athletes
-
వెటరన్... ఆపేదేలేదు!
వయసు పై బడడం అంటే కలల దారులు మూసివేయడం కాదు. గంభీర ఏకాంతవాసం కాదు. క్షణక్షణం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం. ‘వయసు పై బడింది’ అని ఎప్పుడూ భారంగా అనుకోలేదు ఈ మహిళలు. ‘ఈ వయసులో ఆటలేమిటీ!’ అనే నిట్టూర్పు వారి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. వెటరన్ అథ్లెట్స్‌లో సత్తా చాటుతూ నిత్యోత్సాహానికి నిలువెత్తు చిరునామాగా నిలుస్తున్నారు...ఇటీవల గుంటూరులో ఏపీ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 6వ ఏపి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో... రేస్ వాక్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్న శిరీషారెడ్డి, షాట్‌పుట్, జావెలిన్ థ్రో, జంప్స్లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్న ఎం.లక్ష్మి, పరుగులో మూడు బంగారు పతకాలు సాధించిన వి. విజయ... ఆత్మవిశ్వాసం, నిత్యోత్సాహం మూర్తీభవించిన మహిళలు.గుంటూరుకు చెందిన విజయకు పదిహేనేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలలో ఒకరు దివ్యాంగురాలు. ఇళ్లలో పనిచేస్తూ, ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం తాను పనిచేసే ఇంటి యజమాని కుమార్తె కోసం మైదానంలో అడుగుపెట్టింది. ఒక జిమ్ ట్రైనర్ సూచన ప్రకారం వెటరన్ అథ్లెటిక్స్ కోసం సాధనప్రారంభించింది. పతకాలు సాధించడం ఇప్పుడామెకు పరిన్టిగా మారింది. క్యాన్సర్ బారిన పడినప్పుడు ‘ఇక నా పని అయిపోయింది’ అని నిరాశలోకి వెళ్లిపోలేదు శిరీష. ఆ మనోధైర్యానికి కారణం...క్రీడాస్ఫూర్తి. నెల్లూరు చెందిన 71 ఏళ్ల శిరీషా రెడ్డికి ఆటల్లో గెలవడం వల్ల వచ్చినవి పతకాలు మాత్రమే కాదు. అంతకంటే విలువైన ఆత్మవిశ్వాసం తాలూకు శక్తులు!విశాఖపట్టణానికి చెందిన 86 ఏళ్ల లక్ష్మి వయసు న్తికేళ్ల దగ్గరే ఆగిపోవడానికి కారణం ఆటలు! ‘ఆటలు ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి’ అంటున్న లక్ష్మి ఆరోగ్య రహస్యం... క్రమశిక్షణ. ఆ ఉక్కు క్రమశిక్షణకు మూలం... ఆటలు.‘విరమణ అనేది ఉద్యోగానికే. ఆటలకు కాదు’ అంటున్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 76 సంవత్సరాల కోటేశ్వరమ్మ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకుంటోంది.వెటరన్ అంటే మాటలు కాదు... గెలుపు దారిలో విరామం లేకుండా ఉత్సాహమే శక్తిగా పరుగులు తీయడమే అని చెప్పడానికి ఈ వెటరన్ అథ్లెట్లు తిరుగులేని ఉదాహరణ.– మురమళ్ళ శ్రీనివాసరావు,సాక్షి, గుంటూరు– కె.ఎస్., సాక్షి, కావలి, నెల్లూరు జిల్లాక్యాన్సర్ నుంచి బయటపడి...గత 35 ఏళ్ళ నుండి క్రీడాసాధన చేస్తున్నాను. 2011లో క్యాన్సర్ సోకింది. కొంత కాలం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొండి ధైర్యంతో దానిని సులభంగా జయించాను. 2021లో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆటలు ఆడడం కష్టమయ్యింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడు పదుల వయసులో ఎన్నో జాతీయ స్థాయి పతకాలు సాధించాను.– ఎల్. శిరీషా రెడ్డి, నెల్లూరుకష్టాల్లోనూ నవ్వడం నేర్చుకున్నాఆరు పదుల వయసు దాటినా కష్టాలు మాత్రం వెన్నంటే ఉంటున్నాయి. అందుకే అవి చుట్టుముట్టినప్పుడల్లా నవ్వుతోనే ఎదుర్కొంటాను. ఆ నవ్వుకు కారణం ఆటలు. పదకొండు అంతర్జాతీయ వెటరన్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలతో సహా మొత్తం పదకొండు పతకాలు సాధించాను. గుంటూరులో జరిగిన పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాను. ఊపిరి ఉన్నంత వరకు పోటీల్లో పాల్గొంటాను.– వి.విజయ, గుంటూరు 86 = ఎనర్జిటిక్ఉదయించే సూర్యుడు అస్తమించే వరకు తన విధి నిర్వర్తిస్తాడు. పుట్టుకకు, మర ణానికి మధ్యలో ఉండే జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా నడిపించాలనేది నా సిద్ధాంతం. నేను పూర్తి శాకాహారిని. ఎక్కడ పోటీలున్నా ఒంటరిగానే వెళతాను. క్రమశిక్షణకుప్రాణం ఇస్తాను.– ఎం.లక్ష్మి, 86, విశాఖపట్నంకావాలి... ఇలాంటి శక్తిఅంతర్జాతీయ వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఏనుగుల కోటేశ్వరమ్మ వయస్సు 76 ఏళ్లు. అయినా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసమాన క్రీడా నైపుణ్యాన్ని ఆమె ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 125, జాతీయ స్థాయిలో 115, అంతర్జాతీయ స్థాయిలో 17 పతకాలు సాధించింది. కావలిలోని జవహర్ భారతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించింది. పదవీ విరమణ చేసినప్పటికీ ఆటలపై ఆసక్తితో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో న్ల్గొంటూ విజేతగా నిలుస్తోంది. లక్షల రూన్యలు ఖర్చు అయ్యే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో న్ల్గొనడానికి తనకు వచ్చే పింఛన్ నగదును దాచుకొని వాటితో క్రీడాపోటీల్లో న్ల్గొంటోంది.ఆటలే ఆరోగ్యం... మహాభాగ్యంసింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, జన్న్ లలో బంగారు పతకాలు సాధించినప్పటికీ, స్వీడన్ లో సాధించిన కాంస్య పతకం సంతోషాన్ని ఇచ్చింది. ఒలింపిక్స్‌లో న్ల్గొన్న క్రీడాకారులతో పోటీపడి అన్నిరకాల ప్రీ పోటీల్లో విజేతగా నిలవడంతో చివరి పోటీల్లో న్ల్గొనే అర్హత రావడమే చాలా గొప్ప విషయం. రోజూ గ్రౌండ్లోప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. అందువల్లనే ఆరోగ్య సమస్యలు లేకుండా హుషారుగా ఉంటాను. – ఏనుగుల కోటేశ్వరమ్మ -
అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా అంజూ
చండీగఢ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నూతన కార్యవర్గం తొలి వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 9 మంది అథ్లెట్లతో కూడిన ఏఎఫ్ఐ అథ్లెట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు మహిళా అథ్లెట్లు, ముగ్గురు పురుష అథ్లెట్లకు చోటు దక్కింది. తాజా ఎన్నికల్లో మరోసారి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ‘డబుల్ ఒలింపియన్’ మాజీ లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి... ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుంది. ఈ కమిషన్‌లో అంజూతో పాటు జ్యోతిర్మయి సిక్దర్ (రన్నింగ్), కృష్ణ పూనియా (డిస్కస్ త్రో), ఎండీ వల్సమ్మ (హర్డిల్స్), సుధా సింగ్ (స్టీపుల్‌ఛేజ్), సునీతా రాణి (రన్నింగ్) చోటు దక్కించుకున్నారు. పురుషుల విభాగం నుంచి ఏఎఫ్ఐ అధ్యక్షుడు బహదూర్ సింగ్ సాగూతో పాటు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, అవినాశ్ సాబ్లే (స్టీపుల్ ఛేజ్) ఉన్నారు. గత కమిషన్‌లో నలుగురు మహిళలు ఉండగా... ఇప్పుడు వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతూ ఆ సంఖ్యను 6 చేశారు. బహదూర్ సింగ్ గతంలో సుదీర్ఘ కాలం ఈ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. బిజీ షెడ్యూల్ కారణంగా కమిషన్‌కు ఎక్కువ సమయం కేటాయించలేనని చెప్పినప్పటికీ... ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ నీరజ్ చోప్రాతో చర్చించి అతడిని కమిషన్‌లో భాగం చేసింది. 2012 నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఏఎఫ్ఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన అదిలె సుమరివాలా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న సుమరివాలాకు.. ఏఎఫ్ఐ ఎక్స్క్యూటివ్ కౌన్సిల్ సమావేశాలకు హజరయ్యే అధికారాలు ఉన్నాయి. డోపింగ్ ఉదంతాల వల్ల దేశ అథ్లెటిక్స్ ప్రభ మసకబారకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏఎఫ్ఐ నిర్ణయించింది. దీని కోసం అథ్లెట్ల శిక్షణకు సంబంధించిన వివరాలను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పర్యవేక్షించనుంది. -
ప్యారిస్ ఒలింపిక్స్ : నీతా అంబానీ ‘ఇండియా హౌస్’ విశేషాల వీడియో
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ కళలు, ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆశయాలకు అనుగుణంగా, ఐవోఏ భాగస్వామ్యంతో రూపొందించిన ప్రతిష్టాత్మక ఇండియా హౌస్‌కు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. #WATCH | IOC member and CEO & Chairperson of Reliance Foundation, Nita Ambani gives us a glimpse of the first ever India House at the Olympics, bringing the spirit of India to Paris. pic.twitter.com/jxlTKEg3Dq— ANI (@ANI) July 30, 2024ఒలింపిక్స్‌లో భారతీయ అథ్లెట్లకు నిలయం భారతదేశపు తొలి కంట్రీ హౌస్‌ను ఏర్పాటు చేశారు. భారతీయ అథ్లెట్లను ఉత్సాహ పరిచేందుకు, వారి విజయ సంబరాలకు ఉద్దేశించినదే ఈ ఇండియా హౌస్ అని నీతా వెల్లడించారు. ఈ సందర్భంగా నీతా, బనారస్, కాశ్మీర్ నుండి వచ్చిన చేతిపనులు విశేషాలను పంచుకున్నారు. ఇంకా అద్బుతమైన హస్తకళలు, సాంప్రదాయ భారతీయ ఆభరణాలు కూడా ఇందులో ఉన్నాయి. భారతీయ అథ్లెట్ల నైపుణ్యాలు, జాతీయ క్రీడా సమాఖ్యలకు మద్దతు ఇవ్వడంలో భారత విశ్వసనీయతను చాటడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అంతేకాదు భారత్‌ను విశ్వక్రీడా వేదికగా నిలపడంతోపాటు, భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే ఆకాంక్షకు ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్బంగా ఆమె అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు. భారతీయ ఆహారం, బాలీవుడ్ సంగీతం లేకుండా భారతదేశంలో ఏ వేడుకలు పూర్తి కావనీ, మన సంప్రదాయాలు, మన కళ, సంస్కృతి ఇవన్నీ మన అథ్లెట్లను ఉత్సాహపరచడం కోసమే అన్నారు. కళాకారుల నృత్యాలకు నీతా కూడా ఉత్సాహంగా కాలు కదపడం విశేషం. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా ఆనంద్ పిరామిల్కూడా కన్పించారు. ఇండియా హౌస్ లాంచ్ వేడుకలో గాయకుడు షాన్ వేదికపై ప్రదర్శనను ఈ వీడియోలో చూడవచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మరుసటి రోజు జులై 27న లా విల్లెట్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, బీసీసీఐ సెక్రటరీ జై షా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఒలింపిక్స్ ముగింపు తేదీ వరకు ఆగస్టు 11 వరకు ఈ హౌస్‌ను సందర్శకులు వీక్షించే అవకాశం ఉంది. -
భారత్‌తో బంధం... మరో దేశానికి ప్రాతినిధ్యం
ప్రతి క్రీడాకారుడి జీవితాశయం ఒలింపిక్స్‌లో పోటీపడటం, దేశానికి పతకం సాధించడం. అయితే ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. చాలా మందికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కదు. ఫలితంగా సత్తా ఉన్న వాళ్లు వేరే దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి మరో మార్గంలో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తమ కలను నిజం చేసుకుంటారు. మరికొందరేమో తల్లిదండ్రుల వృత్తిరీత్యా స్వదేశాన్ని వీడి వేరే దేశంలో స్థిరపడతారు. వారి పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని ఒలింపిక్స్ స్థాయికి వెళతారు. మరో మూడు రోజుల్లో ఆరంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌తో బంధం ఉన్నా వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఉన్నారు. వారి వివరాలు క్లుప్తంగా...రాజీవ్ రామ్ (టెన్నిస్; అమెరికా): రాజీవ్ రామ్ తల్లిదండ్రులు రాఘవ్, సుష్మా బెంగళూరు నుంచి చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. రాజీవ్ అమెరికాలోని డెన్వర్‌లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 40 ఏళ్ల రాజీవ్ ఐదు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించాడు. వీనస్ విలియమ్స్‌తో కలిసి రాజీవ్ రామ్ 2016 రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం అందించాడు. పారిస్‌లో రాజీవ్ పురుషుల డబుల్స్‌లో పోటీపడనున్నాడు. ప్రీతిక పవాడే (టేబుల్ టెన్నిస్; ఫ్రాన్స్): ప్రీతిక తల్లిదండ్రులు విజయన్, సుగుణ పుదుచ్చేరిలో జన్మించారు. 2003లో విజయన్ ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2004లో ప్రీతిక పారిస్‌లో జని్మంచింది. 16 ఏళ్లకే ప్రీతిక ఫ్రాన్స్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడింది. స్వదేశంలో జరగనున్న ఒలింపిక్స్‌లో 19 ఏళ్ల ప్రీతిక మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్‌గా బరిలోకి దిగనుంది. మహిళల డబుల్స్‌తోపాటు మిక్స్డ్ డబుల్స్‌లోనూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. శాంతి పెరీరా (అథ్లెటిక్స్; సింగపూర్): సింగపూర్ ‘స్ప్రింట్ క్వీన్’గా పేరొందిన వెరోనికా శాంతి పెరీరా పూర్వీకులది కేరళ. సింగపూర్‌లో వాళ్ల తాతకు ఉద్యోగం రావడంతో తిరువంతనపురం నుంచి సింగపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత ఏడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో శాంతి 100 మీటర్ల విభాగంలో రజత పతకం గెలిచి 49 ఏళ్ల తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సింగపూర్‌కు తొలి పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో సింగపూర్ బృందానికి శాంతి పతాకధారిగా వ్యవహరించనుంది. కనక్ ఝా (టేబుల్ టెన్నిస్; అమెరికా): ఇప్పటికే రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న కనక్ ఝా నాలుగుసార్లు టేబుల్ టెన్నిస్‌లో అమెరికా జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కనక్ తల్లి సుగుణ స్వస్థలం ముంబైకాగా.. తండ్రి అరుణ్ కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్‌లలో పెరిగారు. వీరిద్దరు ఐటీ ప్రొఫెషనల్స్. వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లి కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 24 ఏళ్ల కనక్ 2018 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. అమర్ ధేసి (రెజ్లింగ్; కెనడా): అమర్‌వీర్ తండ్రి బల్బీర్ జాతీయ గ్రీకో రోమన్ చాంపియన్. పంజాబ్ పోలీసులో కొంతకాలం పనిచేశాక బల్బీర్ 1979లో కెనడాకు వచ్చి స్థిరపడ్డారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కెనడాకు ప్రాతినిధ్యం వహించిన అమర్ 125 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో 13వ స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టాడు. 28 ఏళ్ల అమర్ 2021 పాన్ అమెరికన్ చాంపియన్íÙప్లో పసిడి పతకం సాధించాడు. అనంతరం 2022 బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. -
షణ్ముగ శ్రీనివాస్‌కు స్వర్ణం... శిరీషకు కాంస్యం
ఇండియన్ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్ స్వర్ణ పతకం సాధించగా... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఇదే నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్ చాంపియన్‌షిప్‌లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో శ్రీనివాస్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది. -
‘టాలెంట్ హంట్’కు సిద్ధం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయి. గ్రామ/వార్డు సచివాలయం, మండలస్థాయి పోటీలను దిగ్విజయంగా ముగించుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు జట్లు ఉరకలేస్తున్నాయి. బుధవారం నుంచి 175 నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్ రీతిలో పోటీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లు చేసింది. క్రిక్క్లబ్ యాప్, ‘ఆడుదాం ఆంధ్రా’ వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష వీక్షణం, ప్రత్యక్ష స్కోరును తిలకించేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కామెంట్రీలను నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలిసితీసే ఉద్దేశంతో ప్రభుత్వం 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులకు 5 క్రీడాంశాల్లో మెగా టోరీ్నకి శ్రీకారం చుట్టింది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్)లో నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను ప్రకటించింది. పోటీలను పక్కా ప్రొఫెషనల్ విధానంలో ఆయా క్రీడా ఫెడరేషన్ల నిబంధనల ప్రకారం నిర్వహించనుంది. టీ10 విధానంలో పూర్తిస్థాయి మ్యాచ్ బాల్‌తో క్రికెట్ పోటీలు, వాలీబాల్‌లో (25–25–15), బ్యాడ్మింటన్‌లో (21–21–21) బెస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ల విధానాన్ని అమలు చేయనుంది. ఖోఖోలో 2 ఇన్నింగ్స్‌కు 9 నిమిషాలు, కబడ్డీ పురుషుల సెషన్‌కు 20 నిమిషాలు, మహిళలకు 15 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించింది. భోజన, వసతి సౌకర్యాలతో.. మండలస్థాయి పోటీల్లో విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది. వీరిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపేందుకు అవసరమైన చోట రవాణా, భోజన, వసతులను పర్యవేక్షిస్తోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకారం పోటీలను పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. 27 నుంచి పూర్తిస్థాయిలో క్రికెట్ పోటీలు ఊపందుకునేలా కార్యాచరణ రూపొందించింది. మండలాలు, మునిసిపాలిటీలు కలిపి 753 యూనిట్ల నుంచి 75,000 మందికిపైగా క్రీడాకారులు నియోజకవర్గ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభ వేట ప్రారంభం.. నియోజకవర్గ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లకు చెందిన ప్రతినిధులు నియోజకవర్గాల్లోని పోటీలను పరిశీలించి ‘టాలెంట్ హంట్’ చేపట్టనున్నారు. ప్రో కబడ్డీ సంస్థ, ప్రైమ్ వాలీబాల్, ఏపీ ఖోఖో క్రీడా సంఘం, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు, అంతర్జాతీయ క్రీడాకారుల బృందాలు యువతలోని ప్రతిభను గుర్తించి నివేదిక రూపొందించనున్నాయి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఆంధ్రాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ఆడుదాం ఆంధ్రా నిర్వహిస్తున్నాం. ఇది ఏటా కొనసాగిస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా వెతికిపట్టుకుని ప్రపంచ వేదికలపై నిలబెట్టడమే సీఎం జగన్ లక్ష్యం. ఇకపై అన్నీ కీలక ఘట్టాలే. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. క్రీడాకారులు ప్రతి దశలోనూ అద్భుత ప్రతిభ కనబర్చాలి. – ఆర్కే రోజా, క్రీడా శాఖ మంత్రి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందజేశాం నియోజకవర్గ స్థాయి పోటీలకు సర్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు జేసీలు, శాప్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది తగిన ఆదేశాలిచ్చాం. మండలస్థాయి విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందించాం. పూర్తిగా ప్రొఫెషనల్స్ తరహాలో టోర్నీ జరగనుంది. – ధ్యాన్‌చంద్ర, శాప్ ఎండీ -
ఆనందం.. ఆకాశాన్నంటింది
సాక్షి నెట్వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్‌లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్‌లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు. పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్‌లకు గాను 664 మ్యాచ్‌లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్‌లకు గాను 1260 మ్యాచ్‌లను నిర్వహించారు. కడపలో కదం తొక్కారు కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్‌లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్‌లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్‌లకు గాను 82 శాతం షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్‌లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్‌లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్‌లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్‌లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు
సాక్షి, నెట్వర్క్: మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలు తొలిరోజు అంబరాన్ని అంటే సంబరంతో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 6,174 చోట్ల షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు ఐదు క్రీడాంశాల్లో కలిపి మొత్తం 33,722 పోటీలు జరిగాయి. సాంప్రదాయ క్రీడాంశాలైన యోగా, మారథాన్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 26 జిల్లాల్లోనూ 5 లక్షలకుపైగా ప్రేక్షకులు నేరుగా ఆడుదాం ఆంధ్రా పోటీలను వీక్షించినట్టు సమాచారం. దాదాపు 50 శాతం జిల్లాల్లో 100 శాతం, మిగిలిన జిల్లా్లల్లో 99 శాతం వరకు జట్ల కూర్పు పూర్తయింది. జనవరి 9లోగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేసేలా రోజూ ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం పని చేస్తోంది. తుది నివేదిక ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు 37.23 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందులో 23.48 లక్షల మంది పురుషులు, 13.75 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. వలంటీర్ల ద్వారా మాన్యువల్ స్కోరింగ్‌తో పాటు పారదర్శకత కోసం క్రిక్ క్లబ్ యాప్ ద్వారా ఆన్లైన్ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మంది శిక్షణ పొందిన వలంటీర్లకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడల స్కోరింగ్‌కు ప్రత్యేక లాగిన్లు అందించారు. సచివాలయ స్థాయి పోటీల్లో విజేతలకు అందించేందుకు వీలుగా టీషర్టులు, టోపీలను వేగంగా సరఫరా చేస్తున్నారు. 17.10 లక్షల జతలకు గాను 8 లక్షలకు పైగా ఇప్పటికే జిల్లాలకు చేరాయి. కోస్తా.. వెల్లివిరిసిన ఆనందం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో పోటీలను కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ భరత్‌రామ్ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 511 సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఆటల పోటీలకు 90 వేల మంది పురుషులు, 40 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,16,171 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు, భీమవరంలో కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతిలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 1.43 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 1.71 లక్షల మంది క్రీడల్లో పాల్గొనటానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో 5 ప్రధాన క్రీడలకు సంబంధించి 14,354 టీమ్‌లను సిద్ధం చేసి 7,198 మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11 వేలకు పైగా జట్లు ఆడనున్నాయి. కృష్ణా జిల్లాలో వివిధ క్రీడల్లో 1.12 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల్లో 7 వేల జట్లు, మహిళల్లో 4వేల జట్లు ఉన్నాయి. పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ పతాకంతో 2 కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 3,280 అడుగుల పొడవున రూపొందించిన జాతీయ జెండాతో క్రీడాకారులు గాంధీనగర్ నుంచి చీమకుర్తిలోని ప్రభుత్వ హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. దర్శిలో జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. ఉత్తరాంధ్రలో ఉరిమిన ఉత్సాహం.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో 11,500 జట్లు నమోదు చేసుకోగా.. 670 క్రీడా మైదానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 976 సచివాలయాల పరిధిలో 485 మైదానాల్లో ఐదు క్రీడాంశాల్లో ఆటల పోటీలు జరిగాయి. మొత్తం 2.07 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విజయనగరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఆటల పోటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పతక విజేత మత్స్య సంతోషి, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, స్కేటింగ్ క్రీడాకారుడు సాయితేజలను ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెంలో జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎంపీ సత్యవతి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 14,098 టీములు, అందులో 1.31 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. రాయలసీమ.. ఆటాడుకుందాం రా.. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,89,929 మంది, నంద్యాల జిల్లాలో 1.25 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 645, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పోటీలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 515 క్రీడామైదానాల్లో పోటీలు జరిగాయి. తిరుపతి జిల్లాలో పలు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ పోటీలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. -
ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 30.50 లక్షల మంది క్రీడాకారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మరో 1.36 లక్షల మందికి పైగా ప్రేక్షకులుగా నమోదయ్యారు. వీరిలో క్రీడల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారి కోసం శాప్ ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అలాగే యువత నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఆదివారం వరకు పొడిగించింది. ప్రత్యేక డ్రెస్.. డిజిటల్ స్కోరింగ్ ఈ టోర్నీని ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో విజేతలకు ప్రభుత్వం స్పోర్ట్స్ టీ షర్టులను పంపిణీ చేయనుంది. దాదాపు ఒక్కో సచివాలయం పరిధిలో ఐదు క్రీడాంశాల్లో(క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, వాలీబాల్)గెలిచిన 114 మంది మహిళలు, పురుషులకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో కూడిన టీషర్టులు అందించనుంది. తొలి దశలో 17.19 లక్షల టీషర్టులను అందజేయనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే సచివాలయాల పరిధిలో వలంటీర్ల సేవలను ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల కోసం ఉపయోగించుకోనున్నారు. జిల్లా కోచ్‌లు, పీఈటీలు, పీడీలతో పాటు వలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్ స్కోరింగ్‌పై తొలి దశ శిక్షణ అందించారు. మరోసారి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక యాప్‌లో స్కోరింగ్ నమోదుపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయం, మండల స్థాయి వరకు ఆఫ్‌లైన్‌లో స్కోర్లు నమోదు చేసి వాటిని యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గస్థాయిలో క్రీడాకారులు, ప్రేక్షకులు తమ మొబైల్లోనే స్కోర్ చూసుకునే విధంగా పోటీల సమయంలోనే ఆన్లైన్లో స్కోరింగ్ నమోదు చేస్తారు. పది రోజుల పాటు వాయిదా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 9,060 క్రీడా మైదానాలను శాప్ అధికారులు గుర్తించారు. మైదానాల్లో గడ్డి తొలగించడంతో పాటు క్రీడలకు అనువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కానీ తుపాను కారణంగా పలు జిల్లాల్లోని మైదానాల్లోకి నీళ్లు చేరాయి. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు.. రిజిస్ట్రేషన్లకు గడువును ఆదివారం(డిసెంబరు 17) వరకు పొడిగించారు. -
ఆట కాదు.. వేట
సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పోటీల్లో ఏపీ క్రీడాకారుల బృందం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే పతకాల వేటలో అద్భుతంగా రాణించింది. 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలతో ఆంధ్రప్రదేశ్ 37వ జాతీయ క్రీడల్లో సత్తా చాటింది. మహిళా అథ్లెట్లు నాలుగు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్యాలతో అదరగొట్టారు. గత ఏడాది అథ్లెటిక్స్‌లో ఆరు పతకాలు రాగా.. ఈ ఏడాది 8కి పెరిగాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో 3 నుంచి 5కు పెరిగాయి. వాటర్ స్పోర్ట్స్‌లో ప్రాతినిధ్యం వహించిన తొలి పోటీలోనే పతకం రావడం విశేషం. 20 క్రీడాంశాల్లో 183 క్రీడాకారులు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తే... ఇందులో 31 మంది పురుషులు,33 మంది మహిళా క్రీడాకారులు వ్యక్తిగత, బృంద విభాగాల్లో పతకాలు సాధించారు. శిక్షణ అదిరింది జాతీయ క్రీడల్లో పతకాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ‘టార్గెట్ గోవా’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. క్రీడా సంఘాల సమన్వయంతో దాదాపు 17 క్రీడాంశాల్లో షెడ్యూల్ ప్రకారం శాప్ కోచ్‌లతో స్పెషల్ కోచింగ్ క్యాంపు నిర్వహించింది. ఫలితంగా క్రీడాకారుల నైపుణ్యాలు మెరుగుపడటంతో పతకాల సంఖ్య కూడా పెరిగింది. 17 క్రీడాంశాల్లో శిక్షణ క ల్పిస్తే.. వీటిల్లో ఏకంగా 10 విభాగాల్లో పతకాలు రావడం విశేషం. ఈ స్పెషల్ క్యాంపు కోసం ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేయడంతో పాటు మరో రూ.14.16 లక్షల విలువైన క్రీడా పరికరాలు, దుస్తులను సమకూర్చింది. వీటితో పాటు పోటీలకు వెళ్లే ముందు టీఏ, డీఏల కింద మరో రూ.12 లక్షలు విడుదల చేసింది. గతేడాది 8 విభాగాల్లో 16 పతకాలు సాధిస్తే.. ఇప్పుడు 11 విభాగాల్లో ఏకంగా 27 పతకాలు గెలుపొందడం విశేషం. క్రీడాకారులకు రెట్టింపు ప్రోత్సాహం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పెద్దపీట వేసింది. గతంలో ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను రెట్టింపు చేసింది. జాతీయ క్రీడల్లో స్వర్ణం గెలిస్తే రూ.5 లక్షలు, రజతానికి రూ.4 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఫలితంగా క్రీడాకారులు ఆరి్థక ఇబ్బందులను దాటి పతకాలను ఒడిసి పడుతున్నారు. పతకాల ఒరవడిని కొనసాగిస్తాం ఏపీలోని యువతను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శాప్ ప్రత్యేక కోచింగ్ క్యాంపుల ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తోంది. వచ్చే జాతీయ పోటీల్లోనూ ఇప్పటి కంటే మెరుగైన ప్రదర్శన, ఎక్కువ పతకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం. ఈ పతకాల ఒరవడి ఇలానే కొనసాగేలా చూస్తాం. – ధ్యాన్ చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సాధించిన పతకాలు ఇలా.. ♦ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం (డి.పూజా, ఎస్కే గౌస్), మహిళా బ్యాడ్మింటన్ జట్టుకు కాంస్యం (కె.నవ్య, టి.సూర్య చరిష్మా, ఎల్.మమైఖ్య, డి.రష్మీత, ఎం.ఆకాంక్ష, సీహెచ్.సాయి ఉత్తేజ్రావు, డి.పూజ, పి.సోనికసాయి, డి.దీపిక, డి.స్రవంతి) లభించాయి. ♦ మహిళల వెయిట్ లిఫ్టింగ్ 85 కేజీల విభాగంలో ఎన్.లలిత (స్వర్ణం), 59 కేజీల విభాగంలో ఎం.దీపనయోమి (కాంస్యం), పురుషుల్లో 109 కేజీల విభాగంలో బీఎస్ విష్ణువర్ధన్ (రజతం), 55 కేజీల విభాగంలో ఎస్.గురునాయుడు (కాంస్యం), 73 కేజీల విభాగంలో జె.కోటేశ్వరరావు (కాంస్యం) పతకాలు సాధించారు. ♦ పెన్కాక్ సిలాట్ 80–85 కేజీల విభాగంలో డీఎన్వీ రత్నబాబు (కాంస్యం), మోడ్రన్ పెంటాథ్లాన్‌లో మిక్స్డ్ డబుల్స్ డి.వెంకటేశ్, ఎన్.సనుతి యశోహర (కాంస్యం) పొందారు. ♦ అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్ల్లో జ్యోతి యర్రాజీ (స్వర్ణం), 200 మీటర్ల పరుగులో (కాంస్యం) సాధించింది. 