deepika kumari
-
ఆర్చరీ వరల్డ్‌కప్: రజత పతకం కైవసం చేసుకున్న దీపికా కుమారి
ట్లాక్స్కాలా (మెక్సికో): భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లో రజత పతకాన్ని (మహిళల రికర్వ్ ఈవెంట్) కైవసం చేసుకుంది. ఫైనల్లో దీపికా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన అర్చర్ లి జియామన్ చేతిలో 0-6 తేడాతో ఓటమిపాలైంది.మూడేళ్ల విరామం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరిన దీపికా అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో దీపికా తడబాటుకు లోనైంది. ఆర్చరీ వరల్డ్‌కప్ టోర్నీలో దీపికాకు ఇది ఆరో పతకం. 2011, 2012, 2013, 2015, 2024 ఎడిషన్లలో దీపికా రజత పతకాలు సాధించింది. 2018 ఎడిషన్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.చదవండి: ధీరజ్, సురేఖలకు నిరాశ -
ఒలింపిక్ పతకం నెగ్గేంతవరకు నిష్క్రమించను: ఆర్చర్ దీపిక కుమారి
పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి.. విశ్వక్రీడల్లో మెడల్ గెలిచేంత వరకు కెరీర్‌కు రిటైర్మెంట్ను ప్రకటించనని వెల్లడించింది. వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన దీపిక... మహిళల వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ఓడి నిష్క్రమించింది. అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపికకు ఒలింపిక్ మెడల్ మాత్రం అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. ‘కెరీర్ కొనసాగిస్తా.ఒలింపిక్ పతకం గెలవాలని బలంగా కోరుకున్నా. అది సాధించేవరకు ఆట నుంచి విశ్రాంతి తీసుకోను, నిష్క్రమించను. మరింత కఠోర సాధన చేసి బలంగా తిరిగి పుంజుకుంటా. వేగంగా బాణాలు వేయడంపై దృష్టి పెడతా. ఈ వేదికపై పొరబాట్లకు తావివ్వకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని దీపిక వెల్లడించింది. కీలక పోరులో 7 పాయింట్లు సాధించడం ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. అదొక్కటి మినహా పారిస్‌లో మంచి ప్రదర్శనే చేశానని దీపిక వివరించింది. -
ముగిసిన భారత ఆర్చర్ల పోరాటం.. కార్టర్స్‌లో దీపికా ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆర్చరీ విభాగంలో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్ మిచ్చెల్లి క్రొప్పన్‌ను ఓడించి తన సత్తాచాటిన దీపికా కుమారి .. క్వార్టర్లో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయింది. దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియోన్ చేతిలో4-6 తేడాతో దీపికా కుమారి పరాజయం పాలైంది. 3వ సెట్ ముగిసే సమయానికి దీపిక 4-2తో ముందంజలో ఉన్నప్పటకి.. తర్వాత సెట్లలో పేలవమైన షూటింగ్‌ల కారణంగా ఆమె తమ సెమీ-ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది.అదేవిధంగా మరో ఆర్చర్ భజన్ కౌర్ రౌండ్-16లోనే ఇంటిముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన డియానందా చోయిరునిసా చేతిలో భజన్ కౌర్ ఓటమి చవిచూసింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ప్రయాణం ముగిసింది. మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి భారత ఆర్చర్లు ఇంటిముఖం పట్టారు. -
Paris Olympics: మెరిసిన అంకిత.. క్వార్టర్ ఫైనల్లో భారత ఆర్చరీ టీమ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళ ఆర్చర్లు శుభారంభం చేశారు. టీమ్ ఈవెంట్లో అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారి త్రయంతో కూడిన భారత ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ర్యాంకింగ్ రౌండ్ ఈవెంట్లో ఈ భారత త్రయం నాలుగో స్ధానంలో నిలవడంతో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.ఈ ఈవెంట్లో భారత్ ఓవరాల్‌గా 1983 పాయింట్లు సాధించి నాలుగో స్ధానంలో నిలిచింది. భారత బృందంలో తొలిసారి ఒలింపిక్స్‌లో భాగమైన యువ ఆర్చర్ అంకిత భకత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలిచి సత్తాచాటింది. ఆమెతో పాటు భజన్ కౌర్(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు. ఇక సీడింగ్ నిర్ణయాత్మక ఈవెంట్లో కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా(1996 పాయింట్లు), మెక్సికో(1986 పాయింట్లు) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచాయి. భారత్ మరో 3 పాయింట్లు సాధించి ఉంటే మెక్సికోను ఆధిగమించి టాప్-3లో చోటు ఖాయం చేసుకుండేది. Paris Olympics : Archery Ankita Bhakat finish 11th in individual while Indian women team finish 4th in qualification Ankita Bhakat - 666 (11th)Bhajan Kaur - 659 (22nd)Deepika Kumari - 658 (23rd)India women team finish 4th with 1983 , & got bye to Quarterfinal pic.twitter.com/7nzDWQPC6O— Sports India (@SportsIndia3) July 25, 2024 -
Paris Olympics 2024: క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్..
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆరంభ వేడుకలకు ఒకరోజు ముందే ఆర్చరీ బృందం పోటీలకు సిద్ధమైంది. విశ్వ క్రీడల తాజా ఎడిషన్‌లో భాగంగా గురువారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ నేటి షెడ్యూల్(భారత కాలమానం ప్రకారం)👉జూలై 25, గురువారం- ఆర్చరీ👉వేదిక- పర్షియన్ కాంప్లెక్స్‌లోని లెస్ ఇన్వాలిడెస్. 1867లో దీనిని నిర్మించారు.👉మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ - మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరంభం👉పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్- సాయంత్రం 5:45 నిమిషాలకు ఆరంభంక్వార్ట్సర్స్కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్..ఒలింపిక్స్‌లో భారత మహిళా ఆర్చరీ బృందం శుభారంభం చేసింది. మహిళల టీమ్ ఈవెంట్లో అంకిత భకత్, భజన్ కౌర్, దీపికా కుమారితో కూడిన త్రయం క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. సీడింగ్ నిర్ణయాత్మక రౌండ్లో భారత బృందం నాలుగో స్ధానంలో నిలిచింది. భారత బృందంలో అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలవగా.. భజన్ కౌర్(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు.Update: నాలుగో స్ధానంలో భారత్..11వ సెట్ ముగిసే సరికి భారత మహిళా ఆర్చరీ బృందం నాలుగో స్ధానంలో నిలిచింది. ఐదో స్ధానంలో ఉన్న జట్టు కంటే భారత్ 13 పాయింట్లు ఆధిక్యంలో ఉంది. మూడో స్ధానంలో ఉన్న మెక్సికోను ఆధిగమించే అందుకు భారత ఆర్చర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి.Update: ఫస్ట్‌హాఫ్(36 షాట్స్) ముగిసే సరికి భారత మహిళా అర్చర్లు ఏ స్ధానాల్లో ఉన్నారంటే?🎯అంకిత భకత్ 335 పాయింట్లు- 12వ స్థానం🎯భజన్ కౌర్ 330 పాయింట్లు- 23వ స్థానం🎯దీపికా కుమారి 327 పాయింట్లు- 38వ స్థానం🎯మహిళా టీమ్: ఆరో స్థానం👉పోటీలో ఉన్న ఆర్చర్లు మొత్తం- 64👉ఇంకా 6 ఎండ్స్(36 షాట్లు) మిగిలి ఉన్నాయి.🎯1 ఎండ్= ఆరుసార్లు బాణం వేసే అవకాశంఅప్డేట్: 4 ఎండ్స్(24 షాట్స్) తర్వాత భారత మహిళా బృందం ఏ స్థానంలో ఉందంటే?🎯అంకిత భకత్ 225 పాయింట్లు- 8వ స్థానం🎯భజన్ కౌర్ 218 పాయింట్లు- 31వ స్థానం🎯దీపికా కుమారి 217 పాయింట్లు- 38వ స్థానం🎯మహిళా టీమ్: నాలుగో స్థానం👉పోటీలో ఉన్న ఆర్చర్లు మొత్తం- 64👉ఇంకా 8 ఎండ్స్(48 షాట్లు) మిగిలి ఉన్నాయి.🎯1 ఎండ్= ఆరుసార్లు బాణం వేసే అవకాశంమన ఆర్చర్లు వీరే.. భారత్ నుంచి మహిళా విభాగంలో మాజీ వరలల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి, 26 ఏళ్ల అంకితా భకత్, 18 ఏళ్ల భజన్ కౌర్ పాల్గొంటున్నారు. దీపిక ఒలింపిక్స్‌లో పోటీపడటం ఇది నాలుగోసారి.ఇక పురుషుల విభాగంలో తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, పర్వీన్ రమేశ్ జాదవ్ ఈసారి విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ ఆర్చరీలో భారత్‌కు ఇంత వరకు ఒక్కసారి కూడా పతకం లభించలేదు.ర్యాంకింగ్ రౌండ్ ఫార్మాట్ ఇదీవ్యక్తిగత, టీమ్ ఈవెంట్ల ఆధారంగా ఆర్చర్లకు సీడింగ్ ఇస్తారు. అత్యుత్తమంగా రాణించిన ఆర్చర్లు, వారి బృందం తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.మెన్స్ టీమ్, వుమెన్స్ టీమ్ సీడింగ్స్‌ను ఆయా ఆర్చర్ల వ్యక్తిగత స్కోర్లను కలిపి నిర్ణయిస్తారు. టాప్ ఫోర్ సీడింగ్‌లో ఉన్న టీమ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెడతాయి. 5- 12 మధ్య సీడింగ్ ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తాయి.ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మెన్స్, వుమెన్స్ అత్యుత్తమ స్కోర్ల ఆధారంగా సీడింగ్ ఇస్తారు. అత్యుత్తమ సీడింగ్‌లో ఉన్న 16 జట్లు మాత్రమే ఫైనల్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తాయి. -
తనది.. ఎదురు లేని బాణం!
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలు.. వరల్డ్ కప్‌లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో కాంస్యం, 18 ఏళ్ల వయసులోనే తొలి సారి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్.. ఇదీ ఆమె బయోడేటా. ఇక మిగిలింది ఒలింపిక్స్ పతకమే. గతంలో మూడు ప్రయత్నాలు ఆమెకు తగిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఇప్పుడు మరింత శ్రమతో, పట్టుదలతో నాలుగోసారి ఒలింపిక్స్ సమరానికి ఆమె సిద్ధమైంది. దేశంలోనే వెనుకబడిన ఒక ప్రాంతం నుంచి వచ్చే దేశం గర్వించేలా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన ఆమె పేరే దీపికా కుమారి. భారత ఆర్చరీకి సంబంధించి ఆల్‌టైమ్ గ్రేట్. ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు, ఘనతలతో విలువిద్యలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని దీపికా ప్రస్థానం అసాధారణం, ఎందరికో స్ఫూర్తిదాయకం.దీపికాకు ఆర్చరీ అనే ఒక క్రీడ ఉంటుందనే విషయం కూడా చిన్నప్పుడు తెలీదు. సహజంగానే ఆమె నేపథ్యమే అందుకు కారణం. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్ నుంచి ఆమె వచ్చింది. రాంచీకి సమీపంలోని రాతూ చట్టీ అనే గ్రామం స్వస్థలం. తండ్రి ఆటోడ్రైవర్ కాగా, తల్లి నర్సుగా పని చేస్తోంది. కుమ్మరి కుటుంబ నేపథ్యం కారణంగా అప్పుడప్పుడు ఆ పనుల ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేది.చాలామంది పిల్లల్లాగే రాళ్లతో చెట్ల పైనున్న పళ్లను కొట్టడం లాంటి అల్లరి పనులు తనూ చేసేది. దీనివల్ల ఒక్కసారిగా విల్లు ఆమె చేతికి వచ్చేయలేదు. ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువు ఒకరికి ఆర్చరీపై మంచి అవగాహన ఉంది. రాళ్లు విసరడంలో కూడా దీపికా కచ్చితత్వం ఆయనను ఆకర్షించింది.దాంతో ఈమెను సానబెట్టవచ్చనే ఆలోచన వచ్చింది. అయితే సహజంగానే తండ్రి నవ్వి ఊరుకున్నాడు. నేనేంటీ, నా కూతురికి ఆటలేంటీ అంటూ వదిలేశాడు. అయితే అప్పటికే ఆర్చరీలో శిక్షణ పొందుతున్న దీపికా కజిన్ ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ ముండా భార్య మీరా ముండా ఒక ఆర్చరీ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. దీపికాను అక్కడకు తీసుకెళ్లి చేర్పించారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. అక్కడే అసలైన ఆర్చరీ ఆటపై ఆమెకు అవగాహన ఏర్పడింది.2024,వరల్డ్ కప్ సిల్వర్ మెడల్‌తో, 2018, వరల్డ్ కప్ గోల్డ్ మెడల్‌తో..టాటా అండదండలతో మలుపు..ఆర్చరీలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత దీపికా తర్వాతి మజిలీ మరో పెద్ద కేంద్రానికి మారింది. జంషెడ్‌పూర్‌లో ఉన్న టాటా ఆర్చరీ అకాడమీ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రం. టాటా అండదండలు, ఆర్థిక సహకారంతో ఎంతోమంది గొప్ప ఆర్చర్లుగా ఎదిగారు. ప్రతిభ ఉంటే చాలు అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభించడమే కాదు, ఆటగాళ్లకు స్టైపెండ్ కూడా లభిస్తుంది. దీపికాకు ఇంతకంటే కావాల్సిందేముంది అనిపించింది.తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు అదే సొంతిల్లు అయింది. అక్కడ మొదలైన గెలుపు ప్రస్థానం మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా సాగిపోయింది. టాటా అకాడమీ సభ్యురాలిగానే మరింత పదునెక్కిన దీపికా ఆట గొప్ప విజయాలను అందించింది. అంతర్జాతీయ జూనియర్, యూత్ స్థాయిల్లో పతకాలు సాధించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది.అన్నీ ఘనతలే..2010.. న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు. సొంతగడ్డపై ప్రతి క్రీడాంశంలోనూ భారత ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదే జాబితాలో ఆర్చరీ ఫలితాలు కూడా చర్చకు తెర తీశాయి. 16 ఏళ్ల దీపికా రికర్వ్ విభాగంలో రెండు స్వర్ణాలతో మెరిసి తన రాకను ఘనంగా చాటింది. అటు వ్యక్తిగత, ఇటు టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు ఆమె ఖాతాలో చేరాయి. రెండేళ్ల తర్వాత తొలి వరల్డ్ కప్ మెడల్‌తో ఆమె మెరిసింది.వరుస విజయాలు దీపికాను అందరికంటే అగ్రభాగాన నిలబెట్టాయి. ఫలితంగా ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన అధికారిక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె మొదటిసారి నంబర్ వన్‌గా నిలిచింది. కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం నుంచి వచ్చి కొరియా, చైనాలాంటి ఆర్చర్లతో పోటీ పడి శిఖరాన నిలిచిన క్షణం అందరూ గర్వపడేలా చేసింది. ఈ ఘనత సాధించిన రోజున తండ్రి శివ్‌చరణ్ చూపించిన ఆనందం, ఆయన సంబరం మాటల్లో చెప్పలేనిది.భర్త అతాను దాస్‌తో, తల్లిదండ్రులతో..అవార్డులు, రివార్డులు..దీపికా ఘనతలకు సహజంగానే అన్ని వైపుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహకాలు లభించాయి. అంతర్జాతీయ వేదికల్లో విజయాలు సాధించిన ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆమెను అంతా చూడలేదు. పేద కుటుంబం, వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆమెను స్ఫూర్తిగా తీసుకునేలా ఉన్న కెరీర్ చాలామందికి దిశను చూపించింది.ముఖ్యంగా అమ్మాయిల కోణంలో చూస్తే ఆమె ఎదిగిన తీరు అసాధారణం. ప్రతిభ, పోరాటతత్వం, కష్టపడే లక్షణం ఉంటే విజయాలు కచ్చితంగా వస్తాయని దీపికా నిరూపించింది. వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదిగిన ఏడాదే 2012లో కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారం అర్జునతో ఆమెను గౌరవించింది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు కూడా ఆమె చెంతకు చేరింది. 20 ఏళ్ల వయసులోనే పలు ఘనతలు సాధించిన దీపికాకు ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘30 అండర్ 30’లో చోటు కల్పించి ఆమె ప్రత్యేకతను ప్రపంచానికి చూపించింది.అన్నింటినీ మించి ఆమె కెరీర్లో హైలైట్‌గా నిలిచిన అంశం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ. దీపికా విజయగాథను పెద్ద స్థాయికి తీసుకెళ్లి చూపించాలనే సంకల్పంతో ఉరాజ్ బహల్, షా బహల్ అనే రూపకర్తలు దీపికా కెరీర్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేశారు. ‘లేడీస్ ఫస్ట్’ పేరుతో వచ్చిన ఈ అద్భుత డాక్యుమెంటరీలో ఆమె జీవితం, పోరాటం, విజయాల గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు నగరాల్లో దీనిని ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ప్రదర్శించడం విశేషం.ఒకే ఒక లక్ష్యంతో..ఐదేళ్ల క్రితం పారిస్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో మూడు విభాగాల్లో (వ్యక్తిగత, మిక్స్డ్, టీమ్) విభాగాల్లో దీపికా మూడు స్వర్ణాలు గెలుచుకుంది. ఇలా వరల్డ్ కప్‌లో ట్రిపుల్ గోల్డ్ సాధించడం ఆర్చర్ సత్తాకు ఉదాహరణ. కానీ తన సుదీర్ఘ కెరీర్లో 13వ సారి ఇలాంటి ఫీట్‌ను నమోదు చేసి అరుదైన ఆర్చర్ల జాబితాలో దీపికా పేరు లిఖించుకుంది. ఇలా ఎన్నో రికార్డులు ఆమె ఖాతాలో చేరినా, ఒలింపిక్స్ పతకం మాత్రం ఇంకా లోటుగానే ఉంది.వరుసగా 2012, 2016, 2021 ఒలింపిక్స్‌లలో ఆమె పాల్గొంది. మెగా ఈవెంట్‌కు ముందు ఫామ్‌లో ఉండి, ఒక దశలో నంబర్‌వన్‌గా కూడా ఉండి అంచనాలు రేపినా, దురదృష్టవశాత్తూ వేర్వేరు కారణాలతో ఆమెకు పతకం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి నాలుగో ప్రయత్నంలో కల నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందులో ఆమెకు భర్త అతాను దాస్ అండగా నిలుస్తున్నాడు. సహచర ఆర్చర్, వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అతాను దాస్‌ను నాలుగేళ్ల క్రితం దీపికా పెళ్లి చేసుకుంది.వీరికి వేదిక పేరుతో ఒక పాప ఉంది. సహజంగానే అమ్మగా మారిన తర్వాత ఆటకు కొంత విరామం ఇచ్చింది. ఇక ఆమె కెరీర్ ముగిసినట్లు అనిపించింది. అయితే రెట్టింపు సాధనతో కొన్నాళ్ల క్రితమే మళ్లీ బరిలోకి దిగి దీపికా సత్తా చాటింది. ముందుగా జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయాలతో పాటు ఇప్పుడు ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. పారిస్‌పై ఆమె ఎక్కు పెట్టే బాణం సరైన లక్ష్యాన్ని చేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
భారత మహిళల ఆర్చరీ జట్టు: ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావాలంటే!
అంటాల్యా (టర్కీ): టాప్–4లో నిలిచి దర్జాగా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించాలనుకున్న భారత మహిళల ఆర్చరీ జట్టుకు నిరాశ ఎదురైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో దీపిక కుమారి, అంకిత, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు రెండో రౌండ్లోనే వెనుదిరిగింది.భారత జట్టు 3–5 (51–51, 55–52, 53–54, 52–54)తో వెరోనికా, అనస్తాసియా, ఒలాలతో కూడిన ఉక్రెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరిన చైనా, చైనీస్ తైపీ, మలేసియా, బ్రిటన్ జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.క్వాలిఫయింగ్ టోర్నీ లో ఓడినప్పటికీ భారత జట్టుకు వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందే చివరి అవకాశం మిగిలి ఉంది. ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ ముగిశాక ఈనెల 24న ప్రపంచ ర్యాంకింగ్స్ విడుదల చేస్తారు.ఇప్పటికీ ఒలింపిక్స్‌కు అర్హత పొందని రెండు ఉత్తమ ర్యాంక్ జట్లకు ‘పారిస్’ బెర్త్‌లు ఖరారవుతాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్, జర్మనీ, కొరియా, మెక్సికో, నెదర్లాండ్స్, అమెరికా, చైనా, చైనీస్ తైపీ, మలేసియా, బ్రిటన్ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. చివరి రెండు బెర్త్‌లను వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా ఖరారు చేస్తారు. -
బిడ్డకు జన్మనిచ్చాక 20 రోజులకే విల్లు పట్టనున్న దీపిక
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి గత నెల పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. కేవలం 20 రోజుల బాలింత అయిన ఆమె విల్లుపట్టేందుకు సిద్ధమైంది. కోల్‌కతాలో రేపటి నుంచి జరిగే జాతీయ సీనియర్ ఓపెన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వచ్చింది. ‘ట్రిపుల్ ఒలింపియన్’ అయిన ఈ సీనియర్ ఇందులో పాల్గొనకపోతే మొత్తం ఏడాదంతా జట్టుకు దూరమవుతుంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో తనకీ ట్రయల్స్ కీలకమని ‘అమ్మ’ దీపిక చెప్పింది. -
దీపిక బృందానికి రజతం
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీని భారత్ రజత పతకంతో ముగించింది. ఆదివారం జరిగిన మహిళల టీమ్ రికర్వ్ ఫైనల్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. చైనీస్ తైపీ జట్టుతో జరిగిన ఫైనల్లో దీపిక బృందం 1–5తో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట స్వర్ణం నెగ్గగా... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ రజతం సాధించింది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
Archery World Cup: దీపికకు త్రుటిలో చేజారిన కాంస్యం
యాంక్టన్ (యూఎస్ఏ): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో భారత ఆర్చర్ దీపికా కుమారి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మహిళల రికర్వ్ విభాగంలో గురువారం జరిగిన కాంస్య పతకం పోరులో ఆమె 5–6తో మిచెల్లే క్రొప్పెన్ (జర్మనీ) చేతిలో ఓడింది. ఐదు సెట్లు ముగిసిన తర్వాత ఇద్దరు ఆర్చర్లు 5–5తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ అనివార్యమైంది. ఇక్కడ ఇరు ఆర్చర్లకు చెరో బాణం సంధించాల్సి ఉంటుంది. మిచెల్లే తొమ్మిది పాయింట్లను స్కోరు చేయగా... దీపిక ఆరు పాయింట్లను మాత్రమే సాధించింది. దాంతో దీపిక కాంస్యాన్ని చేజార్చుకుంది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో స్వెత్లానా గొంబోవా (రష్యా)పై నెగ్గి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే అక్కడ దీపిక 2–6తో ఎలెనా ఒసిపోవా (రష్యా) చేతిలో ఓడి కాంస్యం కోసం పోటీలో నిలిచింది. మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో అభిõÙక్ వర్మ 142–146 స్కోర్ తేడాతో బ్రాడెన్ గెలెన్‌తీన్ (అమెరికా) చేతిలో ఓడాడు. చదవండి: Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా... -
టోక్యో ఒలింపిక్స్: ఆర్చరీలో క్వార్టర్స్ చేరిన దీపికాకుమారి
-
Tokyo Olympics:జపాన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం
జపాన్‌పై భారత హాకీ జట్టు విజయం టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకొని పోతున్నది. పూల్ ఏలో భాగంగా శుక్రవారం జపాన్ తో జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తొలి క్వార్టర్ ప్రారంభంలోనే హర్మన్ ప్రీత్ సింగ్ అద్భుతమైన గోల్ తో భారత్ కి శుభారంభాన్ని అందించాడు. రెండవ క్వార్టర్ ఆరంభంలోనే భారత్ మరో గోల్ ని సాధించి తమ ఆదిక్యతను 2-0 కి పెంచుకుంది.ఇక మూడో క్వార్టర్లో పుంజుకున్న జపాన్ వరుస గోల్స్‌తో 2-2తో సమం చేసింది. ఇక నాలుగవ క్వార్టర్లో భారత్ తన పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి లీడ్ 4-2 కి పెంచుకుంది . చివర్లో జపాన్ మరో గోల్ ని సాధించిడంతో 5-3 తేడా తో మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే అర్జెంటీనాపై గెలుపుతో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్ పూల్ ఏలో రెండవ స్థానంలో ఉంది. Time to end our pool stage on a high with a win against Japan. 💪 🇯🇵 0:0 🇮🇳https://t.co/FEfTJeTHxK#JPNvIND #HaiTayyar #IndiaKaGame #TeamIndia #Tokyo2020 #TokyoTogether #Cheer4India #StrongerTogether #HockeyInvites #WeAreTeamIndia #Hockey pic.twitter.com/hcTX6RC2pC — Hockey India (@TheHockeyIndia) July 30, 2021 టోక్యో ఒలింపిక్స్: టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌కు సెమీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అలెగ్జాండర్ (జర్మనీ) చేతిలో అతడు పరాజయం పాలయ్యాడు. మెరిసిన తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు సెమీస్‌కు చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అకానా యమగూచిని ఓడించి సగర్వంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా రెండు సెట్లలో 4వ సీడ్ యమగూచిపై పైచేయి సాధించి... 