క్రీడాకారులకు ప్రోత్సాహం | Encouragement for athletes | Sakshi

క్రీడాకారులకు ప్రోత్సాహం

Aug 6 2016 7:39 PM | Updated on Oct 30 2018 5:04 PM

అంజుమ్‌ను అభినందదిస్తున్న ఎమ్మెల్యే - Sakshi

అంజుమ్‌ను అభినందదిస్తున్న ఎమ్మెల్యే

ఇటీవల నేపాల్‌లో జరిగిన రెండొందల మీటర్ల రన్నింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్ సాధించిన అంజుమ్‌ని ఎమ్మెల్యే ప్రబాకర్‌ అభినందించారు.

సదాశివపేట: క్రీడాకారులకు తాను చేయూతనిస్తానని ఎమ్మెల్యే చింతా  ప్రబాకర్‌ పేర్కొన్నారు.ఇటీవల నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ యూత్‌ ఆసోసియేషన్‌్‌ క్రీడా పోటీల్లో  రెండొందల మీటర్ల  రన్నింగ్‌ విభాగంలో  గోల్డ్‌ మెడల్ సాధించిన సదాశివపేట పాతకేరికి చెందిన ​అంజుమ్‌ని  శనివారం ఎమ్మెల్యే  అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంజుమ్‌   ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతునే  నేపాల్‌లో జరిగిన 200 మీటర్ల పరుగుపందెంలో గోల్డ్‌మెడల్ సాధించడం గర్వంగా ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తాన్నారు. 

కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్‌ చింతా గోపాల్‌, మండల కోఆప్షన్‌ మెంబర్‌్‌ సలావుద్దిన్‌, పట్టణ టీఆర్‌్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి చిన్న,  నాయకులు పట్నం సుభాశ్‌, షేజ్జీ, నల్ల శంకర్‌, అంజనేయులు, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement