెలిపారు. అక్షయ్ మహదేవ్లో విలువిద్య క్రీడా ఆసక్తిని గమనించిన తండ్రి రాజేష్ శిక్షణ ఇప్పించేందుకు జార్ఖండ్ నుంచి దివ్య ప్రకాష్‌ను ఎంపిక చేసుకున్నారు. కోచ్ దివ్య ప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం సాధనలు చేస్తున్నాడు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పావురాల వేణు, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి సత్యనారాయణలు మంచి సహాయ సహకారాలను అందచేస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు బాటలు వేస్తున్నారు. పతకాలిలా... 2022వ సంవత్సరం నుంచి జరిగిన ప్రతి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అక్షయ్ ప్రతిభ కనపరిచారు. 2023 జూలైలో శ్రీలంకలో జరిగిన కొలంబో ఓపెన్ ఆర్చరీ ఇంటర్నేషనల్ పోటీల్లో అండర్–12 రికార్వ్ విభాగంలో గోల్డ్ మెడల్‌ను, 30 మీటర్ల ఓపెన్ రికార్వ్ పోటీల్లో సిల్వర్ మెడల్‌ను సాధించి అబ్బుర పరిచారు. గోల్డ్ మెడల్ లక్ష్యం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి పేరు తెస్తాను. చదువుల్లో రాణించి ఐఏఎస్ అధికారి కావాలన్నది కోరిక. ఉదయం సాయంత్రం సాధన చేస్తూ చదువుల్లో కూడా రాణిస్తాను. పోటీల్లో పాల్గొనడం వల్ల వివిధ క్రీడాకారుల ఆట తీరు, పలు ప్రాంతాల పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చు. చదువుకుంటూనే ఇష్టమైన క్రీడల్లో రాణించవచ్చు. తాతయ్య, అమ్మ నాన్నలు, కోచ్‌లు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. – చాట్ల అక్షయ్ మహదేవ్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం
World Archery Championships-Berlin: భారత మహిళా ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా (17) ప్రపంచ రికార్డు నెలక్పొంది. బెర్లిన్‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఆర్చరీలో భారత్ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. Aditi Swami gets the FIRST individual WORLD TITLE for India. The 17-year-old prodigy is now the world champion. 🏆#WorldArchery pic.twitter.com/oBbtgxyzq3 — World Archery (@worldarchery) August 5, 2023 ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను 149-47 ఓడించడం ద్వారా జగజ్జేతగా నిలిచి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఇదే పోటీల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్‌లతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన అదితి.. గంటల వ్యవధిలో భారత్‌కు మరో స్వర్ణం అందించింది. Kudos to #KheloIndia Athlete Aditi Gopichand Swami on being crowned World Champion in the Women's Individual Compound Final at the #ArcheryWorldChampionships🇩🇪🏹 and bagging the🥇 for 🇮🇳 with a near perfect score of 149 points💪👏 With this victory she has become the first… pic.twitter.com/m6kd0Y9ifK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2023 ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న అదితి.. గత నెలలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలను సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ షూట్-ఆఫ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన సన్నె డి లాట్‌ను ఓడించిన అదితి.. సెమీఫైనల్లో సహచరి, ఆంధ్ర అమ్మాయి జ్యోతి సురేఖపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌లో రెండో ర్యాంక్‌లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్‌కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
అమన్–ప్రగతి జోడీకి పసిడి పతకం
World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన ఆర్చరీ ఈవెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అమన్ సైని–ప్రగతి (భారత్) జోడీ పసిడి పతకం సాధించింది. ఫైనల్లో అమన్ సైని–ప్రగతి ద్వయం 157–156తో సువా చో–సెయుంగ్హున్ పార్క్ (కొరియా) జోడీపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్యం, మహిళల టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకం లభించాయి. ఎదురులేని సౌత్‌జోన్ పుదుచ్చేరి: దేవధర్ ట్రోఫీ దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ లో సౌత్‌జోన్ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈస్ట్‌జోన్ జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా ఈస్ట్‌జోన్ 46 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. విరాట్ సింగ్ (49; 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్రాన్షు సేనాపతి (44; 5 ఫోర్లు), ఆకాశ్‌దీప్ (44; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ముక్తార్ హుస్సేన్ (33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. సౌత్‌జోన్ బౌలర్లు సాయికిశోర్ (3/45), వాసుకి కౌశిక్ (3/37), విద్వత్ కావేరప్ప (2/40) ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అనంతరం సౌత్‌జోన్ 44.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, 1 సిక్స్), సాయి సుదర్శన్ (67 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించి సౌత్‌జోన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర మ్యాచ్‌ల్లో సెంట్రల్‌జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో నార్త్ఈస్ట్ జోన్ జట్టుపై, వెస్ట్‌జోన్ ఆరు వికెట్ల తేడాతో నార్త్‌జోన్‌పై విజయం సాధించాయి. -
బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్ను గురి చూసి కొడుతున్నాడు. దూరంలో ఉన్న లక్ష్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rudra Pratap singh (@littleyogaguru) ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన్నోడు టాలెంట్ చూసేయండి. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..!
వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్‌గా మారి తర్వాతి రోజుల్లో భారత్‌లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్. 1987.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్‌టేబుల్‌తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన. సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్‌కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్‌కి శ్రీకారం చుట్టారు. ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది. అడవి బిడ్డ నుంచి ఆర్చర్‌గా.. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు. అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్‌కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి. సరైన చోట, సరైన శిక్షణతో.. స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్‌కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్‌గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్‌లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్‌ని ప్రోత్సహించారు. దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో లింబా రామ్‌పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్‌గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్‌లో లింబా రామ్‌కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ప్రపంచ రికార్డు కూడా.. 1989లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్‌కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్‌లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్లో భారత్‌కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్లో అత్యుత్తమ దశ. బీజింగ్‌లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు. అచ్చిరాని మెగా ఈవెంట్.. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్‌కి వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం. ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్‌లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్‌బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్‌లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
గురి తప్పని బాణాలు
పిఠాపురం: మనసును.. దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించి వంద శాతం ఏకాగ్రతతో ఆడాల్సిన ఆట విలువిద్య. సనాతన భారత ఇతిహాసాలలో కనిపించే విలు విద్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆర్చరీ క్రీడను నేర్చుకునేందుకు చిన్నారులు క్యూ కడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, ఆలమూరు, రాజోలు, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వేసవి విలు విద్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్రీడాకారులు 200లకు పైగా ఉండగా.. రిజిస్టర్ కాని క్రీడాకారులు వెయ్యి మందికి పైగా ఉన్నారు. వీరిలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలు విద్యా క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఆర్చరీకి డిమాండ్ పెరిగింది. వేసవి శిబిరాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారంటే.. దేశానికి పేరు తెస్తా చిన్నప్పటి నుంచి విలువిద్య అంటే ప్రాణం. 2016లో జిల్లాస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం, 2022లో సీనియర్స్ విభాగంలో స్వర్ణ పతకం, సీనియర్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఇంటర్ చదివిన నేను ప్రస్తుతం తాపీ పని చేసుకుంటూ ఆర్చరీలో మరింతగా శిక్షణ పొందుతున్నాను. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మరిన్ని పతకాలు సాధించి దేశానికి.. రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్న సంకల్పంతో ఉన్నాను. – పి.కృష్ణ, పిఠాపురం జాతీయ స్థాయిలో రాణిస్తా పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచి పుల్లలతో బాణాలు తయారు చేసుకోవడం సరదా. దానిని చూసిన మా స్కూల్ పీడీ మంగయ్యమ్మ నన్ను విలువిద్య నేర్చుకోమని చెప్పారు. అందుకే.. శిక్షణ పొందుతున్నాను. 2016లో కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాను. 2023 కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. – పి.మహాలక్ష్మి, పిఠాపురం శిక్షణ బాగుంది నేను 3వ తరగతి చదువుతున్నాను. బాణాలంటే చాలా ఇష్టం. అది చూసి అమ్మానాన్న విలువిద్య నేర్పించారు. కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లాస్థాయి ఆర్చరీ పోటీల్లో రజత పతకం సాధించా. జాతీయ స్థాయిలో రాణించాలన్న సంకల్పంతో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ బాగుంది. – ఎస్.కృష్ణ అభిరామ్, పిఠాపురం ఆసక్తి పెరిగింది విలువిద్యపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఏటా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించడమే ధ్యేయంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో విలువిద్య క్రీడాకారులకూ ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటంతో ప్రోత్సాహం పెరిగింది. – పి.లక్ష్మణరావు, ఆర్చరీ కోచ్, పిఠాపురం -
ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం అర్హత
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ ప్రపంచకప్ ఫైనల్స్‌కు భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో జరుగుతుంది. తుర్కియేలో గతవారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనతో సురేఖకు మరో మూడు ప్రపంచకప్‌లు మిగిలి ఉండగానే ఫైనల్స్‌కు బెర్త్ దక్కింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ కొలంబియాలో జూన్ 13 నుంచి 18 వరకు జరుగుతుంది. -
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి.. ఏకంగా 7 స్థానాలు ఎగబాకి..!
ప్రపంచకప్‌లో రెండు స్వర్ణాలు సాధించి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సురేఖ 4వ స్థానానికి (కాంపౌండ్) చేరుకుంది. ఇప్పటి వరకు 11వ ర్యాంక్‌లో ఉన్న ఆమె తాజా ప్రదర్శనతో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకటం విశేషం. -
ధీరజ్ 'గురి' అదిరె.. ఆర్చరీ వరల్డ్‌కప్‌లో ఇరగదీసిన ఆంధ్ర కుర్రాడు
అంటాల్యా (తుర్కియే): అంచనాలకు మించి రాణించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర (విజయవాడ) ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో రెండు పతకాలతో మెరిశాడు. తొలిసారి ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 21 ఏళ్ల ధీరజ్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి రజత పతకం ... వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల టీమ్ ఫైనల్లో ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్ బృందం 4–5తో లీ జాంగ్యువాన్, కి జింగ్షువో, వె షావోజువాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3తో ఇల్ఫాత్ అబ్దులిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ధీరజ్ 4–6తో డాన్ ఒలారు (మాల్డోవా) చేతిలో ఓడిపోయాడు. -
ఆర్చరీలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కోల్‌కతాలో రెండు రోజులపాటు జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ట్రయల్స్‌లో విజయవాడకు చెందిన 26 ఏళ్ల జ్యోతి సురేఖ డబుల్ 50 మీటర్ల రౌండ్లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లు సాధించింది. తొలి రోజు 72 బాణాలు, రెండో రోజు మరో 72 బాణాలు ఉపయోగించారు. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో బ్రిటన్ ఆర్చర్ ఎల్లా గిబ్సన్ 1417 పాయింట్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. 24 మంది ఆర్చర్లు పాల్గొన్న సెలెక్షన్ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ట్రయల్స్ ద్వారా ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీలలో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేస్తారు. -
విజయవాడ : బాలబాలికల జాతీయ ఆర్చరీ పోటీలు (ఫొటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చాక 20 రోజులకే విల్లు పట్టనున్న దీపిక
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి గత నెల పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. కేవలం 20 రోజుల బాలింత అయిన ఆమె విల్లుపట్టేందుకు సిద్ధమైంది. కోల్‌కతాలో రేపటి నుంచి జరిగే జాతీయ సీనియర్ ఓపెన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వచ్చింది. ‘ట్రిపుల్ ఒలింపియన్’ అయిన ఈ సీనియర్ ఇందులో పాల్గొనకపోతే మొత్తం ఏడాదంతా జట్టుకు దూరమవుతుంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో తనకీ ట్రయల్స్ కీలకమని ‘అమ్మ’ దీపిక చెప్పింది. -
కీహోల్ ద్వారా.. ఆర్చరీలో అరుదైన రికార్డు..
-
గిరిజనులకు విలువిద్యలో శిక్షణ
సాక్షి, విశాఖపట్నం: విలువిద్యలో ఆరితేరిన గిరిజనుల పిల్లల్ని ఆర్చర్లుగా తీర్చి దిద్దుతామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆదివాసీ ప్రాంతంలో ఆర్చరీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఆదివాసీలకు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తామని, అటవీ హక్కుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. అల్లూరి దాడిచేసిన పోలీస్ స్టేషన్ ఆవరణలో సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి అనుచరుడు గంటం దొర మనుమడు బోడి దొరని ఘనంగా సత్కరించారు. వారి వారసులు 11 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. న్యాయవాది కరణం సత్యనారాయణరాజు ఆంగ్లంలో రచించిన ‘లెజెండరీ అల్లూరి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ గిరిజనులు ఆత్మాభిమానం కోసం ప్రాణాలు పణంగా పెడతారని చెప్పారు. అల్లూరి బ్రిటిష్ వారిపై విప్లవాగ్ని రగిలించడం గర్వంగా ఉందన్నారు. గిరిజన సంప్రదాయ కొమ్ములతో.. కేంద్ర మంత్రులు అర్జున్‌ముండా, కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, కళావతి తదితరులు గిరిజనుల ఉన్నత విద్యకు 2014 నుంచి దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్ని ప్రారంభించామని, 740కి పైగా పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌ను రూ.12 కోట్ల నుంచి రూ.38 కోట్లకు పెంచామన్నారు. ఆదివాసీలకు దైవంతో సమానమైన చెట్టు, పుట్ట, భూమిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. అటవీ ఉత్పత్తుల్ని పెంచి, వాటి మార్కెటింగ్‌కు మోడల్ విలేజ్‌లు అభివృద్ధి చేసి గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి అర్జున్ ముండా తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బెంగళూరు, ఢిల్లీలోనూ అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ఆధ్వర్యంలోనూ వేడుకలు జరుపుతామని అన్నారు. అల్లూరి నడయాడిన ప్రాంతాల్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాట్లాడుతూ గిరిజనులకు 9 లక్షల ఎకరాలకు పైగా అటవీ హక్కు పత్రాలు అందించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. రాజేంద్రపాలేన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణదేవి పేటలో రూ.66 లక్షలతో అల్లూరి స్మృతి వనం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కళావతి తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు: కిషన్‌రెడ్డి సాక్షి, విశాఖపట్నం: అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన చేసిన పలు సినిమాల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో డిన్నర్ మీట్‌కు అమిత్ షా కోరిన నేపథ్యంలో ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
Archery World Cup: సురేఖ డబుల్ ధమాకా
పారిస్: పునరాగమనంలో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పారిస్‌లో శనివారం జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం, వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 152–149 పాయింట్ల తేడాతో (40–37, 36–38, 39–39, 37–35) సోఫీ డోడెమోంట్–జీన్ ఫిలిప్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఒక్కో జంట నాలుగు బాణాల చొప్పున నాలుగుసార్లు లక్ష్యంపై గురి పెట్టాయి. తొలి సిరీస్‌లో భారత జోడీ పైచేయి సాధించగా, రెండో సిరీస్‌లో ఫ్రాన్స్ జంట ఆధిక్యంలో నిలిచింది. మూడో సిరీస్‌లో రెండు జోడీలు సమంగా నిలువగా... నాలుగో సిరీస్‌లో మళ్లీ భారత జంట ఆధి క్యం సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్ అనంతరం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలోనూ విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ రాణించింది. ముందుగా సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సురేఖ 147–145తో సోఫీ డోడెమోంట్ (ఫ్రాన్స్)ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో జరిగిన ఫైనల్లో సురేఖ ‘షూట్ ఆఫ్’లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 148–148తో సమంగా నిలిచారు. అనంతరం విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ చెరో షాట్ ఇవ్వగా... గిబ్సన్, జ్యోతి సురేఖ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే గిబ్సన్ బాణం 10 పాయింట్ల వృత్తం లోపల ఉండగా... సురేఖ వృత్తం అంచున తగిలింది. దాంతో గిబ్సన్‌కు స్వర్ణం, సురేఖకు రజతం లభించాయి. -
Archery World Cup: మెరిసిన జ్యోతి సురేఖ
పారిస్: ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో మెరిసింది. కాంపౌండ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో lవిజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 712 పాయింట్లు స్కోరు చేసి రెండో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన ప్రియా గుర్జర్ 689 పాయింట్లతో 20వ ర్యాంక్‌లో, ముస్కాన్ 689 పాయింట్లతో 21వ ర్యాంక్‌లో, అవనీత్ 686 పాయింట్లతో 24వ ర్యాంక్‌లో నిలిచారు. సురేఖ, ప్రియ, ముస్కాన్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. -
Khelo India Youth Games: వెంకటాద్రి పసిడి గురి.. ఏపీ ఖాతాలో మరో స్వర్ణం
పంచ్‌కుల(హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆర్చరీలో అండర్–18 పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కుందేరు వెంకట్రాది బంగారు పతకం సొంతం చేసుకోగా... అండర్–18 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మాదల సూర్య హంసిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో వెంకటాద్రి 144–141తో కోర్డె పార్థ్ సునీల్ (మహారాష్ట్ర)పై విజయం సాధిం చాడు. సెమీఫైనల్లో వెంకటాద్రి 147–146తో ప్రథమేశ్ (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 147–145తో పెండ్యాల త్రినాథ్ చౌదరీ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందాడు. కాంస్య పతక పోరులో సూర్య హంసిని 143–141తో అంతర్జాతీయ క్రీడాకారిణి పరిణీత్ కౌర్ (పంజాబ్)ను ఓడించింది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 14వ స్థానంలో ఉంది. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! -
ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి
ఆంధ్రప్రదేశ్ మహిళా స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నిలిచింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 25 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌ను అందుకుంది. కాంపౌండ్ విభాగంలో ఓ భారత ఆర్చర్ మూడో ర్యాంక్‌లో నిలువడం ఇదే ప్రథమం. సురేఖ ఖాతాలో ప్రస్తుతం 188.45 పాయింట్లు ఉన్నాయి. -
Asia Cup: ఆర్చరీలో భారత్ అదుర్స్
సులేమానియా (ఇరాక్): ఆసియా కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నమెంట్లో భారత జూనియర్ ఆర్చర్లు అసాధారణ ప్రదర్శనతో ‘టాప్’ లేపారు. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో క్లీన్‌స్వీప్ చేశారు. దీంతో భారత్ 8 స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల రికర్వ్ ఫైనల్లో భజన్ కౌర్, అవని, లక్ష్మిలతో కూడిన భారత జట్టు ‘షూటాఫ్’లో బంగ్లాదేశ్ జట్టుపై నెగ్గింది. పురుషుల రికర్వ్ ఫైనల్లో పార్థ్ , మృణాల్, జుయెల్లతో కూడిన భారత జట్టు 5–1తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో ప్రథమేశ్ 146–144తో రిషభ్‌పై గెలిచాడు. -
ప్రపంచాన్ని మెప్పించిన పాతికేళ్ల కుర్రాడు.. కడప బాహుబలి
కడప, స్పోర్ట్స్ : కడప నగరానికి చెందిన పాతికేళ్ల కుర్రాడు ప్రపంచాన్ని మెప్పించాడు. ధనుర్విద్యతో యావత్ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్నాడు. బాహుబలిలా ధనుస్సు చేతబట్టి ఏకకాలంలో విభిన్న లక్ష్యాలను ఛేదిస్తూ కడప బాహుబలిగా పేరుప్రఖ్యాతులు సాధిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్ నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాలిటీ షోలో పాల్గొని ఈయన చేసిన ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఏకకాలంలో రెండు బాణాలతో రెండు విభిన్న లక్ష్యాలను చేధించడంతో పాటు కదిలే లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. కష్టాల కడలిని ఈదుతూ.. కడప నగరానికి చెందిన దివంగత శ్రీనివాసులు, విజయ దంపతుల కుమారుడు వర్ధి ఉదయ్‌కుమార్. 2009లో తండ్రి చనిపోవడంతో తల్లి చేపట్టిన చిరువ్యాపారం(సోడా తయారీ)లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కష్టాలెన్ని ఎదురైనా వెరవలేదు. చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల పట్ల మక్కువ పెంచుకున్నాడు. 2007లో మార్షల్‌ఆర్ట్స్‌లో శిక్షణ ప్రారంభించిన ఉదయ్‌కుమార్ 2011లో నేపాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయస్థాయి కుంగ్‌ఫూ పోటీల్లో తొలి అంతర్జాతీయ పతకం(కాంస్యం) సాధించాడు. అదే యేడాది చెన్నైకి వెళ్లి అక్కడ వాసుదేవన్ ఆధ్వర్యంలో ఆర్చరీలో శిక్షణ పొందాడు. అనంతరం వారానికి రెండురోజులు చెన్నైలో, మిగతా రోజులు కడపలో ప్రాక్టీస్ చేసుకోవడం ప్రారంభించాడు. View this post on Instagram A post shared by Vardi Uday Kumar (@vardi_uday_kumar) 2015లో ముంబైలో నిర్వహించిన మేయర్ కప్ ఆర్చరీ పోటీల్లో కాంస్యపతకం సాధించాడు. చెన్నైలో నిర్వహించిన స్పీడ్ ఆర్చరీ టార్గెట్స్ కాంపిటీషన్లో పాల్గొని 2018లో ఏషియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలన్న ఉద్దేశంతో తన తల్లి పేరు మీద కడప నగరంలో విజయాస్ ఆర్చరీ అకాడమీని ఏర్పాటు చేశాడు. చాలామందిని జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాడు. దీంతో పాటు ఏపీ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు 2018లో ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ వారు నిర్వహించిన లెవల్–2 కోచ్‌గా ఉత్తీర్ణత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు క్రీడాకారుడు ఈయనే కావడం విశేషం. ఇటీవలే ‘ఉషు’ క్రీడలో సైతం పాటియాలలోని ఎన్ఐఎస్ శిక్షణ కేంద్రంలో 6 వారాల శిక్షణ పూర్తి చేసి శిక్షకుడుగా మారాడు. వెదుక్కుంటూ వచ్చిన అవకాశం కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా క్రీడాశిక్షణ ఆగిపోవడంతో, తనకు తెలిసిన విద్యలను సాధన చేసుకుంటూ వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. వీటిని పరిశీలించిన సోనీ టెలివిజన్ బృందం గతేడాది నవంబర్‌లో రియాలిటీషో కోసం ఆడిషన్స్‌కు రావాలని ఆహ్వానించారు. ముంబైలోని యశ్‌చోప్రా స్టూడియోలో నిర్వహించిన ఆడిషన్స్‌లో ఈయన ప్రతిభను పరిశీలించిన నిర్వాహకులు రియాల్టీషోకు ఎంపికచేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న ప్రసారమైన ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ రియాలిటీ షోలో ఈయన పాల్గొని ధనుర్విద్యలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. కదిలే తెరపై ఉన్న లక్ష్యాలను ఛేదించడం, ఎదురుగా ఉన్న వేర్వేరు టార్గెట్లను ఏకకాలంలో రెండు బాణాలతో ఛేదించడంతో నిర్వాహకులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన బాలీవుడ్ ప్రముఖులు శిల్పాశెట్టి, బాద్షా, మనోజ్, కిరణ్ఖేర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. షోలో అద్భుత ప్రదర్శన కనబరచడంతో తదుపరి రౌండ్‌కు నిర్వాహకులు ఎంపికచేశారు. తదుపరి రౌండ్లో భారతంలో అర్జునుడు చేధించిన మత్స్యయంత్రం తరహా లక్ష్యాలను చేధించడం, ఏకకాలంలో 5 లక్ష్యాలను ఛేదించడం వంటి అంశాలు ఉండే అవకాశం ఉందని ఉదయ్‌కుమార్ తెలిపాడు. గతంలో 7 లక్ష్యాలను ఛేదించడం కూడా సాధన చేశానని, అయితే షో కోసం ప్రస్తుతానికి 5 లక్ష్యాల పైనే దృష్టిసారిస్తున్నానని తెలిపారు. జర్మనీకి చెందిన హెన్నిక్ ఓంకార్ మార్గదర్శనంలో ధనుర్విద్యపై మరింత పరిశోధన చేస్తున్నానని తెలిపాడు. అలాగే త్వరలో అమెరికాలో నిర్వహించనున్న మరో రియాల్టీ షో కోసం సన్నద్ధం అవుతున్నట్లు ఉదయ్‌కుమార్ తెలిపాడు. 1Arrow | moving two balloons | one shot |#vardiudaykumar #dhanurvidya #Archery #indianarchery pic.twitter.com/mYiYRGK1pH — Vardi Uday Kumar (@UdayVardi) February 12, 2022 -
విలు విద్యలో రాణిస్తున్న మిహిర్ నితిన్ అపర్
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మిహిర్ నితిన్ అపర్ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ కాంపౌండ్ బాలుర విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాకు చెందిన ఈ 16 ఏళ్ల చిచ్చరపిడుగు ఇప్పటికే పలు టోర్నమెంట్లలో పతకాలు సాధించి.. భవిష్యత్‌లో దేశానికి మరిన్ని పతకాలు తేవాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నాడు. గతేడాది ఆగస్టులో పోలాండ్‌లో జరిగిన వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వయంగా రాజ్‌భవన్‌కు పిలిపించుకుని మిహిర్‌ను ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. మిహిర్ తల్లిదండ్రులు టీచర్లుగా పనిచేస్తున్నారు. పేరెంట్స్ పోత్సాహం, కోచ్ చంద్రకాంత్ ఇలాగ్ మార్గదర్శకత్వంతో మిహిర్ ఆర్చరీలో రాణిస్తున్నాడు. మిహిర్‌కు ఆత్మీయ సత్కారం విలు విద్యలో దూసుకుపోతున్న మిహిర్ నితిన్ అపర్‌ను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ సారంగపాణి సాదరంగా సన్మానించారు. ఎర్రగడ్డలోని తన నివాసంలో మిహిర్‌తో పాటు అతడి తండ్రిని చిరు సత్కారంతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో సారంగపాణి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ కార్టూనిస్ట్ నారూ, తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో!! ఎందుకంటే..) -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు ఆర్చర్ సురేఖ...
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్లోనే ఉత్తమ ర్యాంక్‌ను అందుకుంది. ప్రపంచ ఆర్చరీ తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా కాంపౌండ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్న భారతీయ ఆర్చర్‌గా ఆమె గుర్తింపు పొందింది. విజయవాడకు చెందిన 25 ఏళ్ల సురేఖ ఇటీవల ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. -
Tokyo Paralympics: అవని అద్వితీయం
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్‌హెచ్–1 ఈవెంట్లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్‌గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది. టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు. ‘షూట్ ఆఫ్’లో సూపర్... టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు. అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్జెవ్స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. పొలంలో సాధన చేసి... హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్‌కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్‌కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్‌లో పతకం రూపంలో ఫలితం వచ్చింది. ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్‌ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు ఖాయం పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్‌కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు. -
భారత్‌కు మరో పతకం; ఆర్చరీలో పతకం సాధించిన తొలి పారా అథ్లెట్‌గా
టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్ కిమ్ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడించిన హర్వీందర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇక పారాలింపిక్స్‌లో ఆర్యరీ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించాడు. హర్వీందర్ సింగ్ సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. ఇప్పటిదాకా 2 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా అవనీ లేఖరా సరికొత్త చరిత్ర సృష్టించింది. చదవండి: Tokyo Paralympics: సాహో జెంగ్ టావో.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు గెలిచాడు Avani Lekhara: 'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం -
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకాల పంట
వ్రోక్లా (పోలాండ్): ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. శనివారం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు గెలిచారు. కొరియా, చైనా ఆర్చర్ల గైర్హాజరీని భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. క్యాడెట్ మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, ప్రియా గుర్జర్, రిధి వర్షిణిలతో కూడిన భారత బృందం 228–216తో టర్కీ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో కుశాల్ దలాల్, సాహిల్ చౌదరీ, నితిన్‌లతో కూడిన భారత జట్టు 233–231తో అమెరికా జట్టుపై గెలిచింది. కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో ప్రియా–కుశాల్ ద్వయం 155–152తో అమెరికా జోడీపై నెగ్గింది. క్యాడెట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో ప్రియా గుర్జర్ 136–139తో సెలెన్ రోడ్రిగెజ్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో పర్ణీత్ 140–135తో హేలీ బౌల్టన్ (బ్రిటన్)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో సాక్షి 140–141తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోగా... కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో రిషభ్ యాదవ్ 146–145తో సెబాస్టియన్ గార్సియా (మెక్సికో)పై గెలిచి కాంస్యం సాధించాడు. -
ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌నకు మన అమ్మాయి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో అమెరికాలో జరిగే ప్రపంచ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత కాంపౌండ్ జట్టులోకి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఎంపికైంది. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం పాటియాలాలో రెండు రోజులపాటు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో బరిలోకి దిగిన సురేఖ 360 పాయింట్లకుగాను 357 పాయింట్లు స్కోరు చేసింది. ఈ క్రమంలో 356 పాయింట్లతో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. మహిళల విభాగంలో జ్యోతి సురేఖతోపాటు ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్ జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, సంగమ్‌ప్రీత్ సింగ్ బిస్లా, రిషభ్ యాదవ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. -
10 ఏళ్ల క్రితమే నంబర్‌వన్.. మరి ఒలింపిక్స్ పతకం?
సాక్షి, వెబ్‌డెస్క్: దీపికా కుమారి.. మహిళా ఆర్చరీ నంబర్‌వన్ ప్లేయర్. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున అడుగుపెట్టిన ఏకైక మహిళా ఆర్చరీ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు దీపికా సొంతం.. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఆమె ఖాతాలో పతకం కూడా లేదు. ఈసారి కోటి ఆశలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీపికా కుమారి.. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో పోరుకు సిద్దమైంది. వరల్డ్‌నంబర్‌వన్ ట్యాగ్‌తో ఒలింపిక్స్ విలేజ్‌కు వెళ్లిన దీపిక పతకం సాధిస్తుందనే అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణించలేదు.. టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు శుక్రవారం(23-07-2021)తొలి రోజు క్వాలిఫికేషన్ రౌండ్లో మాత్రం దీపికా అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. వరల్డ్నంబర్గా బరిలోకి దిగిన దీపిక తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్- 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 10 ఏళ్ల క్రితమే వరల్డ్ నంబర్‌వన్.. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. అంటే సుమారు 10 ఏళ్ల క్రితమే దీపిక వరల్డ్నంబర్గా నిలవగగా, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌కు టాప్ సీడ్‌గా వెళ్లారు. ఇక్కడ చదవండి: Tokyo Olympics 2020: భారత్ ఎన్ని పతకాలు గెలుస్తుంది?! ఒలింపిక్స్ ముందు గోల్డెన్ హ్యాట్రిక్ టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొన్న చివరి టోర్నమెంట్లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది. ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దీపికా కుమారి.. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్‌కు పతకం రాలేదు. ప్రధానంగా ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో విఫలం అవుతున్న దీపికా.. ఆ అడ్డంకిని అధిగమించాలనే పట్టుదలతో ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో రౌండ్ 16ను దాటలేకపోయిన దీపిక.. 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఈసారి పతకమే లక్ష్యంగా పోరుకు సిద్దమైన దీపిక ఎలా రాణిస్తుందో చూడాలి. -
Tokyo Olympics: శుభవార్త వింటామా!
టోక్యో: విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు ముగిశాయి. నేటి నుంచి క్రీడాకారులు పతకాల వేటను మొదలుపెట్టనున్నారు. తొలి రోజు మొత్తం 7 క్రీడాంశాల్లో 11 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. ఈ ఏడు క్రీడాంశాల్లో నాలుగింటిలో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెడల్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు క్వాలిఫయింగ్ రౌండ్ మొదలవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫైనల్ జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎనిమిది గంటల వరకు భారత్‌కు పతకం ఖాయమైందో లేదో తేలిపోతుంది. షూటింగ్‌లోనే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ మెడల్ ఈవెంట్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ ప్రారంభమవుతుంది. ఫైనల్లో భారత షూటర్లు ఉంటే అరగంటలోపు భారత షూటర్ల గురికి పతకం ఖాయమైందో లేదో తెలిసిపోతుంది. మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 5:00 నుంచి; ఫైనల్: ఉదయం గం. 7:15 నుంచి పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 9:30 నుంచి; ఫైనల్: మధ్యాహ్నం గం. 12 నుంచి నాలుగు పతకాలపై షూటర్ల గురి... కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో భారత షూటర్లు నిలకడగా పతకాలు సాధిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం క్రొయేషియాలో ప్రత్యేకంగా రెండు నెలలపాటు సాధన చేశారు. తొలి రోజు రెండు విభాగాల్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇలవేనిల్ వలారివన్, అపూర్వీ చండేలా పోటీపడనున్నారు. 48 మంది షూటర్లు పాల్గొనే క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇలవేనిల్, అపూర్వీ తొలి లక్ష్యం ఫైనల్ చేరడమే. అనంతరం ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు స్కోరు చేస్తేనే ఇలవేనిల్, అపూర్వీ పతకాలను ఖాయం చేసుకుంటారు. పురుషుల 10 ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ బరిలో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సౌరభ్ రెండో స్థానంలో, అభిషేక్ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. 36 మంది పాల్గొనే క్వాలిఫయింగ్‌లో రాణించి టాప్–8లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు సాధిస్తే సౌరభ్, అభిషేక్‌ల నుంచి పతకాలు ఆశించవచ్చు. దీపిక–ప్రవీణ్ జోడీ అద్భుతం చేస్తేనే... ♦ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: ఉదయం గం. 6 నుంచి ♦ కాంస్య పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:55 నిమిషాల నుంచి ♦ స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 1:15 ని. నుంచి ఆర్చరీలో శుక్రవారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్లు జరిగాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ దీపిక కుమారి 663 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లు స్కోరు చేసి 31వ ర్యాంక్‌లో... అతాను దాస్ 653 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో... తరుణ్‌దీప్ రాయ్ 652 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ విభాగంలో భారత్ తరఫున దీపిక కుమారి–ప్రవీణ్ జాదవ్ జోడీ బరిలోకి దిగనుంది. భార్యాభర్తలైన దీపిక, అతాను దాస్ జతగా ఈ విభాగంలో పోటీపడుతుందని ఆశించినా... ర్యాంకింగ్ రౌండ్లో అతాను దాస్ వెనుకంజలో ఉండటం... ప్రవీణ్ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో... దీపికకు భాగస్వామిగా ప్రవీణ్‌నే ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం స్పష్టం చేసింది. నేడు మిక్స్డ్ డబుల్స్‌లో మెడల్ ఈవెంట్ జరగనుంది. దీపిక–ప్రవీణ్ సంయుక్త స్కోరు (1319) ఆధారంగా తొలి రౌండ్లో ఈ జంటకు తొమ్మిదో సీడ్ లభించింది. నాకౌట్ పద్ధతిలో జరిగే మిక్స్డ్ ఈవెంట్లో తొలి రౌండ్లో లిన్ చియా ఇన్–టాంగ్ చి చున్ (చైనీస్ తైపీ) ద్వయంతో దీపిక–ప్రవీణ్ జంట తలపడుతుంది. తొలి రౌండ్ దాటితే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఆన్ సాన్–కిమ్ జె డియోక్ (దక్షిణ కొరియా)లతో దీపిక–ప్రవీణ్ తలపడే అవకాశముంది. కొరియా అడ్డంకిని అధిగమిస్తే దీపిక–ప్రవీణ్ సెమీఫైనల్ చేరతారు. మీరాబాయి మెరిసేనా... ప్రపంచ మాజీ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే పతకం మోసుకొస్తుంది. ఎనిమిది మంది పోటీపడే ఫైనల్లో మీరాబాయికి చైనా లిప్టర్ జిహుయ్ హు, డెలాక్రుజ్ (అమెరికా), ఐసా విండీ కంతిక (ఇండోనేసియా) నుంచి గట్టిపోటీ లభించనుంది. గత ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మీరాబాయి అదే ప్రదర్శనను పునరావృతం చేసి, స్నాచ్‌లోనూ రాణిస్తే ఆమెకు కనీసం కాంస్యం దక్కే అవకాశముంది. మహిళల 49 కేజీల విభాగం ఫైనల్: ఉదయం గం. 10.20 నిమిషాల నుంచి సుశీలా ‘పట్టు’ ప్రయత్నం మహిళల జూడో 48 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుశీలా దేవి పోటీపడనుంది. తొలి రౌండ్లో ఆమె ఇవా సెర్నోవిక్జీ (హంగేరి)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫునా తొనాకి (జపాన్)తో సుశీలా తలపడుతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుశీలా 33వ ర్యాంక్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో సుశీలా పతకం రేసులో నిలిస్తే అద్భుతమే అవుతుంది. తొలి రౌండ్: ఉదయం గం. 7: 30 తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ్ఠ యాంగ్ లీ–చి లిన్ వాంగ్ (చైనీస్ తైపీ); ఉదయం గం. 8:50 నుంచి. పురుషుల సింగిల్స్ లీగ్ మ్యాచ్: సాయిప్రణీత్ ్ఠ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్); ఉదయం గం. 9:30 నుంచి బాక్సింగ్ పురుషుల 69 కేజీల తొలి రౌండ్: వికాస్ కృషన్ ్ఠ మెన్సా ఒకజావా (జపాన్); మధ్యాహ్నం గం. 3:55 నుంచి. హాకీ పురుషుల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS న్యూజిలాండ్ (ఉదయం గం. 6:30 నుంచి). మహిళల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS నెదర్లాండ్స్ (ఉదయం గం. 5:15 నుంచి) రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ హీట్–2: అర్జున్ లాల్–అరవింద్ సింగ్ (ఉదయం గం. 7:30 నుంచి) టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: శరత్ కమల్–మనిక బత్రా VS యున్ జు లిన్–చింగ్ చెంగ్ (చైనీస్ తైపీ) ఉదయం గం. 8:30 నుంచి మహిళల సింగిల్స్ తొలి రౌండ్: మనిక బత్రా VS టిన్ టిన్ హో (బ్రిటన్); మధ్యాహ్నం గం. 12:15 నుంచి; సుతీర్థ ముఖర్జీ ్ఠ లిండా బెర్గ్స్టోరెమ్ (స్వీడన్); మధ్యాహ్నం గం. 1:00 నుంచి టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: సుమిత్ నగాల్ ్ఠ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్); ఉదయం గం. 7:30 నుంచి నేడు అందుబాటులో ఉన్న స్వర్ణాలు (11) ఆర్చరీ (1) రోడ్ సైక్లింగ్ (1) ఫెన్సింగ్ (2) జూడో (2) షూటింగ్ (2) తైక్వాండో (2) వెయిట్‌లిఫ్టింగ్ (1) అన్ని ఈవెంట్స్ ఉదయం గం. 6:00 నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టోక్యో ఒలింపిక్స్: ఆర్చరీ సీడింగ్ రౌండ్లో దీపికకు 9వ స్థానం
టోక్యో: ప్రపంచ నంబర్‌వన్, భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ విభాగం వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్లో నిరాశపరిచింది. శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. ఇక సీడింగ్ రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్ సాన్ ఆన్ 680 పాయింట్లతో రికార్డు సృష్టించింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి ప్రస్తుతం క్వాలిఫికేషన్ రౌండ్లో 9వ ర్యాంక్ సంపాదించింది. అయితే జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్ 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక పాల్గొననుంది. ఆమె భూటాన్‌కు చెందిన కర్మతో రౌండాఫ్ 32లో తలపడనున్నది. India🇮🇳 begins its #Tokyo2020 journey with @ImDeepikaK finishing 9th with a score of 663 in the Women’s recurve archery ranking round. South Korea’s 🇰🇷 An San created a new #Olympic record with a score of 680. Send in your wishes for #TeamIndia with #Cheer4India pic.twitter.com/0QKAImz6YI — SAIMedia (@Media_SAI) July 23, 2021 -
మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా
తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలానే ఉంది.. చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్‌లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్‌ను ఫిదా చేస్తోంది ఈ భామ. ఇటీవలె బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి మంచి సినిమాల్లో నటించినా ఈ భామకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగమ్మాయి అయిన ఈషాకు ఇక్కడ సరైన అవకాశాలు రాకపోయినా మలయాళ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఓట్టు సినిమాలో ఈషాకు ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఒకేసారి తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ గ్యాప్‌లో తన పాత్ర కోసం కసరత్తులు చేస్తోంది ఈ బ్యూటీ. ఇందుకోసం రైఫిల్ షూటింగ్, బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటుంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్స్‌లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉందంటోంది ఈషా. మొత్తానికి తెలుగమ్మాయిగా టాలీవుడ్లో అవకాశాలు పెద్దగా రాకపోయినా మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమల్లో నుంచి ఈ అమ్మడికి అవకాశాలు రావడం విశేషం. ఇక ఈషా రెబ్బా ప్రస్తుతం అఖిల్ హీరోగా వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలోనూ నటిస్తుంది. చదవండి : సూపర్ చాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా -
నాగశౌర్య షాకింగ్ లుక్ : టైటిల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: యంగ్‌హీరో నాగశైర్య మరోసారి షాకింగ్ లుక్‌లో ఫ్యాన్స్‌ను విస్మయపర్చాడు. ఈ చిత్రానికి `లక్ష్య` అనే టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేసింది. కండలు తిరిగి శరీర సౌష్టవంతో, డిఫరెంట్‌గా నాగశౌర్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్లో వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులముందుకు వస్తున్న నాగశౌర్య తాజా లుక్‌పై అభిమానులు ఫిదా అవుతున్నారు. (నాగశౌర్య సరసన హాట్ బ్యూటీ ఎంట్రీ) ఊహలు గుసాగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నాగశౌర్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశైర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అటు ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎయిట్ ప్యాక్ బాడీతో చేతిలో బాణంతో స్టన్నింగ్ ఫస్ట్‌లుక్ ఇప్పటికే అందరినీ థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. “ LAKSHYA “ - A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN — Naga Shaurya (@IamNagashaurya) November 30, 2020 -
పిల్లలు బంక మట్టిలాంటివాళ్లు
‘‘పసి పిల్లల మనసు, శరీరం రెండూ బంక మట్టిలాంటివి. మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. అందుకే చిన్నప్పుడే మంచి అలవాట్లు, మంచి ఆటలు నేర్పిద్దాం’’ అంటున్నారు శిల్పా శెట్టి. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా విలు విద్య ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు శిల్పా. గతంలో ఓ ట్రిప్‌లో భాగంగా ఈ విద్య నేర్చుకున్నారట. అప్పుడు తీసిన వీడియో ఇది అని, నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. క్రీడల ప్రాముఖ్యత గురించి శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘క్రీడలు పిల్లలకు వ్యాయామంలా ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన పోటీ అలవాటు చేస్తాయి. ఏదో నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తాయి. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. మనం ఆడండి అని పిల్లలకు చెప్పడం కంటే మనం ఆడుతుంటే చూసి ఇంకా చురుకుగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. శుక్రవారంతో ఫిట్ ఇండియా ఉద్యమానికి ఏడాది పూర్తవుతుంది. తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే... మీ పిల్లలకు ఏదో ఒక ఆట నేర్పిస్తూ ఉండండి. మీరు కూడా నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా ఉండండి’’ అన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్!
కరోనా కారణంగా చాలామంది ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పని చేస్తున్నారు. సినిమాలకు సంబంధించిన కొన్ని పనులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నాయి. తాజాగా ప్రభాస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లోకి వెళ్లనున్నారట. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ఆది పురుష్’ అనే ప్యాన్ ఇండియా సినిమాని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నారాయన. ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్య నేర్చుకోనున్నారని, శరీరాకృతిని కూడా అందుకు తగ్గట్టుగా మార్చుకోనున్నారని దర్శకుడు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారు. విలు విద్యకు సంబంధించిన సెటప్‌ను ప్రభాస్ తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకోనున్నారని సమాచారం. ఒక ట్రైనర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణనంతా ఇంట్లోనే పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తారని సమాచారం. -
మరో మేకోవర్
‘బాహుబలి’ కోసం యోధుడిగా తన శరీరాన్ని మార్చుకున్నారు ప్రభాస్. అలానే కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. తాజాగా మరోసారి కొత్త విద్య, బాడీ మేకోవర్ మీద ప్రభాస్ దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ అనే చిత్రంలో నటించనున్నారు ప్రభాస్. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం విలు విద్య నేర్చుకోనున్నారు ప్రభాస్. అలాగే విలు విద్య చేసేవారి శరీరాకృతిని పోలినట్లుగా తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఓం తెలిపారు. ‘‘నా కథలో రాముడిగా ప్రభాస్‌ని తప్ప ఎవ్వర్నీ ఊహించుకోలేకపోయా. ఈ పాత్రను అతను తప్ప ఎవ్వరూ చేయలేరనిపించింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్ ప్రభాస్. మౌనంగా మునిలా ఉంటూనే, రౌద్రంగా గర్జించగలిగే విభిన్నమైన కాంబినేషన్ ప్రభాస్. ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నాం. దానికి సంబంధించి నిపుణులతో సంప్రదిస్తున్నాం. అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నారు ప్రభాస్’’ అని తెలిపారు ఓం రౌత్. -
25 నుంచి ఆర్చరీ శిబిరం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత భారత ఆర్చరీ క్రీడాకారులు మళ్లీ లక్ష్యాలపై గురి పెట్టనున్నారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి జాతీయ ఆర్చరీ శిక్షణ శిబిరం పునఃప్రారంభం కానుంది. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 16 మంది ఆర్చర్ల బృందం (ఎనిమిది మంది చొప్పున పురుషులు, మహిళలు) రికర్వ్ విభాగంలో తమ శిక్షణను కొనసాగించనున్నారు. వీరితో పాటు నలుగురు కోచ్‌లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఈ క్యాంపులో పాల్గొంటారని ‘సాయ్’ తెలిపింది. ఈ క్యాంపునకు ఎంపికైన వారందరూ ఈ నెల 25న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ‘సాయ్’ ఆదేశించింది. అనంతరం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించి... 14 రోజుల పాటు క్వారంటైన్ చేయనుంది. పురుషుల జట్టు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... మహిళల జట్టు మాత్రం ఆ పనిలో నిమగ్నమైంది. అంతే కాకుండా వ్యక్తిగత విభాగాల్లో సైతం ఒలింపిక్ బెర్తుల కోసం భారత ఆర్చర్లు పోటీ పడాల్సి ఉంది. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్ అర్హత టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది. శిబిరానికి ఎంపికైన పురుషుల జట్టు: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, బి.ధీరజ్, ప్రవీణ్ జాదవ్, జయంత తలుక్దార్, సుఖ్‌మను బాబ్రేకర్, కపిల్, విశ్వాస్; మహిళల జట్టు: దీపిక కుమారి, అంకిత భగత్, బొంబేలా దేవి, రిధీ, మధు వేద్వాన్, హిమని, ప్రమీలా బరియా, తిషా సంచెటి. -
సురేఖ రెండు జాతీయ రికార్డులు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్‌ను ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నమెంట్‌తో మొదలుపెట్టనుంది. మే 11 నుంచి 17 వరకు టర్కీలోని అంటాల్యాలో జరిగే రెండో ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ కాంపౌండ్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగనుంది. గ్వాటెమాలా సిటీలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు జరిగే తొలి వరల్డ్ కప్‌లో మాత్రం భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపించనుంది. ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం హరియాణాలో సోమవారం ముగిసిన సెలక్షన్ ట్రయల్స్‌లో సురేఖ రెండు కొత్త జాతీయ రికార్డులు నమోదు చేయడంతోపాటు టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తొలుత నిర్వహించిన ట్రయల్స్‌లో మొత్తం 720 పాయింట్లకుగాను సురేఖ 709 పాయింట్లు స్కోరు చేసి గతంలో 707 పాయింట్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. డబుల్ ఫిఫ్టీ రౌండ్ విభాగంలో 1440 పాయింట్ల కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో సురేఖ 1411 పాయింట్లు సాధించి ఈ విభాగంలోనూ గతంలో 1405 పాయింట్లతో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసింది. -
ఆ రెండు... మీరు నిర్వహించుకోండి
లండన్: కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్, ఆర్చరీ ఈవెంట్ల కోసం బెట్టు వీడని పోరాటం చేసిన భారత్ ఒకింత విజయం సాధించినట్లే! భారత్‌కు ఈ రెండు ఈవెంట్లను ప్రత్యేకంగా నిర్వహించుకునే స్వేచ్ఛనిచ్చిన కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) అందులో సాధించిన పతకాలను గేమ్స్ పట్టికలో తర్వాత చేరుస్తామని ప్రకటించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌కు బర్మింగ్‌హామ్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు ఆతిథ్యమివ్వనుంది. అయితే అతిథ్య దేశానికి ఉన్న సౌలభ్యం మేరకు ఇంగ్లండ్ రోస్టర్ విధానంలో భాగంగా షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను గేమ్స్ నుంచి తప్పించింది. దీనిపై గుర్రుగా ఉన్న భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గేమ్స్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. కొన్ని నెలలుగా ఈ అంశం సీజీఎఫ్‌లో రగులుతూనే ఉంది. ఎట్టకేలకు దీనికి ముగింపు పలికే నిర్ణయాన్ని తాజా సీజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో తీసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందుగా ఆ రెండు క్రీడల్ని భారత్‌లో నిర్వహించాలని, అందులో సాధించిన పతకాల్ని ప్రధాన గేమ్స్ పట్టికలో ఓ వారం తర్వాత చేరుస్తామని సీజీఎఫ్ తెలిపింది. షూటింగ్, ఆర్చరీ ఈవెంట్లను 2022 జనవరిలో నిర్వహిస్తామని ఐఓఏ తెలిపింది. -
కాంస్య పతక పోరుకు భారత జట్లు
అంటాల్యా (టర్కీ): ఈ ఏడాది ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లలో తొలి పతకానికి భారత జట్లు విజయం దూరంలో ఉన్నాయి. ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్లో మహిళల, పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో భారత జట్లు కాంస్య పతక పోరుకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, స్వాతి దుద్వాల్, ముస్కాన్ కిరార్‌లతో కూడిన భారత బృందం షూట్ ఆఫ్‌లో రష్యా చేతిలో పరాజయం పాలైంది. నిర్ణీత నాలుగు రౌండ్ల తర్వాత రెండు జట్లు 232–232 పాయింట్లతో సమంగా నిలిచాయి. షూట్ ఆఫ్‌లో భారత బృందం 29 పాయింట్లు సాధించగా... రష్యా 30 పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే కాంస్య పతక పోరులో బ్రిటన్‌తో భారత్ ఆడుతుంది. పురుషుల విభాగం సెమీఫైనల్లో రజత్ చౌహాన్, అభిషేక్ వర్మ, అమన్ సైనిలతో కూడిన భారత జట్టు 233–234తో టర్కీ చేతిలో ఓటమి చవిచూసింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో రష్యాతో భారత్ తలపడుతుంది. -
పతకాలను ఛేదించింది
అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి గురి చూస్తే, అతడికి పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించేది కాదు. అందుకే గొప్ప విలుకాడయ్యాడు. రామాయమ్మ విల్లు ఎక్కిపెట్టి గురి చూసినా అంతే.. బాణం లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. అందుకే రామాయమ్మ చేతిలో బాణాన్ని రామబాణం అంటారు ఆమె గురించి తెలిసిన వాళ్లు. విలువిద్య మగవాళ్లకే పరిమితం అని ఎవరూ నిర్దేశించలేదు, కానీ మహిళలు ఆసక్తి చూపకపోవడంతో ఆ కళకు మగవాళ్ల విద్య అనే ముద్ర పడింది. ఆ ముద్రను కూడా బాణంతో ఛేదించింది రామాయమ్మ. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. కడబాల రామాయమ్మది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం. ఆదివాసీ మహిళ. ప్రస్తుతం ఆమె దేవీపట్నం మండలం ముసినికుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా అమ్మాయిలకు విలువిద్యలో శిక్షణనిస్తున్నారు. నాన్న నేర్పించాడు ‘‘చిన్నప్పుడు నాన్న నాకు ఆడుకోవడానికి విల్లంబులు తయారు చేసిచ్చాడు. అలా బాణాలు వేయడం అలవాటైంది. మాది గంగవరం మండలం మోహనాపురం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే. హైస్కూల్‌కి అడ్డతీగలకు వెళ్లాను. ఆ స్కూల్లో పీఈటీ రాజయ్య సార్ నేను బాణాలు వేయగలనని గుర్తించి మరిన్ని మెళకువలు నేర్పించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు కూడా తీసుకెళ్లారు. జాతీయ స్థాయిలో, రూరల్ విలువిద్య పోటీల్లో బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్, ఒడిషా, కేరళ, మధ్యప్రదేశ్‌లలో జరిగిన జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో కూడా పతకాలందుకున్నాను. న్యూఢిల్లీలో 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు ఇప్పటికీ సంతోషాన్నిచ్చే విషయం. రంపచోడవరం ఏజెన్సీలో పుట్టిన నేను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించగలనని కలలో కూడా ఊహించలేదు’’ అన్నారు రామాయమ్మ. స్వతహాగా అబ్బుతోంది ఏజెన్సీ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్లకు విలువిద్యలో రాణించే లక్షణం పుట్టుకతోనే అబ్బుతోందని చెప్పారు రామాయమ్మ. ‘‘తూర్పు ఏజెన్సీలో అనేక మంది విద్యార్థుల్లో విలువిద్యలో రాణించే సత్తా ఉంది. జాతీయ స్థాయి మహిళల విలువిద్య పోటీల్లో ఎర్రపాలెం పాఠశాల విద్యార్థినులు ద్వితీయస్థానం సాధించారు. నేను ఇప్పటి వరకు 50 మంది విద్యార్థులకు విలువిద్యలో ఉత్తమ శిక్షణ ఇచ్చాను. రంపచోడవరం కేంద్రంగా ఆర్చరీ క్లబ్ ఏర్పాటు చేస్తే వీరిని నైపుణ్యం కలిగిన క్రీడాకారులగా తీర్చిదిద్దవచ్చు. ఒలింపిక్స్ ఆర్చరీ పోటీలకు ఏజెన్సీ ప్రాంతం నుంచి విలువిద్య క్రీడాకారులను పంపించాలనేది నా కోరిక’’ అన్నారామె. సాక్షి ప్రతినిధి, రంపచోడవరం -
ఆర్చరీలో మేటి... ఆదుకోరా మరి!
సాక్షి, హైదరాబాద్: పట్టుమని పదేళ్లయినా లేని అరిహంత్ ఆర్చరీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తొమ్మిదేళ్ల కుర్రాడు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించిన జాతీయ ఆర్చరీ సంఘం న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టుకు ఎంపిక చేసింది. వెల్లింగ్టన్లో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు జరిగే ప్రపంచ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్లో రావుల అరిహంత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అయితే నాలుగో తరగతి చదువుతున్న ఈ కుర్రాడి కుటుంబానికి కివీస్ పర్యటనకు అయ్యే ఖర్చును భరించే స్తోమత లేదు. ప్రతిభ ఉండి ప్రపంచ స్థాయి పోటీల్లో రాణించాలనుకుంటున్న ఇతనికి న్యూజిలాండ్ పర్యటన కోసం రూ. 4.5 లక్షలు కావాలి. స్పాన్సర్లు ఎవరూ లేకపోవడంతో అరిహంత్ తండ్రి రావుల రమేష్ దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందజేయాలని అభ్యర్థిస్తున్నారు. సాయం అందించాలనుకునేవారు 9000933382 ఫోన్నంబర్లో సంప్రదించగలరు. -
ఆకాశ్‌కు రజతం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్‌లో తమ పోరాటాన్ని రజత పతకంతో ముగించారు. పోటీల చివరిరోజు భారత్‌కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆకాశ్ మలిక్ రజతాన్ని అందించాడు. హరియాణాకు చెందిన 15 ఏళ్ల ఆకాశ్ ఫైనల్లో 0–6తో ట్రెన్టన్ కౌలెస్ (అమెరికా) చేతిల ఓడిపోయాడు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో... 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి. -
అర్చరీ క్రీడకారిణి జ్యోతి సురేఖకు గన్నవరంలో ఘనస్వాగతం
-
చివర్లో తడబడి... రజతాలతో సరి...
కాంపౌండ్ టీమ్ ఆర్చరీలో భారత పురుషుల జట్టు తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా ‘పసిడి’ పోరులో ఒత్తిడికిలోనై రజత పతకంతోనే సరిపెట్టుకుంది. 2014 ఏషియాడ్ ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం నెగ్గిన భారత జట్టు ఈసారి కొరియా చేతిలోనే ఓడిపోయి రజతంతో సంతృప్తి పడింది. అభిషేక్ వర్మ, అమన్ సైని, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఫైనల్లో అదృష్టం కలిసి రాలేదు. నిర్ణీత 24 షాట్ల తర్వాత భారత్, కొరియా 229–229 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు రెండు జట్లకు మూడేసి షాట్లతో కూడిన ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. ఇందులోనూ రెండు జట్లు 29 పాయింట్ల చొప్పున సాధించాయి. అయితే కొరియా ఆర్చర్లు కొట్టిన రెండు షాట్లు 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో వారికి స్వర్ణం ఖాయమైంది. భారత్ ఖాతాలో రజతం చేరింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 228–231తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. 18 షాట్ల తర్వాత రెండు జట్లు 173–173తో సమంగా ఉన్నాయి. అయితే చివరి ఆరు షాట్ల సిరీస్‌లో భారత్ 55 పాయింట్లు సాధించగా... కొరియా 58 పాయింట్లు స్కోరు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. జ్యోతి సురేఖకు ఇది రెండో ఆసియా క్రీడల పతకం. 2014 ఏషియాడ్‌లో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్యం గెలిచింది.