21-13, 22-20 తేడాతో సింధు గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి గేమ్ పీవీ సింధుదే టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యమగూచిపై తొలి గేమ్‌లో పీవి సింధు 21-13తో విజయం సాధించింది. క్వార్టర్స్‌లో దీపికా కుమారి ఓటమి ►ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి పోరు ముగిసింది. కొరియాకు చెందిన ఆర్చర్ ఆన్ సాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 0-6 తేడాతో పరాజయం పాలైంది. అంతకముందు రౌండ్ ఆఫ్ 8లో పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది భారత మహిళల హాకీ జట్టు తొలి విజయం ►టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఫూల్ ఏలో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో గెలుపొందింది. ఆటలో వచ్చిన ఏకైక గోల్ భారత్ నుంచి నవనీత్ కౌర్ ఆట 25వ నిమిషంలో వచ్చింది. ఈ మ్యాచ్ విజయానికి ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చెందిన భారత మహిళల జట్టు క్వార్టర్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే లీగ్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి మ్యాచ్‌ను గెలవడంతో పాటు మిగతా జట్ల ఓటములపై టీమిండియా వుమెన్స్ ఆధారపడాల్సి ఉంది. 100 మీటర్ల హీట్ రేసులో ద్యుతిచంద్ విఫలం ►ఒలింపిక్స్‌లో భాగంగా 100 మీటర్ల హీట్ విభాగంలో భారత మహిళ అథ్లెట్ ద్యుతిచంద్ నిరాశపరిచింది. హీట్ 1 విభాగంలో 100 మీ రేసును ఆమె 11.54 సెకన్లలో పూర్తి చేసి 7వ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం ►బాక్సింగ్‌లో భారత బాక్సర్ లవ్లీనా కొత్త చరిత్ర సృష్టించింది. బాక్సింగ్‌లో సెమీస్‌కు చేరి నూతన అధ్యాయాన్ని లిఖించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లవ్లీనా 69 కేజీల విభాగంలో అదరగొట్టింది. మాజీ వరల్డ్ చాంపియన్, చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ నైన్ చిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకుపోయింది. తద్వారా భారత బాక్సింగ్ కేటగిరీలో కనీసం కాంస్యం పతకం ఖాయమైంది. ప్రీక్వార్టర్స్‌లో వెనుదిరిగిన సిమ్రన్‌జిత్ కౌర్ ►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ నిరాశపరిచింది. థాయ్‌లాండ్‌కు చెందిన సుదాపోర్న్ సీసోండీతో జరిగిన బౌట్లో 0-5 తేడాతో పరాజయం పాలైంది. భారత మహిళా షూటర్లకు నిరాశ ►టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్లకు నిరాశే ఎదురైంది. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో 290 పాయింట్లతో మనుబాకర్ 15వ స్థానంలో.. 286 పాయింట్లతో సర్నబోత్ రహీ 32వ స్థానంలో నిలిచింది. దీంతో వారిద్దరు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయారు. ఆర్చరీ: క్వార్టర్స్‌కు చేరిన దీపికా కుమారి ►ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి క్వార్టర్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 8లో భాగంగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించింది. పెరోవాతో జరిగిన మ్యాచ్‌లో 5 సెట్లలో దీపిక రెండు సెట్లను గెలవగా... పెరోవా రెండు సెట్లను గెలిచింది. మరొక సెట్ టై అవడంతో స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. ఆ తరువాత జరిగిన షూట్ అవుట్ లో రష్యన్ ఆర్చర్ పెరోవా 7 పాయింట్లు మాత్రమే కొట్టగా... దీపిక 10 పాయింట్లతో అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్: మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్: దీపిక కుమారి*సెనియా పెరోవా (రష్యా); ఉదయం గం. 6 నుంచి; క్వార్టర్ ఫైనల్ (దీపిక గెలిస్తే): ఆన్ సాన్ (కొరియా) లేదా రెన్ హయకావా (జపాన్); ఉదయం గం. 11:30 నుంచి... సెమీఫైనల్ మధ్యాహ్నం గం. 12:15 నుంచి; కాంస్య పతకం కోసం మధ్యాహ్నం గం. 1:00 నుంచి; స్వర్ణ, రజత పతకం కోసం మధ్యాహ్నం గం. 1:15 నుంచి షూటింగ్ మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్: మనూ భాకర్, రాహీ (ఉదయం గం. 5:30 నుంచి); ఫైనల్ (మనూ, రాహీ అర్హత సాధిస్తే): ఉ. గం. 10.30 నుంచి .. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్: మనూ భాకర్, రాహీ (ఉదయం గం. 5:30 నుంచి); ఫైనల్ (మనూ, రాహీ అర్హత సాధిస్తే): ఉ. గం. 10.30 నుంచి బాక్సింగ్: మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: సిమ్రన్ జిత్ కౌర్*సుదాపోర్న్ సీసోండీ (థాయ్‌లాండ్); ఉదయం గం. 8:18 నుంచి; మహిళల 69 కేజీల క్వార్టర్ ఫైనల్: లవ్లీనా బొర్గోహైన్*నియెన్ చిన్ చెన్ (చైనీస్ తైపీ) ఉదయం గం. 8:48 నుంచి అథ్లెటిక్స్: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్–1 హీట్: అవినాశ్ సాబ్లే ఉదయం గం. 6:17 నుంచి; పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ రౌండ్–1 హీట్–5: జాబిర్ ఉదయం గం. 8:27 నుంచి; మహిళల 100 మీటర్ల రౌండ్–1 హీట్స్: ద్యుతీ చంద్ ఉదయం గం. 8:45 నుంచి; మిక్స్డ్ 4*400 మీటర్ల రిలే రేస్ రౌండ్–1 హీట్–2: సాయంత్రం గం. 4:42 నుంచి బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్: పీవీ సింధు* అకానె యామగుచి (జపాన్); మధ్యాహ్నం గం. 1:15 నుంచి ఈక్వెస్ట్రియన్ : ఈవెంటింగ్ డ్రెస్సెజ్ తొలి రోజు సెషన్–2: ఫౌద్ మీర్జా మధ్యాహ్నం గం. 2 నుంచి గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్–2: అనిర్బన్ లాహిరి, ఉదయన్మానె ఉదయం గం. 4 నుంచి సెయిలింగ్ : పురుషుల స్కిఫ్ 49ఈఆర్ రేసు 7, 8 ,9: కేసీ గణపతి, వరుణ్ ఠక్కర్ ఉదయం గం. 8: 35 నుంచి; మహిళల రేడియల్ రేసు 9, 10: నేత్రా కుమనన్ ఉదయం గం. 8:35 నుంచి; పురుషుల లేజర్ రేసు 9, 10: విష్ణు శరవణన్ ఉదయం గం. 11:05 నుంచి హాకీ : మహిళల పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్: భారత్ * ఐర్లాం డ్ ఉదయం గం. 8:15 నుంచి; పురుషుల పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్: భారత్ * జపాన్ మధ్యాహ్నం గం. 3 నుంచి చదవండి:Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు.. -
10 ఏళ్ల క్రితమే నంబర్‌వన్.. మరి ఒలింపిక్స్ పతకం?
సాక్షి, వెబ్‌డెస్క్: దీపికా కుమారి.. మహిళా ఆర్చరీ నంబర్‌వన్ ప్లేయర్. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున అడుగుపెట్టిన ఏకైక మహిళా ఆర్చరీ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు దీపికా సొంతం.. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఆమె ఖాతాలో పతకం కూడా లేదు. ఈసారి కోటి ఆశలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీపికా కుమారి.. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో పోరుకు సిద్దమైంది. వరల్డ్‌నంబర్‌వన్ ట్యాగ్‌తో ఒలింపిక్స్ విలేజ్‌కు వెళ్లిన దీపిక పతకం సాధిస్తుందనే అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణించలేదు.. టోక్యో ఒలింపిక్స్ తొలి రోజు శుక్రవారం(23-07-2021)తొలి రోజు క్వాలిఫికేషన్ రౌండ్లో మాత్రం దీపికా అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. వరల్డ్నంబర్గా బరిలోకి దిగిన దీపిక తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్- 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 10 ఏళ్ల క్రితమే వరల్డ్ నంబర్‌వన్.. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. అంటే సుమారు 10 ఏళ్ల క్రితమే దీపిక వరల్డ్నంబర్గా నిలవగగా, 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌కు టాప్ సీడ్‌గా వెళ్లారు. ఇక్కడ చదవండి: Tokyo Olympics 2020: భారత్ ఎన్ని పతకాలు గెలుస్తుంది?! ఒలింపిక్స్ ముందు గోల్డెన్ హ్యాట్రిక్ టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొన్న చివరి టోర్నమెంట్లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది. ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న దీపికా కుమారి.. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్‌కు పతకం రాలేదు. ప్రధానంగా ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లలో విఫలం అవుతున్న దీపికా.. ఆ అడ్డంకిని అధిగమించాలనే పట్టుదలతో ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో రౌండ్ 16ను దాటలేకపోయిన దీపిక.. 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. ఈసారి పతకమే లక్ష్యంగా పోరుకు సిద్దమైన దీపిక ఎలా రాణిస్తుందో చూడాలి. -
టోక్యో ఒలింపిక్స్: ఆర్చరీ సీడింగ్ రౌండ్లో దీపికకు 9వ స్థానం
టోక్యో: ప్రపంచ నంబర్‌వన్, భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ విభాగం వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్లో నిరాశపరిచింది. శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. ఇక సీడింగ్ రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్ సాన్ ఆన్ 680 పాయింట్లతో రికార్డు సృష్టించింది. క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి ప్రస్తుతం క్వాలిఫికేషన్ రౌండ్లో 9వ ర్యాంక్ సంపాదించింది. అయితే జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్ 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక పాల్గొననుంది. ఆమె భూటాన్‌కు చెందిన కర్మతో రౌండాఫ్ 32లో తలపడనున్నది. India🇮🇳 begins its #Tokyo2020 journey with @ImDeepikaK finishing 9th with a score of 663 in the Women’s recurve archery ranking round. South Korea’s 🇰🇷 An San created a new #Olympic record with a score of 680. Send in your wishes for #TeamIndia with #Cheer4India pic.twitter.com/0QKAImz6YI — SAIMedia (@Media_SAI) July 23, 2021 -
దీపిక... వరల్డ్ నంబర్‌వన్
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినందుకు భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారికి తగిన ప్రతిఫలం లభించింది. సోమవారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27 ఏళ్ల దీపిక రికర్వ్ వ్యక్తిగత విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించింది. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంక్‌లో ఉన్న దీపిక తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు పురోగతి సాధించి 263.7 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌ను అందుకుంది. లీసా బార్బెలిన్ (ఫ్రాన్స్–225.5 పాయింట్లు) తొలి ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోగా... కాంగ్ చె యంగ్ (దక్షిణ కొరియా–208 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి 2012లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన దీపిక ఆ తర్వాత నిలకడగా టాప్–10లో కొనసాగింది. పారిస్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో దీపిక రికర్వ్ టీమ్ విభాగంలో, మిక్స్డ్ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు నెగ్గి ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో దీపిక అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పతకాలు సాధించింది. కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే ఆమెను ఊరిస్తోంది. ప్రపంచకప్ టోర్నీలలో 35 పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో ఒక పతకం... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు ఆమె సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో తొలి రౌండ్లో... వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్లో వెనుదిరిగిన దీపిక 2016 రియో ఒలింపిక్స్‌లో టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో... వ్యక్తిగత విభాగంలో మూడో రౌండ్లో ఓడిపోయింది. వచ్చే నెలలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దీపిక కేవలం వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది. -
దీపిక ధమాకా
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొంటున్న చివరి టోర్నమెంట్లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. ముందుగా తన భాగస్వాములు అంకిత భకత్, కోమలిక బరిలతో కలిసి మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న 27 ఏళ్ల దీపిక మిక్స్డ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. అనంతరం వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ దీపిక అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అనా వాజ్క్వెజ్, ఐదా రోమన్, వలెన్సియాలతో కూడిన మెక్సికో మహిళల జట్టుతో జరిగిన రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత బృందం 5–1తో నెగ్గింది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ దీపిక, అంకిత, కోమలిక బృందం స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం విశేషం.రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో దీపిక కుమారి–అతాను దాస్ జంట 5–3తో గ్యాబీ ష్కాలెసర్–ఎస్జెఫ్ వాన్ డెన్ బెర్గ్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6–0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలిచి విజేతగా నిలిచింది. దీపిక వరుసగా మూడు సెట్లు (29–26; 29–28; 28–27) గెలిచి ప్రత్యర్థికి తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. సెమీఫైనల్లో దీపిక 6–2తో అనా వాజ్క్వెజ్ (మెక్సికో)ను ఓడించింది. మూడు స్వర్ణాలు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మున్ముందూ ఇదే తరహాలో నా ప్రదర్శన ఉండాలి. ప్రపంచకప్ టోర్నీలకు దూరంగా ఉన్న కొరియా, చైనా, జపాన్, చైనీస్ తైపీ క్రీడాకారిణుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. నా ఆటలోని లోపాలను సరిదిద్దుకుంటూ టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా. – దీపిక కుమారి భార్యభర్తలు అతాను, దీపిక స్వర్ణ చుంబనం -
సెమీస్‌లో దీపిక, అతాను దాస్
గ్వాటెమాలా సిటీ: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ ఆర్చర్లు, భార్యభర్తలైన దీపిక కుమారి, అతాను దాస్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో దీపిక కుమారి 6–0తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలుపొందగా... అంకిత 2–6తో అలెజాండ్రా వలెన్సియా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో 6–4తో ఎరిక్ పీటర్స్ (కెనడా)పై గెలుపొందాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండో రౌండ్లో 5–6తో డానియల్ క్యాస్ట్రో (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత జట్టు 4–5తో గార్సియా, క్యాస్ట్రో, పాబ్లోలతో కూడిన స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో మహిళల జట్టు మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, అంకిత, కోమలికలతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 6–0తో ఇలియా, ఇనెస్, లెరీ ఫెర్నాండెజ్‌లతో కూడిన స్పెయిన్‌పై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో నాన్సీ, సింతియా, కామిలాలతో కూడిన గ్వాటెమాలా జట్టును ఓడించింది. -
సరిలేరు ఆమెకెవ్వరు...
ఆమె గరిటె తిప్పితే.... కడుపు నిండుతుంది. ఆమె పాట పాడితే... మనసు పరవశిస్తుంది. ‘ఆమె’ ఆట ఆడితే... విజయమే బానిసవుతుంది. పతకం మురిసిపోతుంది. యావత్ దేశం గర్వపడేలా చేస్తుంది. ఆమె ఇప్పుడు ఆకాశంలోనే సగం కాదు... ఆటల్లోనూ ఘనం. క్రీడా సమరంలో క్రియాశీలం. ఇంకా చెప్పాలంటే ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ వీరనారిత్వమే పతకాలను తెచ్చిపెడుతోంది. వ్యక్తిగత క్రీడల్లో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్, తెలుగుతేజం కరణం మల్లీశ్వరి త్రివర్ణ శోభితం చేస్తే... 2012 లండన్ ఒలింపిక్స్‌లో షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీకోమ్... 2016 రియో ఒలింపిక్స్‌లో షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లే పతకాలు, శతకోటి భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో, అంతే కదన కుతూహలంతో ‘టోక్యో’ వెళ్లేందుకు కష్టపడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశల పల్ల్లకిని మోయనున్న షట్లర్ సింధు, బాక్సర్లు మేరీకోమ్, సిమ్రన్‌జిత్, పూజా రాణి, లవ్లీనా, ఆర్చర్ దీపిక కుమారి, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళా షూటర్లు మనూ భాకర్, రాహీ సర్నోబత్, ఇలవేనిల్ వలారివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా, తేజస్విని సావంత్, యశస్విని సింగ్, చింకీ యాదవ్, అథ్లెట్స్ భావన, ప్రియాంక గోస్వామి, రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు సభ్యులకు మనసారా కంగ్రాట్స్ చెబుదాం. విమెన్ ఇండియా... విన్ ఇండియా. కేవలం ఒలింపిక్ క్రీడాంశాల్లోనే కాకుండా నాన్ ఒలింపిక్ క్రీడల్లోనూ భారత మహిళా క్రీడా కారిణులు మెరిసిపోతున్నారు. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ మేధోసంపదతో రెండు దశాబ్దాలుగా ప్రపంచ చెస్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పదిహేను నెలల క్రితం ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో హంపి స్వర్ణ పతకాన్ని గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. బీబీసీ మీడియా సంస్థ అందించే ‘ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ క్రీడాకారిణి’ అవార్డు రేసులో రాణి రాంపాల్ (హాకీ), వినేశ్ (రెజ్లర్), మనూ భాకర్ (షూటింగ్), ద్యుతీ చంద్ (అథ్లెటిక్స్)లతో కలిసి హంపి బరిలో నిలిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసీ సంస్థ ఈరోజు విజేతను ప్రకటించనుంది. -
జూన్ 30న దీపిక–అతాను పెళ్లి
ఎట్టకేలకు భారత అగ్రశ్రేణి ఆర్చరీ జంట దీపికా కుమారి, అతాను దాస్‌ల వివాహానికి ముహూర్తం కుదిరింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే ఈ నెల 30న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినా... వేర్వేరు కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. గత సంవత్సరమే పెళ్లి చేసుకోవాలనుకున్నా బిజీ షెడ్యూల్ కారణంగా కుదర్లేదు. దాంతో టోక్యో ఒలింపిక్స్ ముగియగానే ఒకటి కావాలని భావించారు. అయితే కోవిడ్–19 కారణంగా ఒలింపిక్స్ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కరోనాతో కఠిన నిబంధనల మధ్య తక్కువ మంది అతిథులతోనే చేసుకోవాల్సి వస్తున్నా... ఇక వాయిదా వేసే పరిస్థితి లేదని, పెళ్లికి ఇంతకంటే సరైన సమయం లభించదని దీపిక వెల్లడించింది. -
విల్లు వదిలి వంట గదిలో...
కోల్‌కతా: టోక్యో ఒలింపిక్స్ తర్వాత పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న ఆ జంటకు కరోనా ‘శరా’ఘాతంలా తగిలింది. మెగా ఈవెంట్ ఏకంగా ఏడాదిపాటు వాయిదా పడటంతో వారి ప్రణాళిక మారిపోయింది. ఒలింపిక్స్‌కు సమయముంది కాబట్టి ఇక ముందుగా పెళ్ళికే వీరిద్దరు సిద్ధమైపోతున్నారు. భారత అగ్రశ్రేణి ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ గురించే ఇదంతా. వీరిద్దరి నిశ్చితార్థం జరిగి దాదాపు రెండేళ్లవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వీరిద్దరు ఇప్పటికే అర్హత సాధించారు. రాంచీకి చెందిన దీపిక, ప్రస్తుతం కోల్‌కతాలో దాస్‌తో కలిసే ఉంటోంది. ఇప్పుడు లభించిన విరామంలో ఆమె దృష్టి ప్రస్తుతం విల్లంబులకంటే వంటగదిపైనే ఉంది. ఇదే విషయాన్ని తాను చెప్పుకుంది. ‘ఇప్పటివరకు నాకు అన్నం, కొంత వరకు పప్పు వండటం మాత్రమే వచ్చు. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. ముఖ్యంగా చికెన్ వంటకాలంటే ఇష్టం. రాంచీ నుంచి మా అమ్మ ఆన్లైన్లో ఇవన్నీ నాకు నేర్పిస్తోంది. ప్రాణాయామంతో రోజు మొదలు పెడితే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నా పని వంట నేర్చుకోవడమే’ అని దీపిక చెప్పింది. దీపిక, అతాను దాస్ కలిసి ప్రస్తుతం తమ ఇంట్లోనే ఐదు మీటర్ల తాత్కాలిక రేంజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి అసలు లక్ష్యంతో పోలిస్తే ఇది ఏమాత్రం లెక్కలోనికి రాదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఏమీ చేయలేం. ఒక రకంగా ఇది కంప్యూటర్ గేమ్లాంటిదే. కానీ కనీసం ఆర్చరీని మరచిపోకుండా ఇది గుర్తు చేస్తున్నట్లు, క్యాంప్ మొదలయ్యే సమయానికి ఆటపై ఆసక్తి పోకుండా ఉంచుతుందనేది మా నమ్మకం. కనీసం రెండు గంటల పాటు ఇలా సాధన చేస్తున్నాం’ అని దీపిక వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్ ముగియగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా... ఇప్పుడు కరోనా నుంచి అంతా సాధారణ స్థితికి మారగానే వివాహ ఏర్పాట్లు మొదలుపెడతామని వీరిద్దరు చెప్పారు. దీపిక 2012, 2016 ఒలింపిక్స్‌లలో, అతాను 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
వన్‌పవర్‌మెంట్
ఆట అంటేనే పవర్! షాట్ కొట్టడానికి పవర్. క్యాచ్ పట్టడానికి పవర్. షూట్ చెయ్యడానికి పవర్. లాగి వదలడానికి పవర్. పావులు కదపడానికి పవర్. పంచ్ ఇవ్వడానికి పవర్. స్ట్రయికర్ని విసరడానికి పవర్. అన్నిటా ఎంపవర్మెంట్ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్ చూపిస్తున్నారు. నెంబర్ వన్ స్థానంతో విజయానికే వన్‌పవర్‌మెంట్ తెస్తున్నారు. తల్లి కలనునిజం చేయాలని! సైనా (బ్యాడ్మింటన్) పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది. సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకొని! అపూర్వీ చండేలా (షూటింగ్) మహిళల షూటింగ్ క్రీడలో భారత్ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్ ఒలింపిక్స్ మార్చేశాయి. షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి. బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్‌లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. మకుటంలేని మహరాణి! హంపి (చెస్) మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్ ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్–10 బాలికల ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 1998లో అండర్–12... 2000లో అండర్–14 విభాగంలో ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2002లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకుంది. నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ! షఫాలీ వర్మ (క్రికెట్) భారత్‌లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 15 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్నో...ఎన్నెన్నో! సానియా మీర్జా (టెన్నిస్) ప్రపంచ మహిళల టెన్నిస్ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్‌కు చేరిన సానియా... 2007లో సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్ సాధించింది. సానియా 2009లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో... 2012లో మహేశ్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2014లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సొంతం చేసుకుంది. గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్‌తో జతగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్... 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్ ఓపెన్ టోర్నీలో నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (2015), పద్మభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ‘పంచ్’ మే దమ్ హై మేరీకోమ్ (బాక్సింగ్) క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్‌గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ రింగ్‌లో తన పంచ్ పవర్ చాటుకుంటోంది మణిపూర్ మెరిక మేరీకోమ్. 37 ఏళ్ల మేరీకోమ్ భారత్‌లో మహిళల బాక్సింగ్‌కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఒలింపిక్స్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలా ప్రతి మెగా ఈవెంట్లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్’.. ‘పద్మవిభూషణ్’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్‌ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి మేరీకోమ్ తన ఉజ్వల కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటోంది. సరదాగా మొదలై! అపూర్వ (క్యారమ్) వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్‌కు చెందిన ఎస్.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది. ఆటో డ్రైవర్ అమ్మాయి! దీపిక కుమారి (ఆర్చరీ) మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్ మహతో ఆటో డ్రైవర్‌కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్‌గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది. – కరణం నారాయణ -
పెళ్లి ‘గురి’ కుదిరింది...
రాంచీ: భారత ఒలింపియన్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ ‘ప్రేమ బాణం’ సరిగ్గా లక్ష్యాన్ని చేరింది. ఐదేళ్ల క్రితం తొలిసారి కుదిరిన గురి ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. మైదానంలో కలిసి ఆడిన, కలిసి పతకాలు పంచుకున్న క్రీడాకారులు జీవితాన్ని కూడా పంచుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరికి ఈ నెల 10న వివాహ నిశ్చితార్ధం రాంచీలో జరగనుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో పెళ్లి జరుగుతుంది. ఐదేళ్ల క్రితం కొలంబియాలో జరిగిన ప్రపంచకప్‌లో వీరిద్దరు కలిసి మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యం గెలిచారు. నాటి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. 24 ఏళ్ల దీపిక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది. 6 ప్రపంచకప్ పతకాలతో పాటు 2 కామన్వెల్త్ క్రీడల స్వర్ణాలు, ఆసియా క్రీడల కాంస్యం ఆమె ఖాతాలో ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల అతాను 4 ప్రపంచకప్ పతకాలు గెలుచుకున్నాడు. -
దీపిక ఖాతాలో కాంస్య పతకం
సామ్సన్ (టర్కీ): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ తమ పోరాటాన్ని కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి కాంస్య పతకాన్ని సాధించింది. లీసా ఉన్రూ (జర్మనీ)తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దీపిక ‘షూట్ ఆఫ్’లో విజయం సొంతం చేసుకుంది. నిర్ణీత ఐదు సెట్ల తర్వాత ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇద్దరూ బాణాన్ని 9 పాయింట్ల వృత్తంలోనే కొట్టారు. అయితే లీసా సంధించిన బాణంకంటే దీపిక బాణం 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌కు పతకం ఖాయమైంది. ఒక్కో సెట్లో ఇద్దరికీ మూడు షాట్ల చొప్పున అవకాశం ఇస్తారు. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ లభిస్తుంది. తొలి సెట్‌ను దీపిక 28–25తో సొంతం చేసుకోగా... రెండో సెట్‌ను లీసా 25–22తో గెల్చుకుంది. మూడో సెట్‌ను దీపిక 30–28తో కైవసం చేసుకోగా... నాలుగో సెట్ 28–28తో సమంగా ముగిసింది. ఐదో సెట్‌ను లీసా 29– 28తో నెగ్గడంతో ఇద్దరి స్కోర్లు 5–5తో సమమయ్యాయి. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో లీ చియెన్ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొంది... సెమీస్‌లో 3–7తో యాస్మీన్ అనాగోజ్ (టర్కీ) చేతిలో ఓడిపోయింది. స్వర్ణ పతక మ్యాచ్‌లో లీ యున్ గ్యాయోంగ్ (దక్షిణ కొరియా) 6–4తో యాస్మీన్‌పై గెలిచింది. ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలో దీపిక నెగ్గిన పతకాలు. 2011, 2012, 2013, 2015లలో ఆమె రజత పతకాలు గెలిచింది. -
ఏషియన్ గేమ్స్: 15 ఏళ్ల ‘సిల్వర్’ విహాన్
జకర్తా: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. గురువారం పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్లో 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం సాధించాడు. దీంతో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, పది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 17 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. 50 మీటర్ల బట్టర్ఫ్లై (స్విమ్మింగ్) విభాగంలో విర్ద్వాల్ ఖడే ఫైనల్‌కు అర్హత సాధించాడు. అతడు 24.09 సెకన్లలోనే ఫీట్‌ను పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకోల్పాడు మరోవైపు ఆర్చరీలో తీవ్ర నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య ఆసియా క్రీడల బరిలోకి దిగిన దీపికా కుమారి ప్రీక్వార్టర్స్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో చియాంగ్ యంగ్ లి (చైనీస్ తైపీ) చేతిలో 3-7 చేతిలో ఓటమి చవిచూశారు. -
దీపిక ‘పసిడి’ గురి
సాల్ట్ లేక్ సిటీ (అమెరికా): ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మరోసారి ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలో వ్యక్తిగత స్వర్ణం సాధించింది. సోమవారం ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్ లో ఈ జార్ఖండ్ అమ్మాయి విజేతగా నిలిచింది. ఫైనల్లో దీపిక 7–4తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలిచి 2012 తర్వాత ఈ టోర్నీలో పసిడి పతకం గెల్చుకుంది. దీంతో టర్కీలో ఈ ఏడాది చివర్లో జరిగే సీజన్ ముగింపు టోర్నీకి ఆమె అర్హత సాధించింది. మరోవైపు రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో దీపిక–అతాను దాస్ (భారత్) ద్వయం 4–5తో తాంగ్ చి చున్–తాన్ యా టింగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడింది. సురేఖ ర్యాంక్ 10: మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ పదో ర్యాంక్‌ను సాధించింది. ఈ ఏడాది జరిగిన మూడు ప్రపంచకప్ టోర్నీలలోనూ సురేఖ మిక్స్డ్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచింది.