పారిస్ ఒలింపిక్స్‌లో పలువురు భారత సంతతి క్రీడాకారులు
ప్రతి క్రీడాకారుడి జీవితాశయం ఒలింపిక్స్‌లో పోటీపడటం, దేశానికి పతకం సాధించడం. అయితే ఈ విశ్వ క్రీడల్లో పాల్గొనాలంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. చాలా మందికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కదు. ఫలితంగా సత్తా ఉన్న వాళ్లు వేరే దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడి మరో మార్గంలో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే తమ కలను నిజం చేసుకుంటారు.
మరికొందరేమో తల్లిదండ్రుల వృత్తిరీత్యా స్వదేశాన్ని వీడి వేరే దేశంలో స్థిరపడతారు. వారి పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని ఒలింపిక్స్ స్థాయికి వెళతారు. మరో మూడు రోజుల్లో ఆరంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌తో బంధం ఉన్నా వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఉన్నారు. వారి వివరాలు క్లుప్తంగా...
రాజీవ్ రామ్ (టెన్నిస్; అమెరికా): రాజీవ్ రామ్ తల్లిదండ్రులు రాఘవ్, సుష్మా బెంగళూరు నుంచి చాలా ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. రాజీవ్ అమెరికాలోని డెన్వర్‌లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. 40 ఏళ్ల రాజీవ్ ఐదు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ సాధించాడు. వీనస్ విలియమ్స్‌తో కలిసి రాజీవ్ రామ్ 2016 రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం అందించాడు. పారిస్‌లో రాజీవ్ పురుషుల డబుల్స్‌లో పోటీపడనున్నాడు.
ప్రీతిక పవాడే (టేబుల్ టెన్నిస్; ఫ్రాన్స్): ప్రీతిక తల్లిదండ్రులు విజయన్, సుగుణ పుదుచ్చేరిలో జన్మించారు. 2003లో విజయన్ ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2004లో ప్రీతిక పారిస్‌లో జని్మంచింది. 16 ఏళ్లకే ప్రీతిక ఫ్రాన్స్ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడింది. స్వదేశంలో జరగనున్న ఒలింపిక్స్‌లో 19 ఏళ్ల ప్రీతిక మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్‌గా బరిలోకి దిగనుంది. మహిళల డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
శాంతి పెరీరా (అథ్లెటిక్స్; సింగపూర్): సింగపూర్ ‘స్ప్రింట్ క్వీన్’గా పేరొందిన వెరోనికా శాంతి పెరీరా పూర్వీకులది కేరళ. సింగపూర్‌లో వాళ్ల తాతకు ఉద్యోగం రావడంతో తిరువంతనపురం నుంచి సింగపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత ఏడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో శాంతి 100 మీటర్ల విభాగంలో రజత పతకం గెలిచి 49 ఏళ్ల తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సింగపూర్‌కు తొలి పతకాన్ని అందించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో సింగపూర్ బృందానికి శాంతి పతాకధారిగా వ్యవహరించనుంది.
కనక్ ఝా (టేబుల్ టెన్నిస్; అమెరికా): ఇప్పటికే రియో, టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న కనక్ ఝా నాలుగుసార్లు టేబుల్ టెన్నిస్‌లో అమెరికా జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. కనక్ తల్లి సుగుణ స్వస్థలం ముంబైకాగా.. తండ్రి అరుణ్ కోల్‌కతా, ప్రయాగ్‌రాజ్‌లలో పెరిగారు. వీరిద్దరు ఐటీ ప్రొఫెషనల్స్. వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లి కాలిఫోరి్నయాలో స్థిరపడ్డారు. 24 ఏళ్ల కనక్ 2018 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాడు.
అమర్ ధేసి (రెజ్లింగ్; కెనడా): అమర్‌వీర్ తండ్రి బల్బీర్ జాతీయ గ్రీకో రోమన్ చాంపియన్. పంజాబ్ పోలీసులో కొంతకాలం పనిచేశాక బల్బీర్ 1979లో కెనడాకు వచ్చి స్థిరపడ్డారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కెనడాకు ప్రాతినిధ్యం వహించిన అమర్ 125 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో 13వ స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై గురి పెట్టాడు. 28 ఏళ్ల అమర్ 2021 పాన్ అమెరికన్ చాంపియన్íÙప్‌లో పసిడి పతకం సాధించాడు. అనంతరం 2022 బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment