Madhu
-
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !
హైదరాబాద్, సాక్షి: రియల్టర్ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్.. ఎక్కడో బీదర్‌లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారొచ్చని అంతా భావించారు. అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.బిల్డర్ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్ ఎస్టేట్‌తో పాటు ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్‌తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా గ్యాంగ్‌తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.ముందుగా హైదరాబాద్‌లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.24న తేదీ..మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్ కోసం తనతో పాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం కనిపించింది. కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.అయితే.. హైదరాబాద్‌లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఒంటిపై 20 లక్షల బంగారం, 5 లక్షల క్యాష్.. 30 సార్లు కత్తితో పొడిచి..
-
ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
కుత్బుల్లాపూర్: కాపు సంఘం నేత, బిల్డర్ కుప్పల మధు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు బీదర్ జిల్లాకు చెందిన మానే కేలి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధు ఈ నెల 24న ఉదయం తన కారులో డ్రైవర్ రేణుక అనే వ్యక్తి తో కలిసి బీదర్ వెళ్లాడు. చింతల్ ప్రాంతంలో మరో ఇద్దరు కారులో ఎక్కినట్లు తెలిసింది. నలుగురు కలిసి బీదర్ ప్రాంతంలో ఓ క్లబ్బులో గడిపారు. అదే రోజు రాత్రి మధు భార్య లక్ష్మి అతడికి ఫోన్ చేయగా అప్పటికే బయలుదేరినట్లు చెప్పాడు. మరో గంట తర్వాత ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉంటుందని భావించారు. అయితే శనివారం ఉదయం బీదర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఉన్న కారు నెంబరు ఆధారంగా కర్ణాటక పోలీసులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ కల్పన సొసైటీలో ఉన్న మధు ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మీకి మధుకు కారు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా మధు హత్యకు గురైనట్లు తెలిసి వారు షాక్ అయ్యారు . అతడి శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బండరాయి మోది హత్య చేసినట్లు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో రూ . 5 లక్షల నగదు, ఒంటిపై రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని తీసుకువచ్చి పద్మా నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పథకం ప్రకారమే హత్య చేశారా..! రియల్ వ్యాపారిగా, కాపు సంఘం నేతగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సుపరిచయస్తుడిగా ఉన్న మధు కొద్ది కాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మంది మార్బలం.. ఒంటినిండా నగలతో కనిపించాడు.. ఇటీవల అతడి పెద్ద కుమార్తెకు వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్టులో పెళ్లి ఉండగా ఇంతలోనే హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హత్య పథకం ప్రకారమే చేశారా..! ఎవరైనా పాత ఆరి్థక లావాదేవీలతో సుపారి ఇచ్చి హత్య చేయించారా..? డబ్బు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే డ్రైవర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా..! వెంట వెళ్లిన వారి సెల్ఫోన్లు ఎందుకు స్విచ్ఛాఫ్ చేశారు ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి. కర్ణాటక పోలీసులు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా అందరితో ఆప్యాయంగా మాట్లాడే మధు అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. అతడి వద్ద ఎన్నో ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న రేణుక దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
నీలం మధుకే మెదక్ టికెట్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ టికెట్ నీలం మధు ముదిరాజ్‌కు దక్కింది. బీసీ సామాజిక సమీకరణ ఈయనకు కలిసొచ్చింది. ఇదివరకే ఈ స్థానం నుంచి బీఆర్ఎస్, బీజేపీలు ఓసీలకు టికెట్లు కేటాయించాయి. కాగా, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ నేతను బరిలోకి దింపుతోంది. ఈ అభ్యర్థిత్వం విషయమై నీలం మధు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. బీఆర్ఎస్లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.నరేంద్రనాథ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకుంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. మరో పారిశ్రామికవేత్త పేరు సైతం వినిపించింది. కానీ హస్తం పార్టీ అధినాయత్వం చివరకు మధు వైపే మొగ్గు చూపింది. ఆయనకు సీఎం రేవంత్ ఆశీస్సులున్నాయి. బీఎస్పీ నుంచి పోటీ బీఆర్ఎస్లో చాలా కాలం కొనసాగిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు స్థానం నుంచి టికెట్ ఆశించారు. దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. చివరి క్షణంలో ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను పార్టీ బరిలోకి దింపడం తెలిసిందే. దీంతో మధు బీఎస్పీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్ చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఈ టికెట్ దక్కింది. వార్డుమెంబర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా.. మధు.. 2001లో బీఆర్ఎస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పటాన్చెరు మండలం చిట్కుల్లో వార్డ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో చిట్కూర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్ఎంఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనకు పటాన్‌చెరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. ప్రధానంగా ముదిరాజ్ సామాజికవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బరిలోకి దించడం ద్వారా ఆ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. -
అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్ నియమితులయ్యారు. అపోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా 2023 అక్టోబర్‌లో ఆయన చేరారు. యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ట్రెడిషన్ హాస్పిటల్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. -
బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు
సాక్షి, హైదరాబాద్: బహు జన సమాజ్ పార్టీ అభ్య ర్థులు రాష్ట్రంలోని 119 ని యోజకవర్గాల్లో నామినేష న్లు దాఖలు చేశారు. శుక్రవారం పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో బీఎస్పీ తొలిసారి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాగా, నాటకీయ పరిణామాల మధ్య పటాన్చెరు స్థానం నుంచి నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఆయన పేరును మొదట ప్రకటించినప్పటికీ, తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మధు బీఎస్పీలో చేరారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం: ప్రవీణ్‌కుమార్: తెలంగాణలో అవినీతి, కు టుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్ర జలు సిద్ధంగా ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ప్రవీణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బహుజనుల రాజ్యాధికార కల సాకారం అ య్యే రోజు దగ్గర్లోనే ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను జనం నమ్మడం లేదని అన్నారు. -
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్‌గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్‌ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్‌ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్‌కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
కాంగ్రెస్‌లో తేలని పటాన్చెరు పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు టికెట్ పంచాయితీ ఇంకా పరిష్కారం కాలేదు. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో తన పేరు ఉండడంతో బీఫారం తీసుకునేందుకు నీలం మధు ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఏఐసీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని, స్పష్టత వచ్చిన తర్వాత బీఫారం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చెప్పారు. దీంతో మధు అనుచరులు కొంతసేపు గాంధీభవన్‌లో హడావుడి చేశారు. టికెట్ ప్రకటించి బీఫాం ఎందుకు ఇవ్వరంటూ ఆందోళన నిర్వహించారు. ఈ టికెట్ విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గట్టి పట్టు పడుతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన విధంగా మధుకు కాకుండా తన సన్నిహితుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీలో మకాం వేశా రు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన నామినేషన్ వేయాల్సి ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. తనకు జ్వరం వచ్చినందున బుధ, గురువారాల్లో నిర్ణయించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నానని, ఈనెల 10న తాను నామినేషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. అయి తే, మధుకు బీఫాం ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారని, ఈ కోణంలోనే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంగిశెట్టి, సలీం రాజీనామా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ముషీరాబాద్ టికెట్ ఆశించిన సంగిశెట్టి జగదీశ్వర్‌రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో బీసీలకు అన్యాయం చేసినందున తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మైనార్టీ నేత సలీం కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాం«దీభవన్‌కు వచ్చిన ఆయనకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు బోసురాజు, గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, నవీన్ భార్యకు తుంగతుర్తి టికెట్ కేటాయించనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు బుధవారం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయమే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. -
Neelam Madhu: నీలంకు గాలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నీలం మధుకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న మధును పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అతనికి స్థానికంగా యువతలో మంచి క్రేజ్ ఉంది. అలాగే బీసీ సామాజికవర్గాల్లోనూ మద్దతు ఉంది. స్థానికంగా బలం, బలగం రెండూ ఉన్న మధును పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముది రాజ్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల గెలుపోటములను ప్రభావితం చేసేంత సంఖ్యలో వారు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలంటూ ముదిరాజ్‌లు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అతడిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గాల మద్దతును కొంత మేరకు కూడగట్టుకోవచ్చనే భావన ప్రతిపక్ష పార్టీల్లో ఉంది. అభ్యర్థిత్వం పరిశీలిస్తామని ఆఫర్ బీఆర్ఎస్ పటాన్చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారైంది. అంగ, ఆర్థిక బలంతోపాటు నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఆయనను ఢీకొనగల సత్తా ఉన్న నాయకులను బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది. మధును బరిలోకి దించితే బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వగలరని, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అభ్యర్థులకు కూడా చాలా వరకు మేలు జరుగుతుందనే భావనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన చేరితే అభ్యర్థిత్వం విషయంలో పేరును పరిశీలిస్తామనే ప్రతిపాదన వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో చేరికల కమిటీ బాధ్యతలు చూస్తున్న ఈటల రాజేందర్ కూడా మధు చేరిక విషయంలో పార్టీ జిల్లా నాయకత్వానికి పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు చర్చ జరుగుతోంది. పాదయాత్రకు సిద్ధమవుతున్న నీలం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నీలం మధును గులాబీ పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసింది. మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. ఆయన సేవలు పార్టీకి అవసరమని, తగిన గుర్తింపు ఉంటుందని భరోసాఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈనెల 16 వరకు వేచి చూస్తానని, అప్పటికీ తనకు టికెట్ ప్రకటించని పక్షంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పటాన్చెరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ప్రతి గడపకూ వెళ్లి సబ్బండవర్గాల ప్రజలను కలుస్తానని, వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తానని తేల్చిచెప్పారు. ఇలా అధికార పార్టీ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మీ బిడ్డగా ఆశీర్వదించండి పటాన్చెరు టౌన్/ రామచంర్రాపురం(పటాన్చెరు): మీ బిడ్డగా ఎమ్మెల్యే బరిలో ఉంటున్నానని, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతానని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండా అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం రాత్రి తన స్వగ్రామైన చిట్కుల్లో పలు కాలనీల్లో ఉన్న ప్రజలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామంతోపాటు పటాన్చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 16 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టబోయే పాదయాత్రకు అందరి ఆశీస్సులను కోరారు. -
ఈనెల 16 వరకు ఎదురుచూస్తా
పటాన్చెరు టౌన్ (హైదరాబాద్): బీఆర్ఎస్ పార్టీ నుంచి సానుకూల నిర్ణయం కోసం ఈనెల 16 వరకు ఎదురుచూస్తానని, అప్పటికీ తేల్చకుంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తానని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధుముదిరాజ్ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ బలోపేతం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని, అధిష్టానం పటాన్చెరు నుంచి టికెట్ ఇస్తుందని ఆశించానని తెలిపారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే, ఆ పార్టీ నుంచి కండువా కప్పుకుని పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజా సమస్యల ఎజెండాగా నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి ఒకటో నంబర్ బూత్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్‌గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
అప్పుడు పాచి పని చేసింది.. ఇప్పుడు లెక్చరర్‌గా రాణిస్తోంది
పిల్లల చదువుల కోసం ఇళ్లలో పాచిపనులు చేసిన మధు ఇప్పుడు కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పాఠాలు చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ చదువులు మీరేం చదువుతారని పిల్లలకు అడ్మిషన్ ఇవ్వలేదు. అలాంటి ఆమె పిల్లలు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ప్రతిరోజూ పోరాటమే అని వివరిస్తారు రాజస్థాని భిల్వారా నివాసి మధు. ఆమె గురించి అడిగితే సక్సెస్‌ని ఏ విధంగానైనా కష్టపడి సాధించుకోవచ్చు అని చెబుతుంది. ‘‘మేం ఆరు మంది తోబుట్టువులం. మా నాన్న చనిపోయినప్పుడు నాకు నాలుగేళ్లు. ఎన్నో ఇక్కట్ల మధ్య పెరిగాను. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక పెళ్లయింది. నా భర్త ఒక కంపెనీలో వర్కర్‌గా పనిచేసేవాడు. అతని జీతం ఇంటి అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. పిల్లలు పుట్టాక ఇంకా సమస్యలు పెరిగాయి. దీంతో కుట్టుపని మొదలు పెట్టాను. కొంత కాలానికి మా ఆయనకు కీళ్లనొప్పులు వచ్చి, ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన చేస్తున్న పనిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఈ కష్టకాలంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వారి స్కూల్‌కు దగ్గరలో కుట్టుమిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. అక్కడ కూర్చొని కుట్టుపని చేసేదాన్ని. అక్కడ బ్యాగులు, కవర్లు తయారు చేయడం మొదలుపెట్టినప్పుడు, ఆ స్కూల్ టీచర్ ఒకరు నేను చాలా త్వరగా వర్క్ నేర్చుకుంటానని గమనించారు. నా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని కాన్వెంట్ స్కూల్లో చేర్పించడానికి వెళితే, ‘మీరు చదువుకోలేదు, స్కూల్ ఫీజులు కూడా కట్టలేరు, అడ్మిషన్ ఇవ్వలేం’ అన్నారు. ఈ విషయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ నేను కుట్టుపని చేస్తున్నప్పుడు బ్యాగుల తయారీ గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేవారు. ఆ సమయంలో పిల్లలతోపాటు నన్ను కూడా చదువుకోమని ప్రోత్సహించారు. అందుకు తగిన దూరవిద్య ఫామ్స్ కూడా తెచ్చి ఇచ్చారు. దీంతో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, నేను కుట్టుమిషన్ దగ్గరే చదువుకునేదాన్ని. రోజూ ఉదయాన్నే నాలుగిళ్లలో పనులు చేయడం, కుట్టుమిషన్‌పై బ్యాగులు కుట్టడం, ఖాళీ సమయంలో డిగ్రీ పుస్తకాలు చదవడం... ఇలాగే నడిచేది. అడ్డంకిగా మారిన పరిస్థితులు నేను పట్టుదలగా చదువుకోవడం చూసిన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా నన్ను ప్రోత్సహించేవారు. పిల్లలు కూడా నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే, మా అత్తగారు ఆపేవారు. మామగారికి మా బంధువులు వెక్కిరిస్తున్నారని చెప్పేవారు. ఆమె సాయంత్రం పూట ఎక్కడకు వెళ్తుందో, ఎక్కడి నుండి వస్తుందో అని విపరీతపు మాటలు రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ, నా భర్త వాటన్నింటినీ పట్టించుకోవద్దని చెప్పేవారు. నేను ఎం.ఏ. పరీక్షలు రాస్తున్నప్పుడు మా మామగారు చనిపోయారు. దీంతో చదువును వదులుకునే పరిస్థితి వచ్చింది. కానీ, స్కూల్ టీచర్ శైలజ వచ్చి మా అత్త గారికి నచ్చచెప్పి, నన్ను చదువు కొనసాగించమని ప్రోత్సహించ డంతో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాను. లెక్చరర్‌గా చేస్తూనే.. మొదటిసారి నెట్లో అర్హత సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఏ. పూర్తిచేసి, పీహెచ్‌డీకి అడ్మిషన్ తీసుకున్నాను. పిల్లలు పెద్దవడంతో డబ్బు అవసరం కూడా పెరిగింది. దీంతో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చేరాను. నెలకు ఆరువేల రూపాయలు వచ్చేవి. వాటితోనే ఇల్లు గడవదని, టైలరింగ్ పనులు చేస్తూనే ఉండేదాన్ని. కానీ, మనం అనుకున్నవి అన్నీ జరగవు కదా. మా వారి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ట్రీట్మెంట్ నెలలపాటు కొనసాగింది. దీనిని తట్టుకుంటూనే నా జీవన పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కూతురు ఐఐటీలో సీటు సంపాదించి, మాస్టర్స్ కూడా చేసింది. కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు. నాలుగిళ్లలో పనిచేసుకునే నేను ఇప్పుడు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకున్నాను. పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే మంచి ఉద్యోగాల్లో వారిని చూడబోతున్నాను’’ అని ఆనందంగా వివరించే మధు జీవనపోరాటంలో విజయం ఒక్కరోజుతో సాధ్యం కాలేదని, ప్రతిరోజూ కఠోరశ్రమ చేస్తే వచ్చిందని చెబుతోంది మధు. -
పాపం..! నిరుద్యోగులే.. అతని దొంగ ఉద్యోగానికి బలి పశువులు..!!
-
విషాదంలోనే మూడు గ్రామాలు
కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంపై పోలీసుల ఆరా.. చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తలకొరివి పెట్టిన తనయ చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది. -
మాజీ ఎంపీ పొంగులేటికి ఎమ్మెల్సీ తాత మధు సవాల్
-
అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం
సాక్షి, బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింధగి సీఐ రవి, అతని భార్య మధు అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య ముగిసాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న పిల్లలు అమ్మా,నాన్న..ఇక సెలవు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. వీడ్కోలు పలుకుతున్న సీఐ దంపతుల పిల్లలు వారి కడ చూపు కోసం తరలివచ్చిన జనంతో సీఐ రవి స్వగ్రామం హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా రట్టిహళ్లి వీధులు కిక్కిరిసాయి. గ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని పోలీసు లాంఛనాల మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. మృతదేహలకు పూలమాలలు వేసి కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం) -
సౌదీలో రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లాకు చెందిన మధు మృతి
-
సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ..
దుబ్బాకటౌన్ (మెదక్): సౌదీ అరేబియాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మొగుల్ల మధు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు ఉన్నత విద్య పీజీ, బీఈడీ చదివాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రాకపోవడం.. ఉన్న ఊళ్లో సైతం ఎలాంటి ఉపాధి లేకపోవడంతో గత్యంతరం లేక పని కోసం 2009లో గల్ఫ్ బాట పట్టాడు. 13 ఏళ్లుగా అక్కడ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సౌదీ నుంచి సెలవులపై స్వదేశానికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వారం క్రితం(జూన్ 1న) మళ్లీ సౌదీకి తిరిగి వెళ్లి నాలుగు రోజుల క్రితమే డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు తాను నడుపుతున్న డీసీఎంను మరో వాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న ఆయన పెద్దన్న నర్సింలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధుకు భార్య లావణ్యతో పాటు కొడుకు అశ్విత్(10), కూతరు వేదశ్రీ(2), వృద్ధులైన తల్లిదండ్రులు బాలయ్య, లక్ష్మి ఉన్నారు. చదవండి: (మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..) మమ్మీ .. నాన్న రాడా మధు మృతిచెందాడన్న విషయం తెలియడంతో కుటింబీకులు, బంధువులు, గ్రామస్తులు రోదించడాన్ని చూస్తూ ఆయన పిల్లలు నాన్నకు ఏమైంది.. నాన్న ఇంటికి రాడా? అంటూ ఏం అర్థం గాక అమాయకత్వంతో బంధువులను అడుగడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లి ఏడస్తుంటే నాన్న ఎప్పడోస్తడు మమ్మీ అంటూ అడగడంను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు. శోక సంద్రమైన రాజక్కపేట అందరితో కలిసి మెలిసి ఉండే మధు.. సౌదీలో మృతిచెందడంతో రాజక్కపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాక గల్ప్ పోయిండు. వారం క్రితమే పోతున్నా అంటూ అందరినీ కలిసి చెప్పి పోయిండు ఇంతలోనే ఈఘోరం జరిగిందంటూ అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం) -
పవన్‌కల్యాణ్‌పై సీపీఎం మధు సీరియస్
సాక్షి, విశాఖపట్నం: పవన్‌కల్యాణ్‌కు ఒక సిద్ధాంతమంటూ లేదని సీపీఎం నేత మధు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీల గురించి మాట్లాడకుండా.. పవన్ పొత్తులపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు. చదవండి: పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి గతంలో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు.. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తు అంటున్నాడు.. వామపక్షాలతో పొత్తు అని మాకు తెలియకుండానే పవన్ కల్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడంటూ నిప్పులు చెరిగారు. పవన్ తీరు చూస్తూంటే జనసేనకు ఒక సిద్ధాంతం అంటూ లేదని సీపీఎం మధు వ్యాఖ్యానించారు. -
విశాఖ ఉక్కు కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆంధ్రా భవన్ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదు’’ అని తెలిపారు. ఒక సంవత్సరం పాటు పోరాటాన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని.. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు అన్నారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. -
‘కేంద్ర’ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించండి
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రతిపాదించిన విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ‘విద్యుత్ పంపిణీ పునరుద్ధరణ పథకాన్ని’ తిరస్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ అంశాన్ని కేంద్రం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటీకరించి, ఫ్రాంచైజీల పేరుతో దళారులను ప్రవేశపెట్టడం ఈ పథకం లక్ష్యంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించే చర్యలను ఆపాలని మధు డిమాండ్ చేశారు. అలాగే చట్టవిరుద్ధంగా పౌరులు, ప్రజాప్రతినిధులపై నిఘా పెడుతున్న ఇజ్రాయల్ స్పై సాఫ్ట్వేర్ ‘పెగాసెస్’ను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పౌరులపై నిఘా ఏ రూపంలో ఉన్నా వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నాన్న చనిపోవడంతో అమ్మ అనాథగా వదిలేసి వెళ్లింది: నటి
నటి మధు కృష్ణన్.. అటు సినిమాల్లో సహనటిగా, ఇటూ పలు సీరియల్లో నటిస్తూ ఫుల్ బిజీగా అయిపోయింది. దాదాపు 1300లకు పైగా స్టేజ్ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం దేవత, జానకి కలగనలేదు, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక షోకు అతిథిగా వచ్చిన ఆమె చిన్నతంలో ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తుచేసుకుంది. పదేళ్లకే తల్లిదండ్రులకు దూరమై అనాథలా పెరిగినంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. మధు మాట్లాడుతూ.. ‘నా పదేళ్ల వయసులో మా నాన్న రోడ్డు యాక్సిండెంట్‌లో చనిపోయారు. అమ్మకు అప్పటికి 25 ఏళ్ల వయసు. చిన్న వయసులోనే నాన్న చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య అమ్మను తీసుకుని వెళ్లిపోయారు. నేను ఆడపిల్లనని, నన్ను పోషించే స్థోమత వారికి లేదని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి మా అమ్మను మాత్రమే తీసుకెళ్లారు. దీంతో చిన్నప్పడే అమ్మనాన్నకు దూరమయ్యాను. అయితే బంధువులంతా నన్ను ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించి వదిలించుకొమ్మని చెప్పినా కూడా నానమ్మ, తాతయ్య నా బాధ్యతను తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు నేను వెళ్లి మా తాతయ్య కాళ్లు పట్టుకుని ఏడ్చాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను.. మీకు ఉన్నదే నాకు పెట్టండి చాలు అని వేడుకున్నాను’ అంటూ భావోద్యేగానికి లోనయ్యింది. అయితే అప్పటికే నానమ్మ తాతయ్యకు వయసు మీద పడిందని, కనీసం నడవలేని స్థితిలో కూడా వారు లేరని పేర్కొంది. ‘వారిద్దరూ చాలా పెద్దవారు. అయినా కష్టపడి నన్ను పెంచారు. వాళ్లు తినకపోయిన నాకు పెట్టెవారు. అయితే నేను ఎప్పుడు చదువులో ఫస్ట్ క్లాస్ వచ్చేదాన్ని. 10వ తరగతి తర్వాత నన్ను చదివించే స్థోమత లేకపోవడంతో మా పక్కింటి బామ్మ వాళ్లు నన్ను డిప్లమా వరకూ చదివించారు. అంతేకాదు నాకు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. ఇంతలో తాతయ్య చనిపోవడంతో మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో చదవుతూనే స్టేజ్ షో చేయడం మొదలుపెట్టాను’ అని పేర్కొంది. స్టేజ్ షోలు చేసే సమయంలో భయం, బాధ వెంటాడేవని, చదువు ఆగిపోతుందని బాధతోనే స్టేజ్ షోలు చేసేదాన్నన్నారు. ‘లోపల బాధపడుతూనే పైకి నవ్వుతూ ఉండేదాన్ని. అలా మెల్లమెల్లగా యాంకరింగ్ మొదలుపెటి తొమ్మిదేళ్లలో దాదాపు 1300 స్టేజ్ షోలు చేశా. ఇక మళ్లీ వెనక్కితిరిగి చూసుకోలేదు. కాలేజ్‌కి వెళ్తూనే స్టేజ్ షోలు చేశా.. ఈవెంట్స్ చేస్తూనే బీటెక్ పూర్తి చేశా.. ఎంటెక్ కూడా స్టార్ట్ చేశా కానీ ఇక చాల్లే అనుకుని ఎంటెక్ మధ్యలోనే మనేశా. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నాను.. ఒంటరి అని బాధపడలేదు. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్ని ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది మధు. చదవండి: ఘనంగా సీరియల్ నటి కీర్తి సీమంతం..ఫోటోలు వైరల్ -
ఠాగూర్ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు
ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రాక్ బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా హిట్ సాధించినప్పటికీ ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక వ్యవహారాల కారణంగా క్రాక్ విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సంపాదించుకుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టి ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. అంతేకాకుండా నేటి నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘క్రాక్’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
పవన్, బీజేపీల నంగనాచి మాటలకు మోసపోవద్దు
కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ ఏర్పాటును బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మద్దతు పలుకుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. పవన్‌కల్యాణ్ కూడా బీజేపీ పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి నంగనాచి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివీస్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. స్థానికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జైలులో ఉన్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.