4్ఠ100 మీటర్ల రిలేలో ప్రత్యూష, మధు కావ్యారెడ్డి, భవానీ యాదవ్, జ్యోతి యార్రాజీ బృందం (స్వర్ణం), 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రత్యూష, జ్యోతికశ్రీ, ఎం.శిరీష, కె.రజిత బృందం (స్వర్ణం) కైవసం చేసుకుంది. ♦ 400 మీటర్ల పరుగులో జ్యోతికశ్రీ (రజతం), జావెలిన్ త్రోలో రేష్మి శెట్టి (కాంస్యం), త్రిపుల్ జంప్‌లో ఎం.అనూష (కాంస్యం), 200 మీటర్ల పరుగులో జ్యోతి యర్రాజీ కాంస్యం సాధించారు. మహిళల హెప్టాథ్లాన్‌లో సౌమ్య మురుగన్ స్వర్ణంతో అదరగొట్టింది. ♦ తైక్వాండోలో మహిళల 67 కేజీల విభాగంలో కనక మహాలక్ష్మి, పురుషుల 68 కేజీల విభాగంలో టి.వరుణ్ కాంస్య పతకాలు గెలుపొందారు. ♦ సెపక్ తక్రాలో మహిళల డబుల్ ఈవెంట్లో ఎం.మధులత, టి.నాగహారిక, జి.రోషిత బృందం (రజతం), పురుషుల రెగు విభాగంలో ఎం.అర్జున్, సి.అశోక్‌కుమార్, జి,శివ కుమార్, ఎస్.మాలిక్ బాషా, టి,షణ్ముక్ శ్రీవంశీ బృందం (కాంస్యం) సాధించాయి. ♦ ఆర్చరీలో జి.బైరాగినాయుడు స్వర్ణం, మహిళల కయాకింగ్‌లో నాగిడి గాయత్రి రజతం సాధించింది. ఖోఖోలో ఏపీ పురుషుల జట్టు కాంస్యం గెలుపొందింది. ♦ స్కే మార్షల్ ఆర్ట్స్‌లో పురుషుల 50 కేజీల విభాగంలో పి.ప్రవీణ్ (రజతం), 58 కేజీల విభాగంలో ఎం.నీలాంజలి ప్రసాద్ (కాంస్యం), 75 కేజీల విభాగంలో బి.శ్రీనివాసులు (కాంస్యం) సాధించారు. -
111 పతకాలు... ఐదో స్థానం
హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది. నీరజ్ స్వర్ణంతో... ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది. వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్‌భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్‌స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు. టాప్–5 పట్టికలో... ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది. -
ఆసియా క్రీడల పతక విజేతలకు మోదీ ప్రశంస
తదుపరి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరెన్నో పతకాలు తెస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారందరినీ ప్రశంసించారు. ‘ప్రభుత్వం క్రీడాకారులకు ఏం కావాలో అది చేస్తుంది. వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన క్రీడాకారులు వచ్చే క్రీడల్లో ఈ రికార్డును అధిగమిస్తారనే నమ్మకముంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నాను’అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో రజత పతకం గెలిచిన సాకేత్ మైనేని, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రుతుజా భోస్లే ప్రధానికి జ్ఞాపికగా రాకెట్‌ను అందించారు. స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్‌ను, క్రికెట్లు జట్లు బ్యాట్‌ను మోదీకి బహూకరించాయి. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల బృందం 107 పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. తదుపరి ఆసియా క్రీడలు 2026లో జపాన్‌లో జరుగుతాయి. -
ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఏషియన్ గేమ్స్‌లో బంగారు పథకం సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన వీజే.సురేఖ, పరిణీత్, అదితిగోపీచంద్ స్వామిలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడకు చెందిన సురేఖ సాధించిన విజయంపై రాష్ట్రమంతా గర్వపడుతోందన్న సీఎం.. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. చదవండి: గురి తప్పలేదు.. అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం My best wishes and congratulations to @VJSurekha, @Parrneettt and Aditi Gopichand Swami for winning India the gold in the archery final at #AsianGames2023. Your precision and skill have made all of proud. I and all of Andhra Pradesh is particularly proud of our very own… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2023 -
చైనా కవ్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు
ఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించడంపై భారత్ మండిపడింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు.. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. భారత్ మండిపాటు.. ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది. అరుణాచల్ మాదే.. ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది. భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు. ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్‌లోని అరుణాచల్‌ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..? -
100 మీటర్ల చాంప్ నోవా లైల్స్
బుడాపెస్ట్ (హంగేరి): ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ రిటైరయ్యాక... పురుషుల 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో మళ్లీ అమెరికన్ అథ్లెట్లు ఆధిపత్యం చాటుకుంటున్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్లో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ పసిడి పతకం సాధించాడు. 26 ఏళ్ల నోవా లైల్స్ అందరికంటే వేగంగా 9.83 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి ఈ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. లెట్సిలె టెబోగో (బోట్స్వానా; 9.88 సెకన్లు) రజతం... జార్నెల్ హ్యూస్ (బ్రిటన్; 9.88 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఓబ్లిక్ సెవిల్లె (జమైకా) కూడా 9.88 సెకన్లలో రేసును ముగించాడు. అయితే ఫొటో ఫినిష్ ఆధారంగా రజత, కాంస్య పతకాలను ఖరారు చేశారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జస్టిన్ గాట్లిన్ (అమెరికా) ధాటికి ఉసేన్ బోల్ట్ కాంస్య పతకంతో సరిపెట్టుకొని అదే ఏడాది ఆటకు వీడ్కోలు పలికాడు. అనంతరం 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా), 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫ్రెడ్ కెర్లీ (అమెరికా) 100 మీటర్ల విభాగంలో వరల్డ్ చాంపియన్స్‌గా నిలిచారు. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెడ్ కెర్లీ సెమీఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత అథ్లెట్లకు నిరాశ ఈ మెగా ఈవెంట్లో వరుసగా రెండోరోజు భారత అథ్లెట్లు నిరాశాజనక ప్రదర్శన కనబరిచారు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుషారే 2.22 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఓవరాల్‌గా 20వ స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్ కుమార్ తన హీట్స్‌ను 50.46 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా 36వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. -
ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన టాప్ 10 క్రీడాకారులు
-
తిరుపతిలో సీఎం కప్ ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సీఎం కప్’ టోర్నీ ఫైనల్స్‌ను తిరుపతి వేదికగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు 14 క్రీడాంశాల్లోనూ స్టేట్ మినీ ఒలింపిక్స్ మాదిరిగా ఒకే ప్రాంతంలో పోటీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీల్లో గెలుపొందిన జట్ల వివరాలను పంపించాలని డీఎస్ఏలు, చీఫ్ కోచ్‌లను శాప్ ఆదేశించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 4,200 మందికిపైగా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం టోర్నీలో 963 పతకాలు, 48 ట్రోఫీలను బహూకరించనున్నారు. ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్ 2030 నాటికి బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బీఈఈ న్యూఢిల్లీలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజిని చెప్పారు. గుంటూరు శివారు అమరావతి రోడ్డులో ఆదివారం బీపీ మండల్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రులు మాట్లాడారు. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?!
ఢిల్లీ: అథ్లెట్లకు షాక్ ఇచ్చేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌ను తొలగించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు చర్చలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. వాళ్లపై పోలీస్ ఫిర్యాదుకు డబ్ల్యూఎఫ్ఐ సిద్ధమైంది. అయితే అందుకు ఈ నిరసనలతో సంబంధం లేకపోవడం గమనార్హం!. ఒక ఈవెంట్లో రెజ్లర్లను పాల్గొనకుండా ఆపేందుకు.. నిరసనలో పాల్గొంటున్న రెజ్లర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో ఈ నెల 20 నుంచి 23 తేదీల మధ్య సీనియర్ ఓపెన్ నేషనల్ ర్యాకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో పాల్గొనాల్సిన రెజ్లర్లకు.. ఆ ఈవెంట్ రద్దు అయ్యిందని నిరసనలో పాల్గొంటున్న కొందరు అథ్లెట్లు చెప్పి మోసం చేశారని, తద్వారా వాళ్లను పోటీల్లో పాల్గొనకుండా చేయాలని ప్రయత్నించారని రెజ్లింగ్ ఫెడరేషన్ దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్లపై కేసు నమోదు చేయాలని భావిస్తోందట.! రెజ్లర్ల మీటూ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ.. నాలుగు డిమాండ్లతో ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్‌కు రెజ్లర్లు లేఖ సైతం రాశారు. ఈ క్రమంలో.. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలో భేటీ సాగింది. మరోవైపు ఆరోపణలను ఖండించిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్.. మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని వెల్లడిస్తానని చెప్పడం ఉత్కంఠకు తెర తీసింది. అయితే.. మీడియా ముందుకు రావొద్దని క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఫోన్ ద్వారా సూచించినట్లు నేషనల్ మీడియా ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురించాయి. ఇంకోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లు మరోసారి మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్‌లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్‌లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్‌లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లతో క్రీడలకు మహర్దశ
సత్తెనపల్లి: గల్లీ, గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు యాప్‌లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, 366 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని పాఠశాలల్లో ఇప్పటికే క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఎంతోమంది మెరికల్లా తయారవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిలో వెటరన్ క్రీడాకారులనూ భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదీ ప్రణాళిక జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుకు రెండు నెలల క్రితమే ఉత్తర్వులొచ్చాయి. అప్పటి నుంచి పూర్తి మార్గదర్గకాలు రూపొందించేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాజాగా దీనిపై ఒక ప్రణాళిక రూపొందించారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచే క్రీడాకారుల ఎంపిక, తర్ఫీదు, పోటీల నిర్వహణ చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని సచివాలయ అడ్మిన్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలు స్పోర్ట్స్ క్లబ్‌ల నిర్వహణకు గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ పరిధిలో క్రీడాప్రాధికార సంస్థ కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారు. క్రీడలను ప్రోత్సహించే దాతలనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. రూ.50 వేలు, ఆపైన విరాళంగా అందించే దాతలు, అదే గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, పీఈటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తహసీల్దార్, ఎంఈవో, మండల ఇంజినీర్, ఎంపీడీవో, ఎస్సై, క్రీడాకారుడు, క్రీడాకారిణి, దాత.. ఇలా 11 మంది సభ్యులుగా ఉంటారు. స్పోర్ట్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ ఇలా ► మొదటగా గూగుల్ ప్లే స్టోర్‌లో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► డౌన్లోడ్ అయిన తర్వాత పేరు, మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► రిజిస్టర్ అయిన తర్వాత గ్రామం, సచివాల యం, పాఠశాల వివరాలు నమోదు చేయాలి. ► ఏ క్రీడపై ఆసక్తి ఉంటే దానిపై టచ్ చేసి రిజిస్టర్ కావాలి. ► అప్పటి నుంచి జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లలో సభ్యులుగా మారుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ల రూపంలో క్రీడల వివరాలు అందుతాయి. పల్లె మట్టి వాసనల్లో మరుగున పడిన క్రీడా ఆణిముత్యాలు ఇకపై అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు బాటలు పడ్డాయి. మారుమూల వీధుల్లో ఖోఖో అంటూ కూత పెట్టే యువతరం ఇక ఉన్నత స్థాయిలో మోత మోగించనుంది. మెరికల్లాంటి ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీస్తూ కబడ్డీ తొడగొట్టనుంది. సీనియర్ సిటిజన్స్ నుంచి చిన్నారి బుడతల వరకు ప్రతి ఒక్కరినీ ఆటలో అందలమెక్కిస్తూ శారీరక దారుఢ్యం పెంచుతూ క్రీడా రంగానికి ఉజ్వల భవిష్యత్ తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ద్వారా క్రీడాకారుల తర్ఫీదు, పోటీల నిర్వహణకు సమగ్ర విధివిధానాలు రూపొందించింది. పోటీల నిర్వహణ ఇలా.. ► పంచాయతీ కార్మదర్శులు, సచివాలయ అడ్మిన్ ప్రతి నెలా స్పోర్ట్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తారు. తొలుత వీఆర్వో, సర్వేయర్ల ద్వారా ఆట స్థలాన్ని గుర్తిస్తారు. క్రీడాకారులను ఇందులో భాగస్వాములను చేస్తారు. ఒక్కో క్రీడాంశానికి ఒక్కో క్లబ్‌ను ఏర్పాటు చేస్తారు. ► వెటరన్స్ కోసం జగనన్న వాకింగ్ క్లబ్‌లు రూపొందించారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రోబాల్ తదితర ఆటలు నిర్వహిస్తారు. ► సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ ఏర్పాటు చేస్తారు. ► క్రీడా స్థలాలు లేకపోతే వీధుల్లోనే దీనికి అనువైన ప్రదేశాలను గుర్తించి కబడ్డీ, వాలీబాల్, రబ్బర్ బాల్‌తో క్రికెట్ వంటి అనువైన ఆటలు ఆడిస్తారు. ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడా సామగ్రి సమకూరుస్తారు. ► మండల క్రీడాప్రాధికార సంస్థ సభ్యులు దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు అందజేస్తారు. టోర్నమెంట్లు, మ్యాచులు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించి స్పోర్ట్స్ అథారిటీకి ఆదాయాన్ని పెంచుతారు. ► ప్రతి మూడు నెలలకోసారి మండల, నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా పరిషత్‌ల ఆదాయం నుంచి నాలుగు శాతాన్ని క్రీడలకు వెచ్చిస్తారు. మంచి వేదిక క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి స్పోర్ట్స్ క్లబ్ మంచి వేదిక. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. యువత తమకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో యాప్‌లో నమోదు చేసుకోవాలి. క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను రూపొందించింది. – ఎ.మహేష్ బాబు చీఫ్ కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, పల్నాడు -
సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
టీనేజ్ అథ్లెట్‌తో సాయ్(SAI) మహిళా అధికారి మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. విషయంలోకి వెళితే.. షర్మిలా తేజావత్ అనే మహిళ ధార్‌లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోంది. సాయ్ సెంటర్‌కు వచ్చే టీనేజ్ అథ్లెట్స్‌ను షర్మిలా తేజావత్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్ పనులకు వాడుకోవడమే కాకుండా వారితో మసాజ్ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది. తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్ వారితో మసాజ్ చేయించుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో తేదీ, సమయం, మసాజ్ చేస్తున్న అథ్లెట్స్ ఏ క్రీడకు చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ షర్మిలాతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సాయ్ ఇంతవరకు స్పందించలేదు. అయితే మసాజ్ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణిని ప్రశ్నించగా.. ఆమె తన సమాధానాన్ని దాటవేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన క్రీడా శిక్షణా శిబిరంగా పేరున్న సాయ్కు ఇది పెద్ద మచ్చ లాంటిదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్‌గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడ్డారు. కాగా ధార్‌లోని జెట్‌పురాలోని కేంద్రానికి దేశం నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తుంటారు. #धार #साई ट्रेनिंग सेंटर स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का वीडियो वायरल हो रहा है, जिसमें साई सेंटर केंद्र प्रभारी सर्मिला तेजावत खिलाड़ियों से पैर दबवातीं नज़र आ रहीं हैं। खिलाड़ियों का ऐसा शोषण? कृपया संज्ञान लें @Media_SAI @YASMinistry @ianuragthakur #वायरल_वीडियो pic.twitter.com/JxxzJTR080 — 🇮🇳Sandeep Singh संदीप सिंह (@Sandeep_1Singh_) August 28, 2022 చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు. దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. -
కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లిన బృందంలో 10 మంది లంక ఆటగాళ్లు అదృశ్యం
కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హమ్ వేదికగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 8న ముగిశాయి. ఈ గేమ్స్‌కు 72 దేశాలు పాల్గొనగా.. అందులో శ్రీలంక కూడా ఉంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు)తో కూడిన అథ్లెట్ల బృంధం బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. అయితే గేమ్స్ జరుగుతున్న సమయంలోనే 10 మంది లంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు సమాచారం. కాగా ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం. వీళ్లకు ఆరునెలల పాటు వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృశ్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బర్మింగ్‌హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అదృష్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించి పతకాల పట్టికలో 31వ స్థానంలో నిలిచింది. -
కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులతో మాట్లాడిన ప్రధాని మోదీ