encouragement
-
Dragon Fruit: వాణిజ్య పంట సాగు చేద్దామా..!
రాజాం సిటీ: ఇప్పుడిప్పుడే రైతులకు సుపరిచితమౌతున్న వాణిజ్యపంట డ్రాగన్ ఫ్రూట్. ఎక్కడో మెక్సికో, సెంట్రల్ అమెరికాలో పుట్టిన ఈ పంట ఇప్పుడు పల్లెలకు సైతం పాకుతోంది. ఈ పంట ద్వారా రైతులను ప్రోత్సహించేందుకు తోటల పెంపకానికి ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాణిజ్యపంటలపై అవగాహనతోపాటు సాగుచేసేందుకు ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. వాణిజ్యపంటగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న డ్రాగన్ తోటల పెంపకానికి సంబంధించి మూడేళ్లపాటు నిర్వహణకు నిధులు అందించనుంది. ఉపాధి పథకంలో జాబ్ కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న రైతులు ఈ తోలట పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా వాణిజ్యపంటలపై రైతులను ప్రోత్సహించడంతోపాటు వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీని నిర్వహణకు మూడేళ్లపాటు ఉపాధి పనుల్లో భాగంగా ప్రభుత్వం రూ. 3 లక్షల వరకు నిధులు సమకూర్చనుంది. అర్హులైన రైతులంతా ఈ తోటల పెంపకానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. ప్రోత్సాహం ఇలా.. పొలంలో ఏర్పాటుచేసుకున్న డ్రాగన్ తోటలకు వరుసగా మూడేళ్లపాటు రూ.3,08,722 వరకు రైతుకు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. ఈ మొత్తాన్ని వేతనదారులకు రూ. 71,420లు, మెటీరియల్ ఖర్చుకు సంబంధించి రూ. 2,37,302లు అందజేయనుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఉపాధిహామీ ద్వారా డ్రాగన్ తోటల పెంపకానికి కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధిలో జాబ్‌కార్డు కలిగిఉండడంతో పాటు 50 సెంట్ల భూమి ఉన్న వారంతా తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తమ పొలానికి భూసార పరీక్ష చేయించుకోవాలి. మూడేళ్లపాటు తోటల నిర్వహణకు రూ.3 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నాం. దీనికి అయ్యే పెట్టుబడిని రైతులే ముందుగా పెట్టుకోవాలి. - జి.ఉమాపరమేశ్వరి, పీడీ, డ్వామా -
ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్
ముంబై: ఫల్గుణి నాయర్ ప్రారంభించిన బ్యూటీ స్టార్టప్ ఆమెను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ర్యాంక్‌ల సరసన నిలిపింది. ఆమె స్థాపించిన ఈ కామర్స్ కంపెనీ నైకాలో సగం షేర్లు ఆమెవే. ఇప్పుడా ఆ షేర్లు 89% వరకు పెరగడంతో ఇప్పుడు 6.5 బిలియన్ డాలర్లు(రూ.48 కోట్లు)తో అత్యంత సంపన్నురాలుగా మారారు. అయితే బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న స్వీయ-నిర్మిత మహిళా బిలియనీర్‌గా నిలిచారు. (చదవండి: దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు) అంతేకాదు భారత్‌లో తొలిసారిగా ఒక మహిళ నేతృత్వంలోనైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్ యూనికార్న్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఒక్క ఊపూ ఊపింది. పైగా మార్కెట్ చేసిన శ్రేణిలో టాప్ ఎండ్‌లో నిర్ణయించిన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ధర 53.5 బిలియన్ రూపాయలను ($722 మిలియన్లు) సమీకరించి ఒక్కసారిగా 78% నికి ఎగబాకింది. అంతేకాదు నాయర్ గతంలో ఒక అగ్రశ్రేణి భారతీయ పెట్టుబడి బ్యాంకుకు నాయకత్వం వహించారు. నైకా స్థాపించక మునుపు దేశంలోని చాలా మంది మహిళలు మేకప్ మరియు జుట్టు సంరక్షణ ఉత్పత్తులను పొరుగున ఉన్న మామ్ అండ్ పాప్ స్టోర్లలో కొనుగోలు చేశారు. 2012లో నైకాని స్థాపించి ఆకర్షణీయమైన బాలీవుడ్ నటీనటులు, సెలబ్రిటీల డెమో వీడియోలతో ఆన్లైన్ విక్రయాలను సాగించి ఒక్కసారిగా దాదాపు 70 స్టోర్లను ప్రారంభించింది. దీంతో నైకా మంచి లాభదాయకమైన సంస్థగా నిలవడమేకాక పబ్లిక్ మార్కెట్లోకి అరగేట్రం చేసిన తొలి ఇంటర్నెట్ స్టార్టప్‌గా కూడా నిలిచింది. (చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’) -
తైజుయింగ్ మనసు గెలుచుకున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించి యావత్ భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్న తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్లో తనను ఒడించిన చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్ మనసు కూడా గెల్చుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ఓటమి తరువాత సింధు నిజాయితీగా అందించిన మద్దతుతో తనకు కన్నీళ్లొచ్చాయని తైజుయింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు తైజూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. బంగారు పతకాన్ని కోల్పోవడం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒలింపిక్స్ కలల వేదికపై మూడోసారి అడుగుపెట్టి.. చివరకు ఫైనల్‌కు చేరుకున్నాను, కానీ ఫైనల్లో విజయం సాధించలేకపోయాను. లోపాలు ఎప్పుడూ ఉంటాయి, అయినా మెరుగైన ఫలితాన్ని సాధించడం ఉత్సాహాన్నిచ్చింది. తైజూయింగ్ యూ ఆర్ గ్రేట్ అంటూ తనను తాను అభినందించుకోవడం విశేషం ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటూ సింధుపట్ల తన గౌరవాన్ని చాటుకుంది. మ్యాచ్ తర్వాత సింధు పరుగెత్తుకువచ్చి ఆలింగనం చేసుకుంది. ఆరోగ్యం బాగా లేకపోయినా, టప్ ఫైట్ ఇచ్చారు. కానీ ఈ రోజు మీది కాదంటూ అనునయంగా చెప్పి తను ఏడిపించేసిందంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు. కాగా రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా వీసీ సింధు రికార్డు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో తైజుయింగ్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, కాంస్య పతకం మ్యాచ్‌లో హీ బింగ్ జియావోను ఓడించింది. దీంతో వీవీ సింధుపై ప్రశంసల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌కు ఒలింపిక్స్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. గట్టిగా పోరాడినప్పటికీ చైనాకు చెందిన చెన్ యు ఫే (18-21, 21-19, 18-21 తేడాతో) చేతిలో ఓటమి పాలై తైజుయింగ్ గోల్డ్ మెడల్ చేజార్చుకుంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ లక్ష్యంగా పోరాడి చివరకు రజత పతకంతో సరిపెట్టుకుంది. View this post on Instagram A post shared by Tai Tzu Ying戴資穎 (@tai_tzuying) -
ఓయోలో 1,000 మందికి ఉద్వాసన..!
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ‘ఓయో’ 1,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీని వీడి ఇతర సంస్థల్లో ఉద్యోగాలను చూసుకోవాలంటూ పలువురికి ఈ–మెయిల్స్ అందినట్లు వెల్లడైంది. అయితే, దీనిపై ఇప్పటివరకు కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.‘రైట్–సైజింగ్’ పేరిట ఈ ఉత్తరాలు అందినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై సంస్థ సీఈఓ రితేష్ అగర్వాల్ స్పందిస్తూ.. ఉద్యోగులను బయటకు వెళ్లి మరో సంస్థలో చేరమని కోరడం అంత సులువైన విషయం కాదని వ్యాఖ్యానించారు. -
కూతకు వెళ్తే పతకం కానీ అడ్డుగా పేదరికం
సాక్షి, పత్తికొండ(కర్నూలు) : ప్రతిభ ఉన్న ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువై ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో నరేష్ ఒకరు. అతని ప్రతిభకు పేదరికం అడ్డుగా మారింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారుడు కబడ్డీలో రాణిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏ జట్టులో ఉన్న ప్రత్యేకత చాటుతూ పతకాలు సాధిస్తున్నాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతానంటున్నాడు. మిగతా వివరాలు అతని మాటల్లో ‘మాది పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ గ్రామం. వంకాయల నాగప్ప, సువర్ణమ్మలకు నేను రెండో సంతానం. మోడల్ స్కూల్‌కు ఎంపిక కావడంతో 9వ తరగతిలో చేరా. ప్రస్తుతం అక్కడే సీఈసీ సెకండియర్ చదువుతున్నా. పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ క్రీడలపై ఆసక్తితో కబడ్డీ బాగా అడేవాడిని. ఉపాధ్యాయుల సహకారంతో స్కూల్ స్థాయి టోర్నమెంట్లో పత్తికొండ, పుచ్చకాయలమాడ, బినిగేరి, ఎం.అగ్రహారం, పత్తికొండ, మొలగవల్లి, జొహరాపురంలో టీం తరఫున ఆడాను. ఆదోని జోనల్ పోటీల్లో రాణించడంతో గుర్తించిన జిల్లా అసోషియేషన్ సహకారంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ పోటీలకు అవకాశం లభించింది. ఇండియన్ రూరల్ ఒలంపిక్ అసోషియేషన్ తరఫున మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జూన్ 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చాటాను. ఈ పోటీల్లో ఫైనల్స్ మ్యాచ్‌లో హర్యానా జట్టుపై ఆంధ్రజట్టు రన్నర్స్‌గా నిలిచింది. జట్టులో నేను ప్రతిభ కనపరచడంతో జూన్ 27న రాజస్థాన్‌లో యూత్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా ప్రతిభ చాటాను. -
దేనికైనా టైమ్ రావాలి
బ్యాడ్ టైమ్‌లో బాధపడి లాభం లేదు. ఓపిక పట్టాలి. దేనికైనా టైమ్ రావాలి అంటున్నారు కథానాయిక ఆండ్రియా జెర్మియా. ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇలా సడన్‌గా ఫిలసాఫికల్ టర్న్ ఎందుకు తీసుకున్నారు? అని ఆండ్రియాని అడిగితే... ‘‘బేసిగ్గా నాకు కాస్త ఓపిక తక్కువ. అన్నీ వెంట వెంటనే జరిగిపోవాలని ఆరాట పడతాను. ‘‘తారామణి’ సినిమాకు మంచి అప్రిషియేషన్ దక్కిన తర్వాత నాకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించుకున్నాను. కానీ అలా జరగలేదు. కాస్త దిగులు పడ్డాను. ‘ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని బాధపడకు. అందరూ ఇప్పుడే నీ కోసం పాత్రలు రాస్తూ ఉండొచ్చు. రానున్న రోజుల్లో పుల్ బిజీగా ఉంటావ్’ అని దాదాపు ఎనిమిది నెలల క్రితం దర్శకుడు వెట్రిమారన్ ధైర్యం చెప్పారు. ఎగ్జాట్లీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అప్పుడు అర్థం అయ్యింది.. దేనికైనా టైమ్ రావాలని. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం కంగారు పడటం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఓర్పుతో నేర్పుగా ముందడుగు వేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
‘తేజ’స్సుకు చేయూత కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఆ కుర్రాడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం... తండ్రి టీ కొట్టులో పని చేస్తాడు. వానొచ్చినా, వరదొచ్చినా వెళ్లి పని చేస్తేనే కుటుంబం గడుస్తుంది. కానీ ఆ కుర్రాడి మేధస్సు అపారం. చెస్ క్రీడ అంటే అపరిమితమైన అభిమానం. అందుకే ఆట కోసం తన ఆకలిని మరిచాడు. అవసరమైనప్పుడు కిలో మీటర్ల కొద్దీ నడిచాడు. పట్టుదలగా సాధన చేసి పోటీల్లో తనదైన ముద్ర చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు. 17 ఏళ్ల ఆ కుర్రాడి పేరు పి. షణ్ముఖ తేజ. ఇటీవల అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన 1600లోపు ‘ఫిడే’ రేటింగ్ ఇంటర్నేషనల్ టోర్నీలో విజేతగా నిలిచి అతను అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చెస్‌లో ముందుకు సాగుతున్న తేజ కెరీర్లో మరింత ఎదగాలని పట్టుదలగా ఉన్నాడు. మొబైల్‌తోనే మెళకువలు: పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రోత్సాహంతో షణ్ముఖ చెస్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత పలు చిన్న స్థారుు పోటీలలో పాల్గొంటూ తన ప్రతిభను ప్రదర్శించాడు. కానీ ఆర్థిక సమస్యలు అతనికి కోచింగ్ తీసుకునేందుకు అడ్డంకిగా నిలిచారుు. దాంతో ఆన్లైన్ ద్వారా చెస్‌లో మెళకువలు నేర్చుకోవాలని నిర్ణరుుంచుకున్నాడు. అరుుతే కంప్యూటర్ కొనే శక్తి లేదు. దాంతో అతను తన మొబైల్ ఫోన్‌నే నమ్ముకున్నాడు. అందులోనే చెస్ పాఠాలు నేర్చుకుంటూ తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. గురువు లేకపోరుునా... తన మేధస్సుకు పదును పెట్టి నిలదొక్కుకునేందుకు అతను తీవ్రంగా శ్రమించాడు. గేమ్‌లు ఆడటం ద్వారా...: తల్లిదండ్రులు అండగా నిలవడంతో తేజ చెస్కే అంకితమైపోయాడు. ఎక్కడ చెస్ టోర్నీ జరిగినా ఆడటం... విజయాలు వచ్చినా, పరాజయం దక్కినా సాధన కొనసాగించాడు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కొందరు తమ పిల్లలకు చెస్‌లో శిక్షణ ఇప్పిస్తుంటారు. వారి ఆట మెరుగయ్యేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ గేమ్‌లు ఆడాల్సి ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యర్థిగా ఆడిన వ్యక్తికి కొంత మొత్తం ఇస్తారు. షణ్ముఖ నగరంలో ఇలాంటి అవకాశం ఎక్కడ ఉన్నా వెళ్లిపోయేవాడు. వచ్చిన డబ్బులతో మళ్లీ ఎంట్రీ ఫీజు కట్టి టోర్నీలు ఆడుతూ తన ఆటను కొనసాగించాడు. ఎక్కడైనా గెలిచి ప్రైజ్‌మనీ వస్తే మంచిది లేదంటే మళ్లీ కష్టాలు మొదలు. కొన్ని సార్లు టోర్నీకి వెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఎంత దూరమైనా నడిచి వెళ్లేవాడు. అలా జిల్లా, రాష్ట్ర స్థారుుల్లో అనేక విజయాలు నమోదు చేశాడు. గత ఏడాది రాష్ట్ర జట్టుకు ఎంపికై నా డబ్బులు లేకపోవడంతో టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది . సహకారం లభిస్తే...: చెస్ కోసం ఇప్పుడు మేధస్సు ఉంటే మాత్రమే సరిపోదు. మంచి ఆర్థిక నేపథ్యం కూడా ఉండాల్సిన పరిస్థితి. కోచ్‌లు శిక్షణ ఇచ్చేందుకు గంటల లెక్కన డబ్బులు తీసుకుంటారు. కాస్త మెరుగైన కోచ్ దగ్గర శిక్షణ నెలకు దాదాపు రూ. 15-20 వేల మధ్యలో ఉంటుంది. దీనిని భరించగల స్థోమత షణ్ముఖకు లేదు. ప్రస్తుతం 1536 రేటింగ్ ఉన్న అతను ఇప్పటి వరకు మొబైల్లో శిక్షణ, సొంత ఆలోచనలతోనే నడిపించాడు. కానీ కెరీర్లో ఇంకా ఎదగాలంటే ఇది సరిపోదు. కాబట్టి ఎవరైనా అండగా నిలవాలని అతను కోరుతున్నాడు. ‘మంచి కోచింగ్, ల్యాప్‌టాప్ సౌకర్యంలాంటిది ఉంటే నా ఆట ఈ దశలో ఎంతో మెరుగవుతుంది. ఇప్పటి వరకు ఇబ్బందిగానే గడిచినా, ఇక ముందు మంచి ఫలితాలు సాధించాలంటే ఉన్నత స్థారుు శిక్షణ అవసరం. ప్రైజ్‌మనీ కొంత వరకు ఉపయోగపడుతున్నా, అది ఏమాత్రం చాలదు. ఎవరైనా నాకు ఆర్థిక సహకారం అందిస్తే ఇంకా గొప్ప విజయాలు సాధించగలనన్న నమ్మకం ఉంది‘ అని షణ్ముఖతేజ చెప్పాడు. క్రీడాభిమానులు, కార్పొరేట్లు ముందుకు వస్తే ఈ యువ మేధావి మరింత దూసుకుపోగలరనడంలో సందేహం లేదు. ప్రోత్సహించిన తల్లిదండ్రులు.. షణ్ముఖ తండ్రి జయనారాయణ నల్లకుంట తిలక్‌నగర్ వద్ద హోటల్లో టీ తయారు చేస్తుంటారు. తల్లి సుబ్బలక్ష్మికి పోలియో. స్టాండ్ ఆధారం లేకుండా ఆమె నడవలేరు. జయనారాయణ ఆదాయం కుటుంబ పోషణకే సరిపోదు. ఇక కుర్రాడికి కావాల్సిన సౌకర్యాలు ఇప్పించడం అసాధ్యం. కానీ ఆయన తన కొడుకును నిరుత్సాహపర్చలేదు. ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటూ తేజను టోర్నమెంట్లకు పంపిస్తున్నారు. అప్పోసొప్పో చేసి ఎంట్రీ ఫీజులు కట్టి ప్రోత్సహిస్తున్నారు. -
క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎమ్మెల్యే అరూరి రమేష్ నవోదయ క్లస్టర్ బాల్‌గేమ్స్ ప్రారంభం మామునూరు : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తోందని, క్రీడాభివృద్ధికి బడ్జెట్లో రూ.120కోట్లు కేటాయించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. హన్మకొండ మండలం మామునూరు నవోదయ విద్యాల యం క్రీడామైదానంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో జరిగే అండర్–14, 17, 19 బాలబాలికల క్లస్టర్ బాల్‌గేమ్స్ పోటీలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ హాజరై క్రీడా పతాకా న్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర స్థాయి నవోదయ క్లస్టర్ గేమ్స్ ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, షటిల్, బాడ్మిం టన్, వాలీబాల్ క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ఎదిగి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. నవోదయ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు వెలకితీయాలని సూచించారు. ఇచ్చిన హామీ మేరకు నవోదయ విద్యాలయంలో విద్యార్థు లు శీతాకాలంలో వేడినీటితో స్నానం చేసేం దుకు సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తొమ్మిది జిల్లాల నవోదయ విద్యాలయాల నుంచి చేరుకున్న క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకున్నారు. అంతకుముందు మెుక్కలు నాటారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు కేదారిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు. నవోదయ యాజమాన్యం, విద్యార్థులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు ఆయన చిత్రపటం, మోమెంటోను అందజేసి సన్మానించా రు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు జలగం రంజి త్, పోశాల సదానందం, ఇళ్ల నాగేశ్వర్రావు, ఊకంటి వనంరెడ్డి, మాచర్ల కోమారస్వామి, బి.జయశంకర్, శ్రీనివాస్‌రెడ్డి, కుసుమ సతీష్, మేకల సూరయ్య, ఇనుగోల జోగిరెడ్డి, జిల్లా నవోదయ బాలబాలికలు, కోచ్‌లు, బెటాలియన్ డీఎస్పీ రవికుమార్, రంగరాజు ప్రకాశ్, ఫార్మసిస్ట్ జలగం రమేష్ పాల్గొన్నారు. -
క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలి
కోదాడఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ్రMీ డాకారులకు ప్రోత్సాహమిచ్చి క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు చందా నాగిరెడ్డి కోరారు. బుధవారం కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ అతిథిగృహంలో జరిగిన సమావేశంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాలు నిర్మించాలన్నారు. క్రీడాకారులైన విద్యార్థులకు ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో 2.5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రీడాకారుల సంక్షేమం కోసం ఈ నెల 21న పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల సంక్షేమ నియోజకవర్గ కమిటీని ఎన్నుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో క్రీడాకారులు కళ్యాణ్, శ్రీనివాసరావు, ఎస్కె.బాగ్దాద్, తిరుపతయ్య, ఆలేటి సహదేవ్, శ్రావణ్‌కుమార్, పాలడుగు సంజీవ్, జూలూరు వీరభద్రం, చిన్నా, గోపిచంద్, రామదాసు, విజయ్‌కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు ప్రోత్సాహం
సదాశివపేట: క్రీడాకారులకు తాను చేయూతనిస్తానని ఎమ్మెల్యే చింతా ప్రబాకర్ పేర్కొన్నారు.ఇటీవల నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ ఆసోసియేషన్్ క్రీడా పోటీల్లో రెండొందల మీటర్ల రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సదాశివపేట పాతకేరికి చెందిన అంజుమ్‌ని శనివారం ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజుమ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతునే నేపాల్‌లో జరిగిన 200 మీటర్ల పరుగుపందెంలో గోల్డ్‌మెడల్ సాధించడం గర్వంగా ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్ చింతా గోపాల్, మండల కోఆప్షన్ మెంబర్్ సలావుద్దిన్, పట్టణ టీఆర్్ఎస్ ప్రధాన కార్యదర్శి చిన్న, నాయకులు పట్నం సుభాశ్, షేజ్జీ, నల్ల శంకర్, అంజనేయులు, ఏసయ్య తదితరులు పాల్గొన్నారు. -
చేనేతకు ప్రోత్సాహమేది?
నగరి:‘చేనేతకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం అందించడంలేదు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఏమీ మిగలడం లేదు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోలేక పోతున్నాం.’ అని నగరి మండలం మాంగాడు గ్రామంలో నేత కార్మికులు ప్రభుత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మెల్యే ఆర్కే రోజా గడప గడపకూ వైఎస్ఆర్లో భాగంగా మాంగాడులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఆమె సమస్యలు తెలుసుకున్నారు. చేనేతలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. -
'బాబూ.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి'
విజయవాడ: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించడం చంద్రబాబు దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని మధు తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అనుసరించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. -
స్టూడెంట్ స్టార్స్
నవ్యత్వానికి.. ఉరకలెత్తే ఉత్సాహానికీ ప్రతీకలు.. యువకులు, విద్యార్థులు. ప్రోత్సహిస్తే చాలు.. ఎవరెస్టునైనా అవలీలగా ఎక్కేయగలరు. వారికి కావాల్సింది కాస్తంత ప్రోత్సాహం. ఇది కరువయ్యే చాలామంది లక్ష్యం నుంచి చివరి క్షణంలో తప్పుకుంటున్నారు. వెన్నుతట్టే వారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అటువంటి వారి కోసం నేనున్నానంటోంది ‘స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్’. ..:: కోన సుధాకర్‌రెడ్డి కష్టపడి చదువుతారు. పరీక్ష లేదా ఇంటర్వ్యూ వరకు వెళ్లేసరికి నీరుగారిపోతారు. నటనతో ధూమ్‌ధామ్ చేయాలనుకుంటారు. స్టేజ్ ఎక్కగానే నీరసపడిపోతారు. అద్భుతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆరంభశూరులుగానే మిగిలిపోతారు. ఇంగ్లిష్‌లో అదరగొట్టాలనుకుంటారు. మాట్లాడాలనుకునే సరికి నోట్లోంచి మాటలు పెగలవు. ఇటువంటి యువత వెన్నుతడుతూ ముందడుగు వేయిస్తోంది స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్. ‘విజయంలో శభాష్ అనాలి.. ఓటమిలో వెన్ను తట్టాలి’ అంటున్న ఈ సంస్థ ప్రోత్సాహంతో ఇటీవల 12 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ‘రాక్‌స్టార్’ పేరుతో ఏకకాలంలో 37 కళారూపాల ప్రదర్శనలతో అదరగొట్టారు. భయం.. ఆందోళన.. ఈ రెండే నేడు విద్యార్థులకు, యువతకు శత్రువులు. అటువంటి వారిలో స్థైర్యాన్ని నింపుతోంది స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్. సిటీలోని యువత, విద్యార్థుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్టేజ్ ఫియర్ పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. ‘భయాన్ని తొలగిస్తే, ఎవరికి వారే ముందుకు నడుస్తారు’ అంటారు స్మార్ట్ స్కిల్స్ ల్యాబ్స్ కో- ఫౌండర్, సీఈవో డేనియల్రాజ్. విద్యార్థుల్లో నెలకొన్న భయం, ఆందోళన అనే భావనలే వారి ఓటమికి కారణమవుతున్నాయని గుర్తించాం. అదే సంస్థగా రూపాంతరం చెందిందని అంటారాయన. చదువుతూ పాడుతున్నాం.. మాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం హాబీ. అయితే దీన్ని వెలుగులోకి తెచ్చుకునే ధైర్యం చేయలేకపోయాం. ఇప్పుడు స్టేజ్ ఎక్కిన అనుభవం భయాన్ని పోగొట్టింది. కొన్ని ఆల్బమ్స్ చేశాం. భవిష్యత్తులో సినిమాల్లో పాడాలని తపన. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీ వెలుగు చూసేందుకు ఒక ప్లాట్‌ఫాం అవసరం’ అంటారు డిగ్రీ మొదటి సంవత్సరం భవన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు గాయత్రి, తేజస్విని, భానువర్ష. ఇలాంటి ఎంకరైజ్డ్ ప్లాట్‌ఫాంలు మరిన్ని సిటీలో రావాలి అంటున్నారు వీరు. ప్రోత్సాహమిస్తే అందరూ స్టార్సే.. శ్రీనిధి కాలేజ్‌లో బీఈ సెకండియర్ చదువుతున్న జి.అరుణ్‌కు తెలంగాణ జానపద గీతాలంటే చాలా ఇష్టం. కానీ, స్టేజ్ షో ఇవ్వాలంటే బెరుకు. కానీ, తొలి ప్రదర్శనలో అతను అదరగొట్టాడు. ‘చాలామంది యువత ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనుతిరుగుతున్నారు. స్కిల్స్ లేవా అంటే ఉంటాయి. కానీ భయమే కారణం. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్, మిమిక్రీ వంటి వాటిలో చదువుకునే సమయంలో ప్రతిభ కలిగి ఉంటారు. కానీ, భయం వల్ల ప్రదర్శించలేరు. అటువంటి వారి కోసమే ‘రాక్‌స్టార్-2014’ ప్లాట్‌ఫాం కావాలని భావించి.. అందరినీ ఒక వేదికపైకి తెచ్చాం. తొలి ప్రదర్శన ఇంత విజయవంతం అవుతుందని ఊహించలేదు’ అని అంటారు డేనియల్ రాజ్. ఉత్సాహమొచ్చింది.. సాయికుమార్ రూబిక్స్ క్యూబ్స్‌లో ఆరు కలర్స్‌ను 14 సెకన్లలో ఒకచోటికి తేగలడు. అదే పనిని కళ్లకు గంతలు కట్టుకొని నాలుగు నిమిషాల్లో చేస్తాడు. భవన్స్ డిగ్రీ కాలేజ్‌లో థర్డియర్ స్టూడెంట్ అయిన ఇతనిలో ఇంత ప్రతిభ ఉన్నా ఏనాడూ ప్రదర్శించాలనుకోలేదు. అందరి ఎదుటా ప్రదర్శిస్తే ఫెయిలవుతానని భయం.. హరిహరకళాభవన్‌లో ‘రాక్‌స్టార్’ కింద ఇతనూ తన ప్రదర్శననిచ్చాడు. చివరకు అతని ఆత్మవిశ్వాసమే అతనిని గెలిపించింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న సాయికుమార్.. వర ల్డ్ క్యూబ్ అసోషియేషన్ (లాస్ఏంజెల్స్) త్వరలో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి సన్నద్ధమవుతున్నాడు. -
కూరల రైతుకు ప్రోత్సాహం కరువు
నిరుపయోగంగా చెక్‌డ్యాంలు విత్తనాలు అందించని ఐటీడీఏ ఏటా తప్పని నష్టాలు అరకులోయ : మండలంలోని చినలబుడు పంచాయతీలోని గిరిజన రైతులకు కూరగాయల సాగు జీవనాధారం. ఈ పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయి. సుమారు 600 మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరిలో 400 మంది రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తుంటారు. పండించిన కూరగాయలను విశాఖ, విజయనగరం ప్రాంతాల్లోని రైతు బజార్లకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏటా అతివృష్టి, అనావృష్టి పంటలను దెబ్బ తీస్తున్నా వీరు కూరగాయల సాగునే నమ్ముకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సమయానికి కురవకుండా ముఖం చాటేయ్యడంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఏడాదికి రెండుసార్లు పంటలు పండించుకుని తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ, పిల్లల చదువుకు వినియోగిస్తుంటారు. ఒక్కో రైతు తమకున్న రెండు, మూడు ఎకరాల్లోనే పలు కూరగాయలను సాగు చేస్తుంటారు. ఈ రైతుల కోసం పదిహేనేళ్ల క్రితం 16 చెక్ డ్యాంలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మూడు చెక్‌డ్యాంలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన చెక్‌డ్యాంలను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు ప్రభుత్వానికి, పాడేరు ఐటీడీఏ అధికారులకు గతంలో ఎన్నోమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. వాతావరణం అనుకూలించి నీటి సదుపాయం కలిగితే ప్రతి రైతు ఏటా కూరగాయల సాగు ద్వారా రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందుతున్నట్టు రైతులు తెలిపారు. గిరిజనులు పండించిన కూరగాయలు నేరుగా్గా విక్రయించుకోవడానికి విశాఖలోని ఎంవీపీ కాలనీలోని రైతు బజార్లో ఉచితంగా స్టాల్స్‌ను కూడా ప్రభుత్వం గిరిజన రైతులకు కేటాయించడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. పదేళ్ల క్రితం ఈ పంచాయతీలోని కూరగాయ రైతులను ప్రోత్సాహిస్తూ సబ్సిడీపై విత్తనాలు కూడా పాడేరు ఐటీడీఏ సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేక పోవడంతో ఒడిశా, విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేసుకుని వచ్చి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది నష్టం తప్పదు చెక్‌డ్యాంలు ఎండిపోయాయి. వర్షం చాలా ఆలస్యమైంది. భూమి చదును చేసి, కూరగాయ నారలు సిద్ధం చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. -కిల్లో మొద్దు, కూరగాయ సాగు రైతు, చినలబుడు ఐటీడీఏ చేయూత నివ్వాలి గతంలో ఐటీడీఏ సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసేది. అయితే పదేళ్లుగా ఐటీడీఏ గిరిజన రైతులను పట్టించుకోవడం లేదు. నిత్యం కూరగాయలు సాగు చేసి బతుకుతున్నాం. సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసి రైతులకు కష్టకాలంలో ఆదుకుంటే బావుంటుంది. -బురిడి డొంబు, కూరగాయల సాగుదారుడు, చినలబుడు