sap
-
ఎస్‌ఏపీతో క్యాప్‌జెమినీ జట్టు.. 8,000 మందికి ట్రైనింగ్
ముంబై: ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ తాజాగా ఎస్ఏపీ ల్యాబ్స్‌తో చేతులు కలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 8,000 మంది వెనుకబడిన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు క్యాప్‌జెమినీ–ఎస్ఏపీ డిజిటల్ అకాడెమీ ప్రోగ్రాంను అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వనరుల సమీకరణ, నెట్‌వర్క్‌లు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. తమ కెరియర్లలో విజయాలను అందుకునేందుకు దేశ యువతకు సాధికారత కల్పించేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా ఎండీ సింధు గంగాధరన్ పేర్కొన్నారు. -
రెబల్‌గా మారుతున్న ఐటీ ఉద్యోగులు.. తలలు పట్టుకుంటున్న కంపెనీలు!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీలు స్వస్తి చెప్పేశాయి. కొంతకాలం హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మొత్తంగా ఆఫీస్‌కి రావాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీస్‌కు రాబోమంటూ ఎదురు తిరుగుతున్నారు. జర్మన్ సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (SAP) ఇటీవల రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తీసేసింది. దీంతో ఉద్యోగులు ఎదురుతిరిగారు. బలవంతంగా ఆఫీసులకు పిలిస్తే రాజీనామా చేస్తామంటూ సుమారు 5 వేల మంది ఉద్యోగులు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి అందరూ తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆన్-సైట్ వర్క్ గైడెన్స్ జారీ చేయడం ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు లొకేషన్ ఫ్లెక్సిబులిటీ ఇచ్చిన కంపెనీ ఆకస్మికంగా విధానాలను మార్చడం అసమంజసమని శాప్ యూరోపియన్ వర్క్స్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లైన్ మాత్రం ఉద్యోగులను సాంస్కృతికంగా దగ్గర చేయడం, మార్గదర్శకత్వం, ఉత్పాదకత వంటి వాటి కోసం క్యాంపస్ కో-లొకేషన్ చాలా అవసరమని నొక్కి చెబుతున్నారు. ప్రమోషన్లకు కీలకం.. రిమోట్, ఆన్-సైట్ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి హైబ్రిడ్ విధానంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను పరిశ్రమ ఉత్తమ పద్ధతులు, అంతర్గత అభ్యాసాలు తెలియజేస్తున్నాయని శాప్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు అనువైన పని అవకాశాన్ని కల్పించిన మొదటి టెక్ కంపెనీలలో శాప్ కూడా ఒకటి. కానీ 2022 తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఆన్-సైట్ వర్క్ విధానంపై దృష్టి పెట్టాయి. ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆఫీసుకి హాజరును నిర్ణయాత్మకంగా చూస్తున్నాయి. టీసీఎస్ కూడా.. ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా పెరగనున్న జీతాలు, ప్రమోషన్లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టు ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనట్లు నివేదికలు వచ్చాయి. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం కంపెనీ చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. -
ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ ఇండియా, ఐబీఎమ్‌లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది. ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు? ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్ఏపీ, ఐబీఎమ్లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి. -
SAP: ఏఐపై ఫోకస్.. 8,000 ఉద్యోగాలకు ఎసరు!
జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏపీ ఎస్ఈ (SAP SE) ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, కృత్రిమ మేధస్సు(AI)పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. దీంతో దాదాపు 8,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా 2023 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు ఎస్ఏపీ వివరించింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్ఆర్ఎస్ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్)యేతర ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది. అలాగే క్లౌడ్ సేల్స్ 20 శాతం పెరిగి 3.7 బిలియన్ యూరోలకు (రూ.33 వేల కోట్లు) చేరినట్లు వెల్లడించింది. -
ఆడుకుందాం రండి!
సాక్షి, అమరావతి : దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ‘ఆడుదాం–ఆంధ్ర’ పేరుతో దాదాపు 43 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీకి ఊరూవాడా ముస్తాబవుతున్నాయి. ఈ భారీ క్రీడా పండుగ నిమిత్తం ప్రభుత్వం ఈనెల 27 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ ‘ఆడుదాం–ఆంధ్ర’పై ప్రచారం కల్పించడంతో పాటు ఆసక్తి ఉన్న క్రీడాకారుల వివరాలను నమోదు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. ఇక పోటీలకు డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జవనరి 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులోని ఐదు క్రీడాంశాల్లో రికార్డు స్థాయిలో 2.99 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మూడు విధాలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ♦ రాష్ట్రంలోని 15,004 గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వలంటీర్లు ఈ పోటీలకు క్రీడాకారుల వివరాలను నమోదు చేయడంతోపాటు ప్రజలను క్రీడా మహోత్సవానికి ఆహ్వానిస్తారు. ♦ ఔత్సాహిక క్రీడాకారులు తమ పేరు, చిరునామా, ప్రాతినిధ్యం వహించే క్రీడల వివరాలను గుర్తింపు కార్డు ఐడీ/ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ♦ ఒకటి కంటే ఎక్కువ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులు ప్రాధాన్యత క్రమంలో పాల్గొనే క్రీడల వివరాలను అందించాలి. ♦ వలంటీర్ ఇంటికి వచ్చినప్పుడు లేదా క్రీడాకారులే నేరుగా తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి పోటీలకు తమ వివరాలు ఇవ్వొచ్చు. ♦ వ్యక్తిగతంగానే కాకుండా ఒక గ్రూపుగా కూడా క్రీడాకారులు తమ జట్టును నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ♦ ఇక ప్రభుత్వం తీసుకొచ్చే వెబ్సైట్ ద్వారా కూడా క్రీడాకారులు నేరుగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఐదు రకాల కాంపిటీటివ్ క్రీడాంశాలు, మూడు నాన్–కాంపిటీటివ్ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. వీటిల్లో 15 ఏళ్లకు పైబడిన బాలబాలికలకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడలతో పాటు సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఐదు దశల్లో అంటే.. గ్రామ/వార్డు సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రతి సచివాలయం నుంచి 10 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. సుమారు 1.50 లక్షల మంది వలంటీర్లకు క్రీడాంశాల నిర్వహణపై పీఈటీ, పీడీలతో జిల్లా చీఫ్ కోచ్‌ల సహాయంతో ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రత్యేక శిక్షణనిస్తోంది. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో బాలబాలిక విభాగాల్లో ఒక్కొక్క జట్టు చొప్పున లెక్కిస్తే 228 మంది పాల్గొంటారు. ఇలా మొత్తం 34.20లక్షల మంది క్రీడాకారుల ప్రాతినిధ్యం వహిస్తారని అంచనా. సచివాలయం పరిధిలో ఒకటికి మించి ఎక్కువ జట్లు వస్తే క్రీడాకారుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం.. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకర సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆడుదాం–ఆంధ్ర పేరుతో నిర్వహించే ఈ మెగా టోర్నీని దేశంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా నిలబెడతాం. దీనిద్వారా ఐదు క్రీడాంశాల్లో క్రీడాకారుల సమగ్ర వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. తద్వారా ప్రతిభగల క్రీడాకారులకు అవసరమైన క్రీడా శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించడానికి ఎంతో వీలుంటుంది. ప్రతి క్రీడాంశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పీఈటీలు, పీడీలు, శాప్ కోచ్‌లతో పాటు వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కోసం యాప్, వెబ్‌సైట్‌ను దాదాపు సిద్ధంచేశాం. క్రీడాకారులు వీలైనంత త్వరగా వివరాలు నమోదు చేసుకోవాలి.– ధ్యాన్‌చంద్, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వివిధ స్థాయిల్లో పోటీల నిర్వహణ ఇలా.. ♦ గ్రామ/వార్డు సచివాలయం: డిసెంబర్ 15 నుంచి 20 వరకు ♦ మండల స్థాయి : డిసెంబర్ 21 నుంచి జనవరి 4 వరకు ♦ నియోజకవర్గం : జనవరి 5 నుంచి 10 వరకు ♦ జిల్లా స్థాయి : జనవరి 11 నుంచి 21వరకు ♦ రాష్ట్రస్థాయి : జనవరి 22 నుంచి 26 వరకు -
తిరుపతిలో సీఎం కప్ ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సీఎం కప్’ టోర్నీ ఫైనల్స్‌ను తిరుపతి వేదికగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లోనూ స్టేట్ మినీ ఒలింపిక్స్ మాదిరిగా ఒకే ప్రాంతంలో పోటీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్ల వివరాలను పంపించాలని డీఎస్ఏలు, చీఫ్ కోచ్‌లను శాప్ ఆదేశించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 4,200 మందికిపైగా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం టోర్నీలో 963 పతకాలు, 48 ట్రోఫీలను బహూకరించనున్నారు. ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్ 2030 నాటికి బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బీఈఈ న్యూఢిల్లీలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. గుంటూరు శివారు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడారు. -
రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) రాష్ట్రంలోనే తొలి టెన్నిస్ అకాడమీని అందుబాటులోకి తెస్తోంది. క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులూ ఉండేలా గుంటూరులోని బీఆర్ స్టేడియంలో ఆధునిక వసతులు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ సామర్థ్యంతో టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనిని మంగళవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక శిక్షణకు ప్రణాళిక.. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుల వరకు అకాడమీలో తక్కువ ఖర్చుతో శిక్షణ పొందేలా ప్రణాళికను రూపొందించింది. దేశ, విదేశాలకు చెందిన కోచ్‌ల సహకారంతో అకాడమీని నిర్వహించనుంది. రోజు వారీ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు స్పెషల్ ట్రైనింగ్ కోసం వచ్చే వారికి శాప్ ప్రత్యేక ప్రణాళికను తయారు చేసింది. ప్రస్తుతం అకాడమీలో రెండు సింథటిక్ కోర్టులు అందుబాటులో ఉండగా వీటికి అదనంగా మరో నాలుగు ‘క్లే’ కోర్టులను తయారు చేస్తోంది. క్రీడాకారుల సౌలభ్యం కోసం ఫ్లడ్ లైట్లతో పాటు జిమ్, జిమ్నాస్టిక్స్, రన్నింగ్ ట్రాక్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కోచ్‌లనూ తయారుచేసేలా.. ఈ అకాడమీ ద్వారా ఉత్తమ క్రీడాకారులతో పాటు ఉత్తమ కోచ్‌లను కూడా శాప్ తయారుచేయనుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆరు వారాలు/ఆరు నెలల సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇది పూర్తి చేసిన వారికి స్పోర్ట్స్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇటువంటి కోర్సులు చేయాలనుకునే వారికి నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారికి శాప్ టెన్నిస్ కోచ్ ఫౌండేషన్ కోర్సు ద్వారా ట్రైనింగ్ ఇచ్చి.. అసిస్టెంట్ కోచ్‌లుగా ఉపాధి కల్పించనుంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ శిక్షణ శాప్ దేశ చరిత్రలోనే తొలిసారిగా సొంతంగా స్పోర్ట్స్ లీగ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఒక్క టెన్నిస్‌లోనే 39 టోర్నమెంట్లు నిర్వహించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది టెన్నిస్ క్రీడాకారులను రిజిస్టర్ చేశాం. క్రీడాకారుల అవసరాలను గుర్తించి తొలిసారిగా టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటివరకు టెన్నిస్ కోచింగ్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు శాప్ ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందుబాటులోకి రాబోతోంది. ఎక్కడెక్కడికో వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తీసుకుంటున్న ట్రైనింగ్‌ను.. గుంటూరులోనే తక్కువ ఖర్చుతో అందిస్తాం. శాప్ లీగ్స్‌ను వేగంగా పూర్తి చేయాలి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాప్ లీగ్స్ ఫేజ్–2 పోటీలను వేగంగా పూర్తి చేయాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. శాప్ లీగ్స్ నిర్వహణపై సోమవారం వారిద్దరూ.. కోచ్‌లు, అధికారులకు పలు సూచనలు చేశారు. 19 విభాగాల్లో క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. అనంతరం టోర్నీల షెడ్యూల్‌ను విడుదల చేశారు. – ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ (చదవండి: సచివాలయ వ్యవస్థకు ‘చట్ట’ భద్రత.. ఆర్డినెన్స్ జారీ) -
విశాల్ సిక్కాపై టెరాడేటా ’ఐపీ’ చౌర్యం ఆరోపణలు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవల సంస్థ ఎస్ఏపీ మేధోహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని, ఇందులో ఆ సంస్థ మాజీ సీటీవో విశాల్ సిక్కాకు కూడా భాగం ఉందని అమెరికన్ టెక్నాలజీ సంస్థ టెరాడేటా ఆరోపించింది. ’హెచ్ఏఎన్ఏ’ ప్లాట్‌ఫాం రూపకల్పనలో తమ వ్యాపార రహస్యాలను, మేధోహక్కులను చోరీ చేశారంటూ అమెరికా కోర్టులో దావా వేసింది. హెచ్ఏఎన్ఏను రూపొందించే క్రమంలో తమ కాపీరైట్స్‌ను చౌర్యం చేసేందుకే ఎస్ఏపీ తమతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసిందని, ప్రాజెక్టు పూర్తి కాగానే తెగదెంపులు చేసుకుందని టెరాడేటా ఆరోపించింది. ఎస్ఏపీ దశాబ్దకాలంగా కస్టమర్లు, భాగస్వామ్య సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందంటూ పేర్కొంది. మరోవైపు, ’హెచ్ఏఎన్ఏ’ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సిక్కా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. హెచ్ఏఎన్ఏను పూర్తి నిబద్ధతతో రూపొందించామని, మేధోహక్కుల ఉల్లంఘనేదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవోగా కూడా సిక్కా పనిచేసిన సంగతి తెలిసిందే. -
వేసవి శిక్షణను పకడ్బందీగా నిర్వహించండి
వేసవి శిక్షకులకు శాప్ ఓఎస్డీ రామకృష్ణ సూచన అనంతపురం సప్తగిరి సర్కిల్ : వేసవి శిక్షణ తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని శాప్ ఓఎస్డీ రామకృష్ణ శిక్షకులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా ప్రాదికార సంస్థ కార్యాలయంలో వేసవి శిక్షకులకు శిక్షణ సామగ్రి కొనుగోలుకు చెక్కులను అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 శిక్షణ కేంద్రాలకు రూ.7వేలు చొప్పున 3.50లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాప్ ఓఎస్డీ రామకృష్ణ మాట్లాడుతూ శిక్షణ సామగ్రి కొనుగోలు చేసి వాటి రసీదులను కార్యాలయంలో అందించాలన్నారు. ఆయా కేంద్రాలు ఉదయం 5.30 నుంచి 7.30 వరకు...అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 వరకు నిర్వహించాలన్నారు. ఆయా కేంద్రాల్లో 30 మంది క్రీడాకారులు లేకపోతే అలాంటి కేంద్రాలను రద్దు చేస్తామన్నారు. కేంద్రాలను నడిపేందుకు అలసత్వం ప్రదర్శించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ బాషామోహిద్దీన్, తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురుస్వామి, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు, కొండారెడ్డి, సిరాజుద్దీన్, జీవన్‌కుమార్, మనోహర్‌రెడ్డి, జబీవుల్లా, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్పార్కింగ్
బ్రైట్ కలర్ డ్రెస్... స్పార్కింగ్ లుక్స్‌తో గిలిగింతలు పెట్టింది టాలీవుడ్ చిన్నది మాధవీలత. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో ఆదివారం జరిగిన మెడ్మాక్ ఎంటర్‌ప్రైజస్ డిటాక్స్ ‘ఎస్ఏపీ’ ప్యాచ్‌ల విడుదలలో అలరించింది. ఆమెతో పాటు భరద్వాజ్ పాల్గొన్నాడు. ఆధునిక వైద్య విధానాల ద్వారా శరీరంలో విషపూరిత మలినాలను తొలగించే క్రమంలో ఈ సహజసిద్ధ డిటాక్స్ ఎస్ఏపీని మార్కెట్లోకి తీసుకొచ్చామని మెడ్మాక్ డెరైక్టర్ మొక్కపాటి సింధు తెలిపారు. ఇది రక్తసరఫరా మెరుగుపరుస్తుందని, అలసట తగ్గిస్తుందని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుందన్నారు. సాక్షి, సిటీప్లస్ -
శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పీఆర్ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి శశాంక్ గోయల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ గతంలో ఎన్టీఆర్ హయాంలో శాప్, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. శాప్ సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం), ఎస్.గీత (గుంటూరు), కేఎం షకీల్ షఫీ (అనంతపురం), దుద్యాల జయచంద్ర (వైఎస్సార్ జిల్లా), బండారు హనుమంతురావు (కృష్ణా), ఎం.రవీంద్రబాబు (నెల్లూరు)లను నియమించారు. -
బ్యాంకింగ్ సేవలు భారత్‌లోనే భేష్
ముంబై: బ్యాంకింగ్ సేవలు భారత్‌లో భేషుగ్గా ఉన్నాయని శాప్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్ సేవలతో సంతృప్తి చెందిన ఖాతాదారుల విషయంలో భారత్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచిందని ఐడీసీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత్, ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్‌ల్లో మొత్తం 600 మంది బ్యాంకు ఖాతాదారుల నుంచి ఐడీసీ సేకరించిన వివరాలతో శాప్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ముఖ్యాంశాలు... ఆన్లైన్ బ్యాంకింగ్, సమర్థ లావాదేవీల నిర్వహణ, ఏటీఎంల అందుబాటు, సమర్థవంతంగా సేవలందించే బ్రాంచీలు... ఇత్యాది కారణాల వల్ల భారత్‌కు మొదటి స్థానం దక్కింది. 8.5 స్కోర్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా(8.33 స్కోర్). న్యూజిలాండ్(8.27), చైనా(7.93)లు ఉన్నాయి. టెక్నాలజీపై బ్యాంకులు పెట్టిన పెట్టుబడికి ఫలితాలు దక్కుతున్నాయి. భారత బ్యాంకు ఖాతాదారులకు సంతృప్తికి ప్రధాన కారణం బ్యాంకులందిస్తున్న ఆన్లైన్ సర్వీసులు. ఆ తర్వాతి స్థానాల్లో సమర్థవంతంగా లావాదేవీల నిర్వహణ, అందుబాటులో బ్యాంక్ బ్రాంచీలుండడం నిలిచాయి. భారత్‌లో ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.