టోక్యో: ప్రపంచ నంబర్‌వన్, భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ విభాగం వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో నిరాశపరిచింది. శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్‌లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. ఇక సీడింగ్ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్ సాన్ ఆన్ 680 పాయింట్లతో రికార్డు సృష్టించింది.
క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి ప్రస్తుతం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 9వ ర్యాంక్ సంపాదించింది. అయితే జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్ 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక పాల్గొననుంది. ఆమె భూటాన్‌కు చెందిన కర్మతో రౌండాఫ్ 32లో తలపడనున్నది.
India🇮🇳 begins its #Tokyo2020 journey with @ImDeepikaK finishing 9th with a score of 663 in the Women’s recurve archery ranking round.
— SAIMedia (@Media_SAI) July 23, 2021
South Korea’s 🇰🇷 An San created a new #Olympic record with a score of 680.
Send in your wishes for #TeamIndia with #Cheer4India pic.twitter.com/0QKAImz6YI
Comments
Please login to add a commentAdd a comment