విజయవాడ: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించడం చంద్రబాబు దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని మధు తెలిపారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అనుసరించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
'బాబూ.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి'
Published Wed, Feb 24 2016 2:32 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement