రూ.6,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
‘ప్రాజెక్ట్ స్టార్‌లైట్’కు శ్రీకారం
వన్‌ప్లస్ ఇండియా సీఈవో రాబిన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ప్లస్ ప్రాజెక్ట్ స్టార్‌లైట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో వచ్చే మూడేళ్లలో రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. దశలవారీగా ఏటా రూ.2,000 కోట్లు వెచి్చంచనుంది. భారత్‌లో ఉత్పత్తులు, సేవలలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నట్టు వన్‌ప్లస్ గురువారం ప్రకటించింది.
ప్రాజెక్ట్ స్టార్‌లైట్ పెట్టుబడి మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని వివరించింది. మరింత మన్నికైన పరికరాలను తయారు చేయడం, అసాధారణ కస్టమర్ సేవలు, భారత మార్కెట్ కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేయడం ఇందులో ఉన్నాయి. పరికరాలను మరింత మన్నికైనదిగా చేయడానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ రెండు ముఖ్యమైన డిస్‌ప్లే టెక్నాలజీ పురోగతిని వెంటనే ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి డిస్‌ప్లేమేట్ ఏ++ డిస్‌ప్లే, వన్‌ప్లస్ యొక్క గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్‌ను రూపొందించడం ఇందులో భాగం.
భారత్ కస్టమర్ల కోసం..
కొత్త డిస్‌ప్లే రాబోయే ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో కొలువుదీరనుందని వన్‌ప్లస్ వెల్లడించింది. గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్ మొబైల్స్ కనిపించే ఆకుపచ్చని గీతలపట్ల ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ‘వివిధ సెట్టింగ్‌లలో మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక పరిష్కారాలను కూడా అమలు చేస్తున్నాం’ అని వన్‌ప్లస్ వివరించింది.
అత్యంత ప్రాధాన్య మార్కెట్..
‘వినియోగదారులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేయాలనే అంకితభావానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య మార్కెట్’ అని వన్‌ప్లస్ ఇండియా సీఈవో రాబిన్ లేవో తెలిపారు. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ తన సరీ్వస్ సెంటర్లను 2026 మధ్య నాటికి 50 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్లలో సగం వరకు అప్‌గ్రేడ్ చేయనుంది. 2024లో బ్రాండ్ సొంత ప్రత్యేక సేవా కేంద్రాలలో 11 శాతం పెరుగుదలతో సహా 22 శాతం మేర తన సరీ్వస్ సెంటర్లను పెంచినట్లు వన్‌ప్లస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment