దీపికా కుమారి(ఫైల్ ఫొటో)
యాంక్టన్ (యూఎస్‌ఏ): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో భారత ఆర్చర్ దీపికా కుమారి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మహిళల రికర్వ్ విభాగంలో గురువారం జరిగిన కాంస్య పతకం పోరులో ఆమె 5–6తో మిచెల్లే క్రొప్పెన్ (జర్మనీ) చేతిలో ఓడింది. ఐదు సెట్‌లు ముగిసిన తర్వాత ఇద్దరు ఆర్చర్లు 5–5తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ అనివార్యమైంది. ఇక్కడ ఇరు ఆర్చర్లకు చెరో బాణం సంధించాల్సి ఉంటుంది.
మిచెల్లే తొమ్మిది పాయింట్లను స్కోరు చేయగా... దీపిక ఆరు పాయింట్లను మాత్రమే సాధించింది. దాంతో దీపిక కాంస్యాన్ని చేజార్చుకుంది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో స్వెత్లానా గొంబోవా (రష్యా)పై నెగ్గి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే అక్కడ దీపిక 2–6తో ఎలెనా ఒసిపోవా (రష్యా) చేతిలో ఓడి కాంస్యం కోసం పోటీలో నిలిచింది. మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో అభిõÙక్ వర్మ 142–146 స్కోర్ తేడాతో బ్రాడెన్ గెలెన్‌తీన్ (అమెరికా) చేతిలో ఓడాడు.
Comments
Please login to add a commentAdd a comment