భారీగా కొలువులు కూడా...
కంపెనీ సీఈఓ క్రిస్టియన్ క్లీన్
న్యూఢిల్లీ: జర్మనీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్‌ఏపీ భారత్‌లో అపారమైన పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగాలను కలి్పంచే ప్రణాళికల్లో ఉందని కంపెనీ సీఈఓ క్రిస్టియన్ క్లీన్ చెప్పారు. తమకు అత్యంత వేగవంతమైన వృద్ధిని అందించడంతో పాటు భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కూడా భారత్ నిలుస్తుందన్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బెంగళూరు పర్యటనలో భాగంగా ఆయన విషయాలను వెల్లడించారు.
‘భారత్ టాప్–10 మార్కెట్లలో ఒకటి. ఈ ర్యాంక్ అంతకంతకూ ఎగబాకుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలపై భారీగా వెచ్చించనున్నాం. జర్మనీ తర్వాత ఇక్కడే కంపెనీకి అత్యధిక సిబ్బంది ఉన్నారు. ఇతర ఎస్‌ఏపీ ల్యాబ్‌లతో పోలిస్తే అసాధారణ రీతిలో నియమాకాలను చేపట్టనున్నాం. అతి త్వరలోనే అతిపెద్ద హబ్‌గా భారత్ ఆవిర్భవిస్తుంది. ఏఐ భారీ అవకాశాలను అందించనుంది. భారత్‌లోని ఏఐ నిపుణుల పనితీరు అద్భుతం’ అని క్లీన్ చెప్పారు. కాగా, భారత్‌లోని ఎస్‌ఏపీ ఆర్‌అండ్‌డీ సెంటర్లలో 15,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 15,000 కొలువులు కల్పించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment