
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సీఎం కప్’ టోర్నీ ఫైనల్స్‌ను తిరుపతి వేదికగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లోనూ స్టేట్ మినీ ఒలింపిక్స్ మాదిరిగా ఒకే ప్రాంతంలో పోటీలను ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్ల వివరాలను పంపించాలని డీఎస్‌ఏలు, చీఫ్ కోచ్‌లను శాప్ ఆదేశించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 4,200 మందికిపైగా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం టోర్నీలో 963 పతకాలు, 48 ట్రోఫీలను బహూకరించనున్నారు.
ఏపీ భవన్‌లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్
2030 నాటికి బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బీఈఈ న్యూఢిల్లీలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.
బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి
బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. గుంటూరు శివారు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment