బ్యాంకింగ్ సేవలు భారత్‌లోనే భేష్
బ్యాంకింగ్ సేవలు భారత్‌లోనే భేష్
Published Thu, Sep 12 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
ముంబై: బ్యాంకింగ్ సేవలు భారత్‌లో భేషుగ్గా ఉన్నాయని శాప్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్ సేవలతో సంతృప్తి చెందిన ఖాతాదారుల విషయంలో భారత్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచిందని ఐడీసీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత్, ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్‌ల్లో మొత్తం 600 మంది బ్యాంకు ఖాతాదారుల నుంచి ఐడీసీ సేకరించిన వివరాలతో శాప్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ముఖ్యాంశాలు...
ఆన్‌లైన్ బ్యాంకింగ్, సమర్థ లావాదేవీల నిర్వహణ, ఏటీఎంల అందుబాటు, సమర్థవంతంగా సేవలందించే బ్రాంచీలు... ఇత్యాది కారణాల వల్ల భారత్‌కు మొదటి స్థానం దక్కింది.
8.5 స్కోర్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండోనేషియా(8.33 స్కోర్). న్యూజిలాండ్(8.27), చైనా(7.93)లు ఉన్నాయి.
టెక్నాలజీపై బ్యాంకులు పెట్టిన పెట్టుబడికి ఫలితాలు దక్కుతున్నాయి. భారత బ్యాంకు ఖాతాదారులకు సంతృప్తికి ప్రధాన కారణం బ్యాంకులందిస్తున్న ఆన్‌లైన్ సర్వీసులు. ఆ తర్వాతి స్థానాల్లో సమర్థవంతంగా లావాదేవీల నిర్వహణ, అందుబాటులో బ్యాంక్ బ్రాంచీలుండడం నిలిచాయి.
భారత్‌లో ఫోన్ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ప్రాధాన్యత ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
Advertisement