
స్పార్కింగ్
బ్రైట్ కలర్ డ్రెస్... స్పార్కింగ్ లుక్స్‌తో గిలిగింతలు పెట్టింది టాలీవుడ్ చిన్నది మాధవీలత. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లో ఆదివారం జరిగిన మెడ్‌మాక్ ఎంటర్‌ప్రైజస్ డిటాక్స్ ‘ఎస్‌ఏపీ’ ప్యాచ్‌ల విడుదలలో అలరించింది. ఆమెతో పాటు భరద్వాజ్ పాల్గొన్నాడు.
ఆధునిక వైద్య విధానాల ద్వారా శరీరంలో విషపూరిత మలినాలను తొలగించే క్రమంలో ఈ సహజసిద్ధ డిటాక్స్ ఎస్‌ఏపీని మార్కెట్లోకి తీసుకొచ్చామని మెడ్‌మాక్ డెరైక్టర్ మొక్కపాటి సింధు తెలిపారు. ఇది రక్తసరఫరా మెరుగుపరుస్తుందని, అలసట తగ్గిస్తుందని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుందన్నారు.
సాక్షి, సిటీప్లస్